
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో (ఏడబ్ల్యూఎస్) ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజిన్స్ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా టెలికం నెట్‌వర్క్‌లను రూపాంతరం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరింది.
అధునాతన ఏఐ పరిష్కారాలను వినియోగించి నెట్‌వర్క్ సామర్థ్యాన్ని, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి ఇరు సంస్థలు కృషిచేస్తాయి. కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం రూపొందించిన అటానమస్ నెట్‌వర్క్స్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో టెక్ మహీంద్రా బహుళ–సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై సంతకం చేసింది.