అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు | untimely rains Precautions to prevent damage in horticultural crops | Sakshi
Sakshi News home page

అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు

Published Tue, Mar 25 2025 10:44 AM | Last Updated on Tue, Mar 25 2025 10:44 AM

untimely rains Precautions to prevent damage  in horticultural crops

అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ ధరావత్‌ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. 

మామిడి

  • వీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.

  • గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ ఒక లీటర్‌ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్‌ లాగ చేసి పూయాలి.

  • రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. 

  • మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ఒక లీటర్‌ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్‌ సల్ఫేట్‌ 0.5 గ్రా. ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

  • పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్‌ నీటికి కెఎన్‌03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

  • కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్‌ నీటికి బోరాన్‌ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

  • కాపర్‌ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్‌ సల్ఫేట్, కెఎన్‌03, బొరాన్‌.. ఈ నాలుగింటిని ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.

  • ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.

  • నివారణకు మిథైల్‌ యూజీనాల్‌ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.

  • చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.

    చదవండి: నాలుగు వారాల కొరియన్‌ డైట్‌ ప్లాన్‌ : 6 రోజుల్లో 4 కిలోలు

టమాట

  • కాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్‌ ఒక లీటర్‌ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

  • పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి  పోలానోఫిక్స్‌ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

  • సూక్ష్మ  పోషక మిశ్రమాన్ని ఒకలీటర్‌ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.

పసుపు

వర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న  ప్లాస్టిక్‌ షీట్స్‌ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. 

చదవండి: ట్రెండింగ్‌ కర్రీ బిజినెస్‌ : సండే స్పెషల్స్‌, టేస్టీ ఫుడ్‌

రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253
కూరగాయలు : డా. డి. అనిత –94401 62396
పూలు : డా. జి. జ్యోతి – 7993613179
ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:
శ్రీమతి కృష్ణవేణి – 9110726430
పసుపు : శ్రీ మహేందర్‌ : 94415 32072
మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement