
అందంగా కనిపించాలనే కోరికి ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందుకు తగ్గట్లు తగిన శ్రద్ద తీసుకోవాలి. స్కిన్ కేర్ కోసం ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అవగాహన చాలామందికి ఉండదు. చర్మంపై ఏవేవో ప్రయోగాలు చేస్తూ వేలకు వేలు ఖర్చుపెడుతుంటారు. కానీ సింపుల్‌గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూద్దాం.
కాంతిమంతమైన ముఖం కోసం....
►టమాటాను గుండ్రంగా కట్ చేసి ఒక ముక్కను తీసుకుని దానికి పంచదార అద్దాలి. తరువాత ఈ ముక్కను ముఖంపై సున్నితంగా రుద్దాలి. పది నిమిషాల తరువాత సాధారణ నీళ్లతో కడుక్కోవాలి. తరువాత స్పూను శనగ పిండి, అరస్పూను అలోవెర జెల్, రెండు స్పూన్ల టమాటా రసం, అర స్పూను తేనె వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఉన్న మృత కణాలు, ట్యాన్ పోయి ముఖం కాంతిమంతమవుతుంది.
► రెండు స్పూన్ల పాలలో, అర స్పూన్ తేనె కలిపి కళ్ల చుట్టు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు వేళ్లతో మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఇలా పడుకునేముందు ప్యాక్ వేసుకొని చల్లటి నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది.
► ఒక కప్పు గ్రీన్ టీని బ్రూ చేసి చల్లారనివ్వండి. దీన్ని స్కిన్ టోనర్‌గా ఉపయోగించండి. ఇది స్కిట్‌టోన్‌ని పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment