Top Stories
ప్రధాన వార్తలు

బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
చంద్రబాబు మెప్పు కోసం కొందరు పోలీసులు తమ టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేయకుండా ఆయనకు వాచ్మెన్ల మాదిరిగా పని చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నా..! ఎల్లకాలం చంద్రబాబు నాయుడు పరిపాలనే ఉండదు. అలా వ్యవహరించిన పోలీసుల బట్టలూడదీసి ప్రజల ముందు, చట్టం ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరిస్తున్నా. మీ యూనిఫామ్ తీయించి ఉద్యోగాలు ఊడగొడతామని చెబుతున్నా. మీరు చేసిన ప్రతి పనికీ వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం -వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు.. సూపర్ సిక్స్ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రజలు ప్రశ్నిస్తుండటంతో.. రెడ్‌బుక్ పాలనతో దాడులు కొనసాగిస్తున్నారు. పోలీసులను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెగబడుతున్న దౌర్జన్య కాండను ప్రజలంతా చూస్తున్నారు. కచ్చితంగా దీనికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి..’ అని వైఎస్సార్సీపీ(YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. గత నెల 30వ తేదీన టీడీపీ గూండాల పాశవిక దాడిలో మృతిచెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గతంలో బిహార్.. ఇప్పుడు ఏపీ!! రాప్తాడు నియోజకవర్గంలో ఈ ఘటన ఎందుకు జరిగింది? రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి..? అనేది ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. భర్తను కోల్పోయిన లింగమయ్య భార్య దిక్కు తోచక తల్లడిల్లిపోతోంది. గతంలో బిహార్ గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును చంద్రబాబు రోడ్డున పడేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా దిగజారాయి. ఇటీవల 57 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు చోట్ల చంద్రబాబు పార్టీ గెలిచే పరిస్థితి లేదని గ్రహించడంతో పోస్ట్‌పోన్ చేయించారు. అనివార్యం కావడంతో 50 చోట్ల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా.. 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచింది. అసలు ఆ 57 చోట్ల చంద్రబాబుకు సంఖ్యా బలమే లేదు. అక్కడ గెలిచిన వారంతా వైఎస్సార్సీపీ సభ్యులే. మా పార్టీ గుర్తు మీద గెలుపొందిన వారే. చంద్రబాబు తమకు ఏమాత్రం సంఖ్యా బలం లేదని తెలిసి కూడా భయపెడుతూ, పోలీసులను తన దగ్గర పనిచేసే వాచ్మెన్ల కంటే కూడా హీనంగా వాడుకుంటూ దిగజారిన రాజకీయాలు చేస్తున్నారు. ఒక ఎంపీపీ పోతే ఏమవుతుంది బాబూ? చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి! ఒకచోట ఎంపీపీ పోతే ఏమవుతుంది? ఒకచోట జెడ్పీ చైర్మన్, ఉప సర్పంచ్ పదవి పోతే ఏమవుతుంది? ఆయన సీఎం కాబట్టి.. అధికారంలో ఉన్నారు కాబట్టి.. బలం లేకపోయినా.. తాను ముఖ్యమంత్రినన్న అహంకారంతో ఏ పదవైనా తమకే దక్కాలనే దురుద్దేశంతో శాంతిభద్రతలను పూర్తిగా నాశనం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి రహదారిలో అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ రామగిరిలో రాక్షసత్వం.. రామగిరి మండలంలో పది మంది ఎంపీటీసీలు ఉంటే వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది సభ్యులు గెలిచారు. కేవలం ఒకటి మాత్రమే టీడీపీది. మరి ఇక్కడ ఎంపీపీ పదవికి నోటిఫికేషన్ జారీ అయితే 9 మంది సభ్యులున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవి దక్కాలా? లేక ఒకే ఒక సభ్యుడున్న టీడీపీకి రావాలా? తొమ్మిది మంది సభ్యులు చంద్రబాబు ప్రలోభాలకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లి తమకు ప్రాణహాని ఉందని, ఎంపీపీ పదవికి పోటీ చేయాలంటే పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో సభ్యులను తీసుకొస్తుంటే.. ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్ అనే వ్యక్తిని వీళ్ల కాన్వాయ్‌లోకి ఎక్కించారు. వీళ్లందరికి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కుమారుడితో వీడియో కాల్ చేయించారు. నువ్వు ఓటు వేయకుంటే మీ అమ్మనాన్న ఇంటికి రారని భారతమ్మ అనే ఎంపీటీసీని వీడియో కాల్ చేయించి బెదిరించారు. వీటికి లొంగకపోవడంతో కోరం లేదని ఎన్నికలు వాయిదా వేశారు. ఆ తరువాత ఇదే ఎస్ఐ పెనుకొండకు తీసుకెళ్లి ఎంపీటీసీ సభ్యులను బైండోవర్ చేశారు. దీంతో ప్రకాష్‌రెడ్డి (రాప్తాడు మాజీ ఎమ్మెల్యే), ఉషశ్రీ (పార్టీ జిల్లా అధ్యక్షురాలు) మా పార్టీకి చెందిన ఎంపీటీసీలకు మద్దతుగా వెళ్లడంతో వారిద్దరిపై కేసులు పెట్టారు. అసలు వీళ్లిద్దరు ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు? వాళ్లు టీడీపీ ఎంపీటీసీలనేమైనా తెచ్చారా? మా పార్టీ సభ్యుల కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు వెళ్లి ధర్నా చేసినందుకు వాళ్ల మీద కేసులు బనాయించారు. భయోత్పాతం సృష్టించారు.. ఈ ఎన్నికల ప్రక్రియ జరగకూడదన్న దురుద్దేశంతో పాపిరెడ్డిపల్లిలో మా పార్టీకి చెందిన జయచంద్రారెడ్డిపై దాడి చేశారు. 28న మళ్లీ దాడి చేశారు. లింగమయ్య అన్న ఈ దాడిని అడ్డుకుని పోలీసులకు కంప్లయింట్ చేశారు. తమపై దాడులను అరికట్టాలని వేడుకుంటే పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో మార్చి 30న కురుబ లింగమయ్య కుమారుడు బైక్‌పై వెళ్తుంటే రాళ్లతో దాడి చేశారు. కుమారుడు ఈ విషయాన్ని లింగమయ్యకు చెప్పడంతో.. 20 మందికిపైగా టీడీపీ మూకలు మరోసారి లింగమయ్య ఇంటికి వెళ్లి బేస్‌బాల్ బ్యాట్, మచ్చుకత్తులు, కర్రలతో దాడి చేసి హింసించడంతో లింగమయ్య చనిపోయారు. రాష్ట్రం ఈ రోజు బిహార్ కన్నా అధ్వానంగా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గుతో తల వంచుకునేలా వ్యవహరిస్తున్నారు. 20 మంది దాడి చేస్తే.. ఇద్దరిపై కేసులా? లింగమయ్యపై 20 మంది దాడి చేస్తే కేసులు ఇద్దరి మీదే పెట్టారు. ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్నాయుడుపై ఎందుకు కేసు పెట్టలేదు? మిగిలిన వారిని ఎందుకు వదిలేశారు? నిందితులంతా ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యే బంధువులు. ఎమ్మెల్యే కుమారుడు మార్చి 27న ఆ గ్రామానికి వెళ్లి రెచ్చగొడితే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేపై గానీ, ఆమె కుమారుడిపైగానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్ఐ సుధాకర్ భయపెడుతుంటే అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? లింగమయ్య కుమారుడు శ్రీనివాస్‌పై కూడా దాడి జరిగింది. కానీ కంప్లయింట్ లింగమయ్య కుమారుడితో కాకుండా.. పోలీసులే ఒక ఫిర్యాదు రాసుకుని వచ్చి నిరక్షరాస్యురాలైన లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించుకుని వెళ్లారు. వాళ్లు ఏం రాసుకున్నారో తెలియదు..! నిందితులనే సాక్షులుగా చేర్చి.. లింగమయ్యను చంపాలనే ఉద్దేశంతోనే బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేశారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో బేస్‌బాల్ బ్యాట్ ఉన్నట్లు రాయలేదు. చిన్న చిన్న కర్రలతో దాడి చేసినట్లు వక్రీకరించారు. పోలీసులు విచారించిన 8 మందిలో ఐదుగురు మాత్రమే లింగమయ్య కుటుంబీకులు. మిగిలిన ముగ్గురూ టీడీపీకి చెందినవారు. నిందితులనే సాక్షులుగా చేర్చారంటే పోలీసు వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో ఇంతకంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షులను కూడా వీళ్లకు కావాల్సిన వాళ్లను పెట్టుకున్నారు. వీళ్లే తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం చూస్తే.. పోలీసు వ్యవస్థ ఇంతకన్నా దారుణంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మీ కుటుంబానికి అండగా ఉంటాం⇒ లింగమయ్య హత్యను మానవ హక్కుల సంఘానికి నివేదిస్తాం⇒ పాపిరెడ్డిపల్లిలో బాధిత కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ టీడీపీ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన తమ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 30న శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల దాడిలో లింగమయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. కురుబ లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నట్లు తెలియడంతో పల్లెలకు పల్లెలు పాపిరెడ్డిపల్లికి తరలివచ్చాయి. హెలిప్యాడ్ నుంచి జగన్ నేరుగా లింగమయ్య ఇంటికి చేరుకుని తొలుత చిత్ర పటానికి నివాళులర్పించారు. అనంతరం కింద కూర్చుని లింగమయ్య భార్య, కుమారులు, కుమార్తెతో చాలాసేపు మాట్లాడి ఓదార్చారు. లింగమయ్య కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, పార్టీ తరఫున న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. లింగమయ్య పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. లింగమయ్య అన్న హత్య అత్యంత కిరాతకమన్నారు. టీడీపీ మూకల దుర్మార్గాలను రాష్ట్రవ్యాప్తంగా తెలియచెప్పేందుకు వచ్చామన్నారు. ఈ కేసును మానవ హక్కుల సంఘానికి నివేదిస్తామని ప్రకటించారు. టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..జగన్ పరామర్శిస్తున్న సమయంలో లింగమయ్య కుమార్తె కన్నీటి పర్యంతమైంది. అన్నా..! మా నాన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త.. అందుకే 20 మందితో వచ్చి దాడి చేసి చంపారన్నా..! టీడీపీ వాళ్లు మా నాన్నను చంపేశారన్నా..! అంటూ రోదించింది. మా అమ్మ, తమ్ముళ్లకు ఏమీ తెలియదన్నా..! మీరే అండగా నిలవాలన్నా..! గ్రామంలో టీడీపీ దుర్మార్గాలను తట్టుకోలేకపోతున్నామన్నా..! పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయన్నా..! అంటూ ఆవేదన వ్యక్తంచేసింది. ‘వైఎస్సార్సీపీ హయాంలో ఎలాంటి గొడవలూ లేవన్నా..! ఇప్పుడు ఎప్పుడేం జరుగుతుందోనని భయంగా ఉందన్నా..’ అంటూ కొందరు మహిళలు ఆందోళన వ్యక్తం చేయగా.. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రాష్ట్రమంతా.. రెడ్‌బుక్ దొంగ సాక్ష్యాలను సృష్టిస్తూ.. కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు: జగన్ ‘రామగిరిలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వీళ్లు చేస్తున్న అన్యాయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రం మొత్తం రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోందంటే.. ‘దొంగ సాక్ష్యాలను వీళ్లే సృష్టిస్తున్నారు. నచ్చని నేతలను కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ⇒ తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే బస్సులో ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్సీని ఏకంగా పోలీసులే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నిక కూడా దౌర్జన్యంగా జరిపించారు. పశి్చమ గోదావరి జిల్లా అత్తిలిలో కూడా ఇలాగే దౌర్జన్యం చేశారు. ఎక్కడా వీళ్లకు సంఖ్యా బలం లేదు. విశాఖలో 98 మంది సభ్యుల్లో 56 మంది వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచారు. అక్కడ కూడా భయపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నంరాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే.. ఈ నెల 6న ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్లలో ఇందూరి ప్రతాప్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతాప్‌రెడ్డి గుడికి వెళ్లి పూజ చేస్తుండగా ఆయన అన్నను చంపేశారు. మా ప్రభుత్వంలో ప్రతాప్‌రెడ్డికి గన్‌మెన్ సౌకర్యం కల్పిస్తే చంద్రబాబు వచ్చాక తొలగించారు. పసుపులేటి సుబ్బరాయుడును చంపారు.. గతేడాది ఆగస్ట్ 3న శ్రీశైలం నియోజకవర్గం మహానందిలోని సీతారాంపురంలో పసుపులేటి సుబ్బరాయుడిని చంపేశారు. నేను ఆ ఊరికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించా. నంద్యాల హెడ్ క్వార్టర్‌కు కూతవేటు దూరంలో మర్డర్ జరిగినా పోలీసులు స్పందించలేదు. అక్కడే ఎస్పీ ఆఫీసు ఉన్నా ఎలాంటి చర్యలు లేవు. సాంబిరెడ్డిపై దారుణంగా దాడి.. గతేడాది జులై 23న పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఈద సాంబిరెడ్డిని ఇనుప రాడ్లతో కొట్టి కారుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో గతేడాది జూలై 17న వైఎస్సార్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఏడేళ్ల తర్వాత పోసానిపై కేసులు సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేమిటంటే... ఆయనకు నంది అవార్డు ఇస్తే తీసుకోకపోవడం! కుల వివక్ష పాటిస్తున్నారని ఆయన 2017లో స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఆయనపై 18 కేసులు బనాయించి అరెస్టు చేసి నెల రోజులకుపైగా జైల్లో పెట్టించారు. 145 రోజులకుపైగా జైలులో నందిగం సురేష్.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన మా మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు మోపి 145 రోజులకుపైగా జైల్లో పెట్టారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి 55 రోజులు జైల్లో పెట్టారు. దాడులు చేసేది టీడీపీ వాళ్లయితే.. జైళ్లలో పెట్టేది మాత్రం వైఎస్సార్సీపీ నాయకులను!! వంశీపై అన్యాయంగా కేసులు.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ.. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో లేరని ఆ పార్టీకి చెందిన వ్యక్తే కోర్టుకు వచ్చి చెప్పారు. అసలు అక్కడ వంశీ లేడని చెప్పినా.. అన్యాయంగా కేసులో ఇరికించి.. 50 రోజులుగా జైల్లో పెట్టారు.అడుగడుగునా భద్రతా వైఫల్యంరామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. వైఎస్ జగన్‌ను చూసేందుకు హెలికాప్టర్‌ను చుట్టుముట్టిన భారీ జనసందోహం పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్ఫోన్లు పేలిపోయాయి. కరెంట్ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025

ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ చర్యల కారణంగా పలు దేశాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య టారిఫ్‌ల యుద్ధమే నడుస్తోంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన బీజింగ్‌పై ట్రంప్ ఏకంగా 104శాతం టారిఫ్‌లు విధించారు. దీంతో, ట్రంప్ చర్యలపై చైనా ఘాటుగా స్పందించింది.ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న పన్నులపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తాజాగా స్పందించారు. తాజాగా లీ కియాంగ్ మాట్లాడుతూ..‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నుల పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. ట్రంప్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు.. అమెరికా ఏకపక్షవాదం, రక్షణవాదం, ఆర్థికపరంగా బలవంతపు చర్యలకు అద్దం పడుతున్నాయి. దీనిపై మేం చివరివరకు పోరాడతాం. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు ప్రయత్నిస్తాం. దీనికి మేం తప్పకుండా ప్రతిస్పందిస్తాం. ఎలాంటి అనిశ్చితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించాం. వాణిజ్య భాగస్వాములందరిపైనా ఇలాంటి చర్యలు తీసుకోవడం అమానుషం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, తగినవిధంగా బదులిచ్చేందుకు విధానపరంగా అన్ని ఆయుధాలు మా వద్ద ఉన్నాయి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ అన్నంత పనీ చేశారు. చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు. ‘‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది. చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు.

గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.ప్రియాన్ష్ మెరుపు శతకంఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది. 18 పరుగుల తేడాతో చెన్నై ఓటమిఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Sights we have come to cherish over many years 💛MS Dhoni produced a fighting knock of 27(12) 🔥Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025 కీలక వికెట్ తీసిఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లోనూ గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా

కమెడియన్ సప్తగిరి ఇంట్లో విషాదం
తెలుగులో పలు సినిమాల్లో నటించి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి చిట్టెమ్మ.. మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సప్తగిరి వెల్లడించాడు.(ఇదీ చదవండి: తమన్నాని పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత)బుధవారం (ఏప్రిల్ 9) నాడు తిరుపతిలో తల్లి అంత్యక్రియలు నిర్వహిస్తామని సప్తగిరి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు సప్తగిరికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.సప్తగిరి విషయానికొస్తే.. ఇతడి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. 2006లో బొమ్మరిల్లు సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. పరుగు, గబ్బర్ సింగ్, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, సలార్.. ఇలా 100-150కి పైగా సినిమాలు చేశాడు. రీసెంట్ గా 'పెళ్లికాని ప్రసాద్' అనే మూవీతో హీరోగానూ చేశాడు. ఇతడు నటించిన కన్నప్ప.. విడుదల కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)Miss You Amma🙏. Rest In Peace Death:: 04/08/2025Funeral On 9th April in Tirupati pic.twitter.com/jBY0JKnnbv— Sapthagiri (@MeSapthagiri) April 8, 2025

Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు
సంతో డొమింగో: డొమినికన్ రిపబ్లిక్ రాజధాని సంతో డొమింగోలోని ప్రముఖ జెట్ సెట్ నైట్‌క్లబ్(Jet Set Nightclub)లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. సంగీత కచేరీ జరుగుతుండగా నైట్‌క్లబ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో 79 మంది వరకు మరణించారని, 160 మందికి పైగా జనం గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ సంగీత కచేరీని వీక్షించేందుకు సుమారు 600 మంది హాజరైనట్లు తెలుస్తోంది.స్థానిక రెస్క్యూ బృందాలు(Rescue teams) అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిలో డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మాజీ బేస్‌బాల్ ఆటగాళ్లు ఎమిలియో బోనిఫాసియో, లూయిస్ రామిరెజ్ కూడా ఉన్నారు. అలాగే ఒక ప్రావిన్స్ గవర్నర్ కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంగీత కచేరీకి హాజరైన వారిలో ప్రముఖులు, స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం. 🚨🇩🇴13 DEAD, 93 INJURED IN NIGHTCLUB ROOF COLLAPSE IN THE DOMINICAN REPUBLICThis comes after the roof of the Jet Set nightclub in Santo Domingo, Dominican Republic, collapsed earlier this morning.The national police confirmed the death toll and said search and rescue… pic.twitter.com/yAdkTqw8yX— Mario Nawfal (@MarioNawfal) April 8, 2025నైట్ క్లబ్ పైకప్పు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అధిక జనసమూహం కారణంగా భవనంపై ఒత్తిడి పెరిగి పైకప్పు కూలివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నైట్‌క్లబ్ యాజమాన్యంతో పాటు స్థానిక నిర్మాణ అధికారులను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కచేరీ జరుగుతున్న సమయంలో పైకప్పు కూలిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది.ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకప్పు కుప్పకూలడం ఆ వీడియోలో రికార్డ్ అయింది. ఈ దృశ్యాలు చూసిన వారు ఘటన తీవ్రతను అర్థం చేసుకోగలుగుతారు. డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఈ దుర్ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా సంతాప దినం ప్రకటించారు. బాధితులకు సహాయం చేయడానికి అత్యవసర నిధులను కేటాయించారు. ఈ ఘటన అంతర్జాతీయంగానూ చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం

ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు

మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్‌దే..
గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్‌ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్‌గా ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేకన్జూమర్ ఎల్రక్టానిక్స్, మెడికల్ ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.

అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025

భలే భూవస్త్రం..! పర్యావరణ హితం కూడా..
మన ఆకలి తీర్చుతున్న ఆహారంలో 95% వరకు భూమాతే మనకు అందిస్తుంది. అందువల్ల భూమి పైపొర మట్టి మనకే కాదు జంతుజాలం మొత్తానికీ ప్రాణప్రదమైనది. భూమి పైమట్టి సారవంతమైనదే కాకుండా ఎంతో విలువైనది కూడా. కాబట్టి, మనకు మాదిరిగానే భూమికి కూడా ఆచ్ఛాదనగా వస్త్రం కప్పి పరిరక్షించుకోవాల్సిన ప్రాణావసరం మనది. మట్టి ఎండకు ఎండి నిర్జీవమైపోకుండా.. గాలికి, వర్షపు నీటి తాకిడికి కొట్టుకుపోకుండా రక్షించుకోవడానికి కొబ్బరి పీచుతో చేసిన చాపలు భేషుగ్గా పనిచేస్తున్నాయి. ఈ కొబ్బరి చాపలనే కాయర్ బోర్డు ‘భూవస్త్రం’ అని పిలుస్తోంది. ఇరవయ్యేళ్లుగా కేరళ తదితర రాష్ట్రాల్లో పీచు పరిశ్రమదారులు ‘భూవస్త్రాల’ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే, మన దేశంలో వాడకం తక్కువే. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కొబ్బరి పీచు భూవస్త్రాన్ని పంటలకు మల్చింగ్ షీట్‌గా, కాల్వలు, చెరువులు, నదుల గట్లకు రక్షణ కవచంగా కూడా వాడుకోవచ్చు. భూమిని కాపాడటమే కాకుండా ఐదారేళ్లలో భూమిలో కలిసిపోయి సారవంతం చేస్తుంది. భూవస్త్రాల మన్నిక ఎంత?కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు పర్యావరణ హితమైనవి. వీటిని వినియోగించుకుంటే కాలువలు, చెరువులు, నదుల గట్లు, ఏటవాలు ప్రాంతాల్లో నుంచి గాలికి, వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా జాగ్రత్తపడవచ్చు. రోడ్ల నిర్మాణంలోనూ ఉపయోగపడుతుంది. చెరువులు, సరస్సుల గట్లు, నదుల వరద కట్టల నవీకరణ పనుల్లో భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఇంతకీ వీటి మన్నిక, పటుత్వం ఎంత? ఐదారేళ్ల వరకూ మన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘కొబ్బరి పీచు పటుత్వం చాలా ఎక్కువ. ఇందులో లిగ్నన్ ఎక్కువ మోతాదులో ఉండటమే ఇందుకు కారణం. టేకు, ఇరుగుడు చావ కలపలో కన్నా కొబ్బరి పీచులోనే లిగ్నన్ ఎక్కువగా ఉంది. అంతేకాదు, నీటిని సంగ్రహించే సామర్థ్యం, అతినీల లోహిత(యు.వి.) కిరణాలను తట్టుకునే శక్తి కూడా ఎక్కువే, వేసిన తర్వాత ఐదారేళ్ల వరకు మన్నుతాయి. 90% తేమ, 30 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలో కూడా దీర్ఘకాలంపాటు భూవస్త్రం పటిష్టంగా నిలిచినట్లు ‘జెర్మన్ బున్‌దేసంత్ ఫర్ మెటీరియల్ టెస్టింగ్ ఆన్ నేచురల్ ఫైబర్స్’ తెలిపింది. పత్తి ఉత్పత్తుల కన్నా 15 రెట్లు, జనపనార ఉత్పత్తుల కన్నా 7 రెట్లు ఎక్కువ రెట్లు మన్నిక కొబ్బరి పీచు భూవస్త్రాలకు ఉంది. వరద నీటిలో 4 వేల గంటలు మునిగి ఉన్న తర్వాత కూడా ఇవి చెక్కుచెదరలేదని సంస్థ తెలిపింది. అయితే, ఆ భూమి తీరుతెన్నులు, వాతావరణ పరిస్థితులు, యువి రేడియేషన్, వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఏ విధంగా వాడారు అన్న విషయాలపై కూడా మన్నిక ఆధారపడి ఉంటుంది.కూరగాయ పంటల్లో భూవస్త్రంతో ఆచ్ఛాదనపంట పొలాల్లో, చెట్లు, మొక్కల పెంపకంలో భూమికి ఆచ్ఛాదన కల్పించడానికి మల్చింగ్ షీట్లుగా ప్లాస్టిక్‌కు బదులుగా కొబ్బరి పీచుతో తయారైన భూవస్త్రాలు చక్కగా పనికివస్తాయి. ఈ షీట్ మొక్కల చుట్టూ పరిస్తే ఎండ, వానల నుంచి భూమిని కాపాడటమే కాకుండా కలుపు మొలవకుండా అడ్డుకుంటుంది. కలుపు మందుల పిచికారీ అవసరం లేదు. కలుపు తీత ఖర్చులు ఉండవు. నాగాలాండ్‌లో పైనాపిల్ పంటను విస్తారంగా సాగు చేసే రైతులు భూవస్త్రాలతో మల్చింగ్ చేస్తున్నారు. అరటి, వంగ, టమాటా, బెండ తదితర పంటలకు బాగా మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి భూవస్త్రాలు 600 జి.ఎస్.ఎం.(గ్రామ్స్ పర్ స్క్వేర్ మీటర్) నుంచి 2,000 జి.ఎస్.ఎం. మందం వరకు దొరుకుతాయి. మల్చింగ్ షీట్‌గా 600 జి.ఎస్.ఎం.(సుమారుపావు అంగుళం) మందం ఉండే భూవస్త్రం సరిపోతుంది. ఇది భూమిపై పరిచిన ఐదారు సంవత్సరాలలో భూమిలో కలిసి΄ోతుంది. ఫంక్షన్ హాల్స్, స్టార్ హోటళ్లలో కార్పెట్ల అడుగున కుషన్ ఎఫెక్ట్ కోసం 2,000 జి.ఎస్.ఎం. భూవస్త్రాలను వాడుతుంటారు. రోడ్ల మన్నిక పెరుగుతుందికొబ్బరి పీచు భూవస్త్రాలను మట్టి, తారు రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నారు. గ్రావెల్, ఎర్రమట్టికి అడుగున భూవస్త్రాలను పరుస్తారు. భూవస్త్రం వాడటం వల్ల రోడ్ల మన్నిక 20–40% పెరిగినట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో పంచాయతీ రోడ్ల నిర్మాణంలో ఇప్పటికే వాడుతున్నారు. ప.గో. జిల్లాలో చించినాడ బ్రిడ్జి అ్ర΄ోచ్రోడ్డు నిర్మాణంలో వాడామని, 20 ఏళ్లయినా చెక్కుచెదరలేదు. కొబ్బరి పీచు భూవస్త్రాలను ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన–3 కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రోడ్లలో ఉపయోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 164 కి.మీ., తెలంగాణలో 121 కి.మీ. మేరకు రోడ్ల నిర్మాణంలో భూవస్త్రాలను వాడేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇవి మంచి శోషణ శక్తిని కలిగి ఉంటాయని, బలంగా, చల్లగా ఉండి ఎక్కువ కాలం మన్నుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కృష్ణా, గోదావరి డెల్టాలో కాలువ గట్లు జారిపోతూ ఉంటే ఏటా బాగు చేస్తూ ఉంటారు. ఈ గట్లను భూవస్త్రాలతో కప్పి, వాటిపై మొక్కలను పెంచితే గట్లు బాగా గట్టిపడతాయి. ఐదారేళ్ల వరకు చెక్కుచెదరవు. రైలు పట్టాలకు ఇరువైపులా మట్టికట్టలను కూడా ఇలాగే పటిష్టం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. భూవస్త్రాల ధర..?కొబ్బరి కాయ మన ఆహార, ఆధ్యాత్మిక సంస్కృతిలో పెద్ద పీట ఉంది. కొబ్బరి పంట నుంచి కొబ్బరి కాయ ప్రధాన ఉత్పత్తి. కాయను ఒలిస్తే వచ్చే డొక్కల నుంచి పీచును వేరు చేస్తారు. ఈ క్రమంలో పొట్టు వస్తుంది. కొబ్బరి పొట్టును స్వల్ప ప్రక్రియ ద్వారా సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఈనెలతో చాపలను లేదా మాట్స్ను తయారు చేస్తారు. ఇవే భూవస్త్రాలు (కాయిర్ జియో టెక్స్టైల్స్). వీటిని మీటరు పన్నాతో సుమారు 50 మీటర్ల పొడవున తయారు చేస్తారు. భూవస్త్రాలు రెండు రకాలు.. చేనేత వస్త్రం మాదిరిగా కొన్ని దశల్లో నేసేవి (వోవన్), ఒక యంత్రంతో సులువుగా అల్లిక చేసేవి (నాన్ వోవన్). నాన్ వోవన్ భూవస్త్రాల ధర చదరపు మీటరుకు రూ. 50–60 ఉంటే, వోవన్ భూవస్త్రాల ధర నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా కేరళ తదితర రాష్ట్రాల్లో సహకార సంఘాలు, వ్యాపారులు కొబ్బరి ఉప ఉత్పత్తులను భారీ ఎత్తున తయారు చేస్తున్నారు. కేరళలో కొబ్బరి పీచు ఉత్పత్తుల తయారీ కోట్లాది మంది (వీరిలో 80% మంది మహిళలు)కి ఉపాధినిస్తున్న కుటీర పరిశ్రమ. విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. మన దగ్గరి నుంచి ఫ్రాన్స్ వంటి దేశాలు భూవస్త్రాలతో భూమి కోతకు గురికాకుండా జలవనరుల పరిసరాల్లో వినియోగిస్తున్న తీరును చూసి ఇటీవల మన అధికారులు నోరువెళ్ల బెట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. (చదవండి: Wedding Menu: ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..! క్రియేటివిటీ మాములుగా లేదుగా..)
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం
ఫ్రూట్స్‌తో.. బీకేర్‌ఫుల్..!
అమ్మ చెక్కిన బొమ్మ సమాజానికి కనువిప్పు
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
ఎడబాటు మానసికమా? భౌతికమా?
పాక్‌లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ
బ్యాంకు వారిని సెటిల్ మెంట్ అడగవచ్చు
మధుర కవచం! ఈ ఫ్రూట్ కవర్లతో లాభాలెన్నో..!
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ప్రాణాలు తీస్తున్న సరదా
చరిత్ర సృష్టించిన పూరన్.. సెహ్వాగ్ రికార్డు బద్దలు
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్ చేసిన హర్షిత్ రాణా
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
మేం ఉద్యోగం చేయలేం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
బంగాళాఖాతంలో అల్పపీడనం
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
గవర్నర్‌కు గడువు 3 నెలలే
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
మియాపూర్‌లో షెల్టర్!
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
17 ఏళ్లుగా పరారీలోనే!
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
గోల్డెన్ బ్యూటీ మీనాక్షి.. సమంత షాకింగ్ లుక్!
HYD: ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీ.. ఏడుగురు అమ్మాయిలతో..
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
చైనాపై మరో 50%
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
Waqf Act : అమల్లోకి వక్ఫ్ చట్టం.. విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
పాపికొండల్లో అలుగుల సందడి
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ
ట్రంప్ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
కొనసాగుతున్న అల్పపీడనం
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు
సహజీవనం చేసే వాడే చంపేశాడు
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయం
ఫ్రూట్స్‌తో.. బీకేర్‌ఫుల్..!
అమ్మ చెక్కిన బొమ్మ సమాజానికి కనువిప్పు
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట
గ్లెన్ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!
ఎడబాటు మానసికమా? భౌతికమా?
పాక్‌లో వైశాఖీ ఉత్సవం.. 6,500 భారతీయులకు వీసాలు జారీ
బ్యాంకు వారిని సెటిల్ మెంట్ అడగవచ్చు
మధుర కవచం! ఈ ఫ్రూట్ కవర్లతో లాభాలెన్నో..!
ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
Love Marriage: 15 రోజులకే ప్రేమపెళ్లి పెటాకులు
నేనలాగే పెరిగాను.. నా కూతురు కూడా అలాగే ఎదగాలి: ఉపాసన
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ట్రంప్ట్రేడ్ వార్-మన ఇన్వెస్టర్ల సంపద రూ.14 లక్షల కోట్లు ఆవిరి
గిల్, సూర్య కాదు!.. టీమిండియా కెప్టెన్, రోహిత్ వారసుడిగా ఊహించని పేరు
15 ఏళ్ల ఏజ్ గ్యాప్.. మాకేలాంటి ఇబ్బంది లేదు: తమన్నా
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్
అకీరా పుట్టినరోజే ఇలా జరగడం బాధాకరం: పవన్ కల్యాణ్
భర్త చనిపోయి బాధలో ఉన్న అత్తను ఓదార్చాల్సిందిపోయి ...
వాట్ ఏ వెడ్డింగ్ మెనూ..ఆరోగ్య స్పృహకి అసలైన అర్థం..!
అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. రోహిత్ రావడం వల్ల..: హార్దిక్
పాపకు, నాకు డీఎన్ఏ టెస్టు చేయాలన్నారు, ఎప్పుడూ అనుమానమే!: కీర్తి
అర్జున్ సన్నాఫ్ వైజయంతి సెన్సార్ రిపోర్ట్.. సినిమా అలా ఉందట!
AP: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్‌ను రమ్మన్నారు
PSL: జనాలు IPL వదిలేసి మమ్మల్నే చూస్తారు: పాక్ క్రికెటర్
ఏడు అడుగుల కండక్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
మావోయిస్టుల శాంతి చర్చల ప్రకటన
ప్రాణాలు తీస్తున్న సరదా
చరిత్ర సృష్టించిన పూరన్.. సెహ్వాగ్ రికార్డు బద్దలు
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం..!
మోహన్ బాబు ఫ్యామిలీలో మళ్లీ వివాదం.. పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు
RCB Vs MI: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు భారీ షాక్!
‘రింగు’ పొడవునా సర్వీసు రోడ్లు!
గత ఏడాది కంటే కటాఫ్ తగ్గే చాన్స్
అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?
దర్శకుడి భార్య బర్త్ డే పార్టీలో ఎన్టీఆర్
KKR VS LSG: మళ్లీ ఓవరాక్షన్ చేసిన హర్షిత్ రాణా
బీఆర్ఎస్ సభకు 3 వేల బస్సులు
బాత్రూంలో కెమెరాలతో భార్యపై నిఘా.. ప్రసన్న-దివ్య కేసులో బిగ్ ట్విస్ట్
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా పాటిదార్ అరుదైన ఘనత
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
EMIలు తగ్గుతాయ్.. లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
ఓటీటీలో 'టైమ్ లూప్ హారర్' సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
బిహార్‌ను మించి భయోత్పాతం: వైఎస్ జగన్
బాబుకు ఊడిగం చేసేవాళ్లకు ఇదే నా హెచ్చరిక: వైఎస్ జగన్
మేం ఉద్యోగం చేయలేం
వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..?
శామీర్‌పేట్ కారిడార్‌పై పీటముడి.. హెచ్ఎండీఏ తర్జనభర్జన
నదీ జలాలు లేకుంటే పుష్కర స్నానాలెలా?
IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..
Meerut Murder Case: మా అన్న బిడ్డే అయితే పెంచుకుంటాం
ఈ రాశి వారికి ఇంటాబయటా అనుకూలం.. ఆస్తిలాభం
మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు
Hyderabad: భార్య కడుపుతో ఉన్నా కనికరించని దుర్మార్గుడు..
సొమ్మసిల్లి పడిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
నేను సింగిల్.. రూ.50 కోట్లు తీసుకుంటే తప్పేంటి?: బాలీవుడ్ హీరో
HYD: మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం
టయోటా హైరైడర్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో: ధర ఎంతంటే?
బంగాళాఖాతంలో అల్పపీడనం
PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
యూపీలో ఏం జరుగుతోంది?: సుప్రీంకోర్టు ఆగ్రహం
తల్లి బదులు పది పరీక్షకు కూతురు!
ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
గవర్నర్‌కు గడువు 3 నెలలే
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
భారత్‌తో టెస్టుతో అరంగేట్రం.. ఆసీస్ యువ ఓపెనర్ సంచలన నిర్ణయం
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
రా..రమ్మని ఆహ్వానించేలా ఇంటిని అలంకరించుకోండి ఇలా..!
మియాపూర్‌లో షెల్టర్!
'రామ్ చరణ్' రికార్డ్ దాటాలని ప్రాణాలమీదకు తెచ్చుకున్న ఫ్యాన్స్
ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన 'అషు రెడ్డి' రొమాంటిక్ మూవీ
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
17 ఏళ్లుగా పరారీలోనే!
SRH: వరుసగా నాలుగు ఓటములు!.. మా బ్యాటింగ్ శైలి మారదు: వెటోరి
గోల్డెన్ బ్యూటీ మీనాక్షి.. సమంత షాకింగ్ లుక్!
HYD: ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీ.. ఏడుగురు అమ్మాయిలతో..
ఇల్లు ఏదైనా సరే.. ఇది ఉండాల్సిందే!
పర్యటించడానికి సాధ్యం కాని దేశాలివే..!
చైనాపై మరో 50%
ట్రంప్ పన్నుల బాదుడు.. చైనా అదిరిపోయే కౌంటర్
Waqf Act : అమల్లోకి వక్ఫ్ చట్టం.. విచారణపై తొందరెందుకన్న ‘సుప్రీం’
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
జగిత్యాలకు ఐకాన్ ఈ ‘ఖిల్లా’
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
పాపికొండల్లో అలుగుల సందడి
అరకు లోయలో అద్భుతం.. ప్రపంచ రికార్డు
‘భయపడొద్దు.. ఇన్‌కంట్యాక్స్ వాళ్లేమీ రారు’: ప్రధాని మోదీ
ట్రంప్ భయం.. ఈసారి భారీ ఫైన్లు, జైలు శిక్ష కూడా!
శ్రీకాకుళం: రెండుగా విడిపోయిన రైలు.. తప్పిన పెను ప్రమాదం
తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్!
కొనసాగుతున్న అల్పపీడనం
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు
సహజీవనం చేసే వాడే చంపేశాడు
పొలం ఆన్లైన్ చేయాలంటే పక్కలోకి రమ్మంటున్నారు
సినిమా

వినోదం.. భావోద్వేగం!
రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెరసాల’(Cherasala). శ్రీజిత్, నిష్కల, రమ్య ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్రాయ్ క్రియేషన్స్ పై కథ్రి అంజమ్మ, షికార నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ– ‘‘రిలేషన్ షిప్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే అంశాలతో ఈ మూవీ తీశాం. ఇందులో మంచి భావోద్వేగాలతో పాటుగా, చక్కని వినోదం ఉంది ’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంపై దర్శకుడు నాలుగు సంవత్సరాలు దృష్టి పెట్టాడు. ఇలాంటి మంచి సినిమాలు రావాలి’’ అని పేర్కొన్నారు శ్రీజిత్. ‘‘ఓ అమ్మాయి తన భర్త కోసం, మాంగళ్యాన్ని కాపాడుకునేందుకు పడే తపనే ఈ కథ’’ అని తెలిపారు కథా రచయిత ఫణీంద్ర భరద్వాజ్.

ఊహలకు అందని ప్రపంచం
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ వీడియోతో ఈ మూవీని ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్లో ఇది 22వ సినిమా కాగా, అట్లీ కెరీర్లో 6వ చిత్రం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించనున్నామని, నటీనటులు– సాంకేతిక నిపుణులు, విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘‘మ్యాజిక్ విత్ మాస్. ఊహలకు అందని ప్రపంచం. సన్ పిక్చర్స్ సపోర్ట్‌తో అట్లీగారితో సినిమా చేయనుండటం నిజంగా అద్భుతం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అల్లు అర్జున్ . ‘‘అల్లుఅర్జున్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నా కలను నిజం చేస్తున్న కళానిధిమారన్ సార్‌కి, సన్ పిక్చర్స్‌కు థ్యాంక్స్’’ అని అట్లీ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ ఫిల్మ్ రానుంది. అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణను త్వరలోనేప్రారంభించనున్నట్లు పేర్కొని, అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాక్ మూవీలో నటిస్తోన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమాలో చాలా పద్ధతిగా వైష్ణవిని చూస్తారని ఆయన అన్నారు. ఆ తర్వాత మా ప్రాజెక్ట్‌లో తాను నటించబోతోందని వెల్లడించారు. అయితే మా సినిమాలో మాత్రం చాలా మాస్‌గా చూపిస్తామని తెలిపారు. చివరిసారిగా వైష్ణవిని ఈ సినిమాలో పద్ధతిగా చూడమని సలహా ఇచ్చారు. మా సినిమాలో అన్ని మోడరన్ బూతులే ఉంటాయని నాగవంశీ వ్యాఖ్యలు చేశారు.

బాక్సాఫీస్ వద్ద ఎంపురాన్.. ఆ సినిమా రికార్డ్ సేఫ్!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 257కు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఈ వసూళ్లతో ఎల్2 ఎంపురాన్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా నిలిచింది. అంతేకాకుండా మలయాళంలో ఆల్‌టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ సినిమా 2018 మూవీ రికార్డ్‌ను మాత్రం అధికగమించలేకపోయింది. అయితే 2023లో విడుదలైన 2018 సినిమా కేరళ వ్యాప్తంగా రూ.88.7 కోట్లు రాబట్టగా.. ఎంపురాన్ ఇప్పటి వరకు కేవలం రూ.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ విషయంలో 2018 మూవీని ఎల్2 ఎంపురాన్ దాటలేకపోయింది. కాగా.. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
న్యూస్ పాడ్‌కాస్ట్

మీ కుటుంబానికి అండగా ఉంటాం... పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన ‘ఆరోగ్యశ్రీ’!. సమ్మెలో నెట్వర్క్ ఆస్పత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల 500 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించని ప్రభుత్వం... సమ్మె బాటలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు

ఏపీలో ఊరూ వాడా ఏరులై పారుతున్న వైనం. కూటమి నేతల సిండికేట్ కబంధ హస్తాల్లో మద్యం షాపులు.

వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లింలను దగా చేసిన ఏపీ సీఎం చంద్రబాబు... మూడు సవరణలు ప్రతిపాదించామంటూ తెలుగుదేశం పార్టీ గొప్పలు... అవి పసలేని సవరణలేనని మైనార్టీల ఆగ్రహం

తక్షణమే పనులు నిలిపివేయండి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు... నేడు రాజ్యసభ ముందుకు బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు... చర్చతోపాటు ఓటింగ్ జరిగే అవకాశం

శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను తీవ్రంగా ఖండించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు
క్రీడలు

భారత జట్టులో శ్రీ చరణి
న్యూఢిల్లీ: ఈనెలలో శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెపె్టన్‌గా, స్మృతి మంధాన వైస్ కెపె్టన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్ (మధ్యప్రదేశ్), కాశ్వీ గౌతమ్ (పంజాబ్)లకు తొలిసారి జాతీయ జట్టులో చోటు లభించింది. గాయం కారణంగా పేస్ బౌలర్లు రేణుక సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్లను ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో విశేషంగా రాణించినప్పటికీ ఓపెనర్ షఫాలీ వర్మను సెలెక్టర్లు మరోసారి పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన 20 ఏళ్ల శ్రీ చరణి గత నెలలో ముగిసిన డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అయిన శ్రీ చరణి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టింది. భారత జట్టులో చోటు దక్కించుకున్న శ్రీ చరణికి వైఎస్ఆర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు భరత్ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్, మహిళల విభాగం కో ఆర్డినేటర్ విష్ణుమోహన్ రావు అభినందనలు తెలిపారు. భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొనే ముక్కోణపు వన్డే టోర్నీ ఏప్రిల్ 27 నుంచి మే 11వ తేదీ వరకు కొలంబోలో జరుగుతుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మూడు జట్లు నాలుగు మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. టాప్–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నిస్, నల్లపురెడ్డి శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్, శుచి ఉపాధ్యాయ్.

PBKS vs CSK: ప్రియాంశ్ పటాకా
‘కింగ్స్’ పోరులో చెన్నైపై పంజాబ్‌దే పైచేయి అయింది. యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య మెరుపులకు శశాంక్ సింగ్, యాన్సెన్ ఫినిషింగ్ టచ్ తోడవడంతో పంజాబ్ భారీ స్కోరు చేయగా... ఛేదనలో చెన్నై చతికిలబడింది. కాన్వే, దూబే రాణించినా... మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నైకి వరుసగా నాలుగో పరాజయం తప్పలేదు. ‘ఫినిషర్’ ధోని దూకుడు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమైంది! ముల్లాన్‌పూర్: యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (42 బంతుల్లో 103; 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) రికార్డు సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో పంజాబ్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్లో చెన్నైకిది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రియాంశ్ ఆర్య సెంచరీతో కదంతొక్కగా... శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9)తో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0), స్టొయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్‌వెల్ (1) విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కాన్వే (49 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... రచిన్ (37; 6 ఫోర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (12 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్‌లు) పోరాడారు. ఫటాఫట్... ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికే పాయింట్ మీదుగా సిక్స్ కొట్టిన ప్రియాంశ్ ఆర్య... రెండో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ 24 ఏళ్ల కుర్రాడు అదే ఓవర్లో మరో సిక్స్ బాదాడు. రెండో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ డకౌట్ కాగా... ఆర్య ఇంకో సిక్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఖలీల్ తదుపరి ఓవర్లో శ్రేయస్‌ను క్లీన్‌బౌల్డ్ చేయగా... నాలుగో ఓవర్లో ఆర్య ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడ్డాడు.స్టొయినిస్ క్రీజులోకి వచ్చినంతసేపు కూడా నిలవలేకపోగా... అశ్విన్ ఓవర్లో 4, 6తో ఆర్య 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అశ్విన్ ఒకే ఓవర్లో నేహల్ , మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేశాడు. వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గించని ఆర్య... అశ్విన్ ఓవర్లో మూడు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. పతిరణ ఓవర్లో వరుసగా 6, 6, 6, 4 కొట్టిన ప్రియాంశ్ 13వ ఓవర్లోనే 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తదుపరి ఓవర్లో ఆర్య ఔట్ కాగా... చివర్లో యాన్సెన్, శశాంక్ చక్కటి షాట్లతో పంజాబ్‌కు భారీ స్కోరు అందించారు. 39 ప్రియాంశ్ ఆర్య సెంచరీకి తీసుకున్న బంతులు. ఐపీఎల్లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. గేల్ (30 బంతుల్లో), యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), మిల్లర్ (38 బంతుల్లో) ట్రావిస్ హెడ్ (39 బంతుల్లో) ముందున్నారు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాంశ్ ఆర్య (సి) శంకర్ (బి) నూర్ 103; ప్రభ్‌సిమ్రన్ (బి) ముకేశ్ 0; శ్రేయస్ (బి) ఖలీల్ 9; స్టొయినిస్ (సి) కాన్వే (బి) ఖలీల్ 4; నేహల్ (సి) ధోని (బి) అశ్విన్ 9; మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) అశ్విన్ 1; శశాంక్ (నాటౌట్) 52; యాన్సెన్ (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–17, 2–32, 3–54, 4–81, 5–83, 6–154. బౌలింగ్: ఖలీల్ 4–0–45–2; ముకేశ్ 2–0–21–1; అశ్విన్ 4–0–48– 2; జడేజా 3–0–18–0; నూర్ 3–0–32–1; పతిరణ 4–0–52–0. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ (స్టంప్డ్) ప్రభ్‌సిమ్రన్ (బి) మ్యాక్స్‌వెల్ 37; కాన్వే (రిటైర్డ్ అవుట్) 69; రుతురాజ్ (సి) శశాంక్ (బి) ఫెర్గూసన్ 1; దూబే (బి) ఫెర్గూసన్ 42; ధోని (సి) చహల్ (బి) యశ్ 27; జడేజా (నాటౌట్) 9; శంకర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–61, 2–62, 3–151, 4–171, 5–192, బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–39–0; యశ్ 4–0–39–1; మ్యాక్స్‌వెల్ 2–0–11–1; యాన్సెన్ 4–0–48–0; ఫెర్గూసన్ 4–0–40–2; స్టొయినిస్ 1–0–10–0; చహల్ 1–0–9–0.ఐపీఎల్లో నేడుగుజరాత్ X రాజస్తాన్ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: మారని సీఎస్కే తీరు.. వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో సీఎస్కే పరాజయం పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో డెవాన్ కాన్వే(49 బంతుల్లో 69) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(27 బంతుల్లో 42), రచిన్ రవీంద్ర(36), ధోని(27) పర్వాలేదన్పించారు. ఈ మ్యాచ్‌లో కూడా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) నిరాశపరిచాడు. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మాక్స్వెల్,యష్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు. డెవాన్ కాన్వే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.ఆర్య విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రియాన్ష్ కేవలం 39 బంతుల్లోనే తొలి ఐపీఎల్ శతకాన్ని అందుకున్నాడు.అతడితో పాటు శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.

చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
ఐపీఎల్-2025లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో వికెట్ కీపర్‌గా ధోని తన 150వ క్యాచ్‌ను అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహల్ వధేరా క్యాచ్‌తో ధోని ఈ ఫీట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో 150 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఈ ఫీట్‌ను ఇప్పటివరకు ఎవరూ సాధించలేకపోయారు. ధోని ఓవరాల్‌గా ఐపీఎల్లో 154 క్యాచ్‌లు తీసుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్‌గా తీసుకున్నాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ధోని తర్వాతి స్ధానంలో దినేష్ కార్తీక్(137) ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లు వీరే..ఎంఎస్ ధోని-150 క్యాచ్లుదినేష్ కార్తీక్-137వృద్దిమాన్ సహా-87రిషబ్ పంత్-76క్వింటన్ డికాక్-66ఆర్య సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాన్ష్ ఆర్య(7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగగా.. శశాంక్ సింగ్(52), జాన్సెన్(34) పరుగులతో రాణించారు. సీఎస్కే బౌలర్లలో ఖాలీల్ అహ్మద్, అశ్విన్ తలా రెండు వికెట్లు సాధించగా.. నూర్, ముఖేష్ చెరో వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
బిజినెస్

సెమీకండక్టర్ల తయారీలోకి సైయెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెక్నాలజీ దిగ్గజం సైయెంట్ తాజాగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ’సైయెంట్ సెమీకండక్టర్స్’ పేరిట ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. దీనిపై 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు వెల్లడించారు. దీనికి సుమన్ నారాయణ్ సీఈవోగా వ్యవహరిస్తారని తెలిపారు. దేశవిదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, డిస్కంలు సహా వివిధ పరిశ్రమలకు అవసరమైన సిలికాన్ చిప్ సొల్యూషన్స్‌ను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు కృష్ణ వివరించారు. కంపెనీ విస్తరణ కోసం సెపె్టంబర్ నాటికి ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు కృష్ణ వివరించారు. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియపై కొనసాగుతోందన్నారు. ఇలా సమీకరించిన నిధుల్లో సింహభాగం వాటా పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణుల నియామకాలపై వెచ్చించనున్నట్లు కృష్ణ చెప్పారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల సంబంధ విధులు నిర్వర్తిస్తున్న సుమారు 400 మంది సిబ్బందిని, కొత్త కంపెనీకి బదలాయించనున్నట్లు తెలిపారు. కొత్త సంస్థను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేసే యోచన ఉన్నట్లు కృష్ణ పేర్కొన్నారు. సెమీకండక్టర్ వ్యవస్థలో భారత్ స్వావలంబన సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.

బీవైడీకి కేంద్రం ‘నో’
న్యూఢిల్లీ: చైనా అసమంజస వాణిజ్య విధానాలపై విమర్శల నేపథ్యంలో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలకు ప్రస్తుతం ఆమోదముద్ర లభించే అవకాశాలు కనిపించడం లేదు. ‘దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎవరి పెట్టుబడులను అనుమతించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి బీవైడీ ప్రతిపాదనకు నో (చెప్పినట్లే)’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.స్థానిక భాగస్వామితో కలిసి 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామంటూ బీవైడీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గతేడాది తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మళ్లీ ముందుకు కదిలినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం ప్రధానంగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని దుబాయ్ ఇండియా బిజినెస్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. వివిధ దేశాలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపిన గోయల్.. అమెరికాతో చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నాయని చెప్పారు. యూఏఈలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.

షేర్లపై జియో ఫైనాన్స్ రుణాలు
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ జియో ఫైనాన్స్ (జేఎఫ్ఎల్) తాజాగా డిజిటల్ విధానంలో సెక్యూరిటీస్‌పై రుణాల (ఎల్ఏఎస్) విభాగంలోకి ప్రవేశించింది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లపై తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియంతా పూర్తి డిజిటల్ రూపంలో పది నిమిషాల్లోనే పూర్తవుతుందని వివరించింది. జియోఫైనాన్స్ యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీని ద్వారా రూ. 1 కోటి వరకు, గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి రుణాలు పొందవచ్చు. వ్యక్తిగత రిస్క్ సామర్థ్యాలను బట్టి వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఫోర్క్లోజర్ చార్జీలు ఉండవు. షేర్లను విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి, అవసరమైన నిధులను పొందేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని జియో ఫైనాన్స్ ఎండీ కుశల్ రాయ్ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీ సర్విసులు, డిజిటల్ గోల్డ్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తదితర సేవలను కూడా జియోఫైనాన్స్ యాప్‌తో పొందవచ్చు.

రూపాయికి ట్రేడ్ వార్ సెగ
డాలర్ మారకంలో రూపాయి విలువ మరో 50 పైసలు బలహీనపడి 86.26 వద్ద ముగిసింది. వాణిజ్య యుద్ధాలతో మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చనే భయాలు దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమయ్యాయి. యువాన్ క్షీణత, క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు మరింత ఒత్తిడి పెంచాయి. జనవరి 13 (66 పైసలు క్షీణత) తర్వాత భారత కరెన్సీకిదే అతిపెద్ద పతనం. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.89 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.82 వద్ద గరిష్టాన్ని, 86.29 వద్ద కనిష్టాన్ని తాకింది. ‘అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఫారెక్స్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. ఆర్బీఐ పాలసీ వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రానున్న రోజుల్లో 85.90 – 86.50 శ్రేణిలో ట్రేడవొచ్చు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు దిలీప్ పార్మర్ తెలిపారు.
ఫ్యామిలీ

మరో ఇండోర్‌లా.. భాగ్యనగరం కాగలదా..?
ఆ నగరం.. ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది, విచ్చలవిడిగా పందులు, కుక్కలు తిరుగుతుండేవి.. వాటి విసర్జన కుప్పలు ఈగల సమూహాలతో వీధులు నిండిపోయేవి.. ఇలాంటి అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల మధ్య నుంచి.. తనను తాను మార్చుకుంటూ.. కొత్తగా మలుచుకుంటూ ఇప్పుడు అత్యంత పరిశుభ్ర నగరంగా అవతరించింది ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా.. ఇండోర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఈ స్థానంలో మన హైదరాబాద్ నగరం కూడా చోటు దక్కించుకోగలదా? దేశంలోని 471 పట్టణాలు, నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరం అనే అవార్డును ఎనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం గెలుస్తూనే ఉంది. ఇదే ఇండోర్ నగరం 2017కి ముందు, పరిశుభ్రత ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉంది. దీనికి కారణాలేమిటి? మన ఇండియాలోనే ఉన్నామా? ‘మనం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పుడు, రోడ్డు చూడగానే భారతదేశంలో లేమేమో అనిపిస్తుంది, అంత పరిశుభ్రంగా ఉంటుంది అని నగరం నుంచి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం తరచూ ఇండోర్‌కు రాకపోకలు సాగించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నితీష్ అంటున్నారు. మన నగరంలో పలు కుటుంబాలు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. కానీ ముందు తలుపు నుంచి కొన్ని అడుగుల దూరంలో చెత్త కుప్పలుగా పోగుబడి ఉంటుంది. ‘ఆ కుప్ప ప్రాంతం వేరొకరి బాధ్యతగా భావిస్తారు. దీంతో తమ పరిశుభ్రమైన ఇంటికి దుర్వాసనతో కూడిన ఆ చెత్త కుప్ప మీదుగా వెళ్లడంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందీ పడరు’ అయితే ఇండోర్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఇండోర్ ‘విజయ’విశేషాలు.. క్లీన్ టూ విన్.. పేవ్మెంట్లు, రోడ్ డివైడర్లు రీసైకిల్ చేసిన నీటి గొట్టాలను కలిగి ఉంటాయి. అక్కడి చెత్త వ్యాన్లు ఇండోర్ నంబర్ వన్‌గా మారింది అనే జింగిల్‌ను పదే పదే ప్లే చేస్తుంటాయి. ఆ శబ్దం తమను సమీపిస్తుండగానే జనం తమ ఇళ్లలో నుంచి తమ చెత్త బుట్టలతో బయటపడతారు. అతి చిన్న సందులో ఉండే వేలాది విభిన్న రంగుల డబ్బాల నుంచి వ్యర్థాలను తొలగించి, శుద్ధి చేసే విధానం అమలు చేసేందుకు దాదాపు 850 మంది పారిశుధ్య సిబ్బంది సైన్యం తరహాలో సిద్ధంగా ఉంటుంది. ఇవీ కీలకాంశాలు.. జీపీఎస్ ట్రాకింగ్ ఉపయోగించి, ఓ ప్రత్యేక బృందం చెత్త వ్యాన్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, వారు తమ పనిని నిర్ధేశించిన విధంగా చేస్తున్నారో లేదో సునిశితంగా పరిశీలిస్తారు. గృహస్థుల వ్యర్థాలను తడి, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, నాన్ప్లాస్టిక్, బయోమెడికల్, ప్రమాదకర పదార్థాలుగా విభజన జరుగుతుంది. వ్యర్థాలను ఇంధనంగా, కంపోస్టుగా మార్చి రైతులకు ఎరువుగా విక్రయిస్తున్నారు. చాలా రెస్టారెంట్లు మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్లను రెస్టారెంట్స్ బయట ఉంచుతాయి. పండ్లు, కూరగాయల మార్కెట్లో వివిధ రకాల వ్యర్థాల కోసం వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. అక్కడ ఒక యంత్రం కూడా ఉంది. ఇది వ్యర్థాలను సిటీ బస్సుల కోసం వాడే, అలాగే వంటకు ఉపయోగించే ఇంధనంగా మారుస్తుంది. తమ నగరం పరిశుభ్రత పరంగా దేశంలోనే నెంబర్ వన్ అనే టైటిల్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక ఇంధనంగా మారింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పాఠశాల విద్యార్థులు ప్రతి రోజూ ప్రతిజ్ఞ చేస్తారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త వేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానాలు విధించడం లాంటి కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరిశుభ్రత పోటీలను నిర్వహిస్తున్నారు. మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకుని, పరిశుభ్రత అవసరాన్ని తలకెక్కించడానికి, మత పెద్దలను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశారు. హోలీ వంటి పండుగల సందర్భంగా, వీధులు, భవనాలు రంగులతో తడిసినప్పుడు, అదనపు వాహనాలు నీటి ట్యాంకర్లు నగరాన్ని శుభ్రం చేయడానికి శరవేగంగా బయటకు వస్తాయి. ప్రజలు ప్రభుత్వాలు తలచుకుంటే ఇండోర్ విజయాన్ని మన నగరంలో కూడా పునరావృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రజానీకం, దృఢమైన చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఉంటే తరతరాలుగా వస్తున్న కొన్ని ‘చెత్త’ అలవాట్లు మారతాయి’ అంటున్నారాయన. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..)

65 ఏళ్లు దాటిన వృద్ధులు తరుచుగా పడిపోతుంటారు ఎందుకు..?
సాధారణంగా పెద్దవయసులోని వారు పడిపోయారనీ, బాత్రూమ్లో జారిపడ్డారనీ... లాంటి మాటలుతరచూ వినవస్తూ ఉంటాయి. దాదాపు 65 ఏళ్లు దాటిన చాలామంది ఇలా పడిపోతుంటారనే న్యూస్ వింటుండటం మామూలే. పెద్దవారు ఇలా పడిపోతుండటం వల్ల ఒక్కోసారి ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), తలకు గాయాలు (హెడ్ ఇంజరీస్) కావడం లాంటి అనర్థాలెన్నో జరుగుతుంటాయి. వీటిల్లో బాత్రూముల్లో జారిపోవడం మినహాయించి మిగతాచోట్ల పడిపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. పెద్దవాళ్లు అలా ఎందుకు పడిపోతుంటారో, అందుకు రకరకాల కారణాలేమిటో, వాళ్లు అలాపడిపోవడాన్నినివారించడమెలాగో చూద్దాం. ప్రస్తుతం మనదేశంలో 60 ఏళ్లు పైబడిన పెద్దవాళ్ల సంఖ్య 15 కోట్లు. అంటే మొత్తం జనాభా అయిన 140 కోట్లలో దాదాపు 10.5% మంది పెద్దవాళ్లే. వీళ్లలో దాదాపు 60 నుంచి 70 ఏళ్ల వాళ్లలో 25–30 శాతం మంది పడిపోతూ ఉండగా... 70 నుంచి 80 ఏళ్ల మధ్యవాళ్లలో పడిపోయే వారి శాతం 35%గా ఉంది. మామూలుగా పదిమందిలో ఆరుగురు ఇండ్లలోనే పడుతుంటారు. పడిపోవడం మెల్లగానే పడిపోయినట్లు కనిపించినా ఆ పడటం తాలూకు పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. ఉదాహరణకు అలా పడినప్పుడు మెదడులోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘సబ్డ్యూరల్ హిమటోమా’ అంటారు. దీనికి శస్త్రచికిత్స అవసరం పడుతుంది. ఇక తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిపోయి మంచానికే పరిమితం కావడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అప్పుడప్పుడూ పెద్దవారే కాదు... కొందరు మధ్యవయస్కులూ పడిపోవడం ఇటీవల సాధారణంగా జరుగుతోంది. ఇలా పడిపోడానికి కారణాలేమిటో తెలుసుకుందాం.కారణాలివే... కొందరు పెద్ద వయసువారిలో వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ల పాదాల్లో స్పర్శ కొంతమేర తగ్గవచ్చు. దాంతో తాము పడి΄ోతున్నామనే సంగతి కూడా వాళ్లకు తెలియకుండానే వాళ్లు పడిపోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రతతో పాటు మజిల్ మాస్ కూడా క్రమంగా తగ్గుతూ పోతుంది. దాంతో కండరాల్లోని శక్తి కూడా క్షీణించడంతో పడిపోవడానికి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మోకాలు, చీలమండ, తుంటి ఎముకల కీళ్లలోనూ కొన్ని మార్పులు రావడం కారణంగా పడిపోవడాలు జరగవచ్చు. పెరుగుతున్న వయసుకు తగ్గట్లు చూపు మందగించడం, వినికిడి శక్తి కూడా క్షీణించడం వంటి అంశాలు కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా పడిపోవడానికి కారణాలు కావచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో నిటారుగా నిలబడి ఉండే శక్తి తగ్గుతుంది. వయసు పెరిగిన పెద్దవాళ్లు పడిపోకుండా ఉండటానికి ప్రకృతి ఆ వృద్ధుల్ని కాస్త ముందుకు ఒంగిపోయేలా చేస్తుంది. పడి΄ోయేవాళ్లలో ఇలాంటివాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు గుండె / మెదడు / శరీరంలోని ఇతర అవయవాలు లేదా వివిధ వ్యవస్థల్లోని ఆరోగ్య సమస్యలు నయం కావడం కోసం వాళ్లు వాడే మందుల కారణంగా కూడా వాళ్లు తూలిపడిపోయే ప్రమాదమూ ఉంటుంది. కొన్నిసార్లు నరాలకు సంబంధించిన కారణాలతోనూ పడిపోయే అవకాశాలుంటాయి. ఒక్కోసారి కారణాలేమీ లేకుండానే ముందుకో వెనక్కో పడిపోయే ప్రమాదం ఉంది. మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అందుకే పెద్దవయసు వారు మాట్లాడుతూ నడవకూడదు. నడుస్తూ మాట్లాడకూడదు. వృద్ధాప్యంలో పడిపోవడానికి కారణమయ్యే మరికొన్ని ఆరోగ్య సమస్యలుపోష్చరల్ హై΄ోటెన్షన్ (లో బీపీ) : అకస్మాత్తుగా బీపీ తగ్గిపోయే కండిషన్ ఇది. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా శరీరంలోని ద్రవాలూ లేదా ఖనిజ లవణాల మోతాదులు తగ్గడం వల్ల ఇలా జరగవచ్చు. అలాగే కొందరిలో ఏదైనా మందు/ఔషధం తీసుకోగానే ఇలా జరగడానికి అవకాశముంది. ఒక్కోసారి పెద్దవాళ్లు తాము కూర్చున్న స్థితి నుంచి అకస్మాత్తుగా పైకి లేవడం లేదా ఉన్నట్టుండి పక్కపై నుంచి లేవడం జరిగినప్పుడు అకస్మాత్తుగా బీపీ పడిపోవచ్చు. ఇలాంటప్పుడు బీపీ 20 హెచ్‌జీ/ఎంఎం కంటే తక్కువగా ఉన్నప్పుడు మెదడుకు చేరాల్సిన రక్తం మోతాదులు కాస్తా అకస్మాత్తుగా తగ్గడం వల్ల పడిపోవచ్చు. కొందరు నిలబడి మూత్రవిసర్జన చేసేవాళ్లలో ఆ సమయంలోనూ లేదా కొందరిలో అకస్మాత్తుగా దగ్గు రావడం వల్ల కూడా ఒక్కోసారి బీపీ హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది. సింకోప్ : కొందరు అకస్మాత్తుగా కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లుగా అయిపోతారు. కళ్లు తిరుగుతూ, చూపు తాత్కాలికంగా మసకబారుతుంది. ముఖంలో రక్తపు చుక్కలేనట్లుగా పాలిపోతారు. శరీరమంతా చల్లబడి, ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. దాంతో ఉన్నవారు ఉన్నట్టుగా అకస్మాత్తుగా పడిపోయి, ఎముకలు విరగడం, తలకు గాయం కావడం వంటి ప్రమాదం జరగవచ్చు. ఇలాంటి వాళ్లలో కొందరు ఒక్కోసారి తమ మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయే ప్రమాదమూ ఉంది. ఇలా అకస్మాత్తుగా కళ్లు తిరుగుతూ పడిపోవడాన్ని ‘సింకోప్’ అంటారు. మానసికంగా ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మనకు అంతగా ఇష్టం లేని దృష్యాలనూ / అంశాలనూ చూసినప్పుడు (ఎవరైనా గాయపడటం లేదా రక్తస్రావం అవుతుండటం, ఇంకెవరైనా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండటం వంటి తమకు ఆమోదం కాని అన్‌ప్లెజెంట్ విజువల్ స్టిములై కారణంగా) ఇలా జరగవచ్చు. వర్టిగో : ఒక్కోసారి కొందరిలో కళ్లు తిరిగినట్లుగా అయి΄ోయి ఒళ్లు స్వాధీనం తప్పి పడిపోవచ్చు. సాధారణంగా లోపలిచెవి లేదా బ్రెయిన్ స్టెమ్‌లో ఉన్న వ్యాధుల కారణంగా ఇలా జరగడానికి అవకాశాలెక్కువ. ఫిట్స్ : ఒక్కోసారి కొందరిలో ఫిట్స్ రావడం / స్పృహ కోల్పోవడం / శరీరమంతా కుదుపునకు (జెర్క్) లోనుకావడం వల్ల. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : ఒక్కోసారి కొందరిలో తక్కువ తీవ్రతతో పక్షవాతం వచ్చి, మళ్లీ వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ అంటారు. అకస్మాత్తుగా పడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇలాంటి సందర్భాల్లో కొందరిలో సరిగా మాట రాకపోవడం, మాటలు ముద్దగా రావడం, కాళ్లూ, చేతులు తాత్కాలికంగా బలహీనంగా మారడం జరగవచ్చు. పార్కిన్సన్ డిసీజ్ : ఈ ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లలో వణుకు కారణంగా శరీరానికి సరైన బ్యాలెన్స్ లేకపోవడంతో పడిపోవడం జరుగుతుంది. వీళ్లలో శరీరం కదలికలు నెమ్మదించడం వల్ల కూడా వారు పడిపోయే ప్రమాదముంటుంది. వెన్నెముక / నరాలు / కండరాల వ్యాధుల వల్ల ఒక్కోసారి కాళ్లూ చేతులు బలహీనమైపోయినప్పుడు. దేహంలో సోడియమ్, పొటాషియమ్ వంటి లవణాలూ లేదా చక్కెర మోతాదులు తగ్గిపోయినప్పుడు. చాలా అరుదుగా మెదడులో కణుతులు, మతిమరపు, సైకోసిస్ వంటి అంశాలు కూడా పడిపోడానికి కారణాలు కావచ్చు. అకస్మాత్తుగా పడిపోవడాన్ని నివారించండి ఇలా...పడిపోవడానికి సరైన కారణాలను తెలుసుకొని... వాటిని సరిదిద్దుకోవాలి. అంటే... పడుకున్నవారు / కూర్చున్నవారు అకస్మాత్తుగా లేవడం వల్ల పడి΄ోవడం జరుగుతున్నా అలా ఉన్నపళంగా లేవడం సరికాదు. పడుకున్న వారు తాము పక్క నుంచి లేస్తున్నప్పుడు మొదట మెల్లగా ఒక పక్కకు ఒరుగుతూ... ఆ తర్వాత లేచి కూర్చుని... అప్పుడు మెల్లగా నిల్చోవాలి. కూర్చున్న వారు కూడా ఒకేసారి కుర్చీలోంచి లేవకుండా... మెల్లగా లేని నిలబడాలి. ఆరోగ్య కారణాల వల్ల ఇలా పడిపోయే మెడికల్ హిస్టరీ ఉన్నవారు అందుకు కారణాన్ని తెలుసుకోడానికి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి అందుకు అవసరమైన చికిత్స తీసుకోవడం ద్వారా. అకస్మాత్తుగా పడిపోవడానికి నరాలకు సంబంధించిన (న్యూరలాజికల్) కారణాలుంటే అవేమిటో తెలుసుకుని, తగిన చికిత్స తీసుకోవాలి. ఉపకరణాలు వాడటం : అకస్మాత్తుగా పడిపోయే వారు తమకు అవసరమయ్యే ఉపకరణాలు... అంటే చేతికర్ర (వాకింగ్ స్టిక్) / వాకర్ / కళ్లజోడు వంటివి దూరంగా పెట్టుకోకుండా, ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. కాస్తంత పెద్ద వయసు మహిళలు హైహీల్స్ తొడగడం సరికాదు. తమకు సురక్షితంగా ఉండే ఫ్లాట్ హీల్ పాదరక్షలు వాడాలి. కాలి కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేయడం చాలా రకాల పడి΄ోవడాలను (ఫాల్స్‌ను) నివారిస్తాయి.ఇతరత్రా మరికొన్ని మార్గాలివి... చాలా సార్లు పడిపోవడం అన్నది ఇండ్లలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇంటివాతావరణాన్ని పెద్దవారికి ఫ్రెండ్లీగా మార్చడం చాలా మేలు చేస్తుంది. పడకుండా నివారిస్తుంది. ఇందుకు చేయాల్సిన కొన్ని పనులు... నాన్‌స్టిక్ మ్యాట్స్ వాడటం. ఫ్రిక్షన్ బాగా ఉంటే ఫ్లోరింగ్ వేయించడం. కాలుజారనివ్వని కార్పెట్స్ పరవడం. గదిలో మంచి వెలుతురు / గాలి వచ్చేలా చేసుకోవడం. టాయిలెట్స్, బాత్రూమ్స్లో మంచి పట్టు ఉండటానికి వీలుగా హ్యాండ్ రెయిల్స్ అమర్చుకోవడం, బాత్రూమ్ బయట కాలుజారనివ్వని మ్యాట్స్ వాడటం మరీ అవసరమైతే తప్ప ఎక్కడా ఎక్కకుండా ఉండటం...వంటి జాగ్రత్తలతో పెద్దవారు పడిపోయే ప్రమాదాలను నివారించవచ్చు.పడిపోయే అవకాశాలు ఎవరిలో ఎక్కువ... చిన్న చిన్న అడుగులు వేస్తూ, రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నిల్చున్నప్పుడు రెండు కాళ్ల మధ్య ఖాళీ తక్కువగా ఉంచేవారు. నడిచే సమయంలో కళ్లు మూసుకునేలా ముఖం ఎక్కువగా రుద్దుకునేవారు.చికిత్స ఫాల్ క్లినిక్స్ : ఇటీవల చాలా ఆసుపత్రుల్లో ‘ఫాల్ క్లినిక్స్’ ప్రారంభిస్తున్నారు. వీటిలో పడి΄ోయిన వాళ్లకు ఇవ్వాల్సిన చికిత్స అందిస్తుంటారు. పడిపోయాక తలకు దెబ్బతగిలినప్పుడు తక్షణం న్యూరో సర్జన్ చేత చికిత్సలు అందించాల్సిన అవసరముంటుంది. ఫ్రాక్చర్స్ వంటివి అయితే ఆర్థో నిపుణులతో చికిత్స అందించాల్సి ఉంటుంది.

నైట్‌షిఫ్టుల్లో పనిచేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
ఇటీవల చాలామంది నైట్ డ్యూటీలు చేస్తున్నారు. గతంలో కేవలం కొద్దిమంది స్థానంలో ఇటీవల అమెరికా టైమ్‌కు తగ్గట్లుగా పనిచేయాల్సి రావడంతో రాత్రిళ్లు పనిచేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిరోజూ పగలు పనిచేసి, రాత్రి నిద్రపోయే వారి ఆహారపు అలవాట్లతో పోలిస్తే... నైట్ షిఫ్ట్‌లలో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాల్సి వస్తోంది. లేక΄ోతే వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలెక్కువ. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారు తమ ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులేమిటో చూద్దాం. నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారికి సాధారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఉదాహరణకు అవి... ఛాతీలో మంట, అజీర్ణం, మలబద్ధకం, ఆకలి తగ్గడం వంటి గాస్ట్రోఇంటస్టినల్ సమస్యతో పాటు రక్త΄ోటు, గుండెజబ్బులు, యాంగై్జటీ, ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి వంటివి రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారిలో కాస్తంత ఎక్కువగా కనిపించవచ్చు.బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ..నైట్ షిఫ్టుల్లో పనిచేసేవాళ్లలో బరువు పెరిగి స్థూలకాయం (ఒబేసిటీ) వచ్చే అవకాశాలూ ఎక్కువే. ఇందుకు కారణాలు ఏమిటంటే... సాధారణంగా పగటి డ్యూటీలు చేసేవారు రాత్రంతా నిద్ర΄ోవడం వల్ల మళ్లీ ఉదయం వరకు భోజనం తీసుకోరు. కానీ రాత్రి డ్యూటీలు చేసేవారు రాత్రంతా మెలకువతో ఉండాల్సి రావడంతో మధ్య మధ్య ఆకలేస్తూ ఉంటుంది. దాంతో రాత్రివేళ్లలోనూ తినాల్సి వస్తుంటుంది. సాధారణంగా ఇలా రాత్రి వేళల్లో తినే ఆహారం కాస్తా మామూలు భోజనంలా కాకుండా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ వంటివే ఎక్కువ. అందుకే రాత్రివేళ పనిచేసేవారు తీసుకునే అసమతౌల్య ఆహారపు అలవాట్ల (అన్ బ్యాలెన్స్డ్ డయటరీ ΄ాటర్న్) కారణంగా ఒకపక్క కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం, మరో పక్క శారీరక శ్రమ లేక΄ోవడంతో ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతో ఆ ఒబేసిటీ కారణంగా వచ్చే ఆరోగ్యపరమైన ముప్పులు (హెల్త్ రిస్క్‌లు) ఎక్కువే. అలాంటి ముప్పు రాకూడదంటే ఆహారపరంగా పాటించాల్సి సూచనలివి... రాత్రివేళల్లో ఉద్యోగాలు / పనులు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారికి వచ్చేందుకు అవకాశమున్న చాలా రకాల ఆరోగ్య సమస్యలనూ, ఇతరత్రా ముప్పుల ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అందుకు అనువైన ఆహారపు అలవాట్లు ఇవి... æ నైట్‌షిఫ్టుల్లో పనిచేయడానికి వెళ్లేవారు... డ్యూటీకి వెళ్లే ముందర భోజనం చేసి వెళ్తుంటారు. వాళ్లు పెద్ద పెద్ద పరిమాణాల్లో తక్కువ సార్లు కాకుండా... చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకుంటూ ఉండాలి. చిన్న పరిమాణంలో తీసుకునే ఆహారాలు జీర్ణం కావడం తేలిక. దాంతో చాలారకాల గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు తేలిగ్గా నివారితమవుతాయి. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉండాలి. పీచుపదార్థాలు (డయటరీ ఫైబర్) ఎక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆఫీసుల్లోని వెండింగ్ మెషిన్, కాఫెటేరియా వద్ద లభ్యమయ్యే ఆహారపదార్థాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉండటమే మేలు. ఇంటిదగ్గర నుంచి తెచ్చుకున్న ఆహారాన్నే (హోమ్ మేడ్ ఫుడ్‌ను) తీసుకోవడమే మంచిది. ఒకవేళ కాఫెటేరియా ఫుడ్‌నే తీసుకోవాల్సి వస్తే... పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అంటే... తాజా పండ్లు, సలాడ్స్, మొలకెత్తిన గింజలు, పొట్టుతో ఉన్న పప్పుధాన్యాలు, గింజధాన్యాలు (అంటే ఉదాహరణకు...పొట్టుతోనే ఉన్న గోధుమలతో చేసిన రోటీలు, మొక్కజొన్నలతో చేసిన పదార్థాలు, బ్రౌన్‌బ్రెడ్ శాండ్విచ్లు) వంటివి తీసుకోవడం మంచిది. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు, బాగా ఎక్కువగా వేయించిన వేపుళ్లు (ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, చిప్స్) వంటి ఆహారాలను వీలైనంతవరకు తీసుకోక΄ోవడమే మేలు. రాత్రివేళల్లో తీపి పదార్థాలు, రిఫైన్డ్ ఫుడ్స్ (అంటే... క్యాండీలు, చాక్లెట్లు, వైట్ బ్రెడ్స్, బన్, పాస్తా, పిజ్జాలు, కూల్‌డ్రింక్స్) వంటి వాటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రివేళ పనిచేస్తుండేవారు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. పగటితో పోలిస్తే రాత్రి కాసంత చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ ముప్పు ఉంటుంది. కాబట్టి నైట్ షిఫ్ట్‌లో తరచూ నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. నైట్ షిప్టుల్లో పనిచేసేవారు కాఫీ, టీ లు చాలా ఎక్కువగా తాగుతుంటారు. నిద్రరాకుండా ఉండటానికీ అలాగే బ్రేక్ సమయాల్లో ఇలా టీ, కాఫీలు తాగడం చాలా సాధారణం. అయితే వాటికి వీలైనంతగా తగ్గించాలి. టీ, కాఫీలు తాగాలనిపించినప్పుడల్లా నీళ్లు తాగుతుండటం మేలు. రాత్రివేళల్లో పనిచేసేవారు చాలావరకు వ్యాయామాలకు దూరంగా ఉంటారు. రాత్రంతా డ్యూటీ చేయడంతో పొద్దున్నే ఇంటికెళ్లగానే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇక రాత్రి డ్యూటీకి వచ్చే తొందరలో వ్యాయామాలను వదిలేస్తుండటం కద్దు. అయితే ఇలాంటివాళ్లంతా తమ వర్క్షెడ్యూల్కు అనుగుణంగా రోజులోని ఏదో ఒక సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 – 60 నిమిషాల పాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. రాత్రి షిఫ్టుల్లో పని సమయంలో వారిని ఉత్సాహంగా ఉంచడానికి ఈ వ్యాయామం తోడ్పడుతుంది. పైగా వ్యాయామపు ఉత్సాహం వల్ల రాత్రి పని చేసేటప్పుడు తూగురావడం వంటివి జరగవు. ఈ వ్యాయామాల వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే రాత్రి డ్యూటీల కారణంగా బరువు పెరగడమూ జరగదు. ఇదే వ్యాయామం రాత్రిపనివేళల్లో పనిచేయడం వల్ల కలిగే ఒత్తిడిని (స్ట్రెస్‌ను) నివారిస్తుంది. దాంతో అధిక రక్తపోటు (హైబీపీ), డిస్లిపిడేమియా (రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు అసాధారణంగా పెరగడం) వంటి ముప్పులూ నివారితమవుతాయి. (చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..)

ఎవరీ సోమాదాస్..? కోర్టులు ఆమె పోరాటాన్ని గౌరవించి మరీ..!
‘నేను బాగుంటే చాలు’ అనుకునే ఈ రోజుల్లో నలుగురి కోసం పోరాటానికి దిగడం మామూలు విషయం కాదు.పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామకంలో అవక తవకలున్నాయని 25,752 ఉద్యోగాలని తొలగించింది సుప్రీంకోర్టు – ఒక్క ఉద్యోగం తప్ప. ఆ ఉద్యోగం సోమా దాస్ది. ఈ బెంగాలీ టీచర్ తనకు ఉద్యోగం రానందుకు పోరాడింది. ఉద్యోగం రాని వాళ్ల కోసం పోరాడింది. ఈలోపు కేన్సర్ వస్తే దానిపై పోరాడింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆమె పోరాటాన్ని గౌరవించి ఉద్యోగాన్ని నిలబెట్టాయి. కాని ఇప్పుడు ఈ తీర్పు వల్ల కూడా ఎందరో రోడ్డున పడతారని పోరాటానికి సిద్ధమైంది సోమాదాస్. ఇలా ఎవరున్నారని?‘మళ్లీ కొత్త ఓరాటం చేయాలేమో’ అంది సోమా దాస్.మొన్నటి ఏప్రిల్ 3వ తేదీకి ముందు, తర్వాత ఆమె జీవితం ఒకేలా ఉంది. ఎందుకంటే ఆమె ఉద్యోగం పోలేదు. కాని ఆమెతోపాటు ఉద్యోగంలో చేరిన వారంతా సుప్రీంకోర్టు తీర్పుతో భవిష్యత్తు తెలియని స్థితిలో పడ్డారు. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇలా వెలువడటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. నియామకాల్లో ప్రతిభ చూపి నిజాయితీగా ఉద్యోగాలు సాధించినవారు ఉన్నారు. వారి లిస్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. సుప్రీంకోర్టుకు ఆ లిస్టు ఇచ్చి వారి ఉద్యోగాలను కాపాడాల్సింది’ అందామె. ఈ గొడవ 2016 నుంచి మొదలైంది. వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (డబ్యు.బి.ఎస్.ఎస్.సి.) 2016లో భారీగా పరీక్షలు నిర్వహించి స్కూల్, కాలేజీ స్థాయిలో చేసిన టీచింగ్, నాన్ టీచింగ్ నియామకాలు చేసింది. 25,725 మంది ఉద్యోగులు చేరారు. అయితే ఆనాటి నుంచి గొడవలు మొదలయ్యాయి. దొడ్డిదారిన చాలామంది ఉద్యోగాల్లో చేరారంటూ అర్హులైనవారు రోడ్డెక్కారు. నిరసనలు చేశారు. వారిలో సోమాదాస్ ముందు వరుసలో ఉంది. ‘నా పేరు మెరిట్ లిస్ట్‌లో ఉంది. కాని నాకు ఉద్యోగం ఇవ్వలేదు. నా బదులు ఎవరో దొంగ పద్ధతిలో చేరారు’ అని ఆమె కోల్‌కతా హైకోర్టులో కేసు వేసింది. ఆ కేసు నడుస్తుండగానే విపరీతంగా నిరసన ప్రదర్శనల్లో ముందు వరుసలో కనిపించింది. రోజుల తరబడి నిరాహార దీక్షల్లో కూచోవడం వల్ల ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇంతలో ఆమెకు కేన్సర్ వచ్చింది. అయినా సరే కేన్సర్‌తో పోరాడుతూనే తన కోసం, సాటి వారి కోసం పోరాటం చేసింది. ఇది కోల్‌కతా హైకోర్టు జడ్జి అభిజిత్ గంగోపాధ్యాయ్ దృష్టికి వచ్చి ఆయన ఆమెను కోర్టుకు పిలిపించారు. ‘ఇంకొక ఉద్యోగం ఇవ్వమని ప్రభుత్వానికి చెబుతాను. చేస్తావా?’ అని అడిగారు. ‘టీచర్ కావడం నా జీవిత లక్ష్యం’ అని కరాఖండీగా చెప్పింది సోమాదాస్. దాంతో 2022లో ఆమెకు బెంగాలి భాషను బోధించే టీచరుగా ఉద్యోగం వేయించారు జడ్జి. కాని అదే జడ్జి 2024, ఏప్రిల్ 12న మొత్తం నియామకాలు చెల్లవు అని తీర్పు చెప్పారు. కాని ఒక్క సోమాదాస్ ఉద్యోగం మాత్రం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళితే న్యాయమూర్తులు దేబాంశు, మహమ్మద్ షబ్బార్ కూడా ‘నియామకాలు చెల్లవు. సోమాదాస్ ఉద్యోగం ఉంటుంది’ అని తీర్పు చెప్పారు. కేసు సుప్రీంకోర్టుకు వచ్చాక న్యాయమూర్తులు సంజీవ్‌ఖన్నా, సంజయ్ కుమార్‌లు తీర్పు చెప్తూ ‘ఉద్యోగాలు చెల్లవు. కాని సోమాదాస్ ఉద్యోగం కొనసాగుతుంది’ అన్నారు.ఇంతమంది న్యాయమూర్తులు సోమాదాస్‌కు వెన్నంటి నిలిచి ఆమె ఉద్యోగం కాపాడటం చాలా అరుదు. దానికి కారణం సోమాదాస్ నిరుపేద కుటుంబం నుంచి రావడం, న్యాయం కోసం వెరవక పోరాడటం, ఆమె అర్హతలన్నీ సరిగ్గా ఉండటం, కేన్సర్ వచ్చినా దానిపై పోరాడుతూ ఉద్యోగం కోసం పోరాటాన్ని కొనసాగించడం.దీనిని బట్టి పోరాటం చేసే వారికి... న్యాయం కోసం ఎలుగెత్తే వారికి గౌరవం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఈ పని చేయడానికి చాలామంది వెరుస్తూ ఉంటారు. ‘నా ఉద్యోగం ఉందని సంతోషంగా ఏమీ లేను. ఇన్నాళ్లలో ఎంతోమంది ఈ ఉద్యోగాల వల్ల స్థిరపడ్డారు. ఇప్పుడు వారి ఉద్యోగాలు పోతే కుటుంబాలను ఎలా నడుపుతారు. వారి న్యాయం కోసం ఏదైనా చేయాలి’ అంది సోమా దాస్. నిజమే. దాదాపు ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఆ ఉద్యోగం పోగొట్టుకోవాలంటే దొడ్డిదారిన చేరిన వాళ్ల కంటే నిజమైన అర్హతలతో చేరినవారు కుదేలవుతారు. ‘త్వరలో ఏదో ఒక దారి దొరుకుతుంది. మేం పోరాడతాం’ అంటోంది సోమాదాస్.కొందరు అలా ఉంటారు మరి.
ఫొటోలు


కొప్పున గులాబీలు, నుదుటిపై బొట్టుతో తమన్నా భాటియా (ఫోటోలు)


గోల్డెన్ ఏంజెల్ లా మెరిసిపోతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)


విశాఖపట్నంలో రాత్రి కుండపోత వర్షం (ఫొటోలు)


విశాఖపట్నం : చీర,పంచెకట్టులో మెరిసిన ఏయూ విద్యార్థులు (ఫొటోలు)


ముంబైలోని బాబుల్నాథ్ ఆలయం సందర్శించిన ‘ఒడెలా 2’ మూవీ టీమ్ (ఫొటోలు)


‘జాక్’ మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)


యాక్టింగ్‌తో అదరగొట్టిన గౌతమ్.. ప్రిన్స్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా? (ఫోటోలు)


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (ఫోటోలు)


భద్రాచలంలో ఫ్రెండ్స్ వితికా, భార్గవితో నిహారిక కొణిదెల (ఫోటోలు)


వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన.. లింగమయ్య కుటుంబానికి పరామర్శ (చిత్రాలు)
అంతర్జాతీయం

కుమార్తె పేరు మారింది.. తండ్రి కాస్తా తల్లయ్యాడు
పుర్రెకో బుద్ధి.. జిహ్వకోరుచి అన్నారు పెద్దలు .. అందరిలా రొటీన్ గా తినేసి తొంగుంటే మనల్ని ఎవరు చూస్తారు.. అందుకే ఏదోటి చేద్దాం.. సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అని భావించేవాళ్లు కొందరు ఉంటారు. అందులోభాగంగా కొందరు కోట్లు కోట్లు ఖర్చుపెట్టి జంతువుల్లా మారేవాళ్ళు ఉండగా మరికొందరు.. రకరాలక పచ్చబొట్లు పొడిపించుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నారు. కొందరు రకరకాల డ్రెస్సులు వేసుకుని .. మరికొందరు చిత్రవిచిత్రమైన హెయిర్ స్టైల్స్ వేసుకుని జనాన్ని ఆకర్షిస్తుంటారు. మరికొందరు తమ కార్లను.. ఇళ్లను రకరకాలుగా డిజైన్లు చేయించి అందరిచేతా ఔరా అనిపించుకుంటారు..అలాగే స్వీడన్ బాబాయ్ ఫ్రాన్సిస్కో పెరెజ్ కూడా ఇలాగే చిత్రమైన విధంగా ఫోటోషూట్ చేయించుకున్నారు. స్పెయిన్ కు చెందిన ఫ్రాన్సిస్కో పెరెజ్ వయసు యాభై ఒక్క ఏళ్ళు. ఆయనకు పెళ్ళి ఈడుకొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు మంచి సృజనాత్మక ఆలోచనలు ఉన్న ఫోటోగ్రాఫర్ మార్టిన్ విల్క్స్ అనే మిత్రుడు ఉన్నారు. మార్టిన్ నిత్యం రకరకాల ఫోటో షూట్లు చేస్తుంటారు. పెళ్ళిళ్లు...రిటైర్మెంట్ ఫంక్షన్లు .. పిక్నిక్కులు..ఎంగేజ్మెంట్లు . పుట్టినరోజులు..ఇలా రకరకాల ఈవెంట్లకు ఫోటో షూట్లు చేయడం ఆయనకు వృత్తి..హాబీ కూడా . అందరూ తీసేలా కాకుండా వినూత్నమైన కాన్సెప్టులతో ఫోటోషూట్లు చేస్తూ అందరి కన్నా భిన్నంగా ఫోటోలు తీస్తుంటారు. సరిగ్గా తన మిత్రుడిలోని సృజనాత్మకతకు తన అభిరుచిని జోడించిన ఫ్రాన్సిస్కో కొత్తగా ఒక ఫోటో షూట్ చేసి అందరిచేతా ఔరా అనిపించుకున్నారు.వాస్తవానికి ఫ్రాన్సిస్కో చిన్నకూతురు నోయెలియా అని ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావాల్సి ఉండగా దాన్ని అప్పట్లో ఆయన బీరు మత్తులో ఉండి నటాలియా గా నమోదు చేయించారు. అయితే దాన్ని ఇప్పుడు మార్చాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె పేరును సరిగ్గా మార్చి దానికి సంబంధించి తన బిడ్డ మళ్ళీ పుట్టింది అంటూ సంబరం చేసుకున్నారుదీనికోసం తన మిత్రుడు అయిన ఫోటోగ్రాఫర్ సాయంతో తానే ఓ గర్భిణి అవతారం ఎత్తి పొట్ట మీద పూల డిజైన్లు..నెత్తికి పూల కిరీటం పెట్టుకుని చెట్లు..చేమలు..వాగులు వంకల వెంట గర్భిణి మాదిరి వగలు పోతూ పొట్టను నిమురుకుంటూ సిగ్గులు ఒలకబోసారు. తను తన బిడ్డకు మళ్ళీ జన్మను ఇచ్చానని చెబుతూ ఇలా ఫోటో షూట్ చేశారు... వీటిని చూసినవాళ్ళంతా ఓర్నీ అసాధ్యం పాడుగాను అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మనలో క్రియేటివిటీ ఉండాలి కానీ ఏ సంఘటన.. సన్నివేశాన్ని అయినా ఇలా ఆనందంగా వినూత్నంగా మలుచుకోవచ్చని, అందర్నీ ఆకర్షించొచ్చు అని తెలియజెప్పుతున్నారు.:: సిమ్మాదిరప్పన్న

‘ఇజ్రాయెల్’ను నాశనం చేస్తాం, కిల్ బిల్.. రూ.4 వేల కోట్లు!
జెరూసలేం: ‘ఇజ్రాయెల్’ను సర్వ నాశనం చేయడానికి ఇరాన్ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ భారీగా సొమ్మును అభ్యర్థించింది. ఈ ‘కిల్ బిల్’… 50 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.4,295 కోట్లు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదివారం ఈ సంగతి వెల్లడించారు.ఇరాన్ నుంచి అంత మొత్తాన్ని హమాస్ నేతలు యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ ఆర్థిక సాయంగా కోరినట్టు తెలిపే ఆధారసహిత పత్రాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ చేతికి చిక్కాయి. సిన్వర్, దీఫ్ ఇద్దరూ ఇటీవల మరణించారు. గాజాపై తాజా దాడుల సందర్భంగా తమ సైనికులకు ఆ పత్రాలు దొరికాయని, వాటిని ఇజ్రాయెల్ రక్షణ బలగాల (ఐడీఎఫ్) ‘ఇంటెలిజెన్స్ కేటలాగ్ యూనిట్’కు పంపామని కాట్జ్ తెలిపారు.(ఫొటో రైటప్: మహమ్మద్ దీఫ్, యాహ్యా సిన్వర్, ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమెనీ (ఎడమ నుంచి కుడికి). వారి వెనుక అక్షరాలతో కనిపిస్తున్నది... హమాస్ సంస్థకు ఇరాన్ ఆర్థిక సాయానికి సంబందించిన రహస్య పత్రం)ఆ పత్రాలు 2020 అక్టోబరు- 2021 జూన్ మధ్య కాలానికి చెందినవని, తాజా యుద్ధం నేపథ్యంలో సిన్వర్ వాటిని భూగర్భ సొరంగంలోకి తెచ్చాడని తెలుస్తోంది. ఇరాన్-హమాస్ దోస్తీకి ఆ పత్రాలు సాక్ష్యాధారాలని కాట్జ్ చెప్పారు. ఇరాన్ అందించిన దన్నుతోనే 2023 అక్టోబరు 7న ఇజ్రాయెలీలపై హమాస్ నరమేధానికి పాల్పడిందని చెప్పారు. 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కావాలని యాహ్యా సిన్వర్, మహమ్మద్ దీఫ్ చేసిన విజ్ఞప్తికి ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ‘కుద్స్ ఫోర్స్’ (పాలస్తీనా వ్యవహారాలు) హెడ్ సయీద్ ఇజాదీ ఆమోదం తెలిపారని కాట్జ్ వెల్లడించారు.ఆంక్షలు, ఆర్థిక సమస్యల్లో ఇరాన్ సతమతమవుతున్నప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలతో నెలకొన్న వైరానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఆ మొత్తాన్ని అందించడానికి ఇజాదీ ఒప్పుకున్నారని చెప్పారు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలతోపాటుగా ఇరాక్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థల దుశ్చర్యలకు మూలం ఇరాన్ అని, ‘పాముకు తల’ ఇరాన్ అని ప్రపంచమంతా గ్రహించాలని కాట్జ్ కోరారు.దాడులకు సంబంధించిన కచ్చితమైన సమయం, ‘అక్టోబరు 7 ప్రణాళికల’ గురించి ఇరాన్ నాయకత్వానికి తెలియదని, అయితే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) శిక్షణ, ఆయుధాలు, నిధులు లేకుండా అక్టోబరు 7న హమాస్ ఊచకోతకు పాల్పడేది కాదని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇరాన్ నుంచి రూ.1,300 కోట్ల (154 మిలియన్ డాలర్లు) నిధులు హమాస్ ఉగ్ర సంస్థకు బదిలీ అయినట్టు తెలిపే పత్రాలను ఖాన్ యూనిస్ భూగర్భ సొరంగాల నుంచి ఇజ్రాయెల్ రక్షణ బలగాలు సంపాదించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రదర్శించాయి.::జమ్ముల శ్రీకాంత్

నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

మీకెంత ధైర్యం?
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్లో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గతవారం జరిగిన సంస్థ 50వ వార్షికోత్సవంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారతీయ మూలాలున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, అదే సంస్థ ఉద్యోగిణి వనియా అగ్రవాల్ హఠాత్తుగా వేదిక వద్దకు వచ్చి అక్కడే ఉన్న సంస్థ తాజా, మాజీ సీఈవోలు సత్యా నాదెళ్ల, స్టీవ్ బామర్, బిల్ గేట్స్లనుద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘మీకెంత ధైర్యం?. యుద్ధంలో ఇజ్రాయెల్‌కు సాయపడేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్, ఏఐ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తారా?. పాలస్తీనియన్ల రక్తంతో సంబరాలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడండి. మైక్రోసాఫ్ట్ అందించిన టెక్నాలజీని ఉపయోగించి ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోంది. దీంతో యుద్ధంలో గాజాలో 50,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇకనైనా మీరు ఇజ్రాయెల్‌తో కాంట్రాక్ట్‌ను తెగతెంపులు చేసుకోండి’’అని వనియా బిగ్గరగా అరిచారు. దాంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆమెను వెనక్కి లాక్కెళ్లారు. సంబంధిత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఘటన తర్వాత వాణియా మైక్రోసాఫ్ట్‌లోని ఏఐ విభాగ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అజూర్ క్లౌడ్, కృత్రిమ మేధ టెక్నాలజీలను వాడుకునేందుకు ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ మైక్రోసాఫ్ట్‌తో దాదాపు రూ.1,144 కోట్ల విలువైన కాంట్రాక్ట్ కుదుర్చుకుందని వనియా ఆరోపించారు. వనియాపైనా నెటిజన్ల విమర్శలు సొంత సంస్థపై ఆరోపణలు చేసిన వనియాపై పలువురు నెటిజన్లు విమర్శిస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమెను పాలస్తీనాకు పంపించండి. హమాస్ వాళ్లు ఈమెను బాగా చూసుకుంటారు’, ‘ఈమె నకిలీ హిందువు. ఈమెకు జిహాదీతో పెళ్లిచేయాలి’, ‘ఈమెను అమెరికా నుంచి బహిష్కరించి ఇండియాకు పంపేయాలి’, ‘ఇండియాకు వద్దు. పాలస్తీనాకు పంపాలి’, ‘పాలస్తీనాకు పంపేయండి. హమాస్‌కు మద్దతుగా ఎంచక్కా కొత్త సాఫ్ట్వేర్, ఏఐ వ్యూహాలు సిద్ధంచేస్తుంది’అంటూ వేర్వేరు రకాలుగా విమర్శించారు.
జాతీయం

టీఎంసీలో అంతర్గత విభేదాలు.. ఆగని అమిత్ మాలవీయ వరుస పోస్టులు
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పోరును బీజేపీ రచ్చకెక్కించింది. టీఎంసీ నేతల మధ్య గొడవలకు సంబంధించిన వీడియోలు, వాట్సప్ చాట్లను కమలం పార్టీ బయటపెట్టింది. సీనియర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో ఎంపీ మధ్య గొడవ జరిగిందని.. అదీ ఎన్నికల సంఘం కేంద్రకార్యాలయం వద్దేనంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాలవీయ వాటిని షేర్ చేశారు. ఈ క్రమంలో ఇంకా వరుస వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు.మాలవీయ చేసిన పోస్టుల ప్రకారం.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రతినిధుల బృందం ఒక ప్రజెంటేషన్‌ను సమర్పించడానికి ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లింది. ఆ టైంలో.. ఈసీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు ఒకసారి సమావేశం కావాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. కానీ సదరు ఎంపీ ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. నేరుగా ఈసీ వద్దకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే.. ఇద్దరు ఎంపీల మధ్య గొడవకు దారితీసి పోలీసుల జోక్యం దాకా వెళ్లింది. అమిత్ మాలవీయా షేర్ చేసిన వీడియోలో కల్యాణ్ బెనర్జీ మరో ఎంపీపై ‘‘ఇదంతా పబ్లిక్ ప్లేస్. కాస్త సంయమనం పాటించండి’’ అని ఊగిపోతూ కనిపించినట్లు ఉంది. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రిన్ మధ్యలో వచ్చి‘‘మీడియాలో ప్రసారమవుతుంది. వద్దు..’’ సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. కొసమెరుపు ఏంటంటే.. ఈ వ్యవహారం తర్వాత పార్లమెంట్ సభ్యులు బెనర్జీ, కీర్తి ఆజాద్ చాటింగ్ చేసుకుంటే.. ఏఐటీసీ ఎంపీ 2024 పేరిట ఉన్న గ్రూపులోని ఆ సంభాషణను కూడా మాలవీయ బయటపెట్టారు. ఆ సంభాషణ ధాటి తట్టుకోలేక సదరు మహిళా ఎంపీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయినట్లు ఆ షేరింగ్‌లో ఉంది. Soon after the public spat between two TMC MPs in the precincts of the Election Commission of India on 4th April 2025, the irate MP continued slandering the ‘Versatile International Lady (VIL)’…This is the stuff legends are made of! pic.twitter.com/dsubQrmQUj— Amit Malviya (@amitmalviya) April 8, 2025ఇక ఈ వ్యవహారంపై టీఎంసీ నేత సౌగతారాయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీ అంతర్గత గోప్యతను కాపాడుకోవాలంటూ టీఎంసీ నేతలకు హితవు పలికారు. ఈ క్రమంలో కల్యాణ్ బెనర్జీ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ మహిళా ఎంపీ కన్నీళ్లు పెట్టుకోవడం చూశాను. కల్యాణ్ ప్రవర్తనపై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అని రాయ్ అన్నారు. అయితే అమిత్ మాలవీయా ఇక్కడితోనే ఆగలేదు. సౌగతారాయ్ను తీవ్రంగా విమర్శించిన కళ్యాణ్ బెనర్జీ వీడియోను సైతం షేర్ చేశారు.A defiant Kalyana Banerjee, one of the TMC MP, who had a bitter altercation with someone he described as ‘versatile international lady’… pic.twitter.com/JSieKoVynw— Amit Malviya (@amitmalviya) April 8, 2025 TMC MP Kalyan Banerjee won’t stop at anything. He hits back at his senior colleague Saugata Roy after Roy claimed that Banerjee is damaging TMC’s public image. In a sharp retort, Kalyan calls Roy a man with ‘no character,’ labelling him a ‘chor’ in reference to the Narada case.… pic.twitter.com/5LrNexOLGL— Amit Malviya (@amitmalviya) April 8, 2025 మరోవైపు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గోప్యంగా ఈ విషయాన్ని ఉంచాలని మొదటి నుంచి భావించారట. అయితే ఈలోపే బీజేపీ నేత అమిత్ మాలవీయ పోస్టులతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని బెంగాలీ న్యూస్ ఛానెల్స్ ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి.

గంగాజలం ఎఫెక్ట్.. బీజేపీ నేతపై సస్పెన్షన్ వేటు
రాజస్థాన్‌లో వివాదాస్పద నేత జ్ఞానదేవ్ అహూజాపై ఎట్టకేలకు అక్కడి బీజేపీ విభాగం చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా చర్యల ఉల్లంఘనకుగానూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆలయంలో గంగా జలంతో శుద్ధి చేయడమే ఇందుకు కారణం!!.ఆల్వాల్‌లో శ్రీరామ నవమి సందర్భంగా ఓ ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్టకు కాంగ్రెస్ నేత తికారాం జల్లీ హాజరయ్యారు. అయితే దళిత నేత అడుగుపెట్టి ఆలయం అపవిత్రం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహూజా గంగా జలంతో ఆ ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ పరిణామం దళిత సంఘాలకు ఆగ్రహావేశాలు తెప్పించింది.ఈ చర్య పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొంటూ బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ , అహుజాకు నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ రాథోడ్‌కు వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.జ్ఞానదేవ్ అహూజా.. 2013-18 మధ్య రామ్‌ఘడ్ ఎమ్మెల్యేగా పని చేశారు. వివాదాల్లో నిలవడం ఈయనకు కొత్తేం కాదు. 2016లో.. జేఎన్‌యూలో జాతీ వ్యతిరేక నినాదాల వ్యవహారంపై స్పందిస్తూ జ్ఞానదేవ్ తీవ్రవ్యాఖ్యలే చేశారు. జేఎన్‌యూలో నిత్యం 3 వేల కండోమ్స్, 2 వేల లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. 2017లో గోవుల అక్రమ రవాణా చేస్తున్నాడని పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును మూక దాడిలో చంపడాన్ని కూడా అహూజా సమర్థించారు.
Rahul Gandhi letter to President Over Bengal Teachers Issue
న్యూఢిల్లీ: బెంగాల్లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. దీంతో తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లు ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంపై పోరాటం కొనసాగిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఈలోపు మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ వెళ్లింది.

ఏఐ చేతుల్లో పిల్లల ఎదుగుదల.. ఒడిశాలో శ్రీకారం
భువనేశ్వర్: వయసుకు తగిన విధంగా పిల్లలు ఎదుగుతున్నారా? ఎత్తు, బరువు సరైన విధంగానే అభివృద్ధి చెందుతోందా? వారు పోషకాహార లోపాలను(Nutritional deficiencies) ఎదుర్కొంటున్నారా? మొదలైనవన్నీ తెలుసుకోవడం ఇకపై చాలా సులభం కానున్నాయి. ఇందుకు కృత్రిమ మేథ తోడ్పాటునందించనుంది. పిల్లల సమగ్ర ఎదుగుదలను పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ విధమైన కార్యక్రమాన్ని చేపట్టిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. ‘ఏఐ ఫర్ గ్రోత్ మానిటరింగ్: డెవలప్మెంట్ ఆఫ్ యాన్ ఏఐ టూల్ ఫర్ చైల్డ్ ఆంత్రోపోమెట్రీ’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వం), వధ్వానీ ఏఐ, ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్సీ భువనేశ్వర్, పోషణ్ అభియాన్‌ను సంయుక్తంగా సహకారాన్ని అందిస్తున్నాయి.నూతనంగా రూపొందించబోయే ఈ ఏఐ టూల్(AI tool) సాయంతో అంగన్వాడీ కార్యకర్తలు తమ దగ్గరకు వచ్చే పిల్లల బరువు, ఎత్తు, తల చుట్టుకొలత, ఛాతీ చుట్టుకొలత మొదలైన వాటి పెరుగుదల తగిన విధంగా ఉందో లేదో తెలుసుకోగలుగుతారు. ఈ వినూత్న విధానం ఆంత్రోపోమెట్రిక్ అంచనాల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం, పోషకాహార లోపాన్ని ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), ఐసీఎంఆర్-ఆర్ఎంఆర్సీ భువనేశ్వర్, వధ్వానీ ఏఐ నిపుణులు శిక్షణను అందించనున్నారు. శిక్షణ పొందిన ఇన్వెస్టిగేటర్లు(Investigators) నాలుగు నెలల పాటు రాష్ట్రంలోని బాలాసోర్, కటక్, గంజాం, జాజ్‌పూర్, కియోంఝర్, మయూర్భంజ్ జిల్లాల్లోని చిన్నారుల డేటాను సేకరిస్తారు. ఈ డేటా సేకరణ పైలట్ అంచనాకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని ఒడిశా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శుభా శర్మ ప్రారంభించారు.ఇది కూడా చదవండి: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ లైఫ్ స్టయిల్ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..
ఎన్ఆర్ఐ

సింగపూర్‌లో విశ్వావసు నామ ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 30న ఘనంగా జరిగాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్ర శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి)సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి తదితర ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గాప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి , ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము,కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలను భక్తులు కొనియాడారు.ఉగాది వేడుకల నిర్వహణ, దాతలకు, స్పాన్సర్లతోపాటు, సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS ధన్యవాదాలు తెలిపింది. ఈ వేడుకలలో పాల్గొన్న వై.ఎస్.వి.ఎస్.ఆర్.కృష్ణ (పాస్స్పోర్ట్ అటాచ్, ఇండియన్ హై కమిషన్, సింగపూర్) గారికి అధ్యక్షులు గడప రమేష్ బాబు, కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే మై హోమ్ బిల్డర్స్, సంపంగి రియాలిటీ & ఇన్ఫ్రాస్ట్రక్చర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, గారాంటో అకాడమీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, సౌజన్య డెకార్స్‌కు సొసైటీ కృతజ్ఞతలు తెలిపింది.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ మహాసభలు
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) మొదటి జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియ (Philadelphia) ఎక్స్ పో సెంటర్లో మార్చి 28న మొదటి రోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో మొదటిరోజు వేడుక ఎన్నారైలను ఆకట్టుకుంది. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఘనమైన స్వాగతసత్కారాన్ని నిర్వాహకులు అందించారు.కన్వెన్షన్ కన్వీనర్ సత్య విజ్జు, రవి చిక్కాల స్వాగతోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (andhra pradesh american association) ఫౌండర్ హరి మోటుపల్లి AAA ముఖ్య నాయకులను వేదిక మీదకు ఆహ్వానించి, అభినందించారు. అనంతరం ఫౌండర్ హరి మోటుపల్లి AAA ఏర్పాటు, తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. AAA అధ్యక్షులు బాలాజీ వీర్నాల సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఊహించిన దానికన్నా కన్వెన్షన్ విజయవంతం కావడం పట్ల ప్రెసిడెంట్ ఎలక్ట్ హరిబాబు తూబాటి హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. దాతలు, వాలంటీర్లను ప్రత్యేకంగా అభినందించారు.కన్వెన్షన్‌ను పురస్కరించుకుని AAA నిర్వహించిన పోటీల్లో విజేతలకు హీరో, హీరోయిన్లు బహమతులు ప్రదానం చేశారు. హీరోలు సందీప్ కిషన్, ఆది, సుశాంత్, తరుణ్, విరాజ్.. హీరోయిన్స్ దక్ష, రుహాని శర్మ, అంకిత, కుషిత, ఆనంది ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకులు సందీప్ వంగా, శ్రీనువైట్ల, వీరభద్రం, వెంకీ అట్లూరి మొదటిరోజు వేడుకల్లో మెరిశారు. డైరక్టర్ సందీప్ వంగాను స్టేజిమీదకు పిలిచినప్పుడు హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. టాలీవుడ్ (Tollywood) హీరోయిన్ రుహాని శర్మ, సినీ దర్శకులు వెంకీ అట్లూరి మ్యూజిక్ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. తరుణ్ నటించిన సినిమాల పాటలతో చేసిన ట్రిబ్యూట్ డాన్స్ ఆకట్టుకుంది. తానా, నాట్స్ వంటి ఇతర సంస్థల నాయకులను కూడా వేదికపైకి ఆహ్వానించి సన్మానించారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన నిరవల్ బ్యాండ్ మ్యూజికల్ నైట్ అందరినీ అలరించింది. మహిళలు, పిల్లలు నిరవల్ బ్యాండ్ సింగర్స్ పాటలకు డాన్సులు చేసి ఆనందించారు. ఆంధ్ర వంటకాలతో వడ్డించిన బాంక్వెట్ డిన్నర్ అందరికీ ఎంతో నచ్చింది. బాంక్వెట్ డిన్నర్ నైట్‌కి సుప్రీమ్, ఎలైట్, ప్రీమియం అంటూ 3 రకాల సీటింగ్ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలను నిర్వాహకులు అందుకున్నారు. సెలెబ్రిటీలు, స్టార్స్ అందరికీ అందుబాటులో ఉండేలా ఈ సీటింగ్ ఏర్పాట్లు చేయడం బాగుంది. ఆటపాటలతో ఆనందోత్సాహాలతో మొదటి రోజు కార్యక్రమం ముగిసింది.చదవండి: గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

గల్ఫ్ భరోసా డాక్యుమెంటరీని విడుదల చేసిన సీఎం రేవంత్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గల్ఫ్ కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు గురించి ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'రేవంత్ సర్కార్ - గల్ఫ్ భరోసా' అనే మినీ డాక్యుమెంటరీని శనివారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. చిత్ర బృందం ఇటీవల ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికులు, నాయకుల అభిప్రాయాలను చిత్రీకరించారు. రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఆర్థిక సహాయం పొందిన గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో పొందుపర్చారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత, గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డి, డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాణ సహకారం అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు, కెమెరామెన్ పి.ఎల్.కె. రెడ్డి, ఎడిటర్ వి. కళ్యాణ్ కుమార్, సౌదీ ఎన్నారై మహ్మద్ జబ్బార్‌లు పాల్గొన్నారు. చదవండి: విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

అయోవా నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా అయోవాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ వైద్యులు డాక్టర్ స్మిత కుర్రా, డాక్టర్ ప్రసూన మాధవరం, డాక్టర్ నిధి మదన్, డాక్టర్ విజయ్ గోగినేని వివిధ ఆరోగ్య అంశాలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. భారత ఉపఖండంలో మధుమేహం వ్యాధి, ఆ వ్యాధి ప్రాబల్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.. మధుమేహం నివారించడానికి లేదా తొందరగా రాకుండా ఉండటానికి కొన్ని విలువైన చిట్కాలను తెలుగు వారికి వివరించారు. హృదయ సంబంధ వ్యాధులపై కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ నిధి మదన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గుండె జబ్బు అంశాలపై ప్రేక్షకుల నుండి వచ్చిన అనేక ప్రశ్నలకు విలువైన సమాధానమిచ్చారు. గుండె సమస్యలను నివారించడానికి ఉత్తమ జీవనశైలిని సూచించారు.అయోవా చాప్టర్ బృందంలో భాగమైన పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ గోగినేని నిద్ర, పరిశుభ్రత, స్లీప్ అప్నియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన నిద్ర, స్లీప్ అప్నియా లక్షణాలను గుర్తించడం వల్ల కలిగే ప్రాముఖ్యత, వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను డాక్టర్లు చక్కగా వివరించారు. డాక్టర్ స్మిత కుర్రా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో చొరవ తీసుకున్నారు, ఇతర వైద్యులతో సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమానికి అనుసంధాన కర్తగా వ్యవహరించారు.నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్(ఎలక్ట్) శ్రీహరి మందాడి, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీహరి జమ్ముల ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించినందుకు అయోవా చాప్టర్ కో ఆర్డినేటర్ శివ రామకృష్ణారావు గోపాళం, నాట్స్ అయోవా టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఆహారాన్ని స్పాన్సర్ చేసినందుకు అయోవాలోని సీడర్ రాపిడ్స్‌లో ఉన్న పారడైజ్ ఇండియన్ రెస్టారెంట్ యజమాని కృష్ణ మంగమూరి కి నాట్స్ అయోవా చాప్టర్ సభ్యుడు శ్రీనివాస్ వనవాసం కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ హెల్ప్‌లైన్ అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని.. అత్యవసర పరిస్థితుల్లో నాట్స్ హెల్ప్ లైన్ సేవలు వినియోగించుకోవాలని నాట్స్ అయోవా చాప్టర్ సభ్యులలో ఒకరైన హొన్ను దొడ్డమనే తెలిపారు.జూలై4,5,6 తేదీల్లో అంగరంగవైభవంగా టంపాలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు రావాలని నాట్స్ అయోవా సభ్యులు నవీన్ ఇంటూరి తెలుగువారందరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో,నాట్స్ అయోవా చాప్టర్ సలహాదారు జ్యోతి ఆకురాతి, ఈ సదస్సుకు వచ్చిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

అనారోగ్యంతో రిసెప్షనిస్టు మౌనిక ఆత్మహత్య
చౌటుప్పల్(నల్గొండ): అనారోగ్యంతో బాధపడుతున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన గుండ్ల రామచంద్రయ్య–లక్ష్మమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరు పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె గుండ్ల మౌనిక(25) స్థానిక వలిగొండ రోడ్డు వద్ద ఉన్న అఖిల్ నేత్రాలయంలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. ఇటీవల తనకు ఎర్ర రక్తకణాలు హెచ్చుతగ్గులు అవుతుండడంతో నాలుగు నెలలుగా ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సన్నద్ధమవుతోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న మౌనిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి రామచంద్రయ్య మధ్యాహ్నం ఇంటికి రాగా.. తలుపు పెట్టి ఉండడం, కుమార్తెను పలకకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా.. మౌనిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

ఫుడ్ పాయిజన్‌తో తల్లీకొడుకుల మృతి
రుద్రంగి (వేములవాడ): ఫుడ్ పాయిజన్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతిచెందిన విషాదకర సంఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన కాదాసు పుష్పలత (35), నిహాల్ (6), శుక్రవారం రాత్రి ఇంట్లో రొట్టెలు తిని పడుకున్నారు. అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం కోరుట్ల, కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. చికిత్స పొందుతూ ఆదివారం తల్లి పుష్పలత మృతిచెందగా.. పరిస్థితి విషమించడంతో కొడుకు నిహాల్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిహాల్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలో తల్లీకొడుకులు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదుకాగా పుష్పలత, నిహాల్ మృతిపై అనుమానాలు ఉన్నాయని పుష్పలత అన్న పాలెపు శ్రీనివాస్ రుద్రంగి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫి ర్యాదు చేశాడు. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని.. వాటిని మనసులో పెట్టుకొని పుష్ప లత అత్తగారి కుటుంబ సభ్యులే విషప్రయో గం చేసి ఉంటారని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని పాలెపు శ్రీనివాస్ కోరారు. బాధితుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని రుద్రంగి ఎస్సై అశోక్ తెలిపారు.

యానాం ఎమ్మెల్యే ఫొటోను పెళ్లి ప్రొఫైల్‌లో పెట్టి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): వివాహ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసగించిన ఘరానా మోసగాడు జోగడ వంశీకృష్ణ అలియాస్ చెరుకూరి హర్ష (33)ని కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు, తమ విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలను రాబట్టారు. తన కాలేజ్‌మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫొటోలను పెళ్లి ప్రొఫైల్‌లో తన ఫొటోగా పెట్టి నాలుగు రాష్ట్రాల్లో.. పెళ్లిళ్ల పేరుతో 26 మంది యువతులను అతను మోసం చేసినట్లుగా గుర్తించారు. గత నెలలో నగరానికి చెందిన ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా ఎన్ఆర్ఐగా పరిచయం చేసుకుని దాదాపు రూ.10 లక్షలకుపైగా మోసానికి పాల్పడ్డాడు. తన తల్లి అమెరికా నుంచి రాగానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసాన్ని గ్రహించిన వైద్యురాలు గత నెలలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్షని అరెస్టు చేశారు. నిందితుడిపై హైదరాబాద్, రాచకొండ, విజయవాడ, ఖమ్మం పట్టణాలతో పాటు పలు రాష్ట్రాల్లో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. హర్షను ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అతన్ని తిరిగి కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా హర్షపై మరో ఐదు కేసులు నమోదై ఉన్నట్లు తెలిసింది. పోలీసులకు పట్టుబడకుండా స్నేహితుల పేరు మీద మూడు సిమ్‌కార్డులు తీసుకుని పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో గుర్తించారు. ఎన్ఆర్ఐగా నటించి పెళ్లిళ్ల పేరుతో మోసం చేసి సంపాదించిన డబ్బులతో వంశీకృష్ణ బెట్టింగ్‌లకు పాల్పడటమే కాకుండా విదేశీ టూర్లు కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు.

మియాపూర్‌లో షెల్టర్!
సాక్షి, సిటీబ్యూరో: కర్నాటకలోని బీదర్, నగరంలోని అఫ్జల్‌గంజ్‌లో తుపాకులతో విరుచుకుపడిన ఇద్దరు దుండగులు అమన్ కుమార్, అలోక్ కుమార్ ఈ నేరాలు చేయడానికి ముందు మియాపూర్‌లో బస చేసినట్లు వెలుగులోకి వచి్చంది. అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు ఈ విషయం గుర్తించారు. దీనికి సంబంధించిన రికార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. నగరంలో నేరం చేసిన తర్వాత దేశ సరిహద్దులు దాటి నేపాల్ పారిపోయినట్లు ఈ ద్వయం ప్రస్తుతం నేపాల్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. జనవరి 12న నగరానికి రాక... బీహార్‌లోని వైశాలీ జిల్లా ఫతేపూర్ పుల్వారియాకు చెందిన అమన్ కుమార్, అలోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో నగదు నింపే వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఈ గ్యాంగ్ 2023 సెపె్టంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో సెక్యూరిటీ గార్డు జై సింగ్‌ను హత్య చేసి రూ.40 లక్షలు దోచుకుపోయింది. నేపాల్ పారిపోయిన ఈ గ్యాంగ్ యూపీ పోలీసుల హడావుడి తగ్గిన తర్వాత బీహార్ చేరుకుంది. అక్కడ నుంచి తమ స్వస్థలానికి వెళ్లి... ఈ ఏడాది జనవరిలో నగరానికి వచ్చింది. బీదర్‌ను టార్గెట్‌గా చేసుకున్న అమన్, అలోక్ ఆ నెల 12న మియాపూర్‌లోని శ్రీ సాయి గ్రాండ్ ఇన్ హోటల్లో బస చేసింది. అక్కడ నుంచి బీదర్‌కు రాకపోకలు సాగించడం తేలికనే ఉద్దేశంతోనే అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అమిత్ కుమార్, మహేష్ కుమార్ పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసిన దుండగులు వాటి ఆధారంగానే రూమ్ తీసుకున్నారు. మూడు రోజుల పాటు రెక్కీ... బీదర్‌లో ఎస్బీఐ ఏటీఎం మిషన్లలో నగదు నింపే సీఎంఎస్ సంస్థ వ్యాన్‌ను దోచుకోవడానికి ముందు మూడు రోజుల పాటు పక్కాగా రెక్కీ చేసింది. తమ వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై జనవరి 13, 14, 15 తేదీల్లో అక్కడకు వెళ్లి వస్తూ ఈ పని పూర్తి చేసింది. చివరకు ఆ నెల 16న నేరం చేయడానికి బీదర్ వెళ్లిన ఈ ద్వయం సీఎంఎస్ సంస్థ ఉద్యోగుల్లో గిరి వెంకటే‹Ùను చంపి, శివకుమార్‌ను గాయపరిచి రూ.83 లక్షలు దోచుకుంది. అక్కడ నుంచి డబ్బు నింపిన బ్యాగ్‌లు తీసుకుని నేరుగా తాము బస చేసిన హోటల్‌కే వచ్చారు. రూమ్ ఖాళీ చేయడంతో పాటు తమ వస్తువుల్నీ తీసుకుని ద్విచక్ర వాహనంపై బయలుదేరి మియాపూర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చారు. నేరం చేయడానికి వాడిన ద్విచక్ర వాహనాన్ని ఎంజీబీఎస్ పార్కింగ్‌లో ఉంచారు. అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి ప్రైవేట్ బస్సులో రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో టిక్కెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్‌లో ఉండటంతో పటిష్ట నిఘా... ఈ ట్రావెల్స్ వద్ద జరిగిన పరిణామాలతో మేనేజర్ జహంగీర్‌ను కాలి్చన ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయారు. అఫ్జల్‌గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వీళ్లు... అక్కడ నుంచి గజ్వేల్ వెళ్లడానికి మరో ఆటో మాట్లాడుకున్నారు. అనివార్య కారణాలతో తిరుమలగిరిలో దిగేసి... ఇంకో ఆటోలో మియాపూర్ వెళ్లారు. ఆపై తిరుపతి వెళ్లే ఏపీఎస్‌ఆరీ్టసీ ఎక్కి కడపలో దిగిపోయారు. మరో బస్సులో నెల్లూరు, అట్నుంచి చెన్నై వెళ్లారు. చెన్నై నుంచి రైలులో కోల్‌కతా చేరుకున్న ఈ ద్వయం పశి్చమ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతం నుంచి నేపాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మీర్జాపూర్ నేరం తర్వాత ఇలా వెళ్లిన ఈ ద్వయం కొన్నాళ్లకు తమ స్వస్థలాలకు తిరిగి వచి్చంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిటీ పోలీసులు వారి కదలికలపై పటిష్ట నిఘా ఉంచారు.
వీడియోలు


విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా


డొమినికల్ రిపబ్లిక్ సంతో డొమింగోలో ఘోర ప్రమాదం


రైతుల భూముల్లో నారా ప్యాలెస్


వావ్.. తగ్గిన బంగారం ధరలు


బంగారం తగ్గిందోచ్! ఇప్పుడు కొంటేనే బెటర్..!


అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబు ఇంద్రభవనం


చెన్నైపై పంజాబ్ ఘన విజయం


అగ్నిప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన ఘటనపై YS జగన్ దిగ్భ్రాంతి


జగన్ కు తప్పిన భారీ ప్రమాదం! సర్కారు వారికి హెచ్చరిక..


ఏపీ పోలీసులకు వైఎస్ జగన్ వార్నింగ్..