
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.
మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్‌లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారామె.
ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్‌తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్‌లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి.
వాటిని అటు ఇటు ఒక్క జంప్‌తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్‌పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: రెడ్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..)