మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్‌నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ ఇచ్చే సూచనలు కొన్ని...
► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది.
► ఈ కాలం వుడెన్ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది.
► రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు!
► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్‌ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ లేదా టేబుల్ ల్యాంప్‌లనూ ఎంచుకోవచ్చు.
► గోడలకు వాల్ పేపర్ లేదా వాల్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది.
► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్ రోబ్‌లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి.
► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్ రూమ్.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment