
పొట్టు ఉన్న పెసర పప్పుని నాలుగు టీస్పూన్లు తీసుకుని రెండు గంటలు నానబెట్టి పేస్టు చేయాలి. ఈ పేస్టులో టీస్పూను ఆరెంజ్ పీల్ పొడి, టీస్పూను గంధం పొడి వేసి చక్కగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదినిమిషాలు ఆరనివ్వాలి. తరువాత కొద్దిగా నీటితో తడిచేసి మర్దన చేసి కడిగేయాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతిమంతంగా, అందంగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment