Follow These Tips and Protect Your Job - Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!

Published Fri, May 19 2023 7:49 PM | Last Updated on Sat, May 20 2023 5:13 PM

Follow these tips and protect your job - Sakshi

కరోనా మహమ్మారి భారతదేశంలో వ్యాపించినప్పటి నుంచి ఉద్యోగులలో భయాలు పెరిగిపోయాయి. ఏ కంపెనీ ఎప్పుడు ఉద్యోగం ఊడగొడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. గూగుల్ వంటి అనేక బడా సంస్థలు సంస్థలు సైతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులను కూడా తొలగించింది. అయితే ఉద్యోగులలో ఉన్న భయం పోవాలంటే తప్పకుండా కొన్ని టిప్స్ తెలుసుకోవాలి. అలాంటి టిప్స్ ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.

కంపెనీ హిస్టరీ
మీరు ఒక సంస్థలో చేరే ముందు ఆ కంపెనీ హిస్టరీ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. మీరు చేరే కంపెనీ కొత్తగా ప్రారభించారా? లేక చాలా సంవత్సరాల నుంచి ఉందా? కష్టకాలంలో ఇంతకు ముందు ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించిందా అనే మరిన్ని వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి. అంతే కాకూండా మీరు ఉద్యోగంలో చేరిన తరువాత మీ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఉద్యోగంలో చేరేవారు సీటీసీ, లీవ్స్ పాలసీ, ఇన్సెంటివ్స్ వంటి వాటిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.

నోటీస్ పీరియడ్
ఇక రెండవ విషయం నోటీస్ పీరియడ్. మీ జాబ్ కాంట్రాక్ట్‌లో నోటీస్ పీరియడ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని గుర్తుంచుకోవాలి. మాములుగా కింది స్థాయి ఉద్యోగులకు ఒకనెల, పై స్థాయి ఉద్యోగులకు 2 నుంచి 3 నెలలు నోటీస్ పీరియడ్ ఉంటుంది. నోటీస్ పీరియడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో జాబ్ వెతుక్కోవడానికి సమయం ఉంటుంది. ఇది కూడా ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎల్ఐఎఫ్ఓ పాలసీ
ఉద్యోగులను తొలగించే సమయంలో కంపెనీలు కొన్ని 'లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్' (LIFO) పద్ధతి పాటిస్తుంది. దీని ప్రకారం కంపెనీలు లేటెస్ట్ గా ఉద్యోగంలో చేరిన వారిని కంపెనీ ముందుగా తొలగించే అవకాశం ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఈ పద్ధతి అమలయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కావున ఉద్యోగులకు ఏదైనా సమస్యలు ఉంటే హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌తో చర్చించాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ దీనికి ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటుంది.

గోల్డెన్ హ్యాండ్‌షేక్
సంస్థల్లో సివిరెన్స్ అగ్రిమెంట్/హ్యాండ్‌షేక్ క్లాజ్ అనేది కాంట్రాక్టులో ఉంటుంది. లేఆప్స్ లేదా టెర్మినేషన్ సమయంలో కంపెనీ ఉద్యోగులకు నగదు బహుమతి, స్టాక్ ఆప్షన్ వంటివి ఇస్తుంటాయి. ఇవన్నీ ఉద్యోగికి ఒక పటిష్టమైన భద్రతను కల్పిస్తాయి. ఇలాంటి ఎక్కువగా ఎక్కవ రోజులు సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి.

(ఇదీ చదవండి: కారు ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!)

నాన్ కాంపిటేట్ క్లాజ్
నాన్ కాంపిటేట్ క్లాజ్ అంటే మీరు పనిచేసే కంపెనీ ప్రత్యర్థి కంపెనీలో చేరడంపై పెట్టే పరిమితులు. సంస్థను బట్టి ఇది మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇలాంటి వాటిని పూర్తిగా ఎత్తేసే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఆఫర్ లెటర్ తీసుకునే ముందు తప్పకుండా పరిశీలించాలి.

కారణం లేకుండా టెర్మినేట్
మీరు పనిచేసే సంస్థలో కంపెనీ నియమాలను ఉల్లంగిస్తే టెర్మినేట్ చేస్తారు. అయితే ఏ కారణం లేకుండా టెర్మినేట్ చేసే అవకాశం ఉండదు. కావున కంపెనీ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఇవన్నీ మీరు తప్పకుండా పాటిస్తే మీ ఉద్యోగానికి ఏ డోకా లేదు. అనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement