
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్‌లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్‌నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.
ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు

చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
ఈ లుక్‌కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్‌లెట్‌గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్‌లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు.
