List Of 8 Best Skin Care Tips To Keep Your Skin Healthy In This Monsoon In Telugu - Sakshi
Sakshi News home page

Skin Care Tips : వర్షాకాలంలో చర్మం ఆరోగ్యం కోసం ఇలా చేయండి

Published Sat, Aug 5 2023 4:42 PM | Last Updated on Sat, Aug 5 2023 6:19 PM

Skin Care Tips To Get Healthy Skin In This Monsoon - Sakshi

ఈ కాలం జిడ్డు చర్మం గలవారి సమస్య మరింత పెరుగుతుంటుంది. అలాగే, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. డీ హైడ్రేట్‌ అయ్యి చర్మం నిస్తేజంగా మారే అవకాశం ఉంది. ఈ సమస్యలకు విరుగుడుగా..

► జిడ్డు, మలినాలను తొలగించడానికి క్లెన్సర్‌ను ఉపయోగించాలి. దీనివల్ల మృతకణాలు సులువుగా తొలగిపోతాయి.
► సహజసిద్ధమైన క్లెన్సర్‌ కావాలనుకుంటే ఇందుకు ఓట్‌ మీల్, చక్కెర లేదా పండ్ల గుజ్జును వాడుకోవచ్చు.
► చర్మం పొడిగా మారితే బాదం నూనె లేదా మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి. రోజూ పది గ్లాసుల నీళ్లు తాగాలి.
► ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. తేమ ఉండే చోట ఫంగల్‌ పౌడర్లు, క్రీములను ఉపయోగించాలి.
► చర్మం తాజాగా ఉండాలంటే మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లను చేర్చాలి.
► ఒత్తిడిని ఎదుర్కోవడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి దోహదపడతాయి.
► వేప, తులసి, పసుపు, కలబంద వంటి వాటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉన్నాయి.


► వీటిని చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పై పూతలుగా వాడితే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement