
కిచెన్ టిప్స్
- సాల్ట్ డబ్బా అడుగు భాగంలో కొద్దిగా బియ్యం వేసి తరువాత సాల్ట్ పోసుకుంటే సాల్ట్‌లోని తేమను బియ్యం పీల్చుకుని సాల్ట్‌ను పొడిగా ఉంచుతుంది.
- ప్లాస్టిక్ రోల్ అతుక్కుని త్వరగా రాదు. ఇటువంటప్పుడు అరగంటపాటు రోల్‌ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి తరువాత ఓపెన్ చేస్తే అతుక్కోకుండా సులభంగా వస్తుంది.
- గాజుకప్పు లేదా గ్లాసులో వేడిపాలు, పాయసం వంటివి పోసే ముందు.. దానిలో ఒక స్టీల్ స్పూను పెట్టి, తరువాత పాలు లేదా పాయసం వేయాలి. ఇలా చేయడం వల్ల గాజు గ్లాసు పగలదు.
- స్ప్రే బాటిల్‌లో టేబుల్ స్పూను బేకింగ్ సోడా, టేబుల్ స్పూను వెనిగర్, టీస్పూను డిష్‌వాష్ లిక్విడ్, రెండు గ్లాసులు నీళ్లు పోసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కిచెన్ ప్లాట్‌ఫాం మీద, స్టవ్ మీద చల్లుకుని తుడుచుకుంటే క్రిములు దరిచేరవు.
Comments
Please login to add a commentAdd a comment