పకోడీలు, బజ్జీలు క్రిస్పీగా రావాలంటే...
- పిండిని కలిపేటప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి.∙ అరగంట ముందే పిండిని చల్లని నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి.
- పకోడీలు, బజ్జీలను నూనెలో వేసి డీప్‌ఫ్రై చేసేటప్పుడు పదేపదే తిప్పకూడదు. ఎక్కువగా తిప్పితే మెత్తగా మారతాయి. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు మాత్రమే తిప్పుతూ ఫ్రైచేయాలి.
- పచ్చిమిర్చి, పాలకూర, వంకాయ, అరటికాయ, బంగాళ దుంప వంటివాటితో బజ్జీలు వేసేముందు శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడిలేకుండా తుడిచి ఫ్యాన్ గాలికింద ఆరబెట్టాలి.
- తరువాత పిండిలో ముంచితే ముక్కలకు పిండి చక్కగా అంటుకుని బజ్జీలు క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి.
కిచెన్ టిప్స్
ఊరగాయలను నిల్వచేసుకునే చిన్న జాడీలను పొడిగా ఆరబెట్టిన తరువాత, వేడివేడి నూనెను జాడీలోపల రాయాలి. తరువాత ఊరగాయ పెడితే బూజు పట్టదు. రోజూ మూతతీసి వాడుతున్నప్పటికి పచ్చడి ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment