డేటింగ్ యాప్‌: అమ్మాయి వలపు వల.. సివిల్స్ అభ్యర్థి’ని కేఫ్‌కి పిలిచి.. | Dating App: Man Scammed To Pay 1 2 Lakh Bill At Delhi Cafe | Sakshi
Sakshi News home page

డేటింగ్ యాప్‌: అమ్మాయి వలపు వల.. సివిల్స్ అభ్యర్థి’ని కేఫ్‌కి పిలిచి..

Published Sat, Jun 29 2024 8:38 PM | Last Updated on Sat, Jun 29 2024 8:46 PM

Dating App: Man Scammed To Pay 1 2 Lakh Bill At Delhi Cafe

డేటింగ్‌ యాప్‌ల పేరుతో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి.

ఢిల్లీ: డేటింగ్‌ యాప్‌ల పేరుతో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. మాటమాట కలుపుతారు.. పరిచయాలు పెంచుకుంటారు. వీరి వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకుంటున్నారు. నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి టిండర్‌ యాప్‌లో ఓ యువతి పరిచయం కాగా, ఆమె బర్త్‌డే వేడుకకు కేఫ్‌కి పిలిచింది. ఇద్దరూ కేక్‌లతో పాటు డ్రింక్స్ ఆర్డర్ చేశారు. సడన్‌గా ఆ యువతి ఉన్నట్టుండి.. కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని.. ఎమర్జెన్సీ అంటూ నమ్మించి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. బిల్‌ కట్టేసి వెళ్లిపోదామనుకున్న యువకుడికి షాక్‌ తగిలింది. నాలుగు కేక్‌లు, నాలుగు షాట్స్ డ్రింక్స్‌కే రూ.1.21 లక్షల బిల్‌ వేశారు. మహా అయితే నాలుగైదు వేలల్లో ఉండే బిల్‌ ఇలా లక్ష దాటే సరికి యువకుడు నివ్వెరబోయాడు. చివరకు బిల్ కట్టకపోతే చంపేస్తాంటూ కేఫ్‌ సిబ్బంది బెదిరింపులకు దిగారు. చేసేదేమీ లేక ఆ యువకుడు ఆన్‌లైన్‌లో నగదును ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు.

పోలీసుల విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి పేరుతో పాటు వివరాలన్నీ ఫేక్ అని తేలింది. వీళ్లంతా కుమ్మక్కై ఆ యువకుడిని దోచుకున్నారని గుర్తించారు. వెంటనే ఆ యువతిపై నిఘా పెట్టిన పోలీసులు మరో కేఫ్‌లో వేరే అబ్బాయితో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్‌లో కూడా ఇటీవల ఇలాంటి తరహా  మోసం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చాలా మంది అబ్బాయిలు డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లో అమ్మాయిల ద్వారా పబ్ ఓనర్లు చేస్తున్న దోపిడీ ఇటీవల ఒకటి బట్టబయలైంది. డేటింగ్ యాప్‌లో అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్‌లకు పిలిపిస్తూ వారి చేత ఖరీదైన మద్యం కొనుగోలు చేయిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement