
సోషల్ మీడియా ఎక్కడెక్కడో వంటింట్లోనే మగ్గిపోయే వనిత లెందరినో బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఎందిరినో స్టార్‌లుగా మార్చింది. టెక్నాలజీ అంటే ఏంటో తెలియని బామ్మలను ఓవర్‌నైట్ స్టార్‌లుగా మార్చింది. అలానే ఇక్కడొక బామ్మ కూడా యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. తన పాకకళతో ఎందరో ఫాలోవర్లును దక్కించుకుని డిజటల్ క్విన్‌గా మారింది ఈ 74 ఏళ్ల బామ్మ.
ఆ బామ్మను అంతా ఆప్లీ ఆజీగా పిలిచే సుమన్ ధమానే. ఆమె యూట్యూబ్ ఛానెల్‌కి ఏకంగా 1.79 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. అంచనాలకందని విధంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతిపెద్ద విషయం అనుకుంటే..ఎవ్వరూ ఊహించని రీతిలో సంపాదన ఆర్థిచడం మరింత విశేషం. ఆమె మనవు యష్ సాయంతో ఈ డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టారామె.
తన పాకకళతో యూట్యూబ్ ఛానెల్‌లో మహారాష్ట్ర వంటకాల రుచులను పరిచయం చేసింది ఈ బామ్మ. ఎప్పటికప్పుడూ కొత్తదనంతో..కాలానుగుణ రుచులతో ఆరోగ్యకరమైన వంటకాల వీడియోలతో అలరించింది. ఇంట్లో ఉండే సుగంధద్రవ్యాలతో ఆరోగ్యకరంగా వంటకాలు తయారు చేయడం ఎలా అనే వీడియోలతో..ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చే ఆహారప్రియులను బాగా ఆకర్షించింది. అదే ఆమెకు మంచి స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది.
ఆకర్షణీయమైన పావ్ భాజీ, కరేలే కి సబ్జీ, మహారాష్ట్ర స్వీట్ల వరకు ప్రతిదీ నోరూరించేలా ఆరోగ్యకరంగా చేసుకోవడం ఎలాగో పరిచయం చేసింది. ఈ యూట్యూబ్ స్టార్‌డమ్ జర్నీలో ఆమె కెమెరా ముందు నిలబడి మాట్లాడటంలో మొదట్లో తడబాటు, సిగ్గుపడటం వంటి సమస్యలను ఎదుర్కొంది. అలాగే సాంకేతిక లోపాలు, ఛానెల్ హ్యాక్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంది.
అయినప్పటికీ..తన జర్నీని విరమించలేదు. తాజా కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. అలా యూట్యూబ్ సిల్వర్ బటన్‌ను కూడా దక్కించుకుంది. ఈ బామ్మ కథ విజయానికి వయసు అడ్డంకి కాదని చూపించడమే గాక కుటుంబ మద్దతుతో దేన్నేనా సాధించగలమని నిరూపించింది. ఈ బామ్మ తన యూట్యూబ్ ఛానెల్‌తో నెలకు రూ. 5 నుంచి రూ. 6 లక్షల పైనే సంపాదిస్తుందట.
(చదవండి: మాతృత్వం మధురిమను కాపాడుకుందాం..! కాబోయే తల్లుల ఆరోగ్యం కోసం..)