వర్షాలు పడుతున్నాయి కదా ఇంక మొక్కలకు నీళ్లు పోయనవసరంలేదని కొంతమంది అనుకుంటారు. కానీ వర్షాల్లో కూడా కొన్నిరకాల మొక్కలకు నీళ్లు పోస్తేనే గార్డెన్ పచ్చగా కళకళలాడుతుంది. అందుకు ఇవే కారణాలు...
♦సాధారణంగా మొక్కలకు వర్షాకాలంలో సహజసిద్ధంగా నీళ్లు అందుతాయి. కానీ, కుండీల్లో ఉన్న మట్టి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచలేకపోతే, మొక్కలు త్వరగా ఎండిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు తేమను చూసుకుని మొక్కలకు నీళ్లు పోయాలి.
♦కుండీల్లో పెరుగుతోన్న కొన్ని రకాల మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. దట్టంగా ఉన్న ఆకులు, కొమ్మలు కూడా వెడల్పుగా విస్తరించి చినుకులను అడ్డుకుంటాయి.
♦ వర్షం చినుకులు కొమ్మలపై పడి పక్కకు జారిపోతాయి. దీనివల్ల వేర్లకు సరిగా నీరు అందదు. అందువల్ల గుబురుగా ఉన్న కుండీ మొక్కలకు తప్పని సరిగా నీళ్లుపోయాలి.
Comments
Please login to add a commentAdd a comment