చాలామందికి భోజనం చేసే సమయంలో, లేదా ఇతర కారణాల వల్ల ఎక్కువగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఇంకొంతమందికి ఒకసారి ఎక్కిళ్లు వచ్చాయి అంటే ఇక ఆ రోజంతా ఉంటాయి. ఎగ శ్వాస వచ్చి కొన్ని సార్లు బాగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంటుంది.
ఎక్కిళ్లు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి?
♦ నీళ్లు కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎక్కిళ్ళు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
♦ గాలిని బిగబట్టడం వల్ల కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది
♦ పుల్లటి నీళ్లు నోట్లో పోసుకొని కాస్త పుక్కలించి కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఎక్కుళ్ళు తగ్గడానికి అవకాశం ఉంది.
♦ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె కలుపుకొని తాగి నోరు పుక్కిలిస్తే కొంత తేడా ఉంటుంది.
♦ నోట్లో కాస్త పంచదార వేసుకొని చప్పరించడం వల్ల కూడా కొంత ఉపశమనం దొరుకుతుంది
♦ నిమ్మరసం గానీ ఏదైనా పుల్లటి పదార్థాన్ని నాలుక మీద పిండి చప్పరించినట్టయితే కూడా ఎక్కిళ్ళు తగ్గుతాయి
♦ చంటిపిల్లలకు చక్కిళ్లు వస్తే పిల్లల్ని బోర్లా పడుకోబెట్టి వీపు మీద మెల్లగా రుద్దితే ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది
అదే పెద్ద పిల్లలు అయితే గొంతుక కూర్చో బెట్టడం. మోకాళ్లు, ఛాతీ ఆనెలా కూర్చో పెట్టాలి.ఇంకా తగ్గకపోతే సొంటిలో బెల్లం కలిపి చిన్న ఉండలాగా చేసి మింగిస్తే కూడా ఉపశమనం ఉండవచ్చు.
♦ లవంగం బుగ్గన పెట్టుకొని రసాన్ని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
♦ చెరుకు రసం ఐస్ లేకుండా తాగితే ఉపశమనం ఉంటుంది.
♦ గోరువెచ్చటి పాలలో పంచదార కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి
♦ జామ పండ్లు తింటే కూడా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది
అయితే కొన్నిసార్లు ఏం చేసినా ఎక్కిళ్లు తగ్గవు. అలాంటప్పుడు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
- నవీన్ నడిమింటి
Comments
Please login to add a commentAdd a comment