టెక్‌ మహీంద్రా, పెరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ | Tech Mahindra Pearl Academy to Establish Makers Lab in Bengaluru | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా, పెరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

Published Mon, Dec 2 2024 8:05 AM | Last Updated on Mon, Dec 2 2024 8:05 AM

Tech Mahindra Pearl Academy to Establish Makers Lab in Bengaluru

ముంబై: టెక్‌ మహీంద్రా సహకారంతో బెంగుళూరులో మేకర్స్‌ ల్యాబ్‌ పేరుతో ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు పెరల్‌ అకాడమీ తెలిపింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెటావర్స్, గేమింగ్‌ రంగాల్లో పరిష్కారాలను అభివృద్ధి చేసే దిశగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్ధేశమని క్రియేటివ్‌ ఆర్ట్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి చెందిన పెరల్‌ అకాడమీ పేర్కొంది.

‘టెక్‌ మహీంద్రా సంకేతిక నైపుణ్యంతో మా డిజైన్‌ ఇన్నోవేషన్లను మిళితం చేయడం ద్వారా పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది’ అని అకాడమీ ప్రెసిడెంట్‌ అదితీ శ్రీవాస్తవ తెలిపారు. అభివృద్ధి చెందిన సాంకేతిక రంగం కొత్త నైపుణ్యాలను, సృజనాత్మక రంగం అనుభవాలను మేకర్స్‌ ల్యాబ్‌ అందిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement