sagubadi
-
అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది. పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 275కు పైగా రకాలుఅగవె సక్యులెంట్ ప్లాంట్. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.దైవమిచ్చిన పంట! మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్టెక్ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్‌స్కేపింగ్‌లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.వంద కోట్ల అగవె ప్రాజెక్టుఅగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్ సంకల్పం తీసుకుంది. ద బిలియన్ అగవె ప్రాజెక్ట్‌లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.సరికొత్త తోటల నమూనా అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్ ఇంటర్నేషనల్ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి. అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్ కట్టర్ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడిమన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ‘అగవె’నే ఎందుకు?భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది. పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్) -
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఇంతకుముందే ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఈ యూనిట్లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్‌ను సోలార్ ట్రైసైకిల్లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్ఆర్ ఆశిస్తోంది. చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్‌ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్‌లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్కి 48వి, 750 వాట్స్ డిసి గేర్డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605. -
విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!
దైనందిన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అయితే, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు, చిల్లర వర్తకులు ఆకుకూరలను రెండో రోజు వరకు నిల్వ ఉంచడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు ఈ సమస్యకో పరిష్కారం కనుగొన్నారు. దాని పేరే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్. సాధారణంగా 24 గంటల్లోనే ఆకుకూరలు వాడి పోయి పాడైపోతుంటాయి. అయితే, అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పెడితే 36 గంటలపాటు తాజాగా ఉంటాయి. ఈ బాక్స్‌ను గది ఉష్ణోగ్రత(26–28 డిగ్రీల సెల్షియస్, 52% గాలిలో తేమ)లో ఉంచి, అందులో ఆకు కూరలు పెట్టి మూత వేస్తే చాలు. విద్యుత్తు అవసరం లేదు. రిఫ్రిజరేషన్ చేయనవసరం లేకుండానే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో ఉంచితే చాలు.. ఆకుకూరలు 36 గంటలు తాజాగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే రిటైల్ షాపులకు, సూపర్ మార్కెట్లకు, తోపుడు బండ్లు/ ఆటోలపై కూరగాయలు అమ్మే వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పరిశుభ్రమైన స్థితిలో ఆకుకూరలను తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచుకోవ్చు. ఇతర వివరాలకు... 77608 83948చదవండి: పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్! -
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు..!
గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలోఅక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు35నుండి 40డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు18 నుండి 24డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.వచ్చే ఐదు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు:హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు (సోమవారం మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ఆధారంగా) అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 26 (బుధవారం) నుండి 30వ(ఆదివారం) వరకు రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కోసం పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర పంటలను వేసుకోవచ్చు.నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వరికి ఆరుతడులు ఇవ్వాలి.చీడపీడలు, తెగుళ్ళ ఉధృతి అధికంగా కాకుండా చూడటానికి సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి. వడగళ్ళ వాన, అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు: నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించడానికి నేల బాగా తడిచే విధంగా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ళలో పోయాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోవటానికి 2% యూరియా లేదా 1% ΄÷టాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి.వర్షాలతో శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటల్లో నష్టం ఎక్కువగా ఉంటే తిరిగి మొక్కలను నాటుకోవాలి.పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉనట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా అమ్ముకోవాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. కావున తెగుళ్ళ ఉధృతి గమనించినట్లయితే 1 మి.లీ. ్ర΄ోపికోనజోల్ లేదా 0.4 గ్రా. టేబుకొనజోల్ + ట్రైఫ్లాక్సిస్త్రోబిన్ లేదా 2.5 గ్రా. ట్రైసైక్లాజోల్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్‌కు తరలించాలి. పగిలి ΄ోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది.మామిడిలో కాయమచ్చ తెగులు కనిపిస్తే 1 గ్రా. కార్బండజిమ్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి (కంకివెన్ను 10 శాతం కన్న తక్కువ ఉన్నప్పుడు మందుల పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10 శాతం కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేస్తే దిగుబడి తగ్గుతుంది).వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు, ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్: 1.5గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకడానికి అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లాజోల్ 0.5 గ్రా. లేదా ఐసో ప్రోథైయోలిన్ 0.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిలో కాండం తొలిచే పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిపోరల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలి్ర΄ోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణంలో వరికి జింక్ ధాతువు లోపం రావటానికి అనుకూలం. నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.మొక్కజొన్నప్రస్తుత వాతావరణ పరిస్థితులు (భూమిలో ఎక్కువ తేమ) మొక్కజొన్నలో బాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 4 కి.గ్రా. బ్లీచింగ్ పొడి (35 % క్లోరిన్ కలిగిన) మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పోయాలి.పూత అనంతరం ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.మేడిస్ అకుమాడు తెగులు ఆశంచడానికి అనుకూలం. నివారణకు, 2.5గ్రా. మ్యంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కత్తెర పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలి్ర΄ోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి.వంగప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ, కాయతొలిచే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు ఎకరానికి 10–15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను తుంచి 10,000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిపోరల్ పిచికారీ చేయాలి.మిరపప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో జెమిని వైరస్ (ఆకుముడత) తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు.. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం లో కలుపు మొక్కలను నివారించాలి. n పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8–10 చొప్పున అమర్చాలి.నివారణకు 1.5 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ లేదా 1.0 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ.ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.నల్ల తామర పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 2 మి.లీ. సైంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.టమాటప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో పొగాకు లద్దె పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 1మి.లీ. నోవల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ∙ఫ్యుజేరియం ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల చుట్టూ ΄ోయాలి.తీగజాతి కూరగాయలుప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించడానికి అనుకూలం. నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లేదా 2 మి.లీ ప్రోఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడితరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటల్లో కాయ అభివృద్ధి దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్దతులు: తోటలను శుభ్రంగా ఉంచాలి పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి. 10,000 పి.పి. యం వేప నూనెను పిచికారీ చేయాలి. పండుఈగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200 మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి. ఎకరాకి 40 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి.– డా. పి. లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి, వాతావరణ ఆధారిత వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఎఆర్ఎస్, పిజెటిఎయు, రాజేంద్రనగర్. (చదవండి: 'క్లైమేట్ ఎమర్జెన్సీ': ఇలాంటప్పుడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!) -
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్‌ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్‌ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
Avocado: పోషకాల పండు.. లాభాలు మెండు
విదేశీ పంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా ఆలవాలంగా మారింది. ఇప్పటికే ఏజెన్సీ పాంతంలో స్ట్రాబెర్రీ, లిచీ, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలు మంచి ఫలితాలను ఇస్తుండగా తాజాగా ఈ కోవలోకి అవకాడో వచ్చి చేరింది. కాఫీ చెట్లకు నీడ కోసం పెంచుతున్న ఈ చెట్లు పోషక విలువలతో ఉన్న పళ్లను కూడా ఇస్తున్నాయి. గిరిజన ప్రాంతానికి మేలైన, అనువైన రకాలను గుర్తించడానికి చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయోగాలు చేస్తుంటారు. ఏజెన్సీలో లాభదాయకమైన పంటలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గతంలో యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, లిచీ వంటి మొక్కలను ప్రభుత్వం సరాఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గిరిజన రైతులు వాటిని పండించి మంచి ఫలితాలను పొందుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అవకాడో వచ్చి చేరింది. నిజానికి రెండు దశాబ్దాల క్రితమే కేంద్ర కాఫీ బోర్డు అధికారులు కాఫీ మొక్కలకు నీడ కోసమని అవకాడో మొక్కలను మండలంలో గొందిపాకలు పంచాయతీలోని పలు గ్రామాల్లో పంపిణీ చేశారు. ఈ మొక్కలపై రైతులకు అవగాహన లేకపోయినా కాఫీ చెట్లకు నీడనిస్తాయనే ఉద్దేశంతో పెంపకం సాగించారు. ఈ మొక్కలు పెరిగి క్రమేపీ పండ్ల దశకు చేరుకున్నాయి. అయితే ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో విలువ తెలియక వాటిని రైతులు వృథాగా వదిలేశారు. కొన్నేళ్ల క్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామానికి వచ్చి ఈ అవకాడో పండ్లను చూసి దాని విశిష్టత, ఆ పండ్లకు మార్కెట్లో ఉన్న విలువను రైతులకు వివరించారు. దాంతో రైతులు నాటి నుంచి మార్కెట్లో ఈ అవకాడో పండ్ల అమ్మకాన్ని ప్రారంభించారు. దాంతో వ్యాపారస్తులు సైతం గ్రామాలకు వచ్చి రైతుల నుంచి ఈ పండ్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలో ఆరు దేశ, విదేశీ రకాలను దిగు మతి చేసుకొని ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టారు. ప్రత్యేక శ్రద్ధతో గిరి రైతుల సాగు చింతపల్లి మండలంలో గొందిపాకలు, చిక్కుడుబట్టి, చినబరడý, పెదబరడ మొదలైన గ్రామాల్లో రైతులకు ఐటీడీఏ గతంలో వివిధ రకాల పండ్ల మొక్కలతోపాటు అవకాడో మొక్కలను పంపిణీ చేసింది. రైతులు ఈ మొక్కలను తమ పొలాల్లో వేసి పెంచుతున్నారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవై దిగుబడులను ఇస్తున్నాయి. ఈ అవకాడో పండ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఔషధ గుణాలు, పోషకాలు అధికం అవకాడో పండు ఇతర పండ్ల మాదిరిగా కాకుండా అత్యధిక పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు, పోషకాల నిపుణులు గుర్తించారు. ప్రధానంగా ఈ పండు క్యాన్సర్ కారకాలను నిరోధించడంతోపాటు కంటి చూపు, మధుమేహం, స్థూలకాయం తగ్గుదలకు, సంతానోత్పత్తికి, జీవక్రియ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. చింతపల్లిలో కొత్త రకాలపై పరిశోధనలు అవకాడో పండ్లకు దేశీయంగానే కాకుండా విదేశాల్లోను మంచి గిరాకీ ఉంది. దీనిని గుర్తించి చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానంలో గత ఏడాది టìకేడి–1, హోస్ మొక్కల సాగు చేపట్టగా ఈ ఏడాది కొత్తగా పింకిర్టన్, ప్యూర్డ్, రీడ్ వంటి కొత్త రకాలను ఇక్కడికి తీసుకువచ్చి పరిశోధనలు జరుపుతున్నాం. గిరిజన రైతాంగం పండించి ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న అవకాడోకు శాస్త్రీయ నామం లేదు. దాంతో పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంలేదు. ప్రస్తుతం మా క్షేత్రంలో గత ఏడాది మూడు వెరైటీలు, ఈ ఏడాది 3 రకాలపై పరిశోధనలు జరుపుతున్నాం. ఈ కొత్త రకాలను శాస్త్రీయ నామంతో మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చు. దీంతో మంచి ధర వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ, మిరియాలు పంటల వలే ఈ అవకాడో పంటను విస్తరించడానికి మేలైన రకాల కోసం ప్రయోగాలు చేపడుతున్నాం. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త,ఉద్యాన పరిశోధన స్థానం, చింతపల్లి (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
స్ప్రే డ్రైడ్ అవొకాడో పౌడర్..!
అవొకాడో పండులో పౌష్టిక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా మెండుగా ఉన్నాయి. ఇది సీజనల్ ఫ్రూట్. కొద్ది నెలలే అందుబాటులో ఉంటుంది. ఏడాది పొడవునా అందుబాటులో ఉండదు కాబట్టి, పొడిగా మార్చి పెట్టుకుంటే.. ఏడాదంతా వాడుకోవచ్చు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రీసెర్చ్ పండ్ల పరిశోధనా విభాగం అధిపతి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. జి. కరుణాకరన్, తదితర శాస్త్రవేత్తలు అవొకాడోపై విస్తృత పరిశోధన చేస్తున్నారు. ఐఐహెచ్ఆర్ అవొకాడో పండును ప్రీసెసింగ్ చేసి స్ప్రే డ్రయ్యింగ్ పద్ధతిలో పొడిగా మార్చే సాంకేతికతను రూపివదించింది. అత్యంత నాణ్యమైన అవొకాడో పొడిని ఉత్పత్తి చేయటం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుంది. గది సాధారణ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తే ఈ పొడి మూడు నెలల పాటు నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. అవొకాడో పండును ఏడాది పొడవునా నిల్వ చేయటం కష్టం. అయితే, ఈ పొడిని నిల్వ చేయటం, రవాణా చేయటం సులభం. ఈ ఉత్పత్తికి మన దేశంలో, విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. రూపాయి పెట్టుబడి పెడితే 1.78 రూపాయల ఆదాయాన్ని పొందటానికి స్ప్రే డ్రయ్యింగ్ సాంకేతికత ఉపయోగపడుతుందని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఆసక్తి గల ఆహార పరిశ్రమదారులు ఐఐహెచ్‌ఆర్‌కు నిర్దేశిత ఫీజు చెల్లించి ఈ సాంకేతికతను పొంది అవొకాడో పొడిని తయారు చేసి అనేక ఉత్పత్తుల్లో వాడుకోవచ్చు లేదా దేశ విదేశాల్లో విక్రయించుకోవచ్చు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడండి. (చదవండి: ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!) -
ఆహారమే ఆరోగ్యం! ఇంటి పంటలే సోపానం!!
ఇంటిని పచ్చని పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని ఆహారమే ఆరోగ్యం అనే సూత్రాన్ని నమ్మి.. ఇంటినే ఆరోగ్యదాయక పంటలు, మొక్కలతో నందన వనంగా మార్చారు మచిలీపట్నానికి చెందిన ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని. ఆమే ఎండీ ముంతాజ్‌బేగం.కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హైనీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా 2019లో ముంతాజ్‌బేగం ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల సాగు ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదం చేస్తుందని ఆమె ఆచరణాత్మకంగా చాటి చెబుతున్నారు. తాను మొదట ఆచరించి, తర్వాత ఇతరులకు చెప్పాలన్నా వ్యక్తిత్వం ఆమెది. ఇంటి నుంచి వచ్చే చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మొక్కలకు వేసి పెంచుతూ అధిక ఫలసాయాన్ని పొందుతున్నారు. మునగాకు, బెల్లం కలిపి నీళ్లలో నానబెట్టి మొక్కలకు పోయటం.. పొగాకును నీళ్లలో వేసి రెండు, మూడు రోజులు నానబెట్టి మొక్కల వేర్లకు వేస్తే మట్టి ద్వారా వచ్చే తెగుళ్లు నివారించవచ్చని ఆమె తెలిపారు. పెసలు, మినుము, ఉలవలు, బార్లీ, నువ్వులు నానబెట్టి గ్రైండ్ చేసి నీళ్లలో కలిపి మొక్క వేళలో వేస్తే, మంచి దిగుబడి వస్తుందని ఆమె చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నారు. ఆరోగ్యదాయకంగా పెంచుకున్న కూరగాయలు, పండ్లు తింటే ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చని ఆమె ఘంటాపధంగా చెబుతున్నారు. సేంద్రియ ఇంటిపంటలు ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.మానసిక, శారీరక ఆరోగ్యంముంతాజ్ ఇంటి ఆవరణలో, మిద్దెపై ఎన్నో రకాల కూరగాయలు, పండ్ల మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మొక్కలను సంరక్షిస్తే మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని ఆమె చెబుతున్నారు. మామిడి, జామ, అరటి, డ్రాగన్, చెర్రీ, వాటర్ యాపిల్, నేరేడు, అంజూర, ఫ్యాషనఫ్రూట్, పీ నట్ బటర్, బొప్పాయి పండ్ల మొక్కలతో పాటు ΄పాలకూర, చుక్కకూర, ఆకుకూరల మొక్కలతోపాటు వంగ, టమాట, అలసంద, మునగ, అరటి, మల్బరీ ఆకులతోపాటు వంద రకాల క్రోటస్ను ఆమె తమ ఇంటి ఆవరణలో, మేడపైన పెంచుతున్నారు. మొక్కలే ప్రాణం.. ఇంటిపంటల ధ్యానం!మొక్కలే ప్రాణంగా ప్రతి రోజు నా దినచర్య ఉంటుంది. రోజు మూడు, మూడున్నర గంటలు వీటి సంరక్షణ కోసం వెచ్చిస్తుంటాను. మొక్కలను సంరక్షిస్తే సమాజం ఆరోగ్యం బాగుంటుందని, భవిష్యత్తు మన చేతిలోనే ఉందనేది అందరికీ తెలియజేయాలనేదే నా తపన. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల తొక్కలు, ఇతర సేంద్రియ చెత్తను మునిసి΄ాలిటీ వారికి ఇవ్వకుండా, ఇంటిపట్టునే కం΄ోస్టు ఎరువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. నర్సరీ నుంచే పిల్లలకు మొక్కలను పెంచటంపై అవగాహన కల్పిస్తే మంచి భవిష్యత్తు సమాజాన్ని సృష్టించుకోవచ్చు. – ఎండీ ముంతాజ్ బేగం, ఇంటి పంటల సాగుదారు, విశ్రాంత ప్రధానోపాధ్యాయిని, మచిలీపట్నం – అంబటి శేషుబాబు, సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం). (చదవండి: ఎదురు లేని వెదురు) -
‘మన పంటలు – మన వంటలు’ మూడు రోజుల సదస్సు
మారుతున్న వాతావరణం నేపథ్యంలో ‘మన పంటలు – మన వంటలు’ అనే శీర్షికతో అనంతపురంలోని పోలిస్ కళ్యాణ మండపంలో ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు ఎగ్జిబిషన్, సదస్సులు నిర్వహించనున్నట్లు అనంత సుస్థిర వ్యవసాయ వేదిక కన్వీనర్ డా. వై.వి. మల్లారెడ్డి తెలిపారు. ఆహారమే ఆరోగ్యం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు.. వర్షాధార ప్రకృతి వ్యవసాయంలో పంటలు, వంటల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు మూడు రోజులూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 23 (ఆదివారం) న ఉ.10.30 గం.కు డా. ఖాదర్ వలి ప్రసంగం ఉంటుందన్నారు. 20 స్వచ్ఛంద సంస్థలు కలసి వరుసగా రెండో ఏడాది ఈ సదస్సులు నిర్వహిస్తుండటం విశేషం. 22,23 తేదీల్లోబయోచార్పై శిక్షణ వ్యవసాయ వ్యర్థాలతో బయోచార్ (బొగ్గు పొడి)ని తయారు చేసి పొలంలో తగిన మోతాదులో చల్లితే భూసారం పెరుగుతుంది. ఈ విషయమై రైతులకు లోతైన అవగాహన కల్పించటం కోసం ఘట్కేసర్ సమీపంలోని పిట్టల ఆర్గానిక్ ఫామ్ (ఎన్ఎఫ్సి నగర్ – అంకుష్పుర్ మధ్య)లో జరగనుంది. ప్రసిద్ధ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్ రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు పిట్టల శ్రీశైలం తెలిపారు రు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇతర వివరాలకు.. 70137 84740 నెంబర్‌ను సంప్రదించవచ్చు. చదవండి: డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. అవొకాడో పండ్ల తోటలు సాగు ఎలా చెయ్యాలి? -
Avocado డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. సాగు ఎలా చెయ్యాలి?
మన దేశంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. కరుణాకరన్ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్లో డిమాండ్ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్ మాటల్లోనే చదవండి.అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లు, డిసర్ట్ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్ పడిపోయే ముప్పు ఉంటుంది. ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.‘హాస్’ రకం మొక్కలు వద్దుబెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్ హాస్, పింకర్టన్ రకాలు మేలైనవి. చాలా మంది హాస్ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్ కాదు. నెర్రెలిచ్చే భూముల్లో వద్దుఅవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్ శాండీ సాయిల్) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఏటా రెండు సీజన్లుఅవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్–జూలై, అక్టోబర్– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్ కంటెంట్ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా ప్రాసెసింగ్‌కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం. మరికొన్ని మెళకువలుసముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్ ఇండియన్ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను ప్రాసెస్ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్ ద్వారా పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి అవొకాడో 2 – నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్ శాండీ సాయిల్)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్) దీనికి సరిపడదు. ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్ బెడ్) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్‌తో అంతర సేద్యం చేసినా బెడ్ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.థాంక్స్ టు ‘టొక్సోడాన్’!అవొకాడో.. అమెజాన్, మెక్సికన్ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్కి థాంక్స్ చెప్పాలి అన్నారు ఐఐహెచ్ఆర్ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్! అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్ ఆఫ్ ఫ్రూట్స్’ అయ్యింది! -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఇంటర్ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్కె–4 పసుపు!
చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్ది. పన్నెండో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్కె–4’. ఈ వంగడం సచిన్‌కు ఉత్తమ ప్లాంట్ బ్రీడర్‌గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!సచిన్ కమలాకర్ కరేకర్ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్ సెలక్షన్ మెథడ్ అంటారు.1998 నుంచి కొత్త వంగడంపై కృషిసచిన్ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను. పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్కె–4 అని పేరు పెట్టాను.’కుక్కుమిన్ 4%పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్ బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డిబిఎస్కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్‌కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసింది.ఎస్కె–4 పేరు ఎందుకొచ్చింది?తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్ కొంకణ్‌ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్‌దుర్గ్, రాయ్‌గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్ తాలూకా వేలాంబ్ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలుడాక్టర్ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్‌లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్‌లో ఆ మొక్కల్ని పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్ అంటున్నారు. విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్ కమలాకర్ కారేకర్, ఎస్కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఎన్ఐఎఫ్ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) 2024 డిసెంబర్లో సచిన్ అభివృద్ధి చేసిన ఎస్కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్ కమలాకర్ కరేకర్ను ప్లాంట్ బ్రీడర్’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్‌కు దఖలుపడింది. నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్ -
మండే ఎండల్లోనూ ఆరుబయటే పుట్టగొడుగుల పెంపకం!
పుట్టగొడుగులను పెంచడానికి సాధారణంగా పక్కా భవనంలో లేదా సెమీ పర్మినెంట్ షెడ్లను వినియోగిస్తూ ఉంటారు. అయితే, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ (ఐఐహెచ్ఆర్) ఆరుబయటే ఉంచి సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను పెంచే ఒక ప్రత్యేక పెట్టె వంటి యూనిట్‌ను రూపొందించింది. ఏప్రిల్, మే నెలల్లో మండే ఎండల్లో కూడా ఈ యూనిట్ ద్వారా రూపాయి కరెంటు ఖర్చు లేకుండా పుట్టగొడుగులు పెంచుకోవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎవాపరేటివ్ కూలింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా ఈ ‘అర్క మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్’ పనిచేస్తుండటంమే ఇందుకు కారణం. తక్కువ పెట్టుబడి, సులభ నిర్వహణ దీని ప్రత్యేకత ఆకర్షణలు. పుట్టగొడుగులు పెంచే ఈ ఛాంబర్ సైజు: 1.35 “ 0.93 “ 1.69 మీటర్లు. అంటే.. దీన్ని పెట్టుకోవటానికి రెండు చదరపు మీటర్ల స్థలం ఉంటే చాలు. 1’’ సిపివిసి పైపులు, ఫిట్టింగ్‌లతో దీన్ని తయారు చేశారు. సాధారణ గదుల్లో పుట్టగొడుగులు పెంపకంతో ΄ోల్చితే దీనిలో 51–108% వరకు దిగుబడి పెరిగింది. ఈ యూనిట్ ద్వారా నెలకు 25–28 కిలోల ఎల్మ్ అయిస్టర్, వైట్ మష్రూమ్స్ రకాల పుట్టగొడుగుల్ని పెంచవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది.ఈ యూనిట్లో సులభంగా మిద్దె పైన, ఇంటి పెరట్లో కూడా ఎంచక్కా పుట్టగొడుగులు పెంచి, వాటిని పచ్చివి, ఎండువి విక్రయించవచ్చు. వాటితో తయారు చేసిన పోషక విలువలతో కూడిన పొడులను విక్రయించవచ్చు. ఒక్క ఎండు పుట్టగొడుగులు మాత్రమే విటమిన్ డిని అందించగల ఏకైక ఉత్పత్తి అని డా. ఖాదర్‌వలి వంటి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాపార దృష్టితో మిద్దె తోటల్లో లేదా ఇంటిపంటల్లో మేడలపైనే పుట్టగొడుగులు పెంపకాన్ని ప్రారంభించదలచిన వారికి ఈ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్ వరమని చెప్పవచ్చు. ఫాబ్రికేటర్లు ఇటువంటి యూనిట్లను తయారు చేసి విక్రయించుకోవటానికి అవకాశం ఉంది. ఇతర వివరాలకు.. 90909 49605, 080 – 23086100 (ఎక్స్టెన్షన్ : 348–349)mushroomiihr@gmail.com -
మల్టీపర్పస్ రోబో : పనులన్నీ చక చకా
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న అగ్రిహబ్, ఇక్రిశాట్, టిహబ్, ఐఎస్బి, ట్రిపుల్ ఐటి, ఐఐటి హైదరాబాద్, బిరాక్లలో 2017లో ఇంక్యుబేట్ అయిన అగ్రిటెక్ స్టార్టప్ ‘ఎక్స్ మెషిన్స్’. ఈ ఇండియన్ రోబోటిక్స్, ఎఐ కంపెనీ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ కుమార్ డోగ్గా. పటాన్‌చెరులోని ఇక్రిశాట్లో ఎఐపి బిల్డింగ్ కేంద్రంగా ఎక్స్ మెషిన్స్ రీసెర్చ్ లాబ్ పనిచేస్తోంది. ఎక్స్ మెషిన్స్ రూ పొందించిన కృత్రిమ మేధ ఆధారిత మల్టీపర్పస్ రోబో వ్యవసాయంలో కూలీలు చేసే కలుపుతీత వంటి అనేక పనులను చక్కబెడుతుంది. పంటల సాగులో రసాయనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించటం, శాస్త్రీయ, సుస్థిర వ్యవసాయ సాంకేతికతలను రైతులకు అందుబాటులోకి తేవటం ఎక్స్ మెషిన్స్ లక్ష్యాలు. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం మల్టీపర్పస్ ఎఐ బేస్డ్ రోబోలను తయారు చేస్తోంది. వ్యవసాయంతో ప్రారంభించి ఇతర పరిశ్రమలకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది. ఈ రోబోలను ఎవరూ నడపాల్సిన అవసరం లేదు. వాటంతట అవే తమ ప్రయాణాన్ని నిర్దేశించుకొని పనిచేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. మిరప, పత్తి, పొగాకు తదితర సాళ్లుగా విత్తే పంట పొలాల్లో అన్ని మొక్కలకూ పురుగుమందుల పిచికారీలు అవసరం ఉండదు. కనీసం 30% మొక్కలకు అవసరం ఉండదని ఎక్స్ మెషిన్స్ సంస్థ అంచనా. చీడపీడల బారిన పడిన మొక్కల్ని ఎఐ టెక్నాలజీతో గుర్తించి వాటిపై మాత్రమే పిచికారీ చేయటం ఈ రోబో ప్రత్యేకత అని చెబుతున్నారు. వ్యవసాయంతో పాటు గోదాములు, లాజిస్టిక్స్, రక్షణ శాఖ అవసరాలు, ఉత్పత్తి యూనిట్లకు అవసరమైన ఎఐ రోబోలను కూడా ఈ సంస్థ రూపొందిస్తోంది.చదవండి: ‘మునగరాణి’ : అపుడు ఎన్నో అవహేళనలు..ఇపుడు నెలకు లక్ష రూపాయలు సాంకేతికత: ఎక్స్ 111– మల్టీపర్పస్ రోబోసమస్య: కూలీల కొరత రైతులకు ప్రధాన సవాళ్లలో ఒకటి. దాని అనుబంధ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. పరిష్కారం: ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎక్స్ మెషిన్స్ రోబోని రూపొందించింది.వ్యవసాయ పంటల్లో కలుపు సమస్య, కూలీల కొరత లేకుండా చేస్తుంది. ఇది విత్తనం వేయటం, నారు పెంపకం, మైక్రో స్ప్రేలు, ఎరువుల పిచికారీ, ఇతర పనులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. ఇది 8 గంటల సమయంలో 2.5 ఎకరాల్లోని కలుపు మొక్కల్ని తొలగిస్తుంది. -
అపుడు అవహేళనలు.. ఇపుడు నెలకు లక్ష రూపాయలు
పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే పెద్దగా చదువుకోకపోయినా నమ్ముకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చెప్పటానికి తమిళనాడుకు చెందిన మహిళా రైతు పొన్నరాసి (Ponnarasi) విజయగాథే ఒక ఉదాహరణ. ఆమెకు 38 ఏళ్లు. నలుగురు పిల్లల తల్లి. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. పదో తరగతి మధ్యలో చదువు మానేసింది. పదేళ్లుగా పది ఎకరాల్లో మునగ తోట సాగు చేస్తూ.. తొలుత విత్తనాలు, ఆకులు, మొక్కలు అమ్ముతుండేది. పోటీ ఎక్కువై ఆదాయం తగ్గిపోయింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులను కలిసి సలహా అడిగింది. విత్తనాలు, ఆకులు, మొక్కలు వంటి మునగ ముడి ఉత్పత్తులకు అంత విలువ లేదు. వాటికి విలువను జోడించి.. అంటే, ప్రాసెసింగ్ చేసి రూపం మార్చి.. అమ్మితే మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. అదెలా చెయ్యాలో తెలీదు. పెద్దగా చదువు లేదు. అయినా, పట్టుదలతో ముందడుగు వేసి, శిక్షణ పొంది ధైర్యంగా ముందడుగు వేసింది. మునగ సాగు చేస్తూనే మునగ నూనె తదితర ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తూ వ్యాపారవేత్తగా ఎదిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించటంతో దేశంలో వివిధ ప్రాంతాల నుంచే కాదు అమెరికా, సింగపూర్ వంటి అనేక ఇతర దేశాలకూ మునగ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తోంది. ఏటా రూ. 12 లక్షలకు పైగా నికారదాయం సంపాదిస్తూ తోటి రైతులకు, మహిళలకు శిక్షణ కూడా ఇస్తోంది. అందుకే పొన్నరసికి ‘మునగ రాణి’ అని పేరొచ్చింది!తమిళనాడులోని దిండిగల్ ప్రాంతం మునగ సాగుకు పెట్టింది పేరు. అటువంటి రంగంలో నలుగురు బిడ్డల తల్లి అయిన మహిళా రైతు పొన్నరాసి సంచలనమే సృష్టించింది. ‘మా కుటుంబానికి ఉన్న పదెకరాల భూమిలో గత దశాబ్ద కాలంలో నేను మునగ తోట సాగు (Drumstick farming) చేస్తున్నాను. మునగ ఆకులు, విత్తనాలు, వేర్లు అమ్మేవాళ్లం. అయితే, ఈ పని చేసే రైతులు చాలా మంది ఉండటం వల్ల మార్కెట్ దారుణంగా పడిపోయింది. మునగ విత్తనాల కిలో ధర రూ. 5–10కి పడిపోయింది..’ అని ఎటువంటి సంక్షోభ పరిస్థితుల్లో తాను కొత్తగా ఆలోచించి ప్రాసెసింగ్‌లోకి అడుగు పెట్టిందీ పొన్నరాసి వివరించారు.అటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో కోయంబత్తూరు వెళ్లి, అక్కడి తమిళనాడు వ్యవసాయ కాలేజీలో డాక్టర్ జాన్ కెనడీ అనే శాస్త్రవేత్తను స్వయంగా కలిసి మాట్లాడటమే ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ‘పంటను పండించి, ఎక్కువ దిగుబడి తియ్యటం, పండించిన పంటను ముడి రూపంలో అలాగే ఎంతో కొంతకు అమ్ముకోవటం వల్ల డబ్బులు రావు. ప్రాసెసింగ్ చేసి మునగ నూనె ((Drumstick Oil), పొడి, సౌందర్య సాధనాలను అమ్మితే డబ్బులు వస్తాయి అని జాన్ కెనడీ సార్ చెప్పగా విన్నప్పుడు.. వ్యవసాయం గురించి అప్పటి వరకు నాకు ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఏం చేస్తే గట్టెక్కుతామో అర్ధమైంది..’ అన్నారామె.కిలో మునగ నూనె రూ. 5 వేలుకెనడీ చెప్పిన విషయాలు పొన్నరాసికి బాగా నచ్చాయి. అయితే వాటిని తయారు చేయటం ఎట్లా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే క్రమంలో దిండిగల్ జిల్లాలోనే ఉన్న గాంధీ గ్రామ్ యూనివర్సిటీలో వ్యవసాయ విస్తరణాధికారులు శ్రీకుమారి, శరవణన్లను సంప్రదించింది. మునగ గింజల నుంచి నూనెను వెలికి తీసే పద్ధతులు, యంత్రాలకు సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకుంది. మునగ గింజల నుంచి తీసే నూనె కిలో రూ. 5 వేలు పలుకుతుందని పొన్నరాసికి తెలిసింది అప్పుడే. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకొని ముందడుగు వేసింది. ఆ విధంగా వ్యవసాయం తప్ప వ్యాపారం తెలియని ఆమె జీవితంలో 2019లో వ్యాపారఅధ్యాయం ప్రారంభమైంది.కరువును తట్టుకునే మూలనుర్ మునగమునగ మెట్ట పంట అయినప్పటికీ అన్ని రకాల మునగ విత్తనాలూ కరువును తట్టుకొని మంచి దిగుబడిని ఇవ్వలేవు. అందుకే పొన్నరాసి కరువును తట్టుకునే మూలనూర్ మునగ రకాన్ని సాగు చేస్తున్నారు. అంతే కాదు ఏడాదికి మూడు టన్నుల దిగుబడి ఇస్తుంది. ఈ రకం గింజల్లో నూనె శాతం కూడా ఎక్కువట. అయితే, మునగ విత్తనాల నుంచి నూనె తియ్యటం అంత తేలికేమీ కాదు. విత్తనంపైన పొరను తొలగించడానికి చాలా మంది కూలీలు అవసరం అవుతారు. యంత్రాల నిర్వహణ అనుభవం కూడా అవసరం.నూనె తీయటం ప్రారంభించబోయే లోగా తన చుట్టూ ఉన్న వారు ఏవేవో కామెంట్స్ చేసి ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లేవారు. పదో తరగతి చదువు కూడా లేని దానివి ఏం చేస్తావులే అని ఎత్తి పొడుపు మాటలు అనేవారు. ‘వారి మాటల్ని నేను అసలు పట్టించుకునే దాన్ని కాదు. నా ద్విచక్రవాహనంపై నలుగురు పిల్లల్ని ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే దాన్ని. బంధువులు కూడా నా ఆర్థిక పరిస్థితి గురించి ఇంకా వేవేవో సూటిపోటి మాటలు అనేవారు..’ అని పొన్నరాసి గుర్తు చేసుకున్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టిన పట్టు విడవలేదు. ‘అక్క ఇంటా బయటా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఆత్మస్థయిర్యంతో అన్నీటినీ ఎదుర్కొంది. ఆమె మీద నమ్మకం ఉంచి మేం పనిచేస్తున్నాం అన్నారు పొన్నరాసి దగ్గర పనిచేసే మహిళ కలైరాసి. విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటం ఒక్కటే సరిపోదు. అవి నాణ్యతా ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూసుకోవటం కూడా ఒక సవాలే. తంజావూరులోని ఇండియన్ ఫుడ్ ఎడిబుల్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ (ఐఇఎఫ్ఇడి) అనే సంస్థ నుంచి తన ఉత్పత్తులకు నాణ్యతా సర్టిఫికెట్ తీసుకోవటంతో పొన్నరాసికి మార్కెట్లో మంచి పట్టు దొరికింది. ప్రమాణాలకు తగినట్లు విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్న మహిళా రైతు, వ్యాపారవేత్తగా ఆమెకు ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల గ్రాంటు వచ్చింది. ఆ సొమ్ముతో పొలంలోనే ప్యాక్ హౌస్‌ను ఏర్పాటు చేసుకోగలిగింది. దాంతో ఆమె పని సులువైంది. అంతేకాదు, ఆ తర్వాత నుంచి మునగ ఆకులు, కాయలు, గింజలతో మొత్తం 36 రకాల ఉత్పత్తులను తయారు చేయటానికి వీలు దొరికింది. మునగ నూనెతో పాటు సబ్బులు, షాంపూలు, లిప్ బామ్స్ తయారీలో వాడేందుకు పొడిని.. సూప్ పౌడర్లు.. ఇటువంటివే ఎన్నో ఉత్పత్తుల్ని తయారు చేశారు. ‘ఆహారోత్పత్తులను స్వయంగా తయారు చేయిస్తాను. సౌందర్య సాధనాలను తయారు చేయించే పనులను మా తమ్ముడు చూసుకుంటున్నాడని ఆమె తెలిపారు.కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ, వారి అవసరాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ప్రతి ఏటా కనీసం పది రకాల కొత్త ఉత్పత్తులను అదనంగా చేర్చుతున్నారామె. తన సిబ్బంది ఇతి తమ పనిగా భావించి నిమగ్నమై పని చేయటం వల్ల పనులు సజావుగా చేయగలుగుతున్నానని చెబుతూ.. మునగ ఇడ్లీ పొడిని తయారు చేస్తే బాగుంటుందని మా దగ్గర పనిచేసే కలైరాసి చెప్పటంతోనే మొదలు పెట్టామని పొన్నరాసి సంతోషంగా చెప్పారు.ఫేస్బుక్, వాట్సప్..పొన్నరాసి గత ఆరేళ్లుగా అంకితభావంతో పనిచేయటం వల్ల ఏడాదికి రూ. 12 లక్షలకు పైగా నికరాదాయం పొందగలుగుతున్నారు. ఆమె దగ్గర మునగ ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే వారి సంఖ్య లక్ష దాటిపోయింది. ఫేస్బుక్, వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసిన వినియోగదారులకు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారా ΄ పొన్నరాసి కృషి గురించి, మునగ ఉత్పత్తుల గురించి తెలుసుకున్న మలేషియా, సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, మస్కట్ వాసులు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు.ఎన్ని ఎక్కువ ఉత్పత్తుల్ని ఆమె విక్రయిస్తున్నా అందులో బాగా అమ్ముడు పోయేవి మాత్రం.. మునగ విత్తనాలు, సూప్ పౌడర్లు, నూనె మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగటం, పొన్నరాసి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్పత్తులు తయారు చేస్తుండటంతో మంచి వ్యాపారం జరుగుతోంది. త్రిచీ కలెక్టర్ పొన్నరాసికి బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. దీంతో ఆమెకు ‘మునగ రాణి’ అని పేరొచ్చింది.చదవండి: కార్బన్ పాజిటివ్ పొలం.. అంటే తెలుసా?ఇప్పుడామె చాలా మంది రైతులకు, స్వయం సహాయక బృందాలకు మునగ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తూ, ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడుతోంది. ‘ఎంబిఎ కాలేజీ వాళ్లు నన్ను పిలిచి వ్యవసాయాధిరిత వ్యాపార పాఠాలు చెప్పమని అడుగుతుంటే చాలా గర్వంగా ఉంది’ అని సంబర పడుతున్నారు పొన్నరాసి. సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టటం నాకు తెలిసేది కాదు. మా అమ్మాయి నేర్పించింది. ఫేస్బుక్లో మా ఉత్పత్తుల వివరాలు చూసి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ఆ విధంగా ఫేస్బుక్, వాట్సప్ మా వ్యాపారానికి చాలా బాగా ఉపయగపడ్డాయి అని పొన్నరాసి సంబరంగా చెబుతున్నారు!ప్రచారాలను పట్టించుకోకూడదు..‘మహిళ బాధ్యతల విషయంలో సమాజం గందరగోళపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మహిళ వ్యాపారం మొదలు పెట్టిందంటే, ఆమె తల్లిగా లేదా భార్యగా విఫలమైపోయిందని ప్రచారం జరుగుతుంటుంది. ఇటువంటి ప్రచారాలను పట్టించుకోకుండా మహిళలు తాము ఉన్న చోట నుంచి ముందడుగు వేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనం చేసిన పనుల వల్ల ఎంత ప్రయోజనం చేకూరిందో, ఆర్థికంగా ఎంత స్వయం సమృద్ధి సాధించామో. డిగ్రీలే చదివి వుండాలనేమీ లేదు. మన సంకల్పంతో పాటు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం, సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవటం ముఖ్యం. – పొన్నరాసి, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన మునగ రైతు, దుండిగల్, తమిళనాడు -
వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!
వింగ్డ్ బీన్ (సోఫోకార్పస్ టెట్రాగోనోలోబస్).. ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఒక రకం చిక్కుడు పంట. మిగతా చిక్కుడు కాయల కన్నా ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ చిక్కుడు కాయకు నాలుగు ముఖాలు ఉంటాయి. అందువల్ల ఈ తీగ జాతి కూరగాయ మొక్కకు ‘రెక్కల చిక్కుడు’ అని పేరొచ్చింది. ఉష్ణమండల ప్రాంతాల్లో చక్కగా పెరుగుతుంది. ఆసియా దేశాలకు బాగా అనుకూలమైనదైనా, ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా సాగు చేయని పంట ఇది. ఇది కూరగాయ పంట. ఆకుకూర పంట. దుంప పంట. పప్పు ధాన్యపు పంట కూడా! ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకొని దిగుబడినిచ్చే అద్భుత పంట!! భారత్, బర్మా, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, చైనా తదితర దేశాల్లో సాగవుతోంది. వింగ్డ్ బీన్స్‌తో కూర చేసుకోవచ్చు. ఎండు చిక్కుడు గింజల కోసం కూడా పెంచవచ్చు. గాలిలో పుష్కలంగా ఉన్న నత్రజనిని గ్రహించి నేలకు అందించే సామర్థ్యం అన్ని పప్పుధాన్యపు పంటలకూ ఉంది. దీనికి కొంచెం ఎక్కువగా ఉంది. దీని వేర్లపై ఉండే బుడిపెల ద్వారా నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది. దీని ఆకుల్లో కూడా అత్యంత నాణ్యమైన మాంసకృత్తులు ఉంటాయి. పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు దోహదపడే ఈ చక్కని చిక్కుడు పంటపై మనం పెద్దగా పట్టించుకోవటం లేదు. వింగ్డ్ బీన్‌లో కూడా అనేక రకాల వంగడాలు ఉన్నాయి. అద్భుతమైన ఈ కూరగాయ పంట ప్రతికూల బెట్ట వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో నివసించే పేద గ్రామీణ కుటుంబాల ఆహారంలో మాంసకృత్తులను తగినంత చేర్చగల శక్తి ఉన్న పంట ఇది. సారం అంతగా లేని భూముల్లో సైతం మంచి దిగుబడినిస్తుంది. పంట పొలాల్లో పంటల జీవవైవిధ్యాన్ని, భూసారాన్ని పెంపొందించడానికి, వాణిజ్యపరంగా ఆదాయం పొందడానికి కూడా వర్షాధార వ్యవసాయంలో వింగ్డ్ బీన్ సాగును ్ర΄ోత్సహించవలసిన అవసరం ఉందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) పరిశోధన, విస్తరణ సిబ్బందికి సూచించింది. వింగ్డ్ బీన్స్ ప్రజల పళ్లాల్లోకి చేర్చగలిగితే మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపర్చగలమని, పౌష్టికాహార లోపాన్ని పారదోలగలమని ఐసిఏఆర్ ఆశిస్తోంది. కూరగాయ తోటల్లో, ఇంటిపంటల్లో, మిద్దె తోటల్లో సైతం సాగు చేయదగిన మేలుజాతి తీగ జాతి కూరగాయ పంట ఇది.వన్ స్పెసీస్ సూపర్‌మార్కెట్!ఐసిఏఆర్ వింగ్డ్ బీన్ని ‘వన్ స్పెసీస్ సూపర్‌మార్కెట్’గా అభివర్ణించింది. ఆకుపచ్చని కాయలు, ఆకులు, గింజలతో పాటు.. కొంచెం లావుగా పెరిగే దీని వేర్లు కూడా చక్కని పోషకాలతో కూడి ఉండటమే ఇందుకు కారణం. ఆకులను పాలకూర మాదిరిగా పప్పులో వేసుకోవచ్చు. పూలను సలాడ్‌గా తినొచ్చు. దుంప మాదిరిగా ఊరే వేర్లను విడిగా తినొచ్చు లేదా ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో కలుపుకోవచ్చు. ఈ తీగ జాతి మొక్క వేగంగా అల్లుకుపోతుంది కాబట్టి సజీవ ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు. ప్రధాన పంట మధ్యలో కలుపు పెరగనీయకుండా అంతరపంటగా, పంటమార్పిడి కోసం సాగు చేస్తూ భూసారాన్నిపెంపొందించుకోవచ్చు. ఇది తేలిగ్గా చనిపోదు. ఇతరత్రా ప్రధాన ఆహార పంటలతో పోల్చితే కరువును, వరదను, వేడిని, చీడపీడలను అధికంగా తట్టుకునే శక్తి ఈ పంటకు ఉంది. ఇది బహు వార్షిక పంట. అయితే, వార్షిక పంటగానే సాగులో ఉంది. ఈ తీగ 3–4 మీటర్ల కన్నా పొడవుగానే పెరుగుతుంది. తీగ సాధారణంగా ఆకుపచ్చగా ఉంటుంది. కొన్ని రకాల వింగ్డ్ బీన్ జాతుల తీగ ఊదా, గులాబీ, గోధుమ రంగుల్లో కూడా ఉంటాయి. పూలు తెలుపు నుంచి ముదురు ఊదా రంగు, నీలం, నీలం తెలుపు కలగలపు రంగుల్లో ఉంటాయి. కాయలు నాలుగు పలకలుగా 15-22 సెం.మీ. ΄ పొడవున 2-3 సెం.మీ. వెడల్పున ఉంటాయి. కాయలో 5 నుంచి 20 గుండ్రటి గింజలుంటాయి. ఎండిన తర్వాత ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వింగ్డ్ బీన్ పంటలో ఎక్కువ రకాలు న్యూగినియా, మారిషస్ దేశాల్లో కనిపిస్తాయి. మన దేశంలో అస్సాం, మణిపూర్, మిజోరం, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో ఎక్కువగా దీన్ని సాగు చేస్తున్నారు. ఉత్తరాది మైదాన ప్రాంతాల్లోనూ మంచి దిగుబడినిస్తున్నట్లు రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి తప్ప పెద్దగా ప్రాచుర్యంలోకి రాని పంట ఇది.పుష్కలంగా పోషక విలువలువచ్చే కాలంలో మన ప్రాంతాల్లో కూడా బాగా ్ర΄ాచుర్యంలోకి తేదగిన అద్భుత పోషక విలువలు కలిగిన పంట వింగ్డ్ బీన్. ప ప్రొటీన్, పీచు, బీకాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు తగుపాళ్లలో వింగ్డ్ బీన్స్‌లో ఉన్నయి. థయామిన్, పైరిడాక్సయిన్ (విటమిన్ బి–6), నియాసిన్, రిబోఫ్లావిన్ వంటి బికాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఇనుము, రాగి, మాంగనేసు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు ఉన్నాయి. వింగ్డ్ బీన్ ఆకుల్లో పీచు, విలమిన్ ఎ, సి, ఖనిజాలు ఉన్నాయి. వంద గ్రాముల తాజా ఆకుల్లో 45 మిల్లీ గ్రాముల విటమిన్ సి (రోజువారీ అవసరంలో ఇది 75%), 8090 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయు) విటమిన్ ఎ (270% ఆర్డిఎ) ఉంటాయి. లేత వింగ్డ్ బీన్ కాయల్లో ఫొలేట్స్ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల బీన్స్‌లో 66 మైక్రో గ్రాముల (రోజుకు మనిషికి రోజువారీ అవసరంలో ఇది 16.5%) ఫొలేట్స్ ఉంటాయి. డిఎన్ఎ సంశ్లేషణకు, కణ విభజనకు విటమిన్ బి–12తో ΄ాటు ఫొలేట్స్ అతి ముఖ్యమైనవి. గర్భం దాల్చే సమయం నుంచి ప్రసవం వరకు తల్లికి ఫొలేట్స్ లోపం లేకుండా ఉంటే బిడ్డకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రావు. వంద గ్రాముల తాజా వింగ్డ్ బీన్స్‌లో 18.3 మిల్లీ గ్రాముల (రోజువారీ అవసరంలో 31%) విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్. ఇన్ఫెక్షన్లకు తట్టుకునే రోగనిరోధక శక్తిని కలిగించటంలో తోడ్పడుతుంది. రక్త నాళాలకు సంకోచ వ్యాకోచ గుణాన్ని ఇస్తుంది. ఆహారంలో తగినంతగా తీసుకుంటే కేన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. వింగ్డ్ బీన్స్ అతి తక్కువ కేలరీలతో కూడిన కూరగాయ. వంద గ్రాముల్లో 49 కేలరీలు మాత్రమే ఉంటాయి.అతివృష్ఠినీ తట్టుకుంటుంది!కరువు కాటకాలను, వరదలను, తీవ్ర ప్రతికూల వాతావరణాన్ని, చీడపీడలను తట్టుకొని దిగుబడినివ్వగలగటం అనే లక్షణం వాతావరణ మార్పుల నేపథ్యంలో మిగతా ప్రధాన పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా వింగ్డ్ బీన్స్ నిరాశపరచదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలకు ఆహార కొరత, ΄పౌకాహార లోపాన్ని సరిదిద్దే క్రమంలో తోడ్పడే పంటగా దీన్ని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా సాగు చేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీని ఆకులు, కాయలు, గింజలు, దుంపల్లాంటి వేర్లను తినటానికి వీలుంది. మిగిలిన తీగను పశుగ్రాసంగా వాడుకోవచ్చు. నత్రజనిని స్థిరీకరిస్తుంది కాబట్టి పంట మార్పిడికి ముఖ్యమైన పంటగా ఇది గుర్తింపు పొందింది. ఇది ప్రధానంగా స్వీయపరాగ సంపర్క పంట. మహా అయితే 7.6% మేరకు పరపరాగ సంపర్కం జరుగుతున్నట్లు గుర్తించారు. వింగ్డ్ బీన్స్ పంట అనావృష్టిని, అతివృష్టిని కూడా తట్టుకుంటుంది. 700 మిల్లీ మీటర్ల నుంచి 4100 ఎం.ఎం. వార్షిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత 15.4 – 27.5 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతను ఇష్టపడుతుంది. మెత్తని దుక్కి చేసి విత్తుకుంటే వేరు వ్యవస్థ విస్తరించడానికి వీలుగా ఉంటుంది. ఇసుక నేలల నుంచి లోతైన రేగడి నేలలు, నీరు నిలబడని ఎర్ర నేలలు, సేంద్రియ పదార్థం బాగా ఉన్న నేలలు అనుకూలం. 4.3–7.5 మధ్య ఉదజని సూచిక ఉన్న నేలలు అనుకూలం. సెప్టెంబర్ మధ్య నుంచి అక్టోబర్ మధ్యలో పూత వస్తుంది. 18 డిగ్రీల కన్నా తక్కువ, 32 డిగ్రీల సెల్షియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే పూత రాదు. సముద్రతలం నుంచి 2,000 మీటర్ల ఎత్తు వరకు గల ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది (హైదరాబాద్ 542 మీ. ఎత్తులో ఉంది). కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్‌లో విస్తారంగా సాగు చేయటానికి, తోటల్లో అంతరపంటగా సాగు చేయటానికి ఇది అనుకూలమైన పంట. విత్తుకోవచ్చు. కాండం ముక్క పెట్టినా వస్తుంది. హెక్టారుకు 15–20 కిలోల విత్తనాలు అవసరం. విత్తనం పైన గట్టి పెంకులాంటి పొర ఉంటుంది. 1-2 రోజులు నానబెట్టి, 3-4 సెం.మీ. లోతులో విత్తుకోవాలి. 5-7 రోజుల్లో మొలకెత్తుతుంది. 25 డిగ్రీల సెల్షియస్ పగటి ఉష్ణోగ్రత ఉన్న కాలంలో చక్కగా పెరుగుతుంది. ఉత్తర–దక్షిణ నిలువు పందిళ్లకు తీగలు పాకిస్తే ఎండ బాగా తగిలి బాగా పెరుగుతుంది. కూరగాయ పంటగా సాగు చేసేటప్పుడు 90 సెంటీమీటర్లు (36 అంగుళాలు)“ 90 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి. విత్తన పంటగా అయితే 45 సెం.మీ.“ 45 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. తీగ 3-4 మీటర్ల కన్నా తక్కువ పెరిగే రకాలైతే 30 సెం.మీ. “ 20 సెం.మీ. దూరంలో నాటుకోవచ్చు. రుతుపవనాలు వచ్చిన తర్వాత జూన్–జూలైల్లో నాటుకోవాలి. వింగ్డ్ బీన్ వేరు దుంపలను కూడా ఆహారంగా వాడుతారని చెప్పుకున్నాం కదా. దుంపల కోసం సాగు చేసేటప్పుడు ఆగస్టు–సెప్టెంబర్ మధ్య ఆలస్యంగా విత్తుకుంటే రొట్ట ఎక్కువ పెరగకుండా వేరు ఎక్కువ పెరుగుతుంది.నత్రజని తక్కువ నేలలైనా.. నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది కాబట్టి వింగ్డ్ బీన్స్ పంటను సారం తక్కువగా ఉన్న నేలల్లోనూ విత్తుకోవచ్చు. హెక్టారుకు 20 టన్నుల మాగిన పశువుల ఎరువుతోపాటు 50:80:50 కిలోల ఎన్.పి.కె. ఎరువులు హెక్టారుకు వేసుకోవాలి. నత్రజనిని మాత్రం రెండు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని విత్తనానికి ముందు, రెండో భాగాన్ని 40–60 రోజుల మధ్య వేసుకోవాలి.నెలలోనే కమ్మేస్తుంది!వింగ్డ్ బీన్స్ తీగ విత్తిన నెల రోజుల్లోనే వేగంగా పెరిగి పొలం అంతా కమ్మేస్తుంది. విత్తిన తర్వాత 15–20 రోజులకు ఒకసారి కలుపు తీస్తే చాలు. వేరు దుంపల కోసం సాగు చేస్తే నేల మీదే పాకించవచ్చు. కూరగాయ పంటగా, విత్తనాల పంటగా సాగు చేసుకుంటేపాదులను ఒక మోస్తరు ఎత్తు గల ఊత కర్రలకు పాకిస్తే కాయలు కోసుకోవటానికి వీలుగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. తుప్పు తెగులు, ఆకుమచ్చ వంటి శిలీంధ్ర తెగుళ్లు తప్ప మిగతా తీవ్రమైన చీడపీడలేవీ ఈ పంటకు సోకవు. రూట్‌నాట్ నెమటోడ్స్ సమస్య ఉండొచ్చు. అవసరాన్ని బట్టి తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి.చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ హెక్టారుకు 5–10 టన్నులువిత్తుకున్న 10 వారాలకు ఆకుపచ్చని వింగ్డ్ బీన్స్ కూరగాయలను కోసుకోవచ్చు. హెక్టారుకు 5–10 టన్నుల వరకు తాజా కాయలతోపాటు అంతే బరువైన వేరు దుంపల దిగుబడి వస్తుంది. విత్తనాలైతే హెక్టారుకు 1 నుంచి 1.5 టన్నుల దిగుబడి వస్తుంది. తాజా వింగ్డ్ బీన్స్ కూరగాయలను ప్లాస్టిక్ బాగ్స్‌లో కట్టి 10 డిగ్రీల సెల్షియస్, 90% తేమ గల చోట నిల్వ చేస్తే 4 వారాల వరకు బాగుంటాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవటం,పౌష్టిక విలువలతో కూడిన పంట కావటంతో వింగ్డ్ బీన్స్ పంట భవిష్యత్తులో విస్తారంగా సాగులోకి తేవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సాగవుతున్న రాష్ట్రాల్లో నుంచి అనువైన రకాలను సేకరించి తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యాన పరిశోధనా సంస్థలు పరిశోధన చేసి స్థానికంగా రైతులకు విత్తనాలను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వం విధానాల ద్వారా ఈ పంట వ్యాప్తికి దోహదం చేయాలి. -
ఐరన్ లోపానికి అర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్
పుట్టగొడుగులు ఎంతో ఆరోగ్యదాయకమైనవని మనకు తెలుసు. రక్తహీనతకు ఐరన్ లోపం పెద్ద సమస్య. మన దేశంలో ముఖ్యంగా మహిళలు, యుక్తవయసు బాలికలు అధిక శాతంలో రక్త హీనతతో బాధపడుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు బెంగళూరులోని (భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి– ఐసిఎఆర్– అనుబంధ సంస్థ) భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) అధిక పాళ్లలో ఐరన్ కలిగి ఉండే పుట్టగొడుగులను రూపొందించింది. ఐరన్ ఎల్మ్ ఆయిస్టర్ మష్రూమ్‌ను ఉత్పత్తి చేసి, దానితో రసం పొడిని తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం ద్వారా రక్తహీనతను అధిగమించవచ్చని ఐఐహెచ్ఆర్ చెబుతోంది. ఎల్మ్ ఆయిస్టర్ పుట్టగొడుగుల్లో సాధారణంగా ఐరన్ 135.60 పిపిఎం స్థాయిలో ఉంటుంది. ఫార్టిఫికేషన్ ప్రక్రియ ద్వారా దీన్ని 338.15 పిపిఎంకు ఐఐహెచ్ఆర్ పెంపొందించింది. అంటే 149.37% పెంచిందన్నమాట. తినే ఆహారంలో ఉన్న పోషకాన్ని కూడా మన దేహం వంట పట్టించుకోగలిగేది తక్కువే ఉంటుంది. సాధారణంగా మొక్కల ఆహారం ద్వారా మనం తీసుకోగలిగే ఐరన్ 5–8% మాత్రమే. అదే ఇన్ఆర్గానిక్ ఐరన్ టాబ్లెట్లు వంటి సప్లిమెంట్ల ద్వారా 10–12% ఐరన్‌ను మాత్రమే మన దేహం తీసుకోగలదు. అయితే, ఐఐహెచ్ఆర్ రూపొందించిన ఆర్క ఐరన్ ఫార్టిఫైడ్ మష్రూమ్ పొడితో రసం తయారు చేసుకొని రోజువారీ భోజనంలో తీసుకుంటే 21.68% ఐరన్‌ను తీసుకోగలుగుతామని ఐఐహెచ్ఆర్ పేర్కొంది. ఐరన్‌తో ఫార్టిఫై చేసిన పుట్టగొడుగుల పొడిని తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కుటీర పరిశ్రమగా ఉత్పత్తి చేసి ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది. చదవండి: ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధనShivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి? ఇతర వివరాలకు.. 080–23086100 – ఎక్స్టెన్షన్ 348, 349. mushroomiihr@gmail.com -
తెల్లబియ్యం తిన్నా.. షుగర్ పెరగదు!
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసైమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసైమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసైమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రా లో మిగతా 2వ పేజీలో uగ్లైసైమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్‌లెసైమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్‌లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్‌పీవోల ద్వారా సాగు..మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్ అత్యల్ప గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు రెట్టింపు ప్రొటీన్‌ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికి కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ( వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్‌లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు -
పందిరి సాగు.. ఫలితాలు బాగు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకొని వరి సాగు చేస్తే సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధర అందడం లేదని ఆందోళన చెందుతున్న రైతులు తమ ఆలోచను మార్చుకుంటున్నారు. సంప్రదాయ పంటలకు బదులుగా ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తమకున్న కొద్దిపాటి సాగు భూమిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు, ఉద్యాన పంటల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటే సాగును లాభాల బాటలో నడిపించొచ్చని నిరూపిస్తున్నారు. చిన్నకోడూరు మండలంలో సుమారు 90 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.పందిరి సాగుతో మేలురైతులు వారి భూముల్లో పందిరి వేసి, ఉద్యాన పంటను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఎకరా భూమిలో పందిరి సాగు అమలు చేసే రైతులు ఉద్యానశాఖ ద్వారా రూ. లక్ష సాయం అందిస్తుండగా, ఇందులో రూ. 50 వేలు సబ్సిడీ వస్తుంది. మిగితా సగాన్ని రైతులు భరించాల్సి వస్తుంది. అధికారులే పందిరి సిద్ధం చేసి ఇస్తారు. సుమారు నాలుగేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీగజాతి కూరగాయలు పండించుకోవచ్చు. కాకర, బీర, దొండ, సోరకాయ పండిస్తూ ఆదాయం పొందవచ్చు. పందిరి కింది బాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో టమాట, వంకాయ, బెండ వంటి అంతర పంటలు సాగు చేయవచ్చు.దిగుబడి బాగుందిపందిరి సాగు విధానంతో దిగుబడులు బాగున్నాయి. ఈ విధానం ద్వారా కలుపు తక్కువగా ఉండి కూలీల అవసరం ఉండదు. కూరగాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. చీడ పీడలు ఎక్కువగా ఆశించవు. పంటలు సాఫీగా వస్తాయి. మార్కెట్ల మంచి ధర పలుకుతుంది. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)–నాగర్తి తిరుపతిరెడ్డి, రైతు మాచాపూర్ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. నమ్మలేం. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన దివంగత రైతు శాస్త్రవేత్త రాజు టైటస్ మాత్రం 30 ఏళ్ల పాటు ఇలాగే వ్యవసాయం చేసి సత్ఫలితాలు సాధించారు. ‘ప్రకృతి వ్యవసాయం వెనుకబడినదో లేదా ప్రాచీనమైనదో కాదు. ఆధునికమైనది, వినూత్నమైనది అని రాజు టైటస్ రుజువు చేశారు’ అని ఐసిఎఆర్ ప్రశంసించింది. ఆరేళ్ల క్రితం కన్నుమూసినా.. ఆయన కృషి రైతులకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 13 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలై పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (వన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్నిచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు తను సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.అడ్డంకులను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశారు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడేవారు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకి.. నేల గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. తొలుత గ్రామస్తులు అవహేళన చేసినా అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.సోయా విత్తన బంతులు!అంకితభావంతో రాజు టైటస్ చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించారు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు పనిచేశారు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశారు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశారు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదిగాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. సోయా మొక్కల మధ్య ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదనగా వేశారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకు΄ోయి తేమను ΄ోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం అప్పు చేయాల్సిన అగత్యం తప్పింది. రాజు తన పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేశారు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరవును అందించాల్సిన అవసరం ఉండదంటారాయన. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడ్డాయి. ఈ చెట్ల కలపతో పాటు మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఆ విధంగా 30 ఏళ్లకు పైగా పొలాన్ని దున్నకుండానే సమృద్ధిగా పంటలు పండిస్తూ పేరు΄ పొందారు. వినియోగదారులు అడిగితేనే రైతులు పండిస్తారు!వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు’ అనేవారు రాజు టైటస్. మన దేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న రసాయనాలు. వీటి వల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతి సేద్య పంట ఉత్పత్తులే కారణం అన్నారాయన. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగంమా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, పాలు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం. రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. ఫుకు ఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు అంటారు రాజు టైటుస్! -
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
ఎండు ఆకులను కాల్చకండి.. ఇలా సులభంగా ఎరువు!
ఇది ఆకులు రాలే కాలం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఏప్రిల్ వరకు మన చూట్టూతా ఉండే చెట్లు ఆకులను రాల్చుతూ ఉంటాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా వాకిలి నిండా, ఇంటి ఆవరణలో, చెట్ల పక్కనున్న ఇంటి పైకప్పుల మీద, కాలనీల్లో రోడ్ల మీద, పార్కుల్లో.. ఎక్కడ చూసినా ఆకులే.. ఆకులు.. రాలిన ఆకులు! ఈ ఆకులను చక్కని కంపోస్టు ఎరువుగా మార్చుకోవచ్చని తెలిసినా.. నిర్లక్ష్యం కొద్దీ ఆకులను కుప్ప జేసి నిప్పు పెట్టడమో లేదా చెత్తను మోసుకెళ్లే మున్సిపాలిటీ వాళ్ల నెత్తిన వెయ్యడమో చేస్తున్నాం.. అయితే, స్వల్ప ప్రయత్నంతోనే ఈ ఎండాకులను అమూల్యమైన సహజ ఎరువుగా మార్చుకోవచ్చని ఓ మహిళ ఎలుగెత్తి చాటుతున్నారు. మహారాష్ట్రలోని పుణే నగరవాసి అదితి దేవ్‌ధర్ ‘బ్రౌన్‌లీఫ్’ పేరిట ఏకంగా ఓ సామిజిక ఉద్యమాన్నే ప్రారంభించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఆమె స్ఫూర్తి కథనం.. పచ్చని చెట్లంటే మనందరికీ ఇష్టమే. అందుకే పొలాల గట్ల మీద, పడావు భూముల్లో, ఇంటి దగ్గర, ఊళ్లు / కాలనీల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో.. ఇష్టపడి పచ్చని చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే, ఆ చెట్లు రాల్చే ఆకుల్ని ఏం చేయాలి? ఊడ్చి మున్సిపాలిటీ వ్యాన్‌లో వేస్తున్నారు లేదా కుప్ప చేసి ఏకంగా నిప్పు పెడుతున్నారు. ఈ రెండూ మంచి పనులు కాదు. పనిగట్టుకొని మొక్కలు నాటి పచ్చని చెట్లని పెంచుతున్న వారు సైతం నాకెందుకులే అనో.. ఓ రకమైన నిరాసక్తతతోనో, నిర్లక్ష్యంతోనో చూస్తూ ఊరుకుంటున్నారు. అయితే, అదితి దేవ్‌ధర్ ఊరుకోలేదు. తమ ఇంటి ఆవరణలో పెద్ద చెట్లు రాల్చే ఆకులు పోగుపడుతూ ఉంటే.. ఆ ఆకులను నిప్పు పెట్టి వాయుకాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యానికి ముప్పు తేవడానికి గానీ, మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చి డంపింగ్ యార్డులో చెత్త దిబ్బలను కొండలుగా పెంచడానికి గానీ ఆమె ఒప్పుకోలేదు. తానే చొరవతో ఎండాకుల సమస్యకు పరిష్కారం వెదికారు. బ్రౌన్‌లీఫ్ ఛాలెంజ్ తీసుకున్నారు. నలుగురినీ కూడగట్టారు. ఒక్క ఎండాకునూ తగులబెట్టనియ్య కూడదని ప్రతినబూనారు. నాలుగేళ్లుగా ఎండాకులను తగుల బెట్టకుండా చూస్తున్నారు. ఎండాకులతో కం΄ోస్టు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆ కంపోస్టుతో చక్కని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి దోహదం చేస్తూ మరెందరిలోనో ప్రేరణ కలిగిస్తున్నారు. ఎండాకులను వాడుకునే మూడు పద్ధతులు! రాలిన ఎండాకులకు నిప్పు పెడుతున్నారా? వద్దు. ఎందుకంటే దీని వల్ల గాలి కలుషితమవుతుంది. చెట్లు రాల్చే ఎండాకులు భూమికి తిరిగి చెట్లు అందిస్తున్న పోషకాలు. ప్రకృతిలో, అడవిలో రాలిన ఆకులు దొంతర్లుగా పేరుకొని భూమికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాయి. వర్షానికి తడిచిన ఆకులు, అలములు కుళ్లి భూమిని సారవంతం చేస్తున్నాయి. అదితి బ్రౌన్‌లీఫ్.ఓఆర్‌జి పేరిట వెబ్‌సైట్‌ను రూపొందించారు. వాట్సప్ గ్రూప్ ప్రాంరంభించారు. ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఎండాకులను తగులబెట్టకుండా వాడుకునే మూడు పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. అదితి బ్రౌన్‌లీఫ్.ఓఆర్‌జి పేరిట వెబ్‌సైట్‌ను రూ పొందించారు. వాట్సప్ గ్రూప్ ప్రారంభించారు. ఫేస్బుక్ ఖాతా తెరిచారు. ఎండాకులను తగులబెట్టకుండా వాడుకునే మూడు పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆచ్ఛాదన (మల్చింగ్) చెయ్యండిఎండాకులను మొక్కలు, చెట్ల దగ్గర నేలపై ఎండ పడకుండా మల్చింగ్ చేయాలి. ఎండ నేరుగా నేలకు తగలకుండా ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములకు మేలు జరుగుతుంది. కాలక్రమంలో ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి.కంపోస్ట్ చెయ్యండి... ఎండాకులను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయండి. కంపోస్టు చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఎ) ఇంటి ఆవరణలో ఒక మూలన గుంత తవ్వి ఆకులను అందులో వేయటం. బి) ఇనుప మెష్‌తో ట్రీగార్డు మాదిరిగా గంపను తయారు చేసి అందులో ఎండాకులు వేయడం. సి) ఎండాకులను కుప్పగా పోసి కూడా కంపోస్టు చెయ్యొచ్చు. ఈ మూడు పద్ధతుల్లో కూడా ఆకులను తేమగా ఉండేలా తరచూ నీరు పోస్తుండాలి. పేడ నీరు లేదా జీవామృతం లేదా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం లేదా లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియా ద్రావణం లేదా పుల్లమజ్జిగ వంటి సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవరాశి ఉండే కల్చర్‌ను కలపాలి (వీటి గురించి మున్ముందు వివరంగా తెలుసుకుందాం)ఇతరులకివ్వండి... పట్టణాలు, నగరాలలో నివసించే వారు ఇంటి దగ్గర లేదా కాలనీ రోడ్లపై లేదా పార్కుల్లో చెట్లు రాల్చే ఆకులను కం΄ోస్టు చేసే ఉద్దేశం లేకపోతే వాటిని కంపోస్టు చేసుకోదలచిన వారికి అందించడం ఉత్తమం. పుణే వాసులు ఎండాకులను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా అదితి బ్రౌన్‌లీఫ్ పేరుతో వాట్సప్ గ్రూప్, ఫేస్బుక్ ఖాతాతోపాటు వివరంగా చర్చించేందుకు వెబ్‌సైట్‌ను సైతం 2016లో ప్రారంభించారు. తొలి ఏడాదే 500 బస్తాల ఎండాకులను ప్రజలు ఇతరులకు అందించారట. సోషల్ మీడియా ద్వారా సామాజికోద్యమం ప్రారంభించి ఉండకపోతే ఈ ఆకులన్నిటినీ తగులబెట్టి ఉండేవారని ఆమె సంతోషంగా చెబుతారు. అయితే, రెండో ఏడాదికి ఆకులను ఇతరులకిస్తాం అనే వారు లేకుండా ΄ోయారట. అంటే అందరూ కం΄ోస్టు తయారు చేసుకోవడం, దానితో కుండీలలో సేంద్రియ ఇంటిపంటలు పండించడం ప్రారంభించారన్న మాట! https://brownleaf.org -
రొయ్యల సాగు: సక్సెస్ సీక్రెట్ ఇదే!
రొయ్యల పెంపకం విజయవంతానికి సీడ్ (పిల్లల) నాణ్యతే కీలకమైన అంశం. టైగర్, వెనామీ వంటి సాగుకు అనువైన రొయ్యల జాతుల వలన ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఒక ముఖ్య పరిశ్రమగా మారింది. చెరువుల్లో రొయ్యల పెరుగుదల, ఆరోగ్యం, బతుకుదల అనేవి నీటి నాణ్యత, చెరువు నిర్వహణ పద్ధతులు, సీడ్ సాంద్రత, మేత నాణ్యత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి. చెరువులో రొయ్య పిల్లలు ఎలా పెరుగుతున్నా యనేది అర్థం చేసుకోవడం దిగుబడిని పెంచడానికి, నష్టాలను తగ్గించడానికి, సుస్థిరత్వానికి ముఖ్యమైన అంశం. చెరువులోని నీటి వాతావరణ పరిస్థితులకు రొయ్యల సీడ్ అలవాటు పడే ప్రక్రియపై శ్రద్ధచూపటం చాలా అవసరం. ఈ ప్రక్రియనే ఎక్లిమటైజేషన్ అంటారు. హేచరీలు, చెరువుల మధ్య ఉష్ణోగ్రత, లవణీయత వంటి నీటి నాణ్యత గుణాలలో ఆకస్మిక మార్పులు గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తాయి. ఇది రొయ్యలలో శారీరక, ప్రవర్తనా సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల చెరువుకు అలవాటుచేయడం, ఈ మార్పులకు రొయ్యలు క్రమంగా సర్దుబాటు అవడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి అధికమైతే మరణాలకు దారితీస్తుంది లేదా పెరుగుదల కుంటుపడుతుంది. రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటు చేయటం ఒక క్లిష్టమైన అంశం. హేచరీలలో రొయ్యపిల్లలు స్థిరమైన, నియంత్రిత ఉష్ణోగ్రతలో పెరుగుతాయి. అయితే చెరువుల్లో వాతావరణ మార్పులు, నీటి ప్రవాహం కారణంగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలినప్పుడు ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రొయ్యల సీడ్‌ను ఒకవిధమైన ’షాక్’ కు గురి చేస్తుంది. వాటి జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమై వ్యాధులకు గురి చేస్తుంది.అదేవిధంగా, హేచరీ, చెరువు మధ్య లవణీయత (సెలినిటి) హెచ్చుతగ్గులు కూడా ఒత్తిడిని కలిగిస్తాయి. క్రమంగా అలవాటు చేస్తే రొయ్య పిల్లలు చెరువు నీటి లవణీయతకు సర్దుకోగలుగుతాయి. మరో ముఖ్యమైన అంశం నీటిలోని ఆక్సిజన్ స్థాయి. రొయ్యల ఆరోగ్యం, పెరుగుదలను ప్రోత్సహించడానికి హేచరీలు ఎయిరేషన్ ద్వారా అధిక స్థాయిలో ఆక్సిజన్‌ను అందిస్తాయి. అయితే, చెరువుల్లో ఆక్సిజన్ స్థాయి నీటి ఉష్ణోగ్రత, సంఖ్య వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. రొయ్యల సీడ్‌ను చెరువులో సరిగ్గా అలవాటు చేయకపోతే అకస్మాత్తుగా తక్కువ ఆక్సిజన్ స్థాయిలున్నపుడు అవి ఒత్తిడికి గురవుతాయి. అలాగే, పిహెచ్ హెచ్చుతగ్గులు స్టాకింగ్ సమయంలో పోస్ట్–లార్వాల బ్రతుకుదలపై ప్రభావం చూపెడతాయి. కాబట్టి వాటిని సర్దుబాటు చేయాలి. చెరువు నీటిని విత్తన సంచులకు క్రమంగా కలపడం, తరువాత నెమ్మదిగా చెరువులోకి రొయ్య పిల్లలను విడుదల చేయడం మేలు.చెరువు నీటికి సరిగ్గా అలవాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. మెరుగైన బతుకుదల 2. మంచి పెరుగుదల 3. వ్యాధి నియంత్రణ లేదా తక్కువ వ్యాధి ప్రమాదాలు4. పర్యావరణ ఒత్తిడి ప్రభావం తగ్గుదల 5. ఖర్చు తగ్గటం6. మెరుగైన ఉత్పాదకతచెరువులో రొయ్యల విత్తనాలను ప్రవేశపెట్టే ముందు, ఉష్ణోగ్రత, పిహెచ్, లవణీయత, నీట కరిగిన ఆక్సిజన్ స్థాయి వంటి కీలక నీటి గుణాలు రొయ్యలకు సరైన స్థాయిలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. వెనామీ రొయ్యలకు అనువైన పరిస్థితులు: ఉష్ణోగ్రత: 28–32 డిగ్రీల సెల్షియస్పిహెచ్: 7.5–8.5లవణీయత: 15–35 పిపిటి (స్థానిక పరిస్థితులను బట్టి)నీటిలో కరిగిన ఆక్సిజన్: 5 పిపిఎం కన్నా తక్కువచెరువు పరిస్థితులు, హేచరీ నీటి మధ్య ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నట్లయితే, సీడ్ వేయడానికి ముందు సర్దుబాట్లు చేయవలసి ఉంటుంది (ఉదా.. మంచినీరు, ఎయిరేషన్ మొదలైనవి). రవాణా సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి రొయ్యల సీడ్ ను ( పోస్ట్–లార్వాలు) శుభ్రమైన, ఆక్సిజన్ ఉన్న బ్యాగ్‌లు లేదా ఫైబర్ కంటైనర్లలో రవాణా చేయండి. బ్యాగ్‌లు/కంటెయినర్ల రవాణా సమయంలో ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు రొయ్యలకు హాని కలిగిస్తాయి. పర్యావరణ ఒత్తిడికి ఎక్కువ కాలం గురికావడం సీడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి రొయ్యల విత్తనాల రవాణా వేగంగా జరిగేలా చూడండి.రొయ్యల సీడ్‌ను చెరువుకు అలవాటుచేసే ప్రక్రియసాగు చేసే ప్రదేశానికి రొయ్య పిల్లలను చేర్చిన తర్వాత, బ్యాగులను తాడు/కర్రల సహాయంతో చెరువు ఉపరితలంపై కట్టి ఉంచండి. ఉష్ణోగ్రతల సర్దుబాటుకు ఇది సహాయపడుతుంది. తర్వాత సీడ్ బ్యాగ్‌లను తెరిచి క్రమంగా చెరువు నీటిని సీడ్ బ్యాగ్‌లలోకి ప్రవేశపెట్టండి. ప్రతి 10–20 నిమిషాలకు 10–20% చొప్పున కంటైనర్/బ్యాగ్‌లో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పిహెచ్, ఉష్ణోగ్రత, లవణీయతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది.కొనుగోలు చేసిన పి.ఎల్. సంఖ్య నీటి గుణాల వ్యత్యాసాల పరిధిని బట్టి కొన్ని గంటల పాటు ప్రక్రియను కొనసాగించండి. ఈ సమయంలో నీటి నాణ్యత గుణాలను నిరంతరం గమనించండి. థర్మామీటర్, రిఫ్రాక్టోమీటర్, పిహెచ్ మీటర్లను ఉపయోగించండి.చెరువు నీటిలోకి చేరిన రొయ్య పిల్లలు ఆహారం తీసుకోకపోవడం, అనారోగ్యం పాలవటం, మరణాలు పెరగడం వంటి ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు గమనిస్తే.. చెరువు నీటికి వాటిని అలవాటు ప్రక్రియను మరింత నెమ్మదిగా చేయండి లేదా నీటి గుణాలను తగిన రీతిలో మార్చండి. చెరువులోకి రొయ్యలను నెమ్మదిగా వదలండి. రొయ్య పిల్లలను ఒకేసారి చెరువు నీటిలోకి వేసెయ్యకుండా చిన్న బ్యాచ్‌లుగా విడుదల చేయండి.రొయ్య పిల్లలను చెరువు అంతటా సమానంగా పంపిణీ చేయండి. వాటికి షెల్టర్, ఆక్సిజన్, తగిన ఫీడింగ్ జో¯Œ లు అందుబాటులో ఉంచండి. విడుదల చేసిన తర్వాత, మొదటి కొన్ని రోజులు చెరువు నీటి నాణ్యతను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ఉష్ణోగ్రత, లవణీయత లేదా ఆక్సిజన్ స్థాయి స్థిరంగా ఉండేలా చూసుకోండి.రొయ్యల పరిమాణం, వయసుకు తగిన మేత షెడ్యూళ్లను అమలుచేయండి. నీటి నాణ్యత క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి అతిగా మేత ఇవ్వడం మానుకోండి. ఫీడ్ కంపెనీల ద్వారా సరఫరా చేయబడిన ఫీడ్ చార్ట్‌లను అనుసరించండి. మేత తినే తీరు, కదలికలను గమనించడం ద్వారా రొయ్యల ఆరోగ్యాన్ని గమనించండి. ఆరోగ్యకరమైన రొయ్యలు చురుకుగా తింటాయి. ప్రశాంతంగా ఈత కొడతాయి. ఒత్తిడికి సంబంధించిన ఏవైనా సంకేతాలు ఉంటే తక్షణమే పరిష్కరించాలి. ్ర΄ారంభ రోజుల్లో రొయ్య పిల్లలు చిన్నగా ఉంటాయి. స్పష్టంగా కనిపించవు కాబట్టి ఇది చాలా కష్టమైన ప్రక్రియ.చెరువు నీటికి అలవాటు చేసే ప్రక్రియలో రొయ్య పిల్లలు వ్యాధికారక క్రిములకు గురికాకుండా చూసుకోండి. వ్యాధుల ప్రవేశాన్ని నివారించడానికి రవాణాలో, చెరువు నిర్వహణ పద్ధతుల్లో సరైన పరిశుభ్రతను పాటించండి. చెరువు నీటి నాణ్యత గుణాలు, రొయ్యల ఆరోగ్య వివరాలను ‘రికార్డ్’ చేయండి. ఈ సమాచారం సమస్యలను పరిష్కరించడంలో, భవిష్యత్తులో రొయ్యల సాగులో తగిన మెళకువలు తీసుకోవడానికి సహాయపడుతుంది. మరికొన్ని సూచనలు: నీటి గుణాలను సర్దుబాటు చేస్తే రొయ్య పిల్లలు క్రమంగా, సాఫీగా చెరువుకు అలవాటు పడతాయి. ఆక్సిజన్ తగినంత అందేలా చూడండి. ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్య పిల్లలను బ్యాచ్‌ల వారీగా రవాణా చేసి, నెమ్మదిగా చెరువు నీటిలోకి విడుదల చేయండి. రొయ్యలు, చెరువు వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోవడానికి విడుదల చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు వాటి ఆరోగ్యాన్ని, ప్రవర్తనను నిశితంగా గమనించండి.చాలా మంది రైతులు రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసి, త్వరగా చెరువులో వేసుకోవాలని ఆత్రంగా వ్యవహరిస్తుంటారున. నెమ్మదిగా చేపట్టాల్సిన ఈ కీలక ప్రక్రియను పట్టించుకోరు. కాబట్టి, రొయ్యల పంట విజయానికి ఉత్తమమైన ప్రారంభాన్ని ఇవ్వటం ముఖ్యం. ఈ ప్రక్రియలో సీడ్‌ను చెరువుకు అలవాటు చేయడమే కీలకఘట్టం. రొయ్యల సీడ్ ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో హేచరీ/ల్యాబ్‌లోని ఒత్తిడి పరీక్షలు సహాయపడతాయి. – డా. పి. రామమోహన్‌రావు (98851 44557), కాకినాడ -
వర్టికల్ టవర్ గార్డెన్‌ను ఇలా మీరే తయారు చేసుకోవచ్చు!
వర్టికల్ టవర్ గార్డెన్ ఇంటిపంటల సాగుదారులకు చాలా ఉపయోగకరం. మేడ మీద లేదా బాల్కనీలో, ఇంటి పెరట్లో అతి తక్కువ స్థలంలో (కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట) ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక్కో బారెల్లో 60 రకాల ఆకుకూరలు, కూరగాయలు, కషాయాల కోసం ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. బారెల్ మధ్యలో ఉండే పీవీసీ పైపులో వంటింటి వ్యర్థాలు వేస్తూ.. వర్మీ కం΄ోస్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ టవర్ గార్డెన్లను సేంద్రియ ఇంటిపంటలపై ఆసక్తి, ఓపిక ఉన్న వారు తమంతట తాము తయారు చేసు కోవచ్చు. అదెలాగో హైదరాబాద్‌కు చెందిన వర్టికల్ టవర్ గార్డెన్ నిపుణులు రవి చంద్ర కుమార్ వివరిస్తున్నారు. మార్కెట్లో దొరికే 300 లీటర్ల లేదా 250 లీటర్ల హెచ్.డి.పి.ఇ. బారెల్ తీసుకోవాలి. బారెల్ పొడవు 36 అంగుళాలు. బారెల్‌కు చుట్టూతా 5 అంగుళాలకు ఒక చోట కత్తిరిస్తే (దీన్నే పాకెట్ అని పిలుస్తున్నాం).. 7 వరుసల్లో పాక్లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్డంగా ఒక్కొక్క పాకెట్ వెడల్పు 5 అంగుళాలు ఉండేలా కొలత స్కేల్‌తో మార్క్ చేసుకోవాలి. రెండు పాకెట్ల మధ్య 4 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. ఒక వరుసలో 8 పాకెట్ వస్తాయి. 7 వరుసల్లో మొత్తం 56 పాకెట్లు వస్తాయి. బారెల్ పై భాగాన 4 మొక్కలు పెట్టవచ్చు. అన్నీ కలిపి 60 మొక్కలు పెట్టుకోవచ్చు. అంటే ఒక బారెల్ 60 కుండీలతో సమానం అన్నమాట! పాకెట్ ఎక్కడ పెట్టుకోవాలో మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసిన చోట బారెల్ను డ్రిల్ మెషిన్‌తో కత్తిరించి చిల్లు పెట్టాలి, జిగ్సా రంపం పట్టడం కోసం. జిగ్సా తో వరుసలల్లో మార్క్ చేసిన చోట్ల 5 అంగుళాల వెడల్పున కట్ చేయాలి. పాకెట్ మౌల్డింగ్ చేసే విధానం.. హీట్ గన్‌తో కట్ చేసిన ప్రదేశంలో హీట్ చేయాలి. తగిన హీట్ అయిన తరువాత ఆ ప్రదేశంలో చిత్రంలో చూపిన విధంగా సిమెంటు దిమ్మె అమర్చాలి. అలా అన్నిపాకెట్ ను తయారు చేయాలి. బారెల్ అడుగు భాగంలో మధ్యన 4 అంగుళాల రంధ్రం చేయాలి. పక్కన అర అంగుళం రంధ్రం చేయాలి. అధిక నీరు బయటకు వెళ్లడానికి అక్కడ గ్రోమేట్ పెటి టేకాహ్ అమర్చాలి. మధ్యలో 4 అంగుళాల పీవీసీ గొట్టం అమర్చాలి. గొట్టం చుట్టూ చిల్లులు పెట్టాలి. ఇదీ చదవండి: గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలుగొట్టం అమర్చే విధానం.. ఆ గొట్టాన్ని క్రింది భాగాన 6 అంగుళాలు బయటకు ఉండేలా అమర్చి.. అక్కడ ఎంసీల్‌తో అతకాలి. పై భాగాన జీయే వైరుతో కట్టాలి. 4 అంగుళాల గొట్టానికి పైన, కింద మూతలు అమర్చాలి. ఈ బారెల్ను నిలబెట్టడానికి ఇనుప స్టాండ్‌ను తయారు చేసుకోవాలి. స్టాండ్ 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల ఎత్తు ఉండాలి.వర్టికల్ గార్డెన్లో కంపోస్టు తయారు చేసే విధానం : వర్మీ కం΄ోస్టు 30%, రంపపు పొట్టు 30%, పశువుల ఎరువు 30%, వేప గింజల చెక్క 10%.. ఇవన్నీ కలిపి బారెల్లో సరిపడినంత నింపుకోవాలి. బారెల్ మధ్యలో అమర్చిన గొట్టంలో వంటింటి వ్యర్థాలు వేయాలి. అందులో చక్కటి వర్మీకంపోస్టు తయారవుతుంది. స్టాండ్ మీద వర్టికల్ గార్డెన్‌ను అమర్చుకున్న తర్వాత.. అందులో కం΄ోస్టు మిశ్రమాన్ని నింపుకోవాలి. బారెల్ చుట్టూ ఉన్న అరలలో విత్తనాలు నాటుకోవాలి. ఒక్కో వర్టికల్ గార్డెన్ టవర్‌ను తయారు చేసుకోవడానికి (బారెల్, స్టాండ్, టవర్, కం΄ోస్టు, విత్తనాలు.. అన్నీ కలిపి) రూ. 5 వేలు ఖర్చవుతుంది. వర్టికల్ టవర్‌కు రోజుకు కనీసం 4 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోవాలి. ఇందులో అన్ని రకాల ఆకుకూరలు, ఔషధ మొక్కలు చక్కగా పండించవచ్చని రవిచంద్ర కుమార్ తెలిపారు. -
గోకృపామృత సేద్యం, మెరుగైన ఫలితాలు
ఇరవై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఉత్తమ రైతు కరుటూరి పాపారావు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతాపూర్ ఆయన స్వగ్రామం. 8 ఎకరాల్లో పదేళ్లుగా పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. అరెకరంలో వివిధ రకాల పసుపు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. 2012లో బాసరలో సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొని స్ఫూర్తి పొందిన పాపారావు 2015 నుంచి 8.5 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పంట వ్యర్థాలను కాలబెట్టకుండా జనుము, జీలుగతో కలిపి కుళ్లబెట్టి భూమిని సారవంతం చేస్తున్నారు ΄ పాపారావు. తన వ్యవసాయ క్షేత్రంలో 5వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసి బెల్లం, మజ్జిగ, మదర్ కల్చర్ కలిపి గోకృపామృతం.. దేశీ ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగపిండి, పుట్టమట్టి కలిపి జీవామృతం తయారు చేస్తున్నారు. ఈ రెండింటినీ కలిపి పైప్లైన్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. పురుగుల నియంత్రణ కోసం వేప కషాయం, పుల్లటి మజ్జిగ, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు.ఏడాది పాత బియ్యం..పంట నూర్పిడి అనంతరం నిల్వ, ప్రాసెసింగ్ అంతా సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ పోషక సంపన్న ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం రైతు పాపారావు మరో ప్రత్యేకత. వరి పొలం గట్ల మీద కందిని కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. కందులను ఇసుర్రాయితో ఆడించి సహజ విధానంలో పప్పుగా మార్చుతున్నారు. ధాన్యం దిగుబడి రసాయన సాగుతో పోలిస్తే సగమే వస్తోంది. కూలీల అవసరమూ ఎక్కువే. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి గన్నీ బ్యాగుల్లో నింపి ఏడాది పాటు నిల్వ చేస్తున్నారు. నిల్వ సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు వావిలాకు, గానుగ ఆకు, సీతాఫలం ఆకు ధాన్యం బస్తాల వద్ద ఉంచుతున్నారు. ఏడాది దాటిన తరువాత ధాన్యాన్ని ముడి బియ్యం ఆడించి 10 కిలోల సంచుల ద్వారా ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతున్నారు.పచ్చి పసుపు ముక్కలు..పసుపు తవ్విన తరువాత ఉడకబెట్టి, పాలిష్ చేసి అమ్మటం సాధారణ పద్ధతి. అలాకాకుండా, పచ్చిగా ఉన్నప్పుడే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి, నీడలో ఎండబెట్టి పసుపు పొడిని తయారు చేయిస్తున్నారు. ఉడకబెడితే పోషకాలు తగిపోతాయని ఇలా చేస్తున్నానని అంటున్నారు పాపారావు. నల్ల పసుపు, సేలం, కృష్ణ సేలం రకాల పసుపును సాగు చేస్తున్నారు. మునగాకును నీడలో ఆరబెట్టి ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆయన 50 రకాలకు పైగా కూరగాయలు, సుగంధ, ఔషధ, పండ్ల రకాలను సేంద్రియ పద్ధతిలో పండిస్తు న్నారు. తాను పండించే పంటలతో పాటు పప్పులు, బెల్లం, పల్లీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల సేంద్రియ రైతుల నుంచి సేకరించి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పలువురు ప్రకృతి వ్యవసాయదారులను కలుపుకొని వాట్సప్‌లో‘నేచురల్ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్స్ గ్రూపు’ ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయక ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాపారావును ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు పురస్కారంతో అనేక ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు. ప్రకృతి సాగుకు మరింత తోడ్పాటునివ్వాలి అన్ని రకాల పంటలను రైతు పండించి, సంప్రదాయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వినియోగదారుడికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో నా వంతు కృషి చేస్తున్నాను. రైతులు అన్ని రకాల పంటలు పండించాలి. అన్ని పనులూ వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవాలి. ప్రతి రైతూ ఈ లక్ష్యంతోనే ముందుకెళ్లాలి. ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మరింత తోడ్పాటు ఇవ్వాలి. – కరుటూరి పాపారావు (96188 11894), జైతాపూర్, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
ఆచ్ఛాదనతో అధిక దిగుబడి!
సుభాష్ శర్మ(Subhash Sharma) కృషిపై 2018లో, హారిమన్ శర్మ విశేష కృషి గురించి 2017లోనే ‘సాక్షి సాగుబడి’లో కథనాలు ప్రచురించాం. ఈ ఏడాది వీరు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా ఆ కథనాలను పునర్ముద్రిస్తున్నాం.మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాతూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేల తల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పోలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించేవినూత్న పద్ధతిని ఆయన దీర్ఘకాలంగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు..సుభాష్ శర్మకు 66 ఏళ్లు. వ్యవసాయంలో 46 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన ప్రజ్ఞతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దరశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పోలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాది పోడవునా ఏవో కొన్ని రకాల పంటలు సాగు చేస్తుంటారు.పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట పంటల సాగుపత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పంటలు పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసే రైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి.పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది. 2. పోలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపోర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శతృపురుగుల చొప్పున పెరుగుతుంటాయి. మిత్రపురుగులు శతృపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి లేక రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ వివరించారు. ఒక పంట కాలంలో పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట తదుపరి పంట కాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ.. విత్తిన ప్రతిసారీ పంట మార్పిడి చేస్తారు.పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడిపత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్ (సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు సుభాష్ శర్మ. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మతో 94228 69620 హిందీలో మాట్లాడవచ్చు)ఆచ్ఛాదనలోని శాస్త్రీయతను అర్థం చేసుకోవాలిపత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి దీనిలో దాగి ఉన్న శాస్త్రీయతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పోరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రఆచ్ఛాదన వల్ల అనేక ప్రయోజనాలుపంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్ట పంటలను పెంచటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పోలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. ఆ పంటలను కోసి, అక్కడే ఆచ్ఛాదనగా వేస్తే నేలలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్క సాళ్లలో ఉన్న ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్‌లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్‌లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్‌లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్‌రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్‌లో ఫ్యామిలి ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్‌కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
మిద్దె తోట : షేడ్‌నెట్ అవసరమా? కాదా?
మేడపైన ఖాళీ ఉంచకుండా పచ్చని పంటలతో కళకళలాడేలా చూసుకుంటే ఏడాది పొడవునా ఆ కుటుంబం అంతటికీ ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కొంతవరకైనా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు మేడపైన, పెరట్లో ఖాళీ లేకుండా ఇంటిపంటలు సాగు చేసుకోవటం అర్బన్ ప్రాంతాల్లో సొంతి ఇంటి యజమానులకు చాలా వరకు అలవాటైపోయింది. అయితే, వేసవిలో తమ పంటలను రక్షించుకోవటానికి సేంద్రియ మిద్దెతోట / ఇంటిపంటల సాగుదారులు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. షేడ్నెట్లు కట్టడం, గాలిదుమ్ములకు అవి చిరిగి΄ోవటం, ఎగిరి΄ోవటం పరి΄ాటి. అయితే, మండు వేసవిలోనూ షేడ్‌నెట్ అవసరం లేకుండానే పంటల ప్రణాళిక ద్వారా మిద్దె తోటలను సంరక్షించుకోవచ్చు అంటున్నారు సీనియర్ మిద్దెతోట నిపుణులు ‘లతా కృష్ణమూర్తి’.. ‘సాక్షి సాగుబడి’కి ఆమె తెలిపిన వివరాలు.. వచ్చేది ఎండాకాలం. షేడ్‌నెట్‌కు బదులుగా సంవత్సరం పొడవునా దిగుబడి వచ్చే పండ్ల మొక్కలను మిద్దెతోటలో పది అడుగులకు ఒకటి చొప్పున పెద్ద కుండీల్లో పెంచుకుంటే.. వాటి పక్కన చిన్న మొక్కలకు ఎండ నుంచి రక్షణ ఉంటుంది. మిద్దెతోట ఏర్పాటు చేసుకునేటప్పుడే కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా పెట్టుకోవాలి.పండ్ల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు (మొదటి సంవత్సరం) ఎండాకాలం ఉష్ణోగ్రతలకు మొక్కలు తట్టుకోలేకపోయినా రెండో సంవత్సరం నుంచి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మా మిద్దెతోటలో నిర్మించిన ఎత్తుమడుల్లో ప్రతి పది అడుగులకు ఒక పండ్ల చెట్లు పెంచుతున్నాం. మిద్దెతోట వల్ల ఇంటి లోపల చల్లగా ఉంటుంది. బయటి ఉష్ణోగ్రతల కంటే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. మండువేసవిలోనూ ఇంట్లో ఏ.సి. అవసరం ఉండదు. అందువల్ల కరెంట్ వాడకం తగ్గుతుంది. ఖర్చు కలిసి వస్తుంది. అలాగే, ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల కూడా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటంతోపాటు తేమ కూడా రిలీజ్ అయి, గదిలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇవీ చదవండి: పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే... రోజుకు నాలుగు కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా? -
సేద్యంలో మహిళా సైన్యం!
దేవతల స్వంత దేశంగా భావించే భూమిపై తమకంటూ సొంతమైన కుంచెడు భూమి లేని నిరుపేద మహిళలు వారు. కేరళ ప్రభుత్వం ఇచ్చిన చిన్న ఆసరాతో సాగునే నమ్ముకోని వేరే ఉపాధికి నోచుకోని ఆ మహిళలు చేయి.. చేయి కలిపారు. సాగుబాటలో వేల అడుగులు జతకూడాయి. మహిళల నుదుటి చెమట చుక్కలు చిందిన బీడు భూములు విరగపండాయి. పైరు పరవళ్లు తొక్కాయి. వ్యవసాయం లాభసాటి కాదనే మాటలు నీటిమీది రాతలుగా తేలాయి. కేరళలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ సేద్యం జరుగుతోంది. వ్యవసాయంలో మాదే పైచేయి సుమా అంటున్నారు కేరళ మహిళా రైతులు.భూమిలేని మహిళల ఆర్థిక స్వావలంభన కల్పించే దిశగా కేరళ ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమం కుడుంబశ్రీ. కేరళ రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ 1998లో ఊపిరి΄ోసుకున్న ‘కుడుంబ శ్రీ’ కేరళ గడ్డపై మహిళా సంఘటిత శక్తికి ప్రతీకగా ఎదిగింది. ఆ రాష్ట్రం మొత్తం ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ఉపాధి. ముఖ్యంగా తమకంటూ సొంత వ్యవసాయ భూములు లేని కుటుంబాలే ఎక్కువ. స్థానిక సాగు భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించటం వల్ల నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండేది. వ్యవసాయ రంగంలో పనిచేసేది ఎక్కువగా మహిళలే కావటంతో పనులు దొరక్క తీవ్ర ఒడిదుడుకులకు లోనవ్వాల్సివచ్చేది. రాష్ట్ర భూ సంస్కరణల చట్టం కౌలుపై నిషేధం విధించింది. అనధికారికంగా కౌలుకు ఇస్తే తమ భూమిపై అధికారం శాశ్వతంగా కోల్పోతామనే భయం యజమానుల్లో ఉండేది. కూలి పనులు మానుకొని సొంత వ్యవసాయం చేయాలనుకునేవారికి అది అందని ద్రాక్ష అయింది. సంఘటిత శక్తే తారక మంత్రం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోను కేరళ ప్రభుత్వం వెనుకడుగేయలేదు. సామూహిక వ్యవసాయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమిలేని మహిళలకు ΄÷లం, పంటతో అనుబంధం కల్పించటమే లక్ష్య సాధనలో తొలి అడుగుగా కొంతమంది భూమిలేని మహిళలను కలిపి 15–40 మంది మహిళలను కలిపి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, వ్యక్తిగత వ్యవసాయ భూములను గుర్తించి సంఘాలకు దఖలు పరిచారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు సాగులో సేంద్రియ పద్ధతులకు పెద్ద పీట వేశారు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు మహిళా రైతుల కోసం ఏర్పాటు చేశారు. మంచి దిగుబడులను సాధించిన సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించేవారు. అన్ని జిల్లాల్లో 201 క్లస్టర్లలో 10,000 హెక్టార్లలో కుడుంబశ్రీ ఆధ్వర్యంలో సేంద్రియ / ప్రకృతి సేద్యం జరుగుతోంది. నాబార్డు సహకారంతో కుడుంబశ్రీ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. రుణాలు తీసుకోవటం తిరిగి చెల్లించటంలో ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులందరిది ఉమ్మడి బాధ్యత. ఒక్క తిరువనంతపురం జిల్లాలోనే ఆరువేల గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 30 వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఆదునిక పద్ధతుల్లో అరటి సాగుపై కేర ళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన శిక్షణతో తక్కువ కాలంలోనే రెండింతల దిగుబడులు సాధించారు. వనితా కర్మసేన పేరుతో కుడుంబశ్రీ కోసం వ్యవసాయ పరికాలను, యంత్రాలను ఉపయోగించటంలో మహిళలకు శిక్షణ ఇచ్చారు. కొనుగోలుకు రుణాలు ఇచ్చారు. ప్రతి సంఘానికి తమ సొంత పరికరాలు ఉన్నాయి. దీంతో వారే శ్రామికులుగా మారటంతో ఖర్చును ఆదా చేయగలిగారు. పంటను నష్ట΄ోయిన సందార్భాల్లో నాబార్డ్ మహిళా రైతులకు అండగా నిలిచింది. 47 వేల పై చిలుకు సంఘాలు, లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నాయి. జీడిమామిడి, కొబ్బరి, వరి, అరటి, పైనాపిల్ పండ్లతోటలు, ఆకుకూరలు, గుమ్మడి, బఠాణీ, సొర, అల్లం, బెండ, మిరప, వంటి పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. తాము పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించటంతో మంచి లాభాలు కళ్లజూశారు. ఆరు నెలలు తిరగకుండానే రుణాలు తిరిగి చెల్లించారు. ఒక్కో సీజన్లోనే ఈ సంఘాలు రూ. లక్ష వరకు నికరాదాయం ఆర్జించేవి. దీంతో తమకంటూ సొంత ఇళ్లను నిర్మించుకున్నారు. చిన్న వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంకులు గతంలో మహిళలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చేవి కాదు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. 10543 స్వయం సహాయక సంఘాలకు రూ. 123 కోట్ల రుణాలు ఇచ్చారు. ఇప్పుడు బ్యాంకుల దృష్టిలో మహిళారైతులు అంటే మంచి పరపతిగల మహిళలు. (చదవండి: కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..) -
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది. -
తక్కువ ఖర్చుతో...పంటభూమిలో విషానికి బ్యాక్టీరియాతో చెక్
రసాయనిక వ్యవసాయం వల్ల కాలుష్య కాసారంగా మారిపోయిన వ్యవసాయ భూములను తక్కువ ఖర్చుతో, సులభంగా, సమర్థవంతంగా శుద్ధి చేసే కొన్ని జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని ముంబై ఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందుల వల్ల, ఇతరత్రా కాలుష్య కారకాల వల్ల పంట భూములు నాశనమవుతున్న సంగతి తెలిసిందే.విషతుల్య కాలుష్య కారకాలను హరించటంతో పాటు నేలలో ఉన్నప్పటికీ మొక్కలకు అందుబాటులో లేని పోషకాలను అందుబాటులోకి తేవటం ద్వారా పనిలో పనిగా పంట దిగుబడిని కూడా పెంపొందించడానికి ఈ ‘బ్యాక్టీరియా కాక్టెయిల్’ ఉపయోగపడుతున్నదని ముంబై ఐఐటి పరిశోధకులు ప్రకటించారు. ముంబై ఐఐటిలో బయోసైన్సెస్, బయోఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే మార్గ దర్శకత్వంలో సందేశ్ పపడే ఈ పరిశోధన చేశారు. మట్టిలోని విషాలను విచ్చిన్నం చేసి తీసివేయటంతో పాటు ఈ బ్యాక్టీరియా అధికోత్పత్తికి దోహదం చేసే గ్రోత్ హార్మోన్ల పెరుగుదలకు ఊతం ఇస్తున్నాయని, అదేసమయంలో హానికారక శిలీంధ్రాలను అరికడుతున్నాయని, తద్వారా పోషకాల లభ్యత పెరుగుతోందని గుర్తించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందుల వాడకాన్ని తగ్గించటానికి.. నేలల ఆరోగ్యం, ఉత్పాదకశక్తిని పెంపొందించడానికి ఉపయోడపడుతోందని ప్రొఫెసర్ ప్రశాంత్ ఫలే వెల్లడించారు. రసాయనిక పురుగుమందులు, తెగుళ్ల మందులలోని బెంజీన్ వంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్ వల్ల నేలలు కలుషితం కావటం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఈ సమ్మేళనాలు విషతుల్యమైనవి. విత్తనం మొలక శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. పంట మొక్కల ఎదుగుదలకు, దిగుబడికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ధాన్యాలు, గింజల్లో, మొక్క భాగాల్లో ఈ విషతుల్యమైన సమ్మేళనాలు చేరి΄ోతాయి. కార్బారిల్, నాఫ్తలిన్, బెంజోయేట్, 2,4–డ్రైక్లోరోఫెనాక్సియేసెటిక్ ఆసిడ్, థాలేట్స్‌ను పురుగుమందుల్లో విస్తృతంగా వాడుతున్నారు. సౌందర్యసాధనాలు, దుస్తులు, నిర్మాణ రంగం, ఆహార రంగంలో వాడే ప్రిజర్వేటివ్స్, అద్దకం, పెట్రోలియం, ప్లాస్టిక్ ఉత్పత్తి రంగాల్లో కూడా ఈ విషతుల్యమైన సమ్మేళనాలను వాడుతున్నారు. వీటి వల్ల మట్టి, నీరు, గాలి కలుషితం అవుతున్నాయి. అయితే, ఈ కలుషితాలను తొలగించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రసాయనిక పద్ధతి లేదా కలుషితమైన మట్టిని తొలగించటం వంటి పద్ధతులు అధిక ఖర్చుతో కూడినవే కాక సమస్యను సమూలంగా పరిష్కరించకుండా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తున్నాయి. ఈ దృష్ట్యా సమస్యాత్మక నేలలను శుద్ధి చేసుకోవటానికి ఐఐటి ముంబై పరిశోధకుల కృషి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.సహజ పద్ధతిలో శుద్ధిఘాటైన వాసనలతో కూడిన రసాయనిక విషపదార్థాలను చక్కగా విచ్ఛిన్నం చేయటానికి సూడోమోనాస్, అసినెటోబాక్టర్ తదితర జాతుల బ్యాక్టీరియా ఉపయోగపడుతున్నట్లు గుర్తించారు. ఇవి విషతుల్య సమ్మేళనాలను తిని.. హానికరం కాని, విషరహిత సమ్మేళనాలుగా మార్చుతున్నాయి. ఆ క్రమంలో కలుషిత∙పర్యావరణాన్ని ఇవి సహజంగా శుద్ధి చేస్తున్నాయని ఫలే వ్యాఖ్యానించారు.పెరిగిన పోషకాల లభ్యత ఫాస్ఫరస్, పొటాషియం వంటి నీట కరగని స్థూల పోషకాలను ఈ బ్యాక్టీరియా నీట కరిగేలా చేస్తుంది. తద్వారా పంట మొక్కల వేర్లు అదనపు పోషకాలను పీల్చుకునే అవకాశం కల్పిస్తాయి. నిస్సారమైన భూముల్లో పెరిగే పంట ఐరన్‌ను ఎక్కువగా తీసుకోలేకపోతుంటుంది. ఈ సూక్ష్మజీవులు సైడెరోఫోర్స్ అనే పదార్ధాన్ని విడుదల చేయటం ద్వారా ఐరన్‌ను సరిగ్గా తీసుకునేలా చేస్తాయి. అంతేకాకుండా ఇండోల్ అసెటిక్ ఆసిడ్ (ఐఎఎ) అనే గ్రోత్ హార్మోన్‌ను ఈ బ్యాక్టీరియా విడుదల చేసి దిగుబడిని పెంచుతుంది. ఇంకా ప్రొఫెసర్ ఫలే ఇలా అన్నారు.. ‘సూడోమోనాస్, అసెనెటోబాక్టర్ జెనెరకు చెందిన అనేక జాతుల సూక్ష్మజీవుల మిశ్రమాన్ని వాడిన తర్వాత గోధుమ, పెసర పాలకూర, మెంతికూర తదితర పంటల దిగుబడి 40–45% వరకు పెరిగింది. మట్టిలో రసాయనాలను కొన్ని రకాల బ్యాక్టీరియా విచ్ఛిన్నం చేస్తుంటే, మరికొన్ని సూక్ష్మజీవులు మొక్కల పెరుగుదలను పెంపొందించే హార్మోన్ ఉత్పత్తికి, చీడపీడల బెడద నుంచి దీటుగా తట్టుకునేందుకు ఉపయోగపడుతున్నాయని, కలసికట్టుగా పనిచేస్తే కలిగే ప్రయోజనం ఇదే అన్నారు ప్రొ. ఫలే. -
11న తార్నాకలో సేంద్రియ సంత : పిండివంటలు, చేనేత వస్త్రాలు
గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రీయ సంతను నిర్వహిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణపెరుగుతోంది.సేంద్రీయ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే అవగాహన కూడా బాగా పెరిగింది. ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులు, సంప్రదాయ రుచులు , సహజ ఆహారాలను ఇష్టపడేవారికి ఈ సంత ఒక అవకాశం కావచ్చు. సికింద్రాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణా హాల్లో ఈ నెల 11 (శనివారం)న ఉ. 10 నుంచి సా. 7 గం. వరకు సేంద్రియ/ప్రకృతి ఆహారోత్పత్తుల మూలం సంత జరగనుంది. దేశీ వరి బియ్యం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులు, సంప్రదాయ పిండివంటలు, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు సూర్యకళ తెలిపారు. సంప్రదాయ రుచులతో కూడిన ఆర్గానిక్ భోజనం ఈ సంత ప్రత్యేకత. ఇతర వివరాలకు.. 94908 50766. -
ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!
‘సాక్షి’ పప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ ముందుంచుతున్నారు.జీవామృతం..కావలసిన పదార్థాలు...తాజా(పది రోజుల్లోపు) నాటు లేదా దేశీ ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా పండిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 – 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం... పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు పంచకం వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7–10 రోజుల్లోపు వినియోగించాలి.బూడిద+ పసుపు మిశ్రమంకావలసిన పదార్థాలు...దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి... పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కల΄ాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది.కీటకాల నివారిణి(మల్టీ పెస్ట్ కంట్రోలర్)...కావలసిన పదార్థాలు...పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు పంచకం(డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత.తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది.ఆచ్ఛాదన (మల్చింగ్)కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండి΄ోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టిఉంచగలుగుతుంది. తద్వారా మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.వేప కషాయంకావలసిన పదార్థాలు... తాజా వేపాకులు అర కేజీ, తాజా దేశీ ఆవు పేడ అర కేజీ, దేశీ ఆవు పంచకం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వే΄ాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు పంచకం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజుకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఎగ్ అమైనో ఆమ్లం (ముట్టగయం):కావలసిన పదార్థాలు:నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం ΄ోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచుకోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి. మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో ఆమ్లంను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో ఆసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగ -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్‌కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్‌లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్‌లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్‌కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్‌కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్‌లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్‌లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్‌లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
మంకీ జాక్ గురించి విన్నారా? బోలెడన్ని పోషకాలు, ప్రయోజనాలు
మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది. ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది. మంకీ జాక్‌ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లుపర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు. పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్‌లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్‌ను ఉపయోగిస్తున్నారు. మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలుమంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్‌గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది. పండ్ల ధర కిలో రూ. 175మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు. చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి. భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది. -
ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!
ఉద్యోగం వద్దు వ్యవసాయమే ముద్దు అని అతను నమ్మాడు. సాగులోకి దిగింది మొదలు నిరంతర కృషితో రుషిలా తపించి ఒక అద్భుత మునగ వంగడాన్ని రూపొందించారు. ఈ వంగడం ఖ్యాతి దేశం నలుమూలలకు విస్తరించింది. అధిక దిగుబడులనిస్తూ అళగర్ స్వామికే కాదు అనేక రాష్ట్రాల్లోని వేలాది మంది రైతులకూ కనక వర్షం కురిపిస్తోంది. ఈ ఆవిష్కరణతో అళగర్ స్వామి వ్యవసాయ క్షేత్రం మునగ నర్సరీగా మారిపోయింది.ఏరోజు కారోజు విధులు ముగించుకొని బాధ్యతలు తీర్చుకునే ఉద్యోగం కాదు రైతు జీవితం. అలాగని పంటలు పండించటం, అమ్ముకోవటంతోనే దింపుకునే తల భారమూ కాదు. ఎంత చాకిరీ చేసినా వద్దనని పొలం సముద్రాన్ని ఈదటంలా అనిపిస్తుంటే.. అలసిపోని చేపలా మారి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలిగితేనే రాణింపు, సంతృప్తి. అళగర్స్వామి చేసింది అదే. తమిళనాడు దిండిగల్ జిల్లాలోని పల్లపట్టి గ్రామం స్వామి జన్మస్థలం. ఆర్ట్స్‌లో పీజీ విద్యను పూర్తి చేసిన స్వామి మక్కువతో వ్యవసాయాన్ని చేపట్టారు. మొక్కుబడి వ్యవసాయం చే యకుండా నిరంతరం శాస్త్రవేత్తలతో చర్చిస్తూ ఆధునిక పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ.. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించారు. దిండిగల్ నుంచి మధురైకి వెళ్లే ప్రధాని రహదారి పక్కనే అళగర్ స్వామికి చెందిన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. బీడు భూమిని సాగులోకి తెచ్చే క్రమంలో మునగ వంగడాన్ని రూ పొందించేందుకు కృషిని మమ్మురం చేసి 2002లో ఒక నూతన మునగ వంగడాన్ని ఆవిష్కరించారు. రెండు స్థానిక రకాలను సంకరం చేసి ఈ వంగడాన్ని సృష్టించారు. దీనికి ‘పళ్లపట్టి అళగర్ స్వామి వెళ్లిమాలై మురుగన్’(పీఏవీఎం) అని తన పేరే పెట్టుకున్నారు. తక్కువ నీటితో సాగయ్యే ఈ వంగడం కరవు పరిస్థితులను, చీడపీడలు, తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని మంచి దిగుబడినిస్తుంది. సాగులో ఉన్న రకాలకన్నా అధిక దిగుబడులను ఇస్తుండటంతో ఆనోటా ఈనోటా ప్రచారంలోకి వచ్చిన ఈ వంగడం ఖ్యాతి దేశమంతటా పాకింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు మునగకు పుట్టినిల్లయిన ఉత్తర భారతదేశంలోనూ రైతులు ఈ వంగడం సాగుపై మొగ్గు చూపుతున్నారు. (కంపెనీకి బాండ్ రాశారా? రాజీనామా చేస్తే ఆ బాండ్లు చెల్లుతాయా? )తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది రైతులు 30 వేల ఎకరాల్లో పీఏవీఎం మునగ వంగడాన్ని సాగు చేస్తున్నారు. దాదాపు 90 లక్షల పీఏవీఎం మునగ మొక్కలను అళగర్ స్వామి వివిధ రాష్ట్రాల రైతులకు అందించారు. గ్రాఫ్టింగ్ లేదా ఎయిర్ లేయర్ పద్ధతుల్లో అంట్లు కడుతున్నారు.20 అడుగులకో మొక్క...మునగను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే పద్ధతులను అళగర్ స్వామి అనుసరిస్తున్నారు. పంచగవ్యను కనుగొన్న డాక్టర్ నటరాజన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉంది. పంచగవ్యను క్రమం తప్పకుండా వాడతారు. భూమిని దున్ని సిద్ధం చేసుకున్న తర్వాత.. తూర్పు పడమర దిశలో మొక్కలు, సాళ్ల మధ్య 20 అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు ధారాళంగా లబిస్తుంది. ఎకరాకు 150 నుంచి 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. మునగ మొక్కలు పెళుసుగా ఉంటాయి కాబట్టి రవాణాలోను.. నాటుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. 50 సెం. మీ. లోతు వెడల్పుతో గుంతలు తీసుకోవాలి. 20 రోజుల వయసు మొక్కలను నాటుకొని, గాలులకు పడి పోకుండా కర్రతో ఊతమివ్వాలి. ప్రతి మొక్కకు 5 కిలోల కం΄ోస్టు ఎరువు లేదా 10 కిలోల పశువుల ఎరువు వేసుకోవాలి. కొత్త మట్టితో గుంతను నింపితే మొక్క త్వరగా వేళ్లూనుకుంటుంది. నాటిన మరుసటి రోజు నుంచి రెండు నెలల పాటు నీరుపోయాలి. తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి తగుమాత్రంగా తడులు ఇవ్వాలి. పూత కాత దశలో మాత్రం సమృద్ధిగా నీరందించాలి. మిగతా సమయాల్లో పొలం బెట్టకొచ్చినట్టనిపిస్తే తడి ఇవ్వాలి. వర్షాధార సాగులో నెలకు రెండు తడులు ఇస్తే చాలు. అంతర కృషి చేసి చెట్ల మధ్య కలుపును ఎప్పటికప్పుడు తొలగించాలి. ఒకటిన్నర ఏడాది తర్వాత కొమ్మల కత్తిరింపు చేపట్టాలి. బలంగా ఉన్న నాలుగైదు కొమ్మలను మాత్రమే చెట్టుకు ఉంచాలి. పెద్దగా చీడపీడలు ఆశించవు. పశువుల బారి నుంచి కాపాడుకునేందుకు కంచె వేసుకోవాలి.లక్షల మొక్కల సరఫరా...ఆళ్వార్ స్వామి ప్రస్తుతం మునగ కాయల సాగుపైన కన్నా నర్సరీపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 100 మంది కూలీలతో పల్లపట్టి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు పీఏవీఎం మొక్కలను సరఫరా చేస్తున్నారు. 90 లక్షలకు పైగా మొక్కలను విక్రయించారు. ఏటా రూ. 6 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అళగర్ స్వామి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అందించే ప్రతిష్టాత్మక సృష్టి సమ్మాన్ అవార్డుతోపాటు సీఐఐ అవార్డు, మహీంద్రా టెక్ అవార్డు వంటి దాదాపు వంద అవార్డులు ఆయనను వరించాయి. సిటీ బ్యాంక్ ఉత్తమ ఔత్సాహిక వ్యాపారవేత్త అవార్డుతో సత్కరించడం విశేషం. అద్భుతమైన ఆవిష్కరణతో ఖ్యాతి గడించిన అళగర్ స్వామి స్థానిక గ్రామీణ ఆవిష్కర్తల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ రైతులకు స్ఫూర్తినిస్తున్నారు. ఐదేళ్లలో చెట్టుకు 3 క్వింటాళ్ల దిగుబడి..ఇతర వంగడాలు నాటిన 9 నెలలకు కాపుకొస్తాయి. పీఏవీఎం మునగ ఆరు, ఏడు నెలల నుంచే కాస్తుంది. సాళ్లు, మొక్కల మధ్య 20 అడులు దూరంలో ఎకరానికి 150 మొక్కలు నాటుకోవాలని అళగర్ స్వామి సూచిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచి ఎకరానికి 10 – 15 టన్నుల కాయల దిగుబడి వస్తుంది. ఐదేళ్ల వయసు చెట్టు సగటున ఏడాదికి 300 కిలోల దిగుబడినిస్తుంది. ఐదేళ్ల తోట నుంచి ఏడాదికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. సాధారణ రకాల్లో కాయల దిగుబడి 20 టన్నులే. పైగా అవి ఐదారేళ్ల పాటే నిలకడగా దిగుబడులిస్తాయి. పీఏవీఎం మాత్రం ఏడాదికి 8 –9 నెలల చొప్పున 20–25 ఏళ్లపాటు మంచి దిగుబడి నిస్తుంది. తమిళనాడు రైతులు స్థానిక మార్కెట్లలో కాయ రూ. 5 – 20 చొప్పున విక్రయిస్తున్నారు. ఖర్చులు పోను ఏటా ఎకరాకు రూ. లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు. కొందరు రైతులు కంచె పంటగాను ఈ వంగడాన్ని సాగు చేస్తున్నారు. -
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
6 జిల్లాల్లో శీతల గాలులు: పంటలను ఇలా రక్షించుకుందాం!
తెలంగాణా రాష్ట్రంలో వచ్చే రెండు రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, ఉదయపు వేళల్లో దట్టంగా పొగమంచు ఆవరించే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయ వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. పి. లీలారాణి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులు ఈ కింది సూచనలు పాటించాలని డా. పి. లీలారాణి సూచించారు.వరి: తెలంగాణా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాలలో 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. చలి ప్రభావంతో యాసంగి నారుమడుల్లో నారు ఎదగక పోవచ్చు. ఆకులు పసుపు, ఎరుపు రంగుల్లోకి మారవచ్చు. కొన్నిసార్లు నారు చనిపోవచ్చు. అందువల్ల రైతులు కొన్ని రక్షణ చర్యలు చేపట్టాలి. నారుమళ్ళపై ఇనుప చువ్వలు లేదా వెదురు కర్రలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా ఖాళీ యూరియా బస్తాలతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం పూట కప్పి, మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. రాత్రి వేళల్లో నారుమడిలో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి, కొత్త నీరు పెట్టాలి. ∙200 చదరపు మీటరు విస్తీర్ణం గల నారుమడికి ఆఖరి దుక్కిలో 2 క్వింటాళ్లు బాగా చివికిన కోళ్ళు లేదా గొర్రెల ఎరువు వేయాలి. విత్తే సమయంలో 1 కిలో నత్రజని, 1కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే రసాయనిక ఎరువులు వేయాలి. వరి నారుమళ్ళలో జింక్ ధాతువు లోపం నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరుసగా వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేదా ప్రతి యాసంగిలో దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి. చలి వాతావరణం, పొగమంచు వరిని అగ్గి తెగులు ఆశించటానికి అనుకూలం. పొలంలో, పొలంగట్లపైన ఉండే గడ్డి కలుపు మొక్కలు అగ్గి తెగులను వ్యాప్తి చేస్తాయి. కాబట్టి, పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి. వరి నారుమళ్ళలో అగ్గి తెగులు గమనిస్తే, నివారణకు 0.5 గ్రా. ట్రైసైక్లాజోల్ లేదా 1.5 మి.లీ. ఐసోప్రొథైయోలిన్ లేదా 2.5 మి.లీ. కాసుగామైసిన్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న: చలి వల్ల మొక్కజొన్నలో భాస్వరం లోపించి ఆకులు ఊదా రంగులోకి మారుతాయి. భాస్వరం లోప లక్షణాలు గమనించినట్లైతే నివారణకు 10 గ్రా. 19–19–19 లేదా డి.ఎ.పి మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మిరప : ప్రస్తుత చలి వాతావరణం మిరపను బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 3గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 మి.లీ. అజాక్సిస్ట్రోబిన్ లేదా 2.5గ్రా. టేబుకొనజోల్ + గంధకం లేదా 1.5గ్రా. కార్బండజిమ్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మామిడిలో తేనెమంచు పురుగు, బూడిద తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు, 0.3గ్రా. డైనోటేఫురాన్ + 1గ్రా. కార్బండజిమ్ + 2.5 మి.లీ. వేపనూనె లేదా 0.5 గ్రా. థయోమిథాక్సామ్ + 2 మి.లీ. హెక్సాకొనజోల్ + 2.5 మి.లి వేప నూనె మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కుసుమ: నవంబర్‌లో విత్తుకున్న కుసుమ పంటకు పేనుబంక ఆశించే అవకాశం ఉంది. నివారణకు 2 మి.లీ. డైమిథోయెట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
19 ఏళ్ల ఐటీ ఉద్యోగానికి బై చెప్పి, ప్రకృతి సేద్యంతో లాభాలు
దేశ విదేశాల్లో అధికాదాయాన్నిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో అంతకంతకూ పెరిగే పని ఒత్తిడి, తీవ్ర అసంతృప్తి నుంచి బయటపడటానికి ప్రకృతితో తిరిగి మమేకం కావటం ఒక్కటే మార్గమని మునిపల్లె హరినాద్(52) భావించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి కుమారుడు హరినాద్. 1994లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్ట్రేలియా, అమెరికా, యూకేలలో పనిచేశారు. నెలకు రూ. 1.5 లక్షల జీతంతో మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ 2013లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎడతెగని పని వత్తిడితో నలుగుతూ కుటుంబానికి సమయం ఇవ్వలేని స్థితిలో ఎంత చేసినా సంతృప్తినివ్వని ఉద్యోగాన్ని కొనసాగించటం కన్నా.. సొంతూళ్లో కుటుంబ సభ్యులతో కలసి ప్రశాంతంగా జీవిస్తూ వారసత్వ భూమిలో సాధారణ రైతుగా కొత్త జీవితాన్ని ప్రారంభించటంలో నిజమైన ఆనందం ఉందని ఆయన భావించారు. ముందు నుంచే అధ్యయనంవిదేశాల్లో ఉన్న సమయంలో అక్కడి సూపర్ మార్కెట్లలో లభించే ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారు. ఖర్చు ఎక్కువైనా కల్తీలేని ఆహార పదార్ధాలను తాను కూడా ఎందుకు పండించేలేననే పట్టుదలతో ఇంటర్నెట్లో ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలనే అంశాలపై మూడేళ్లపాటు అధ్యయనం చేశారు. రసాయనిక అవశేషాల్లేని, పోషకాల సమతుల్యతతో కూడిన ఆరోగ్యాదాయకమైన ఆహారాన్ని పండించటమే ముఖ్యమైన పనిగా తలచి ఉద్యోగానికి 2013లో రాజీనామా ఇచ్చారు. ఆ కొత్తలోనే మధురైలో జరిగిన పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరంలో హరినాధ్ పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన ఇతర రైతులతో పరిచయాలు పెంచుకొని వారి క్షేత్రాలను సందర్శించి, వ్యవసాయం చేస్తూ నేర్చుకున్నారు. వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల మాగాణి, అర ఎకరం మెట్టలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. (చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!)దిబ్బపై ఉద్యాన పంటలుమాగాణిలో సార్వాలో వరి, దాళ్వాలో మినుములు, పెసలు, నువ్వులు తదితర పంటలను హరినా«ద్ సాగు చేస్తున్నారు. మాగాణి పక్కనే 3 అడుగుల ఎత్తు దిబ్బగా ఉన్న అరెకరంలో పండ్లు, దుంపలు తదితర పంటలు పండిస్తున్నారు. అరటి, జామ, బొ΄్పాయి, కొబ్బరి, మునగ, కంద, అల్లం, కంద, మద్ది, మామిడి, టేకు పెంచుతున్నారు. తమ ప్రాంతంలో ఖరీఫ్‌లో వరి కోతలు అయ్యాక, రబీలో మొక్కజొన్న పూర్తయ్యాక పంట వ్యర్థాలను ఉత్తరాదిలో మాదిరిగా తగుల బెడుతున్నారని హరినా«ద్ తెలిపారు. గత ఏడాది ఇతర ΄÷లాల నుంచి వ్యాపించిన మంటలకు తమ అరెకరంలోని ఉద్యాన పంటలు కాలిపోయాయన్నారు. గోదావరి ఇసుకలు, కట్టుయానం...ప్రకృతి సేద్యానికి అనువైన దేశీ వరి రకాల సాగుపై హరినాద్ దృష్టి కేంద్రీకరించారు. వ్యవసాయం చేసిన అనుభవం లేక΄ోయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఒక్కో పని నేర్చుకుంటూ నిలదొక్కుకున్నారు. కాశీవిశ్వనాద్ (130 రోజులు) అనే సన్న తెల్ల వరి రకాన్ని 8 ఏళ్ల పాటు వరుసగా సాగు చేశారు. బీపీటీ కన్నా సన్నని ఈ రకం ధాన్యాన్ని పూర్తిగా ప్రకృతి సేద్యంలో ఎకరానికి అత్యధికంగా 25 బస్తాల దిగుబడి పొందారు. ఈ ఏడాది నుంచి 1.25 ఎకరాల్లో గోదావరి ఇసుకలు (110 రోజులు) సాగు చేస్తున్నారు. ఇది తెల్ల, సన్న రకం. త్వరలో నూర్పిడి చేయనున్నారు. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. మరో 1.25 ఎకరాల్లో కట్టుయానం (180 రోజులు) అనే రెడ్ రైస్‌ను సాగు చేస్తున్నారు. ఇది 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావచ్చని చెప్పారు.సంపూర్ణ సంతృప్తి, సంతోషం!ఉద్యోగ బాధ్యతల్లో అసంతృప్తి, పని ఒత్తిడితో ఏదో తెలియని వేదనకు గురయ్యాను. వారానికి 5 గంటలు నిద్రతో సరిపెట్టుకొని, పర్సనల్ పనులనూ మానుకొని, 3–4 నెలల ΄ాటు పనిచేసి ్ర΄ాజెక్టు పూర్తి చేసిన రోజులున్నాయి. డబ్బు వస్తుంది. కానీ, ఆ వత్తిడిమయ జీవితంలో సంతృప్తి, ఆనందం లేవు. గత 9 ఏళ్లుగా కుటుంబీకులతో ఉంటూ ప్రకృతి సేద్యం చేసే భాగ్యం కలిగింది. కుటుంబం అంతా మద్దతుగా నిలిచారు. రసాయనాల్లేకుండా వరి ధాన్యం తొలి ఏడాది 10 బస్తాల దిగుబడి తీయటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు 25 బస్తాల దిగుబడినిచ్చే స్థాయికి ΄÷లం సారవంతమైంది. ఈ ఏడాది జీవామృతం కూడా ఇవ్వలేదు. పూర్తి ప్రకృతి వ్యవసాయం అంటే ఇదే. రైతుగా మారి 6 కుటుంబాలకు ఏడాది ΄÷డవునా ఆరోగ్యదాయకమైన ఆహారం అందిస్తున్నా. అనేక ఆరోగ్య సమస్యలు తగ్గాయని, షుగర్‌ను నియంత్రించటం సులువైందని వారు చెబుతుంటే సంతృప్తిగా ఉంది. సొంతూళ్లో ప్రకృతి సేద్యం సంపూర్ణంగా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోంది. – మునిపల్లె హరినాద్ (93805 16443). మునిపల్లె, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా ఈ ఏడాది జీవామృతమూ లేదు!పొలం దుక్కి చేయటం, రొటోవేటర్ వేయటం, దమ్ము చేయటం వంటి పనులను సొంత చిన్న ట్రాక్టర్‌తో స్వయంగా చేసుకోవటం నేర్చుకున్నారు హరినా«ద్. పచ్చిరొట్ట పంటలను కలియదున్నటం, జీవామృతం పిచికారీ, కాలువ నుంచి తోడుకునే నీటితో కలిపి ఆవు మూత్రం పారించటం చేస్తుంటారు. ఈ సంవత్సరం అవేవీ చెయ్యలేదన్నారు. అయినా, గోదావరి ఇసుకలు రకం ధాన్యం ఎకరానికి 20 బస్తాలకు తగ్గకుండా వస్తాయని సంతోషంగా తెలిపారు. నాట్లు, కలుపు తీత, కోతలు మనుషులతోనే చేయిస్తున్న హరినాద్కు ఎకరా వరి సాగుకు రూ. 35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతోంది. అన్నీ అనుకూలిస్తే రసాయనిక రైతులకు 40–45 బస్తాలు, తనకు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని, అయినా తనకు మంచి ఆదాయమే వస్తున్నదన్నారు. ఆ ప్రాంతంలో అందరూ కౌలు రైతులే. కోత కోసి ఆ రోజే అమ్మేస్తుంటారు. హరినా«ద్ నెలకోసారి ధాన్యం మర పట్టించి కనీసం 6 కుటుంబాలకు నెల నెలా పంపుతూ ఉంటారు. కిలో బియ్యం రూ. వందకు అమ్ముతున్నారు. తాను నిర్ణయించిన ధరకు నేరుగా వినియోగదారులకు అమ్మటం వల్ల తనకు ఇతర రైతుల కన్నా అధికాదాయమే వస్తోందని హరినా«ద్ తెలిపారు. నేలను బాగు చేసుకుంటూ ఇతరులకూ ఆరోగ్యదాయక ఆహారాన్ని అందిస్తున్నానన్న సంతృప్తితో చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. – సయ్యద్ యాసిన్, సాక్షి, పొన్నూరు, గుంటూరు జిల్లా -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
ఎర్ర ఆకులతో అరటి చెట్టు.. ఎక్కడైనా చూశారా?
ఎర్ర అరటి పండు మనకు అక్కడక్కడా కనిపిస్తుంది. అయితే, ఎర్ర ఆకులతో కూడిన అరటి చెట్టు అరుదనే చెప్పాలి. దీని ఆకు మాదిరిగానే కాయ కూడా ఎర్రగానే ఉంటుంది. కర్ణాటకలోని సిర్సికి చెందిన రైతు ప్రసాద్ కృష్ణ హెగ్డే ఈ అరుదైన అరటి వంగడాన్ని సంరక్షిస్తున్నారు. దీనితో పాటు ఆయన మరో 80 అరటి రకాలను తన పొలంలో పెంచుతూ అరటి పంటల్లో వైవిధ్యాన్ని కాపాడుతున్నారు. ప్లాస్టిక్ బనానా అనే మరో రకం కూడా ఈయన దగ్గర ఉంది. దీని ఆకులను భోజనం చేయటానికి వాడతారట. మైసూరులో ఇటీవల 3 రోజుల పాటు సహజ సమృద్ధ, అక్షయకల్ప ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో జరిగిన ‘అరటి పండుగ’ సందర్భంగా ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. 550 అరటి రకాలను సంరక్షిస్తున్న కేరళకు చెందిన వినోద్ నాయర్ 75 రకాల అరటి పండ్లను ఈ ఉత్సవంలో ప్రదర్శించటం మరో విశేషం. వినోద్ నాయర్‌తో పాటు 100 దేశీ అరటి రకాలను సంరక్షిస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను సైతం ఘనంగా సత్కరించారు.ఆహార నిపుణురాలు, రచయిత్రి రత్న రాజయ్య అరటి పండుగలో మాట్లాడుతూ ఏదో ఒకే రకం అరటిని సాగు చేయటం ప్రమాదకరమని, ఏదైనా మొండి తెగులు సోకిందంటే మొత్తం ఆ అరటి రకమే అంతరించిపోతుందన్నారు. భవిష్యత్తు తరాల కోసం అరటి రకాల్లో జీవవైవిధ్యాన్ని మన తరం పరిరక్షించుకోవాలని పలుపునిచ్చారు.ఎర్ర అరటి జగత్ప్రసిద్ధంసహజ సమృద్ధ ఎన్జీవో డైరెక్టర్ జి. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘అరటి బంగారంతో సమానం. అరటి ప్రపంచం పెద్దది. వందలాది వంగడాలున్నాయి. మానవ జీవితంలో పుట్టుక దగ్గరి నుంచి చావు వరకు అనేక సందర్భాల్లో, ఆచార వ్యవహారాల్లో అరటి పండు సాంస్కృతిక అవసరం ఉంటుంది. ప్రతి రకం రుచి, రంగు, సైజు, చెట్టు ఎత్తులో వైవిధ్యభరితంగా ఉంటాయ’న్నారు. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి అరటి రకాలున్నాయి. ఆఫ్రికన్ జంజిబార్ స్ప్రౌట్ లాంగ్ బనానా, ఇండోనేషియా జావా బ్లూ బనానా, హవాయికి చెందిన తెల్ల చారల అరటితో పాటు దక్షిణాసియాకు సంబంధించి ఎర్ర అరటి రకాలు జగత్ప్రసిద్ధి గాంచాయన్నారు.చదవండి: తాటి తేగలతోనూ వంటకాలు!అరటికి భారతదేశం పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో వందల రకాల అరటి వంగడాలు కనిపిస్తాయి. భింకెల్ అనే రకం అరటి చెట్టు ఎత్తయిన దూలం మాదిరిగా ఉంటుంది. కేరళకు చెందిన పొడవాటి రకం అరటి గెలకు వెయ్యి కాయలుంటాయి. ప్రపంచంలోకెల్లా ఇదే అతి పొడవైన అరటి రకం. కొడిగుడ్డు అంత చిన్న అరటి కాయ రకం కూడా ఉంది అన్నారు కృష్ణప్రసాద్. కర్ణాటకకు ప్రత్యేకమైన అరటి రకాలు ఉన్నాయన్నారు. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న కావెండిష్ బ్రీడ్ల అరటి పంటలను సాగు చేయటం ప్రారంభమైన తర్వాత దేశీ వంగడాలు మరుగున పడిపోయాయంటున్నారు కృష్ణప్రసాద్. ఒకే రకం అరటి సాగు చేస్తే పనామా కుళ్లు తెగులు సోకే ముప్పు ఉందని చెబుతూ, ఈ తెగులు సోకిందంటే పంటంతా తుడిచిపెట్టుకుపోవటం ఖాయమన్నారు.కార్డమమ్, నెండ్ర ఆర్గానిక్ సాగుకు అనుకూలంసేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన అరటి పండ్లకు ఈ రోజుల్లో అధిక డిమాండ్ ఉందన్నారు కృష్ణప్రసాద్. సేంద్రియంగా సాగు చేయటం వల్ల భూమి కరువు బారిన పడకుండా ఉంటుంది. రసాయనాలకు ఖర్చుపెట్టే డబ్బు ఆదా అవుతుంది అన్నారాయన. కార్డమమ్, నేండ్ర అరటి రకాలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటానికి అనువైనవే కాక, మార్కెట్ డిమాండ్ రీత్యా కూడా ఇవి మేలైనవని దేశీ విత్తన నిపుణుడు కూడా అయన కృష్ణప్రసాద్ వివరించారు. అరటి సాళ్ల మధ్యన ముల్లంగి, ఆకుకూరలు, గుమ్మడి, బీన్స్, పసుపు, చిలగడదుంప పంటలను సాగు చేసుకోవచ్చని కృష్ణప్రసాద్ వివరించారు. ఇతర వివరాలకు.. 94821 15495. -
తేగలతో వంటకాలు గురించి విన్నారా..?
తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యానపరిశోధనా కేంద్రం అధిపతి, ఆహార–సాంకేతిక విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త డా. పి సి వెంగయ్య (94931 28932) అంటున్నారు. తాటి టెంక నుంచి 21–30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45–60 సెం.మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్ది కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6–12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది. టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా బాగా పెరుగుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వచ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. తేగల పిండి తయారీ ఇలా...తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషద గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్టవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానపెడితే చేదుపోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి. తేగల పిండితో పలు వంటకాల తయారీ పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు. చదవండి: యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశంలో డైవర్స్ కేసు వేస్తే..!తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రోటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి. -
ఈ నెల 12 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళా
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ రైతు సాధికార సంస్థ, ప్రకృతి వ్యవసాయదారుల సేవాల సంఘం సంయుక్తంగా డిసెంబర్ 12 నుంచి 15వ తేదీ వరకు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 5వ విశాఖ ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నాయి. రైతులు, ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయదారులు, ఆహారోత్పత్తుల ఉత్పత్తిదారుల, వినియోగదారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. 12న ఉ. 10 గంటలకు ప్రారంభోత్సవంతో పాటు సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం ఉంటుంది. 13న ఉ. 10 గం.కు ఆరోగ్య అవగాహన సదస్సు, 14న ఆహార ప్రాసెసింగ్‌పై సదస్సు, 15 సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సదస్సు, ముగింపు సమావేశం జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ఇతర వివరాలకు.. 78934 56163, 91001 86522. ఇదీ చదవండి : నిలువు పుచ్చ తోట!అవును..నిజమే! -
నిలువు పుచ్చ తోట!అవును..నిజమే!
నిలువు పుచ్చ తోట, అవును మీరు చదవింది.. ఈ ఫొటోలో చూస్తోంది.. నిజమే! మన పుచ్చ తోటల్లో పాదులు నేలపై పరచుకొని ఉంటాయి. పుచ్చ కాయలు నేలపైనే పెరుగుతాయి కదా. సౌతాఫ్రికాలో ఒక కంపెనీ పాలీహౌస్‌లలో పుచ్చ పాదులు నిలువుగా ఎగబాగుకుతున్నాయి. పుచ్చ కాయలు వాటికి వేలాడుతున్నాయి. ట్రెల్లిస్ పద్ధతిలో పెరిగే టొమాటోల మాదిరిగా ఈ పుచ్చకాయలు వేలాడుతున్నాయి కదూ.. కాండీ బాల్ సీడ్లెస్ పుచ్చకాయలు కిలో నుంచి కిలోన్నర వరకు బరువు పెరుగుతాయి. అదేమాదిరిగా కిలో బరువు పెరిగే స్మైల్ మెలన్స్ (ఇదో రకం కర్బూజ) పండ్లను కూడా నిలువు తోటల్లో పెంచుతున్నారు. టొమాటోలు వంటి కాయలు బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి తీగజాతి మొక్కలు మొయ్యగలుగుతాయి. అయితే, ఇలాంటి నిలువు తోటలో పుచ్చకాయలు, కర్బూజ కాయల బరువు మొక్కలకు భారం కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ నెట్ కవర్లతో కాయలను ప్లాస్టిక్ వైర్లకు కట్టేస్తున్నారు. ‘నిలువు తోటలో పెరిగిన పుచ్చకాయలను మేం త్వరలోనే అమ్మకానికి పెట్టబోతున్నాం. సౌతాఫ్రికా మార్కెట్లో మేమే ఫస్ట్’ అంటున్నారు ఆ కంపెనీ ప్రతినిధి ఫ్రాంకోయిస్ ఫౌరీ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లలో, మేడపై ఇంటిపంటల్లో ట్రెల్లిస్ పుచ్చ, కర్బూజ సాగు సాధ్యమే అని గ్రహించాలి! -
బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?
బ్రెడ్‌ఫ్రూట్ (ఆర్టోకార్పస్ ఆల్టిలిస్) చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. పనస, బ్రెడ్నట్, అంజీర, మల్బరీలకు దగ్గరి జాతికి చెందినదే. తెలుగులో ‘సీమ పనస’, ‘కూర పనస’ అంటారు. ఫిలిప్పీన్స్, న్యూగినియా, మలుకు దీవులు, కరిబియన్ దీవుల ప్రాంతం దీని పుట్టిల్లు. ఇప్పుడు దక్షిణాసియా, ఈశాన్య ఆసియా, పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలు, కరిబియన్, సెంట్రల్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో సాగవుతోంది. ఈ చెట్లకు కాచే కాయలు లేత ఆకుపచ్చని రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కాయలనే (పండుగా కాదు) అనేక రూపాల్లో తింటూ ఉంటారు. పసిఫిక్ దీవుల్లోని ప్రజలు అనాదిగా దీన్ని బ్రెడ్ లేదా బంగాళ దుంపల మాదిరిగా దైనందిన ఆహారంగా తింటున్నారు. బ్రెడ్‌ఫ్రూట్ చెట్లలో విత్తనాలు ఉన్న, లేని రెండు రకాలున్నాయి. ఈ చెట్టు 26 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. అదే చెట్టుకు ఆడ, మగ పూలు పూస్తాయి. లేతగా ఉన్నప్పు లేత ఆకుపచ్చగా, పండినప్పుడు ముదురు పసుపు రంగులో దీని కాయలు ఉంటాయి. తొక్కపైన చిన్నపాటి బుడిపెలు ఉంటాయి. లోపలి గుజ్జు లేత గోధుమ రంగులో చక్కని వాసనతో కొంచెం తియ్యగా ఉంటుంది. దీని కాయలు కిలో నుంచి 5 కిలోల వరకు బరువు పెరుగుతాయి. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్ తినగానే జీర్ణమైపోయేది కాదు. నెమ్మదిగా అరుగుతుంది. దీనిలో కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు, జీర్ణమయ్యే పీచుపదార్థం, ముఖ్యమైన విటమిన్లు, విటమిన్ సి, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లకు కూడా ఇది నెలవు. ఉత్పాదకత, సుస్థిరతఎదిగిన ఒక బ్రెడ్‌ఫ్రూట్ చెట్టు ఏడాదికి 200 కిలోలకు పైగా కాయలు కాస్తుంది. నాటిన తర్వాత వేరూనుకొని బతికితే చాలు. తర్వాత ఢోకా ఉండదు. మొండిగా పెరిగి, కాయలనిస్తుంది. ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని, నిస్సారమైన భూముల్లోనూ బతుకుతుంది. అందువల్లే ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రజలకు కరువు కాలాల్లో కూడా సుస్థిరంగా ఆహారాన్ని అందిస్తుంది. ఎన్నో రకాలుగా తినొచ్చుబ్రెడ్ఫ్రూట్ను పచ్చిగా, లేతగా, పండుగా.. ఇలా ఏ దశలోనైనా తినొచ్చు. పూర్తిగా మగ్గిన పండుకు బంగాళ దుంప రుచి వస్తుంది కాబట్టి అనేక వంటకాలు చేసుకోవచ్చు. పెరిగిన కాయను ఉడకబెట్టుకొని, కుమ్ములో పెట్టుకొని, వేపుకొని, కాల్చుకొని తినొచ్చు. పచ్చి బ్రెడ్‌ఫ్రూట్ కాయలను పిండి చేసి పెట్టుకొని, బేకరీ ఉత్పత్తుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇందులో గ్లుటెన్ ఉండదు కాబట్టి సెలియాక్ జబ్బు ఉన్న వారు కూడా తినొచ్చు. తీపి పదార్ధాల్లో, రుచికరమైన ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవచ్చు. పోషక విలువలుబ్రెడ్ఫ్రూట్లో పోషకవిలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉన్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడే ముఖ్యమైన అమినోయాసిడ్లు, ప్రొటీన్లు, పీచుపదార్థం ఇందులో ఉంటాయి. విటమిన్ సి, బి1, బి5తో పాటు పొటాషియం, రాగి వంటి మినరల్స్ ఉన్నాయి.చదవండి: వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ.. ఆదాయం ఎంతో తెలుసా?ఈ కాయలో కొవ్వు, సోడియం స్వల్పంగా, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కల్లో 4.4 మిల్లీ గ్రాముల సోడియం, 60 గ్రాముల పిండిపదార్థాలు, 2.4 గ్రాముల మాంసకృత్తులు, 227 కేలరీల శక్తి, 24.2 గ్రాముల చక్కెర, 0.5 గ్రామలు కొవ్వు, 10.8 మిల్లీ గ్రాముల పీచు పదార్థం ఉంటాయి. రెండు కప్పుల బ్రెడ్‌ఫ్రూట్ ముక్కలు తింటే ఆ రోజుకు సరిపోయే పొటాషియంలో 23% లభించినట్లే. రోగనిరోధక శక్తిపుష్కలంగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించటం, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచగలగటం బ్రెడ్‌ఫ్రూట్ ప్రత్యేకత. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలను నిర్మూలించటం, దీర్ఘరోగాల బెడదను తగ్గించటంతో పాటు దేహం బరువును తగ్గించుకోవటానికి ఉపకరిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఎముక పుష్టికి దోహదపడుతుంది. విటమిన్ ఎ ఉండటం వల్ల కంటి చూపునకు కూడా మంచిదే. వెంటనే అరిగిపోకుండా క్రమంగా శక్తినిస్తుంది కాబట్టి రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. -
పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?
మీ గార్డెన్లో పేనుబంక (అఫిడ్స్)ను నియంత్రించటం ఒక సవాలుతో కూడుకున్న పని. కానీ, పేనుబంక పురుగులను అదుపు చేయటానికి అనేక ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. మీరు అనుసరించగల కొన్ని సూచనలు:1. మీ మొక్కలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండిముడుచుకున్న ఆకులపై అంటుకునే పదార్థం లేదా స్టెమ్ లేదా ఆకులపై పేనుబంక సోకుతున్న సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో గమనించటం కోసం మీ మొక్కలను తరచుగా తనిఖీ చేయండి. 2. వేపనూనె వాడండి వేప నూనె అఫిడ్స్‌ను నియంత్రిండానికి వాడే సహజమైన పురుగుమందు. లేబుల్ సూచనల ప్రకారం వేప నూనెను నీటితో కలిపి పేనుబంక సోకిన మొక్కలపై పిచికారీ చేయండి. 3.సబ్బు నీరు స్ప్రే చేయండిపేనుబంకను నియంత్రించడానికి తేలికపాటి డిష్ సోప్‌ను నీటిలోకలిపి ప్రభావిత మొక్కలపై స్ప్రే చేయవచ్చు.4. గార్లిక్ స్ప్రే ఉపయోగించండివెల్లుల్లి సహజ క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పేనుబంకను నియంత్రించడంలో సహాయ పడుతుంది. వెల్లుల్లి రసాన్ని నీటితో కలపండి. ప్రభావిత మొక్కలపై పీచికారీ చేయండి.5. ప్రయోజనకరమైన కీటకాలులేడీబగ్స్, లేస్వింగ్, పరాన్నజీవి కందిరీగలు వంటి ప్రయోజనకరమైన కీటకాలు పేనుబంకను వేటాడతాయి. అఫిడ్స్ పురుగుల సంతతిని నియంత్రించడానికి మీ గార్డెన్ లో ఈ కీటకాలు పెరిగేలా చూసుకోండి.6. తోట పరిశుభ్రత పాటించండికలుపు మొక్కలను తొలగించండి. తెగులు సోకిన మొక్కలను తీసి దూరంగా పారవేయండి. పురుగుల ముట్టడిని నివారించడానికి ఎక్కువ ఎరువులు వేయకుండా ఉండండి.7. స్క్రీన్లు, రో కవర్లను ఉపయోగించండిఅఫిడ్స్ మీ మొక్కలను ఆశించకుండా నిరోధించడానికి ఫైన్–మెష్ స్క్రీన్లు లేదా ఫైన్–వెటెడ్ రో కవర్లను ఉపయోగించండి.8.జీవ నియంత్రణపేనుబంకను తినే పక్షులు, సాలె పురుగులు వంటి సహజ మాంసాహారులను ప్రోత్సహించటం ద్వారా జీవ నియంత్రణకు అవకాశం కల్పించండి.9. పర్యవేక్షించండి, పునరావృతం చేయండి మీ గార్డెన్లో మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి. పేనుబంకను సమర్థవంతంగా అరికట్టే నియంత్రణ చర్యలను అవసరాన్ని బట్టి పునరావృతం చేయండి.– హేపీ గార్డెనర్స్ అడ్మిన్ టీం -
వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
ఫిలిప్పో కర్రర 28 ఏళ్ల యువ రైతు. అతనిది ఇటలీలోని ఉత్తరప్రాంతంలోని పర్మ నగరం. ఇటలీలో పెద్ద కమతాలే ఎక్కువ. ఇప్పుడు సగటు వ్యవసాయ క్షేత్రం విస్తీర్ణం సుమారు 11 హెక్టార్లు. అక్కడ కమతాల సైజు పెరుగుతూ వస్తోంది. 2000వ సంవత్సరంలో 5 హెక్టార్లున్న సగటు కమతం విస్తీర్ణం 2010 నాటికి 8 హెక్టార్లకు, తర్వాత 11 హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయక కుటుంబంలో పుట్టిన ఫిలిప్పో చదువు పూర్తి చేసుకొని ఏడేళ్ల క్రితం వ్యవసాయంలోకి దిగాడు. పేరుకు వ్యవసాయమే అయినా వాణిజ్య దృష్టితో సేద్యం చేయటంలో దిట్ట ఫిలిప్పో. అతను పగ్గాలు చేపట్టేటప్పటికి వారి కుటుంబ వ్యవసాయ కంపెనీ పది హెక్టార్లలో పంటలు సాగు చేస్తుండేది. ఈ ఏడేళ్లలోనే 150 హెక్టార్లకు విస్తరించిందంటే యువ రైతు ఫిలిప్పో పట్టుదల, కార్యదక్షతలను అర్థం చేసుకోవచ్చు. 50 హెక్టార్లలో ఇటాలియన్ బసిల్ పంటను పండిస్తున్నాడాయన. బసిల్ తులసి జాతికి చెందిన పంట. ఇందులో తీపి రకం కూడా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో కూడిన సలాడ్లలో కలుపుకొని తింటారు. బసిల్ నుంచి నూనెను కూడా వెలికితీసి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. 1996లో పుట్టిన ఫిలిప్పోను ఆ దేశంలో కొత్త తరం రైతులకు, వాణిజ్య స్ఫూర్తికి ప్రతీకగా యువత పరిగణిస్తున్నారు. ‘నేను ఏడేళ్ల క్రితం మా వ్యవసాయం బాధ్యతలు తీసుకున్నాను. పది హెక్టార్ల పొలానికి బాధ్యత తీసుకున్నాను. మా తాత ప్రాంరిశ్రామిక పద్ధతుల్లో భారీ విస్తీర్ణంలో టొమాటోలు సాగు చేసేవారు (ఇటలీ ఉత్తర భాగంలో ఎక్కువ టొమాటోలే సాగవుతూ ఉంటాయి). బసిల్ పంటను అధిక విస్తీర్ణంలో పెంచడానికి అనువైనదిగా గుర్తించాను. ఇది అధికాదాయాన్నిచ్చే పంట. అయితే, రైతులు కొద్ది విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు. నేను భారీ యంత్రాలు ఉపయోగించటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయటం ప్రారంభించాను. బసిల్ ఆకులను తాజాగా, సువాసనతో కూడి ఉండాలని దీనితో ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఆశిస్తుంటాయి..’ అంటాడు ఫిలిప్పో (బ్రెడ్‌ఫ్రూట్ (సీమ పనస) : లాభాల గురించి తెలుసా?)మనుషులతో కాకుండా భారీ యంత్రాలతో బసిల్ పంట కోతను చేపట్టాలనుకున్నప్పుడు.. తమ పొలంలో మడుల సైజుకు తగిన విధంగా పంట కోత యంత్రాన్ని ఆయన ప్రత్యేకంగా డిజైన్ చేయించి తయారు చేయించాడు. ఫిలిప్పో ఫిలిప్ఫో బసిల్ ఆకును ఆ రంగంలో వేళ్లూనుకున్న 6 కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ‘నేను ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం చదివాను. కానీ, వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం’ అన్నాడు. ‘ఆరుబయట పొలాల్లో విస్తారంగా బసిల్ పంటను నాణ్యమైన దిగుబడి తీసే విధంగా సాగు చేయటం సవాళ్లతో కూడిన పని. అయితే, ఈ పంటలోనే ఎదిగే అవకాశం ఉందని నేను గుర్తించాను. మా కంపెనీ 3 వేల టన్నుల బసిల్ ఆకులను పండిస్తోంది. టన్ను ధర 550 యూరోలు (సుమారుగా రూ. 49 వేలు). అనేక విషయాలపై ఆధారపడి ఈ ధరలో హెచ్చుతగ్గులుంటాయి అనిఫిలిప్పో చెప్పాడు. 50 ఎకరాల్లో ఏడాదికి రూ. 14.66 లక్షల ఆదాయం పొందుతున్నాడు. (పెరటితోటలో పేనుబంకను వదిలించేదెలా?)ఏప్రిల్ రెండోవారంలో బసిల్ విత్తటం ప్రారంభిస్తాం. మొదటి కోత జూన్ రెండోవారంలో మొదలవుతుంది. అక్టోబర్ వరకు కోతలు కొనసాగుతాయి. ‘ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారం వరకు దిగుబడి, నాణ్యత బాగున్నాయి. భారీ వర్షం కురవటంతో పంట దెబ్బతింది.’ అన్నాడు ఫిలిప్పో. పొద్దున్న, సాయంత్రపు వేళల్లో బసిల్ ఆకుల్ని కత్తిరిస్తే వాటి నాణ్యత, రంగు, వాసన బాగుంటాయి. మేం కత్తిరించిన కొద్ది గంటల్లోనే ఫుడ్ కంపెనీకి చేర్చుతాము అని చెప్పాడు. ఇటలీలో ఒకానొక పెద్ద సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ‘ఎలిల్బంక’. ఫిలిప్పో కర్రరకు దీని మద్దతు ఉంది. ఫిలిప్పోకు వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ, వ్యాపారాత్మక దృష్టి అమోఘమైనవి’ అని ఎలిల్బంక ప్రతినిధి ఆండ్రియా కలెఫ్పి ప్రశంసించారు. -
పత్తి చేనులో పప్పులు,కూరగాయలు : ఇలా పండించుకోవచ్చు!
వర్షాధారంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులు బహుళ పంటల సాగుకు స్వస్థి చెప్పి పత్తి, కంది వంటి ఏక పంటల సాగు దిశగా మళ్లటం అనేక సమస్యలకు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు ఈ సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. పత్తిలో పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఆకుకూరలను అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేయటం రైతులకు నేర్పిస్తున్నారు. ప్రధాన పంటపై ఆదాయం పొందుతూనే అంతరపంటలతో కుటుంబ పౌష్టికాహార అవసరాలు తీర్చుకునే దిశగా రైతు కుటుంబాలు ముందడుగు వేస్తున్నాయి.వికారాబాద్ జిల్లాలోని సాగు భూమిలో 69.5% భూమిలో రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. నల్ల రేగడి భూములతో పోల్చుకుంటే ఎర్ర /ఇసుక నేలలు ఈ జిల్లాలో అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో సారం తక్కువ. తేమ నిలుపుకునే శక్తి కూడా తక్కువ. తద్వారా పంట దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ప్రధానమైన పంట కంది. జిఐ గుర్తింపు కలిగిన ప్రఖ్యాతమైన తాండూర్ కంది పప్పు గురించి తెలిసిందే. పదేళ్ల క్రితం వరకు వికారాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో కంది, పెసర, నువ్వు, పచ్చ జొన్న, బొబ్బెర, కొర్ర, అనుములు, మినుములు, పత్తి, మొక్క జొన్న వంటి పంటలు పండించేవారు. అయితే, ప్రస్తుతం వర్షాధార భూముల్లో 60% వరకు పత్తి పంట విస్తరించింది. రబీలో ప్రధానంగా బోర్ల కింద వేరుశనగ, వరి పంటలు సాగులో ఉన్నాయి. (రూ. 40 వేలతో మినీ ట్రాక్ట్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ)ఒక పొలంలో అనేక పంటలు కలిపి సాగు చేసే పద్ధతి నుంచి ఏక పంట సాగు (మోనోకల్చర్) కు రైతులు మారటం వల్ల చీడపీడలు పెరుగుతున్నాయి. రైతు కుటుంబాలు రోజువారీ వాడుకునే పప్పులు, కూరగాయలను కొనుక్కొని తినాల్సిన పరిస్థితి నెలకొంది. వాసన్ స్వచ్ఛంద సంస్థ ఈ సమస్యలకు పరిష్కారాలు వెదికే దిశగా కృషి చేస్తోంది. దౌలతాబాద్, దోమ, బోమరసపేట మండలాల్లో అరక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, ఇతర సహకార సంఘాలతో కలసి పనిచేస్తోంది. పత్తిలో అంతర పంటల సాగుపై సలహాలు, సూచనలు అందిస్తూ రైతులకు తోడుగా ఉంటూ వారి నైపుణ్యాలు పెంపొదిస్తోంది. పత్తి ప్రధాన పంటగా 5 సాళ్లు, పక్కనే 6వ సాలుగా కంది.. వీటి మధ్య బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు విత్తుతున్నారు. 3–4 నెలల్లో ఈ పంటల దిగుబడి చేతికి వస్తోంది. ఆ పంటల కోత పూర్తయ్యాక ఎండు కట్టెను పత్తి పొలంలోనే ఆచ్ఛాదనగా ఉపయోగిస్తున్నారు. టైప్ 2 ఘన జీవామృతం వేయటంతో పాటు ప్రతి 15–20 రోజులకు ద్రవ జీవామృతం, కషాయాలు పిచికారీ చేస్తున్నారు. దీంతో తొలి ఏడాదిలోనే రైతులు సత్ఫలితాలు పొందుతున్నారని వాసన్ ప్రతినిధి సత్యం (83175 87696) తెలిపారు. మా కుటుంబంలో అమ్మ, నా భార్య, ఇద్దరు పిల్లలు ఉంటాం. ఐదు ఎకరాల పొలం ఉంది. 8 బోర్లు వేసినా రెంటిలోనే నీరు పడింది. ఒకటి 2 ఇంచులు, మరొకటి 1 ఇంచు నీరు ఇస్తున్నాయి. సాధారణంగా 2 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, కంది, అలాగే కూరగాయలు సాగు చేస్తుంటాను. 2024 ఫిబ్రవరి, మే నెలల్లో వాసన్ సంస్థ నిర్వహించిన రెండు శిబిరాలకు హాజరై శిక్షణ తీసుకున్నాను. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే సాగు పద్ధతులు, తక్కువ వర్షం అవసరం ఉన్న పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ ఖరీఫ్‌లో 1 ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశాను. పంటల సాగుకు ముందు అనేక రకాల పచ్చిరొట్ట పంటలు సాగు చేసి రొటోవేటర్‌తో నేలలో కలియదున్నాను. జులై 3వ తేదీన పత్తి, కంది, బొబ్బర, పెసర, మినుములు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలు వేశాను. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పట్టుదలతో పాటించాను. నా ప్రయాణంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. విత్తనాలు వేయడం, కషాయాలు, ద్రవ, ఘన జీవామృతాల వాడకం వంటి అన్ని విషయాల్లో వాసన్ సంస్థ వారు నాకు సూచనలు ఇచ్చారు. విత్తనాలు వేసిన నెల నుంచే ఏదో పంట చేతికి రావడం ప్రారంభమైంది, మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా చేశారు. ఇంట్లో మేము తినటానికి సరిపడా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు వచ్చాయి. మిగిలినవి అమ్ముకొని మంచి ఆదాయం పొందాం. కానీ, ఈ ఏడు అధిక వర్షాల కారణంగా పత్తి 6 క్వింటాళ్లే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట రాలేదు. ఈ పప్పు ధాన్యాలు, నూనె గింజలు సంవత్సరమంతా మా కుటుంబానికి పోషకాహారాన్ని అందిస్తున్నాయి. ఈ ఎకరానికి రూ. 29,400 ఖర్చయ్యింది. పత్తి, కంది పంటలన్నీ పూర్తయ్యే నాటికి ఆదాయం రూ. 96,500లు వస్తుందని అనుకుంటున్నాను. ఈ వ్యవసాయ పద్ధతి మా కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మాకు ఆదాయం బాగుంది. అలాగే, నీటి వినియోగాన్ని తగ్గించడంలో ఈ పద్ధతులు మాకు ఎంతో సహాయపడ్డాయి.– అక్కలి శ్రీనివాసులు (96668 39118), రైతు,దోర్నాలపల్లి, దోమ మండలం, వికారాబాద్ జిల్లా ప్రకృతి సేద్యంతో ఆదాయం బాగుందివికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన బందయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల పొలంలో 6 సార్లు బోర్లు వేసినా ఒక్క బోరులోనే 2 ఇంచుల నీరు వస్తోంది. కుటుంబం తిండి గింజల కోసం ఎకరంలో వరి నాటుకున్నారు. మిగిలిన 1.5 ఎకరంలో వర్షాధారంగా జొన్న, పత్తి, కందులను రసాయనిక పద్ధతిలో సాగు చేసేవారు. పెద్దగా ఆదాయం కనిపించేది కాదు. వాసన్ సంస్థ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పత్తి పంట సాగుపై రెండుసార్లు శిక్షణ పొంది సాగు చేపట్టారు. ఒక పంట నష్టమైతే మరొక పంటలో ఆదాయం వస్తుందని తెలుసుకున్నారు. ఒక ఎకరంలో పత్తితో పాటు పప్పుదినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను అంతర పంటలుగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేశారు. విత్తనం వేయటం నుంచి, కషాయాలు పిచికారీ, ద్రవ – ఘన జీవామృతాల వినియోగం, పంట కోత విధానం.. ఇలా ప్రతి పనిలోనూ వాసన్ ప్రతినిధుల సూచనలు పాటించారు. మొదటి నెల నుంచి ఆకుకూరలు, 3 నెలల్లో మినుము, పెసర, కూరగాయలు, చిరుధాన్యాలు.. ప్రతినెలా ఏదో ఒక పంట చేతికి రావడంతో సంతోషించారు. ఇంట్లో తినగా మిగిలినవి అమ్మటం వల్ల అదనపు ఆదాయం కూడా వచ్చింది. పత్తి 7 క్వింటాళ్లు, కందులు 4–5 క్వింటాళ్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకసారి నీటి తడి ఇచ్చారు. నేల మొత్తం పంటలు పరుచుకోవడం వల్ల నీటి అవసరం చాలా తగ్గిందని బందయ్య తెలి΄పారు. పత్తిలో అంతరపంటలు వేసిన ఎకరానికి పెట్టుబడి రూ. 28 వేలు. కాగా, ఇంట్లో వాడుకోగా మిగిలిన పప్పుధాన్యాలు, చిరుధాన్యాల అమ్మకంపై వచ్చిన ఆదాయం రూ. 13,750. పత్తి, కందులపై రాబడి (అంచనా) రూ. 1,01,000. ఖర్చులు ΄ోగా రూ. 86,750 నికరాదాయం వస్తుందని భావిస్తున్నారు. అధిక వర్షం వలన పత్తి పంట కొంత దెబ్బతిన్నప్పటికీ మిగతా పంటల్లో వచ్చిన దిగుబడులు సంతోషాన్నిచ్చాయని, వచ్చే ఏడు కూడా ఈ పద్ధతిలోనే పత్తి, అంతర పంటలు సాగు చేస్తానని బండి బందెయ్య అంటున్నారు. -
రూ. 40 వేలతో మినీ ట్రాక్టర్ , ఇంట్రస్టింగ్ స్టోరీ
పెద్దగా చదువుకోకపోయినా సృజనాత్మక ఆలోచన, పట్టుదలతో కూడి కృషితో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పటానికి ఈ మినీ ట్రాక్టర్ ఓ ఉదాహరణ. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన పెంచల నారాయణ (25) వెల్డింగ్ పనిచేస్తూ జీవిస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న నారాయణ చిన్న రైతుల కోసం కేవలం రూ.40 వేల ఖర్చుతో మినీ ట్రాక్టర్‌ను తయారు చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఆటో ఇంజన్ తదితర విడిభాగాలను జత చేసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించారు. 2 లీటర్ల డీజిల్‌తో ఎకరా పొలం దున్నేయ వచ్చునని నిరూపించారు. ΄ పొలం దున్నడంతో పాటు నిమ్మ, జామ వంటి పండ్ల తోటల్లో అంతర సేద్య పనులను ఈ మినీ ట్రాక్టర్‌తో అవలీలగా చేసుకోవచ్చని నారాయణ వివరించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో కూడిన మినీ ట్రాక్టర్‌ను అందిస్తానని పెంచల నారాయణ అంటున్నారు. కాన్సెప్ట్ బాగుంది: గణేశంపల్లెసృజన అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ బాగుంది. ఏమీ తెలియని ఒక అబ్బాయి నడిచే మోటరు వాహనాన్ని తయారు చేయడం సులభం కాదు అన్నారు. ‘రోడ్డు మీద బాగానే నడుస్తోంది. చిన్న ఇంజన్‌తో దుక్కిచేయటం వంటి శక్తితో కూడుకున్న పనులను ఏయే రకాల భూముల్లో ఈ చిన్న టాక్టర్ ఎంతవరకు చేయగలుగుతుందో చూడాలి’ అన్నారాయన. – కే.మధుసూధన్, సాక్షి, పొదలకూరు -
కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని తగ్గించటం ఎలా?
వ్యాధి నిర్ధారణ అయిన కోళ్లకు, వాటి పక్కన ఉన్న కోళ్లకు చికిత్స చేయడానికి మాత్రమే యాంటీబయాటిక్స్ ఉపయోగించండి. వీటిని మేత ద్వారా కంటే నీటిలో కలిపి ఇస్తే బాగా పనిచేస్తాయి. యాంటీబయాటిక్ ఔషధాలను వ్యాధి నివారణకు లేదా కోళ్ల పెరుగుదలను పెపొందించడానికి ఉపయోగించవద్దు.కోళ్ల షెడ్లోకి వచ్చే సందర్శకుల సంఖ్యను పరిమితం చేయండి. లోపలికి వెళ్లే ముందు బట్టలు, చెప్పులు/బూట్లు మార్చుకోవాలి. చేతులు కడుక్కోవాలి. ఆవరణలోకి ప్రవేశించే ముందు వాహనాలను క్రిమిసంహారకాలతో శుభ్రపరచండి. వ్యాధులను వ్యాపింపజేసే ఎలుకలు, పురుగులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు కోళ్ల ఫారాలల్లోకి రానివ్వకండి. నాణ్యతతో కూడిన మంచి వ్యాక్సిన్లను ఉపయోగించండి. తయారీదారు సూచించిన విధంగా వాటిని నిల్వ చేయండి, జాగ్రత్తగా వాడండి.మీ ఫౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ల ఆరోగ్యాన్ని, ప్రవర్తనను ప్రతిరోజూ తనిఖీ చేయండి. వాటిల్లో అకస్మాత్తుగా లేదా క్రమంగా వస్తున్న మార్పులను వెంటనే గుర్తించండి. చనిపోయిన పక్షులను తొలగించి పారవేయండి.గాలి, వెల్తురు, మేత, నీటి సరఫరా, కోళ్ల సంఖ్య (స్టాకింగ్ డెన్సిటీ) ఇతర విషయాలకు సంబంధించి నిపుణుల సిఫార్సులను అనుసరించండి.కోళ్లకు వేసే మేత నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి. మేతలో తగినంత శక్తినిచ్చే దినుసులు, ఖనిజాలను సమతుల్యంగా ఉండాలి. మేతను జాగ్రత్తగా నిల్వ చేయండి. మొక్కలు, గింజలతో కూడిన మేతను ఇవ్వటమే మేలు.ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్, సుగంధ తైలాలు, ఆర్గానిక్ యాసిడ్స్, నీటకరగని పీచు కోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి పేగులలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తాయి. సూక్ష్మక్రిములను నిరోధిస్తాయి. పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.చదవండి: మనం తింటున్న ఆహార నాణ్యత ఎంత?మీ ఫౌల్ట్రీ షెడ్‌ను, పరికరాలను క్రిమిసంహారకాలతో శుభ్రం చేసిన తర్వాత.. మురికిని శుభ్రంచేయటానికి డిటర్జెంట్లు లేదా వేడి నీటిని ఉపయోగించండి. ప్రతి బ్యాచ్ తర్వాత తగినన్ని రోజులు షెడ్‌ను ఖాళీగా ఉంచండి.కొత్తగా కోడి పిల్లలను తెచ్చుకునేటప్పుడు విశ్వసనీయమైన హేచరీల నుంచి తెచ్చుకోండి. టీకాలు వేసి, వ్యాధులు సోకని తల్లి కోళ్ల నుంచి పుట్టిన పిల్లలనే ఎంచుకోండి.కోడిపిల్లలను తెచ్చిన వెంటనే మేతను, నీటిని అందించండి. వాటికి అవసరమైన అన్ని పోషకాలు ఇవ్వండి. శారీరక అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేయండి.చదవండి: కుమ్ఖాత్ పండు.. పోషక విలువలు మెండుశుభ్రమైన, మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉండేలా చూసుకోండి. నీటి సరఫరా గొట్టాలను తరచుగా శుభ్రపరచండి. డ్రింకింగ్ లైన్లను వారానికోసారి శుభ్రపరచండి.మరిన్ని ముఖ్యాంశాలుకోడి పిల్లలకు మొదటి నుంచే అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యకరమైన కోడి పిల్లలను మాత్రమే పెంచండి. మీ కోళ్ల ఫారాన్ని సిద్ధం చేయండి.మేతలో ప్రత్యేక పోషకాలు కలిపి ఇవ్వండి.మేత ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.సౌకర్యవంతమైన వాతావరణం కల్పించండి.ప్రతి రోజూ కోళ్లను పరిశీలించండి.సకాలంలో టీకాలు వేయండి.గట్టి జీవ భద్రతా చర్యలు పాటించండి. యాంటీ బయాటిక్స్‌ను తగుమాత్రంగా వాడండి.అధిక నాణ్యత గల నీరివ్వండి. -
రైతు లాభాలకు పంట మార్పిడి ఊతం!
వ్యవసాయం ఆశల జూదమంటారు. సకాలంలో వానలు కురవకపోవడం మొదలుకొని వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా రకరకాల కారణాలు రైతును దెబ్బతీయవచ్చు. అయితే ఇవేవీ రైతు నియంత్రణలో ఉన్న అంశాలు కావు. కానీ.. రైతులు తమ చేతుల్లో ఉన్నవీ సక్రమంగా చేసుకోకపోవడంతో కూడా నష్టపోతున్నాడని అంటున్నారు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ జి.పద్మజ. పైగా ఈ విషయం గురించి తెలియని వారు ఉండరని, ఆచరణలో పెట్టకపోవడం వల్ల రైతులు కనీసం 25 శాతం పంట దిగుబడిని నష్టపోతున్నాడని చెబుతున్నారు. ఏంటా విషయం. దిగుబడి నాలుగో వంతు పెరిగే మార్గమేది? ఒక్క ముక్కలో చెప్పాలంటే... పంట మార్పిడి!అంతేనా అని అనుకోకండి.. రైతు ఆదాయాన్ని పెంచుకునేందుకు పంట మార్పిడి అద్భుతమైన సాధనం. పైగా రసాయనిక ఎరువుల ధాటికి నానాటికీ తీసికట్టుగా మారుతున్న నేల సారానికి టానిక్గానూ పనిచేస్తుంది ఇది. దురదృష్టం ఏమిటంటే.. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మన మన రైతన్నలు పంట మార్పిడిని సీరియస్‌గా తీసుకోవడం లేదని అంటున్నారు డాక్టర్ జి.పద్మజ. ఈ నేపథ్యంలో అసలు పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను ఇంకోసారి తరచి చూద్దాం...భూసారం, దిగుబడులు పెరుగుతాయి..వరి, మొక్కజొన్న, పత్తి వంటి వాణిజ్య పంటలు మట్టిలోని పోషకాలను తగ్గిస్తూంటాయి. దీనివల్ల ఏటికేడాదీ దిగుబడి కూడా తగ్గుతూంటుంది. అయితే.. పంటలను మార్చి మార్చి వేసుకోవడం అది కూడా మట్టిలో నత్రజనిని చేర్చగల వాటిని వేసుకోవడం ద్వారా పోషకాలను మళ్లీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా నేల సారం పెరుగుతుంది. దిగుబడులు కూడా ఎక్కువవుతాయి. ఉదాహరణకు.. వేరుశనగ, పప్పుధాన్యాల పంటలు మట్టిలో నత్రజనిని పెంచుతాయి. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నేల నుంచే తగినంత నత్రజని అందుతుంది. కృత్రిమంగా అందించాల్సిన అవసరం తగ్గుతుంది కూడా. పంట మార్పిడి చేసుకోవడం వల్ల దిగుబడి సుమారు 25 శాతం వరకూ పెరుగుతుందని పరిశోధనలు చెబుతూండగా.. వరి, మొక్కజొన్న, కాయధాన్యాల విషయంలో ఈ పెరుగుదల 20 శాతమని ఇప్పటికే స్పష్టమైంది. మార్పిడులు ఇలా...వరి వేసిన తరువాత మినుములు లేదా నువ్వుల్లాంటి నూనెగింజల సాగు చేయడం మేలు. దీనివల్ల నేలలో నత్రజని మోతాదు పెరగడమే కాకుండా.. చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశనగ లేదా కాయగూర పంటలతో మార్పిడి చేసుకోవడం మేలు. ఒకవేళ ప్రధాన పంటగా వేరు శనగ వేస్తూంటే.. తరువాతి పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. ఇది నేలలో సేంద్రీయ పదార్థం మోతాదులను కూడా పెంచుతుంది. పత్తి పంటకు మార్పిడిగా పెసలు వేస్తే చీడపీడల బెడద తగ్గుతుంది. నేలలో నత్రజని మోతాదు ఎక్కువ అవుతుంది. ప్రధాన పంటల సాగు తరువాత కాయధాన్యాలను సాగు చేయడం.. వ్యర్థాలను మళ్లీ నేలలో కలిపేస్తే మేలు కలిగించే సూక్ష్మజీవులు కూడా ఎక్కువవుతాయి. వేర్వేరు పంటల సాగు వల్ల రైతు ఆదాయమూ పెరుగుతుంది. రైతుకు ఎంతవరకూ లాభం...?పంట మార్పిడిని తగు విధంగా అమలు చేస్తే రైతు ఆదాయం 15 నుంచి 20 శాతం ఎక్కువ అవుతుంది. ఒక సంవత్సరంలో వేర్వేరు పంటలు సాగు చేస్తారు కాబట్టి మార్కెట్ రిస్క్ తక్కువ అవుతుంది. పైగా ఎక్కువ డిమాండ్ ఉన్న, ఆదాయం అందించే కూరగాయల్లాంటివి సాగు చేసుకునే వీలేర్పడుతుంది. పైగా పంట మార్పిడి వల్ల నేలలో నత్రజని మోతాదు ఎక్కువై ఇన్పుట్ ఖర్చులు 10 - 15 శాతం వరకూ తగ్గుతాయి. అంటే రసాయన ఎరువులు, క్రిమి, కీటకనాశినుల వాడకం తగ్గుతుందని అర్థం. పంటలు మార్చి మార్చి సాగు చేయడం వల్ల చీడపీడలకు అవకాశాలూ తగ్గుతాయి. ఒకే రకమైన పంట సాగు చేస్తూంటే చీడపీడలు కూడా వాటికి అలవాటు పడిపోతాయి కాబట్టి సమస్య ఎక్కువవుతుంది. ఉదాహరణకు వరికి సోకే కాండం తొలుచు పురుగు కాయధాన్యాల మొక్కలపై జీవించలేదు. వరి తరువాత ఈ కాయధాన్యాల సాగు చేస్తే సహజసిద్ధంగా చీడపీడల సమస్య తగ్గిపోతుంది. దేశంలో వ్యవసాయంపైనే ఆధారపడిన అరవైశాతం గ్రామీణుల జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు, ఆహార భద్రతకు పంట మార్పిడి అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. భూసారం, దిగుబడులు పెంచే పంటమార్పిడి గ్రామీణ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యేందుకు తద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కారణమవుతుంది. ఆసక్తి లేదు ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో రైతులు పంటమార్పిడిపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. మొదటిది పంట మార్పిడి వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన లేకపోవడమైతే.. రెండోది పంట మార్పిడి ప్రయోజనాలపై తగిన ప్రచారం లేకపోవడం. వ్యవసాయ, హార్టికల్చర్ విస్తరణాధికారులు ఇతర బాధ్యతలు నిర్వర్తించరావడం వల్ల వారు రైతులకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. ఇక మూడో కారణం మార్కెట్, ఆర్థిక పరిమితులు. పంటల మార్పిడి వల్ల వేర్వేరు పంటల విత్తనాలు, ఎరువులు, కొన్నిసార్లు వ్యవసాయ పరికరాల అవసరమూ ఏర్పడుతుంది. ఇవి రైతులపై కొంత ఆర్థిక భారం మోపే అవకాశం ఉంటుంది. పైగా అన్ని రకాల పంటలకు మద్దతు ధర లభించని నేపథ్యంలో రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపడం లేదు. చివరగా.. ఒకే రకమైన పంటలు వేయడం (మోనోక్రాపింగ్) అనే సంప్రదాయానికి రైతులు గుడ్ బై చెప్పాలి. రిస్క్ తక్కువన్న అంచనాతో అప్పటివరకూ ఇతరులు పాటిస్తున్న పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వల్ల పంట మార్పిడికి ధైర్యం చేయలేకపోతున్నారు. గ్రామస్థులంతా మూకుమ్మడిగా పంట మార్పిడి తీర్మానం చేసుకుని ఆచరిస్తే బహుళ ప్రయోజనాలు కలుగుతాయి.చేయాల్సింది ఇది...రైతులందరూ పంట మార్పిడిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. అలాగే పైలెట్ ప్రోగ్రామ్‌తోపాటు డెమాన్స్ట్రేషన్ల ద్వారా వ్యవసాయ అధికారులు పంట మార్పిడి లాభాలు రైతుకు అర్థమయ్యేలా వివరించాలి. సీజన్‌ను బట్టి మారిపోయే పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పుధాన్యాలతోపాటు నూనెగింజల పంటల విత్తనాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా.. మద్దతు ధరలు దక్కేలా చూడటం. మార్కెట్ ఒడిదుడుకులను వీలైనంత మేరకు తగ్గించడం ద్వారా రైతులు పంట మార్పిడిపై ఆసక్తి చూపేలా చేయాలి. చివరగా..విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా పంటల మార్పిడి అనేది దేశంలో లక్షలాది రైతు కుటుంబాల ఆదాయాన్ని పెంచే, ఆహార భద్రత కల్పించే సాధనంగా మారుతుంది!తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి పంటల సాగు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూండగా వార్షిక దిగుబడి కోటీ అరవై లక్షల టన్నుల వరకూ ఉంది. అలాగే తెలంగాణలో మొక్కజొన్న సాగు 28 లక్షల ఎకరాల్లోనూ, వేరుశనగ దాదాపు అరవై వేల ఎకరాల్లోనూ సాగులో ఉంది. రైతులందరూ పంట మార్పిడి చేపట్టడం ద్వారా దిగుబడులు పెరగడంతోపాటు సాగునీటిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. -
మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది?
హరిత విప్లవానికి పట్టుగొమ్మ వంటి పంజాబ్ రాష్ట్రంలో రైతులు పునరలోచనలో పడ్డారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు అత్యధిక మోతాదులో వాడుతూ ఏడు దశాబ్దాలుగా మార్కెట్ కోసం వరి, గోధుమ వంటి పంటలు పండిస్తూ వచ్చిన రైతులు.. ఆ ఆహారం తిని తమ కుటుంబ సభ్యులు వ్యాధిగ్రస్తులుగా మారుతుండటాన్ని గురించారు. తమ కుటుంబం కోసమైనా రసాయనాలు వాడకుండా పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించుకోవటమే ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గమని పంజాబ్ రైతులు ఎట్టకేలకు గ్రహిస్తున్నారు.తేజ్‌పాల్ సింగ్ 30 ఎకరాల ఆసామి. పొలం అంతా (గత సెప్టెంబర్‌లో) పచ్చని వరి పంటతో నిండి ఉంది. పటియాలా జిల్లా కక్రాల గ్రామ పొలిమేరల్లోని తన వరి పొలానికి 4 టన్నుల యూరియా వేశానని, పురుగుల మందు ఒకసారి చల్లానని చెప్పారు. ఇది మార్కెట్లో అమ్మటం కోసం అతను పండిస్తున్నాడు. ఈ పంట అమ్మటం కోసం కాదుఈ ప్రధాన పొలానికి పక్కనే అతనిదే 4 ఎకరాల పొలం మరొకటి ఉంది. అందులో కొంత మేరకు వరి పంట, దాని పక్కనే కూరగాయల తోట కూడా ఉంది. ‘ఈ 4 ఎకరాల పంట అమ్మటం కోసం కాదు, మా కుటుంబం కోసమే పూర్తిగా సేంద్రియంగా పండిస్తున్నా. పచ్చిరొట్ట ఎరువు, వర్మీకంపోస్టు, జీవన ఎరువులు ఈ పొలంలో వాడుతున్నా. మా కుటుంబం తినగా మిగిలినవి ఏమైనా ఉంటే అమ్ముతా’ అన్నారు తేజ్‌పాల్ సింగ్.ఈ మార్పు ఎందుకొచ్చిందని అడిగితే.. మూడేళ్ల క్రితం తన భార్య అనారోగ్యం పాలైంది. టెస్ట్ చేయిస్తే యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. ఆ రోజుల్లో మరో దగ్గరి బంధువుకు కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి మనం తింటున్న ఆహారం నాణ్యత ఎలా ఉంది అని ఆలోచించటం మొదలు పెట్టాడు. తాను రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తుల్ని పరీక్ష చేయించాడు. యూరియా, పొటాష్, పురుగుమందుల అవశేషాలు ప్రమాదకర స్థాయిలో ఆ ఆహారంలో ఉన్నట్లు తేలింది.మా కోసం ఆర్గానిక్ పంటలు‘అప్పుడు నేను నిర్ణయించుకున్నా. మా కుటుంబం తినేదంతా సేంద్రియ పద్ధతుల్లోనే పండించుకోవాలని గట్టి నిర్ణయానికొచ్చా. అప్పటి నుంచి ఈ 4 ఎకరాల్లో మా కోసం ఆర్గానిక్ పంటలు పండించుకొని తింటున్నాం. నా భార్య దేహంలో యూరిక్ యాసిడ్ తగ్గింది. మేం తింటున్న సేంద్రియ ఆహారం రుచిగా, నాణ్యంగా ఉంది. ఈ ఆహారం అంతకు ముందు తిన్న దానికన్నా ఎంతో మేలైనదని మాకు అర్థమైంది’ అన్నారు తేజ్‌పాల్ సింగ్. ఇది ఆయన ఒక్కడి మాటే కాదు. తినే ఆహారంలో రసాయనాల అవశేషాల్లేకపోతే ఆరోగ్యం బాగుంటుందని గట్టిగా గుర్తించిన రైతులు చాలా మందే కనిపిస్తున్నారంటే ఆశ్చర్యం లేదు.చదవండి: సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?కొద్ది నెలల క్రితం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. పంజాబ్‌లో 2023–24లో ఎకరానికి 103 కిలోల రసాయనిక ఎరువులు వాడారు. దేశవ్యాప్తంగా రైతులు వాడుతున్న 58 కిలోలతో పోల్చితే ఇది దాదాపుగా రెట్టింపు. 1980–2018 మధ్యలో పంజాబ్ రైతులు వాడిన ఎన్‌పికె ఎరువులు ఏకంగా 180% పెరిగిందట.దీనికి తగ్గట్టే జబ్బులూ పెరిగాయి. ఐసిఎంఆర్ సంస్థ నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం.. పంజాబ్‌లో 2021లో 39,521 మంది కేన్సర్ బారిన పడితే.. అది 2024 నాటికి 42,288కి పెరిగింది. పొలాల్లో రసాయనాల వాడకం పెరగటానికి, మనుషుల్లో జబ్బులు పెరగటానికి మధ్య సంబంధం స్పష్టంగానే కనిపిస్తోంది. ఇది పంజాబ్ రైతులు, వినియోగదారులూ గుర్తిస్తున్నారు. మన సంగతేంటి? -
అంతర్జాతీయ సహకార మహాసభ.. ఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?
పరస్పరం సహకరించుకోవటం మానవ సహజ లక్షణం. ఈ లక్షణాన్ని ఒక పద్ధతి ప్రకారం కొనసాగించడానికి సహకార సంఘాలు (కోఆపరేటివ్ సొసైటీలు) దోహదం చేస్తాయి. ప్రపంచ సహకార వ్యవస్థకు 130 ఏళ్ల చరిత్ర, సుసంపన్న వారసత్వం ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 12% మంది ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులే. మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, వందేళ్లకు పైబడి చక్కగా ఆర్థిక సేవలందిస్తున్న ఘనమైన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పిఎసిఎస్‌లు), సహకార అర్బన్ బ్యాంకులు అనేకం కనిపిస్తాయి. ఈ నెల 14 నుంచి సహకార వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరో రెండు ముఖ్య విశేషాలు... ఈ నెల 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా అంతర్జాతీయ సహకార మహాసభ జరగబోతోంది.అంతర్జాతీయ మహాసభ మన దేశంలో జరగటం ఇదే మొదటిసారి. సుమారు రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఐక్యరాజ్యసమితి 2025వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం’గా ప్రకటించింది. ఈ పండుగకు కూడా ఈ నెల 25న ఉత్సాహపూరిత వాతావరణంలో న్యూఢిల్లీలో తెర లేవనుంది. సహకార విలువలకు తిలోదకాలు, అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగం.. వంటి అవశ్యం వదిలించుకోవాల్సిన జాఢ్యాలు మన సహకార వ్యవస్థను పట్టి పీడిస్తున్నప్పటికీ.. మొక్కవోని సహకార స్ఫూర్తి మన సమాజంలో అనుక్షణం వర్థిల్లుతూనే ఉంటుంది. సహకారం కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది! ఈ నేపథ్యంలో తలపండిన సహకారవేత్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. సహకార సంఘం అంటే?సభ్యుల ప్రయోజనాలను నెరవేర్చటమే లక్ష్యంగా పనిచేసే ప్రజాస్వామిక సంస్థ సహకార సంఘం. యాజమాన్యం, నియంత్రణ, నిర్వహణ అన్నీ సభ్యులదే. సభ్యుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చటమే సహకార సంఘాల ధ్యేయం. సహకారం రాష్ట్ర సబ్జెక్ట్.. కేంద్రం చట్టాలు ఎలా చేస్తుంది?ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య, ఒక దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించటానికి సహకార వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో సహకార వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉంది. నెదర్లాండ్స్‌లో సహకార సంఘాలకు స్వేచ్ఛ ఎక్కువ. అధికారుల జోక్యం ఉండదు. ఫ్రాన్స్‌లో 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు వాణిజ్య బ్యాంకులు నిలవలేక సహకార బ్యాంకుల్లో విలీనమయ్యాయి. అమెరికాలోనూ కమ్యూనిటీ బ్యాంకులు బలంగా ఉన్నాయి. జర్మనీలో రైతులకు ఎక్కువ రుణాలిస్తున్నది సహకార బ్యాంకులే. న్యూజిలాండ్‌లో డెయిరీ కోఆపరేటివ్లదే రాజ్యం. లాటిన్ అమెరికాలో ఇటీవల కోఆపరేటర్లు బలపడుతూ కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నారు.జవాబుదారీతనం ఏదీ?మన దేశంలో సహకార విస్తరణకు అవకాశాలెక్కువ. మన సంస్కృతిలోనే సహకార స్ఫూర్తి ఉంది. గ్రామీణులు, గిరిజనుల్లో ఇది మరీ ఎక్కువ. అయితే, అధికారులకు అధిక పెత్తనం ఇవ్వటం, జవాబుదారీతనం లేకుండా చేయటం వల్ల మన దేశంలో సహకార వ్యవస్థ దెబ్బతింటున్నది. ఆర్బీఐ నిబంధనలు, సహకార చట్టాల మధ్య వైరుధ్యం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను కుంగదీస్తోంది. సహకార విలువలను తుంగలో తొక్కేలా కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు, మల్టీస్టేట్ కోఆపరేటివ్‌ల విషయంలో రాష్ట్ర సహకార చట్టాలు నిర్దేశించే నిబంధనలకు భిన్నమైన నిబంధనలను బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నిర్దేశిస్తోంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు షేర్ క్యాపిటల్ తిరిగి ఇవ్వొద్దని, డైరెక్టర్ల పదవీ కాలం నాలుగేళ్లేనని (సహకార చట్టాల ప్రకారం 5 ఏళ్లు).. ఇలా అనేక విషయాల్లో వైరుధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 45 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 20 బ్యాంకులు వందేళ్ల క్రితం నుంచి ఉన్నవే. ఇవి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక తోడ్పాటునూ పొందటం లేదు. పిఎసిఎస్‌లలో బ్యాంకింగ్ సేవలా?సహకారం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్. రాష్ట్రాలతో చర్చించకుండానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలు చేస్తోంది. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలతో ఇంకో 25 పనులు చేయించాలని కేంద్ర సహకార శాఖ నిర్దేశించింది. ఇందులో బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయి. నిధులు దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షించేదెవరూ అంటే సమాధానం లేదు. ఇది సరికాదు. అమలు చేయాల్సింది రాష్ట్రాలైనప్పుడు సహకార రిజిస్ట్రార్, ముఖ్య కార్యదర్శితో కనీసం చర్చించకుండానే కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే ఎలా? సహకార సంస్థల్లో అక్రమాలకు బాధ్యులను జవాబుదారీ చేయటం లేదు. ఎంత అవినీతి జరిగినా రాష్ట్ర ప్రభుత్వాలు అరెస్టులు, ఆస్తుల రికవరీ వంటి చర్యలు తీసుకోవటం లేదు. సహకార శాఖకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ జవాబుదారీతనం లేకుండా΄ోయింది. – మానం ఆంజనేయులు పూర్వ అధ్యక్షులు, విశాఖ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పూర్వ ఉపాధ్యక్షులు, నాఫ్కాబ్ కేంద్రం తెచ్చిన కొత్తచట్టాలతో చేటుభారతీయ ఆర్థిక రంగంలో సహకార వ్యవస్థ వాటా 43% వుంది. రైతులు, గ్రామీణ చేతివృత్తిదారులు, బలహీన వర్గాలు ఈ సహకార వ్యవస్థలో భాగస్వాములు. గత 75 సంవత్సరాలుగా 29 కోట్ల మంది సభ్యులు తమ ఖర్చులు తగ్గించుకొని రూ.40,689 కోట్ల మూలధనంతో సుమారు 9 లక్షల సహకార సంఘాలను స్థాపించుకున్నారు. రూ. లక్షల కోట్ల సహకార ఆర్థిక సౌధాన్ని నిర్మించారు. దీన్ని అక్రమంగా పెట్టుబడిదారుల పరం చేయటానికి పార్లమెంటులో రెండు చట్టాలు చేశారు. వీటిని అమలుచేస్తే జిల్లా స్థాయి సహకార బ్యాంకుల నుంచి ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్ వంటి పెద్ద సంస్థలన్నీ కారుచౌకగా పెట్టుబడిదారుల పరం అవుతాయి. సహకార సిద్ధాంతాలకు, సహకార సూత్రాలకు ఇది విరుద్ధం. మొత్తంగా భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని రాజ్యాంగ సవరణ చేయకుండానే ఈ చట్టాలు మార్చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతులై వీటిని అడ్డుకోవాలి. సహకార ధర్మపీఠం తరఫున దేశవ్యాప్త ప్రచారోద్యం చేపట్టాం. – సంభారపు భూమయ్య , సీనియర్ సహకారవేత్త, సహకార ధర్మపీఠం, హైదరాబాద్సహకార సంస్థల బలోపేతానికి దోహదంఅంతర్జాతీయ సహకార మహాసభ న్యూఢిల్లీలో ఈ నెలాఖరులో జరుపుకోవటం సంతోషదాయకం. దేశంలో సహకార సంస్థలన్నీ బలోపేతం కావటానికి, ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించడానికి అంతర్జాతీయ మహాసభ ఉపయోగపడుతుంది. సహకార సంఘాలు చాలా వరకు వ్యవసాయ ఉత్పాదకాల సరఫరా వరకే పరిమితం అవుతున్నాయి. ప్రాసెసింగ్, విలువ జోడింపు, ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించటం, ఉత్పత్తుల బ్రాండింగ్ చేసుకోవాలి. ఆన్లైన్, సొంత అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలి. రైతుల ప్రయోజనమే పరమావధిగా ముల్కనూర్ సొసైటీ 60 ఏళ్లుగా ఇటువంటి అనేక సేవలు అందిస్తోంది. గోదాములు నిర్మించటం, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సహకార సంఘాలకు ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలిచ్చి ప్రోత్సహించాలి. శిక్షణపై దృష్టి కేంద్రీకరించాలి. సహకార సంఘాల సభ్యులు, సిబ్బంది, బోర్డు సభ్యులకు సహకార విలువలు, వాణిజ్య, నిర్వహణ నైపుణ్యాల పెంపుదల శిక్షణకు కృషి చెయ్యాలి.– అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, అధ్యక్షులు, ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘం, తెలంగాణఒకే రంగానికి రెండు చట్టాలెందుకు?సహకార రంగం ఆర్థిక పురోగతి బాగానే వుంది. కానీ, నడక సరిగ్గా లేదు. సహకార మూల సూత్రాలకు సహకార వ్యవస్థ దూరమైంది. సహకార విద్య, సహకార విలువలకు సంబంధించిన కనీస జ్ఞానం కొరవడిన యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగునాట సహకార వ్యవస్థ నడుస్తోంది. సహకార హక్కులు, బాధ్యతలు తెలియని దుస్థితి. 12 నెలలు శిక్షణ పొందినవారే సహకార సంస్థల్లో సిబ్బందిగా వుండాలన్నది నియమం. చదవండి: ఫ్యామిలీ ఫార్మింగ్.. విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణఇప్పుడున్న సహకార సిబ్బందిలో 90 శాతం సరైన శిక్షణ లేనివారే. ఉద్యోగం చేస్తూ మూడు నెలలు, ఆరు నెలల డిప్లొమా అంటూ సర్టిఫికెట్లు పొందిన వారే ఎక్కువ కనిపిస్తున్నారు. వీరిని నడిపించే ఉన్నతోద్యోగుల పరిస్థితి కూడా ఇంతే! ఏ ఇతర రంగాల్లోనూ లేనివిధంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 1964, 1995 సహకార చట్టాలు అమల్లో ఉన్నాయి. ఒకే రంగానికి రెండు చట్టాలేమిటి? 1904, 1912,1932, 1964 సహకార చట్టాలకు రూల్స్ ఉన్నాయి. కానీ, 1995 చట్టం అమల్లోకి వచ్చి 29 ఏళ్లయినా ఇప్పటికీ రూల్స్ లేవు. రిజిష్ట్రార్ బాధ్యతలపై కూడా స్పష్టమైన నిబంధనల్లేవు.– దాసరి కేశవులు, సీనియర్ సహకారవేత్త, చైర్మన్, సహకార భూమి జర్నల్ కోఆపరేటివ్ సొసైటీ, విజయవాడ -
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!
కూరగాయల వ్యర్థాలను మురగ బెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది. భూసార వర్థినిగా, పురుగుల మందుగా ఉపయోగపడుతుంది. థాయ్‌లాండ్‌కు చెందిన డాక్టర్ రోసుకాన్ పూమ్ పాన్వాంగ్ ఈ ఎంజైమ్‌ను తొలుత తయారు చేశారు. కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు.. మార్కెట్లలో చెత్తకుప్పలో పోసిన మిగలపండిన పండ్లు, కూరగాయలు వంటివి ఎందుకూ పనికిరాని వ్యర్థాలే కదా అని అనుకోనక్కర్లేదు. వీటికి కొంచెం నల్లబెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ పంచదార కలిపితే 90 రోజుల్లో గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.గార్బేజ్ ఎంజైమ్ తయారీ ఇలా.. మూత బిగుతుగా పెట్టడానికి వీలుండే గాజు లేదా పలాస్టిక్/ఫైబర్ డ్రమ్ముల్లో దీన్ని తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు : కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, ముక్కలు, కుళ్లినవి) 3 పాళ్లు + నల్ల బెల్లం లేదా మొలాసిస్ లేదా సేంద్రియ (బ్రౌన్) పంచదార 1పాలు + నీరు 10 పాళ్ల చొప్పున కలపాలి.మార్కెట్లు, దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్లిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి వాడుకోవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. అయితే, జారుగా ఉండే గ్రేవీ కలపకూడదు. మాంసం, మందంగా ఉండే పనస పండ్ల తొక్కలు కలపకూడదు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగలకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. మొదటి 30 రోజుల పాటు.. రోజుకోసారి మూత తీసి వాయువులు బయటకు వెళ్లాక, మళ్లీ గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడకట్టి, నిల్వ చేసుకొని అక్కడి నుంచి 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చే వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు లేదా మళ్లీ గేర్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడుకోవచ్చు. (ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ)పలు ప్రయోజనాలుగార్బేజ్ ఎంజైమ్ లో ఉన్న సూక్ష్మజీవరాశి, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ భూసార వర్థినిగా, కీటకనాశనిగా పనిచేస్తుంది. తెగుళ్లు బారి నుంచి పంటలను కాపాడుకోవచ్చు. దీన్ని వాడితే పంట మొక్కల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. గార్బేజ్ ఎంజైమ్‌ను నీటిలో తగినపాళ్లలో కలిపి వాడుకోవాలి. ఎరువుగా.. 1:1000 పాళ్లలో(అంటే.. 1 మిల్లీలీటరు ఎంజైమ్‌కు 100 మిల్లీలీటర్ల నీరు) కలిపి నేలలో పోయవచ్చు లేదా పిచికారీ చేయవచ్చు. పురుగులు/ తెగుళ్ల నాశినిగా.. 1:100 మోతాదులో కలిపి పిచికారీ చేయాలి. దిగుబడి పెంపుదలకు.. 1:500 పాళ్లలో కలిపి పిచికారీ చేయాలి. -
బీఎస్ఎఫ్ పురుగులతో చవకగా చేపల మేత!
బ్లాక్ సోల్జర్ ఫ్రై (బిఎస్ఎఫ్) పురుగులను ప్రత్యామ్నాయ ప్రొటీన్ వనరుగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఎండబెట్టిన బిఎస్ఎఫ్ పురుగుల పిండితో బలపాల(పెల్లెట్ల) రూపంలో చేపల మేతను తయారు చేసుకునేందుకు మార్గం సుగమం అయ్యింది. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ముడిసరుకుగా వాడి పర్యావరణ హితమైన పద్ధతుల్లో బిఎస్ఎఫ్ పురుగులను ఉత్పత్తి చేసి, వాటితో వాణిజ్య స్థాయిలో నాణ్యమైన చేపల మేతను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐసిఎఆర్ సంస్థ సెంట్రల్ మెరైన్ ఫిష్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎంఆర్ఎఫ్ఐ) ఇటీవల అభివృద్ధి చేసింది. ఫీడ్ కన్వర్షన్ రేషియో చాలా మెరుగ్గా ఉండటమే కాకుండా చేపల మేత ఖర్చు తగ్గటం ద్వారా ఆక్వా రైతులకు మేలు జరుగుతుందని సిఎంఆర్ఎఫ్ఐ తెలిపింది. ఇప్పటివరకు సోయాచిక్కుళ్ల పిండి, ఎండుచేపల పిండిని ప్రొటీన్ వనరుగా చేపల మేతల్లో వాడుతున్నారు. (Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు)ఇక మీదట బిఎస్ఎఫ్ పురుగుల పిండిని నిక్షేపంగా వాడొచ్చని వెల్లడైంది. అయితే, ఈ మేత ఏయే రకాల చేపల పెంపకంలో ఎలా ఉపయోగపడుతోంది? అన్నది పరీక్షించాల్సి ఉంది. ఈ పరిశోధనను కొనసాగించేందుకు సిఎంఎఫ్ఆర్ఐ అమల ఎకోక్లీన్ అనే కేరళకు చెందిన స్టార్టప్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదీ చదవండి: డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో -
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్‌ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్‌లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్‌లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్‌ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్‌ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్‌లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
డ్రాగన్ తోట : ఉపాయం ఉండాలేగానీ, నెలకు రూ.లక్ష ఈజీగా
ఉపాయం ఉండాలే గాని ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఉత్సాహంగా మరో వృత్తిని చేపట్టి మంచి ఆదాయం పొందవచ్చనటానికి కేరళకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయిని కృషే నిదర్శనం. కొల్లం పట్టణానికి చెందిన రెమాభాయ్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సాయిల్ లెస్ పద్ధతిలో తమ ఇంటిపైనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయటం ప్రారంభించారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నారు. నెలకు 500 కిలోల డ్రాగన్ ఫ్రూట్స్ దిగుబడి వస్తోంది. కిలో రూ. 200కు విక్రయిస్తూ నెలకు రూ. లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 3 నెలలే డ్రాగన్ ఫ్రూట్ సీజన్ ఉంటుంది. రిటైరైన కొద్ది రోజులకే ఆమె తల్లి వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆ వేదనలో నుంచి బయటపడటం కోసం ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలనుకున్నారు. విదేశీ పండైన డ్రాగన్ సాగును ఇంటిపైనే ప్రారంభించారామె. నేలపైన పెంచడానికి ఇంటి దగ్గర ఖాళీ స్థలం లేదు. అందుకే మేడపై రెండొందల లీటర్ల బ్యారళ్లు 50 పెట్టి, వాటిల్లో వంద డ్రాగన్ మొక్కల్ని పెంచుతున్నారు. మట్టి మోసుకెళ్లి ఇంటిపైన పెట్టటం నాకు కష్టం అనిపించి సాయిల్ లెస్ పద్ధతిని ఎంచుకున్నానని రమాభాయ్ అంటున్నారు. కొన్ని రెడ్, కొన్ని ఎల్లో రకం డ్రాగన్ రకాలను నాటారు. ఎక్కువైన నీరు బయటకు పోవటానికి బ్యారెల్‌కు అడుగున బెజ్జం పెట్టి.. అందులో ఆకులు, రంపపు పొడి, వరి గడ్డి ముక్కలు, బ్యారెల్‌కు 3 కిలోల చొప్పున కం΄ోస్టు ఎరువును దొంతర్లుగా వేశారు. వంద గ్రాముల బోన్ మీల్ కూడా కలిపి, మొక్కలు నాటారు. ఎండాకులు, కూరగాయ వ్యర్థాలు, చేపలు, రొయ్యల వ్యర్థాలు, ఆల్చిప్పలతో సొంతంగా తయారు చేసుకునే ద్రవరూప ఎరువులను మొక్కలకు ఆమె అప్పుడప్పుడూ ఇస్తున్నారు. దీంతో మొక్కలు పోషకలోపాల్లేకుండా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తున్నాయని రమాభాయ్ సంతృప్తిని వ్యక్తం చేశారు.‘ఏదైనా కంటెయినర్లో కిలో చేపలు, రొయ్యలు, పీతల డొప్పలకు కిలో బెల్లంతో పాటు బొప్పాయి పండ్ల తొక్కలు కలపాలి. ఎండ తగలకుండా నీడన ఉంచి అప్పుడప్పుడూ కలియదిప్పుతూ ఉంటే.. 90 రోజులకు సేంద్రియ ద్రావణం సిద్ధమవుతుంది. ఇది కాల్షియం, ఫాస్ఫరస్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఆ బలంతో డ్రాగన్ మొక్కలు చక్కగా కాస్తున్నాయి’ అన్నారు రమాభాయ్. జెసిస్ వరల్డ్ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆమె ప్రారంభించారు. సీజన్లో మా ఇంటిపైన 200–300 డ్రాగన్ పూలు కనువిందు చేస్తుంటే నా వయసు 60 నుంచి 20కి తగ్గిపోతుంది. బాధలన్నీ మర్చిపోతున్నా అంటున్నారామె సంతోషంగా! -
హెల్దీ సంచోక్స్ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!
సంచోక్స్.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్ (హెలియాంతస్ ట్యూబరోసస్) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది. పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు. సంచోక్స్ దుంపలు రకరకాల రంగులు..సంచోక్స్ మొక్క చూడటానికి పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్ – అక్టోబర్లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్ డి–లాక్టిక్ యాసిడ్ రూపంలో లాక్టిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. జెరూసలెం ఆర్టిచోక్ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్ తయారు చేయొచ్చు. భార లోహాలను సంగ్రహిస్తుంది..జెరూసలెం ఆర్టిచోక్ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్ రకం జెరూసలెం ఆర్టిచోక్ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. షుగర్ రోగులకు ఉపయోగకరంటైప్ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్ రూపంలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్ ఫుడ్స్‌లో స్వీట్నర్గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (23) గ్లూకోజ్ (100) లేదా సుక్రోజ్ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. -
మట్టి + ఆముదం + కుంకుడు ద్రావణం: పంటలు పచ్చగా, నిండుగా!
పొలంలోని మట్టినే సేంద్రియ ఎరువుగా, పురుగులనునియంత్రించే ద్రావణం వాడి సత్ఫలితాలు పొందటం ద్వారా ఆరోగ్య దాయకమైన ద్రాక్ష, వరి తదితర పంటలు పండించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సివిఆర్) మరో ద్రావణాన్ని రూ పొందించారు. మట్టి+ఆముదంతో పాటు కుంకుడు రసం కలిపి చల్లితే పంటలకు చీడపీడల నియంత్రణతోపాటు పెరుగుదల బాగుందని గుర్తించారు. ఈ ద్రావణాన్ని తయారు చేసి మొదట తన పెరట్లోని టొమాటో, మొక్కజొన్న పంటలపై ఆయన ప్రయోగించి చూశారు. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే పంటలో విపరీతమైన మార్పును గమనించారు. అంతకు ముందు మొక్కజొన్న ఆకులను పురుగులు తినటం, పంట పసుపు పచ్చగా ఉన్నపుడు ఈ ద్రావణం పిచికారీ చేశారు. కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఆ పంట పచ్చదనంతో కళకళలాడుతూ, ఆకులు కూడా వెడల్పుగా రావటం అంటే పంటలో మంచి ఎదుగుదలను గమనించారు. మరి కొందరు రైతులు కూడా సత్ఫలితాలు సాధించటంతో ఈ ద్రావణం సామర్థ్యంపై సివిఆర్ నిర్థారణకు వచ్చారు.మట్టి, ఆముదం, కుంకుడు ద్రావణం తయారీ విధానంలోపలి మట్టి (బాగా జిగటగా ఉండే మట్టి) 10 కిలోలు (ఒక తట్టెడు) తీసుకొని, గడ్డలు చిదిపి మెత్తని మట్టిని సిద్ధం చేసుకోవాలి. ఆ మట్టిలో 250 మి.లీ. నుంచి 500 మి.లీ. వరకు ఆముదం కలపాలి. 250 నుండి 500 గ్రా. కుంకుడు కాయలు తీసుకొని కొంచెం నీటిలో వాటిని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో పిసికి, విత్తనాలు తీసివేసి, పేస్టులాగా తయారు చెయ్యాలి. అలా తయారైన పేస్టును అంతకు ముందు రోజు ఆముదం కలిపి పక్కన పెట్టిన మట్టిలో వేసి, బాగా కలియ తిప్పాలి. ఈ మిశ్రమాన్ని 200 లీటర్ల నీటి డ్రమ్ములో వేసి కర్రతో బాగా కలపాలి. మట్టి మిశ్రమం అంతా నీటిలో బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి నీటిలోని మట్టి రేణువులు నీటి అడుగుకు పేరుకుంటాయి. పైకి తేరుకున్న ద్రావణాన్ని వడకట్టి స్ప్రేయర్లలో పోసుకొని పంటపై పిచికారీ చెయ్యాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మట్టి ద్రావణం నీటిలో కలిపిన తర్వాత 4 గంటల్లోగా వంటపై పిచికారీ చేయాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ఆలన్యం అయితే ఆముదం ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. కుంకుడుతో పచ్చదనం వస్తోంది!పైకి పురుగు కనిపిస్తూ ఉంటే గతంలో చెప్పినట్లు మట్టి 20 కిలోలు, ఆముదం పావు కిలో నుంచి అర కిలో వరకు కలిపిన ద్రావణం చల్లితే పురుగుల నియంత్రణ బాగుంటుంది. అయితే, పెరుగుదల ఉండేది కాదు. మొలకల ద్రావణం చల్లాల్సి వచ్చేది. ఇప్పుడు కుంకుడు రసం కలపటం వల్ల ఆ కొరత తీరి పచ్చదనం వస్తోంది. తెగుళ్లు నివారిస్తుంది. పురుగులను గుడ్లు పెట్టనివ్వదు. అనేక పంటల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇది చల్లిన వారం, పది రోజుల్లోనే పంటలు ఆకుపచ్చని రంగులోకి మారి, గ్రోత్ వేగాన్ని అందుకుంటున్నది. మల్బరీ తప్ప ఏ పంటలోనైనా చల్లొచ్చు. పత్తి రైతులు కాయ పగలటానికి ముందు దశలోనే ఈ ద్రావణం వాడాలి. టొమాటోలో ఏ తెగుళ్లు, పురుగులూ రాలేదు. మిర్చిలో తామర పురుగు నియంత్రణకు మట్టి, ఆముదం, కుంకుళ్లతో పాటు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా కలిపి తయారు చేసిన ద్రావణం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ద్రావణాన్ని వర్షాలు బాగా పడే రోజుల్లో వారానికోసారి చల్లాలి. ఇప్పటి నుంచి పది రోజులకోసారి చల్లితే సరిపోతుంది. ఇది చల్లిన 2 గంటల వరకు వర్షం పడకపోతే చాలు, పనిచేస్తుంది. – చింతల వెంకటరెడ్డి (98668 83336), పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆల్వాల్, సికింద్రాబాద్చాలా పంటలపై చల్లా.. రిజల్టు బాగుంది!మట్టి, ఆముదం, కుంకుడు రసం ద్రావణం వాడిన వారం రోజుల్లోనే చీడపీడల నియంత్రణతో పాటు పంటల్లో పెరుగుదల బాగా కనిపించింది. 10 కిలోల లోపలి మట్టికి 250 ఎంఎల్ ఆముదం కలిపి పెట్టుకోవాలి. కుంకుడు కాయలను గింజలతో ΄ాటు నలగ్గొట్టి, ఉడక బెట్టాలి. నానబెట్టిన దానికన్నా, కుంకుడు విత్తనాలు కూడా పగులగొట్టి ఉడకబెడితే మరింత ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది. ఆ తెల్లారి కుంకుళ్లను పిసికి రసం తీసుకోవాలి. ఆముదం కలిపిన మట్టిలో ఈ కుంకుడు రసం కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. పసుపు, మామిడి, నిమ్మ, అవకాడో, అరటి తదితర పంటలన్నిటిపైనా ఈ ద్రావణాన్ని పిచికారీ చేశాను. వారంలోనే గ్రోత్ చాలా కనిపించింది. నూనెలు చల్లితే గ్రోత్ వస్తుంది. ఇక్కడ ఆముదం వాడుతున్నందున గ్రోత్తోపాటు చీడపీడల నియంత్రణ కూడా జరుగుతుంది. మట్టి ద్వారా మినరల్స్ కూడా పంటకు అందుతున్నాయి. 12–15 రోజులకోసారి అన్ని పంటలపైనే పిచికారీ చేస్తున్నా. ఈ రెండు పిచికారీల మధ్య ఒకసారి వేపనూనె పిచికారీ చేస్తే పురుగుల గుడ్లు నశించి మరింత మెరుగైన ఫలితాలుంటాయి. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రుషి వ్యాలీ స్కూల్, మదనపల్లిదివంగత సంజీవరెడ్డి సూచనలతో 2007 నుంచి మా 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. 2014లో ‘సాక్షి సాగుబడి’లో సివిఆర్ మట్టి ద్రావణం గురించి చదివినప్పటి నుంచి వంగ, సాంబారు దోస, పూల తోట, వేరుశనగ వంటి అన్ని పంటలకూ లోపలి మట్టి+ ఆముదం ద్రావణం వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. సివిఆర్ కొత్తగా చెప్తున్నట్లు మట్టి, ఆముదంతోపాటు కుంకుడు రసం కూడా కలిపి పత్తి పంట 20 రోజుల దశలో రెండు నెలల క్రితం ఒకసారి, ఆ తర్వాత మరోసారి పిచికారీ చేశాను. పంట ముదురు ఆకుపచ్చగా బలంగా పురుగుల బెడద లేకుండా పెరిగింది. ఇప్పుడు పత్తి తీస్తున్నాను. ఇతర రైతులతో కూడా మట్టి ద్రావణం వాడిస్తున్నాం. – పి. గిరీష్ గౌడ్ (80732 45976), ఇనగలూరు,అగళి మండలం, సత్యసాయి జిల్లా -
ప్రకృతి సేద్యం ఇంత గొప్పగా ఉంటుందని ఉహించలేదు: ప్రొ.రమేశ్ చంద్
సుభాష్ పాలేకర్ కృషితో ప్రాధమిక రూపంలో ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయం గత కొన్నేళ్లలో అనేక ఆవిష్కరణలతో శాస్త్రీయతను సంతరించుకుంటూ క్లైమెట్ ఎమర్జెన్సీని తట్టుకునేలా ఆశ్చర్యకరమైన రీతిలో పరిపుష్టమవుతూ, ప్రకృతి వైపరీత్యాలను దీటుగా తట్టుకుంటూ కొత్త పుంతలు తొక్కుతోందని నీతి ఆయోగ్ సభ్యుడు, వ్యవసాయ నిపుణుడు ప్రొఫెసర్ డాక్టర్ రమేశ్ చంద్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ వికాసం తీరు తెన్నులను ఇటీవల రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తమ నీతి ఆయోగ్, ఐసిఎఆర్ నిపుణుల బృందానికి ఒక గొప్ప అభ్యాసం (గ్రేట్ లెర్నింగ్)గా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.వినూత్న ఆవిష్కరణలుఏడేళ్ల క్రితం తాను ఆంధ్రలో పర్యటించినప్పుడు ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతికి మాత్రమే పరిమితమైందని, ఇప్పుడు వినూత్న ఆవిష్కరణలతో శాస్త్రీయత ప్రాతిపదికపై పురోగమిస్తోందని, క్షేత్రస్థాయిలో ఇంత గొప్పగా ఉంటుందని తాము ముందుగా ఊహించలేదన్నారు. పర్యటన అనంతరం ప్రొ. రమేశ్ చంద్ ఒక వీడియో సందేశంలో తన స్పందనను వెల్లడించారు. ఏపీ ప్రకృతి సేద్య ఆవిష్కరణలను వివరిస్తూ, రసాయనిక సేద్యంలో, ప్రకృతి సేద్యంలో పక్క పక్కన పొలాల్లోనే సాగవుతున్న వరి పంటను పరిశీలిస్తే.. కరువు, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి సేద్యం ఎంత మెరుగైన ఫలితాలనిస్తోందో అర్థమైందన్నారు. అదేవిధంగా, కూరగాయలు, పండ్ల తోటలను పరిశీలించినప్పుడు కూడా ఆశ్చర్యకరమైన ఫలితాలను కళ్లజూశామన్నారు. అరటి తోట సాగు చేస్తున్న ఒక రైతు జీవామృతం వంటి బయో ఇన్పుట్స్ కూడా ఇక వాడాల్సిన అవసరం లేనంతగా తన భూమిని సారవంతం చేసుకోవటం ఆశ్చర్యం కలిగించిందని ప్రొ.రమేశ్ చంద్ తెలి΄ారు. విత్తనాలకు అనేక పొరలుగా మట్టి, జీవామృతాలతో లేపనం చేసి గుళికలు తయారు చేసి, నేలలో తేమ లేని పరిస్థితుల్లో వర్షం రావటానికి ముందే విత్తుతున్నారన్నారు.విభిన్నమైన దృష్టికోణంపంటలతో, ఆచ్ఛాదనతో నేలను కప్పి ఉంచటంతోపాటు అనేక పంటలను కలిపి పండిస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తున్నారన్నారు. గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే చెదలు సమస్య వస్తుంది కదా అని ఓ ప్రకృతి వ్యవసాయదారుడ్ని ప్రశ్నిస్తే.. చెదపురుగులు తమ మిత్రపురుగులని బదులిచ్చారన్నారు. సాధారణ రైతుల అభిప్రాయానికి ఇది పూర్తిగా విభిన్నమైన దృష్టికోణం అని, అన్ని విషయాల్లోనూ ఈ వ్యత్యాసం ఉందన్నారు. ఈ పర్యటనలో రైతులతో స్వయంగా మాట్లాడి అనేక కొత్త విషయాలను తాము నేర్చుకున్నామని, ఇది గ్రేట్ లెర్నింగ్ అని ఆయన అన్నారు. ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, ఫార్మింగ్ సిస్టమ్స్ నిపుణులు, మట్టి నిపుణులు, నీతి ఆయోగ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. నీలం పటేల్ కూడా మాతో ఈ పర్యటనలో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రసాయనిక వ్యవసాయానికి సంబంధించిన పద్ధతులను మాత్రమే విస్తరణ, బోధన, పరిశోధన రంగాల్లో అనుసరిస్తున్నామని, ఇక మీదట ప్రకృతి సేద్యాన్ని కూడా భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.సబ్సిడీ ఎలా ఇవ్వగలం?ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట రసాయన వ్యవసాయంలో పండించిన పంటతో పోల్చితే చాలా మెరుగైనది. నాణ్యతకు తగిన ధర ఎలా కల్పించగలమో ఆలోచించాలి. యూరియా ధరలో 85–90% సబ్సిడీ ఇస్తున్నాం. ప్రకృతి సేద్యాన్ని దేశంలో విస్తరింపజేయటానికి ప్రోత్సాహకాలు ఎలా ఇవ్వాలో ఆలోచించాల్సి ఉందంటూ క్రేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామన్నారు. -
సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు
ఈనెల22, 23 తేదీల్లో బయోడైనమిక్సేద్యంపై శిక్షణ దేశ విదేశాల్లో చిరకాలంగా కొందరు రైతులు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య పద్థతుల్లో బయోడైనమిక్ సేద్యం ఒకటి. రైతులు స్వయంగా తయారు చేసుకునే ఆవు కొమ్ము ఎరువు తదితర సేంద్రియ ఎరువులను సూక్ష్మ పరిమాణంలో వేస్తూ చేసే రసాయన రహిత సేద్య పద్ధతి ఇది. టైమ్ టేబుల్ ప్రకారం ప్రతి వ్యవసాయ పనినీ నిర్దేశిత రోజుల్లో మాత్రమే చేయటం ఇందులో ప్రత్యేకత. బయోడైనమిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో బెంగళూరులోని బెంగళూరు ఇంటర్నేషనల్ సెంటర్లో రైతు శిక్షణా శిబిరం జరగనుంది. బయోడైనమిక్ సేద్యంలో అనుభవం కలిగిన రైతులు శిక్షణ ఇస్తారు. క్షేత్ర సందర్శన ఉంటుంది. ప్రవేశ రుసుము (శిక్షణ, భోజనం సహా): రూ. 1,500. వసతి ఎవరికి వారే చూసుకోవాలి. ఆసక్తి గల వారు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇతర వివరాలకు.. 97386 76611 సంప్రదించవచ్చు. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ΄్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) దేశంలోనే పేరెన్నికగల వ్యవసాయ శిక్షణా సంస్థ. సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులు, ఎఫ్పిఓలు/ సహకార సంఘాల నిర్వాహకులు, రైతు శాస్త్రవేత్తలుగా ఎదిగి స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు లోతైన శాస్త్రీయ అవగాహన, ఆచరణాత్మక శిక్షణ కల్పించడానికి ఎన్‌ఐపిహెచ్‌ఎం 3 నెలల సర్టిఫికెట్ కోర్సు తెలుగు/హిందీ భాషల్లో నిర్వహించనుంది.నూటికి నూరు శాతం రసాయనాల్లేకుండా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా చేయదలచిన వారికి ఇది సదవకాశం. నవంబర్ 27 నుంచి వచ్చే మార్చి 5 వరకు ఈ కోర్సు ఉంటుంది. వివిధ కేంద్ర వ్యవసాయ సంస్థలతో కలసి ఎన్‌ఐపిహెచ్‌ఎం నిర్వహించే ఈ కోర్సులో 3 దశలుంటాయి. మొదట 21 రోజులు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐపిహెచ్‌ఎం ఆవరణలో శాస్త్రీయ అంశాల బోధన. తర్వాత అభ్యర్థి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో 2 నెలలు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు. ఆ తర్వాత ఎన్‌ఐపిహెచ్‌ఎంలో 10 రోజుల తుది దశ శిక్షణ ఉంటాయి. ఇంటర్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ డిప్లొమా చేసిన 18 ఏళ్లు నిండిన అన్ని సామాజిక వర్గాల స్త్రీ పురుషులు అర్హులు. గ్రామీణ యువతకు ప్రాధాన్యం. కోర్సు ఫీజు: రూ. 7,500. శిక్షణా కాలంలో ఉచిత వసతి కల్పిస్తారు. భోజనానికి రోజుకు రూ.305 అభ్యర్థి చెల్లించాలి. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ ఇస్తారు. దరఖాస్తులను నవంబర్ 22 లోగా పోస్టు/మెయిల్ ద్వారా పంపవచ్చు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా.కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. -
వరిలోనే గోనె సంచుల్లో కూరగాయల సాగు!
నీరు నిల్వగట్టే రబీ వరి పొలాల్లో కూరగాయల సాగుతో పౌష్టికాహార భద్రతతో పాటు అదనపు ఆదాయంఅధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడిహెక్టారులో 4–5 టన్నుల వరి ధాన్యంతో పాటు 60 క్వింటాళ్ల టొమాటోలు లేదా 30 క్వింటాళ్ల క్యారట్/ ముల్లంగి దిగుబడి పొందవచ్చుఐసిఎఆర్ సంస్థ ‘క్రిజాఫ్’ పరిశోధనల్లో వెల్లడిసార్వా, దాళ్వా సీజన్లలో (వర్షాకాలం, ఎండాకాలాల్లో) విస్తారంగా వరి పంట సాగయ్యే ప్రాంతాల్లో గట్ల మీద తప్ప పొలంలో అంతర పంటలుగా కూరగాయ పంటలను నేలపై సాగు చేయటం సాధ్యపడదు. అయితే, వరి సాళ్ల మధ్యలో వరుసలుగా ఏర్పాటు చేసిన గోనె సంచుల్లో సాధ్యపడుతుంది. గోనె సంచిలో అడుగు ఎత్తున మట్టి + మాగిన పశువుల ఎరువు/ఘన జీవామృతాల మిశ్రమం నింపి.. అందులో రకరకాల కూరగాయ మొక్కలు సాగు చేసుకునే అవకాశం మెండుగా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. స్వల్ప ఖర్చుతోనే వరి రైతులు అధికాదాయం పొందేందుకు అవకాశం ఉంది. వరి సాగయ్యే ప్రాంతాల్లో స్థానికంగా కూరగాయల లభ్యత పెరగటంతో ప్రజలకు పౌష్టికాహార భద్రత చేకూరుతుందని ఈ పద్ధతిపై సుదీర్ఘ పరిశోధన చేసిన విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. ఘోరాయ్ అంటున్నారు. పశ్చిమ బెంగాల్ బారక్పుర్లోని (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ) సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్)లో ఈ పరిశోధనలు చేశారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ నిశ్చింతగా కూరగాయల దిగుబడి పొందవచ్చని ఈ పరిశోధనల్లో తేలింది.పదేళ్ల పరిశోధన2011–2021 మధ్యకాలంలో క్రిజాఫ్ ఆవరణలో, మరికొన్ని జిల్లాల్లో రబీ వరి పొలాల్లో గోనె సంచుల్లో కూరగాయలను అంతర పంటలుగా ప్రయోగాత్మకంగా సాగు చేశారు. నీరు నిల్వ ఉండే చోట నేలలో ప్రాణవాయువు లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ద్విదళ జాతికి చెందిన కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చని తేలింది. మట్టి లోతు తక్కువగా ఉండే రాళ్ల నేలల్లో, చౌడు నేలల్లో కూడా ఈ విధంగా గోనె సంచుల్లో మట్టి మిశ్రమం నింపుకొని కూరగాయ పంటలు నిశ్చింతగా పండించుకోవచ్చు. ఎండాకాలంలో మంచి ధర పలికే టొమాటోలు, క్యారట్, ముల్లంగి, వంగ, పొద చిక్కుడు, కాళీఫ్లవర్, క్యాబేజి వంటి పంటలతో పాటు బీర, పొట్ల, సొర, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి వంటి తీగజాతి కూరగాయలను, కొత్తిమీర, ఉల్లి, కంద తదితర పంటలను పండించి మంచి ఆదాయం గడించవచ్చని డాక్టర్ఘోరాయ్ తెలిపారు. తీగలు పాకడానికి మూడు కర్రలు పాతి, పురికొస చుట్టి ఆసరా కల్పించాలి. వరి పంట కోసిన తర్వాత నేల మీద పాకించవచ్చు. అవసరాన్ని బట్టి తాత్కాలిక పందిరి వేసుకోవచ్చు. ఈ మడుల్లో ఒక పంట పూర్తయ్యాక మరో పంటను వేసుకోవచ్చు.గోనె సంచుల్లో సాగు ఎలా?ప్లాస్టిక్ వాడకం జోలికి పోకుండా వాడేసిన గోనె సంచిని అడ్డంగా ముక్కలుగా చేయాలి. బ్లైటాక్ నాడ్ రోగార్ కలిపిన నీటిలో గోనె సంచిని శుద్ధి చేస్తే శిలీంధ్రాలు, పురుగులను తట్టుకోవడానికి వీలుంటుంది. వాటికి నిలువుగా నిలబెట్టి, మట్టి+ సేంద్రియ ఎరువు నింపాలి. బయట ఏర్పాటు చేసి తీసుకెళ్లి పొలంలో పెట్టకూడదు. నీటిని నిల్వగట్టిన వరి పొలంలోనే వీటిని తయారు చేసుకోవాలి. గోనె అడుగున మొదట 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి వేయాలి. దానిపై వరి పొలంలోని బురద మట్టినే 4 అంగుళాలు వేయాలి. ఆపైన మాగిన పశువుల ఎరువు లేదా ఘన జీవామృతం 2 అంగుళాల మందాన వేయాలి. ఆపైన మళ్లీ 2 అంగుళాల మందాన ఎండు వరి గడ్డి, మట్టి, ఎరువు పొరలుగా వేసి ఆపైన కొంచెం మట్టి కలపాలి. అంతే.. కూరగాయ మొక్కలు నాటడానికి గోనె సంచి మడి సిద్ధమైనట్టే. వరి గడ్డి క్రమంగా కుళ్లి పోషకాలను అందించటంతో పాటు మట్టి పిడచకట్టుకుపోకుండా గుల్లబరుస్తుంది. ఈ గోనె సంచుల మడులకు పనిగట్టుకొని నీరు పోయాల్సిన అవసరం లేదు. కాపిల్లరీ మూమెంట్ ద్వారా మట్టి అడుగున ఉన్న నీటి తేమను ఎప్పటికప్పుడు పీల్చుకొని మొక్కల వేర్లకు అందిస్తుంది. అప్పుడప్పుడూ ద్రవజీవామృతం తదితర ద్రవరూప ఎరువులను ఈ మడుల్లో పోస్తుంటే మొక్కలకు పోషకాల లోపం లేకుండా పెరిగి ఫలసాయాన్నిస్తాయి. వరి పంటను కంబైన్ హార్వెస్టర్‌తో కోత కోసే పనైతే.. అది వెళ్లడానికి వీలైనంత దూరంలో ఈ కూరగాయ మొక్కలను వరుసలుగా ఏర్పాటు చేసుకోవాలి.హెక్టారుకు 3 వేల మడులు95 సెం.మీ. పొడవుండే 50 కిలోల గోనె సంచిని అడ్డంగా 3 ముక్కలు చేసి మూడు మడులు ఏర్పాటు చేయొచ్చు. హెక్టారుకు వెయ్యి గోనె సంచులు (3 వేల మడులకు) సరిపోతాయి. మడి ఎత్తు 30 సెం.మీ. (అడుగు), చుట్టుకొలత 45 సెం.మీ. ఉంటుంది. వరిపొలంలో 5–10 సెం.మీ. లోతు నీరుంటుంది. కాబట్టి కూరగాయ మొక్కలకు ఇబ్బంది ఉండదు. హెక్టారుకు 3 వేల గోనె సంచి మడులు పెట్టుకోవచ్చు. 3వేల వంగ మొక్కల్ని లేదా 6 వేల క్యాబేజి మొక్కల్ని వేసుకోవచ్చు. సమ్మర్ కేరట్ లేదా ముల్లంగి హెక్టారుకు 30 క్వింటాళ్లు దిగుబడి తీసుకోవచ్చు. టొమాటో మొక్కకు 2 కిలోల చొప్పున హెక్టారుకు 60 క్వింటాళ్ల టొమాటోల దిగుబడి పొందవచ్చు. హెక్టారుకు 4–5 టన్నుల వరి ధాన్యానికి అదనంగా కూరగాయలను పుష్కలంగా పండించుకోవచ్చని డాక్టర్ ఘోరాయ్ వివరించారు. రబీ వరిలో అంతరపంటలుగా కూరగాయల సాగుపై మన యూనివర్సిటీలు / కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తే రైతులు అందిపుచ్చుకుంటారు. ఈ పంటల వీడియోలను డాక్టర్ ఘోరాయ్ తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. నీరు నిల్వ గట్టే వరి పొలాల్లో గోనె సంచుల్లో వరుసలుగా ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే రైతుల కుటుంబాలకు, స్థానిక ప్రజలకు పుష్కలంగా కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. ఒకే స్థలంలో అవే వనరులతో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు పండించుకోవచ్చు. వరి రైతులు రూ;eయి అదనంగా ఖర్చుపెట్టి పది రెట్లు ఆదాయం సమకూర్చుకోవచ్చు. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల ఆరుబయట కూరగాయ తోటలతో పోల్చితే 6–8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎండలు ముదిరిన తర్వాత కూడా కూరగాయల దిగుబడి బాగుంటుంది. వేసవిలో నీరు తదితర వనరులను మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి ఈ పద్ధతి తోడ్పడుతుంది. – డాక్టర్ ఎ.కె. ఘోరాయ్, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ జ్యూట్ అండ్ అల్లీడ్ ఫైబర్స్ (ఐసిఎఆర్ – క్రిజాఫ్),బారక్‌పుర్, పశ్చిమ బెంగాల్. -
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
Snake Fruit: స్నేక్ ఫ్రూట్!
‘స్నేక్ ఫ్రూట్’ లేదా సలక్ ఫ్రూట్. శాస్త్రీయ నామం సలక్క జలక్క. అరెకేసియే కుటుంబం. ఈత, ఖర్జూర వంటి పామ్ జాతికి చెందిన ఒక రకం. ఇండోనేషియాలోని జావా, సుమత్ర ప్రాంతం దీని పుట్టిల్లు. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి ఈశాన్య ఆసియా దేశాల్లో విస్తారంగా సాగులో ఉన్న పండు. లేత కాఫీ రంగులో ఉండే ఈ పండు పైన పోలుసు పాము చర్మంపై పోలుసులను పోలి ఉంటుంది. అందుకే కాబోలు, దీనికి స్నేక్ ఫ్రూట్ లేదా స్నేక్ స్కిన్ ఫ్రూట్ అంటారు. పండిన అంజూర పండు సైజులో, అదే ఆకారంలో స్నేక్ ఫ్రూట్ ఉంటుంది. పైపోర పెళుసుగా ఉంటుంది. పైపోరను ఒలిస్తే లోపల తెల్లటి రెబ్బలు (వెల్లుల్లి రెబ్బల మాదిరిగా) ఉంటాయి. వాటి లోపల గోధుమ రంగు గింజలు ఉంటాయి. గింజలు తీసేసి ఈ రెబ్బల్ని తినాలి. రుచి గమ్మత్తుగా, విలక్షణంగా ఉంటుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ద హెల్త్ అని, సూపర్ హీరోస్ ఆఫ్ ఫంక్షనాలిటీ అని దీన్ని వ్యవహరిస్తుంటారు. సలక్కు ఇంకా చాలా పేర్లున్నాయి. ఇండోనేషియాలో పోందో, థాయ్‌లాండ్‌లో రకం, చైనాలో సలక లేదా షి పై గ్యో జాంగ్, మయన్మార్‌లో ఇంగన్ అని పిలుస్తున్నారు. న్యూ గినియ, ఫిలిప్పీన్స్, క్వీన్స్లాండ్, ఉత్తర ఆస్ట్రేలియా, పోనపె ఐలాండ్ (కారోలిన్ అర్చిపెలాగో), చైనా, సూరినామ్, స్పెయిన్, ఫిజి తదితర దేశాల్లో స్నేక్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నారు. ఇండోనేషియాలోని ఇతరప్రాంతాల్లో దీన్ని ఆహార పంటగా సాగు చేస్తున్నారు.20 అడుగుల ఎత్తుస్నేక్ ఫ్రూట్ చెట్టుకు కాండం చాలా చిన్నది. అయితే, కొమ్మలు పెద్దగా 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ప్రతి కొమ్మకు ముళ్లతో కూడిన 2 మీటర్ల పోడవైన తొడిమె ఉంటుంది. ముల్లు 6 అంగుళాల వరకు పోడవుంటుంది. కొమ్మకు చాలా ఆకులుంటాయి. ఈ చెట్టు కాండానికి కాయలు గెలలుగా కాస్తాయి. ఆకు అడుగున లేత ఆకుపచ్చగా, పైన ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. స్నేక్ ఫ్రూట్ మొక్క నాటిన తర్వాత 3–4 ఏళ్లలో కాపుకొస్తుంది. ఇప్పుడు ముళ్లు లేని వంగడాలు కూడా వచ్చాయి. ఆడ చెట్లు, మగ చెట్లు ఉంటాయి. కొన్ని రకాల స్నేక్ ఫ్రూట్ చెట్లలో (ఉదా.. సలక్ బాలి) ఆడ, మగ పూలు రెండూ ఒకే చెట్టుకు పూసి స్వపరాగ సంపర్కం చెందుతాయి. పూలు గుత్తులుగా పూస్తాయి. ఆడ పూలు 20–30 సెం.మీ., మగవి 50–100 సెం.మీ. పోడవు ఉంటాయి. పరాగ సంపర్కం కోసం మగ పూలలో 20%ని మాత్రమే ఉంచి, మిగతావి తొలగించాలి. మనుషులు చేతులతో పరాగ సంపర్కం చేయిస్తే పండ్ల దిగుబడి పెరుగుతుంది.తీపి కాదు, వగరుసలక్క చెట్ల రకాలు 21 జాతులున్నాయి. మలేషియాలో మూడు రకాలను పెంచుతున్నారు. ఎస్.గ్లాబెరెసెన్స్, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన. ఎస్. గ్లాబెరెసెన్స్ను లోకల్ సలక్గా భావిస్తారు. దీని నుంచి 9 క్లోన్స్‌ను తయారు చేశారు. ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలు ఇండోనేషియా నుంచి మలేషియాకు వచ్చాయి. ఇక ఇండోనేషియాలో దేశీయ, విదేశీ మార్కెట్ల కోసం వాణిజ్యపరంగా ఎస్. జటక్క, ఎస్. ఎడ్యులిస్, ఎస్.సుమత్రాన రకాలను సాగు చేస్తున్నారు. మనోంజయ, బొంగ్కాక్, బంజార్నెగర, కొండెట్, పోందో, బాలి, ఎన్రెంకంగ్, సైడెంపుయన్ వంటి అనేక రకాల స్నేక్ ఫ్రూట్ వంగడాలు సాగులో ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్ తియ్యని పండు కాదు, కొంచెం వగరు. బోంగ్కాక్ రకం పండు మరీ ఎక్కువ వగరు. మిగతా రకాల కన్నా తక్కువ తీపి కలిగి ఉంటుంది.పుష్కలంగా పోషకాలుస్నేక్ ఫ్రూట్లో ఇతర పండ్లతో పోల్చినప్పుడు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సుక్రోజ్ (7.6 గ్రా/100 గ్రా.), ఫ్రక్టోజ్ (3.9 గ్రా/100 గ్రా.), టోటల్ సుగర్ (17.4 గ్రా./100 గ్రా.), జీర్ణమయ్యే పీచు (0.3 గ్రా./100 గ్రా.), జీర్ణం కాని పీచు (1.4 గ్రా./100 గ్రా.), టోటల్ డైటరీ ఫైబర్ (1.7 గ్రా./100 గ్రా.), నీరు (80గ్రా./100 గ్రా.), కేలరీలు (77 కిలోకేలరీలు/ 100 గ్రా.),ప్రోటీన్ (0.7గ్రా./100 గ్రా.), బూడిద (0.6గ్రా./100 గ్రా.), కొవ్వు (0.1 గ్రా./100 గ్రా.). ఉన్నాయి. సహజ పీచు, సుగర్స్‌కు స్నేక్ ఫ్రూట్ చక్కని వనరు. దీని గుజ్జులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఫాస్ఫరస్ (1161 ఎంజి/కేజీ), పోటాషియం (11.339 ఎంజి/కేజీ), కాల్షియం (220 ఎంజి/కేజీ), మెగ్నీషియం (607 ఎంజి/కేజీ), సోడియం (231 ఎంజి/కేజీ), ఐరన్ (12.0 ఎంజి/కేజీ), మాంగనీసు (10.4 ఎంజి/కేజీ), రాగి (3.36 ఎంజి/కేజీ), బోరాన్ (5.07 ఎంజి/కేజీ), సల్ఫర్ (5.07 ఎంజి/కేజీ), అస్కార్బిక్ ఆసిడ్ (400 ఎంజి/కేజీ), కెరోటిన్ (5 ఎంజి/కేజీ), థయామిన్ (20 ఎంజి/కేజీ), నియాసిన్ (240 ఎంజి/కేజీ), రిబోఫ్లావిన్ (0.8 ఎంజి/కేజీ), ఫొలేట్ (6 ఎంజి/కేజీ) మేరకు ఉన్నాయి. స్నేక్ ఫ్రూట్లో ఆరోగ్యదాయకమైన పీచు, పిండి పదార్థం నిండుగా ఉన్నాయి. ఇతర విదేశీ పండ్లతో పోల్చితే దీని గుజ్జులో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ పండును నేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, చిప్స్, ఊరబెట్టి కూడా వాడుకుంటున్నారు. పోందో (ఇండోనేషియన్ సలక్) రకం లేత కాయలను గింజలతో సహా తినొచ్చు. స్నేక్ ఫ్రూట్ ఆకులను, రెమ్మలను కూడా చాపలు, బుట్టల అల్లికకు వాడుతున్నారు.50 ఏళ్ల పాటు దిగుబడిస్నేక్ ఫ్రూట్‌ను విత్తనాలతో మొక్కలు పెంచి నాటుకోవాలి. అయితే, 50% మాత్రమే ఆడ మొక్కలు వస్తాయి. పండు నాణ్యత ఒకే స్థాయిలో ఉంటుంది. తల్లి మొక్క లక్షణాలు పూర్తిగా రావాలంటే మాత్రం పిలకలు నాటుకోవాలి. 6–12 నెలల వయసు మొక్కను పైన ఆకుల నుంచి కింది వేర్ల వరకు నిలువుగా చీల్చి నాటుకోవచ్చు. పిహెచ్ 4.7 – 7.5 వరకు తట్టుకుంటుంది. లేత మొక్క నీడలో బాగా పెరుగుతుంది. వాణిజ్యపరంగా సాగయ్యే తోటల్లో కొబ్బరి, డ్యూరియన్ చెట్ల నీడన ఈ మొక్కల్ని పెంచుతుంటారు. నాటిన 3–4 ఏళ్లకు కాపు ్రపారంభం అవుతుంది. ఈ చెట్టు 50 ఏళ్ల పాటు హెక్టారుకు 5–15 టన్నుల పండ్ల దిగుబడినిస్తుంది. ఏటా నాలుగు సార్లు పూత వచ్చినప్పటికీ ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలోనే పండ్లు వస్తాయి. మొక్కలు 60–70 సెం.మీ. ఎత్తు పెరిగిన 5–7 నెలల తర్వాత నాటుకోవాలి. గుంతలు 40“40“40 సెం.మీ. సైజులో తవ్వాలి. 1.5 “ 3 మీటర్ల నుంచి 2 “ 2 మీటర్ల దూరంలో నాటుకోవాలి. కొమ్మకత్తిరింపు, కలుపు తీత ప్రతి రెండు నెలలకోసారి చేస్తే పూత బాగా వస్తుంది. సరిగ్గా లేని లేదా పాడైన పండ్లను ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. గుత్తికి 20–25 పండ్లు ఉంటే దిగుబడి లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా వర్షాధారంగానే పెరుగుతుంది. కొమ్మ కత్తిరించినప్పుడు, పండ్లు ఎదుగుతున్న దశలో, వేడి సీజన్లలో నీరు అందించాలి. పూత దశలో, పండ్ల కోతకు ముందు రోజుల్లో తగుమాత్రంగా నీరివ్వాలి. ఎక్కువ నీరిస్తే కుళ్లిపోతాయి. వాణిజ్యపరంగా సాగు చేసే తోటల్లో అధిక దిగుబడి కోసం కూలీలతో పోలినేషన్ చేయిస్తారు. పువ్వు గట్టిపడితే పోలినేషన్ సక్సెస్ అయ్యిందని గుర్తు. మెత్తగానే ఉండిపోతే ఫెయిలైనట్లు గుర్తించి తొలగిస్తారు. పండు తగిన సైజు, రంగు వచ్చి, పండుపై ఉన్న సన్నని ముళ్లు ఊడిపోయిందంటే పక్వానికి వచ్చినట్లు గుర్తిస్తారు. పండు 70–80% పండినప్పుడు కూలీలతో పండ్లు కోయిస్తారు. తాజా పండ్ల మార్కెట్లో విక్రయించటంతో పాటు స్నేక్ ఫ్రూట్స్‌ను ఊరగాయ పచ్చడి పెడతారు. సుగర్, ఈస్ట్ కలిపి వైన్ తయారీలో కూడా స్నేక్ ఫ్రూట్స్ వాడుతున్నారు. -
అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి దోహదం!
2030 నాటికి ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దుకోవటానికి ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు నిర్దేశించిన లక్ష్యాలే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్.డి.జి.లు). ఇవి 17 రకాలు. ఈ లక్ష్యాల సాధన కృషి స్థితిగతులపై సమీక్షకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈనెల 22–23 తేదీల్లో కీలక శిఖరాగ్రసభ ‘ఫ్యూచర్ 2024’ జరగనుంది. ఈ నేపథ్యంలో అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా ప్రభావితం చేస్తోందో తెలుసుకునేందుకు ఒక అధ్యయనం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగెన్ (నెదర్లాండ్స్)కు చెందిన డాక్టర్ ప్రజల్ ప్రధాన్ సారథ్యంలోని పరిశోధకుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. అర్బన్ అగ్రికల్చర్ ఎస్.డి.జి.ల సాధన కృషిపై చూపుతున్న సానుకూల ప్రభావాలతో ΄ాటు ప్రతికూల ప్రభావాలను చర్చించే 76,000 పరిశోధన పత్రాల్లో నుంచి 1,450ని ఎంపిక చేసి అధ్యయనం చేయటం విశేషం. ఈ తాజా అధ్యయన ఫలితాలను జర్నల్ సెల్స్ రి΄ోర్ట్ సస్టయినబిలిటీలో ప్రచురితమయ్యాయి.అర్బన్ అగ్రికల్చర్.. అంటే? నగరాలు, నగరాల పరిసరప్రాంతాల్లో ఇళ్లపైన, ఖాళీ స్థలాల్లో చేపట్టే వ్యవసాయ కార్యకలా΄ాలనే అర్బన్ అగ్రికల్చర్‌గా చెప్పచ్చు. నగర, పట్టణప్రాంతాల్లో ఇంటిపంటలు, మిద్దె తోటలు, పెరటి తోటలు, పశుపోషణ, పాడి పరిశ్రమలు. కోళ్లు, చేపల పెంపకం.. వంటి కార్యకలా΄ాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. 17 ఎస్.డి.జి.లన్నిటితోనూ అర్బన్ అగ్రికల్చర్‌కు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంది. నాణానికి అవతలి వైపు..అర్బన్ అగ్రికల్చర్ వల్ల అభివృద్ధి లక్ష్యాల సాధనకు అంతా మేలే జరుగుతుందని చెప్పలేమని, చెడు కూడా జరుగుతోందని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ స్పష్టం చేశారు. ‘అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తోంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని బాగా తగ్గించే అర్బన్ అగ్రికల్చర్ పద్ధతులను ΄ాటించగలిగినప్పుడే దాని ద్వారా ప్రయోజనాలు ఒనగూడతాయి. ఐరాస 2024 ఫ్యూచర్ సమ్మిట్ లక్ష్యాల సాధనకు అర్బన్ అగ్రికల్చర్ దోహదపడేదైనప్పటికీ మరో కోణాన్ని కూడా ఆవిష్కరించటం కోసం ఈ అధ్యయనం చేశాం’ అన్నారాయన. వుహాన్ యూనివర్సిటీ (చైనా) అసోసియేట్ రిసెర్చ్ ప్రోఫెసర్ యుయాన్ఛావ్ హు మాట్లాడుతూ ‘ఎస్.డి.జి.ల సాధన కృషికి అర్బన్ అగ్రికల్చర్ ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే, విభిన్న ప్రదేశాల్లో ఈ కార్యకలా΄ాల వల్ల ఎదురయ్యే సవాళ్లను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అధిగమించటం ముఖ్యం’ అన్నారు. అర్బన్ అగ్రికల్చర్ కార్యకలాపాలలో సుస్థిరతకు దోహదం చేసే పద్ధతులను అనుసరించటం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా నగరాల అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ‘అర్బన్ అగ్రికల్చర్ వల్ల చేకూరే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి అందుబాటులో ఉన్న సైంటిఫిక్ లిటరేచర్ను విశ్లేషించడానికి మా అధ్యయనం ద్వారా కృషి చేశాం. మొత్తంగా చూసినప్పుడు అర్బన్ అగ్రికల్చర్ వల్ల ఆహారం, విద్య, సాంఘిక సదుపాయాలను కల్పించటంతో పాటు జీవవైవిధ్యాన్ని పెంపోందించేందుకు సుస్థిరత ఎలా చేకూరుతుందో శాస్త్రబద్ధంగా ఈ అధ్యయనం రుజువులు చూపింది’ అని డాక్టర్ ప్రజల్ ప్రధాన్ వివరించారు. తాజా పోషకాహారం లభ్యతపోషకాలతో కూడిన తాజా ఆహారోత్పత్తులను స్థానికంగానే అందుబాటులోకి తేవటం.. దూరప్రాంతాల నుంచి ఆహారాన్ని తరలించాల్సిన అవసరాన్ని తగ్గించటం.. ఆహారోత్పత్తుల్ని వందల కిలోమీటర్ల నుంచి తీసుకురావటానికి ఖర్చయ్యే ఇంధనాన్ని ఆదా చేయటం ద్వారా కాలుష్యాన్ని(ఫుడ్ మైల్స్‌ను) తగ్గించటం.. వివిధ సామాజిక వర్గాల ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని పెం΄÷ందించటం.. మానసిక ఆరోగ్యాన్ని పెం΄÷ందించటం వంటివి అర్బన్ అగ్రికల్చర్ ప్రయోజనాలని ఈ అధ్యయనం తేల్చింది. బీజింగ్ ఫారెస్ట్ యూనివర్సిటీ (చైనా) పరిశోధక విద్యార్థి దయ రాజ్ సుదేబ్ ఇలా అన్నారు:‘అవకాశాలను ఉపయోగించుకునేలా ప్రజలు, సంస్థలు, ప్రభుత్వాలు అర్బన్ అగ్రికల్చర్ పద్ధతుల్లో సుస్థిర లక్ష్యాల సాధన దిశగా పరివర్తన తేవాలి..’ప్రతిబంధకాలుశుద్ధమైన, చవక ఇంధనం లభ్యతకు సంబంధించి 3,6,7 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, జలచరాల జీవన భద్రతకు సంబంధించి 11,12,14,16 ఎస్.డి.జి.లకు సంబంధించి అర్బన్ అగ్రికల్చర్ ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. నీరు, ఇంధనం, ఎరువులు, పురుగుమందుల అధిక వాడకం వల్ల నేల, నీరు కలుషితం కావటం.. వనరులు ఉన్న వారికే ప్రయోజనాలను పరిమితం చేయటం ద్వారా పేదలకు ఫలితాలను అందించలేని పరిస్థితులు నెలకొనటం వంటి ప్రతిబంధనాలు అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. ఈ సవాళ్లను సమర్థవంతంగా అధిగమించడానికి చర్యలు తీసుకుంటే అర్బన్ అగ్రికల్చర్ సుస్థిర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందనటంలో సందేహం లేదు. -
జీవితాలను పండించుకుంటున్నారు! సలాం!
ప్రస్తుతం వ్యవసాయంలో విచ్చలవిడిగా వినియోగిస్తున్న రసాయనాల వల్ల పంటలు కలుషితమవడంతో పాటు మట్టిలో సూక్ష్మజీవులు నశించి΄ోతున్నాయి. పర్యావరణానికి హాని కలగటమే కాకుండా మానవాళి అనారోగ్యానికి ఆహారంలోని రసాయనాల అవశేషాలు కారమణవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావు పేటకు చెందిన మహిళా రైతులు కొందరు ఈ ముప్పును గుర్తించారు. విషపూరిత ఆహార పదార్థాల నుంచి కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ప్రకృతి సాగుకు నడుం బిగించారు. ఒకవైపు భూసారాన్ని పెంచుతూ మరోవైపు అధిక దిగుబడులు సాధిస్తూ తమ జీవితాలను పండించుకుంటున్నారు.ప్రకృతి వ్యవసాయ విభాగం మహిళలకు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తోంది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ద్వారా మహిళా రైతులను గుర్తించి గ్రామాల వారీగా అవగాహన కల్పించి, ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు ప్రకృతి సేద్యమే ఏకైక మార్గమని నమ్ముతున్న మహిళా రైతులు ఇప్పుడిప్పుడే ప్రకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతున్నారు. మహిళా సంఘాల్లోని ప్రతి మహిళా కనీసం తన ఇంటికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలనైనా పెరటి తోటల్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించుకునే విధంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిపుణులు, అధికారుల కృషి ఫలిస్తోంది. గత నాలుగేళ్లలో జిల్లాలో ప్రకృతి సాగు అంచనాకు మించి విస్తరించింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని కూడా వ్యవసాయ శాఖ రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికెల) పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో సిబ్బంది ఆర్బీకేల్లోనే రైతులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయానికి వాడే ఉత్పాదకాలను స్వయంగా రైతులే పొలం దగ్గర తయారు చేసుకొని వాడాలని, బయట కొనకూడదన్నది ఒక నియమం. అయితే, నాటు ఆవు లేక, ఉన్నా వాటిని తయారు చేసుకునే ఓపిక, తీరిక లేని వారు ప్రకృతి సాగుపై ఆసక్తి ఉన్నా ముందడుగు వేయలేక΄ోతున్నారు. అటువంటి వారి కోసం ఒక్కో మండలంలో ఐదు నుంచి పది వరకు ఎన్‌పీఎం (నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్) షాపులను ప్రకృతి వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ పద్ధతిలో సాగు చేసిన రైతుల ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ ద్వారా 10 నుంచి 15 శాతం అధిక మద్దతు ధర చెల్లించేలా ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. అ మేరకు రైతులతో ముందస్తుగా ఒప్పందం చేసుకొని ఉత్పత్తులను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండించిన ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతోంది. వినియోగదారులే రైతుల వద్దకు వచ్చి అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. దీనితోపాటు.. టీటీడీతోపాటు మరో 11 ప్రధాన దేవస్థానాలు మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దిగుబడులు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. – పుట్లూరి శివకోటిరెడ్డి, సాక్షి, నరసరావుపేట రూరల్ ఉద్యమంగా ప్రకృతి వ్యవసాయంప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను నైవేద్యాల తయారీకి వాడేందుకు టీటీడీతో ΄ాటు మరో 11 దేవస్థానాలు మూడేళ్లుగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది ప్రకృతి వ్యవసాయదారులకు మంచి గుర్తింపు. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నాం. – కె.అమలకుమారి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, నరసరావుపేట పెట్టుబడి తక్కువ.. ఒక ఎకరంలో వరి, మరో ఎకరంలో మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి తగ్గింది. దిగుబడి బాగుంది. ఈ ఉత్పత్తులకు అధిక ధర వస్తుండటంతో లాభదాయకంగా ఉంది. – శివలక్ష్మి, మహిళా రైతు, ఏనుగు΄ాలెం, వినుకొండ మండలం, పల్నాడు జిల్లాదిగుబడి బాగుంది.. మా రెండు ఎకరాల్లో పంట సాగు చేసేందుకు గతంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయాం. కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించారు. ఖర్చులు తగ్గాయి. దిగుబడులు పెరిగాయి. – లక్ష్మీదుర్గ, మహిళా రైతు, కారుమంచి, శావల్యాపురం మండలం ఇదీ చదవండి: తాతల నాటి నత్త మాంసం కూర తిన్నారా? అనేక రోగాలకు మందు! -
గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు
గాక్ ఫ్రూట్.. అత్యంత ఖరీదైన పండు. మనకు కొత్త పంట. కానీ, అనేక దక్షిణాసియా దేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఎన్నెన్నో ΄ోషకాలు, ఔషధ గుణాల గని ఈ అద్భుత పండు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయుక్తమైన పండ్ల జాతి గాక్. కేరళ, కర్ణాటకలో అతికొద్ది మంది ఇంటిపంటగా సాగు చేస్తున్న ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పెరట్లో సాగు చేస్తూ.. కిలో రూ. 500కు విక్రయిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంటిపంటగా, వాణిజ్య పంటగా సాగు చేసుకోదగిన ఈ కొత్త పంటపై ప్రత్యేక కథనం. బొరగం వెంకట్ బీటెక్ చదువుకొని పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకే అయితే పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదైనా మంచి కొత్త పంటను మన ప్రజలకు పరిచయం చేయాలన్న తపనతో ఇంటర్నెట్ సహాయంతో లక్షణమైన గాక్ ఫ్రూట్‌ను సాగు చేయనారంభించారు. వెంకట్ స్వస్థలం ఏలూరు జిల్లా పోలవరం మండలం లోని మామిడిగొంది గ్రామం. గాక్ ఫ్రూట్‌ను కేరళలో కొందరు సాగు చేస్తుండటాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వెంకట్, మొక్కలు తెప్పించి తన ఇంటి పెరట్లో 2023 నవంబర్ నెలలో నాటారు. సుమారు 300 మొక్కల్ని నాటి, పందిరి పైకి పాకించారు. ఇందులో కొన్ని ఆడ, మగ మొక్కలు కలిసి ఉన్నాయి. చాలా ఏళ్లపాటు పండ్ల దిగుబడిని ఇవ్వటంతోపాటు.. ఏడాది పొడవునా పండ్లను అందించే అద్భుత తీగజాతి పంట ఇది. అవగాహన లోపం వల్ల మొక్కల్ని దగ్గరగా నాటటం వల్ల కొన్ని మొక్కలు చనిపోయాయని, ప్రస్తుతం 120 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని వెంకట్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. రెండు నెలల క్రితం నుంచి చక్కని ఎర్రటి పండ్ల దిగుబడి తీసుకుంటున్నానని, ఎంతో ఆరోగ్యకరమైన ఈ పండ్లకు చాలా గిరాకీ ఉందని వెంకట్ తెలి΄ారు. గాక్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్న ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కిలో పండ్లకు రూ. 500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా చెప్పారు. ఒక్కో పండు అరకేజీ వరకు బరువు పెరుగుతోంది. ప్రతి రెండు ఆడ మొక్కల పక్కన ఒక మగ మొక్కను నాటుకోవాలని, 6“6 అడుగుల దూరంలో నాటుకొని పందిరి వేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు ఏడాది పొడవునా నిరంత రాయంగా పండ్ల దిగుబడి వస్తూ ఉంటుందన్నారు. దీని తీగలు ఎంత విస్తారంగా పెరిగే వీలుంటే అన్ని ఎక్కువ పండ్ల దిగుబడి వస్తుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నారు. ఆకాకర జాతికి చెందిన గాక్ ఫ్రూట్ పైన కూడా నూగు ఉంటుంది. లోపల గుజ్జుతో ΄ాటు గింజలు ఎక్కువగానే ఉంటాయి. గింజల్ని తీసేసి గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే పోషకాల లోపం తగ్గి΄ోతుందని, జబ్బులు సైతం తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. గాక్ ఫ్రూట్ పూలకు కృత్రిమంగా చేతులతో పరపరాగ సంపర్కం చేస్తే అధిక పండ్ల దిగుబడి వస్తుందని, సహజంగా జరిగితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని వెంకట్ వివరించారు. గాక్ ఫ్రూట్ పువ్వు రెండు నెలల్లో పిందె నుంచి పండు దశకు పెరుగుతుంది. రంగులు మారుతుంది. పిందె పడిన తొలి నెలలో ఆకు పచ్చగా ఉంటుంది. ఈ దశలో ఈ కాయలను గోకాకర మాదిరిగానే కూరవండుకొని తినొచ్చు. దోస కాయ మాదిరి రుచి ఉంటుందన్నారు. రెండో నెలలో మొదటి పది రోజుల్లో పసుపు పచ్చ రంగుకు మారుతుంది. 20 రోజులకు నారింజ రంగులోకి మారి, 30 రోజులకు ఎర్రగా మారుతుంది. పండు పండిన తర్వాత త్వరగా మెత్తబడి పోతుందని వెంకట్ వివరిస్తున్నారు. విత్తనాలు నల్లగా ఉంటాయి. యూట్యూబ్ ద్వారా వెంకట్ దగ్గర ఈ కొత్త పంట సాగవుతున్నట్లు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన శాఖ అధికారులను పంపారు. పండ్లతో పాటు కొన్ని మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా సాగు చేయించటం ప్రారంభించారు. గాక్ ఫ్రూట్ పోషక విలువలతో కూడిన పంటని, దీన్ని సులువుగా తీగ ముక్కలను కత్తిరించి నాటుకోవచ్చని వెంకట్ ఇంటిపంటను పరిశీలించిన ఉద్యానాధికారి సందీప్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. ఇది చీడపీడలు ఆశించని పంటని, సాగు చేయటం కూడా సులువేనని అన్నారు. ఇద్దరు రైతులతో తాము ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామన్నారు. వియత్నాం, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో చిరకాలంగా సాగులో ఉన్న గాక్ ఫ్రూట్‌ను అనాదిగా సందప్రదాయ వైద్యంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని యూనివర్సిటీ సైన్స్ మలేషియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైకోపెన్, బీటా కెరోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల కేన్సర్, అల్సర్లు, కంటి సమస్యలు తదితర జబ్బుల్ని నయం చేసే విశేష ఔషధ గుణాలు గాక్ ఫ్రూట్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా జర్నల్ ఆఫ్ క్రాప్సైన్స్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలకు గాక్ ఫ్రూట్ ముడిసరుకుగా ఉపయోగపడుతున్నందున వాణిజ్యపరమైన విలువ కలిగి ఉండటం మరో విశేషం. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్కిలో రూ. 500కు అమ్ముతున్నామన ప్రాంతానికి ఓ మంచి కొత్త పంటను పరిచయం చేయాలనే తపన నాకుండేది. ఇంటర్నెట్లో గాలిస్తుండగా గాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. కేరళలో ఒకరి దగ్గరి నుంచి మొక్కలు తెప్పించి నాటా. 20 సెంట్ల నా పెరటి తోటలో గాక్ ఫ్రూట్స్ వారానికి 10–15 కిలోల వరకు పండుతున్నాయి. కూరకు ఉపయోగపడే పచ్చి గాక్ కాయలను కిలో రూ. 300కు అమ్ముతున్నా. కేరళలో కిలో రూ. 1,000 – 1,500 వరకు అమ్ముతున్నారు. గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొదించటంతో పాటు.. షుగర్, కేన్సర్ వంటి జబ్బుల్ని కూడా నయం చేస్తుంది. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వాళ్లు ముందే బుక్ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. మొక్కలు కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. – బోరగం వెంకట్ (77999 11174), గాక్ ఫ్రూట్ సాగుదారు, మామిడిగొంది, పోలవరం మండలం, ఏలూరు జిల్లా -
ముళ్లు లేని బ్రహ్మజెముడుతో బయోగ్యాస్!
ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్ లెస్ కాక్టస్) పంటను కరువు ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ పశుగ్రాసం కోసం సాగు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు దీనితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్కల్ని తీవ్ర కరువు పరిస్థితుల్లో.. నిస్సారమై వ్యవసాయానికి పనికిరాని భూముల్లో (మన దేశంలో వ్యవసాయ భూమిలో 40శాతం ఇప్పటికే నిస్సారమై సాగు యోగ్యం కాకుండా΄ోయిందని అంచనా) కూడా సాగు చేయొచ్చు. ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా అడుగులు వేశారు కూడా. అయితే, బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం వాడుతున్న పశువుల పేడకు బదులు పాక్షికంగా బ్రహ్మజెముడు మొక్కల్ని వాడొచ్చని తాజాగా రుజువైంది. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఆవిష్కరణ కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మజెముడుతో బయోగ్యాస్‌పై పరిశోధన జరుగుతోంది. కరువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశువుల పేడతో బయోగ్యాస్ ద్వారా 65% బయోమీథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పేడపై ఆధారపడటం తగ్గించి బ్రహ్మజెముడును వాడుతున్నారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్ ఉమ్మడిగా ఝాన్సీలో పరిశోధనలు చేపట్టాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్క ఆకులను పశుగ్రాసంగా, çపర్యావరణహితమైన తోలు ఉత్పత్తులకు ముడిసరుకుగా, బయోగ్యాస్ ఉత్పత్తితో ఇంధనంగా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బ్రహ్మజెముడు స్లర్రీని సేంద్రియ ఎరువుగా, ఈ చెట్టు పండ్లు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. ఈ పండ్లను అనేక దేశాల్లో ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా ఇష్టంగా తింటారు. బ్రహ్మజెముడు ఆకుల గుజ్జుతో పాటు కొంతమేరకు పేడను కలిపి చేసిన బయోగ్యాస్ ప్రయోగాత్మక ఉత్పత్తిలో 61% వరకు మీథేన్ కంటెంట్‌ను సాధించడం విశేషం. దీంతో ఇది వాణిజ్యపరంగా లాభదాయకమైనదేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిప్ ద్వారా నీటిని అందించటం, ఎరువుల వాడకం ద్వారా ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట ఉత్పాదకతను పెంచే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక్కో బ్రహ్మజెముడు మొక్క ఏడాదికి 69 కిలోల బొగ్గుపులుసు వాయువును గ్రహిస్తుందట. రైతులకు కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇదీ చదవండి : గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు -
Sagubadi: ‘ఐ గ్రో యువర్ ఫుడ్’.. ఉద్యమం!
అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ ఉద్యమ సంస్థల సమాఖ్య (ఐ.ఎఫ్.ఓ.ఎ.ఎం. –ఐఫోమ్) పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు ఈ నెల 10వ తేదీన ‘ఐ గ్రో యువర్ ఫుడ్’ పేరిట వినూత్న ప్రచారోద్యమాన్ని చేపట్టారు. ప్రజల కోసం రసాయనాల్లేకుండా ఆరోగ్యదాయకంగా చేపట్టిన సేంద్రియ వ్యవసాయం– మార్కెటింగ్ తీరుతెన్నులు.. సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి ప్రజలు చేయగల సహాయం ఏమిటి? వంటి అంశాలపై తమ అభి్రపాయాలతో కూడిన వీడియోలను సేంద్రియ రైతులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఐగ్రోయువర్ఫుడ్.. బయో పేరిట ఏర్పాటైన ప్రత్యేక వెబ్సైట్లో, ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్‌కు చెందిన వెబ్సైట్/ఎక్స్/యూట్యూబ్/ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా వేదికల్లో ప్రపంచ దేశాల సేంద్రియ రైతుల షార్ట్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసిన ప్రజలు/వినియోగదారులు తమ అభి్రపాయాలను, సూచనలను పంచుకోవడానికి వీలుంది.ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ 1972లో ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. వంద దేశాల్లోని సుమారు 700 సేంద్రియ వ్యవసాయ సంస్థలకు ఇప్పుడు ఐఫోమ్ సభ్యత్వం ఉంది. ఆరోగ్యం, పర్యావరణం, న్యాయం, శ్రద్ధ అనే నాలుగు మూల సూత్రాలపై ఆధారపడి సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరింపజేయటమే ఐఫోమ్ తన లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రియ వ్యవసాయానికి అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించటంతో పాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజన్సీలకు అక్రెడిటేషన్ ఇస్తుంది. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఆహారోత్పత్తి చేసి ప్రజలకు అందిస్తున్న రైతుల్లో 80% మంది చిన్న, సన్నకారు రైతులేనని ఐఫోమ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 57 కోట్ల వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో 90% క్షేత్రాలు ఒంటరి రైతులు లేదా రైతు కుటుంబాలే నడుపుతున్నారు. సంస్థలు/కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవసాయ క్షేత్రాలు మిగతా పది శాతం మాత్రమే. https://igrowyourfood.bio/కేరళలో కౌలు సేద్యం చేస్తున్నా..!నా పేరు షమికా మోనే, మహారాష్ట్రలో పుట్టా. పరిశోధనలు వదలి పెట్టి సేంద్రియ రైతుగా మారా. కేరళలో భూమిని కౌలుకు తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అనేక రకాల దేశీ వరితో పాటు కూరగాయలు పండిస్తున్నా. పంట విత్తిన దగ్గర నుంచి నూర్పిడి,ప్రాసెసింగ్ వంటి పనులు సాధ్యమైనంత వరకు నేనే చేసుకోవటం అద్భుతమైన అనుభవం. నేను పండించిన ఆహారోత్పత్తుల్ని తింటున్న స్నేహితులు, బంధువులు చాలా సంతోషంగా ఉన్నారు. సీజన్‌కు ముందే డబ్బు పెట్టుబడిగా ఇస్తారు. పంటలు పండించిన తర్వాత.. తమకు అవసరమైన ఆహారోత్పత్తుల్ని తీసుకుంటున్నారు. దేశీ వరి బియ్యం, అటుకులతో చేసిన స్థానిక సంప్రదాయ వంటకాలను పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఐఫోమ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ పిలుపు మేరకు ‘ఐగ్రోయువర్ఫుడ్’ ఉద్యమంలో భాగస్వామిని కావటం సంతోషంగా ఉంది.– షమిక మోనె, సేంద్రియ యువ మహిళా రైతు, కేరళ -
Sagubadi: ప్రకృతి సేద్యం.. బతికించింది!
దేవేంద్ర మాటలు అనంతపురం జిల్లాకు చెందిన లక్షలాది మంది రైతుల కష్టాలను ప్రతిబింబిస్తాయి. ప్రపంచంలోని ఇతర కరువు పీడిత ్రపాంతాల మాదిరిగానే ఇక్కడ వ్యవసాయం ఒక సవాలు. గత ఏడాది కరువుకు అధిక ఉష్ణోగ్రతలు తోడు కావటంతో ఎండుతున్న చీనీ తోటలు.. పంట నష్టాల మధ్య.. ఈ విద్యాధిక యువ రైతుది ఓ ఆశావహమైన కథ.‘నా పేరు పొత్తూరు దేవేంద్ర. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చిన్నమల్లేపల్లి గ్రామం. గత ఏడాది లోటు వర్షపాతంతో మా ్రపాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మాకు 2.5 ఎకరాల సాగు భూమి ఉంది. మా నాన్న చిన్న వెంకట స్వామి 30 ఏళ్లు సంప్రదాయ రసాయన వ్యవసాయం చేశారు. ఆ రోజుల్లో కుటుంబ ఖర్చులకూ కనా కష్టంగా ఉండేది. ఎమ్మే చదివాను. గత 15 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను.నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. విత్తనాలు వేయటం నుంచి పంట నూర్పిడి వరకు ప్రతి పనినీ మనసు పెట్టి చేస్తున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంది. అంతేకాదు, వ్యవసాయ పనులను మరింత నైపుణ్యంతో చేయటం నేర్చుకున్నారు. మాకున్న 2.5 ఎకరాల్లో ఒక ఎకరంలో చీనీ(బత్తాయి) తోట ఉంది. నీటి సౌకర్యం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది జూలై 31న అలసంద, పొద చిక్కుడు, సజ్జలు, కందులు, ఆముదం విత్తనాలను గుళికలుగా మార్చి.. వానకు ముందే విత్తే (పిఎండిఎస్) పద్ధతిలో విత్తాను.ప్రూనింగ్ చేసి ఘనజీవామృతం వేస్తున్న రైతుఅప్పటి నుంచి 13 నెలలుగా చీనీ చెట్ల మధ్యలో భూమిని ఒక్కసారి కూడా దున్నలేదు. కానీ, మట్టిలో బెజ్జాలు చేసి చేతులతో విత్తనాలు వేస్తూ.. ఏడాది పొడవునా కాలానుగుణమైన అంతర పంటలు పండిస్తూనే ఉన్నాం. ఇలా ఏడాది పొడవునా పంటలతో పొలాన్ని ఆకుపచ్చగా కప్పి ఉంచుతున్నాం. పడిన కొద్దిపాటి వర్షంతోనో లేదా కొద్దిపాటి నీటి తడి ద్వారానో మట్టిలో తేమను నిలుపుకుంటున్నాం. చీనీ చెట్లకు, అంతర పంటలకు అవసరమైన విధంగా నిరంతరాయంగా తేమ అందుతున్నట్లు పచ్చని పొలాన్ని చూస్తే నిర్ధారణ అవుతోంది. గత వేసవిలో అతి వేడి పరిస్థితుల్లో కూడా నేలలో తగినంత తేమ ఉంది. గడ్డీ గాదం, పంట అవశేషాలతో నేలను కప్పి ఉంచటం కూడా తోటను పచ్చగా ఉంచడంలో సహాయపడుతోంది. వీటన్నింటితో కరువు పరిస్థితులను అధిగమిస్తున్నా.నాలుగేళ్లలో ఎంతో మార్పు..ప్రకృతి వ్యవసాయం చేపట్టిన తర్వాత ఈ నాలుగేళ్లలో మా పొలం మట్టిలో, చీనీ చెట్లలో అనేక మార్పులను గమనించాను. వానపాములు, సూక్ష్మజీవులు పనిచేయటం వల్ల మట్టిలో జీవవైవిధ్యం పెరిగింది. అందుకు రుణపడి ఉన్నాం. మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకోవడం మెరుగుపడింది. ఫలితంగా చీనీ చెట్లలో ఎటువంటి సూక్ష్మధాతు లోపాలు లేవు. మంచి నాణ్యమైన పండ్ల దిగుబడి వచ్చింది. మా నాన్న రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేస్తూ వ్యవసాయం చేసినప్పుడు పరిస్థితి ఇలా లేదు. గత ఏడాది అధిక ఎండలకు మా పొలానికి దగ్గర్లోని తోటల్లో కూడా చీనీ చెట్లు ఎండిపోయాయి. రైతులు చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నో రసాయనాలను స్ప్రే చేశారు. కానీ చీనీ చెట్లను రక్షించుకోలేకపోయారు.ఎపిసిఎన్ఎఫ్ చీఫ్ టెక్నాలజీ– ఇన్నోవేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ్రపాజెక్ట్ మేనేజర్ లక్ష్మా నాయక్ చనిపోతున్న చీనీ చెట్లను ఎలా రక్షించుకోవాలో మాకు నేర్పించారు. ఆయన చెప్పినట్లు.. 50 శాతం ఎండిన చెట్ల కొమ్మలను నేల నుంచి 2 అడుగుల ఎత్తులో కత్తిరించి, మోళ్లకు తడి ఘన జీవామృతం పూసి, ద్రవజీవామృతం పిచికారీ చేశాం. ఆ తర్వాత చెట్టు చుట్టూ 2 అడుగుల వెడల్పున పాది చేసి, ఘనజీవామృతాన్ని వేసి, అనేక పంటల విత్తనాలు చల్లి, దానిపైన మట్టి వేశాం.కాయలతో కళకళలాడుతున్న చీనీ చెట్లుఇటువంటి పద్ధతులతో మట్టిలో సూక్ష్మజీవుల కార్యకలాపాల ఫలితంగా చనిపోతున్న చెట్లు కూడా బతికాయి. 20–25 రోజుల్లో కొత్త చిగుర్లు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ చెట్లు పునరుజ్జీవం పొందాయి. మృత్యువాత పడుతున్న చీనీ చెట్లను కాపాడుకోగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వెనుక ఉన్న సై¯Œ ్సను అర్థం చేసుకొని ఆశ్చర్యపోయాను. రసాయనిక వ్యవసాయం చేసిన రోజుల్లో అనేక మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాం. వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించిన తర్వాత పరిస్థితి మారింది. నా పొలంలో 365 రోజులు కాలానుగుణమైన కూరగాయలు, ఇతర ఆహార పంటలను అంతర పంటలుగా పండించడం ్రపారంభించాను. బయటి నుంచి ఏదైనా ఆహారాన్ని కొనుగోలు చేయడం మానేశాను. మనం ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నది తినడం వల్ల, హాస్పిటల్ ఖర్చులు, మీరు నమ్ముతారో లేదో గాని, దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.ఎకరంలో 10 టన్నుల బత్తాయిలు..ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) మోడల్‌తో పాటు ఏ–గ్రేడ్ మోడల్లో కూడా పంటలు సాగు చేస్తున్నాం. మా కూరగాయలు, తదితర పంటలను ఇంట్లో వాడుకోగా, అదనంగా వీటి ద్వారా ప్రతి నెలా రూ. 4–5 వేల వరకు ఆదాయం వస్తోంది. కుటుంబం ఖర్చులు తీరుతున్నాయి. ఈ ఒక ఎకరం చీనీ తోట నుండి ప్రతి సంవత్సరం సగటున 10 టన్నుల బత్తాయిలు పండిస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా, మేం టన్ను బత్తాయి పండ్లను సగటున రూ. 30–33 వేలకు అమ్ముతున్నాం. ఏటా కనీసం రూ. 3 లక్షల ఆదాయం బత్తాయిల ద్వారా వస్తోంది. ఇక చెట్ల మధ్యలో సాగు చేసే బొబ్బర్లు, పొద అనప, కంది, సజ్జ, ఆముదం పంటలతో పాటు సూపర్ నేపియర్ గడ్డి ద్వారా వచ్చే ఆదాయం కలిపితే మొత్తం రూ. 4 నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది..’ – దేవేంద్ర, మొబైల్: 79976 44711గేదెలకూ ఇతర జంతువుల మాదిరిగానే కంటి శుక్లం సమస్య వస్తుంటుంది. కంటి కటకం తెల్లగా మారడం వల్ల దృష్టి లో΄ానికి లేదా అంధత్వానికి దారితీస్తుంది. గేదె కన్ను తెల్లగా మారినా, వాపు ఉన్నా.. కళ్ళు కనపడక వస్తువుల్ని ఢీ కొట్టడం వంటి లక్షణాలను బట్టి శుక్లం వచ్చినట్లు భావించాలి..కారణాలు..– వయస్సు: ముసలి గేదెలకు కంటిశుక్లం వచ్చే అవకాశం ఎక్కువ.– జన్యువులు: వారసత్వంగా వచ్చిన జన్యు కారణాల వల్ల కొన్ని గేదెల్లో కంటిశుక్లం రావచ్చు.– ΄ోషకాహార లోపం: విటమిన్ ఎ వంటి ముఖ్యమైన ΄ోషకాలు లోపించటం వల్ల కంటిశుక్లం ఏర్పడుతుంది.– అంటువ్యాధులు: కొన్ని అంటువ్యాధులు, ముఖ్యంగా కంటిని ప్రభావితం చేసేవి, కంటిశుక్లాలకు కారణమవుతాయి.– గాయం: గాయం వల్ల కంటి కటకాలు దెబ్బతిని శుక్లాలకు దారితీస్తుంది.– రసాయనాలు: కొన్ని రసాయనాలు/ విషతుల్య పదార్థాలు తగలటం వల్ల కంటిశుక్లం ఏర్పడవచ్చు.హోమియోపతి చికిత్స యుఫ్రేసియ– క్యు: కంటిలో 3 చుక్కలు.. రోజుకు 3 సార్లు.. 10 రోజులు వేయాలి.యుఫ్రేసియ 200: 10 మాత్రలు.. రోజుకు 2 సార్లు.. 10 రోజులు వేయాలి. 5 రోజుల్లోనే పూర్తిగా ఫలితం కనపడుతుంది.– డా. జి. రాంబాబు (94945 88885), పశువైద్యాధికారి, కడప -
డ్రాగన్ పౌడర్ టెక్నాలజీ రెడీ!
అధికంగా యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థం, ఇంకా ఇతర పోషకాలతో కూడిన డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో సూపర్ ఫ్రూట్‌గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రారంభమైన 5–7 ఏళ్లలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పాటు మరో 9 రాష్ట్రాలకు డ్రాగన్ సాగు విస్తరించింది. పింక్/రెడ్, వైట్ పల్ప్ రకాలు సాగవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు ‘కమలం’ అని పేరుపెట్టింది. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) గత ఏడాది డ్రాగన్ జ్యూస్ ఉత్పత్తి సాంకేతికతను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా, రెడ్/పింక్ డ్రాగన్ ఫ్రూట్‌తో పౌడర్ (పిండి)ని తయారు చేసే టెక్నాలజీని రూపొందించింది. కర్ణాటకలోని కొడగు జిల్లా చెట్టల్లిలోని ఐఐహెచ్‌ఆర్‌కు చెందిన కేంద్రీయ ఉద్యాన పంటల ప్రయోగ కేంద్రం ఈ టెక్నాలజీ అభివృద్ధికి వేదికైంది.డ్రాగన్ పండ్లతో పిండిగా మార్చే ప్రక్రియలో రెండు పద్ధతులున్నాయి. స్ప్రే డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ. 4 వేలు, ఫ్రీజ్ డ్రైడ్ పద్ధతిలో తయారైన పిండికి కిలో రూ.12 – 15 వేల ధర పలుకుతోంది. ఈ రెండు పద్ధతుల్లో పిండిని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే, ఇందులో సగం ఖర్చుతోనే డ్రాగన్ పిండిని ఉత్పత్తి చేసే టెక్నాలజీని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇటీవల రూపొందించింది.మార్కెట్లో ఉన్న డ్రాగన్ పిండి కంటే అత్యంత పోషక విలువలతో ఉండే విధంగా ఈ టెక్నాలజీతో డ్రాగన్ పిండిని తయారు చేయవచ్చని, ఈ పిండిని సహజ రంగు పదార్థంగా అనేకప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల్లో కలపవచ్చని ఐఐహెచ్ఆర్ తెలిపింది. ఐస్‌క్రీమ్‌లు, మిల్క్‌షేక్‌లు, జ్యూస్‌లు, కేకులు, బిస్కట్లు, టీ బ్యాగ్స్, మఫిన్స్ తయారీలో డ్రాగన్ పిండిని విస్తృతంగా వాడుతున్నారు. ఐఐహెచ్ఆర్ రూపొందించిన డ్రాగన్ పొడి సాంకేతికతను అందిపుచ్చుకొని రైతులకు మెరుగైన ఆదాయం తెప్పించేందుకు వాణిజ్య సంస్థలు/ ఎఫ్పిఓలు/ కోఆపరేటివ్లు కృషి చెయ్యాలి. -
Sagubadi: పొద చిక్కుడు పంటతో.. ఏనుగులకు చెక్!
లఏనుగులు జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రాకుండా తిప్పికొట్టేందుకు కేరళవాసులు రెండు పద్ధతులను అవలంభిస్తున్నారు. మొదటిది: తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెలు నిర్మించటం. రెండోది: ప్రత్యేక వాసనను వెదజల్లే దేశవాళీ పొద చిక్కుడు పంటను సరిహద్దు పంటగా సాగు చేయటం. మొదటి పద్ధతి కన్నా రెండో పద్ధతి ఎక్కువ ప్రభావశీలంగా పని చేస్తోందని రైతులు చెబుతున్నారు.గ్రామ సరిహద్దుల్లో తేనెటీగల పెట్టెలతో కూడిన కంచెల (బీహైవ్ ఫెన్సెస్)ను ఏర్పాటు చేశారు. ఏనుగులు అడవి నుంచి గ్రామాల వైపు వచ్చే దారిలో ఈ కంచె తీగలను తాకగానే తేనెటీగలు పెద్దపెట్టున శబ్ధం చేస్తూ వాటిని చుట్టుముడతాయి. అవి చేసే శబ్ధం ఏనుగులకు గిట్టదు. అందువల్ల అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకురాలు లూసీ కింగ్ 15 ఏళ్ల క్రితం ఈ పద్ధతిని కనుగొన్నారు. కెన్యా, టాంజానియాలలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి, తేనెటీగల కంచెలు ఏనుగులను సమర్థవంతంగా బెదరగొట్టగలవని నిర్థారించారు. ఆ తర్వాత కేరళలో ఏనుగుల బెడద ఎక్కువగా ఉన్న అట్ట΄్పాడి తాలూకాలో అనేక గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులకు ఏనుగుల నుంచి కొంతమేరకు ఉపశమనం దొరికింది.కేరళలో గిరిజనులు మరో సంప్రదాయ పద్ధతిలో కూడా ఏనుగుల సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆట్టుకొంబ అమర (అట్టాప్పడీ డొలిఖోస్ బీన్ లేదా లాబ్లాబ్ బీన్) అనే స్థానిక రకం పొద చిక్కుడు పంటను ఏనుగులు గ్రామాల్లోకి వచ్చే మార్గాల్లో సాగు చేయటం ద్వారా వాటì రాకను సహజ పద్ధతిలో నిరోధించవచ్చని గిరిజన రైతులు గుర్తించారు.అట్టాప్పడీ తాలూకాలోని మూలకొంబు అనే గ్రామవాసి అయిన చింది అనే 65 ఏళ్ల మహిళా రైతు ఏనుగులను నిరోధించేందుకు చెట్టు చిక్కుడును సాగు చేస్తున్నారు. అడవి ఏనుగుల గుంపును తేనెటీగల కంచెలు పూర్తిగా ఆపలేకపోతున్నాయన్నారు. ఆట్టుకోంబ అమర వంటి దేశవాళీ పొద చిక్కుడు పంట ప్రభావం చాలా బాగుందన్నారు. ‘ఈ చిక్కుడు పంటను కంచె పంటగా వేసినప్పటి నుంచి నా పొలం మీద ఏనుగులు దాడి చెయ్యలేదు. అమర చిక్కుళ్లు మంచి ధరకు అమ్ముడు కావటంతో మంచి ఆదాయం కూడా వస్తోంద’ని చింది సంతోషిస్తున్నారు.ఈ చిక్కుడు రకం పంట వెదజల్లే ఒక రకమైన ఘాటు వాసన ఏనుగులు, తదితర వన్య్రపాణులకు గిట్టకపోవటం వల్లనే అవి వెనుదిరిగి వెళ్లి పోతున్నాయని చెబుతున్నారు. ఈ సంగతి శాస్త్రీయంగా ఇంకా రుజువు కానప్పటికీ, ప్రజలకు ఏనుగుల బెడద మాత్రం తీరింది. కేరళలో అనాదిగా సాగవుతున్న ఆట్టుకొంబ అమర చిక్కుళ్లు విలక్షణమైన రకం కావటంతో మూడేళ్ల క్రితం జాగ్రఫికల్ ఇండికేషన్ (జిఐ) గుర్తింపు వచ్చింది. దీంతో ‘బయోసర్టిఫికేషన్’ ఉన్న ఈ చిక్కుళ్లకు ఏకంగా కిలోకు రూ. వెయ్యి వరకు ధర పలుకుతుండటం మరో విశేషం. మళయాళంలో ‘ఆట్టు’ అంటే మేక. ‘కొంబు’ అంటే కొమ్ము. కేరళ గిరిజన రైతులు సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ‘మేక కొమ్ము’లతో ఏనుగులను జయిస్తున్నారన్న మాట! -
Sagubadi: వేపతో స్వయం ఉపాధి..
వారంతా వ్యవసాయం చేసుకునే సాధారణ మహిళలు.. కానీ సేంద్రియ ఉత్పత్తులు తయారుచేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వృథాగా భూమిలో కలిసి పోయే వేప గింజల నుంచి విలువైన వేప నూనె, వేప పిండిని తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి విజయ గాథలోకి వెళదాం...సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గ్ల్ గ్రామంలో సుమారు 15 మంది మహిళలు మూడు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు. ఐదుగురికి ఒక్కో యూనిట్ చొప్పున మూడు యూనిట్లు స్థాపించుకున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలోని వివిధప్రాంతాలకు వెళ్లి వేప గింజలను కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటారు. ఇటు వ్యవసాయం చేసుకుంటూనే సమయం దొరికినప్పుడు వేప నూనె, వేప పిండిని తయారు చేస్తున్నారు.ఏటా వేప చెట్లకు కాసే వేప కాయలు పండి రాలిపోతుంటాయి. ఇలా రాలిపోయిన గింజలను ఆయాప్రాంతాల్లోని మహిళలు, గిరిజనులు సేకరిస్తుంటారు. ఇలా సేకరించి తెచ్చిన గింజలకు అంటుకున్న మట్టిని తొలగించి, ఎండబెట్టి ్రపాసెస్ చేస్తుంటారు. క్వింటాలు గింజలకు ఐదు లీటర్ల వరకు వేప నూనె, 70 నుంచి 90 కిలోల వరకు నూనె తీసిన వేప పిండి (కేకు) తయారవుతుంది. గింజల నాణ్యత బాగుంటే నూనె కాస్త ఎక్కువ వస్తుంది. వేప నూనెను వ్యవసాయంలో పంటలపై చీడపీడల నివారణకు పిచికారీ చేస్తుంటారు. ఔషధాల తయారీకి, చర్మవ్యాధుల నివారణకూ వాడుతుంటారు. వేప పిండిని పంటల సాగులో సేంద్రియ ఎరువుగా వినియోగిస్తుంటారు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నారు.దారి చూపిన డీడీఎస్..చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు సాగు చేసే సేంద్రియ రైతులను ప్రోత్సహించే స్వచ్చంద సంస్థ డక్కన్ డవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) వీరికి వేప కాయలతో సేంద్రియ ఉత్పత్తుల తయారీ పద్ధతిని నేర్పించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితమే వేప గింజల నుంచి నూనె, వేప పిండి తీసే యంత్రాల కొనుగోలు చేసేందుకు రుణ సహాయం అందించింది. ఇప్పుడు ఆ యంత్రాలు పనిచేయడం లేదు. అప్పటి మహిళలకు వయస్సు మీద పడటంతో వారి కోడళ్లు, కూతుళ్లు ఈ యూనిట్లను నడుపుతున్నారు. పాతయంత్రాలు పనిచేయకపోవడంతో కొత్త యంత్రాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం బ్యాంకుల ద్వారా కొంత మొత్తాన్ని రుణంగా పొందారు. ఈ రుణంపై వడ్డీలు పెరిగిపోతుండటం తమకు భారంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ రుణాలను మాఫీ చేసిప్రోత్సహించాలని, లేదంటే కనీసం రుణంపై వడ్డీనైనా మాఫీ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. – పాత బాలప్రసాద్, సాక్షి, మెదక్ జిల్లా ఫొటోలు: మాతంశెట్టి మల్లన్న, జహీరాబాద్ టౌన్అప్పు భారమైంది..ఇటు వ్యవసాయం పని చేసుకుంటూనే ఏడాదిలో 6నెలల పాటు వేప నూనె, వేప చెక్క (కేక్) తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి. ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ప్రస్తుతం సరైన మార్కెట్ లేకపోవడంతో చేసిన కష్టమంతా వృథా అవుతోంది. బ్యాంకు రుణాలను వడ్డీతో కలిపి చెల్లిస్తే మాకు ఏమీ మిగలడం లేదు. బ్యాంకు రుణం రద్దు చేయాలి. కనీసం వడ్డీ అయినా రద్దు చేయాలి. – దవలమ్మ, స్వయం సహాయక బృందం సభ్యురాలుఆర్టీసీ కార్గో ద్వారా పంపుతాం..జడ్చర్ల, కోస్గి వంటిప్రాంతాలకు వెళ్లి వేపగింజలను కొనుగోలు చేసి తెచ్చుకొని వేప నూనె, వేప చెక్క తయారు చేస్తున్నాం. ఇప్పుడు గింజలు దొరకడం కష్టమవుతోంది. ఏడాదిలో ఆరు నెలలు ఈ పనే చేస్తున్నాం. వేప గింజల రేట్లు పెరిగినా వేప నూనె (కిలో రూ.400), వేప చెక్క/కేక్ (కిలో రూ. 35) రేటు పెంచలేదు. వివిధ జిల్లాల్లో సేంద్రియ సాగు చేసే రైతులు ఇక్కడి వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళుతుంటారు. ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ తీసుకొని ఆర్టీసీ కార్గో ద్వారా కూడా పంపుతున్నాం. – సువర్ణమ్మ (88979 04571), స్వయం సహాయక బృందం సభ్యురాలు -
రైతులకు త్వరగా చేరినప్పుడే కొత్త వంగడాల ప్రయోజనం!
వాతావరణ మార్పుల్ని ధీటుగా తట్టుకునే అధిక పోషకాలతో కూడిన 109 కొత్త వంగడాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల విడుదల చేశారు. వీటిల్లోని 5 వంగడాలతో అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్)కు సంబంధం ఉంది. ఇక్రిశాట్లో పెరిగిన తల్లి మొక్కల (పేరెంట్ లైన్స్)ను తీసుకొని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు కొత్త వంగడాలను రూపొందించాయి. ఈ ఐదింటిలో మూడు కంది, జొన్న, సజ్జ వంగడాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైనవి. ఈ వంగడాల రూపకల్పనలో ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు డా. ప్రకాశ్, డా.గుప్తా, డా. ఇఫ్రీన్ ప్రధానపాత్ర పోషించారని ఇక్రిశాట్ ప్రధాన శాస్త్రవేత్త డా.పసుపులేటి జనీల ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఇంతకీ.. ఇప్పుడు విడుదలైన కొత్త విత్తనాలు రైతులకు ఎప్పటికి అందుతాయి? అని ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. కొన్ని పంటల్లో 5 నుంచి 15 ఏళ్లు పడుతోందన్నారు. విత్తన వ్యవస్థలపై శ్రద్ధ కొరవడినందున కొత్త వంగడాలు గ్రామీణ రైతులకు సత్వరమే చేరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 తెగుళ్లను తట్టుకునే సజ్జ హైబ్రిడ్సజ్జ పూసా 1801: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అనువైన హైబ్రిడ్ ఇది. ఇక్రిశాట్‌తో కలసి న్యూఢిల్లీలోని ఐఎఆర్ఐ రూపొందించింది. సజ్జల కోసమే కాకుండా, పశుగ్రాసం కోసం కూడా సాగు చేయతగినది. 5 తెగుళ్లను తట్టుకోగలుగుతుంది. అగ్గి తెగులును, వెర్రి తెగులును పూర్తిగా.. తుప్పు తెగులు, స్మట్, ఆర్గాట్ తెగుళ్లను కొంతమేరకు తట్టుకుంటుంది. ఈ రకం సజ్జల్లో ఇనుము (70 పిపిఎం), జింక్ (57 పిపిఎం) ఎక్కువ. హెక్టారుకు 33 క్వింటాళ్ల సజ్జలు, ఎండు చొప్ప హెక్టారుకు 175 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఇది ప్రకృతి సేద్యానికీ అనువుగా ఉంటుందని డా. జనీల తెలిపారు.కోతకొచ్చినా పచ్చగా ఉండే జొన్నజొన్న ఎస్పిహెచ్ 1943: తెలంగాణకు అనువైన(ఏపీకి కాదు) హైబ్రిడ్ ఇది. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధర్వాడ్(కర్ణాటక) ఇక్రిశాట్‌తో కలసి అభివృద్ధి చేసింది. హెక్టారుకు 39 క్వింటాళ్ల జొన్నల దిగుబడినిచ్చే ఈ రకం ఖరీఫ్‌లో వర్షాధార సాగుకు అనుకూలం. గడ్డి దిగుబడి హెక్టారుకు 116 క్వింటాళ్లు. కోత దశలోనూ గడ్డి ఆకుపచ్చగానే ఉండటం (స్టే గ్రీన్) దీని ప్రత్యేకత. గింజ బూజును కొంత వరకు తట్టుకుంటుంది. తక్కువ నత్రజని ఎరువుతోనే 9% అధిక దిగుబడినిస్తుంది. ప్రకృతి సేద్యానికీ అనువైనదని డా. జనీల తెలిపారు. 5 నెలల కంది సూటి రకంకంది ఎన్ఎఎఎం–88: ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వర్షాధారం/నీటిపారుదల కింద ఖరీఫ్‌కు అనువైన సూటి రకం. ఇక్రిశాట్‌తో కలసి కర్ణాటక రాయచూర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ఈ రకాన్ని అభివృద్ధి చేసింది. 142 రోజుల (స్వల్పకాలిక) పంట. హెక్టారుకు 15 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతమేరకు తట్టుకుంటుంది.పాలకులు శ్రద్ధ చూపాలిశాస్త్రవేత్తలు దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఓ కొత్త వంగడాన్ని రూపొందిస్తారు. కానీ, విడుదలైన తర్వాత కూడా కొత్త విత్తనం రైతులకు సత్వరం అందటం లేదు. వేరుశనగ, శనగ వంటి పంటల్లో 15–18 ఏళ్లు పడుతోంది. వెరైటీల రిలీజ్‌తో పని అయి పోయినట్లు కాదు. ఫార్మల్, ఇన్ఫార్మల్ సీడ్ సిస్టమ్స్‌ను ప్రోత్సహించటంపైపాలకులు దృష్టిని కేంద్రీకరించటం అవసరం. అప్పుడే రైతులు, వినియోగదారులకు కొత్త వంగడాల ప్రయోజనాలందుతాయి. – డా. పసుపులేటి జనీల, క్లస్టర్ లీడర్ – క్రాప్ బ్రీడింగ్, ప్రధాన శాస్త్రవేత్త (వేరుశనగ), ఇక్రిశాట్ -
సేంద్రీయ వ్యవసాయం : ఏడాది పొడవునా ఆదాయం!
ఆ రైతు క్షేత్రం దట్టమైన ఆహారపు అడవిపదేళ్లుగా పాలేకర్ పద్థతిలో గడ్డి మందు సహా, 100% రసాయనాల్లేని సాగు 20 ఎకరాల్లో లక్ష్మణ ఫలం నుంచి అవకాడో వరకు పండ్లు, కూరగాయల సాగుపంటలతో పాటు గొర్రెలు, నాటుకోళ్లు, చేపల పెంపకంతో నిరంతరాదాయం ఆదర్శంగా నిలుస్తున్న మాజీ ప్రభుత్వాధికారి అంజిరెడ్డి సేద్యంఏదుళ్ల అంజిరెడ్డి 2013లో హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నేలతల్లికి ప్రణమిల్లి ప్రకృతి వ్యవసాయదారుడిగా మారారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో అన్ని సంపదల్లో కెల్లా ఆరోగ్య సంపద గొప్పదని భావించి కార్యాచరణకు ఉపక్రమించారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లి వద్ద తన 20 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని దట్టమైన ఆహారపు అడవిగా మార్చారు. తొలుత కుటుంబ అవసరాల కోసం పురుగుమందుల అవశేషాలు లేని పండ్లు, కూరగాయలు సాగు చేయనారంభించి.. వ్యవసాయాన్ని క్రమంగా 20 ఎకరాలకు విస్తరించారు.మామిడి నుంచి అవకాడో వరకు 11 రకాల పండ్లతో పాటు 10 రకాల పంటలను సాగు చేస్తున్నారు. శ్రీగంధం, ఎర్రచందనం, చింత, రావి, వెదురు, సరుగుడు, మహాగని మొక్కల్ని నాటారు. బహురూపి దేశీవరిని సాగు చేస్తున్నారు. గత పదేళ్లుగా భూసారం సమృద్ధిగా వృద్ధి చెందటం ఆ వ్యవసాయ క్షేత్రంలో కనిపిస్తుంది. ఆరోగ్యంగా పెరుగుతూ పచ్చగా ఉన్న తోటలో అనేక చోట్ల పుట్టలు కనిపిస్తాయి. పంటలతో పాటే గొర్రెలు, కోళ్లు..ఏ చెట్టు కింద మట్టిని తీసినా వానపాములు ఉంటాయి. పండ్లు, కూరగాయల సాగే కాకుండా 500కు పైగా గొర్రెలతో అధునాతన ఫామ్‌ను అంజిరెడ్డి గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. గొర్రెల మేత కోసం ఆరోగ్యవంతమైన గడ్డిని పెంచుతున్నారు. తోటలో నాటు కోళ్లను పెంచి గుడ్లను అమ్ముతున్నారు. సీమ కోళ్లు, బాతులు ఉన్నాయి. ఈ సమీకృత వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో కొర్రమీను చేపలనూ పెంచుతున్నారు. డ్రిప్ ద్వారా ద్రవ జీవామృతాన్ని చెట్లు, మొక్కలకు అందిస్తున్నారు. భూమిని దున్నకుండా అవసరం ఉన్న చోటనే పరిమితంగా దున్ని కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. క్రిమికీటకాల నివారణకు వేప నూనెను స్ప్రే చేస్తున్నారు.నేరుగా అమ్మకాలుతన సమీకృత వ్యవసాయ క్షేత్రం దగ్గర, నల్లగొండలోని తన నివాసం వద్ద పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లను ప్రజలకు నేరుగా విక్రయిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు అంజిరెడ్డి. కలుపు మందు సహా ఏ రసాయనాలు వాడకుండా సాగు చేస్తున్నందున దిగుబడుల నాణ్యతను గుర్తించిన నల్గొండ నగర ప్రజలు వచ్చి కొనుక్కెళ్తున్నారు. కూరగాయలు ఏ రకం అయినా కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. కేజీ రూ.420 లెక్కన గొర్రెలను విక్రయిస్తున్నారు. నాటు కోడిగుడ్డు రూ.15, జామ కాయలు కిలో రూ.60, సపోట కిలో రూ.40, నిమ్మ వేసవిలో కిలో రూ.100, వానాకాలంలో కిలో రూ.50, బత్తాయి కిలో రూ.80, మామిడి రూ.100 – 150, కూర అరటి డజన్ రూ.70, అరటి పండ్లు డజన్ రూ.80, నెయ్యి కిలో రూ. 1,200, ΄ాలు లీ. రూ.80 చొప్పున విక్రయిస్తూ అంజిరెడ్డి రోజూ ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా 20 ఎకరాలలో ఖాళీ స్థలం లేకుండా బహుళ పంటలను సాగు చేస్తూ.. జీవాలు, కోళ్లను పెంచుతుండటంతో అంజిరెడ్డి క్షేత్రం ఏడాది పొడవునా దిగుబడులనిచ్చే అక్షయపాత్రగా మారింది. – కుంభం వెంకటేశ్వర్లు గౌడ్, సాక్షి, నల్లగొండ రూరల్ ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ప్రతి రైతూ కుటుంబం కోసమైనా రసాయనాల్లేకుండా పండించాలిభూసారాన్ని కాపాడుకుంటే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. క్యాన్సర్, గుండె΄ోటు, బీపీ, షుగర్ వంటి అనేక రకాల వ్యాధులు రావడానికి రసాయనాలతో పండించిన ఆహరమే కారణం అని గ్రహించాను. రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని మా కుటుంబంతో పాటు ప్రజలకూ అందించటం కోసమే రైతుగా మారాను. ప్రతి రైతూ మిశ్రమ పంటలను తన కుటుంబ అవసరాల కోసమైనా రసాయనాలు లేకుండా సాగు చేసుకోవాలి. విద్యార్థులకు ఇటువంటి వ్యవసాయ క్షేత్రాలు చూపిస్తే వారిలో ప్రకృతి సేద్యంపై, ఆరోగ్యదాయకమైన ఆహారంపై అవగాహన పెరుగుతుంది. రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వారు భవిష్యత్తులో వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతారన్న ఆశతో క్షేత్ర పరిశీలనకు వచ్చిన విద్యార్థులకు వ్యవసాయం గురించి వివరిస్తున్నా. – ఏదుళ్ల అంజిరెడ్డి (99482 55544), ప్రకృతి వ్యవసాయదారుడు, నల్గొండ -
సేంద్రియ సేద్యంపై 21 రోజుల ఉచిత శిక్షణా శిబిరం..
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో ఇమిడి ఉండే అన్ని అంశాలతో పాటు పిజిఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ విషయాలపై పూర్తిస్థాయి శిక్షణ పొందాలనుకునే తెలుగు వారికి ఇదొక గొప్ప అవకాశం. సేంద్రియ/ప్రకృతి సేద్యంలో అన్ని విషయాలతో పాటు పిజిఎస్ సర్టిఫికేషన్‌పై లోతైన అవగాహన కల్పించేందుకు 21 రోజుల పాటు తెలుగులో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరం జరగనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్/నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఓఎన్ఎఫ్) తోడ్పాటుతో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ), కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ (కెఎస్ఎ) సెప్టెంబర్ 5 నుంచి ఉమ్మడిగా ఈ శిబిరాన్ని నిర్వహించనున్నాయి. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, సిఎస్ఎ, కెఎస్ఎల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ శిక్షణా శిబిరం జరగనుండటం విశేషం.విజయవాడకు 50 కిమీ దూరంలో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సమీపంలో శ్రీపద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ నెలకొల్పిన కృష్ణ సుధ అకాడమీ ఆఫ్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఈ శిబిరం జరగనుంది. 38 ఎకరాలలో అత్యాధునిక సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేస్తూ ఆచణాత్మక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటైన కెఎస్ఎకు సుస్థిర వ్యవసాయ కేంద్రం నాలెడ్జ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ 21 రోజుల శిబిరంలో బోధన పూర్తిగా తెలుగులో ఉంటుంది. శిక్షణ, భోజన వసతులు ఉచితం. అభ్యర్థులు కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 30 మందికి అవకాశం.సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలోను, సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపారంలోను స్థానికంగా కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి, నిబద్ధత కలిగిన వారికి సంపూర్ణ అవగాహన కలిగించేందుకే ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు డా. రామాంజనేయులు వివరించారు. స్థానిక స్వయం సహాయక బృందాలు/ ఎఫ్పిఓలు / ఐసిఎస్/ ఆత్మ, పికెవివై, నామని గంగే లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సేంద్రియ వ్యవసాయ పథకాలలో నమోదైన వారికి ్రపాధాన్యం ఉంటుందన్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి.. గూగుల్ ఫామ్‌లో వివరాలు పొందుపరచటం ద్వారా ఈనెల 26లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 85002 83300. జుట్చఃఓటజీటజిn్చ uఛీజ్చిఅఛ్చిఛ్ఛీఝy.ౌటజముచ్చింతల్లో ‘సిరిధాన్యాలతో జీవన సిరి’ శిబిరం..రైతునేస్తం ఫౌండేషన్, స్వర్ణభారత్ ట్రస్ట్ సహకారంతో.. కర్షక సేవా కేంద్రం నిర్వహణలో హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో సిరిధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్‌వలి, డా. సరళా ఖాదర్లచే ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. 3 రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇతర వివరాలకు.. 97053 83666, 70939 73999. -
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్‌గా, ఫంగిసైడ్‌గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
వర్షాధార భూముల్లో.. అధిక దిగుబడినిచ్చే.. సరికొత్త బీటీ పత్తి సూటి రకం!
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న విడుదల చేసిన 61 పంటలకు సంబంధించిన 109 సరికొత్త వంగడాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఉపయోగపడే పత్తి సూటి రకం ఒకటి ఉంది. దాని పేరు సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి). నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్) ఈ బీటీ సూటి రకాన్ని రూపొందించింది.ఇప్పటి వరకూ మార్కెట్లో ఉన్న జన్యుమార్పిడి బీటీ పత్తి వంగడాలన్నీ హైబ్రిడ్ రకాలే. ఇది హైబ్రిడ్ కాదు. ఓపెన్ పొల్లినేటెడ్ వంగడం. అంటే.. రైతులు ఈ విత్తనాన్ని ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు. దూదిలో నుంచి తీసిన విత్తనాన్ని తిరిగి విత్తుకోవచ్చు. పత్తి సాగులో పెద్ద సమస్యగా మారిన పచ్చదోమ వంటి రసంపీల్చే పురుగులతో ΄ాటు తెగుళ్లను సైతం సమర్థవంతంగా తట్టుకుంటుందని సిఐసిఆర్ డైరెక్టర్ డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 రకాన్ని మూడేళ్లు 15 చోట్ల పండించి చూసిన తర్వాత సివీఐసి దీన్ని దక్షిణాది మెట్ట భూముల్లో సాగుకు ఎంపిక చేసింది. హెక్టారుకు సగటున 17.3 క్వింటాళ్ల పత్తి(సీడ్ కాటన్) దిగుబడి వచ్చింది. ఆదిలాబాద్‌లో 2023–24 సీజన్లో సాధారణ దూరంలో విత్తినప్పుడు అత్యధికంగా హెక్టారుకు 32.05 క్వింటాళ్ల దిగుబడినిచ్చింది. ఇతర రకాలతో ΄ోల్చితే 11–18% అధిక పత్తి దిగుబడినిస్తోంది. దూదిపింజ 26 ఎం.ఎం. పొడవుంటుంది. సగటు దూది పటుత్వం 25.8 జి/టెక్స్. 34–38% గింజల్లేని పత్తి దిగుబడినిస్తుంది. ఈ రకం చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది. రసంపీల్చే పురుగులను దీటుగా తట్టుకునే ఈ సరికొత్త బీటీ కాటన్ జినోటైప్ వంగడం దక్షిణాది వర్షాధార తేలిక భూముల్లో అధిక దిగుబడినిస్తుందని సిఐసిఆర్ తెలిపింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనువైనది..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వర్షాధార తేలిక నేలల్లో అధిక సాంద్రతలో విత్తుకోవటానికి సూటిరకమైన సిఐసిఆర్ హెచ్ బీటీ కాటన్ 40 (ఐసిఎఆర్–సిఐసిఆర్ పికెవి 081 బిటి) చాలా అనువైనది. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటూ అధిక దిగుబడినిస్తుంది. సర్టిఫైడ్ సీడ్ వచ్చే ఏడాది ఇవ్వగలం. బ్రీడర్ సీడ్ కొద్ది మొత్తంలో ఉంది. కిలో ధర రూ. 320. వచ్చే ఏడాది విత్తనం కావాలనుకునే వారు ముందుగా బుక్ చేసుకోవచ్చు. నాగపూర్ సిఐసిఆర్లోని విత్తన శాస్త్రవేత్త డా. శాంతిని 98906 84572 నంబరులో సంప్రదించవచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్, మహారాష్ట్ర -
కుంకుడు తోట.. ఎకరానికి రూ.13 లక్షలు!
ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల నిర్వహణ ఖర్చుతో ఈ ఆదాయం పొందటం విశేషం. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటి అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. సరికొత్త కుంకుడు వంగడాన్ని రూపొందించటంతో ΄ాటు కుంకుడు పొడితో సబ్బులు, టూత్‌పేస్టులు తయారు చేస్తున్నారు. కుంకుడు కాయల పొడిని సేంద్రియ పురుగుమందుగా, గ్రోత్ ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా కూడా వాడొచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు. రైతు శాస్త్రవేత్త పద్మారెడ్డి సుసంపన్న అనుభవాలు రైతులకు చక్కని వ్యవసాయ, వ్యా΄ార ΄ాఠాలుగా నిలుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు.నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్టప్రాంత రైతు చేసిన ప్రయోగం అబ్బుర పరిచే ఫలితాలనందిస్తోంది. డిగ్రీ చదువుకున్న పద్మారెడ్డి(59) వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. గతంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పట్టు సాధించారు. ఆయన భార్య శోభారాణి స్వగ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇద్దరు కుమారులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. తన ఊరి వారు, మిత్రులు కుంకుడు మొక్కల తోట చూసి నీకేమైనా పిచ్చా? కుంకుడు చెట్లు చేలో ఒకటో రెండో వేసుకుంటే చాలు. ఎవరైనా ఏకంగా 12 ఎకరాల్లో ఇలా తోట ఎవరైనా పెడతారా పటేలా? అని ఎగతాళి చేశారు. కానీ తన ఆలోచన వేరు. తాను వేరే ఏ తోట పెట్టినా ఆ తోటను బతికించుకోవటానికి తగినంత నీరు లేదు. కుంకుడు చెట్లయితే నీరు పెట్టాల్సిన పని లేదు. మొండి చెట్టు కాబట్టి బతికి పోద్దిలే అన్నది పద్మారెడ్డి ఆలోచన. ఆ చెట్లు పెరిగి మంచి కుంకుడు కాయల దిగుబడి ఇస్తుండటంతో ఆయన ఆలోచన ఎంత ముందుచూపుతో కూడినదో అందరికీ అర్థం అవుతున్నది.8 లక్షల ఎకరాలకు విత్తనాలు..33 ఏళ్ల చెట్టు ఏటా 100 కిలోల కాయలు కాస్తోంది. ఎకరానికి పది వేల కిలోల దిగుబడి. గత సీజన్లో కిలో రూ. 130 చొప్పున అమ్మితే ఎకరానికి రూ. 13 లక్షల ఆదాయం వచ్చిందని పద్మారెడ్డి తెలి΄ారు. ఆనోటా ఈనోటా తెలుసుకున్న అనేక రాష్ట్రాల రైతులు సుమారు 4 లక్షల మంది ఇప్పటికి సందర్శించారు. 8 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలు అమ్మానని, వారిలో చాలా మంది కుంకుడుతోటలు సాగు చేస్తున్నారన్నారు. కాబట్టి, భవిష్యత్తులోనూ ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోలేమని ఆయన స్పష్టం చేశారు. విస్తీర్ణం పెరిగి భవిష్యత్తులో కుంకుళ్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుందన్నారు. ఎంత తగ్గినా, ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎకరానికి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా అయితే ఆదాయం రాదని పద్మారెడ్డి చెబుతున్నారు.కొత్త వంగడం నమోదుకు యత్నాలు..దేశంలోనే అరుదైన ఒక అద్భుత కుంకుడు వనంగా పద్మారెడ్డి తోట గుర్తింపు పొందింది. అనేక రాష్ట్రాల నుంచి రైతులు, అధికారులు ఇప్పటికి లక్షలాది మంది తన తోటను సందర్శించారని ఆయన సంతోషంగా చె΄్పారు. 12 ఎకరాల్లో 1200 కుంకుడు చెట్లను 31 ఏళ్లుగా సాగు చేస్తున్న పద్మారెడ్డి తోటలో 3–4 రకాల కుంకుడు రకాలు ఉన్నాయి. వీటిలో 63 చెట్లు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన గుర్తించారు. మెరుగైన చెట్లను ఎంపిక చేసి సరికొత్త కుంకుడు వంగడాన్ని ఆయన రూపొందించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు పద్మారెడ్డి కుంకుడు క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు. దీనితో ΄ాటు జాతీయ స్థాయిలో దీన్ని సరికొత్త రైతు వంగడంగా అధికారికంగా గుర్తింపు తెప్పించేందుకు దరఖాస్తు చేయటంలో పద్మారెడ్డికి ఉద్యాన వర్సిటీ తోడ్పాటునందిస్తోంది. పిజెటిఎస్ఎయు క్వాలిటీ కంట్రోల్ ప్రయోగశాలలో పద్మారెడ్డి కుంకుడు కాయలపై పరీక్షలు జరిపించారు. ఇందులో అద్భుత ఫలితాలు రావటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.ఒక్కసారి నాటి, మూడు/ నాలుగు సంవత్సరాలు వాటిని కా΄ాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అనుభవాలు చాటి చెబుతున్నాయి. పెద్ద కమతాలు ఉండి, సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.20×20 దూరంలో నాటాలి..కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. 20“20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్‌తో నీటిని అందించాలి. రెండు కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొ΄్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. కుంకుడు మొక్క నాటి డ్రిప్ ఏర్పాటు చేసి, యాజమాన్య పద్ధతులు ΄ాటిస్తే నాలుగో ఏడాది నుంచి 20–30 కిలోల కాపుప్రారంభమవుతుంది. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుంది. నవంబర్–డిసెంబర్లో పూత వస్తుంది. ఏప్రిల్‌లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20–25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి.విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి!33 ఏళ్లుగా 12 ఎకరాల్లో కుంకుడు తోట సాగుచేస్తున్నా. ఏటా 1200–1300 క్వింటాళ్ల ఎండు కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నా. విత్తనాలు కిలో రూ. వెయ్యి, ఇప్పటికి 8 లక్షల ఎకరాలకు అమ్మా. ఇకపై కుంకుళ్లు అమ్మకుండా.. విలువ జోడించి అమ్మాలనుకుంటున్నా. కుంకుడు పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని జోడించి.. కిలో 170కి అమ్ముతున్నా. ఇది పంటలకు పురుగుమందుగా, గ్రోత్‌ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ పొడిని మరింత మెరుగ్గా తయారు చేసి.. బ్రాండ్ చేసి ప్యాక్‌చేసి మార్కెట్లోకి తేబోతున్నా. పండ్ల పొడిగా, టూత్‌పేస్ట్‌గా, కాళ్ల పగుళ్లకు మందుగా.. ఇలా అనేక రకాలుగా కూడా కుంకుడు ఉపయోగపడుతోంది. పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా. కుంకుడు చెట్లకు తేనెటీగలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. ప్రకృతికి కూడా ఈ తోట ఎంతో మేలు చేకూర్చుతోంది. – లోకసాని పద్మారెడ్డి (99481 11931), రైతు శాస్త్రవేత్త, పోలేపల్లి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా– నిర్వహణ: పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్ -
రైతుబడి అగ్రి షో!
తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 17, 18 తేదీల్లో నల్గొండలోని నాగార్జున గవర్నమెంటు కాలేజీ ఆవరణలో జరిగే తొలి వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయం, డెయిరీ, పౌల్ట్రీ, ఆక్వా రంగాలకు చెందిన 150 దేశ విదేశీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 జిల్లాల నుంచి సుమారు 50 వేల మంది రైతులు ఇందులో పాల్గొంటారని భావిస్తున్నారు. సందర్శకులు వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఉచిత పాస్‌లు పొందవచ్చు. ఇతర వివరాలకు.. rbagrishow.com28న అమలాపురంలో కొబ్బరి రైతుల సదస్సు..‘కలసి నడుద్దాం – కొబ్బరికి లాభసాటి ధర సాధిద్దాం’ నినాదంతో ఈ నెల 28 (బుధవారం) ఉ. 10 గం. నుంచి అమలాపురంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కొబ్బరి రైతుల సదస్సును నిర్వహించనుంది. దేశం నలుమూలల నుంచి కొబ్బరి రైతులు ఈ సదస్సులో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 94906 66659, 95425 9966629 నుంచి హైదరాబాద్‌లో నర్సరీ మేళా..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గల పీపుల్స్ ΄్లాజాలో ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 16వ అఖిలభారత నర్సరీ మేళా జరగనుంది. 140 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు...98492 61710.15న తార్నాకలో సేంద్రియ సంత..గ్రామభారతి, సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15న సికింద్రాబాద్‌లోని తార్నాకలో మర్రి కృష్ణ హాల్లో ఉ. 10 గం. నుంచి సా. 6 గం. వరకు బ్యాక్ టు రూట్స్ మూలం సంత పేరిట సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారుల ఉత్పత్తుల సంతను నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు.. 94908 50766, 63051 82620.17న హైదరాబాద్‌లో బయోచార్‌పై సెమినార్..హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో ఈ నెల 17(శనివారం) ఉ. 9.30 నుంచి సా. 6 గం. వరకు బయోచార్ (కట్టెబొగ్గు)పై జాతీయ సదస్సు జరగనుంది. ్ర΄ోగ్రెసివ్ బయోచార్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్, నిమ్స్‌మే, రెయిన్బో బాంబూ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. 63051 71362.18న పెనుకొండలో..బయోచార్ (కట్టెబొగ్గు) ఉత్పత్తిపై ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుకొండలో చార్ గోల్డ్ సంస్థ ఆవరణలో వర్క్‌షాప్ జరగనుంది. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి, ప్రేమ్‌రాజ్ అవగాహన కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. వాట్సప్ – 92463 52018.11న సేంద్రియ చెరకు సాగు, 18న మట్టి సేద్యంపై శిక్షణ..‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ‘కర్షక సేవా కేంద్రం’ నిర్వహణలో హైదరాబాద్ ఖైరతాబాద్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో ఈ నెల 11,18 తేదీల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆగస్టు 11 (ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ పద్ధతిలో చెరకు సాగు, చెరకుతో బెల్లం తయారీ విధానం’పై రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిక్షణ ఇస్తారు.18(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి ‘సేంద్రియ సాగులో మట్టి ద్రావణంతో పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా?’ అనే అంశంపై రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి శిక్షణ ఇస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. హాజరుకాగోరే వారు తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 95538 25532, 70939 73999. -
Yarru Baparao: సేఫ్ ఫుడ్ సేనాని!
కుటుంబ సభ్యులు కేన్సర్ బారిన పడిన ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్న నేపథ్యంలో ఆహారంలో రసాయనాల అవశేషాలే ఇందుకు మూల కారణంగా గుర్తించిన ఓ యువకుడు ఉద్యోగం వదలి ప్రకృతి సేద్య సేనానిగా మారారు. అతనే యర్రు బాపారావు (బాపయ్య). కేవలం ఎకరంన్నర సొంత భూమి మాత్రమే ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయం చేపట్టడంతో పాటు దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. తమిళనాడు వెల్లూరులో ఈషా ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘భారతీయ సంప్రదాయ వరి, ఆహారోత్పత్తుల ఉత్సవం’లో బాపారావు మరో ముగ్గురు తెలుగు రైతులతో పాటు ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు.సేఫ్ ఫుడ్ యువ ఉద్యమకారునిగా బాపారావు (39), లక్ష్మీ సౌజన్య దంపతుల ప్రకృతి వ్యవసాయ జీవన ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం. వారి స్వగ్రామం గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట. ఉన్నత విద్యావంతుడైన బాపారావు హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్, 2డి ఏనిమేటర్ గా ఉద్యోగం చేసేవారు. తమ కుటుంబంలోనే ముగ్గురు కేన్సర్ వ్యాధితో కొద్ది కాలంలోనే మృత్యువాతపడటంతో రసాయనాల మయమైన ఆహారమే ఆరోగ్యాన్ని నాశనం చేస్తోందని గ్రహించారు. ఓ వైద్యుని సలహా మేరకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. 9 ఏళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం – సంప్రదాయ ఆహారోద్యమం ్రపారంభించారు. భార్య తోడ్పాటుతో బాపారావు తిరిగి స్వగ్రామం చేరుకొని ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. సొంత భూమి ఎకరంన్నరకు తోడు 7 ఎకరాల కౌలు భూమిలో ఔషధ, పోషక విలువలతో కూడిన దేశీ వరి వంగడాలను గత తొమ్మిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో అత్తోట గ్రామానికి చెందిన 60 మంది రైతులు సమష్టిగా ప్రకృతి వ్యవసాయం చేపట్టి సుమారు 85 ఎకరాల భూమిలో దేశీ వరి రకాలను సాగు చేస్తుండటం విశేషం.ఎకరంలో 365 రకాల దేశీ వరి రకాలను విత్తనాల పరిరక్షణ కోసం బాపారావు సాగు చేస్తున్నారు. 7 ఎకరాల్లో సార్వాలో మైసూర్మల్లిగ, బహురూపి తదితర దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. గట్లపై బంతి, వంగ, చిక్కుడు, ΄÷ద్దు తిరుగుడు, బెండ, అరటి, మునగ, టమాటా, మిర్చి, తోటకూర, గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. వేసవిలో 20 రకాల ధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలు చల్లి.. 40 రోజులు పెరిగిన తర్వాత కోసి ఆవులకు మేతగా ఉపయోగించుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఇంట్లోకి వాడుకుంటున్నారు. మిగతా పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని తర్వాత వరి సాగు చేస్తున్నారు.ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, కూరగాయలను స్నేహితులు, బంధువులకు అమ్ముకొని ప్రతి రోజూ ఆదాయం సంపాదిస్తున్నారు. లక్ష్మి దేవినేని సహకారంతో ‘తానా’ సహకారంతో గ్రామంలోనే ‘భూమి భారతి’ అనే సంస్థను నెలకొల్పారు. భూమి భారతి ద్వారా దేశీ వరి విత్తన నిధిని నిర్వహించటంతోపాటు.. రైతులు పండించిన దేశీ వరి బియ్యాన్ని, విలువ జోడించిన ఇతర ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను సంతల్లో, సోషల్ మీడియా ద్వారా సుమారు వెయ్యి కుటుంబాలకు విక్రయిస్తున్నారు. రైతు మిత్రుల ద్వారా దేశీ వరి విత్తనోత్పత్తి చేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 వేల మంది ప్రకృతి వ్యవసాయదారులకు అందించటం బాపారావు విశేష కృషికి నిదర్శనం.భావితరం కోసం...ఆయన ఇలా చెబుతున్నారు.. ‘రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించడం వలన భూమి సారం కోల్పోతున్నది, రైతులు అప్పుల పాలవుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి సాగు పద్ధతిలో పండిస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. నీటి తడులు పెట్టడం తగ్గుతుంది. అంతర పంటలతో అధికాదాయాన్ని ΄÷ందుతాం. దేశీ విత్తనం వాడటం వలన ఆ పంటలు తినే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఇలా ఇతర రైతులు పండించే పంటదిగుబడులను బై బ్యాక్ సిస్టం కింద కొని భూమి భారతి ద్వారా నేరుగా ప్రజలకు అమ్ముతున్నాను. ప్రతి రైతూ ఏటీఎం మోడల్ వేసుకుంటే అదనపు ఆదాయం కూడా వస్తుంది. మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తోపాటు మంచి భూమి భావితరానికి కావాలి అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయటమే మార్గం..’ అంటారు బాపారావు.ప్రవాస భారతీయులు మౌనికా రెడ్డి దంపతుల సాయంతో విజయవాడలోని కనకదుర్గ అమ్మ వారికి , మరో ఎన్ఆర్ఐ తాళ్లూరి జయశేఖర్ దంపతుల సాయంతో భద్రాచలంలోని సీతారాముల వారికి ఏడాది ΄÷డవునా నైవేద్యం కోసం దేశీ వరి బియ్యాన్ని పంపుతుండటం మరో విశేషం. వరి కోత సమయంలో వర్షాల కారణంగా ధాన్యం ఎండబెట్టడం, కలుపు తీసే సమయంలో కూలీల కొరత వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని ఆయన చెబుతున్నారు. బాలారిష్టాలను అధిగమించి నిలదొక్కుకున్న ఆయన నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌కు చేరుకోవటం విశేషం. ‘ఆరోగ్యమే మహా భాగ్యం. ఆరోగ్యదాయక ఆహారమే ఆరోగ్య సోపానమ’ని తన చేతల ద్వారా చాటిచెబుతున్న బాపారావు (91003 07308) దంపతులు యువతకు ఆదర్శ్రపాయులు. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
ఈ యువరైతుకి.. అరుదైన ఘనత!
సిద్ధేశ్ సాకోర్ (28)... ఒక మారుమూల గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివారు. అయినప్పటికీ, తన తండ్రి వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతుల ఆదాయాలు పెంచటం కోసం స్వగ్రామంలోనే ఉంటూ తన వంతుగా ఏదైనా చెయ్యాలన్నదే తపనంతా! ఈ తపనకు తోడైన ఆచరణే సిద్ధేశ్కి గత నెలలో ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది! దాని పేరే.. భూమి హీరో!ఐక్యరాజ్య సమితికి చెందిన కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ గత నెల 17న బ్రెజిల్లో భూమి పరిరక్షణ కృషిలో క్రియాశీలపాత్ర నిర్వహిస్తున్న పది మంది యువతకు భూమి హీరో పురస్కారాలు అందించింది. ఈ పురస్కార విజేతల్లో సిద్ధేశ్ ఒకరు. మన దేశం నుంచి ఈయనొక్కరికే ఈ గుర్తింపు దక్కింది. ఆయన ప్రయాణం ఆసక్తిదాయకం.. స్ఫూర్తిదాయకం..అతనిది మహారాష్ట్ర పుణే జిల్లా షిరూర్ తాలూకా ధామరి గ్రామం. పేద వ్యవసాయ కుటుంబంలో పెరిగిన సిద్ధేశ్ కరువు పీడిత మెట్ట ్రపాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. తాను వ్యవసాయం చేసి మార్పు తేవాలనుకున్నాడు. కొడుకు వ్యవసాయం చేయటం తండ్రికి ఇష్టం లేదు. కుటుంబ పొలాన్ని ఇవ్వనన్నాడు తండ్రి. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవమన్నాడు. ఆ ప్రకారంగానే డిగ్రీ చదివిన సిద్ధేశ్ ఆ తర్వాత తమ జిల్లాలోనే గల విజ్ఞానాశ్రమంలో చేరి అనేక చిన్న యంత్రాలను ఆవిష్కరించాడు.వంటింటి వ్యర్థాలతో తక్కువ సమయంలో కంపోస్టు ఎరువు తయారు చేసే యంత్రాలను రూపొందించి శభాష్ అనిపించుకున్నాడు. ఈలోగా కరోనాతో తండ్రి చనిపోయారు. అప్పటికి తండ్రి బ్యాంకు ఖాతాలో రూ. 3వేలు నిల్వ ఉందని చెబుతూ.. ఇదీ చిన్న రైతుల దుస్థితి అంటారాయన. భూములను సారవంతం చేసుకుంటూ రైతుల ఆదాయం పెంచే పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయంతో రైతుల తలరాత మార్చవచ్చని సిద్ధేశ్ బలంగా నమ్మాడు.ఐదెకరాల్లోపు వర్షాధార వ్యవసాయం చేసే రైతులు తగినంత ఆదాయం లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. ఆదాయం ఎందుకు రావటం లేదు? వారి భూములు అతిగా రసాయనాలు వాడటం వల్ల నిస్సారమైపోతున్నాయి. సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువగానే ఉంది. ఆ నేలల్లో అరకొర దిగుబడులు రావటం, గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల బడుగు రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు. ఈ వెతలన్నిటికీ మూలం సాగు భూమి అతిగా నిస్సారమైపోవటం అని గ్రహించిన సిద్ధేశ్ స్వగ్రామంలోనే ఉండి, వారసత్వ చిన్నకమతంలో పునరుజ్జీవన సేంద్రియ వ్యవసాయం చేస్తూ.. తోటి రైతులను కూడా ఆ దిశగా నడిపించే పనిని ్రపారంభించారు. ‘ఆగ్రో రేంజర్స్’ అనే లాభాపేక్ష లేని సంస్థను ఐదేళ్ల క్రితం స్థాపించాడు.సీజనల్ పంటలపైనే ఆధారపడకుండా చిన్న కమతాల రైతులు కూడా కొంత మేరకు పండ్ల తోటలు పండించుకుంటూ.. రసాయన వ్యవసాయం నుంచి స్థిరమైన సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఆగ్రో రేంజర్స్ రైతులకు మద్దతు ఇస్తోంది. బహుళ పంటలు పండించే పండ్ల చెట్ల ఆధారిత ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను ఆగ్రో రేంజర్స్ అభివృద్ధి చేసింది. ఇది రైతులకు స్థిరంగా ఆదాయం వచ్చేలా చేస్తుంది. అదే సమయంలో నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది.గత 5 సంవత్సరాలుగా సిద్ధేశ్ బృందం 1,200 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. 23 గ్రామాల్లో వందకు పైగా ఎకరాల్లో రీజనరేటివ్ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనాను క్షేత్రస్థాయిలో అమల్లోకి తేగలిగారు. రెండు, మూడు సంస్థల్లో నైపుణ్య శిక్షణ పొందటం ద్వారా, అనేక సంస్థల ఆర్థిక తోడ్పాటుతో ఆగ్రోరేంజర్స్ బృందం లోపాలను సరిదిద్దుకొని పురోగమిస్తోంది.రైతులు శిక్షణ తీసుకున్నప్పటికీ సాగు పద్ధతి మార్చుకోవటానికి ముందుకు రాకపోవటాన్ని గమనించి.. పండ్ల మొక్కలను, డ్రిప్ లేటరల్స్తో పాటు నాణ్యమైన శిక్షణ ఇవ్వటంతో మార్పు క్రమంగా వస్తోందని సిద్ధేశ్ తెలిపారు. వారికి ఎప్పుడు ఏమి అవసరమైతే అది చెబుతూ ముందుకు తీసుకువెళ్తే ఒక్కసారి ఈ పద్ధతి వల్ల ఆదాయం పెరిగితే ఇక వారికి నమ్మకం కుదురుతుంది. నేల క్షీణతను, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనే దిశగా పునరుజ్జీవ ఆగ్రో ఫారెస్ట్రీ నమూనా సాగు పద్ధతిని చిన్న, సన్నకారు రైతులకు అందించే కృషిలో గ్రామీణ యువతను విరివిగా భాగస్వామ్యం చేయాలని సిద్ధేశ్ ఆశిస్తున్నారు.పుణేలోని లఖేవాడికి చెందిన రైతు జలంధర్ చేమాజీ మావ్లే మాటల్లో చె΄్పాలంటే.. ‘భూతాపం పెరిగిపోవటం అనే సమస్యను ఎదుర్కోవడానికి, సాధ్యమైనంత ఎక్కువ చెట్లను పెంచటం ఉత్తమం. అందువల్ల, పండ్ల మొక్కలు, బిందు సేద్యం, విలువైన పాఠాలతో నాకు సహాయం చేసిన ఆగ్రో రేంజర్స్ బృందంతో నేను కనెక్ట్ అయ్యాను. ఇది వాతావరణ మార్పుపై పోరాటంలో మాత్రమే కాదు. నాకు స్థిరమైన ఆదాయం కూడా వస్తోంది. రెండు ఎకరాల భూమి గతంలో పండ్ల మొక్కలు నాటాను. ఈ సంవత్సరం మరో మూడు ఎకరాల భూమి కోసం ప్లాన్ చేస్తున్నాను’.ఇవి చదవండి: కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల! -
కృత్రిమ మేధతో.. ‘గులాబీ’కి స్మార్ట్ వల!
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్‌లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్‌కు, కంప్యూటర్‌కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్‌సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్‌ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు. స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్‌తో నడిచే జిఎస్ఎం ట్రాన్స్మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్‌లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్‌లోని రిమోట్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్‌కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్‌సింగ్. సకాలంలో గులాబీ పురుగుకు చెక్..పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్లను ఏర్పాటు చేయవచ్చు.– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్ -
మట్టి కొట్టుకెళ్లనివ్వని సాగు! పీఎండీఎస్!
పంటలకు ప్రాణప్రదమైన భూమి పైపొర మట్టి వర్షపు నీటితో భారీగా కొట్టుకు పోతోంది. మట్టితో కూడిన బురద నీరు వరదలా పారుతుంటే.. ఇది ‘ప్రవహిస్తున్న భూమాత రక్తం’ అని ఓ రైతు శాస్త్రవేత్త ఆవేదన చెందారు. మట్టిని కొట్టుకెళ్లనివ్వని సాగు పేరు పిఎండిఎస్.. పిఎండిఎస్ ప్రయోజనాలు: నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయి నేలలో నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది పోషక విలువలతో కూడిన నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగ పడతాయిఏకకాలంలో బహుళ పంటలు వేయటం వలన అదనపు ఆదాయం వస్తుంది ప్రధాన పంటల్లో కలుపు సమస్య ఉండదు. నేల కోతకు గురి కాదు ప్రధాన పంటల దిగుబడులు పెరుగుతాయి ∙నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది మట్టిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం పెరుగుతుంది ∙ప్రధాన పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది ప్రధాన పంటలకు చీడపీడలు, తెగుళ్ళను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఈ సూక్ష్మజీవుల కార్యకలాపాల ద్వారా ప్రధాన పంటకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందుతాయి ప్రధాన పంటకు అతివృష్టి, అనావృష్టి వంటి వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది ∙ఏడాదిలో 365 రోజులు బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచే సేద్యం ఇలా సాధ్యమవుతుంది భూమిని పలు పంటలతో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరికాకుండా ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2శాతం మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23శాతంని, హెక్టారుకు సగటున 16శాతం టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకు΄ోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండ΄ోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు. -
ఇనుప బట్టీలతో బయోచార్ : బెట్ట నుంచి రక్షణ, 15శాతం అదనపు పంట!
పంట కోతలు పూర్తయ్యాక పత్తి, కంది, సోయా తదితర పంటల కట్టెకు నిప్పుపెట్టి పర్యావరణానికి హాని చేసే కన్నా.. ఆ కట్టెతో కట్టె బొగ్గు (బయోచార్) తయారు చేసి, తిరిగి భూములను సారవంతం చేసుకోవచ్చు. ఎకరానికి టన్ను బయోచార్ కం΄ోస్టు వాడితే పంటలు బెట్టను తట్టుకుంటాయి. తద్వారా పంట దిగుబడులను 12–15% వరకు పెంచుకోవచ్చని మహారాష్ట్రలో ఓ రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనుభవం చాటి చెబుతోంది..పంట వ్యర్థాలను తగులబెట్టటం పరిపాటి. ఇది పర్యావరణానికి హాని చేసే పని. పత్తి కట్టె, కంది కట్టె వంటి పంట వ్యర్థాలను కాలబెట్టటం వల్ల గాలి కలుషితమై కార్బన్డయాక్సయిడ్ శాతం పెరిగిపోతంది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోయింది. రసాయనిక ఎరువుల వాడకం పెరిగిపోయింది. ఫలితంగా సాగుభూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయింది. మట్టికి నీటిని పట్టి ఉంచే శక్తి లోపించటం, వాన నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం తగ్గి΄ోవటం, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో 4 లక్షల హెక్టార్లలో పత్తి, లక్ష హెక్టార్లలో కంది పంటలను రైతు సాగు చేస్తారు. పంట కోత పూర్తయిన తర్వాత రైతులు పత్తి, కంది కట్టెను కాల్చివేస్తారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా భూమికి తిరిగి అందాల్సిన సేంద్రియ పదార్థం అందకుండా పోతోంది. బిఎఐఎఫ్ (బైఫ్) డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే పుణేకు చెందిన స్వచ్ఛంద సంస్థ యవత్మాల్ రైతులతో కలసి పనిచేసి ఈ పరిస్థితిలో విజయవంతంగా మార్పుతెచ్చింది. పత్తి, కంది కట్టెను వట్టిగా కాలబెట్టకుండా.. ఒక పద్ధతి ప్రకారం (దీన్నే పైరోలిసిస్ అంటారు) కాల్చితే బొగ్గుగా మారుతుంది. దీన్నే బయోచార్ అంటారు. దీన్ని సేంద్రియ ఎరువులతో కలిపి బయోచార్ కంపోస్టుగా మార్చి భూమిలో చల్లితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంతతి పెరిగి భూసారం మెరుగవుతుంది. బయోచార్ కంపోస్టు వాడకం వల్ల ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ నేలలకు బెట్టను తట్టుకునే శక్తిని పెంపొందిస్తాయి. బయోచార్ కంపోస్టు తయారు చేయాలంటే.. బయోచార్ను ఉత్పత్తి చేసే ఇనుప బట్టీని ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత చిన్న రైతులకు విడిగా ఉండదు. అందుకని బైఫ్ ఫౌండేషన్ రైతులతో రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని (ఎఫ్.పి.ఓ.ని) 2019లో రిజిస్టర్ చేయించింది. 220 మంది రైతులను కూడగట్టి ఒక్కొక్క రైతు నుంచి రూ. వెయ్యి షేర్ ధనంతో ఎఫ్.పి.ఓ.ను రిజిస్టర్ చేయించారు. పత్తి, కంది కట్టెను కాల్చవద్దని, దీనితో ఎఫ్పిఓ తరఫున బయోచార్ తయారు చేసుకొని పంటలకు వాడుకుంటే బెట్టను తట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చని బైఫ్ ఫౌండేషన్ సిబ్బంది రైతులకు ఆలోచన కలిగించారు. 2021 జనవరిలో ఎఫ్పిఓ పత్తి కట్టెను రైతుల నుంచి కిలో రూ. 2.5–3లు చెల్లించి కొనుగోలు చేసింది. రూ. 60 వేల ఖర్చుతో బ్యాచ్‌కు 200 కిలోల కట్టెను కాల్చే ఇనుప బట్టీని ఎఫ్పిఓ కొనుగోలు చేసింది. ఈ బట్టీ ద్వారా పైరోలిసిస్ పద్ధతిలో ఈ కట్టెను కాల్చి బొగ్గును తయారు చేసింది. బొగ్గును పొడిగా మార్చి గోనె సంచుల్లో నింపి ఎఫ్పిఓ తిరిగి రైతులకే అమ్మింది. మార్కెట్ ధర కన్నా కిలోకి రూ. 2, 3 తగ్గించి అమ్మింది. 2021–22లో ఎఫ్పిఓ విజయవంతంగా 100 టన్నుల పత్తి కట్టెతో 25 టన్నుల బయోచార్ను ఉత్పత్తి చేయగలిగింది. ఎఫ్పిఓ బయోచార్ ఉత్పత్తిని చేపట్టటం వల్ల చాలా మందికి పని దొరికింది. కాల్చేసే పత్తి కట్టెను రైతు అమ్ముకొని ఆదాయం పొందాడు. కట్టెను సేకరించటంలో కూలీలకు పని దొరికింది. వాహనదారులకు కట్టెను బట్టీ దగ్గరకు చేర్చే పని దొరికింది. చివరికి బయోచార్ను రైతులే తిరిగి తక్కువ ధరకు కొనుక్కోగలిగారు. అంతిమంగా కాలబెడితే ఆవిరైపోయే పత్తి కట్టె.. ఎఫ్పిఓ పుణ్యాన భూమిని సుదీర్ఘకాలం పాటు సారవంతం చేసే బయోచార్గా మారి తిరిగి ఆ పొలాలకే చేరటం విశేషం. హెక్టారుకు 2.5 టన్నుల బయోచార్ కంపోస్టును దుక్కిలో వేశారు. ఏటేటా పంట దిగుబడులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2% మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23%ని, హెక్టారుకు సగటున 16% టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క. అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకుపోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండపోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు. 2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కా΄ాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.ఎకరానికి టన్ను బయోచార్ కంపోస్టుయవత్మాల్ జిల్లాలోని 0.5% కన్నా తక్కువగా ఉండే వర్షాధార పత్తి తదితర పంటలు పండించే నేలలను బయోచార్ కంపోస్టు పోషకవంతం చేయటమే కాకుండా నీటిని పట్టి ఉంచే సామర్ధ్యాన్ని, కరువును తట్టుకునే శక్తిని పెంపొదించింది. బయోచార్ను ఎంత మోతాదులో వేయాలనే దాన్ని ఇంకా ప్రామాణీకరించాల్సి ఉంది. హెక్టారుకు 1 నుంచి 10 టన్నుల వరకు సూచిస్తున్న సందర్భాలున్నాయి. రైతుకు మరీ భారం కాకుండా వుండేలా హెక్టారుకు 2.5 టన్నుల (ఎకరానికి టన్ను) చొప్పున బయోచార్ కంపోస్టును వేయించాం. బొగ్గు పొడితో వర్మీకంకంపోస్టు, అజొటోబాక్టర్, అజోస్పిరిల్లమ్ వంటి జీవన ఎరువులను కలిపి బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని పంట పొలాల్లో వాడాం. ఆ సంవత్సరంలోనే పత్తి, సోయా వంటి పంటల దిగుబడి 12–15% పెరిగింది. పోషకాలను నిదానంగా దీర్ఘకాలం పాటు పంటలకు అందించేందుకు, బెట్టను తట్టుకునేందుకు బయోచార్ ఉపకరిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రైతులు పూర్తిగా గుర్తించేలా ప్రచారం చేయటానికి ప్రభుత్వ మద్దుతు అవసరం ఉంది. ఎఫ్పిఓలు తయారు చేసే బయోచార్ కంపోస్టుకు ప్రభుత్వం మార్కెటింగ్‌కు అవకాశాలు పెంపొందించాలి.– గణేశ్ (98601 31646), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణే -
ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ
సుగంధ మొక్కల వ్యాపార అవకాశాలపై 10 రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుజరాత్ ఆనంద్‌లోని ఐసిఎఆర్ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ లాంట్స్ రీసెర్చ్‌కు చెందిన మెడి–హబ్ ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు రోజుకు జరుగుతుంది. రెండు విడతలుగా మొత్తం 5.30 గంటలపాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉ. 10 గం. నుంచి మ. 12.30 వరకు, మ. 2 గం. నుంచి సా. 5.30 వరకు ఇంగ్లీష్/హిందీలో జూమ్ ద్వారా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. డా. స్నేహల్కుమార్ ఎ పటేల్, వాట్సాప్: 99098 52552. ఆసక్తి ఉన్న వారు ఈ గుగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి -
దుక్కి చేయని సేద్యం.. దుఃఖం లేని భాగ్యం!
వరి సాగులో రసాయనిక ఎరువులు, సాగు నీటి వాడకాన్ని దిగుబడి తగ్గకుండా తొలి ఏడాదే సగానికి తగ్గించుకోగలమా? వరి పొలాల నుంచి వెలువడే మిథేన్ వాయువు (బొగ్గుపులుసు వాయువు కంటే ఇది భూతా΄ాన్ని 20 రెట్లు ఎక్కువగా పెంచుతోంది) ని అరికట్టే మార్గం ఏమిటి? ఏటా దుక్కి చేసే పంట భూముల్లో నుంచి ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి వానకు గాలికి కొట్టుకుపోతోంది.దీన్ని ఆపటం ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోగలమా? భారీ ఖర్చుతో నిర్మించిన రిజర్వాయర్లు కొద్ది ఏళ్లలోనే పూడికతో నిండిపోకుండా చెయ్యగలమా..? భూగర్భజలాలు వర్షాకాలంలో (రెండు నెలలుగా మంచి వర్షాలు పడుతున్నప్పటికీ) కూడా అడుగంటే వుంటున్నాయెందుకు? ఈ పెద్ద ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘ఒక్కటే’ అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.. అవును.. సాగు పద్ధతిని మార్చుకోవటం అనే ఒక్క పని చేస్తే చాలు..వరి, పత్తి వంటి తదితర పంటల సాగును ’సగుణ రీజెనరేటివ్ టెక్నిక్’ (ఎస్.ఆర్. టి.) అనే నోటిల్లేజ్ ఆరుతడి పద్ధతిలోకి మార్చుకుంటే పై సమస్యలన్నీ పరిష్కారమైపోతాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు రైతు శాస్త్రవేత్త చంద్రశేఖర్.పొలాన్ని దున్ని ఒక్కసారి ఎత్తుమడులను ఏర్పాటు చేస్తే చాలు.. 20 ఏళ్లు మళ్లీ దున్నే పని లేకుండానే ఏటా మూడు పంటలు పండించుకోవచ్చు.వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయ పంటలను సాగు చేస్తూ చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు.రసాయనాలను తగుమాత్రంగా వాడుతూ ఖర్చును, శ్రమను తగ్గించుకొని దిగుబడులతో΄ాటు సేంద్రియ కర్బనాన్ని సైతం 0.3% నుంచి 1.5%కి పెంపొందించానన్నారు.జమ్మికుంటలోని జి.ఎన్.ఎన్.ఎస్. ప్రశాశం కేవీకే ఆవరణలో ఎస్.ఆర్.టి. పద్ధతిలో శాశ్వత ఎత్తుమడులపై ఆరుతడి వరి సాగుకు ఇటీవల శ్రీకారం చుట్టారు. చంద్రశేఖర్ స్వయంగా హాజరై రైతులకు, శాస్త్రవేత్తలకు మెళకువలు నేర్పించారు. ఇతర వివరాలకు.. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు (98485 73710)ను సంప్రదింవచ్చు.1. 136 సెం.మీ. దూరంలో మార్కింగ్ చేసుకొని.. 100 సెం.మీ. వెడల్పుతో శాశ్వత బెడ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. రెండు వైపులా కాలువలు ఉండాలి.2. ఎస్.ఆర్.టి. ఫ్రేమ్‌తో బెజ్జాలు వేసుకొని బెడ్‌పై వరి విత్తనాలను 5 వరుసలుగా విత్తుకోవాలి. మొక్కలు, వరుసల మధ్య దూరం 25 సెం.మీ.లు.3. కాలువల్లో నీరు పెట్టుకొని.. వరి విత్తనాలను ఇలా విత్తుకోవచ్చు..4. మహరాష్ట్రలోని చంద్రశేఖర్ పొలంలో ఎత్తుమడులపై వరి పంట ఇది. పొలం అంతా ఒకే మాదిరిగా పెరిగి కోతకు సిద్ధమైన దృశ్యం.5. వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకూడదు. అవసరాన్ని బట్టి ఆరుతడులు ఇవ్వాలి. ఒక్కసారి మాత్రమే యూరియా వేయాలి.6. విత్తనాలు వేసిన తర్వాత కలుపు మొలవకుండా ఎంపిక చేసిన గడ్డి మందును పిచికారీ చేయాలి.భూమిని పంట వేసిన ప్రతి సారీ దున్నకుండా వ్యవసాయం (నోటిల్లేజ్ / జీరోటిల్లేజ్ వ్యవసాయం) చెయ్యగలిగితే భూమి కోతను అరికట్టి భూసారాన్ని పెంపొందించుకోవటానికి అంతకుమించి మరో ఉత్తమ మార్గం ఉండదు. ఈ పద్ధతిని దీర్ఘకాలం సాగులో ఉండే పండ్ల తోటల్లో త్రికరణశుద్ధితో అనుసరించే ప్రకృతి/సేంద్రియ వ్యవసాయదారులు చాలా మంది కనిపిస్తుంటారు. అయితే, మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే సీజనల్ పంటలను నోటిల్లేజ్ పద్ధతిలో శ్రద్ధగా సాగు చేసే రైతులు మాత్రం అత్యంత అరుదు. ఈ కోవకు చెందిన వారే చంద్రశేఖర్ హరి భడ్సావ్లే(74).మహారాష్ట్ర రాయ్‌గడ్ జిల్లా కర్జత్ తాలూకాలోని దహివాలి సమీపంలో చంద్రశేఖర్ హరి భడ్సావ్లే వ్యవసాయ క్షేత్రం ‘సగుణబాగ్’ ఉంది. మహారాష్ట్రలో అగ్రిబిఎస్సీ చదివిన తర్వాత అమెరికాలో ఎం.ఎస్.(ఫుడ్ టెక్) చదువుకొని ఇంటికి తిరిగి వచ్చి.. 48 ఏళ్ల క్రితం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టిన చంద్రశేఖర్ అప్పటి నుంచి మొక్కవోని దీక్షతో 55 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. సుదీర్ఘ సేద్య అనుభవాన్ని రంగరించి వెలువరించిన అనేక ఆవిష్కరణలతో ఎత్తుమడులపై నోటిల్లేజ్ సాగును ఈయన కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.ఆరుతడి వరి దగ్గర నుంచి పత్తి, పప్పుధాన్యాలు, కూరగాయలు వంటి పదికి పైగా పంటలను సాగు చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటి పంటల మార్పిడి చేస్తూ ఖర్చుల్ని తగ్గించుకుంటూ దిగుబడులతో΄ాటు పనిలోపనిగా భూసారాన్ని సైతం పెంపొందిస్తున్నారు. తగుమాత్రంగా రసాయనిక ఎరువులతో ΄ాటు కలుపు మందును వాడుతున్నారు. గత 12 ఏళ్లుగా నోటిల్లేజ్ సాగులో చక్కని ఫలితాలు సాధిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ సాగు పద్ధతిని ఇప్పుడు కనీసం మరో పది వేల మంది అనుసరిస్తున్నారు.రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించే సాగు పద్ధతిగా ‘రీజెనరేటివ్ అగ్రికల్చర్’ (పునరుజ్జీవన వ్యవసాయం) అనే మాట వాడుకలో ఉంది. అయితే, ఈ మాటకు తనదైన శైలిలో సరికొత్త అర్థం చెబుతున్నారు చంద్రశేఖర్.ఎత్తుమడులపై ఆరుతడి పంట (వరి కావచ్చు, మరొకటి కావచ్చు) కోసిన తర్వాత మోళ్లు మిగులుతాయి. వాటి కింద నేలలో వేర్లుంటాయి. మరో పంట వేసుకోవటానికి వీలుగా ఈ మోళ్లను వదిలించుకొని శుభ్రం చేయటం ఎలాగన్నది పెద్ద సమస్య.అయితే, ఈ సమస్యనే చంద్రశేఖర్ అద్భుతమైన పరిష్కారంగా మార్చుకున్నారు. మోళ్లను వేర్లతో సహా పీకెయ్యటమో, కాల్చెయ్యటమో కాకుండా.. వాటిని ఒక చిన్న పనితో పొలంలో కురిసే వాన నీటిని అక్కడికక్కడే ఒడిసిపట్ఠి భూమిలోకి ఇంకింపజేసేందుకు చక్కని సాధనంగా మార్చుకుంటున్నారు. మోళ్లపై కలుపుమందు చల్లటంతో నిర్జీవమవుతాయి. తిరిగి మొలకెత్తవు. కుళ్లిపోతాయి. అప్పుడు తదుపరి పంట విత్తనాలను మనుషులతోనో లేదా సీడ్ డిబ్లర్తోనో కోవచ్చు.మోళ్లు, వేర్లు కుళ్లిపోయి పోషకాలు పంటకు అందుబాటులోకి వస్తాయి. ఆఖాళీల ద్వారా వాన నీరు వేగంగా ఇంకుతుంటుంది. వేరు వ్యవస్థలో మట్టికి పుష్కలంగా గాలి, పోషకాలు అందుతాయి. సూక్ష్మజీవరాశి, వాన΄ాములతో ΄ాటు సేంద్రియ కర్బనం పెరుగుతుంది. పంట కోసిన తర్వాత మోళ్లపై కలుపు మందు చల్లుతున్న కారణంగానే ఈ ప్రక్రియ సౌలభ్యకరంగా, వేగవంతంగా జరుగుతోందని చంద్రశేఖర్ చెబుతారు. నోటిల్లేజ్ సాగు పద్ధతిలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయన అంటున్నారు.‘సగుణ’తో సకల ప్రయోజనాలు!నేను అగ్రికల్చర్ బీఎస్సీ, అమెరికాలో ఎమ్మెస్ చదివి కూడా 48 ఏళ్లుగా 55 ఎకరాల్లో శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నా. గత పన్నెండేళ్లుగా ఎస్.ఆర్.టి. పద్ధతిలో దుక్కి దున్నకుండా వరుసగా అనేక పంటలు పండిస్తున్న అనుభవంతో చెబుతున్నా. నోటిల్లేజ్ సాగు రైతులకు సౌలభ్యకరంగా, అనేక రకాలుగా ప్రయోజనకరంగా ఉంది.ప్రతి పంటకూ ముందు, వెనుక దుక్కి దున్నటం వల్ల వానకు, గాలికి భూమి కోతకు గురై ఏటా హెక్టారుకు 20 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. దుక్కి చేయకుండా విత్తనాలు వేస్తున్నందు వల్ల సాయిల్ అగ్రిగేషన్ జరిగి పొలంలో మట్టి వానకు, గాలికి కొట్టుకుపోవటం ఆగిపోతుంది. రసాయనిక కలుపు మందులు వాడటం వల్ల కలుపు సమస్య తీరిపోతుంది. ΄ాత పంటల మోళ్లు, వేర్లు కుళ్లటం వల్ల పోషకాల పునర్వినియోగం జరుగుతుంది.ఆ రంధ్రాల ద్వారా పొలంలోనే వాన నీటి సంరక్షణ అత్యంత సమర్థవంతంగా జరుగుతుంది. బెట్టను తట్టుకునే శక్తి పంటలకు కలుగుతుంది. నీటిని నిల్వగట్టే పద్ధతిలో సాగయ్యే వరి పొలం మాదిరిగా మిథేన్ వాయువు వెలువడదు. కాబట్టి, భూతాపం గణనీయంగా తగ్గుతుంది. కలుపు మందు వల్ల కలిగే నష్టంతో పోల్చితే రైతుకు, భూమికి, పర్యావరణానికి ఒనగూడే ప్రయోజనాలు చాలా ఎక్కువ.నానా బాధలు పడి సాగు చేసే రైతు ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటున్నాడు. ఎస్.ఆర్.టి. సాగు పద్ధతి వల్ల రైతులకు సంతోషం కలుగుతోంది. అగ్రిటూరిజం కూడా ఇందుకు తోడ్పడుతోంది. అందరూ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. భూతా΄ాన్ని తట్టుకునే శక్తి, ఖర్చులు తగ్గించి, దిగుబడులు పెంచే శక్తి ‘సగుణ’ సాగు పద్ధతికి ఉందని నా అనుభవంలో రుజువైంది.శాశ్వత ఎత్తుమడులపై ఖరీఫ్‌లో వరిని ఆరుతడి పద్ధతుల్లో సాగు చేయటం, ఆ తర్వాత అవే మడులపై 2,3 పంటలుగా పప్పుధాన్యాలు/ నూనెగింజలు/ కూరగాయలను పంట మార్పిడి ΄ాటిస్తూ సాగు చేస్తున్నాం. వరిలో ఖర్చు 29% తగ్గి దిగుబడి 61% పెరిగింది. పత్తి సాగు ఖర్చు 17% తగ్గి దిగుబడి 96% పెరిగింది. నాతో ΄ాటు మహారాష్ట్రలోని పది వేల మంది రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఎవరైనా వచ్చి చూడొచ్చు. – చంద్రశేఖర్ హరి భడ్సావ్లే (98222 82623), సగుణ రీజెనరేటివ్ టెక్నిక్ ఆవిష్కర్త, రైతు శాస్త్రవేత్త, మహారాష్ట్ర, https://sugunafoundation.ngo/– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
6,7 తేదీల్లో హుబ్లీలో పనస మేళా..
కరువును తట్టుకొని చక్కని ఫలసాయాన్నిచ్చే పండ్ల చెట్టు పనస. ఈ నెల 6,7 తేదీల్లో కర్ణాటకలోని హుబ్లీ నగరంలో మూడు వేల మఠాల ఆవరణలో పనస మేళా జరగనుంది. సరికొత్త ‘శంకర ఎర్ర పనస’ రకం ఈ మేళాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అత్యంత రుచికరంగా ఉండటం, ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పాటు జిగట తక్కువగా ఉండటం దీని ప్రత్యేకతలు.హుబ్లీ మేళాలో ‘శంకర ఎర్ర పనస’తో పాటు సిద్ధు, వియత్నాం ఎర్లీ, లాల్బాగ్ మథుర, భైరచంద్ర, రుద్రాక్షి వంటి అనేక పనస రకాల పండ్లను ప్రదర్శించటంతో పాటు మొక్కలను కూడా మేళాలో విక్రయిస్తారు. ‘శంకర ఎర్ర పనస’ రకం ప్లాంట్ బ్రీడ్ కన్సర్వేషన్ అథారిటీలో కూడా రిజిస్టర్ అయ్యింది. దీన్ని అభివృద్ధి చేసి, మొక్కల్ని విక్రయిస్తున్న రైతు శాస్త్రవేత్త పేరు కెంపరాజు (76767 80559).7,8 తేదీల్లో అనంతపురం జిల్లాలో డా. ఖాదర్ సభలు..స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార – ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 7,8 తేదీల్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంప్రాంతంలో జరిగే వివిధ సభల్లో ప్రసంగిస్తారు. సిరిధాన్యాల ఆహారం ద్వారా ఆరోగ్యం, సిరిధాన్యాల సాగు, గ్రామాల్లోనేప్రాసెసింగ్ పద్ధతులు, తద్వారా మహిళల ఆదాయం పెంచుకోవటం.. వంటి అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. 7 (ఆదివారం)న కళ్యాణదుర్గం సమీపంలోని గుడ్డిళ్లలోని రాధాసామి సత్సంగంలో ప్రసంగిస్తారు.8 (సోమవారం)న ఉ. 9 గంటలకు కోట గుడ్డెమ్ గ్రామంలో, 10.30 గంటలకు చెన్నంపల్లిలో, మధ్యాహ్నం 12 గంటలకు పేరూరులో జరిగే సమావేశాల్లో డా. ఖారద్ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కుళ్లాయిస్వామి (92464 77103), రామప్ప (94411 65281) రైతులకు చిరుధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తారు. 8న మధ్యాహ్నం 3 గంటలకు కురుగుంటలోని పుడమిసిరి మిల్లెట్స్ హోటల్ ప్రాంగణంలో మా భూమి మహిళా రైతు సమాఖ్య చిరుధాన్య ఉత్పత్తుల ప్రదర్శనప్రారంభోత్సవంలో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. నిర్వాహకులు భానూజ (94400 17188) ఆధ్వర్యంలో విత్తన వితరణ జరుగుతుంది. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అతిథిగా పాల్గొంటారు.సిరిధాన్యాలతో జీవన సిరి’పై 3 రోజుల శిబిరం..గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 12,13,14 తేదీల్లో చిరు (సిరి)ధాన్యాలతో జీవన సిరి అనే అంశంపై డా. ఖాదర్ వలి, డా. సరళా ఖాదర్ ద్వారా ప్రత్యేక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆధునిక రోగాల నుంచి విముక్తి పొందే మార్గాల గురించి, రోగరహితంగా జీవనాన్ని కొనసాగించే సిరి జీవన శైలిపై పూర్తి అవగాహన కల్పిస్తారన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 95538 25532. -
మిల్లెట్స్‌ను ప్రోత్సహిస్తే.. లాభాలు మెండు!
తెలంగాణ దక్కను పీఠభూమిప్రాంతంలో వర్షాధారంగా వ్యవసాయం చేసే సన్న, చిన్నకారు రైతులు సంఘంగా ఏర్పడటం.. సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరించటం.. చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు తదితర పంటలను కలిపి సాగు చేయటం.. సంఘటితంగా మార్కెటింగ్ చేసుకోవటం నిస్సందేహంగా బహువిధాలా లాభదాయకమే! సంఘటితమైన చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు తాము పండిస్తున్న పౌష్టికాహారాన్ని తింటూ.. మిగతా దిగుబడులు విక్రయిస్తూ మంచి నికరాదాయం కూడా పొందగలుగుతున్నారని, పనిలో పనిగా భూసారాన్ని కూడా పెంపొందించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెస్’ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది.డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్)ప్రోత్సాహంతో మహిళా రైతుల స్వయం సహాయక సంఘాలు అనుసరిస్తున్న సేంద్రియ సేద్య నమూనా సాధిస్తున్న విజయాలపై ‘సెస్’ ఇటీవలే అధ్యయనం చేసింది. సహకార స్ఫూర్తిని చాటిచెబుతున్న ఈ అధ్యయన వివరాలు..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత గ్రామాల్లో డీడీఎస్ చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగును చాలాకాలంగాప్రోత్సహిస్తోంది. సాగులో అడుగడుగునా ఈ మహిళా రైతులకు తోడుగా ఉండటంతో పాటు మార్కెట్లో మద్దతు ధరకు తానే సేకరించి, ్రపాసెస్ చేసి ఏడాది పొడవునా హైదరాబాద్, జహీరాబాద్ప్రాంతాల్లో ప్రజలకు విక్రయిస్తోంది డీడీఎస్. సంఘటిత శక్తి వల్ల ఈ రైతులు ఎకరానికి రూ. 6 వేలకుపైగా నికరాదాయం పొందుతున్నారు.అయితే, కొందరు రైతులు డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను పండించి వ్యక్తిగతంగా మార్కెట్లో అమ్ముకుంటూ నష్టాల పాలవుతున్నారని హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ (సెస్) ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.సెస్ సంచాలకురాలు ఇ. రేవతి, అసోసియేట్ ప్రొఫెసర్ బి.సురేశ్ రెడ్డి, అసిస్టెంట్‌ప్రొఫెసర్ పెద్ది దయాకర్‌ల బృందం 2024 జనవరిలో జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, న్యాల్కల్, మొగడంపల్లె మండలాల్లోని 34 గ్రామాల్లో 1,100 మంది రైతుల వ్యవసాయ అనుభవాలపై ఇంటింటి సర్వే చేసింది. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలతో ‘సెస్’ పరిశోధనా నివేదికను వెలువరించింది.సర్వే జరిగిన గ్రామాల్లో ప్రధానంగా వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు చిరుధాన్యాలు తదితర పంటలను రసాయనిక పద్ధతిలో కాకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో పాటు కందులు, పెసలు, మినుములు, ఉలవలు, సోయా, మిరప, మొక్కజొన్న, అల్లం, పత్తి, పసుపు వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో 80% మంది రైతులు తమ చిన్న చిన్న కమతాల్లో ఏదో ఒక పంటను కాకుండా కనీసం 8 రకాల పంటలు కలిపి పండిస్తున్నారు.డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్యాలను సాగు చేసే రైతులకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 11,893. అయితే, డీడీఎస్ సహకార సంఘాల సభ్యులైన మహిళా రైతులకు చిరుధాన్యాలు తదితర కలిపి పంటల సాగుకు ఎకరానికి అయిన ఖర్చు రూ. 10,218 మాత్రమే. చిరుధాన్యాలు తదితర పంటలు కలిపి పండించిన రైతులకు మొత్తం ఖర్చులో 70% కూలీల ఖర్చే. చిరుధాన్యేతర పంటల రైతులకు అయిన కూలీల ఖర్చు 39% మాత్రమే.చిరుధాన్యేతర పంటల సాగు ఖర్చులో 43% విత్తనానికి అవుతుంది. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ఖర్చు అదనం. డీడీఎస్‌తో సంబంధం లేకుండా చిరుధాన్య పంటలు సాగు చేసే రైతులు విత్తనాలకు 12% ఖర్చు పెడుతున్నారు.డీడీఎస్ సంఘాల్లో రైతులు విత్తనాలకు 10% ఖర్చు చేస్తున్నారు. వీరు సేంద్రియ ఎరువుల కోసం మొత్తం ఖర్చులో 15% వెచ్చిస్తున్నారు. బోరాన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాలను భూమికి అందిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్న సంఘటితం కాని రైతులకు మార్కెట్లో సరైన ధర రాక ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువ అవుతుండటం గమనార్హం.అయితే, డీడీఎస్ సహకార సంఘాల్లో ఉన్న సేంద్రియ రైతులకు మాత్రం డీడీఎస్ సంస్థాగత తోడ్పాటు.. మార్కెటింగ్ మద్దతు, వాతావరణ మార్పులను తట్టుకునే శక్తి వల్లే రైతులకు అధికాదాయం వస్తోందని సెస్ నివేదిక తెలిపింది. ఇదిలా ఉండగా, ‘చిరుధాన్యేతర’ (పత్తి తదితర) పంటలను సాగు చేసే రైతులకు అన్నీ అనుకూలిస్తే రూ. 12 వేలకు పైగా నికారదాయం వస్తోంది. అను కూలించకపోతే ఏకపంటలు సాగు చేసే ఈ రైతులకు పెట్టుబడి నష్టం ఎక్కువగా ఉంటుంది.చిరుధాన్యాల రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి..వర్షాధారంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలను పండించే చిన్న, పెద్ద రైతులు సమజానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. వాతావరణ మార్పుల్ని తట్టుకుంటూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. పర్యావరణానికీ మేలు చేస్తున్నారు.ఈ మెట్ట రైతుల విశేష కృషికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చే విధంగా బలమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రైతులకు ఎకరానికి కనీసం రూ. 2–3 వేలు ప్రత్యేకప్రోత్సాహకంగా ఇవ్వాలి. అన్ని రకాల చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలి. మిల్లెట్ రైతుల ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలకు ప్రత్యేక సుదుపాయాలు ఇవ్వటం ద్వారా ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలి.నీటిపారుదల రైతులతో పోల్చితే వీరికి అధిక ్రపాధాన్యం ఇచ్చేలా గట్టి చట్టాలు తేవాలి. ఈ చర్యలతో చిరుధాన్యాల, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరిగి, ప్రజలకు మరింత సరసమైన ధరలకు లభిస్తాయి. – డా. బి.సురేశ్ రెడ్డి (95505 58158), అసోసియేట్ ప్రొఫెసర్, సెస్, హైదరాబాద్ -
Sagubadi: మామిడి సాగులో.. బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు
జూలై 7న నూజివీడులో.. రైతు సదస్సు!ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా నూజిబీడు టీటీడీ కల్యాణ మండపంలో జూలై 7(ఆదివారం)న ఉ. 10 గంటల నుంచి మామిడి సాగులో మెలకువలతో పాటు బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు నూజివీడు సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి భోగోలు రాజేశ్ తెలిపారు. బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తారని రాజేశ్ (91779 88422) వివరించారు.గోమయ ఉత్పత్తులపై 30న శిక్షణ..ఆవు పేడతో అనేక ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వ్యూహాలపై రైతులు, గోశాలల నిర్వాహకులకు ఈ నెల 30న హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మురళీధర గోధామం (జగిత్యాల జిల్లా) వ్యవస్థాకులు డాక్టర్ పద్మ తెలిపారు. గోశాలలను ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 98497 50854.ఆంగ్రూ ఆన్లైన్ కోర్సులు..ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకంపై వేర్వేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులను ్రపారంభించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు నిర్వహిస్తారు. ఫీజు రూ. 1,500. ఇతర వివరాలకు.. 80087 88776, www.angrau.ac.inఇవి చదవండి: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..! -
Sagubadi: విదేశీ విత్తనాలను, మొక్కల్ని ఆన్లైన్లో కొంటున్నారా? జాగ్రత్త..!
విదేశాల నుంచి మొక్కలు, విత్తనాలు, చెక్క వస్తువులు, అలంకరణ చేపలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారా? విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ కంటికి నచ్చిన పూల మొక్కలనో, పంట మొక్కలనో, వాటి విత్తనాలనో అధికారుల కన్నుగప్పి వెంట తెస్తున్నారా?మిరపతో పాటు కొన్ని కూరగాయ పంటలు, మామిడి తోటలను ఇటీవల అల్లాడిస్తున్న నల్ల తామర ఇలాగే విదేశాల నుంచి వచ్చిపడిందేనని మీకు తెలుసా? కొబ్బరి, ఆయిల్‌పామ్ వంటి తోటలను పీడిస్తున్న రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ కూడా విదేశాల నుంచి మన నెత్తిన పడినదే. వీటి వల్ల జీవవైవిధ్యానికి, రైతులకు అపారమైన నష్టం కలుగుతోంది.ఒక దేశంలో ఉన్నప్పుడు పెద్దగా నష్టం కలిగించని పురుగులు, తెగుళ్లు వేరే దేశపు పర్యావరణంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి జీవవైవిధ్యానికి పెను సమస్య్ఠగా మారే ప్రమాదం ఉంటుంది.ఒక్కసారి ఆ పర్యావరణంలో అది సమస్యగా మారిన తర్వాత దాన్ని నిర్మూలించటం చాలా సందర్భాల్లో అసాధ్యం. ఉదాహరణ.. మన రైతులను వేధిస్తున్న నల్లతామర, రుగోస్ రింగ్‌స్పాట్ తెల్లదోమ. అందుచేత.. విదేశాల నుంచి సకారణంగా ఏవైనా మొక్కల్ని, విత్తనాలను, అలంకరణ చేపలను తెప్పించుకోవాలనుకుంటే.. అంతకు ముందే ఫైటోశానిటరీ సర్టిఫికెట్తో పాటు ఇతర అనుమతుల్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త..!తెలిసో తెలియకో పోస్టు, కొరియర్ల ద్వారా మన వంటి వారు కొనుగోలు చేస్తున్న విదేశీ మొక్కలు, విత్తనాలతో పాటు మనకు తెలియకుండా దిగుమతయ్యే సరికొత్త విదేశీ జాతుల పురుగులు, తెగుళ్లు మన దేశంలో పంటలకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆహార భద్రతకు ఎసరు పెట్టే పరిస్థితులూ తలెత్తవచ్చు. అందుకే అంతర్జాతీయంగా జన్యువనరుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టుల్లో, సీపోర్టుల్లో, సరిహద్దుల్లో ప్రత్యేక అధికార వ్యవస్థలను ఏర్పాటు చేశారు.మొక్కలు, విత్తనాలే కాదు.. మట్టి ద్వారా కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి చీడపీడలు తెలియకుండా రవాణా కావొచ్చు. ఆ మధ్య ఒక క్రికెటర్ తనతో పాటు తీసుకెళ్తున్న బూట్లకు అడుగున అంటుకొని ఉన్న మట్టిని సైతం ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గుర్తించి, నివారించడానికి ఇదే కారణం.అధికారికంగా వ్యవసాయ పరిశోధనల కోసం దిగుమతయ్యే పార్శిళ్లను ఈ క్వారంటైన్ అధికారులు వాటిని నిబంధనల మేరకు పరీక్షించి, ప్రమాదం లేదనుకుంటేనే దిగుమతిదారులకు అందిస్తారు. జాతీయ మొక్కల జన్యువనరుల పరిశోధనా సంస్థ (ఎన్‌బిపిజిఆర్) ద్వారా ఇది జరుగుతుంది.ఒక వ్యాపార సంస్థ నుంచి నేరుగా వినియోగదారుల మధ్య (బి2సి) జరిగే ఆన్లైన్ వ్యాపారం వల్లనే సమస్య. విదేశాల్లోని వినియోగదారులకు ఓ వ్యాపార సంస్థ నేరుగా అమ్మకాలు జరుపుతున్నందున దిగుమతులకు సంబంధించిన ఫైటోశానిటరీ నిబంధనల అమలు కష్టతరంగా మారింది.అంతర్జాతీయంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ప్రపంచ దేశాల మధ్య ఇంటర్నేషనల్ ΄్లాంట్ ్ర΄÷టెక్షన్ ఒడంబడిక (ఐపిపిసి) గతంలోనే కుదిరింది. ఇటీవల కాలంలో పెద్ద తలనొప్పిగా మారిన ఈ–కామర్స్ పార్శిళ్లను కట్టడి చేయడం కోసం జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థలకు ఐపిపిసి సరికొత్త మార్గదర్శకాలను సూచించింది.- గోల్డెన్ ఆపిల్ స్నెయిల్, - వరి మొక్కపై నత్త గుడ్లుఎవరేమి చెయ్యాలి?దేశ సరిహద్దులు దాటి సరికొత్త చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించకుండా ఉండాలంటే, ప్రమాదవశాత్తూ వచ్చినా వాటిని తొలి దశలోనే గుర్తించి మట్టుబెట్టేందుకు సమాజంలోని అనేక వర్గాల వారు చైతన్యంతో వ్యవహరించాల్సి ఉంది.రైతులు: చీడపీడలను చురుగ్గా గమనిస్తూ ఏదైనా కొత్త తెగులు లేదా పురుగు కనిపిస్తే వెంటనే అధికారులకు చె΄్పాలి. పర్యావరణ హితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు: చీడపీడల నివారణ, నియంత్రణకు మేలైన పద్ధతులను రైతులకు సూచించాలి. వీటి అమలుకు మద్దతు ఇస్తూ.. మొక్కల ఆరోగ్య పరిరక్షణకు సంబంధీకులందరినీ సమన్వయం చేయాలి.ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు, పాలకులు: మొక్కల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలి. పర్యావరణహితమైన సస్యరక్షణ చర్యలను ్రపోత్సహించాలి. ప్రమాదరహితమైన వ్యాపార పద్ధతులను ప్రవేశ పెట్టాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయిలో మొక్కల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ సంస్థలను అన్ని విధాలా బలోపేతం చేయాలి.దాతలు–సిఎస్ఆర్: మొక్కల ఆరోగ్య రక్షణ వ్యవస్థలను, సాంకేతికతలను బలోపేతం చేయాలి. ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులు సమకూర్చాలి. రవాణా, వ్యాపార రంగాలు: ప్రస్తుతం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ఫైటోశానిటరీ చట్టాలను, ఐపిపిసి ప్రమాణాలను తు.చ. తప్పక పాటించాలి.ప్రజలు: విదేశాల నుంచి మన దేశంలోకి మొక్కల్ని, మొక్కల ఉత్పత్తుల్ని తీసుకురావటం ఎంతటి ప్రమాదమో గుర్తించాలి. అధికార వ్యవస్థల కన్నుగప్పే విధంగా ఈ–కామర్స్ వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా విదేశాల నుంచి మొక్కలను, విత్తనాలను ఆర్డర్ చేయకుండా చైతన్యంతో మెలగాలి.విదేశీ నత్తలతో ముప్పు!ఓ కోస్తా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంచినీటి నత్త జాతికి చెందిన గోల్డెన్ ఆపిల్ స్నెయిల్ను విదేశాల నుంచి తెప్పించి సిమెంటు తొట్లలో పెంచుతూ పట్టుబడ్డాడు. దక్షిణ అమెరికా దీని స్వస్థలం. అయితే, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పాకిన ఈ నత్త ఆయా దేశాల్లో తామరతంపరగా పెరిగిపోతూ స్థానిక జలచరాలను పెరగనీయకుండా జీవవైవిధ్యాన్ని, వరి పంటను దెబ్బతీయటంప్రారంభించింది.లేత వరి మొక్కలను కొరికెయ్యటం ద్వారా పంటకు 50% వరకు నష్టం చేకూర్చగలదు. ఫిలిప్పీన్స్‌లో ఏకంగా 200 కోట్ల డాలర్ల మేరకు పంట నష్టం కలిగించింది. వేగంగా పెరిగే లక్షణం గల ఈ నత్త మంచినీటి చెరువులు, కాలువలు, వరి ΄÷లాల్లో జీవవైవిధ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ వ్యక్తి ఈ నత్తలను పెంచుతూ మాంసాన్ని విక్రయించటంప్రారంభించిన విషయం తెలుసుకున్న అధికారులు అతని వద్ద ఉన్న విదేశీ నత్తలను, వాటి గుడ్లను పూర్తిగా నాశనం చేశారు.దీని వల్ల జీవవైవిధ్యానికి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఈ నత్తల్ని పెంచటంప్రారంభించినట్లు చెబుతున్నారు. కొరియర్ ద్వారా గాని, కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి నత్తలను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అయితే, సకాలంలో అధికారులు స్పందించటం వల్ల మన వరి ΄÷లాలకు ఈ నత్తల ముప్పు తప్పింది.ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్..ఎండిన, ముక్కలు చేసిన లేదా పాలిష్ చేసిన ధాన్యాలు, విత్తనాలు, పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా చీడపీడలను మోసుకొచ్చే ప్రమాదం ఉంది. అయితే, ఉడికించటం, స్టెరిలైజ్ చేయటం, వేపటం వంటిప్రాసెసింగ్ చేసిన ఆహారోత్పత్తుల ద్వారా మాత్రం చీడపీడలు రవాణా అయ్యే అవకాశం ఉండదు కాబట్టి వీటికి ఫైటోశానిటరీ నిబంధనలు వర్తించవు.తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మాంటిడ్స్, పెంకు పురుగులు, పుల్లలతో చేసిన బొమ్మ మాదిరిగా కనిపించే పురుగులు (స్టిక్ ఇన్సెక్ట్స్), నత్తలు వంటి వాటిని కొందరు సరదాగా పెంచుకోవటానికి కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి పంపటం లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయటం వంటి పనులు చేస్తుంటారు. వీటి ద్వారా కూడా పురుగులు, తెగుళ్లు, వైరస్లు ఇతర దేశాలకు వ్యాపించే అకాశం ఉంటుంది. న్యూజిలాండ్‌లో మూడేళ్ల క్రితం ఒక స్కూలు విద్యార్థిని ఇంట్లో పెద్దలకు తెలియకుండా అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లను పోర్చుగల్ దేశం నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేసి తెప్పించుకుంది. పార్శిల్ వచ్చిన తర్వాత గమనించిన ఆమె తల్లి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఆ పార్శిల్‌ను జాగ్రత్తగా తీసుకెళ్లి పరీక్షించి చూశారు.ఆ దేశంలో అప్పటికే ఉన్న అనేక రకాల స్టిక్ ఇన్సెక్ట్స్ గుడ్లతో పాటు కొత్త రకం ఇండియన్ స్టిక్ ఇన్సెక్ట్ గుడ్లు కూడా ఆ పార్శిల్లో ఉన్నాయని గుర్తించి నాశనం చేశారు. ఈ విద్యార్థిని తల్లి చైతన్యం మెచ్చదగినది.సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు!ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా వస్తువుల వ్యాపారం (ఈ–కామర్స్) గతమెన్నడూ లేనంత జోరుగా సాగుతున్న రోజులివి. సెకనుకు 5,102 ఈ–కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి. 2022లో ఏకంగా 16,100 కోట్ల పార్శిళ్ల కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయి. కరోనా కాలంలో 20% పెరిగాయి. ఇప్పుడు వార్షిక పెరుగుదల 8.5%. 2027 నాటికి ఏటా 25,600 కోట్ల పార్శిళ్లు ఈ కామర్స్ ద్వారా బట్వాడా అయ్యే అవకాశం ఉందని అంచనా.- అమెరికాలోని ఓ తనిఖీ కేంద్రంలో ఈ–కామర్స్ పార్శిళ్లుముఖ్యంగా అసక్తిగా ఇంటిపంటలు, పూల మొక్కలు పెంచుకునే గృహస్తులు చిన్న చిన్న కవర్లలో విత్తనాలను విదేశాల్లోని పరిచయస్తులకు పోస్ట్/ కొరియర్ ద్వారా పంపుతుంటారు. విదేశీ కంపెనీల నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటూ ఉంటారు. విదేశాల నుంచి విత్తనాలు, ఉద్యాన తోటల మొక్కలు, అలంకరణ మొక్కలు, వాటితో పాటు వచ్చే మట్టి, అలంకరణ చేపలు, చెక్కతో చేసిన వస్తువులు, యంత్రాల ప్యాకింగ్‌లో వాడే వుడ్ ఫ్రేమ్‌ల ద్వారా పురుగులు, తెగుళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి రవాణా అవుతూ అధికారులకు చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా కాలం నుంచి ప్రపంచ దేశాల మధ్య పార్శిళ్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటంతో నియంత్రణ వ్యవస్థలు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. మన దేశంలో నియంత్రణ వ్యవస్థలను నేటి అవసరాలకు అనుగుణంగా పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
CABI: 'కాబి' ఉచిత డిజిటల్ టూల్స్..
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్సైట్, యాప్‌ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్‌ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.వెబ్సైట్, అనేక యాప్‌ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్షీట్లు, వీడియో ఫ్యాక్ట్షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్‌టాప్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్వైజ్ ఫ్యాక్ట్‌షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిసురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్‌ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్‌తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఎత్తు మడులపై అల్లం నాటారో.. ఇక లాభాలే!
సాధారణ బోదెలపైన అల్లం విత్తుకోవటం కన్నా వెడల్పాటి ఎత్తు మడులపై రెండు సాళ్లుగా నాటుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎత్తు మడులపై అల్లం సాగు వల్ల వేరుకుళ్లు వంటి తగుళ్ల సమస్య తీరిపోతుందని, కనీసం 30–40% అల్లం దిగుబడి పెరుగుతుందని ఉత్తరాంధ్ర జిల్లాల్లో గిరిజన రైతులతో పనిచేస్తున్న వికాస స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎస్. కిరణ్ తెలిపారు.సాధారణంగా రైతులు బోదెలు తోలి అల్లం విత్తుకుంటూ ఉంటారు. వర్షాలకు కొద్ది రోజులకే బోదె, కాలువ కలిసిపోయి నీరు నిలబడటం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా వేరుకుళ్లు వంటి తెగుళ్లు వస్తుంటాయి. నీటి ముంపు పరిస్థితుల్లో పంట దిగుబడి భారీగా దెబ్బతిని ఖర్చులు కూడా రాని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి.ఈ సమస్యల నుంచి బయటపడి పంట విషలం కాకుండా మంచి దిగుబడి పొందాలంటే ఎత్తుమడులపై విత్తుకోవటమే మేలని వికాస సంస్థ పాడేరు, అరకు ప్రాంత రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రేమ్‌జీ ఫౌండేషన్ తోడ్పాటుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం గత ఖరీఫ్ నాటికి రెండేళ్లలోనే 543 మంది రైతులకు విస్తరించిందని డా. కిరణ్ వివరించారు. అడుగు ఎత్తున, రెండు నుంచి రెండున్న అడుగుల వెడల్పుతో ఎత్తు మడులను పొలంలో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి.రెండు వరుసలుగా అల్లం లేదా పసుపు విత్తుకోవచ్చు. అల్లం సాగులో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. ఎత్తుమడులపై విత్తుకోవటం, మురుగునీరు పోవడానికి కాలువలు ఏర్పాటు చేయటంతో పాటు ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం, 25 కిలోల వేపపిండి వేస్తారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం (ఏటా 600 లీటర్లు) మొక్కల మొదళ్లలో పోస్తున్నారు. ఎకరానికి కనీసం 14–15 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారని డా. కిరణ్ వివరించారు.బోదెలు తోలి సాగు చేసే సాధారణ పద్ధతిలో సగటున ఎకరానికి 9–11 టన్నుల దిగుబడి వస్తుంటుందని, ఎత్తుమడుల పద్ధతిలో సగటున ఎకరానికి 5–6 టన్నులు అదనపు దిగుబడి వస్తోందన్నారు. ఎత్తుమడుల వల్ల కలుపు తీయటం సులభం అవుతుంది. పంట విఫలమై రైతు నష్టపోయే ప్రమాదం తప్పుతుంది. మైదానప్రాంతాల రైతులు కూడా ఎత్తు మడుల పద్ధతిని నిశ్చింతగా అనుసరించవచ్చని డా. కిరణ్ (98661 18877) భరోసా ఇస్తున్నారు.– డాక్టర్ కిరణ్13 నుంచి తిరుపతిలో సేంద్రియ ఎఫ్పిఓల మేళా..కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నాబార్డ్ సహకారంతో ఈ నెల 13,14,15 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం (టౌన్‌క్లబ్)లో గో ఆధారిత వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు, ఎఫ్పిఓల మేళాను నిర్వహించనుంది. కనెక్ట్ టు ఫార్మర్ సంస్థ నెలకో సేంద్రియ సంత నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.13 ఉ. 11 గంటలకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నాబార్డ్ సీజీఎం గో΄ాల్ మేళాను ప్రారంభిస్తారు. ΄ాత విత్తనాల ప్రదర్శన ఉంటుంది. 14న ఉదయం అమేయ కృషి వికాస కేంద్రం (భువనగిరి) వ్యవస్థాపకులు, ప్రముఖ రైతు శాస్త్రవేత్త జిట్టా బాల్‌రెడ్డి ఉద్యాన పంటల్లో గ్రాఫ్టింగ్‌పై శిక్షణ ఇస్తారు.15న ప్రకృతి చికిత్సా పద్ధతులపై నేలకొండపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డా. కె. రామచంద్ర, ప్రకృతి సేద్యంపై గ్రామభారతి అధ్యక్షులు సూర్యకళ గుప్త, ప్రసిద్ధ అమృతాహార ప్రచారకులు ప్రకృతివనం ప్రసాద్, ఆరుతడి వరి సాగుపై ఆదర్శ రైతు శ్రీనివాస్ (గద్వాల్) వివరిస్తారు. ఇతర వివరాలకు 63036 06326. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ఇవి చదవండి: బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే! -
బయోచార్ కంపోస్టు.. నిజంగా బంగారమే!
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి వస్తున్న ఒక పద్ధతి ‘బయోచార్’ వినియోగం. దీన్నే మామూలు మాటల్లో ‘కట్టె బొగ్గు’ అనొచ్చు. పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకొని పొలాల్లో వేసుకోవచ్చు.– బయోచార్ ఎరువు కాదు.. పంటలకు వేసే రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ కనీసం 30–40% ఎక్కువ ఉపయోగపడేందుకు బయోచార్ ఉపయోగపడుతుంది అంటున్నారు స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి.– మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, వరిసాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ తోడ్పడుతుంది.– ఒక్కసారి వేస్తే వందల ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది.. సీజనల్ పంటలకైనా, పండ్ల తోటలకైనా బయోచార్ నిజంగా బంగారమే అంటున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి.బయోచార్.. ఈ పేరు చెప్పగానే ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ నక్కా సాయిభాస్కర్రెడ్డి(55) పేరు చప్పున గుర్తొస్తుంది. 20 ఏళ్ల క్రితం నుంచి ‘బయోచార్’ అనే పేరును ఖరారు చేసి.. వ్యవసాయకంగా, పర్యావరణపరంగా దీని ప్రయోజనాల గురించి దేశ విదేశాల్లో విస్తృతంగా పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు చేస్తూ ఇప్పటికి 5 పుస్తకాలను వెలువరించారు. వెబ్సైట్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఆయనతో ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..బయోచార్ (కట్టె బొగ్గు) అంటే..?వ్యవసాయ వర్గాల్లో ఈ మధ్య తరచూ వినవస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం.. చార్ (చార్కోల్) అంటే బొగ్గు. బయోచార్ అంటే ‘జీవం ఉన్న బొగ్గు’ అని చెపొ్పచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు. అంటే ఇది అస్థిర కర్బనం (ఒలేటైల్ కార్బన్). దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కార్బన్ ఉపయోగపడుతుంది. అదే బయోచార్.బయోచార్ కోసం కట్టెలు కాలబెట్టడం వల్ల అడవులకు, పర్యావరణానికి ముప్పు లేదా?బొగ్గు నల్ల బంగారంతో సమానం. బంగారం అని ఎందుకు అన్నానంటే.. ప్రపంచంలో తయారు చేయలేనిది, డబ్బుతో కొనలేనిది మట్టి ఒక్కటే. హరిత విప్లవం పేరుతో మట్టిని మనం నాశనం/ విషతుల్యం/ నిర్జీవం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం బయోచార్. అడవులను నరికి బయోచార్ తయారు చేయమని మనం చెప్పటం లేదు. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలను వట్టిగానే తగులబెట్టే బదులు వాటితో బయోచార్ తయారు చేసుకోవచ్చు. వూరికే పెరిగే సర్కారు తుమ్మ వంటి కంప చెట్ల కలపతో లేదా జీడి గింజల పైపెంకులతో కూడా బయోచార్ తయారు చేసుకోవచ్చు. వరి పొట్టును బాయిలర్లలో, హోటళ్ల పొయ్యిల్లో కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు.పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో, పెద్దగా పొగ రాకుండా, 450 నుంచి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే (ఈ ప్రక్రియనే ‘పైరోలిసిస్’ అంటారు) తయారయ్యే నల్లని కట్టె బొగ్గే బయోచార్. ఆరుబయట కట్టెను తగుటబెడితే బూడిద మిగులుతుంది. ఈ పద్ధతిలో అయితే బూడిద తక్కువగా బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ వందల ఏళ్ల ΄ాటు మట్టిలో ఉండి మేలుచేసే సూక్ష్మజీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సాగు నీటిలో విషాలను పరిహరిస్తుంది. దీనితో వ్యవసాయంలో కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చితే.. దీన్ని తయారు చేసేటప్పుడు వెలువడే కొద్ది΄ాటి పొగ వల్ల కలిగే నష్టం చాలా తక్కువ.‘బయోచార్ కంపోస్టు’ అంటే ఏమిటి?బయోచార్ అంటే.. పొడిగా ఉండే కట్టె బొగ్గు. దీన్ని నేరుగా పొలాల్లో వేయకూడదు. బయోచార్ కంపోస్టు తయారు చేసుకొని వేయాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్దమొత్తంలో పీల్చుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ను మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు. అందుకనే. వట్టి బయోచార్ను కాకుండా బయోచార్ కంపోస్టును తయారు చేసుకొని వేస్తే ఈ సమస్య ఉండదు.మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా బయోగ్యాస్ స్లర్రీ లేదా జీవామృతం లేదా పంచగవ్య వంటి.. ఏదైనా సేంద్రియ ఘన/ ద్రవరూప ఎరువులలో ఏదో ఒకదాన్ని బయోచార్ను సమ΄ాళ్లలో కలిపి కుప్ప వేసి, బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలియదిప్పుతూ ఉంటే 15 రోజుల్లో బయోచార్ కంపోస్టు సిద్ధం అవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలు వస్తాయి. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం ముఖ్యం. బయోచార్ ఒకటి రెండు సీజన్లలో ఖర్చయిపోయే ఎరువు వంటిది కాదని రైతులు గుర్తుంచుకోవాలి. వంద నుంచి వెయ్యేళ్ల వరకు నేలలో స్థిరంగా ఉండి మేలు చేస్తుంది.రసాయనిక ఎరువులు వాడే రైతులకు కూడా బయోచార్ ఉపయోగపడుతుందా? బయోచార్ సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా వాడుకోవచ్చు. కట్టెబొగ్గుతో యూరియా, ఫాస్పేటు వంటి వాటిని కలిపి వేసుకోవచ్చు. వట్టిగా యూరియా వేస్తే 20–30 శాతం కన్నా పంటకు ఉపయోగపడదు. అదేగనక బయాచార్తో యూరియా కలిపి వేస్తే 30–40% ఎక్కువగా పంటకు ఉపయోగపడుతుంది. బొగ్గులోని ఖాళీ గదులు ఉంటాయి కాబట్టి యూరియాను కూడా పట్టి ఉంచి, ఎక్కువ రోజుల ΄ాటు పంట మొక్కల వేర్లకు నెమ్మదిగా అందిస్తుంది.వరి సాగుకూ ఉపయోగమేనా?వరి పొలాల్లో నీటిని నిల్వగట్టే పద్ధతి వల్ల మిథేన్ వంటి హరిత గృహ వాయువులు గాలిలో కలుస్తూ వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడే పొలాల వాయుకాలుష్యం మరింత ఎక్కువ. ఈ పొలాల్లో బయోచార్ వేస్తే.. నీటి అడుగున మట్టిలో ఆక్సిజన్‌ను లభ్యత పెరుగుతుంది. మిథేన్ తదితర హరిత గృహ వాయువులను బొగ్గు పీల్చుకుంటుంది. కాబట్టి, వాతావరణానికి జరిగే హాని తగ్గుతుంది. అందుకనే బయోచార్ వాడితే కార్బన్ క్రెడిట్స్ పేరిట డబ్బు ఇచ్చే పద్ధతులు కూడా సమీప భవిష్యత్తులోనే అమల్లోకి రానున్నాయి.బయోచార్‌పై మరింత సమాచారం కోసం చూడండి.. www.youtube.com/@biocharchannelhttps://biochared.comఏ పొలానికి ఎంత వెయ్యాలో తెలిసేదెలా?మీ భూమికి ఖచ్చితంగా ఎంత మొత్తంలో బయోచార్ కంపోస్టు వేస్తే సరిపోయేదీ ఒక టెస్ట్ ద్వారా మీరే స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ విషయం ఎవరినో అడిగితే తెలియదు. మీ పొలంలో ఎత్తయిన ప్రదేశంలో 5 చిన్న మడులు చేసుకొని, వాటిల్లో బయోచార్ కంపోస్టును వేర్వేరు మోతాదుల్లో వేసి.. ఆ 5 మడుల్లోనూ ఒకే రకం పంటను సాగు చేయండి. 3 నెలల్లో మీకు ఫలితం తెలిసిపోతుంది. 1 చదరపు మీటరు విస్తీర్ణం (ఈ విసీర్ణాన్ని మీరే నిర్ణయించుకోండి)లో పక్క పక్కనే 5 మడులు తయారు చేసుకోండి. అంటే.. మొత్తం 5 చ.మీ. స్థలం కేటాయించండి. ఒక్కో దాని మధ్య గట్టు మాత్రం ఎత్తుగా, బలంగా వేసుకోండి.1వ మడిలో బయోచార్ కంపోస్టు అసలు వెయ్యొద్దు. 2వ మడిలో బయోచార్ కంపోస్టు 0.5 కిలో, 3వ మడిలో 1 కిలో, 4వ మడిలో 2 కిలోలు, 5వ మడిలో 4 కిలోలు వెయ్యండి. ఈ 5 మడుల్లో 3 నెలల్లో చేతికొచ్చే ఒకే రకం పంట విత్తుకోండి లేదా కూరగాయ మొక్కలు నాటుకోండి.– బయోచార్ కంపోస్టుపై శిక్షణ ఇస్తున్న డా. సాయి భాస్కర్ రెడ్డిబయోచార్ కంపోస్టు విషయంలో వత్యాసాలు ΄ాటించి చూడటం కోసమే ఈ ప్రయోగాత్మక సాగు. ఇక మిగతా పనులన్నీ ఈ మడుల్లో ఒకేలా చేయండి. అంటే నీరు పెట్టటం, కలుపు తీయటం, పురుగుమందులు లేదా కషాయాలు పిచికారీ చేయటం అన్నీ ఒకేలా చెయ్యండి.ఆ పంటల్లో పెరిగే దశలో వచ్చే మార్పులన్నిటినీ గమనించి, రాసుకోండి. ప్రతి వారానికోసారి ఫొటోలు/వీడియో తీసి పెట్టుకోండి. కాండం ఎత్తు, లావు, పిలకలు/కొమ్మల సంఖ్య, పూత, దిగుబడి, గింజ/కాయల సైజు, ఆ మొక్కల వేర్ల పొడవు వంటి అన్ని విషయాలను నమోదు చేయండి. 3 నెలల తర్వాత ఆ పంట పూర్తయ్యే నాటికి బయోచార్ కంపోస్టు అసలు వేయని మడితో వేర్వేరు మోతాదుల్లో వేసిన మడుల్లో వచ్చిన దిగుబడులతో పోల్చిచూడండి. బయోచార్ కంపోస్టు ఏ మోతాదులో వేసిన మడిలో అధిక దిగుబడి వచ్చిందో గమనించండి. ఇదే మోతాదులో మీ పొలం అంతటికీ వేసుకోండి. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సాగుకు భరోసా..!
‘వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది.. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం.. విత్తనాల తయారీ, ఉత్పత్తిలో ముందడుగు వేశాం.. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ విత్తనాలపై ఆధారపడి ఇప్పుడు విత్తనాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం.. వివిధ రాష్ట్రాల నుంచి మన విత్తనాలు కావాలని ఇండెంట్ పెడుతున్నారు’ అని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి తెలిపారు. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..స్వరాష్ట్రంలో మూడు వ్యవసాయ కళాశాలలు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయమే ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ.నరసింహారావు వెటర్నటీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన యూనివర్సిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరంగల్, జగిత్యాల, పాలెం (మహబూబ్‌నగర్ జిల్లా)లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలకు అనుబంధంగా వ్యవసాయ కళాశాలలను నెలకొల్పింది. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి వ్యవసాయ విద్యనభ్యసించేవారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వ్యవసాయ కళాశాలలలో విద్యార్థులకు పరిశోధనతోపాటు బోధన జరుగుతోంది. వరంగల్‌కు వెటర్నరీ కళాశాల కూడా వచ్చింది.పెరిగిన సాగువిస్తీర్ణం..సమృద్ధిగా వర్షాలు కురవడంతోపాటు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి అయ్యింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నీటి ల«భ్యత, సాగు విస్తీర్ణం పెరిగింది. ధాన్యం, పత్తి దిగుబడి ఎక్కువగా వస్తోంది. ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేస్తున్నాం. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ అధిగ దిగుబడి సాధిస్తున్నాం. కూలీల కొరతను అధిగవిుంచేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.మెరుగైన రైతుల ఆర్థికపరిస్థితి..సాంకేతికతతో పంట దిగుబడులు పెరగడంతో రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అధిక సాంద్రత పత్తితో రైతులు లాభసాటి సాగు చేస్తున్నారు. పత్తి తీసివేసిన తర్వాత మరో పంట సాగు చేస్తున్నారు. గతంలో పత్తి తర్వాత ఈ భూమిలో పంట వేయకుండా వదిలేసే వారు. రైతులు పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచి్చంది. సకాలంలో పెట్టుబడి అందుతుండడంతో విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. ‡రైతుబీమా రైతు కుటుంబానికి భరోసా కల్పించింది. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. బీమా చేయించిన రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల సొమ్ము వస్తుంది.అనుబంధ రంగాలకు ప్రోత్సాహం..వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన పథకాలు అమలవుతున్నాయి. పశువైద్య, పశుసంవర్థక శాఖ ద్వారా గొర్రెల పంపిణీ పథకం చేపట్టారు. దీంతో పెంపకందారులకు ఆదాయం సమకూరుతోంది. అదేవిధంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోంది. ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, ఆయిల్‌పామ్ తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్..ఏఓలు, ఏఈఓల నియామకాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఒక ఏఈఓను నియమించింది. రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించేందుకు, రైతుల సందేహాలు తీర్చుకునేందుకు ప్రతి క్లస్టర్లో రైతు వేదిక నిర్మించింది. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు రైతులకు అందిస్తున్నారు.వాట్సాప్ ద్వారా రైతుల సందేహాల నివృత్తి..వారంలో రెండు రోజులు వాతావరణ పరిస్థితులు వివరిస్తుండడంతో రైతులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటునానరు.అదేవిధంగా పీజేటీఎస్ ఏయూ యూట్యూబ్ చానల్ ప్రారంభించి సాగులో అవలంబించాల్సిన పద్ధతులను వివరిస్తున్నారు. వాట్సా ప్ ద్వారా కూడా రైతుల సందేహాలు తీరుస్తున్నాం.మేలైన వంగడాల వృద్ధి..రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుములు, పెసర, కుసుమ, నువ్వు తదితర మేలు రకమైన వంగడాలు వృద్ధి చేశాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1010 వరి రకానికి ప్రత్యామ్నాయంగా కునారం సన్నాలు, జేజీఎల్–2423 వంగడాలను తీసుకొచ్చాం. బీపీటీ–5204కు ప్రత్యామ్నాయంగా షుగర్ లెస్ వరి విత్తనం ఆర్ఎన్ఆర్–1504 (తెలంగాణ సోనా)ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. కందిలో ఎల్‌ఆర్‌జీ–41కి ప్రత్యామ్నాయంగా డబ్ల్యూజీఎల్–97 వంటి విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు మన విత్తనాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మే 24న విత్తన మేళా నిర్వహించి రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నాం.విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం.. విలువ ఆధారిత ఉత్పత్తులు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంట ఉత్పత్తులకు విలువను జోడిస్తే రైతుకు అధిక ఆదాయం వస్తుంది. ఉదాహరణకు మిర్చి, పసుపును పొడిగా మార్చి విక్రయిస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుంది. భవిష్యత్‌లో ఈ విధానం పెద్ద ఎత్తున ఆచరించే అవకాశముంది. తాండూరు కంది పప్పు జీఐ ట్యాగ్ సాధించింది.రైతుల వద్దకే వ్యవసాయ అధికారులు..జిల్లాల పునర్విభజన తర్వాత రైతుల ముంగిటికి జిల్లా వ్యవసాయf అధికారులు వస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఖ్య గతంలో కంటే పెరిగింది. తద్వారా రైతులకు వ్యవసాయ అధికా రుల సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఏజీ హబ్ ద్వారా గ్రామీణ ప్రాంత యువ రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.– డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, సహ పరిశోధన సంచాలకుడు -
Sagubadi: ప్రకృతి ఆహారం.. పక్కా లోకల్!
తొలకరితో పాటే వచ్చే అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (జూన్ 5) ఈ ఏడాది లక్ష్యం: ’భూముల పునరుద్ధరణ, ఎడారీకరణను, కరువును తట్టుకునే దిశగా పనిచేయటం’. మట్టిలో సేంద్రియ కర్బనం 0.3%కి పడిపోయింది. దీన్ని పెం΄÷ందించుకోవటానికి, పనిలో పనిగా భూతాపాన్ని తగ్గించడానికి సేద్యం మొత్తాన్నీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం తప్ప మరో మేలైన దారి లేదన్నది నిపుణుల మాట.ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులు భూమిని శాశ్వతంగా బాగుచేసుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వారు పండించిన అమృతాహారాన్ని స్థానిక మార్కెట్లలోనే నేరుగా ప్రజలకు అమ్ముతున్నారు. ఈ విధంగా ప్రకృతి/సేంద్రియ రైతులతో పాటు ఈ ఆహారాన్ని కొనుగోలు చేస్తున్న వినియోగదారులు కూడా పర్యావరణ పరిరక్షణకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార రంగంలో చోటు చేసుకుంటున్న గుణాత్మక మార్పుల గురించి ప్రత్యేక కథనం..!ప్రకృతి వ్యవసాయంలో మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) విస్తారంగా సాగవుతోంది. రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకంగా పండించిన ధాన్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను స్థానిక మార్కెట్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో ఏపీ రైతు సాధికార సంస్థ కృషి చేస్తోంది.ప్రకృతి వ్యవసాయంలో స్థానిక రైతులు పండించిన ఆహారోత్పత్తులను స్థానిక ప్రజలకే తొలుత అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. స్థానిక మార్కెట్లలో, రైతుబజార్లలో, వైఎస్సార్ చేయూత మహిళా రూరల్ మార్ట్‌లలో రైతుల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు కృషి చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమం ్రపారంభమైంది. విజయవాడ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రతి సోమవారం జరిగే ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు తరలి వస్తారు కాబట్టి అదే రోజు నమ్మకమైన ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, సాధారణ మార్కెట్‌తో పోల్చినప్పుడు ఇక్కడ 10–15% అదనపు ధర రైతులకు లభిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ సీనియర్ మార్కెటింగ్ లీడ్ బి. ప్రభాకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.జిల్లా, మండల కేంద్రాల్లో ఉత్పత్తులు విక్రయిస్తున్న ప్రకృతి వ్యవసాయదారులు427 మండల కేంద్రాల్లో అమ్మకాలు..ఏపీలోని 26 జిల్లా కేంద్రాలకు గాను 22 చోట్ల, 663 మండలాలకు గాను 427 మండల కేంద్రాల్లో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయోత్పత్తులను రైతులు అమ్ముతున్నారని ప్రభాకర్ వివరించారు. అదేవిధంగా, 113 మునిసిపాలిటీలకు గాను 24 మునిసిపాలిటీలలోనూ తాము పండించే ఉత్పత్తులను గత 2–3 నెలలుగా ప్రకృతి వ్యవసాయదారులు విక్రయిస్తున్నారు. వైఎస్సార్ చేయూత మహిళా గ్రామీణ మార్ట్లు 47 ఉండగా ఇప్పటికి 32 మార్ట్‌లలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను అందుబాటులోకి తెచ్చారు.ఆకర్షిస్తున్న ‘కంటెయినర్ రైతుబజార్లు’..ఏపీలో 96 రైతుబజార్లు పట్టణ ్రపాంత వినియోగదారులకు నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తున్నాయి. వీటిలో ఇప్పటికే 47 రైతుబజార్లలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే స్టాల్స్ ఏర్పాటయ్యాయి. 3 ఉత్తరాంధ్ర జిల్లాల్లో 5 రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ తోడ్పాటుతో అవని ఆర్గానిక్స్ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రత్యేక కంటెయినర్లు ఏర్పాటు చేసింది. వీటిలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలను విక్రయించటం ఇటీవలే ్రపారంభించారు. పట్టణ ్రపాంతీయులను ఈ కంటెయినర్ రైతుబజార్లు విశేషంగా ఆకర్షిస్తున్నాయని, మరో 33 రైతుబజార్లలో జూన్ రెండోవారంలో కంటెయినర్ దుకాణాలను ్రపారంభించనున్నామని ప్రభాకర్ వివరించారు. మున్ముందు దశలవారీగా ప్రతి రైతుబజారులోనూ కంటెయినర్ దుకాణాలు తెరుస్తామన్నారు.లోకల్ మార్కెటింగే మా వ్యూహం!రసాయనాలతో పండించిన ఆహారోత్పత్తులతో పోల్చితే.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో పండించిన ఆహారోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ఈ ఆహారోత్పత్తులను స్థానిక మార్కెట్ల ద్వారా సాధారణ ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటమే మా మార్కెటింగ్ వ్యూహం. మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.– టి. విజయకుమార్, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ఏపీఆర్వైఎస్ఎస్.గ్రామాల్లో ‘ఫుడ్ బాస్కెట్లు’!ఏపీలో ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక బృందాలు కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందాల సభ్యుల కుటుంబాలలోని వారందరికీ అవసరమయ్యే అన్ని రకాల ఆహారోత్పత్తులను ప్రకృతి వ్యవసాయంలో పండించినవే అందించాలన్న లక్ష్యంతో ఫుడ్ బాస్కెట్స్ కార్యక్రమానికి రైతుసాధికార సంస్థ 7 నెలల క్రితం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతానికి 76 గ్రామాల్లో ఈ ఫుడ్ బాస్కెట్ స్కీమ్ ్రపారంభమైందని, త్వరలో 129 గ్రామాలకు విస్తరించనున్నామన్నారు. వీరికి ఆయా గ్రామాల్లో పండించేవి చాలకపోతే, పక్క గ్రామాలు, మండలాల నుంచి సేకరించి అందిస్తున్నారు.గ్రామీణులకు తొలి ్రపాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ ఫుడ్ బాస్కెట్స్ అందిస్తుండటం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తున్నారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో సిబ్బంది, సందర్శకులకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులన్నిటినీ విక్రయించేందుకు జూన్ రెండో వారం నుంచి ప్రత్యేక స్టాల్‌ను ్రపారంభించనున్నామని ప్రభాకర్ (97714 63539) చెప్పారు. స్థానిక మార్కెట్ల ద్వారా స్థానిక ప్రజలకు ప్రకృతి ఆహారాన్ని విస్తృతంగా అందుబాటులోకి తేవటం సంతోషదాయకం.– బి.ప్రభాకర్, సీనియర్ మార్కెటింగ్ లీడ్, ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ -
పంట ఏదైనా.. ఎత్తుమడులే మేలు!
భరించలేని ఎండలతో జనాన్ని భీతిల్లజేసిన ఎల్‌నినో ముగిసింది. అధిక వర్షాలతో కూడిన లానినాప్రారంభం కానున్న నేపథ్యంలో అధిక వర్షాలకు పంటలు తట్టుకునే వ్యూహాలు అవసరం. అందులో ముఖ్యమైనది.. ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పై పంటలు విత్తుకోవటం. అది ఎర్ర నేలైనా, నల్ల నేలైనా.. పత్తి, కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో టు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే నీటి ముంపు నుంచి, ఉరకెత్తటం, అతివృష్ఠి/ అనావృష్ఠి బాధల నుంచి రక్షణ పొందవచ్చని ఆదిలాబాద్ కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు.వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకోవటం మేలని డా. ప్రవీణ్ కుమార్ గత కొన్ని సంవత్సరాలుగా రైతులకు చెబుతూ వస్తున్నారు.పత్తి సాగులో ఎత్తు మడి లాభాలు..అతివృష్ఠి సమయాల్లో పంటల సంరక్షణకు సమర్థవంతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ కీలకం. ఎత్తు మడుల పద్ధతిలో పత్తి సాగు చేయడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ఎత్తుమడులు చేసుకోవడానికి ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే రిడ్జర్ లేదా బెడ్ మేకర్‌ను ఉపయోగిస్తారు. పత్తికి ఉద్దేశించిన మడి 15–20 సెం.మీ.ల ఎత్తు ఉంటుంది. మడి వెడల్పు నేల స్వభావం, ఆప్రాంతంలో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు.ట్రాక్టర్ ద్వారా ఇలా ఎత్తు మడులు/బోదెలు తోలుకోవాలిపత్తి సాళ్ల మధ్య 180/ 150/ 120 సెం.మీ., మొక్కల మధ్య 30/20/30 సెం.మీ.ల దూరంలో పత్తి పంటను సాగు చేయవచ్చు. సాధారణంగా ఒక ఎకరంలో ఎత్తు మడులు చేయడానికి సుమారు 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం పడుతుంది. ఎత్తు మడుల మీద విత్తిన విత్తనం సాధారణ ΄÷లంలో కన్నా ఒకటి రెండు రోజులు ముందే మొలకెత్తుతుంది. సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే, మొలక శాతం ఎక్కువ. దాదాపు 90 శాతం విత్తనాలు మొలుస్తాయి.ఎత్తు మడుల వలన మురుగు నీటి వ్యవస్థ మెరుగవుతుంది. వర్షపు నీరు ΄÷లంలో నిలవకుండా, కాలువల ద్వారా బయటికి వెళ్లిపో తుంది. దీనివలన తొలిదశలో మొక్క పెరుగుదల కుంటుపడదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నల్లరేగడి నేలల్లో వరద పారుతుంది. ఆ ప్రవాహంలో మొక్కలు కొట్టుకుపోకుండా ఎత్తు మడులు కాపాడుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మడుల్లో నిల్వ ఉండే తేమ పంటకు ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పత్తి మొక్కల కింది కొమ్మలకు మొదట్లో వచ్చే 5 నుండి 10 కాయలు కుళ్లాపోతూ ఉంటాయి.ఎత్తుమడులు చేయడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి కాయకుళ్లు, ఇతర చీడడీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. యాంత్రీకరణ ద్వారా కలుపు యాజమాన్యం సులభమవుతుంది. సాధారణ పద్ధతితో పోలిస్తే ఎత్తు మడుల పద్ధతిలో 10–20 శాతం అధిక దిగుబడులు సాధించవచ్చు. నల్లరేగడి నేలలు, తేలికపాటి ఎర్రనేలల్లో ఎత్తు మడుల పద్ధతిలో పత్తిని సాగు చేయవచ్చు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే, ఒకవేళ ఏ కారణంగానైనా ఒక పంట దెబ్బతింటే, మరో పంట రైతును ఆదుకుంటుంది.ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్‌ను 99896 23829 నంబరులో సంప్రదించవచ్చు. ఎత్తు మడులపై పత్తి పంటను విత్తుకునే మెళకువలను తెలిపే వీడియో ‘కేవీకే ఆదిలాబాద్’ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి చూడొచ్చు. – డా. ప్రవీణ్ కుమార్ -
Sagubadi: కాల్చొద్దు.. కలియదున్నండి!
వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక వాటి అవశేషాలు(వ్యర్థాలు) కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయ కర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నదాతలకు సూచిస్తున్నారు. దేశంలో ఏటా 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు (వరి, పత్తి, మొక్కజొన్న అవశేషాలు) మిగులుతోంది.ఇందులో 20 నుంచి 30% రైతులు వాటికి నిప్పు పెట్టి బూడిద చేస్తున్నారు. అలా చేయడం వల్ల పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలిపారు. ప్రధానంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికంగా కాల్చడం వల్ల ఢిల్లీ వంటి పక్క రాష్ట్రాల్లో విపరీతమైన గాలి కాలుష్యం అవడం జరుగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చి వే యడమని, తెలంగాణలో సగటున 30 నుంచి 40% వరి, 90 నుంచి 95% పత్తి అవశేషాలకు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేయడం జరుగుతుందన్నారు.అవశేషాలను కాల్చడానికి ప్రధాన కారణాలు..మొదటి, రెండో పంట మధ్య తక్కువ వ్యవధి.అవశేషాలు కుళ్లడానికి అధిక సమయం.కాల్చడం వల్ల కలిగే సమస్యలు..పర్యావరణ కాలుష్య కారకాలైన సీఓ, సీఓ–2, ఎన్–2ఓ, ఎస్ఓ–2 విడుదలవ్వడం.గాలి నాణ్యత తగ్గడం, భూసారం క్షీణించడం, నత్రజని కర్బన స్థాయి తగ్గడం ఉపయోగకర సూక్ష్మజీవులు కీటకాలు చనిపోవడం.5.5 కిలోల నత్రజనితోపాటు 2.3 కిలోల భాస్వరం 25 కిలోల పొటాషియం 1.2 కిలోల సల్ఫర్ నష్టం వాటిల్లుతుంది.పంట అవశేషాల ఉపయోగాలు..పశువులకు మేతగా ఉపయోగించడం, వంట చెరుకుగా వాడుకోవడం.సేంద్రియ వ్యవసాయంలో కంపోస్టింగ్, పుట్టగొడుగుల సాగు కోసం ఉపయోగించవచ్చు.అవశేషాల నుంచి బయోఇథనాల్ ప్యాకింగ్ మెటీరియల్ కోసం ఉపయోగపడటం.నేలలో కలియదున్నడం ద్వారా కర్బన స్థాయి పెరగడం, గాలిప్రసారం, భూభౌతిక లక్షణాలు పెరుగుతాయి.నేల మీద మల్చ్‌గా ఉపయోగించవచ్చు.నేలలో కలియదున్నితే..నత్రజని 1.2 నుంచి 2 కిలోల వరకు, భాస్వరం 1 నుంచి 1.6 కిలోల వరకు, 12 నుంచి 13.6 కిలోల వరకు నేలకు అందజేయవచ్చు.బయోచార్ తయారు చేసుకోవడం..పంట అవశేషాలను ట్రాక్టర్ బెల్లర్ సహాయంతో వరిగడ్డిని చుట్టలుగా చుట్టుకోవచ్చు.గడ్డి త్వరగా కుళ్లడానికి వ్యర్థ డికంపోజర్ లేదా పూసా డికంపోజర్, పీజేటీఎస్ఏయూ కన్సార్టియం ద్వారా త్వరగా కుళ్లబెట్టవచ్చు. -
బోరు చుట్టూ.. ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?
చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఎంతో కొంతైనా భాగం చేసుకోవాలని భారతీయ వైద్యపరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలలో భారతీయులకు స్పష్టమైన సూచన చేసింది. గత ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల దినోతవ్సం జరుపుకున్న నేపథ్యంలో ఇప్పటికే చిరుధాన్యాలను అన్నంగానో, అంబలిగానో స్నాక్స్‌గానో తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగుపై రైతులు మక్కువ చూపుతున్న ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విత్తనాల సమాచారం పొందుపరుస్తున్నాం..హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో...జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద విత్తనాలు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. రకాన్ని బట్టి కిలో విత్తనాల ధర రూ. 100 నుంచి 200 వరకు ఉంటుంది. రైతులు స్వయంగా వెళ్లి ఐఐఎంఆర్ కార్యాలయంలో కొనుక్కోవాలి. వివరాలకు.. 040–24599305 నంబరులో సంప్రదించవచ్చు.పాలెంలో...నాగర్‌కర్నూల్ జిల్లాపాలెంలోని ్ర΄ాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అనేక ఇతర పంటల విత్తనాలతోపాటు చిరుధాన్యాల విత్తనాలు కూడా రైతులకు విక్రయిస్తున్నారు.పాలెం పచ్చజొన్న–1 (3 కేజీలు–రూ.450), తెలంగాణ తెల్ల జొన్న (3 కేజీలు–రూ.270), రాగి (3కేజీలు– రూ.150), సజ్జ (2 కేజీలు–రూ.200), కొర్ర (2 కేజీలు–రూ.130) విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు మురళిని 94904 09163 నంబరులో సంప్రదించవచ్చు.ఆంధ్రప్రదేశ్‌లో...నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జొన్న, రాగి విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ నర్సింహులును 79810 85507 నంబరులో సంప్రదించవచ్చు. అనంతపురంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సజ్జ విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ మాధవీలతను 79819 29538 నంబరులో సంప్రదించవచ్చు. పెరుమాళ్లపల్లె వ్యవసాయ పరిశోధనా స్థానంలో రాగి విత్తనాలు ఉన్నాయి. ఎం. శ్రీవల్లిని 93987 95089 నంబరులో సంప్రదించవచ్చు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రాగి విత్తనాలు ఉన్నాయి. డా. ఎన్. అనూరాధను 85002 04565 నంబరులో సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్‌కు ఇతరత్రా పంట విత్తనాతోపాటు 721 క్వింటాళ్ల రాగి, 146 క్వింటాళ్ల కొర్ర, 6 క్వింటాళ్ల సామ, ఒక క్వింటా ఊద విత్తనాలను 26 జిల్లాల్లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.బోరు చుట్టూ ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వాననీటి సంరక్షణకు ఉపక్రమిద్దాం. పొలాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్మెంట్లు / ఇళ్ల దగ్గర ఉన్న బోర్ల చుట్టూతా ఇంకుడు గుంతలు తీయించుకుందాం.బోరు రీచార్జ్ గుంతను నిర్మించుకుంటే.. వర్షపు నీటిలో 40–50% వరకు భూమి లోపలికి ఇంకింపజేసుకోవచ్చని భూగర్భ జల నిపుణులు, సికింద్రాబాద్‌లోని వాటర్ అండ్ లైవ్వీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. రామమోహన్ (94401 94866) సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం, సంబంధిత వీడియో కోసం ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయండి.ఇవి చదవండి: Sagubadi: ఈ అతిపొడవైన సజ్జ పేరు.. 'సుల్కానియా బజ్రా'! -
Sagubadi: ఈ అతిపొడవైన సజ్జ పేరు.. 'సుల్కానియా బజ్రా'!
సజ్జ కంకి పొడవు మహా అయితే మూర పొడవుంటుందని మనకు తెలుసు. అయితే, రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు దగ్గర ఏకంగా కంకి బారెడు పొడవు పెరిగే సజ్జ రకం ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ అపురూపమైన పురాతన సజ్జ వంగడాన్ని ఆ రైతు కుటుంబం గత 300 ఏళ్లుగా సాగు చేస్తూ, పరిరక్షిస్తూ ఉంటటం మరో విశేషం. కరువును దీటుగా తట్టుకొని వర్షాధారంగా హెక్టారుకు 20–25 క్వింటాళ్ల దిగుబడిని ఇవ్వగలిగిన గొప్ప వారసత్వ సంపదైన ఈ వంగడం పేరు ‘సుల్కానియా బజ్రా’. రాజస్థాన్‌లోని చురు జిల్లా సుల్కానియా గ్రామానికి చెందిన హనుమాన్రామ్ ఝురియా అనే 69 ఏళ్ల రైతు 45 ఏళ్లుగా దీన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.ప్రతి ఏటా సాగు చేస్తూ రైతులకు విత్తనాలు అందుస్తున్నారు. సంప్రదాయ విత్తనాన్ని సంరక్షిస్తున్న ఈ రైతు కృషిని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వ సైన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు అనుబంధమైన స్వతంత్ర సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్‌కు) ఔట్‌స్టాండింగ్ ట్రెడిషినల్ నాలెడ్జ్ పురస్కారాన్ని 2017లోనే ప్రదానం చేసింది. ఈ అద్భుత వంగడానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలు..పొడవైన కంకులు, రుచికరమైన గింజలు, అధిక దిగుబడినివ్వటం, కరువు పరిస్థితులను తట్టుకోవటం, ఎక్కువ పశుగ్రాసం ఇవ్వటం ఈ సుల్కానియా సజ్జ ప్రత్యేకతలు.హనుమాన్రాం కుటుంబం తాత ముత్తాతల కాలం నుంచే ఈ సజ్జలను పండిస్తున్నారు. బికనీర్ నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక గురువు 300 సంవత్సరాల క్రితం వీరి ముత్తాతకి ఈ విత్తనం ఇచ్చారట! అప్పటి నుంచి అదే రకాన్ని వీరి కుటుంబం పండిస్తున్నది.ప్రతి సంవత్సరం పంట వచ్చిన తర్వాత బాగున్న గింజలను ఏరి, ఎండిన వేపాకులతో కలిపి నిల్వచేస్తాడు. ఈ విధంగా 5 సంవత్సరాల వరకు ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు అంటారు హనుమాన్రామ్ ఝురియా.‘సుల్కానియా’ సజ్జ తొలకరి వర్షాలకు విత్తుకునే రకం. ఇది ఇసుకతో కూడిన నేలలు, నీటి ఎద్దడి ్రపాంతాల్లో సాగుకు అనువైన రకం.కరువు వాతావరణాన్ని తట్టుకుంటుంది. విత్తిన తర్వాత కొంత కాలం వర్షం లేక΄ోయినా బాగా మొలకెత్తి ఎదగగలగటం దీని మరో ప్రత్యేకత.సజ్జతో హెక్టారుకు 20 నుంచి 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి సాధించవచ్చు. 20 నుంచి 30 అంగుళాల పొడవాటి కంకులు వుండటం ప్రత్యేకత.ప్రతి మొక్కకు అనేక పిలకలతో పాటు 6 నుంచి 10 కంకులు వస్తాయి. ప్రతి కంకిలో 90 శాతానికి పైగాబలమైన విత్తనాలే వుంటాయి. విత్తిన 90 రోజులకు పంట కోతకు వస్తుంది. అధిక మొత్తంలో గడ్డి లభిస్తుంది.వర్షాధారంగా ఈ రకంతో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చని, చీడపీడలను తట్టుకునే శక్తి కలిగి వుందని అక్కడి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, సెంటర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ శాస్త్రవేత్తలు అభి్రపాయ పడ్డారు.సుల్కానియా ప్రాంత రైతులతో పాటు, నిపుణులు ప్రశంసిస్తూ.. తాము కూడా 30 ఏళ్లుగా ఈ వంగడాన్ని సాగు చేస్తున్నామన్నారు.సికింద్రాబాద్‌లోని పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ సుల్కానియా సజ్జ రకం విత్తనాలను తెప్పించి తెలుగు రాష్ట్రాల రైతులకు అందిస్తోంది. ఇతర వివరాలకు ‘పల్లెసృజన’ ప్రతినిధి వీరరాఘవరెడ్డిని 81257 99904, 79890 38186 ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.ఇవి చదవండి: Sagubadi: అరెకరం ఉచిత విత్తనాలకై.. -
Sagubadi: అరెకరం ఉచిత విత్తనాలకై..
ఈ ఏడు ముందస్తు వానలు కురుస్తున్నాయి. ప్రకృతి శుభసూచనలు చేసింది. ప్రకృతిలో కానుగ చెట్లు ఇగురు పూత విరివిగాను, నేరేడు చెట్లు గుబురుగాను ఉన్నాయి. మే నెలలోనే తొలకరి వానలకు ప్రకృతి నాంది పలికింది. వానకు ΄÷లంలో ఉన్న కలుపు విత్తనాలు మొలుస్తాయి. ఆరుద్ర కార్తె నుంచి పంటలు సాగు చేయటానికి అనుకూలంగా ఉండాలంటే భూమిని వారం, పది రోజుల వ్యవధిలో ఒకటికి రెండుసార్లు తేలిక΄ాటి సేద్యం చేయాలి (దుక్కి దున్నాలి). ఇలా చేస్తే మట్టిలోని గడ్డి గింజలన్నీ మొలిచి ఆరుద్ర నాటికి 80 శాతం కలుపు మొక్కలు చని΄ోతాయి. ఆ తర్వాత పంట వేసుకుంటే కలుపు సమస్య పెద్దగా వేధించదు. అయితే, చాలా మంది రైతులు ఒకేసారి ఇరుసాలు సేద్యం (దుక్కి) చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మొదటి దుక్కికి భూమిపైన ఉన్న గడ్డి విత్తనాలు మట్టి కిందకు వెళ్తాయి. వానలు పడిన వెంటనే కలుపు మొలుస్తుంది. అయినా, ఇంకా కలుపు విత్తనాలు కొన్ని మట్టిలో మిగిలే ఉంటాయి. మొదటి దుక్కి నుంచి రెండోసారి దుక్కి చేయటానికి కనీసం ఒక వారం, పది రోజుల సమయం ఇవ్వాలి. లేక΄ోతే మన పంటకు కలుపు ఎక్కువ వస్తుంది. పంట దిగుబడి తగ్గుతుంది.ఈ విధంగా కలుపు నివారణ కోసం రెండు సార్లు సేద్యం (రెండు దుక్కులు) చేయక΄ోతే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రైతులు కొర్ర చేనులో కూడా కలుపు మందులు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల దిగుబడి బాగా తగ్గుతుందని గుర్తించండి. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు వారం, పది రోజుల వ్యవధిలో రెండు సార్లు తేలిక ΄ాటి సేద్యం (దుక్కి) చేసి కలుపు నిర్మూలన చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.అరెకరానికి ఉచితంగా విత్తనాలు..కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, సామల సాగును పెంపొందించే లక్ష్యంతో కొత్తగా సిరిధాన్యాలు సాగు చేయదలచిన కొందరు రైతులకు అరెకరానికి సరి΄ోయే (5 రకాలు ఒక్కో రకం అర కేజీ చొప్పున) 2.5 కిలోల విత్తనాలను ఉచితంగా ఇస్తాను. ట్రాన్స్΄ోర్ట్ ఖర్చులు వారే భరించాలి (గమనిక: సిరిధాన్యాల సేంద్రియ సాగుపై సందేహాల నివృత్తి కోసం, విత్తనాల కోసం ఏపీ వారు ఉ. 5–30 గం. నుంచి సా. 7.30 గం. వరకు.. తెలంగాణ వారు సా. 7 గం. నుంచి రాత్రి 8.30 వరకు ఫోన్ చేయొచ్చు). విజయకుమార్: 98496 484985 రకాలను అంతటా పండించాలి..చిరుధాన్యాల సాగు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని జిల్లాల్లో పెరుగుదల బాగానే ఉంటుందనిపిస్తోంది. ఈ మధ్యన చిరుధాన్యాల ధర విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు.. బరిగె ధాన్యం టన్నుకు రూ. 65 వేలు పలుకుతోంది. బరిగె బియ్యం కిలో రూ. 90–100 పలుకుతోంది. కోస్తా ఆంధ్ర జిల్లాలో పెద్ద సామ విరివిగా సాగు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కొర్ర పంట మాత్రమే సాగు చేస్తున్నారు.కర్ణాటక జిల్లాల్లో అరిక కొంత మేర సామ, ఊద సాగు చేస్తున్నారు. కొన్ని ్ర΄ాంతాల్లో మాత్రమే అండుకొర్రలు సాగవుతున్నాయి. ఐదు రకాల సిరిధాన్యాల బియ్యం కావాలంటే అన్నీ ఒక చోటకు చేర్చాలంటే రవాణా ఖర్చు ఎక్కువ అవుతున్నది. ఈ రోజు మార్కెట్లో చిరుధాన్యాల బియ్యం ధరలు పేదలు తినేటట్టు లేవు. అందుకే కొర్ర, అరిక, సామ, ఊద, అండుకొర్ర ఈ ఐదు రకాల సిరిధాన్యాలను అన్ని ్ర΄ాంతాల్లోనూ సాగులోకి తేవాలి.ఆరుద్రలో అరిక విత్తాలి..పెద్ద రైతులు ఒకసారి ఆలోచన చేయండి. చిరుధాన్యాలు సాగు చేస్తే రసాయన ఎరువులు, పురుగుమందుల ఖర్చులు తగ్గి భూసారం పెరుగుతుంది. అరిక పంట ఆరుద్ర కార్తెలో మిశ్రమ పంటగా సాగు చేసుకుంటే బాగుంటుంది. 6 సాళ్లు అరిక ఒక సాలు కంది.. 6 సాళ్లు అరిక, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఇందులో అలసందలు, అనుములు, నల్లపెసలు, గోగులు, సీతమ్మ జొన్న సాగు చేస్తే చాలా బాగుంటుంది.ఊద పంట 110–120 రోజులు, అండుకొర్ర పంట 105–115 రోజులు, సామ పంట 110 రోజులు, కొర్ర పంట 75–80 రోజుల వరకు ఉంటుంది. వానలు బాగా పడుతున్నందు వలన అన్ని రకాలు సాగు చేయవచ్చు. నీటి ఆధారం కింద రెండు లేదా మూడు పంటలు సాగు చేయవచ్చు. చిరుధాన్యాల సాగులో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి రావాలంటే.. రసాయనిక ఎరువులు వేయటం మానివేసి.. పశువుల ఎరువు, చెరువు మట్టి వేయటంతో ΄ాటు గొర్రెలను మళ్లించటం (మంద కట్టటం), అలాగే ఏగిలి మార్చటం (పంట మార్పిడి) వంటి పనులు చేయాలి. – కొమ్మూరి విజయకుమార్, సృష్టి సమ్మాన్ పురస్కార గ్రహీత, వేంపల్లె మం, టి.వెలమవారిపల్లె, వైఎస్సార్ కడప జిల్లా. -
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్యాకెట్లపై ఆకర్షణీయమైన ఫొటోలు, తక్కువ ధరలు ఆఫర్లు చూసి మోసపోవద్దు. నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. విత్తనాల బెడద రైతులకు సవాల్‌గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లోకి వస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలు కొనాలని చేయాలని వ్యసాయాధికారులు సూచిస్తున్నారు.తక్కువ ధరలు, ఆఫర్లు నమ్మొద్దు.. వర్షాలు పడితే చాలు రైతుల హడావుడి మొదలవుతుంది. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాల కోసం రైతులు విత్తన డీలర్ల దుకాణాల వద్ద బారులు తీరుతారు. పలు విత్తన కంపెనీలు డీలర్లకు ఆఫర్లు ప్రకటిస్తాయి. ఆ ఆఫర్ల కోసం డీలర్లు రైతులకు విత్తనాలను అంటగడుతున్నారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దు. చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండవచ్చు. ఫొటోలు చూపించి, ఆఫర్ల ఆశ చూపి వివిధ పట్టణాలకు కంపెనీ వారు రైతులను తీసుకుపోవడం, గ్రామాల్లో తిరుగుతూ విత్తన ప్యాకెట్లు బుక్ చేసుకోవడం చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం మంచిదని వ్యవసా«యాధికారులు పేర్కొంటున్నారు.రైతులు తీసుకోవాలి్సన జాగ్రత్తలు..1. గుర్తింపు పొందిన దుకాణం నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేస్తేనే అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.2. విత్తనాలు కొన్న అనంతరం దుకాణం నుంచి తప్పనిసరిగా రశీదు తీసు కోవాలి.3. విత్తనాలు ఏ సంస్థకు చెందినవో ప్యాకెట్‌పై ఉన్న లేబుల్, లాట్ నంబర్ రశీదుపై నమోదు చేసుకొని, భద్రపర్చుకోవాలి.4. తొలుత విత్తనాలు మొలకెత్తే శాతాన్ని ప్యాకెట్‌పై చూసి కొనాలి.విత్తనాలపై అవగాహన ఉండాలి..విత్తనాలపై రైతులు అవగాహన ఉండాలి. కొన్న ప్యాకెట్లలో ఉన్న విత్తనాలు ఎంత శాతం మొలకెత్తుతాయో చూసుకోవాలి. రసీదులు, ప్యాకెట్లను భద్రపర్చుకోవాలి. అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు కొనాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో నాసిరకమా? అనేది చూసుకోవాలి.– వెండి విశ్వామిత్ర, వ్యవసాయాధికారి, బోథ్ -
స్పీడ్ బ్రీడింగ్ పద్ధతుల్లో.. అర్బన్ అన్నదాత!
విస్తారమైన పొలాల్లో ఆరుబటయ సాగేది సంప్రదాయ వ్యవసాయం అయితే.. నియంత్రిత వాతావరణంలో అత్యాధునిక సాంకేతికతలతో చేసేదే అర్బన్ వ్యవసాయం. మట్టిలో కాకుండాపోషకాలతో కూడిన నీటిలో వర్టికల్ స్ట్రక్చర్లలో లేదా కొబ్బరి పొట్టుతో కూడిన గ్రోబాగ్స్‌లో అర్బన్ సాగు జరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక సాగు వ్యవస్థలతోపాటు ప్రత్యేకంగా బ్రీడింగ్ చేసిన వంగడాలు కూడా అవసరమే అంటోంది ‘అర్బన్ కిసాన్’. మానవాళి రేపటి ఆహారపు, పర్యావరణ అవసరాలు తీర్చటం కోసం స్పీడ్ బ్రీడింగ్ తదితర పద్ధతుల్లో పరిశోధనలు చేపట్టి చక్కని పురోగతి సాధిస్తోంది. ఈ హైదరాబాద్ సంస్థ విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సహా పలు సంస్థల భాగస్వామ్యంతో అర్బన్ సాగు ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. పట్టణీకరణ తామరతంపరగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాధునిక సాంకేతికతలతో కూడిన అర్బన్ ఫార్మింగ్ పద్ధతులు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కోవలోనివే హైడ్రోపోనిక్స్, సాయిల్ లెస్ ఫార్మింగ్, వర్టికల్ ఫార్మింగ్, ఇండోర్ ఫార్మింగ్ వంటివి. ఈ సాగు వ్యవస్థలను ముఖ్యంగా అర్బన్ రైతులకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో హైదరాబాద్ సమీపంలో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది ‘అర్బన్ కిసాన్’. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పనిచేస్తూ అర్బన్ కిసాన్ అభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ పండించిన లెట్యూస్, ఇటాలియన్ బసిల్ తదితర ఆకుకూరలు, రంగురంగుల కాప్సికం తదితర కూరగాయలతో తయారైన సలాడ్స్‌ను ఫార్మ్బౌల్ పేరుతో హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తోంది.అర్బన్ సాగు కోసం ప్రత్యేక వంగడాలు..హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లిపారిశ్రామికవాడలో అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. విహారి కానుకొల్లు, డాక్టర్ సాయిరాం రెడ్డిపాలిచర్ల కొందరు మిత్రులతోపాటు అర్బన్ కిసాన్ సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. విహారి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, డా. సాయిరాం రెడ్డి, డా. నర్సిరెడ్డి ఆధ్వర్యంలో పరిశోధనలు సాగుతున్నాయి. హైడ్రోపోనిక్స్, వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థలను శీతల గదిలో,పాలీహౌస్లో, మేడపైన.. ఇలా అనేక వాతావరణ పరిస్థితుల్లో మట్టి లేకుండా వివిధ పంటలు పండించటంపై వారు లోతైన పరిశోధనలు చేస్తున్నారు.హైదరాబాద్ నగర శివారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి పారిశ్రామికవాడలోని అర్బన్ కిసాన్ పరిశోధన కేంద్రంలో హైడ్రోపోనిక్స్ సాగు దృశ్యాలుపొలాల్లో వాడే సాధారణ వంగడాలను నియంత్రిత వాతావరణంలో, పరిమిత స్థలంలో సాగు చేయటం అనేక ఇబ్బందులతో కూడిన పని. అందుకే అర్బన్ సాగుకు అవసరమైన ప్రత్యేక వంగడాల రూపుకల్పన కృషికి అర్బన్ కిసాన్ శ్రీకారం చుట్టింది. మన దేశపు 150 రకాల కూరగాయలు, ఆకుకూరలపై ప్రయోగాలు చేశారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో పండటంతోపాటు.. వేర్ల పొడవు, మొక్క సైజు, ఆకారం తదితర అంశాల్లో అర్బన్ ఫార్మింగ్‌కు అనువుగా చిన్న సైజులో ఉండేలా అనేక సరికొత్త వంగడాలను రూపొందించామని డా. సాయిరాం రెడ్డి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. ఇవి తిరిగివాడుకోదగిన సూటి రకాలేనని, వీటిని నియంత్రిత వాతావరణంలో ఏ దేశంలోనైనా పండించవచ్చన్నారు.చెప్పినంత దిగుబడి..!హైడ్రోపోనిక్స్ సాగు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. అయితే, ఎవరి దగ్గరా కంప్లీట్ టెక్నాలజీ లేదు. మా దగ్గర తప్ప. మేం వాడుతున్నది స్వయంగా మేం దేశీయంగా పరిశోధనల ద్వారా రూపొందించుకున్న పరిపూర్ణమైన, సమగ్ర సాంకేతికత ఇది. అందుబాటులో ఉన్న టెక్నాలజీలతోపోల్చితే 60% ఖర్చుతోనే మా టెక్నాలజీని అర్బన్ ఫార్మర్స్ పొందవచ్చు. దీని ద్వారా చెప్పినంత దిగుబడి కచ్చితంగా ఇస్తుంది. ప్రపంచంలో ఎవరైనా టెక్నాలజీ అమ్ముతారు లేదా ్రపొడక్టు అమ్ముతారు. మేం అలాకాదు. ఇతర సంస్థలతో కలిసి భాగస్వామ్యంలో యూనిట్లు నెలకొల్పి ఉత్పత్తి చేసి విక్రయించి లాభాలు పంచుకుంటాం. ఈ పద్ధతిలోనే అనేక దేశాల్లో యూనిట్లు ఏర్పాటు చేశాం. పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే హైడ్రోపోనిక్ కూరగాయలు, ఆకుకూరలను ప్రీమియం ప్రైస్‌తో అమ్మగలగాలి. మానవాళి భవిష్యత్తు ఆహారపు అవసరాలు తీర్చగలిగిన శక్తిసామర్థ్యాలున్న టెక్నాలజీ ఇది.– డాక్టర్ సాయిరాం రెడ్డి, పాలిచర్ల, అర్బన్ కిసాన్ పరిశోధనా కేంద్రం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా sai@urbankisaan.com2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలు..బెండ, టొమాటో, పచ్చిమిర్చి వంగ తదితర కూరగాయల్లో ఒక్కో రకానికి సంబంధించి 2–3 రకాల వంగడాలను రూపొందించారు. ఫంగస్ సోకని బేసిల్ (ఇటాలియన్ తులసి)ను రూపొందించారు. ఎరుపు, ఆకుపచ్చ, కాండం తెల్లగా ఆకు గ్రీన్‌గా ఉండే రకరకాల తోటకూర రకాలను రూపొందించారు.పాలకూర, కొత్తిమీర, గోంగూరలో కూడా కొత్త వంగడాలను రూపొందించారు. కీరదోస, సొర, కాకర వంటి తీగజాతులు పొలినేషన్ అవసరం లేకుండా దిగుబడినిచ్చే విధంగా రూపొందిస్తున్నాం అన్నారు డా. సాయిరాం. సాధారణంగా ఒక కొత్త వంగడాన్ని బ్రీడింగ్ చేయాలంటే 6–7 ఏళ్లు పడుతుంది. స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో తాము 2.5 ఏళ్లలోనే కొత్త వంగడాలను రూపొందించగలిగామన్నారు.95 శాతం నీటి ఆదా..!వేగవంతమైన నగరీకరణ నేపథ్యంలో నగరాల్లో ఏడాది పొడవునా అర్బన్ప్రాంతీయులకు తాజా ఆకుకూరలు, కూరగాయలు అందించడానికి ద్రవరూప ఎరువులతో చేసే వర్టికల్ ఫార్మింగ్ ఉపయోగపడుతోంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలు పండించటం వల్ల కలిగే ప్రయోజనాలను భారత్‌తోపాటు ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. సాధారణ వ్యవసాయంలో వాడే నీటితోపోల్చితే ఈ పద్ధతిలో 95% ఆదా అవుతుంది. పొలంలో పంటతోపోల్చితే నిర్దిష్టమైన స్థలంలో 30 రెట్లు అధిక దిగుబడి సాధించడానికి హైడ్రోపోనిక్స్ ఉపయోగపడుతుందని, అందులోనూ ఈ సాంకేతికతను దేశీయంగానే అభివృద్ధి చేశామని అర్బన్ కిసాన్ చెబుతోంది. సాగులో ఉన్న పంటల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగాపోషకాల మోతాదు, పిహెచ్ స్థాయిలు, వాతావరణంలో తేమ, కార్బన్డయాక్సయిడ్ స్థాయి, కాంతి తీవ్రత వంటి అనేక ఇతర అంశాలన్నిటినీ ఒక యాప్ ద్వారా నియంత్రిస్తుండటం విశేషం. వర్టికల్ ఫార్మింగ్ వ్యవస్థల్లో కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగిస్తూ ఫార్మింగ్ ఆటోమేషన్‌లో అర్బన్ కిసాన్ తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోపోనిక్స్ సాగు జరుగుతున్నా ఇందులో అన్ని దశలకు సంబంధించిన సంపూర్ణ సాంకేతికత ఒకే చోట అందుబాటులో లేదు. అర్బన్ కిసాన్ పూర్తిగా సొంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవటం విశేషం.మధ్యప్రాచ్య దేశాల్లో ఆదరణ..అర్బన్ కిసాన్ ఇండోర్ హైడ్రోపోనిక్స్ యూనిట్లలో పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, సెన్సార్ల ఆధారంగానే ఫామ్ యాజమాన్యం ఉంటుంది. దుబాయ్, ఒమన్, ఖతార్ దేశాల్లో మూడేళ్ల క్రితం 50% భాగస్వామ్యంతో హైడ్రోపోనిక్స్ యూనిట్‌ను నెలకొల్పాం. అదే మాదిరిగా బహామాస్ దేశంలోనూ 50% భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన యూనిట్‌ను కూడా తాము ఇక్కడి నుంచే పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నామని డా. సాయిరాం రెడ్డి వివరించారు. అక్కడ ఆకుకూరల ధర కిలో 12 డాలర్లు. మా యూనిట్లలో కిలో 5 డాలర్లకే ఆకుకూరలను ఉత్పత్తి చేస్తున్నాం. అమెరికా, కెనడా, నార్వే దేశాల్లో కూడా జాయింగ్ వెంచర్లు ఏర్పాటు చేయబోతున్నాం.మన దేశంలో హైడ్రోపోనిక్స్ యూనిట్లకు పారిశ్రామిక విద్యుత్తు చార్జీలు వర్తిస్తుండటం ఈ హైటెక్ సాగు విస్తరణకు ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికైతే ఇది కాస్త ఖరీదైన ప్రత్యామ్నాయ ఆహారోత్పత్తి పద్ధతే. కానీ,పోషక విలువలున్న, పురుగుమందుల్లేని ఆహారాన్ని అందించే ఈ పద్ధతి ఏదో ఒక రోజున మెయిన్ స్ట్రీమ్‌లోకి వస్తుందని అర్బన్ కిసాన్ ఆశాభావంతో ముందడుగు వేస్తోంది. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి చదవండి: కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..! -
కలబంద రసంతో.. ఉపయోగాలెన్నో..!
కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. అమైనా ఆమ్లాలు, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటివి 75 రకాలపోషకాలుంటాయి.. ఇది మొక్కలను క్రిములు, వైరస్లు, శిలీంధ్రాల నుంచి కాపాడుతుంది. కలబంద ఆకు ముక్కలను మిక్సీలో వేస్తే రసం వస్తుంది. స్పూనుతో ఈ కింద చెప్పిన కొలతలో ఇంటిపంటలు / మిద్దెతోటల సాగులో వాడుకోవచ్చు..1. ఒక టీస్పూను కలబంద రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొలక దశలో లేదా చిన్న మొక్కలు స్ప్రే చేయవచ్చు. వారానికి ఒక సారి చేస్తే సరి΄ోతుంది.2. ఒక టేబుల్ స్పూన్ రసాన్ని ఒక లీటరు నీటితో కలిపి మొక్క ఉన్న కుండీలోపోయాలి. ఇలా నెలకు ఒకసారి చేయాలి. దీనివలన మొక్కకు ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది.3. మొక్కను ఒక కుండీ నుంచి వేరే కుండీలోకి మార్చినప్పుడు లీటరు నీటికి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని కలిపి కుండీలోపోయాలి. ఇలా చేస్తే మొక్క మార్పిడి వత్తిడికి గురికాదు.4. ఎరువుగా వాడాలి అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని లీటరు నీటితో కలిపి మొక్క కుండీలోపోయాలి. ఇలా 15 రోజులకు ఒకసారి వాడాలి.5. స్ప్రే చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వాడాలి లీటరు నీటికి. ఆకుల అడుగు భాగంలో మాత్రమే స్ప్రే చేయాలి. దీనివలన మొక్క తొందరగాపోషకాలను గ్రహిస్తుంది.6. రూటింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఏదైనా మొక్క కొమ్మను విరిచి నాటుకోవాలంటే, నేరుగా కలబంద రసంలో అరగంట కొమ్మ చివరను నానబెట్టి, ఆ తరువాత నాటవచ్చు.7. ఇది బూడిద తెగులును అరికడుతుంది. గమనిక: కలబంద రసం తయారు చేసిన అర గంట లోపే వాడాలి. పులిస్తే అందులో ఉన్నపోషకాలు కొన్నిపోతాయి.– విజయలక్ష్మి, బెంగళూరు మిద్దెతోట బృందంఇవి చదవండి: ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే! -
ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్‌ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్‌లింక్ ఫెన్స్‌కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! -
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
ఈ వేసవిలో ఎల్‌నినో పుణ్యాన సాధారణం కన్నా ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ ఉద్యాన తోటలు సాగు చేసే రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా సీజనల్ పండ్ల తోటలైన మామిడి, జామతో పాటు కూరగాయలు, డ్రాగన్ వంటి తోటలకు నిప్పుల కుంపటి వంటి వేడి ఒత్తిడి తీవ్ర సమస్యగా మారింది.47 డిగ్రీలకు చేరిన పగటి గరిష్ట ఉష్ణోగ్రత వల్ల భూమి విపరీతంగా వేడెక్కి రాత్రి 7–8 గంటల వరకు శగలు కక్కుతూ ఉంది. దీన్నే ‘రిఫ్లెక్టెడ్ రేడియేషన్’ అంటారు. పొలాల్లో కన్నా కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చెట్లు, మొక్కలు వేర్ల ద్వారా తీసుకునే నీటి కన్నా ఎక్కువగా నీరు ఆవిరైపోతుండటం వల్ల లేత ఆకుల చివర్లు ఎండిపోతున్నాయి. లేత కణాలు ఉంటాయి కాబట్టి లేత ఆకుల చివరలు మాడిపోతున్నాయి.పగటి గరిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెల్షియస్ వరకు ఉన్న వాతావరణం పంటల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. 40 డిగ్రీలు దాటిన తర్వాత పంటలు, తోటలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పుడు 47–48 డిగ్రీల సెల్షియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో కూరగాయ పంటలు, పండ్ల తోటలు సన్ బర్న్‌తో సతమతమవుతూ ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం మాజీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ పీవీ రావు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణంగా ఎండను రక్షణకు కొన్ని పంటలపై 50% సూర్యరశ్మిని ఆపే గ్రీన్ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. అయితే, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవటం వల్ల 80% ఎండను ఆపే గ్రీన్ షేడ్నెట్లు వేసుకోవాల్సి వస్తోందని డా.పివి రావు అన్నారు.సన్‌బర్న్‌కు గురైన మామిడి కాయసూర్యకాంతి తీవ్రత..పంటలపై ప్రతికూల ప్రభావం ఎంతగా ఉందన్నది ఉష్ణోగ్రతతో పాటు సూర్యకాంతి తీవ్రత (లైట్ ఇంటెన్సిటీ)పై కూడా ఆధారపడి ఉంటుందని డా. రావు వివరించారు. సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్న రోజుల్లో చదరపు మీటరుకు 20,000 – 25,000 కిలో లక్స్ వరకు సూర్యకాంతి ఉంటుంది. వేసవిలో సాధారణంగా ఇది 80,000 కిలో లక్స్‌కు పెరుగుతూ ఉంటుంది. అయితే, ఈ ఏడాది ఇది విపరీతంగా పెరిగి, ఏకంగా 1,20,000 కిలో లక్స్‌కు చేరటం పండ్ల తోటలకు, కూరగాయల పంటలకు ముప్పుగా మారిందని డాక్టర్ పి వి రావు తెలిపారు.ఫొటో ఆక్సిడేషన్ వల్ల ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ సజావుగా జరగటం లేదు. లేత ఆకుల్లో క్లోరోఫిల్ మాలిక్యూల్ చిట్లి పోవటం వల్ల ఆకుపచ్చగా ఉండాల్సిన ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగుకు మారి ఎండిపోతున్నాయన్నారు.తారస్థాయికి చేరిన యువి రేడియేషన్..అతినీలలోహిత కిరణాల (యువి) రేడియేషన్ సూచిక సాధారణంగా 3–4 వరకు ఉంటుంది. వేసవిలో ఈ సూచిక 8–9 వరకు పెరుగుతుంది. అయితే, ఈ ఏడాది మాత్రం ఇది 12కు పెరగటంతో సూర్యరశ్మిని పంటలు, తోటలు తట్టుకోలేకుండా ఉన్నాయని డా. పి వి రావు వివరించారు. మామిడి, జామ తదితర కాయలు ఎండ పడిన చోట ఎర్రగా మారి దెబ్బతింటున్నాయి. వెనుక వైపు పచ్చిగానే ఉంటూ ఎండ సోకిన దగ్గర రంగు మారుతుండటంతో పండ్లు నాణ్యతను కోల్పోతున్నాయి. అల్ఫాన్సో, పచ్చడి రకాల మామిడి కాయలు బాగా రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.సన్‌బర్న్‌కు గురైన జామ కాయ, - సన్‌బర్న్‌కు గురైన డ్రాగన్ పంట పోషకాలు, హార్మోన్ అసమతుల్యత..వేసవిలో టొమాటో, మిర్చి వంటి కూరగాయ పంటల మొక్కలు నాటుకునేటప్పుడు వీటికి ఉత్తర, దక్షిణ వైపున నీడనిచ్చే మొక్కలను వేసుకుంటే ఎండ బారి నుంచి కొంత మేరకు కాపాడుకోవచ్చు. ఉదాహరణకు.. టొమాటో మొక్కలు ఉత్తర దక్షిణాల్లో మొక్కజొన్న లేదా ఆముదం మొక్కలు వత్తుకోవాలి. వడగాలుల నుంచి పంటలను రక్షించుకోవటానికి పొలం సరిహద్దుల్లో విండ్ బ్రేకర్‌గా పనికొచ్చే ఎత్తయిన చెట్లు పెంచుకోవాలి. ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న వారి తోటలు ఉపశమనం పొందుతాయి.దాదాపు మరో నెల రోజులు మండే ఎండలు కొనసాగే పరిస్థితి ఉండటంతో తోటలకు చాలినంతగా నీటి తడులు ఇవ్వటంతో పాటు, చెట్లపైన కూడా సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయాలి. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ నేల నుంచి వేర్ల ద్వారా పోషకాలను తీసుకునే సామర్ద్యం తగ్గుతుందని, అందుకు తగినట్లు నీరు, పోషకాలు సైతం అందిస్తే తోటలకు ఉపశమనం కలుగుతుందని డాక్టర్ పివి రావు సూచిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కాలంలో పంటలు పోషకాలను నేల నుంచి తీసుకోవటంలో ఇబ్బంది వస్తుంది. జింక్ లోపం ఏర్పడుతుంది. హోర్మోన్లను కూడా చెట్లు, మొక్కలు తయారు చేసుకోలేవు. హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది.ఎండ తీవ్రతకు రెస్పిరేషన్ రేటు ఎక్కువ అవటం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారయ్యే పిండి పదార్థం మొక్క/చెట్టు నిర్వహణకే సరిపోతాయి. పెరుగుదల లోపిస్తుంది. అదనపు పిండిపదార్థం అందుబాటులో వుండక పూలకు, కాయలకు పోషకాలను అందించలేని సంక్షోభ స్థితి నెలకొంటుంది. అందువల్ల పూలు, కాయలు రాలిపోయే పరిస్థితి ఎదురవుతుంది. అతి వేడి వత్తిడి ఎదుర్కొంటున్న మామిడి తోటలపై జింక్, ΄్లానోఫిక్స్, బోరాన్‌లను సాయంత్రం 3 గంటల తర్వాత పిచికారీ చేయాలి. టొమాటో, మిరప, వంగ తదితర కూరగాయ మొక్కలపైన నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్‌ను 5 లీటర్ల నీటికి 1.5 నుంచి 2 ఎం.ఎల్. మోతాదులో కలిపి పిచికారీ చేయాలని డా. రావు తెలిపారు.అల్ఫాన్సో, పచ్చడి కాయలు 80% రాలిపోతున్నాయి..ఈ ఏడాది ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అల్ఫాన్సో, దేశీ పచ్చడి రకాల చిన్న కాయలు రాలిపోతున్నాయి. ఆర్గానిక్ మామిడి తోటల్లో గతంలో 10–20% రాలే కాయలు ఈ సీజన్లో 70–80% రాలిపోతున్నాయి. ఇతర రకాల్లో కూడా జనవరిలో వచ్చిన ఆఖరి పూత ద్వారా వచ్చిన చిన్న కాయలు ఎక్కువగా ఎండదెబ్బకు రాలిపోతున్నాయి. ఎండలు ముదిరే నాటికి నిమ్మకాయ సైజు ఉన్న కాయలకు ్రపోబ్లం లేదు.సన్‌బర్న్ సమస్య వల్ల కాయలు ఒకవైపు అకాలంగా రంగుమారిపోతుంటే, వెనుక వైపు మాత్రం పచ్చిగానే ఉంటున్నాయి. బంగనిపల్లి పూత రాలిపోవటంతో ఈ ఏడాది 20% కూడా కాయ మిగల్లేదు. దశేరి కాపు మాత్రం అన్నిచోట్లా బాగుంది. మామిడి చెట్లకు రోజూ నీరు స్ప్రే చేస్తున్నాం. చెట్ల కింద మల్చింగ్ చేసి నీటి తేమ ఆరిపోకుండా కాపాడుకుంటున్నాం. ఇదిలాఉంటే, మధ్య్రపాచ్య దేశాల్లో యుద్ధం వల్ల నౌకల్లో వెళ్లే సరుకు విమానాల ద్వారా ఎగుమతి అవుతోంది. దీనికితోడు, దుబాయ్‌లో భారీ వరదల వల్ల అమెరికా తదితర దేశాలకు మామిడి పండ్ల ఎగుమతి ఈ ఏడాది బాగా దెబ్బతింది.గత 15 రోజుల్లో 350 ఎమిరేట్స్ విమానాలు రద్దయ్యాయి. దీంతో ఖతర్ తదితర దేశాల విమానాలు ధరలు పెంచేశాయి. అమెరికాకు కిలో మామిడి రవాణా చార్జీ రూ. 180 నుంచి 600కు పెరిగిపోయింది. అమెరికాలో 4 కిలోల మామిడి పండ్ల బాక్స్ గతంలో 40 డాలర్లకు అమ్మేవాళం. ఇప్పుడు 60–70 డాలర్లకు అమ్మాల్సివస్తోంది. దీంతో అమెరికాకు మామిడి ఎగుమతులు బాగా తగ్గిపోయాయి.– రఫీ (98480 02221), సేంద్రియ మామిడి రైతు, ఎగుమతిదారు, ఏఆర్4మ్యాంగోస్, హైదరాబాద్యు.వి. రేడియేషన్ పండ్లను దెబ్బతీస్తోంది!అతి నీలలోహిత వికిరణాల (యు.వి. రేడియేషన్) తీవ్రత బాగా పెరిగిపోయి మామిడి, జామ పండ్లు ఎండదెబ్బకు గురవుతున్నాయి. యు.వి. రేడియేషన్ ఏప్రిల్ ఆఖరి, మే మొదటి వారాల్లో తీవ్రస్థాయికి చేరింది. యు.వి. ఇండెక్స్ ఇప్పుడు 12–13కి పెరిగిపోయింది. మామిడి, జామ వంటి పండ్ల తోటల్లో కాయలపై ఎండ మచ్చలు ఏర్పడుతూ పండ్ల నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. టొమాటోలు వంటి కూరగాయలపై కూడా ఈ ఎండ మచ్చలు సమస్యగా మారాయి.ఎండ తగిలిన వైపు పండినట్లు రంగు మారుతుంది. వెనుకవైపు పచ్చిగానే ఉంటుంది. నాణ్యత కోల్పోయిన ఈ కాయలను కొయ్యలేక, చెట్లకు ఉంచలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధిక వేడికి అనేక పోషకాలు అందక కొన్ని కాయలు రాలిపోతున్నాయి. యు.వి. రేడియేషన్ ఉద్యాన తోటల రైతులను ఈ ఏడాది చాలా నష్టపరుస్తోంది. నత్రజని కోసం ఫిష్ అమినో యాసిడ్ లేదా పంచగవ్యలను ద్రవజీవామృతంతో కలిపి చల్లాలి. బోరాన్ కోసం జిల్లేడు+ఉమ్మెత్త కషాయం, పోటాష్ కోసం అరటి పండ్ల (తొక్కలతో కలిపి తయారు చేసిన) కషాయాన్ని పిచికారీ చేయాలి. – ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం.నీరు, పోషకాలు పిచికారీ చేయాలి..విపరీత ఉష్ణోగ్రతలకు తోడైన వడగాడ్పులకు కూరగాయ తోటలు, పండ్ల తోటల్లో లేత ఆకులు మాడిపోతున్నాయి. ఉష్ణోగ్రత, అతినీలలోహిత వికిరణాలతో పాటు సూర్యరశ్మి తీవ్రత చాలా పెరిగిపోయింది. ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల తర్వాత నీటిని పిచికారీ చేయటం ద్వారా పంటలకు రక్షించుకోవచ్చు. వారం, పది రోజులకోసారి ఇంటిపంటలపై నానో యూరియా/ వర్మీవాష్ / జీవామృతం / ఆవు మూత్రంను ఒకటికి పది (1:10) పాళ్లలో నీటిలో కలిపి పిచికారీ చేసుకొని, అతి వేడి వత్తిడి నుంచి తోటలకు ఉపశమనం కలిగించాలి.– డాక్టర్ పి.వి. రావు (94901 92672), రిటైర్డ్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్, ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ అధ్యక్షులు, హైదరాబాద్.సేంద్రియ సేద్యం, వ్యాపార నైపుణ్యాలపై 6 రోజుల శిక్షణా శిబిరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులను సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు నేర్పటంతో పాటు.. సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార అవకాశాలను సృష్టించటంలో నిపుణులైన ఫెసిలిటేటర్‌గా మారడానికి నైపుణ్యం, విజ్ఞానాభివృద్ధి శిక్షణా కోర్సును నిర్వహించనుంది కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ. 20 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయ శిక్షణలో విశేష కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు సారథ్యంలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో సకల వసతులతో కృష్ణ సుధా అకాడమీ ఫర్ అగ్రోఎకాలజీ అంతర్జాతీయ స్థాయి వసతులతో ఇటీవలే ప్రారంభమైంది. సేంద్రియ వ్యవసాయంలో క్షేత్రస్థాయిలో లోతైన పరిశోధనలు చేయటంతో పాటు సేంద్రియ వ్యవసాయం, వ్యాపారం తదితర అంశాలపైప్రామాణికమైన శిక్షణ ఇవ్వటమే ఈ అకాడమీ లక్ష్యంగా పెట్టుకుంది. అగ్రికల్చర్ స్కిల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల తోడ్పాటుతో మే 22 నుంచి 27 వరకు తెలుగులో నిర్వహించనున్న ఉచిత రెసిడెన్షియల్ శిక్షణా శిబిరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. రామాజంనేయులు తెలిపారు. గుగుల్ ఫామ్ ద్వారా అభ్యర్థులు విధిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవటం తప్పనిసరి. 30–35 మందికి మాత్రమే అవకాశం. ఇతర వివరాలకు.. 85002 83300.ఇవి చదవండి: Women of My Billion: కలిసి నడిచే గొంతులు -
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్‌ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్‌ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్‌ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్‌లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్‌గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్‌కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్‌పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్‌పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్‌లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్‌తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్‌కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్‌సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్‌లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్‌లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్‌సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్‌లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్‌పై డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్‌పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్‌ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్‌ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745) -
Sagubadi: మార్కెట్‌ను బట్టి సేద్యం! ఆపై నేరుగా ప్రజలకే అమ్మకం..
రైతు దంపతులు బండారి వెంకటేష్, విజయకు ప్రయోగాలంటే ప్రాణం. చదివింది పదో తరగతే అయినా, ఉద్యాన పంటల సాగులో భేష్ అనిపించుకుంటున్నారు. ఇతర రైతులకు భిన్నంగా మార్కెట్‌కు తగిన పంటలు పండించడం, దళారులకు విక్రయించకుండా నేరుగా మార్కెటింగ్ చేయటం వారి సక్సెస్‌కు ముఖ్య కారణాలుగా నిలిచాయి. వెంకటేష్, విజయ దంపతులది జగిత్యాల జిల్లాలోని సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామం. ఖర్భూజ (పుచ్చ) పంటను తమకున్న 3 ఎకరాల్లో నవంబర్ నుండి మే నెల వరకు గత మూడేళ్లుగా సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 90 రోజులు. ఒకేసారి పొలం మొత్తంలో విత్తనాలు వేయకుండా, కొన్ని రోజుల వ్యవధిలో ఐదు దఫాలుగా విత్తుతారు. శివరాత్రి నుంచి ఎండలు ముదురుతాయి. అప్పటి నుంచి మే వరకు పుచ్చకాయలు మార్కెట్‌కు వచ్చేలా సాగు చేస్తారు. ప్రతి రోజు టన్ను నుంచి టన్నున్నర కాయలు జగిత్యాల మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ల్లో డిమాండ్ ఉన్న ఖర్భూజ రకాలను సాగుచేస్తుంటారు. ఈ ఏడాది ఐదు రకాల ఖర్భూజ పండ్లను సాగు చేశారు. సాధారణ ఖర్భూజ (సూపర్ క్వీన్ రకం), లోపల పసుపు పచ్చగా బయట ఆకుపచ్చగా ఉండే విశాల్ రకం, లోపల ఎర్రగా బయట పసుపు పచ్చగా ఉండే అరోహి రకం, గుండ్రంగా ఉండే జన్నత్ రకం, మస్క్‌మిలన్ (జ్యూస్ రకం) సాగు చేశారు. ఈ విత్తనాలను బెంగళూర్ నుంచి తెప్పించారు. ఖర్భూజ విత్తనాలు వేయక ముందు భూమిలో కోళ్ల ఎరువు, పశువుల పేడ వేసి, రెండు సార్లు దున్నిస్తారు. తర్వాత, బెడ్ మేకర్‌తో బెడ్ తయారు చేసి, మల్చింగ్ షీట్ వేసి, డ్రిప్ ద్వారా సాగు నీరు అందిస్తుంటారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పెద్దగా వాడకుండా సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటారు. జగిత్యాలలో ఖర్భూజ కాయలు అమ్ముతున్న వెంకటేష్ 3 నెలలు కష్టపడి పంట పండించి, ఆ పంటను దళారులకు విక్రయిస్తే కిలోకు రూ. 5–6 ధర కూడా రాదు. అందుకని ఈ రైతు దంపతులు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముతారు. విజయ సాయంత్రం తోటకు వెళ్లి కూలీల సాయంతో కాయలను తెంపుతుంటారు. వెంకటేష్ ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి, ఒక్కరిద్దరి సహాయంతో కాయలను ట్రాక్టర్లో లోడ్ చేస్తారు. ఇంటి వద్ద భోజనం చేసి ఉ. 8 గంటలకు జగిత్యాలకు వచ్చి, ప్రభుత్వ మహిళా డిగ్రి కళాశాల వద్ద అమ్ముతారు. ఈ సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మంచి గిరాకీ వస్తోంది. కిలో రూ. 25 నుంచి 49 వరకు రకాన్ని బట్టి విక్రయిస్తున్నారు. మార్కెట్ కంటే తక్కువ ధరకు ఇవ్వడంతో పాటు కాయలు నాణ్యతగా, రంగు రంగుల్లో ఉండటంతో వినియోగదారులు సైతం ఈ రైతు దగ్గర కొనటానికి ఆసక్తి చూపుతున్నారు. ఖర్భూజ సాగుతో పాటు ఏడాది పొడవునా ఏదో రకం కూరగాయలు, పండుగలప్పుడు పూలు కూడా సాగు చేస్తున్నారు. ఏ పంట పెట్టినా, అందులో అధిక దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయాన్ని వ్యాపారంలా మార్చితేనే రైతులకు లాభం అనే మాటను వీరు చేసి చూపిస్తున్నారు. పలువురు యువ రైతులు వీరిని అనుసస్తున్నారు. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ డిమాండ్‌ను బట్టి పంట మార్చుతాం! ఐదారు రకాల ఖర్భూజ కాయలు పండించేందుకు చాలా కష్టపడుతున్నాం. ఆ పంటను దళారులకు విక్రయిస్తే విత్తనాల ఖర్చు కూడా రావడం లేదు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి రకాన్ని మార్చుతాం. నా పంటకు నేనే రాజును. నేరుగా అమ్ముతున్నాను. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రజలు మా దగ్గర కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌ను గమనించుకుంటూ.. భార్యభర్త కలిసి పనిచేస్తే వ్యవసాయం తృప్తిగా ఉంటుంది. మంచి ఆదాయమూ వస్తుంది. – బండారి వెంకటేష్, విజయ (62818 13273). నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'.. -
Sagubadi: నేలపైన కాదు.. నేరుగా వేర్లకే 'తడి తగిలేలా'..
దీర్ఘకాలం మనుగడ సాగించే పండ్ల, పూల తోటల నుంచి కొద్ది నెలల్లో పంటకాలం ముగిసే సీజనల్ కూరగాయల సాగు వరకు నీటిని పొదుపుగా వాడుకోవటం అంటే వెంటనే అందరికీ గుర్తొచ్చేది చెట్ల దగ్గర మట్టిపై నీటిని చుక్కలు చుక్కలుగా వదిలే డ్రిప్ లైన్లు! అయితే, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పుల కాలంలో బోర్లు ఎండిపోతూ ఉంటే.. పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను రక్షించుకోవడానికి దీనికన్నా మెరుగైన మరో మార్గం ఉంది. అదే.. భూగర్భ డ్రిప్! నేల మీద నీరివ్వటం కాదు, భూమిలో వేర్లకే నేరుగా నీటి తేమ అందించటం! భూతాపం ఏటేటా పెరిగిపోతున్న దశలో నీటి సవాళ్లు మరింత తీవ్రమవుతున్నాయి. దీనికి తగినట్లు నీటిని మరింత సమర్థవంతంగా వాడుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇంతకుముందెన్నడూ ఎరుగని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు పెచ్చుమీరుతుంటే.. ఉద్యాన తోటల సాగుకు నీటి లభ్యత తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన కె.ఎస్. గోపాల్ ‘స్వర్’ (సిస్టం ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రిజునవేషన్) పేరుతో వినూత్న డ్రిప్‌ను ఆవిష్కరించారు. సాధారణ డ్రిప్ భూమి పైనే నీటిని వదులుతూ ఉంటే.. ఈయన రూపొందించిన డ్రిప్ నేలపైన కాకుండా చెట్లు/మొక్కల వేర్ల దగ్గర భూగర్భంలో నీటి తేమను అతి పొదుపుగా వదులుతుంది. సాధారణ డ్రిప్‌తో పోల్చితే కూడా సగానికి సగం నీరు ఆదా కావటంతో పాటు.. అతి తక్కువ నీరు అందుబాటులో ఉండే కరువు కాలపు మండు వేసవిలోనూ పండ్ల తోటలను కంటికి రెప్పలా కాపాడుకోవటానికి, తద్వారా వ్యవసాయాన్ని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఈ భూగర్భ డ్రిప్ ‘స్వర్’ రైతులకు చక్కగా ఉపయోగపడుతోందని గోపాల్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. 2019 మొదలుకొని ఇప్పటికి 8 రాష్ట్రాల్లో స్వర్ భూగర్భ డ్రిప్‌ను అనేక పండ్ల, కూరగాయ తోటల్లో అనేక సంస్థలతో కలిసి ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూస్తూ సత్ఫలితాలు పొందుతున్నామన్నారాయన. ‘స్వర్’ ఎలా పనిచేస్తుంది? భూగర్భంలో చెట్లు/ మొక్కల వేర్లకే నీటి తేమను అందించటమే ‘స్వర్’ భూగర్భ డ్రిప్ ప్రత్యేకత. సాధారణ ఆన్లైన్ డ్రిప్ లేటరల్ పైపునకు ఉండే డ్రిప్పర్‌ను తొలగించి, ‘స్వర్’ భూగర్భ డ్రిప్ బాక్సులను అమర్చితే సరిపోతుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే.. అరచేతి సైజులో ఉండే ఒక ΄్లాస్టిక్ బాక్స్ ఉంటుంది. దానికి నిండా సన్నని బెజ్జాలుంటాయి. 5 ఎం.ఎం. మైక్రో ట్యూబ్‌తో ఒక చివర్న ఈ బాక్స్‌ను జోడించి.. మరో చివర భూమిపైన ఉండే డ్రిప్ లేటరల్ పైపులకు అమర్చాలి. ఆ తర్వాత బాక్స్‌ను చెట్టు/మొక్క దగ్గర మట్టిని తవ్వి భూమి లోపల వేర్ల దగ్గర్లో పెట్టి, మట్టి కప్పెయ్యాలి. ఆ విధంగా ఈ భూగర్భ డ్రిప్ భూమి లోపల వేరు వ్యవస్థకు నీటి తేమను అందుబాటులోకి తెస్తుంది. మట్టి లోపల వేరు వ్యవస్థ దగ్గర ఉండే ఈ బాక్స్‌లో క్వార్ట్›్జ స్టోన్ గ్రాన్యూల్స్ ఉంటాయి. అవి నిరంతరం నీటì తేమను మట్టి ద్వారా వేరు వ్యవస్థకు క్రమబద్ధంగా అందిస్తుంటాయి. బయటి నుంచి వేర్లు ఈ బాక్స్ లోపలికి అల్లుకొని దాని పనితీరును దెబ్బతీయకుండా ఉండేలా దీన్ని రూపొందించటం విశేషం. మామిడి, బత్తాయికి 4 డ్రిప్ బాక్సులు.. ఉద్యాన తోటల్లో చెట్ల వయసును, ఎత్తును బట్టి, మట్టి తీరును బట్టి ఒక్కో చెట్టుకు ఎన్ని డ్రిప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలో, వేరు వ్యవస్థ వద్ద నేలలో ఎంత లోతులో ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. చెట్టు మొదలు దగ్గర కాకుండా.. దాని కొమ్మలు విస్తరించిన చివరిలో పీచువేళ్లు అందుబాటులో ఉండే చోట్ల ఈ డ్రిప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం. ఎమ్మెస్ స్వామినాధన్ ఫౌండేషన్, వైజాగ్ కృషి విజ్ఞాన కేంద్రం, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవా, జిఐజడ్ వంటి సంస్థలతో కలిసి స్వర్ భూగర్భ డ్రిప్, లివింగ్ కంపోస్టుపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించామని గోపాల్ తెలిపారు. పెద్ద మామిడి చెట్టుకు 4 (12–16 అంగుళాల లోతులో) స్వర్ డ్రిప్ బాక్సులు, జామ చెట్టుకు 2 (12 అంగుళాల లోతులో), బత్తాయి చెట్టుకు 4 (12 అంగుళాల లోతులో), నిమ్మ చెట్టుకు 2 (6 అంగుళాల లోతులో), దానిమ్మ చెట్టుకు 2 (భగువ చెట్టుకు 4–5, గణేశ్ చెట్టుకు 6–7 అంగుళాల లోతులో), కొబ్బరి చెట్టుకు 4 (4–5 అంగుళాల లోతులో), మల్లె మొక్కకు 1 డ్రిప్ బాక్సు ఏర్పాటు చేసుకుంటే చాలని ప్రయోగాత్మక సాగులో తేలింది. రెండు చెరకు మొక్కలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని గోపాల్ తెలిపారు. 50% నీరు, 30% విద్యుత్తు ఆదా.. భూగర్భ డ్రిప్ బాక్సుల ద్వారా వేరు వ్యవస్థకు నీటిని అందించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వర్షాకాలంలో తప్ప కలుపు సమస్య ఉండదు. కాబట్టి రైతుకు శ్రమ, ఖర్చు తగ్గుతాయి. సాధారణ డ్రిప్‌తో పోల్చితే 50% నీరు, 30–40% విత్యుత్తు ఆదా అవుతుంది. డ్రిప్ ద్వారా ఇచ్చే ద్రవరూప ఎరువులు కూడా 30% ఆదా అవుతాయి. సౌర విద్యుత్తు ద్వారా నడిచే 5 హెచ్‌పి మోటారుకు బదులు 1.5 హెచ్.పి. మోటారు సరిపోతుంది. 10% అదనంగా పంట దిగుబడి వస్తుంది. అంతేకాదు, త్వరగా పూత వస్తుందని గోపాల్ చెబుతున్నారు. అవార్డుల పంట.. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్ (సిఇసి) తరఫున ‘స్వర్’ భూగర్భ డ్రిప్ వ్యవస్థను ఆవిష్కరించిన కె.ఎస్.గోపాల్‌కు 2023 అవార్డుల పంట పండించింది. న్యూఢిల్లీలోని ఐఎఆర్‌ఐలో పూసా కృషి పురస్కారం (రూ. 5 లక్షలు), ఫిక్కి ఉత్తమ నీటి సాంకేతికత పురస్కారం, రూ. 50 లక్షల యాక్ట్ గ్రాంటు లభించాయి. కేంద్ర జలశాఖ, యుఎన్‌డిపి, తెరి ఉమ్మడిగా 2024 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ‘స్వర్’ ప్రథమ బహుమతిని గెల్చుకుంది. తోటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చు! సాధారణ డ్రిప్ వాడినప్పుడు చెట్టు/మొక్క దగ్గర ఉపరితలం నుంచి వేర్ల దగ్గరకు మట్టిని తడుపుకుంటూ నీరు వెళ్లాల్సి ఉంటుంది. ‘స్వర్’ భూగర్భ డ్రిప్ బాక్సులు ఏర్పాటు చేసుకుంటే ఆ అవసరం ఉండదు. నేరుగా వేర్లకే నీటి తేమను అందించవచ్చు. దీనివల్ల, నీటి వాడకం సగానికి సగం తగ్గిపోతుంది. మండు వేసవిలోనూ 3 నుంచి 5 రోజులకు ఒకసారి నీరిస్తే సరిపోతుంది. అడుగు లోతులో నీటి తేమ ఎంత ఉందో సెన్సార్ ఆధారంగా తెలుసుకుంటూ.. నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే, తగినంత నీటి తేమను, నెమ్మదిగా అందించటం వీలవుతుంది. తద్వారా తక్కువ నీటితోనే పండ్ల, పూల తోటలను, కూరగాయ తోటలను అధిక వేడి, హీట్‌వేవ్ కష్టకాలంలోనూ రక్షించుకోవటానికి అవకాశం ఉంది. భూగర్భ డ్రిప్ బాక్సు ధర గతంలో రూ. 50 ఉండేది. ఇజ్రేల్ కంపెనీ సహాయంతో దీన్ని రూ. 25కి తగ్గించగలిగాం. – కె.ఎస్.గోపాల్ (98481 27794), ‘స్వర్’ భూగర్భ డ్రిప్ ఆవిష్కర్త, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ కన్సర్న్స్, హైదరాబాద్. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: కుండలు చేసే ఊరు -
ప్రకృతి సేద్యం నిశ్శబ్ద విప్లవం!
సాక్షి సాగుబడి, అహ్మదాబాద్ (గుజరాత్): ప్రకృతి వ్యవసాయం ఒక నిశ్శబ్ద విప్లవమని, స్వావలంబన విప్లవమని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌కు దగ్గరలోని బోటాడ్ జిల్లా పాలియాడ్లో శుక్రవారం సుభాష్ పాలేకర్ కృషి పై మూడు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలతో పాటు నేపాల్ నుంచి సుమారు 500 మంది రైతులు, రైతు శ్రేయోభిలాషులు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. పాలేకర్ ప్రసంగిస్తూ తన సేద్య పద్ధతిలో భూమిలో హ్యుమస్ పెరగటం వల్ల 90 శాతం సాగునీరు ఆదా అవుతుందన్నారు. పంటలు నేల నుంచి కన్నా వాతావరణం నుంచి ఎక్కువ నీటిని తీసుకుంటాయన్నారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా వినియోగదారులు కొనుగోలు చేసుకునే ప్రత్యామ్నాయ స్వయం నియంత్రిత, స్వావలంబన వ్యవస్థ లో ధర నిర్ణయించే హక్కు రైతులేనని, ప్రభుత్వ జోక్యం అవసరం లేదన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూలం పంట పొలంలో పర్యావరణ సంక్షోభమే కారణమన్నారు. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి ఈ సంక్షోభాన్ని పరిష్కరించటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మ హత్యల్లేని సమాజాన్ని నిర్మిస్తుందని పాలేకర్ తెలిపారు. వాతావరణ మార్పులని ఎదుర్కోవటం ఈ సేద్యం వల్లనే సాధ్యం అన్నారు. ఇవి చదవండి: The Goat Life: 700 గొర్రెలూ.. ఎడారి.. అతను -
సాగుబడి: 15 నిమిషాల్లోనే.. ఎడ్ల బండితో పిచికారీ!
కూలీల సమస్యను అధిగమించడంతోపాటు పెట్టుబడి తగ్గించుకునే ఆలోచనతో ఓ యువరైతు వినూత్న స్ప్రేయర్‌ను రూపొందించారు. ఎడ్లబండిపై పెట్టుకొని ఉపయోగించుకునేందుకు ఈ స్ప్రేయర్ అనువైనది కావటం విశేషం. అందరి మన్ననలు అందుకుంటున్న మక్దుం అలీపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా నర్వ మండలం కల్వాల్ గ్రామానికి చెందిన మక్దుం అలీ(38)కి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే చదువు ఆపేసి వ్యవసాయంలో స్థిరపడ్డారు. సాగునీటి ఇబ్బందులున్నప్పటికీ.. రెండెకరాల్లో కంది, ఆముదాలు, పత్తితోపాటు మరో ఎకరా పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఏటా పెట్టుబడి పెరగడం, రాబడి తగ్గుతుండడంతో ఖర్చు ఎలా తగ్గించుకోవాలని ఆలోచిస్తుంటారు. పురుగు మందులతోపాటు కూలీల ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగుచూసింది. ఎడ్ల బండిపై 5 హెచ్‌పీ ఇంజిన్, స్ప్రే పంపు, బ్యాటరీ, డైనమో, రెండు వైఫర్ మోటర్లు, రెండు డ్రమ్ములు, రెండు స్ప్రేయింగ్ గన్లతో సుమారు రూ.45 వేల వ్యయంతో అలీ దీన్ని రూపొందించారు. ఎడ్ల బండిపై కూర్చున్న రైతు బండిని తోలుకెళ్తూ ఉంటే.. బండి వెనుక వైపు బిగించిన రెండు స్ప్రేగన్లు ఏకకాలంలో పిచికారీ చేస్తాయి. అటు 20 అడుగులు, ఇటు 20 అడుగుల (దాదాపు ఆరు సాళ్ల) వరకు పురుగుల మందును ఈ యంత్రం పిచికారీ చేస్తుంది. మనిషి అవసరం లేకుండానే రెండు స్ప్రేగన్లు, రెండు డ్రమ్ముల ద్వారా 15 నిమిషాల్లోనే ఎకరం పొలంలో మందు పిచికారీ చేస్తాయి. ఎడ్లబండిపై కూర్చునే వ్యక్తికి, ఎద్దులకు మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో వెనుక వైపున పురుగుమందు పిచికారీ అవుతున్నందున ఇబ్బంది ఉండదు. అలీని కలెక్టర్ ప్రశంసించడమే కాకుండా ‘ఇంటింటా ఇన్నోవేషన్’కు ఎంపిక చేశారు. టీహబ్ అధికారులూ ప్రశంసించారు. – పెరుమాండ్ల కిషోర్ కుమార్, సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, ఫొటోలు: సుదర్శన్‌గౌడ్, నర్వ స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ.. రసాయనిక వ్యవసాయంలో తెగుళ్ల బెడద ఎక్కువ. పంటలపై వాటి తీవ్రత అధికంగా ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఒక్క రోజులోనే పంట మొత్తానికి తెగుళ్లు వ్యాపించొచ్చు. నేను రూపొందించిన స్ప్రేగన్తో వేగంగా మందులు పిచికారీ చేయొచ్చు. దీంతోపాటు నిర్దేశించిన మేరకు ఖచ్చితత్వంతో ఎరువులు వేసేలా రూ.500 ఖర్చుతో పరికరాన్ని రూపొందించాను. కూలీలు అవసరం లేకుండా రైతు ఒక్కరే ఎరువులు వేసుకోవచ్చు. శాస్త్రవేత్త కావాలన్నది నా సంకల్పం. అయితే ఆర్థిక స్థోమత లేమి కారణంగా చదువు మధ్యలోనే ఆగింది. నాకున్న ఆలోచనతో స్ప్రేగన్ తయారు చేసిన. ప్రభుత్వ ప్రోత్సహించాలని కోరుతున్నా. – మక్దుం అలీ (97038 20608), యువ రైతు, కల్వాల్, నర్వ ► గుంటూరులో చిరుధాన్య వంటకాలపై శిక్షణ.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక్ సేవా కేంద్రం నిర్వహణలో ఈనెల 30, 31, ఏప్రిల్ 1 తేదీలలో ఉ. 10–5 గంటల వరకు చిరుధాన్యాలతో తయారుచేసే వివిధ రకాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరుగుతుంది. మిల్లెట్స్ రాంబాబు తదితరులు ప్రత్యక్షంగా చిరుధాన్యాలతో అనేక వంటకాల తయారీ విధానాన్ని తెలియజేస్తారు. వసతి, మిల్లెట్ భోజనం సదుపాయం ఉంది. పాల్గొనదలచినవారు 97053 83666 / 95538 25532కు ఫోన్ చేసి తప్పనిసరిగా ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు తెలిపారు. ఇవి చదవండి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు! -
సాగుబడి: సస్యగవ్యతో.. బంజరు భూమి సాగు!
మన దేశంలో 28.7% భూమి (9 కోట్ల 78 లక్షల హెక్టార్ల భూమి బంజరు భూమి ఉంది. విచ్చలవిడిగా రసాయనాల వినియోగం వల్ల పూర్తిగా నిస్సారమై సాగుయోగ్యం కాకుండా పోయిన భూమి కూడా ఇందులో కలసి ఉంది. ఇటువంటి రాళ్లూ రప్పలతో కూడిన బంజరు, నిస్సారమైన భూములను సైతం కేవలం ద్రవరూప ఎరువు ‘సస్యగవ్య’తో పునరుజ్జీవింపచేయ వచ్చని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. వేదకాలం నాటి కృషిపరాశర గ్రంథం నుంచి తీసుకున్న సాగు పద్ధతిలో బంజరు భూములను, నిస్సారమైన భూములను పునరుజ్జీవింపజేస్తూ తిరిగి సాగులోకి తేవడానికి ఉపయోగపడే వినూత్న ప్రకృతి సేద్య పద్ధతిని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన యూనివర్సిటీ అనుసరిస్తోంది. అనేక రకాల పండ్ల మొక్కలను ఐదేళ్లుగా ఈ పద్ధతిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తోంది. వనపర్తి జిల్లా మదనాపురంలోని ఉద్యాన బోధనా క్షేత్రంలో 11 ఎకరాల రాళ్లతో కూడిన బంజరు భూమిలో అసిస్టెంట్ ్రపొఫెసర్ డా. జడల శంకరస్వామి 2019 నుంచి ఈ ప్రయోగాత్మక సాగు పద్ధతిని అవలంభిస్తూ భూమిని క్రమంగా సారవంతం చేస్తున్నారు. ఎత్తుమడులు.. అధిక సాంద్రత.. 11 ఎకరాలను ఎకరం ప్లాట్లుగా చేసి నేల తీరుకు సరిపోయే పంటలను సాగు చేస్తున్నారు. ఉదాహరణకు రాళ్లు రప్పలతో కూడిన నేలలో దానిమ్మ (భగువ) రకం మొక్కల్ని అధిక సాంద్రతలో ఎకరానికి 300 నాటారు. అదేవిధంగా, 7 రకాల మామిడి, మూడు రకాల అంజూర, జామ, మునగ తదితర తోటలను వేశారు. భూమిని దుక్కి చేసి 2.5 అడుగులు (75 సెం.మీ.) వెడల్పుతో.. సాళ్ల మధ్యలో మీటరు లోతున తవ్విన మట్టిని పోసి 2 మీటర్ల ఎత్తున బెడ్స్ చేశారు. సాళ్ల మధ్య 16 అడుగులు, మొక్కల మధ్య 10 అడుగుల దూరం పాటించారు. ఎత్తుమడులపై మొక్కలు అధిక సాంద్ర పద్ధతిలో నాటి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. గుంతకు 5 కిలోల వర్మీ కంపోస్టు వేసి మొక్కలు నాటారు. ఇక ఆ తర్వాత ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ, సేంద్రియ ఎరువులు గానీ, పిచికారీలు గానీ చేయటం లేదు. కలుపు మొక్కలే బలం! ఏ పొలంలో మొలిచే కలుపు మొక్కలను పీకి ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వాడటంతో పాటు.. ఆ మొక్కలను మురగబెట్టి సస్యగవ్య అనే ద్రవ రూప ఎరువును తయారు చేస్తున్నారు. దీన్ని అదే పొలంలో గడ్డీ గాదాన్ని కుళ్లించడానికి వినియోగించటం ద్వారా భూమిని సారవంతం చేసుకోవచ్చు. బంజరు భూముల్ని, సారం కోల్పోయిన భూముల్ని సాగులోకి తేవటానికి బయటి నుంచి ఎటువంటి ఉత్పాదకాలను ఖర్చుపెట్టి కొని తెచ్చి వేయాల్సిన అవసరం లేదని రైతులకు తెలియజెప్పడానికే ఈ ప్రయోగాన్ని చేపట్టామని డా. శంకరస్వామి ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. కలుపు మొక్కలుగా మనం భావించేవాటిలో చాలా మటుకు నిజానికి ఔషధ మొక్కలేనని అంటూ.. వాటిని పీకి పారేయటం కాకుండా అదే నేలలో కలిపేస్తే చాలు. కలుపు ఆచ్ఛాదనపై సస్యగవ్య పిచికారీ ఇక ఏ రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు చల్లకుండా ఉంటే.. ఆ భూమిలోనే ఉండే సూక్ష్మజీవరాశి సంరక్షించబడి భూమిని క్రమంగా సారవంతం చేస్తుందని ఆయన తెలిపారు.గులక రాళ్లు సైతం భూసారాన్ని పెంపొందించడానికి దోహదపడుతాయని తమ అనుభవంలో వెల్లడైందన్నారు. గణనీయంగా పెరిగిన సేంద్రియ కర్బనం.. సస్యగవ్యతో సేద్యం చేయనారంభించిన తొలి దశలో, నాలుగేళ్ల తర్వాత పండ్ల తోటలో భూసార పరీక్షలు చేయించగా భూసారం గణనీయంగా వృద్ధి చెందింది. 11 ఎకరాల్లో సగటున సేంద్రియ కర్బనం 0.24 నుంచి 0.53కి, సేంద్రియ పదార్థం 0.1 నుంచి 1%కి పెరిగింది. వీటితో పాటు మట్టిలో టోటల్ నైట్రోజన్ 0.015 నుంచి 0.045కి పెరిగిందని డా. శంకర స్వామి తెలిపారు. సస్యగవ్యను వరుసగా నాలుగేళ్లు వాటం వల్ల సాగుకు యోగ్యం కాని భూమిని కూడా తిరిగి సారవంతం చేయటం సాద్యమేనన్నారు. ఒక్కో రకం పండ్ల తోట సాగులో ఉన్న తోటలో వేర్వేరు రకాల కలుపు మొక్కలు, ఔషధ మొక్కలు మొలుస్తున్న విషయం గుర్తించామన్నారు. మట్టిలోని గులకరాళ్లు కూడా పరోక్షంగా మట్టిని సారవంతం చేయడానికి పరోక్షంగా దోహదపడుతున్నట్లు కూడా గుర్తించామని అంటూ.. సాగు భూమిలోని గులక రాళ్లు పనికిరానివేమీ కాదన్నారు. బెడ్స్ మధ్యలో రాళ్ల భూమి - బోడ్స్ మధ్య కలుపు ఆచ్ఛాదన ‘సస్యగవ్య’ తయారీ ఇలా.. పొలంలో మొలిచిన కలుపు మొక్కలను ఏడాదికి మూడు దఫాలు పీకి వాటితో సస్యగవ్యను డా. శంకర స్వామి తయారు చేయిస్తున్నారు. ఆ పొలంలోని తాజా కలుపు మొక్కలు కిలో, తాజా ఆవు పేడ కిలో, ఆవు మూత్రం లీటరు, రెండు లీటర్ల నీటి (1:1:1:2)తో కలిపి పొలంలోనే నీడన ఫైబర్ పీపాల్లో మురగబెడుతున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం కలియదిప్పుతుంటే 10–12 రోజుల్లో సస్యగవ్య ద్రవ రూప ఎరువు సిద్ధమవుతుంది. ఆ పొలంలోనే సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం, ఆకులు అలములు, కొమ్మలు రెమ్మలపై సస్యగవ్యను 1:1 పాళ్లలో నీరు కలిపి పిచికారీ చేస్తున్నారు. వారం తర్వాత ఆ గడ్డీ గాదాన్ని రొటోవేటర్‌తో మట్టిలో కలియదున్ని, ఆ మట్టిపై మరోసారి సస్యగవ్యను పిచికారీ చేస్తున్నారు. తద్వారా ఈ సేంద్రియ పదార్థం కుళ్లి మట్టిలో కలిసిపోయి భూమి సారవంతం అవుతోంది. ఏడాదిలో మూడు సీజన్లలో కొత్తగా కలుపు మొలిచినప్పుడు ఆ కలుపు మొక్కలతో మాత్రమే దీన్ని తయారు చేసి వాడుతున్నారు. భూమిని సారవంతం చేయటానికి ఈ ఒక్క పని తప్ప మరే ఎరువూ వేయటం లేదు. డ్రిప్ ద్వారా అవసరం మేరకు నీరు మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. రైతులు అనుసరించడానికి ఇది చాలా అనువైన, ఖర్చులేని పద్ధతని డా. శంకరస్వామి అంటున్నారు. ఇంతకీ దిగుబడి ఎంత? స్వల్ప ఖర్చుతోనే బంజరు భూముల్ని, రసాయనిక వ్యవసాయం వల్ల నిస్సారమైన భూముల్ని తిరిగి సారవంతం చేసుకొని ఫలసాయాన్నిచ్చేలా పునరుజ్జీవింపచేయొచ్చని మా ప్రయోగం రుజువు చేసింది. సస్యగవ్యతో కూడిన ప్రకృతి సేద్యంలో 4 ఏళ్ల తర్వాత ఒక్కో దానిమ్మ (భగువ) చెట్టుకు 3.96 కిలోల పండ్లు, అంజూర (డయాన) చెట్టుకు 13.8 కిలోల పండ్లు, జామ (అలహాబాద్ సఫేది) చెట్టుకు 1.65 కిలోల దిగుబడి వచ్చింది. బయటి నుంచి ఏదీ కొని వేయకుండా సాధించిన ఫలసాయం ఇది. – డా. జడల శంకరస్వామి (97010 64439), ఉద్యాన కళాశాల, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం -
సాగుబడి: పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్‌లో ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం!
"పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ ఐదు అంచెల పంటల సాగు నమూనాతో ఎకరానికి ఏటా రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. గుజరాత్లో ఫైవ్ లేయర్ ఫుడ్ ఫారెస్ట్లు తన టెక్నాలజీకి నిదర్శనంగా నిలిచాయని, తొలి ఏడాదే రూ. 2 లక్షలు, ఆరో ఏడాది నుంచి రూ. 6 లక్షల ఆదాయం సమకూరుతోందన్నారు. ఆసక్తిగల రైతులు గుజరాత్ వస్తే తానే స్వయంగా చూపిస్తానన్నారు." ఈ నెల 29,30,31 తేదీల్లో అహ్మదాబాద్‌కు 151 కి.మీ. దరంలోని పాలియాడ్ (బోటాడ్ జిల్లా)లోని శ్రీ విషమన్ బాపు ప్యాలెస్ మందిర్‌లో (ఆంగ్లం/ హిందీ) రైతు శిక్షణా శిబిరంలో పాల్గొనే వారికి ఈ ఫుడ్ ఫారెస్ట్‌లను స్వయంగా చూపిస్తానన్నారు. 3 రోజులకు ఫీజు రూ.700. ఇతర వివరాలకు.. ఘనశ్యాం భాయ్ వాల– 63550 77257, కశ్యప్ భాయ్‌చౌహాన్– 85303 13211. పుట్టగొడుగుల సాగుపై 26 రోజుల ఉచిత శిక్షణ.. ఇంటర్/డిప్లొమా దశలో చదువు మధ్యలో ఆపేసిన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ‘ఆస్కి’ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పుట్టగొడుగుల పెంపకంపై పూర్తిస్థాయి శిక్షణా శిబిరం జరగనుంది. హైదరాబాద్ (రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆవరణ) లోని విస్తరణ విద్యా సంస్థలో జరిగే ఈ శిబిరంలో పాల్గొనే వారికి బోధనతో పాటు భోజన, వసతి కూడా పూర్తిగా ఉచితం. చిన్న స్థాయి పుట్టగొడుగుల రైతుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని అంశాలపై నైపుణ్య శిక్షణ ఇస్తారు. 16 ఏళ్లు పైబడిన గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు. ఇంటర్ ఫస్టియర్ పాస్ లేదా టెన్త్ తర్వాత వ్యవసాయ/ అనుబంధ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా మొదటి ఏడాది పూర్తి చేసిన లేదా పదో తరగతి పాసైన తర్వాత కనీసం ఒక ఏడాది పుట్టగొడుగుల పెంపకంలో అనుభవం పొందిన వారు లేదా 8వ తరగతి పాసైన తర్వాత కనీసం 3 ఏళ్లుగా పుట్టగొడుగులు పెంపకం పని చేస్తున్న వారు.. ఈ ఉచిత శిక్షణకు అర్హులు. విద్యార్హత, కులధృవీకరణ, ఆధార్, ఫోటో తదితర వివరాలను పొందుపరుస్తూ ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. ఇతర వివరాలకు.. 040– 2405368, 98666 18107. eeihyd1962@gmail.com 22 నుంచి దేశీ వరి సాగు, నీటి సంరక్షణపై ‘సేవ్’ శిక్షణ.. విశాఖపట్నం కృష్ణాపురంలోని సింహాచలం దేవస్థానం గోశాల (న్యూ)లో ఈ నెల 22 నుంచి 26 వరకు దేశీ వరి సాగుదారులు, దేశీ వరి బియ్యాన్ని సేకరించి ఆలయాల్లో నైవేద్యాల కోసం అందించే దాతలతో రైతుల ముఖాముఖి పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకృతి వ్యవసాయ సాధకులు, ‘సేవ్’ సంస్థ నిర్వాహకులు విజయరామ్ తెలిపారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ వరి రకాల సాగు, ఉద్యాన పంటల 5 లేయర్ సాగు, వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతల తవ్వకంపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. పెళ్లిళ్లలో ఔషధ గుణాలు గల సంప్రదాయ వంటకాలు వడ్డించే ఆసక్తి గల వారికి ఆ వంటకాలను కూడా ఈ శిబిరంలో పరిచయం చేస్తామన్నారు. ‘శబలా భోజన పండుగ’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ ఐదు రోజులూ జరుగుతాయని, ఆసక్తిగల వారు ఏదో ఒక రోజు హాజరైతే చాలని విజయరామ్ తెలిపారు. వివరాలకు.. సేవ్ కార్యాలయం 63091 11427, సురేంద్ర 99491 90769. 29 నుంచి సేవాగ్రామ్‌లో జాతీయ విత్తనోత్సవం! వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తి దేశీ వంగడాలకే ఉందనే నినాదంతో ఈ నెల 29 నుంచి 31 వరకు మహారాష్ట్ర వార్థా జిల్లా సేవాగ్రామ్‌లోని నాయ్ తాలిమ్ సమితి పరిసర్లో వార్షిక జాతీయ విత్తనోత్సవం జరగనుంది. దేశం నలుమూలల నుంచి అనేక పంటల దేశీ వంగడాల ప్రదర్శన, అమ్మకంతో పాటు సేంద్రియ రైతుల సదస్సులు, క్షేత్ర సందర్శనలు, నిపుణులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రుసుము రూ. వెయ్యి. వివరాలకు.. యుగంధర ఖోడె – 91302 17662, ప్రతాప్ మరొడె – 75888 46544. ఇవి చదవండి: సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు! -
సాగుబడి: ఈ సరికొత్త ప్రయోగంతో.. కరువును తట్టుకున్న పంటలు!
ఏపీ రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్) మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ఒక సరికొత్త ప్రయోగం ప్రారంభమైంది. కరువును తట్టుకునే ప్రత్యేక పద్ధతి (డ్రాట్ ప్రూఫింగ్ మోడల్)లో పంటలు సాగు జరుగుతోంది. వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, బీడు భూముల్లో కూడా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయవచ్చని పలువురు చిన్న, సన్నకారు రైతులు నిరూపిస్తున్నారు. పొలం మొత్తాన్నీ దుక్కి చేయకుండా.. ప్రతి 3 అడుగుల దూరంలో ఒక అడుగు భూమిని తవ్వి 5 రకాల పంట విత్తనాలను విత్తుతున్నారు. 2023 ఆగస్టులోప్రారంభమైన ఈ సరికొత్త పద్ధతిలో అనేక జిల్లాలకు చెందిన 56 మంది రైతులు 20 సెంట్ల నుంచి ఎకరా విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫ్ సాగు చేస్తున్నారు. ఇద్దరు రైతుల అనుభవాలతో కూడిన కథనం.. కాలువ రాకపోయినా పంట వచ్చింది.. రైతు ఆదిలక్ష్మి ఇలా చెప్పారు.. ‘‘మాకు అరెకరం పొలం ఉంది. ఇక్కడ అందరూ మిరపే వేస్తారు. మేమూ మిరపే వేసేవాళ్లం. రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మిరపలో అంతరపంటలు కూడా సాగు చేశాం. సాగర్ కాలువ నుంచి ఇంజన్‌తో తోడుకొని తడి పెట్టేవాళ్లం. గత ఏడాది 7 క్వింటాళ్లు ఎండు మిరప పండింది. రూ. 50 వేల నికారాదాయం వచ్చింది. వర్షాలు లేక ఈ సంవత్సరం కాలువ ఒక్కసారే వచ్చింది. అందుకని మిరప వేయలేదు. ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు.. కరువును తట్టుకొని పండే డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు పెట్టాం. ఈ పంటలకు ముందు మేలో నవధాన్య (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్) పంటలు చల్లాం. వర్షం లేక సరిగ్గా మొలవలేదు. మళ్లీ జూలైలో వేశాం. వర్షానికి మొలిచింది. పెరిగినాక కోసి, గొడ్లకు మేతగా వాడుకున్నాం. వరుసగా మూడేళ్లుగా నవధాన్య పంటలు వేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే.. భూమి బాగా గుల్లబారింది. నవధాన్య పంటలు వేయని పక్క పొలంలోకి వెళ్లి మట్టి చేత్తో తీయాలంటే చాలా కష్టపడాలి. మా పొలంలో సులువుగానే మట్టి తీయొచ్చు. పొలం దున్నకుండానే, 3 అడుగులకు ఒక చోట అడుగు నేలను గుల్లగా తవ్వి, గత ఏడాది అక్టోబర్ 27న 5 రకాల విత్తనాలు నాటుకున్నాం. ప్రధాన పంటగా మధ్యలో ఆముదం లేదా కందిని నాటాం. దానికి నాలుగు వైపులా చిక్కుడు, అలసంద, అనుములు, సజ్జలు విత్తుకున్నాం. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తన గుళికలు తయారు చేసుకొని నాటుకున్నాం. సీడ్ పెల్లటైజేషన్ చేయటం వల్ల భూమిలో విత్తుకున్న తర్వాత మొలక శాతం బాగుంటుంది. ఒకవేళ వర్షం రాకపోయినా లేదా మనం నీళ్లు పెట్టటం లేటైనా ఆ విత్తనం చెడిపోకుండా ఉంటుందని పెల్లటైజేషన్ చేశాం. విత్తనం పెట్టిన కొద్ది రోజులకు తుపాను వానకు విత్తనాలు మొలిచాయి. విత్తనం పెట్టేటప్పుడు అరెకరంలో 200 కిలోల ఘనజీవామృతం వేశాం. రెండుసార్లు ద్రవ జీవామృతం పిచికారీ చేశాం. తర్వాత మరో రెండు సార్లు వాన వచ్చింది. అదే వాన సరిపోయింది. మిరపకు ఈ పంటలకు చాలా తేడా ఉంది. మిరపకు రెండు రోజులు నీరు లేకపోతే వడపడిపోయి ఎండిపోతుంది. డ్రాట్ ప్రూఫ్ మోడల్లో పంటలు అలా కాదు. నీరు లేకపోయినా చాలా వరకు జీవ కళ ఉంటుంది. అదీకాక, మేం చేసిన విత్తన గుళికలుగా చేసి వేసినందు వల్ల, భూమిలో వేసిన ఘనజీవామృతం వల్ల, ద్రవ జీవామృతం పిచికారీ వల్ల పంటలు ఎదిగాయి. ప్రధాన పంటతో పాటు పెట్టిన అనుములు, చిక్కుళ్ల వల్ల ఉపయోగం ఏమిటంటే.. ఈ తీగలు పాకి నేలపై ఎండపడకుండా కప్పి ఉంచి కాపాడటం, భూమిలో తేమ ఆరిపోకుండా కాపాడింది. సజ్జ ద్వారా రూ. 8,000లు వచ్చాయి. సజ్జ ఇంకా తీయాల్సి ఉంది. చిక్కుళ్లు,సొర కాయలు, దోసకాయల ద్వారా మరో ఆరేడు వేలు ఆదాయం వచ్చింది. సజ్జ బాగా పెరగటంతో నీరు లేక కంది సరిగ్గా ఎదగలేదు. ఇప్పటికి అన్నీ కలిపి రూ. 15 వేల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా ఆముదాలు ఒక బస్తా వరకు వస్తాయి. పనులు మేమే చేసుకుంటాం. ఖాళీ ఉన్న రోజుల్లో కూలికి వెళ్తాం. బెట్టను తట్టుకొని పంట పండించుకోవచ్చని, ఎంతో కొంత దిగుబడి వస్తుందని నాకైతే నమ్మకం కుదిరింది..’’ – ఎం. ఆదిలక్ష్మి (83091 18867), ఈపూరు, పల్నాడు జిల్లా బీడులోనూ పంటలు.. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాళ్ళ గ్రామానికి చెందిన రంగస్వామి బిఎస్సీ బీఈడీ చదువుకొని తమ రెండెకరాల్లో ఐదేళ్లుగా ప్రకృతి వ్వవసాయం చేస్తున్నారు. ఒక ఎకరంలో సపోట, మామిడి చెట్లు ఉన్నాయి. మరో ఎకరంలో టొమాటో, మిర్చి, వంగ, గోరుచిక్కుడు పంటలను బోరు నీటితో సాగు చేశారు. రెండో పంటగా వేరుశనగ, కంది, ముల్లంగి తదితర పంటలు వేశారు. రెండెకరాల్లో సగటున ఏడాదికి రూ. లక్షా 70 వేల వరకు నికరాదాయం పొందుతున్నట్లు తెలిపారు. సపోట, మామిడి తోటలో మూడు ఏళ్లుగా దుక్కి చేయని 30 సెంట్ల విస్తీర్ణంలో డ్రాట్ ప్రూఫింగ్ మోడల్లో 2023 డిసెంబర్లో ప్రయోగాత్మకంగా సజ్జ, గోరు చిక్కుడు, అనుములు, అలసంద, కంది, ఆముదం పంటలను సాగు చేశారు. 3 అడుగుల దూరంలో ఒక అడుగు విస్తీర్ణంలో తవ్వి, ఘనజీవామృతం వేసి విత్తనాలు విత్తారు. మామిడి ఆకులతో ఆచ్ఛాదన చేశారు. వారానికోసారి బక్కెట్లతో పాదికి 2,3 లీటర్ల నీరు పోశారు. మూడు నెలల వ్యవధిలో అలసంద, అనుములు అమ్మితే రూ. 2 వేల దాకా ఆదాయం వచ్చింది. పశుగ్రాసం రూపంలో మరో రూ. 3 వేల ఆదాయం వచ్చింది. రూ. 2 వేల గోరుచిక్కుళ్లు పండాయి. తమ ఇంటి కోసం, బంధువులకు వినియోగించారు. సజ్జ పక్షులు తిన్నాయి. కంది, ఆముదం పంటలు కోయాల్సి ఉంది. పంటలకు నీరు పోస్తున్నందున మొక్కల మధ్యన 3 అడుగుల ఖాళీలో గడ్డి పెరుగుతోంది. ఆ గడ్డిని కోసి ఆవులు, గేదెలకు వేస్తున్నారు. డ్రాట్ ప్రూఫింగ్ మోడల్ పంటలతో వదిలేసిన భూమిని దుక్కి చేయకుండానే.. పంటలు పెట్టుకునే చోట తవ్వి విత్తనాలు పెట్టుకొని తిరిగి సాగులోకి తెచ్చుకోవచ్చని, ఎంతో కొంత పంట దిగుబడి తీసుకోవచ్చని రంగస్వామి అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రంగస్వామి పొలంలో వానపాముల సంఖ్య పెరిగింది. నేల గుల్లబారి మృదువుగా తయారవడంతో వర్షాలు తగ్గినా పంట పెరగుదల బాగా కనిపిస్తోంది. రంగస్వామి ప్రకృతి వ్యవసాయం చూసి రంగస్వామి (88869 60609) తండ్రి కూడా ప్రకృతి వ్యవసాయం చేపట్టడం విశేషం. -
ఈ వేసవిలో పంటలు, పశు పోషక రక్షణ ఎలా?
ఈ వేసవిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5–8 డిగ్రీల సెల్షియస్ మేరకు ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ప్రచండ వడగాడ్పులు వీచే సూచనలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలు, తోటలను సాగు చేసే రైతులు, పశు పోషకులు గత వేసవిలో కన్నా అధికంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన ఉష్ణోగ్రతల వలన పంట పెరుగుదల, దిగుబడి గణనీయంగా తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలో పెరుగుదల మందగించడం, పురుగులు, తెగుళ్ళు పెరగడం, ఆకులు మాడిపోవడం, పువ్వులు, పండ్లు రాలిపోవడంతో పాటు పండ్ల పరిమాణంలో తగ్గుదల కనిపిస్తుంది. వేడి వాతావరణం వలన పాలు ఇచ్చే పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 0.5 నుండి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పశువులు ఎక్కువగా నీటిని తీసుకొని తక్కువ మేత తినడం వలన పాల దిగుబడి 11 శాతం వరకు తగ్గుతుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను, పండ్ల తోటలను కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు. పంటల నిర్వహణ.. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల వంగడాలను, రకాలను ఎంచుకోవాలి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి తడులు ఇచ్చుకోవాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్రాంతాల్లో తేమ సున్నిత దశల్లో పంటకు నీటి తడులు ఇవ్వాలి. వరి పంటలో పొట్ట, పూత దశల్లో (10 శాతం వెన్ను నుండి పూత బయటకు వచ్చినప్పుడు) 0.5% కె.ఎన్.03 పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు. వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. ఎత్తున నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుంచి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెం.మీ. లేదా 5 సెం. మీ. నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువ ఉన్నప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. మొక్కజొన్న పంట పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కాబట్టి, రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి. పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు.. నీటి వసతి అధికంగా ఉన్నప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే, ఒక రోజుకు ఒక చెట్టుకు 150–240 లీటర్ల నీరు అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రియ పదార్థాలైన గడ్డి తదితర పదార్థాలతో మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన (మల్చింగ్) చేయటంతో పాటు బిందు సేద్యానికి ్రపాధాన్యత ఇవ్వాలి. ఆచ్ఛాదన చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి, మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరి గడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రియ పదార్థాలు లేదా పాలిథిన్ షీట్లను మొక్కల మొదళ్ళ చుట్టూ కప్పాలి. మామిడి తోటలో ఏప్రిల్ – మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్ (13–0–45) మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. బెట్ట పరిస్థితుల్లో నల్లి (మైట్) ఉధృతి పెరుగుతుంది. నివారణకు 30 మి.లీ. డైకోఫోల్ లేదా 20 మి.లీ. ్రపొపారై్గట్ లేదా 20 మి.లీ. ఇథియాన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఒకటి లేదా రెండేళ్ల వయస్సు గల పండ్ల తోటలు లేదా కొత్తగా నాటిన తోటల చుట్టూ వేసవిలో వడగాల్పుల ప్రభావం తగ్గించడానికి సరుగుడు లేదా వెదురు మొక్కలను నాటుకోవాలి. కూరగాయ తోటల్లో ఏం చేయాలి? అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి. తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షిచుకోవచ్చు. బిందు సేద్యం చేసే పంటల్లో ప్రతి రోజూ అరగంట (ఉదయం, సాయంత్రం) 2సార్లు నీరివ్వాలి. ప్రధాన పంటపై వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి, మొక్కజొన్నను 3–4 వరుసల సరిహద్దు పంటగా వేసుకోవాలి. ప్రతి 20–25 మీటర్ల దూరంలో అంతర పంటగా వేసుకోవాలి. 50% షేడ్ నెట్‌ను వాడి పంటలపై అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. కోళ్ళు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లల్లో ఫ్యాన్లను, ఫాగర్లను అమర్చాలి. షెడ్లను వరి గడ్డితో కప్పి స్ప్రింక్లర్లు అమర్చాలి. కోళ్ళు ఎక్కువ మోతాదులో దాణా తినటం కోసం మెత్తటి దాణాతో పాటు చల్లని తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. – డా. లీలారాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్. పశువులను కాపాడేదెలా? వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వల్ల ఉష్ణతాపానికి గురై పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు తీవ్ర అసౌకర్యానికి, అనారోగ్యానికి లోనుకావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. కాబట్టి, పశుపోషకులు, గొర్రెలు– మేకల పెంపకదారులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని పశువులు, గొర్రెలు మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిని పాటించడం ద్వారా ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల సంరక్షణ ఇలా.. అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువులు సరిగా నడవలేక, తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు రావచ్చు. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన పశువుల్లో దాహం పెరుగుతుంది. తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణించే ప్రమాదం ఉంటుంది. పశువుల మేపు.. వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలో వేర్వేరుగా ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉ. పూట 6 నుంచి 10 గంటల వరకు, సా. 5 నుండి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది. వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగునీరు తాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లవేళలా మంచి చల్లని తాగునీరు ఇవ్వాలి. అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి. వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స.. వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి. తల నుదుటి మీద మంచుముక్కలు ఉంచాలి లేదా చల్లని గోనె సంచిని దానిపై క΄్పాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తగిన చికిత్స చేయించాలి. – డా. జి. మంజువాణి, సంచాలకులు, పశువైద్య, పశు సంవర్థక శాఖ, హైదరాబాద్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బోరు బావుల రీచార్జ్‌తో నీటి భద్రత! 22న వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ వెబినార్ గత వానాకాలంలో రుతుపవనాల వైఫల్యం వల్ల భూగర్భంలోకి వాన నీరు సరిగ్గా ఇంకకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేకప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాయి. కాలువ కమాండ్ ఏరియాల్లో సైతం పొలాల్లో, నివాసప్రాంతాల్లో కూడా పలువురు ఇప్పటికే కొత్త బోరు బావులు తవ్వుతున్నా, చాలా వాటిల్లో ఆశించినంతగా నీరు లభించని పరిస్థితి. ఎండిపోయిన బోరు బావులు, కొద్దొగొప్పో నీరు పోస్తున్న బోరు బావుల చుట్టూ వాన నీటి ఇంకుడు గుంత (రిచార్జ్ పిట్)ను నిర్మించుకోవటం ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవటమే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం. వీటిని నిర్మాణం ద్వారా ఈ ఎండాకాలంలోనూ కురిసే అకాల వర్షాలకు వృథాగా పోయే నీటిని సమర్థవంతంగా బోర్ల దగ్గరే భూమిలోకి ఇంకింపజేసుకోవచ్చు. అయితే, వాననీటిని ఇంకింపజేసే ఇంకుడు గుంత నిర్మాణానికి ఎండిపోయిన బోర్లన్నీ పనికిరావు. ‘ట్యాంకర్ టెస్ట్’ చేసి నిర్థారించుకోవాల్సి ఉంటుంది. ఈ అత్యాధునిక బోర్వెల్ రీచార్జ్ టెక్నిక్‌ను సికింద్రాబాద్‌లోని ‘వాటర్ అండ్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (డబ్ల్యూ.ఎల్.ఎఫ్.)’ గత 14 ఏళ్లుగా ప్రజలకు అందిస్తోంది. ఈ అంశంపై రైతులకు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు డబ్ల్యూ.ఎల్.ఎఫ్. ఈ నెల 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తెలుగులో ఉచితంగా వెబినార్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యూ.ఆర్.కోడ్ ద్వారా స్కాన్ చేసి గూగుల్ ఫామ్ ద్వారా పేర్లను ఈ నెల 18 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి వాట్సప్ ద్వారా వెబినార్ లింక్ పంపుతారు. ప్రవేశం ఉచితం. రూ.200 చెల్లించిన వారికి బోర్ల వద్ద వాన నీటి సంరక్షణపై ఆంగ్ల పుస్తకాన్ని పంపుతారు. వివరాలకు.. సీనియర్ జియాలజిస్ట్ రామ్మోహన్ – 94401 94866, 040 27014467. 16, 17న సేంద్రియ రైతులతో ముఖాముఖి! హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో గ్రామభారతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో నాబార్డ్ తోడ్పాటుతో సేంద్రియ వ్యవసాయ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన ‘కిసాన్ ఎక్స్పో’ 2వ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సామ ఎల్లారెడ్డి తెలిపారు. ఆరోగ్యదాయక సేద్యం చేస్తున్న గ్రామీణ సేంద్రియ/ ప్రకృతి వ్యవసాదారులను, వారి ఉత్పత్తులను ప్రత్యక్షంగా నగరవాసులకు పరిచయం చేయటం కోసం వినియోగదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించటం ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రకృతి సేద్య రంగ ప్రముఖులు డా. జీవీ రామాంజనేయులు, విజయరామ్, కొప్పుల నరసన్న తదితరులు అతిధులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 97040 66622. ఇవి చదవండి: Dr Supraja Dharini: తాబేలు గెలవాలి -
సాగుబడి: విపత్తులకూ వివక్షే..!
'అధిక ఉష్ణోగ్రత, వరదలు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినటం వల్ల గ్రామీణ రైతాంగం వ్యవసాయక ఆదాయాన్ని పెద్ద ఎత్తున నష్టపోతుంటారని మనకు తెలిసిందే. అయితే, ఇందులో ఏయే వర్గాల వారు ఎక్కువగా నష్టపోతున్నారన్నది ఆసక్తి కరమైన ప్రశ్న. ఈ దిశగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చేసిన తొట్టతొలి పరిశోధనలో మహిళలు, యువత సారధ్యంలోని రైతు కుటుంబాలకే ఎక్కువని తేలింది!' పురుషాధిక్యతతో పాటు వాతావరణ మార్పులు తోడై విపత్తుల వేళ మహిళా రైతు కుటుంబాలకు అధికంగా ఆదాయ నష్టం కలిగిస్తున్నాయని ఈ అధ్యయనం తేల్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘అన్జస్ట్ క్లైమెట్’ శీర్షికతో ఎఫ్.ఎ.ఓ. ఈ నివేదికను వెలువరించింది. విపరీతమైన వాతావరణ సంఘటనలకు తట్టుకునే, ప్రతిస్పందించే సామర్థ్యంలో హెచ్చు తగ్గులే ఈ అసమానతకు కారణమని తేల్చింది. భారత్ సహా 24 అల్పాదాయ, మధ్య తరహా ఆదాయ దేశాల్లో ఈ అధ్యయనం జరిగింది. ఈ దేశాల్లో 95 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే లక్ష గ్రామీణ కుటుంబాల నుంచి సామాజిక ఆర్థిక గణాంకాలను సేకరించి, గత 70 ఏళ్లలో విపత్తుల గణాంకాలతో పాటు విశ్లేషించారు. వాతావరణ విపత్తుల వల్ల పురుషుల సారధ్యంలోని కుటుంబాల కంటే మహిళల నేతృత్వంలోని కుటుంబాలకు వ్యవసాయ ఆదాయ నష్టం ఎక్కువగా ఉందని ఒక కొత్త నివేదిక ఎత్తిచూపింది. పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలతో పోల్చితే, మహిళలు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాలు అధికోష్ణం ఒత్తిడి కారణంగా 8 శాతం, వరదల కారణంగా 3 శాతం ఎక్కువ నష్టాలను చవిచూస్తున్నాయి. అదేవిధంగా, పురుషులు కుటుంబ పెద్దగా ఉన్న కుటుంబాల్లోనూ.. పెద్దల నేతృత్వంలోని కుటుంబాలతో పోల్చితే 35 ఏళ్లు నిండని యువకుల నాయకత్వంలోని కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయ ఆదాయం కోల్పోతున్నాయని ఎఫ్.ఎ.ఓ. గుర్తించింది. సామాజికంగా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న గ్రామీణ ప్రజలకు వాతావరణ సంక్షోభం ద్వారా ఎదురయ్యే సవాళ్ల ప్రభావం సంపద, లింగం, వయస్సు భేదాల కారణంగా ఎలా ఉందనే ఖచ్చితమైన ఆధారాలను అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. మహిళల నేతృత్వం వహించే కుటుంబాలకు అధిక వేడి వల్ల 83 డాలర్లు, వరదల కారణంగా 35 డాలర్ల మేరకు తలసరి నష్టం జరుగుతోంది. 24 దేశాల్లో మొత్తంగా అధిక వేడి వల్ల 3700 కోట్ల డాలర్లు, వరదల వల్ల 1600 కోట్ల డాలర్ల మేరకు నష్టం జరుగుతోందని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కేవలం 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే, పురుషులతో పోలిస్తే మహిళా రైతులు తమ వ్యవసాయ ఆదాయంలో 34 శాతం ఎక్కువ నష్టాన్ని చవిచూస్తారు. ఇవీ కారణాలు.. మహిళా రైతులు కుటుంబ సభ్యుల సంరక్షణ, గృహ బాధ్యతలు వంటి అనేక వివక్షతతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అసమానత భారం, భూమిపై వారికి ఉండే పరిమిత హక్కులు, శ్రమపై నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించే ప్రతికూల పరిస్థితుల వల్ల మహిళా రైతులు వత్తిడికి గురవుతున్నారు. పంటల సాగులో మహిళా రైతులు ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్ల కారణంగా పంటల ఉత్పాదకతలో, స్త్రీ పురుషుల మధ్య వేతనాలలో వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారణంగానే వాతావరణ సంక్షోభకాలాల్లో వీరు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటిని ప్రభుత్వాలు పరిష్కరించకపోతే, వాతావరణ సంక్షోభం వల్ల రాబోయే కాలంలో ఈ అంతరాలు బాగా పెరిగిపోతాయని ఎఫ్.ఎ.ఓ. హెచ్చరించింది. 68 దేశాల్లో వ్యవసాయ విధానాలను ఎఫ్.ఎ.ఓ. గత ఏడాది విశ్లేషించగా.. దాదాపు 80 శాతం విధానాల్లో మహిళలు, వాతావరణ మార్పుల ఊసే లేదు! వాతావరణ సంక్షోభకాలంలో గ్రామీణులకు రక్షణ కల్పించే పథకాలపై అధికంగా పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వాలకు ఎఫ్.ఎ.ఓ. సూచిస్తోంది. ఇవి చదవండి: డాక్టర్ గీతారెడ్డి బోర: స్టార్టప్ దిశగా అంకురం! -
Sagubadi: చౌడు సాగుకు చేదోడు కొత్త బ్యాక్టీరియా!
'సాధారణ వరి వంగడాల పంటకు ఉప్పు నీరు తగిలితే ఆకులు పసుపు రంగులోకి మారిపోయి, ఎదుగుదల లోపించి, దిగుబడి తగ్గిపోతుంది. అయితే, కేరళ తీరప్రాంతంలో లోతట్టు మాగాణుల్లో ఉప్పు నీటిలోనూ పొక్కలి వరి వంగడం చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. ఇందుకు దోహదపడుతున్న మట్టి మర్మమేమిటి? అని అల్లాపుఝలోని సనాతన ధర్మ కాలేజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేసి ఓ సరికొత్త బ్యాక్టీరియాను కనుగొన్నారు. పొక్కలి రకం వరి సాగయ్యే సేంద్రియ పొలాల్లోని మట్టిలో ఉండే సూడోమోనాస్ తైవానెన్సిస్ (పికె7) వల్లనే ఉప్పు నీటిని ఆ పంట తట్టుకోగలుగుతోందని వారు తేల్చారు.' కుట్టనాడ్ ప్రాంతంలో విస్తారంగా సాగయ్యే యుఎంఎ అనే రకం వరికి ఉప్పునీటి బెడద ఎక్కువైన నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. పికె7తో పాటు పంట పెరుగుదలకు దోహదం చేసే రైజోబ్యాక్టీరియా (ఎస్.టి.–పిజిపిఆర్లు) కూడా వాడి యుఎంఎ రకం వరిని ప్రయోగాత్మకంగా సాగు చేసి చూశారు. ఈ బ్యాక్టీరియాలు వాడి సాగు చేస్తే హెక్టారుకు 7,595 కిలోల ధాన్యం దిగుబడి వస్తే.. వాడకుండా సాగు చేస్తే హెక్టారుకు 7,344 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే.. పికె7 బ్యాక్టీరియా ఉప్పు వల్ల కలిగే ప్రతికూలతను తట్టుకొని వరి పంట నిలబడే వ్యవస్థను సృష్టిస్తోందని అర్థమవుతోందని పరిశోధకులు నిర్థారణకు వచ్చారు. 2022 డిసెంబర్ – ఏప్రిల్ 2023 మధ్య కాలంలో జరిగిన ఈ అధ్యయన వివరాలతో కూడిన వ్యాసం జర్నల్ ఆఫ్ అగ్రానమీ అండ్ క్రాప్ సైన్స్‌లో ప్రచురితమైంది. మన చౌడు భూముల్లోనూ వరి, తదితర పంటల సాగుకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందేమో మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. 'పొక్కలి’ పొలంలో మట్టి సేకరణ 67.3 లక్షల హెక్టార్లలో చౌడు సమస్య.. మన దేశంలో చౌడు బారుతున్న నేలల (సాల్ట్–ఎఫెక్టెడ్ సాయిల్స్) విస్తీర్ణం ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కు చెందిన కేంద్రీయ చౌడు నేలల పరిశోధనా సంస్థ (సిఎస్ఎస్ఆర్ఐ) ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 67 లక్షల 30 వేల హెక్టార్ల సాగు భూమి చౌడుబారింది. 2050 నాటికి ఇది రెట్టింపవుతుందని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. భూములు చౌడుబారటం వల్ల మన దేశంలో ఏటా 1.68 కోట్ల టన్నుల పంట దిగుబడిని నష్టపోతున్నాం. ఈ పంట విలువ రూ. 23 వేల కోట్లు (2015 నాటి ధరల ప్రకారం). చౌడు భూముల్లో పంటలు బతకవు. బతికినా పెద్దగా పెరిగి దిగుబడినివ్వవు. వ్యవసాయోత్పత్తిని దెబ్బతీయటమే కాదు సాంఘిక–ఆర్థిక స్థితిగతులను సైతం చౌడు సమస్య అతలాకుతలం చేస్తుంది. మురుగునీటి పారుదల సదుపాయం సమర్థవంతంగా లేకపోవటం, భూముల్లో అతిగా నీరు నిల్వ ఉండిపోవటం ఇందుకు ప్రధాన కారణాలు. రసాయనిక ఎరువులు విచ్చలవిడిగా వాడటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులు, పంటలకు అందించే భూగర్భ జలాల నాణ్యత నాసికరంగా ఉండటం కూడా తోడవుతున్నాయి. చౌడు సమస్య మన దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఏటా వీరికి కలుగుతున్న నష్టం 630 కోట్ల డాలర్లని అంచనా. వంద దేశాల్లో 83.5 కోట్ల హెక్టార్ల భూమి చౌడుబారిన పడింది. ఇందులో మనుషుల పనుల వల్ల చౌడువారిన భూములు 7.6 కోట్ల హెక్టార్లు ఈ నేపధ్యంలో కేరళలో కనుగొన్న కొత్త సూక్ష్మజీవి చౌడు భూముల సాగులో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశిద్దాం..! 13న బయోచార్ సొసైటీ ఆవిర్భావం! కట్టె పులల్ల నుంచి పర్యావరణ హితమైన బయోచార్ (బొగ్గుపొడి) ఉత్పత్తిని, వాడకాన్ని పెంపొందించే సదుద్దేశంతో భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. బొగ్గుపొడి సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతుంది. దీంతో పాటు నీటి శుద్ధి, పారిశుద్ధ్యం తదితర అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బయోచార్‌కు కార్బన్ క్రెడిట్స్ చేకూర్చే పరిస్థితులు ఉండటంతో జీవనోపాధులను పెంపొందించడానికి కూడా ఇది దోహదపడనుంది. ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5–7 గంటల మధ్య హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఎన్.ఐ.–ఎం.ఎస్.ఎం.ఇ. కార్యాలయ ఆవరణలో బయోచార్ సొసైటీ ఆవిర్భావ సభ జరగనుంది. ఆర్.కె. మెహతా చైర్మన్‌గా, డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి ప్రెసిడెంట్‌గా, ఎస్.కె. గు΄్తా కార్యదర్శిగా భారతీయ బయోచార్ సొసైటీ ఆవిర్భవిస్తోంది. వివరాలకు.. 6305 171 362. 1 నుంచి పల్లెసృజన శోధా యాత్ర.. గ్రామీణుల్లో నిగూఢంగా దాగి ఉన్న తరతరాల జ్ఞానాన్ని శోధించడానికి, ప్రకృతితో మమేకమైన వారి జీవన విధానం గురించి తెలుసుకోవడానికి కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి గ్రామం నుంచి గన్నారం గ్రామం వరకు చిన్న శోధాయాత్ర నిర్వహించనున్నట్లు పల్లెసృజన సంస్థ అధ్యక్షులు బ్రిగేడియర్ పోగుల గణేశం తెలిపారు. మార్చి 1 నుంచి 3 వరకు జరిగే ఈ యాత్రలో రూ.500 రుసుము చెల్లించి ఆసక్తిగల వారెవరైనా ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర వివరాలకు.. 98660 01678, 99666 46276. నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్! -
Sagubadi: ఎక్కడి నుంచైనా.. మోటర్ ఆన్, ఆఫ్!
'రైతులు ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బంది. ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ పరికరం ద్వారా ఫోన్‌తో బోర్ మోటర్‌ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో తయారైన ఎంబెడ్డెడ్ స్టార్టర్ ఇది. దొంగల భయం లేని ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్న రైతులు..' వరి, మొక్కజొన్న, మిర్చి.. ఇలా పంట ఏదైనా సమయానికి సాగు నీటిని అందించటం ముఖ్య విషయం. స్వయంగా పొలానికెళ్లి మోటారు స్విచ్ ఆన్, ఆఫ్ చేయటం సాధారణంగా రైతు చేసే పని. అయితే, ఏదైనా పని మీద రైతు ఊరికి వెళ్లాల్సి వస్తే.. పక్క పొలంలో రైతును బతిమాలుకొని పంటలకు నీళ్లు పెట్టేందుకు మోటర్ ఆన్, ఆఫ్ చేయించేవారు. ఇప్పుడు అలా ఎవర్నీ ఇబ్బంది పెట్టక్కర్లేదు, రైతు ఇబ్బంది పడక్కర్లేదు. ఎందుకంటే, రైతు ఎంత దూర ప్రాంంతం వెళ్లినా సరే ఫోన్ నెట్వర్క్ ఉంటే చాలు.. మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పుడు అంటే అప్పుడు బోర్ మోటర్‌ను ఆన్ చేసుకోవచ్చు, పని పూర్తయ్యాక ఆఫ్ చేసుకోవచ్చు. న్యాస్త అనే స్టార్టప్ కంపెనీ వారు అత్యాధునిక సాంకేతికతతో విలక్షణ స్టార్టర్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట జిల్లాలో చిన్నకోడూరు మండలంలో పలువురు రైతులు దీన్ని వినియోగిస్తున్నారు. ఈ పరికరాన్ని మోటారు వద్ద అమర్చుకోవడం వలన ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా మోటర్‌ను ఆన్ చేసుకునే వెసులుబాటు ఏర్పడటంతో తమకు చాలా ఇబ్బందులు తప్పాయంటున్నారు రైతులు. నలుగురు యువ విద్యావంతులు స్థాపించిన ‘న్యాస్త’ స్టార్టప్ కంపెనీ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ (నార్మ్) ఎ–ఐడియాలో ఇంక్యుబేషన్ సేవలు పొంది రూపొందించిన ఈ పరికరంలో మొబైల్లో మాదిరిగానే ఒక సిమ్ కార్డు ఉంటుంది. దాని ద్వారా మెసేజ్ రూపంలో పొలంలో నీటి మోటర్‌కు సంబంధించిన సమాచారం.. అంటే మోటర్‌కు నీరు సరిగ్గా అందుతోందా? విద్యుత్తు ఓల్టేజి ఎంత ఉంది? మోటర్ నీటిని సరిగ్గా ఎత్తిపోస్తోందా లేదా? వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతు మొబైల్‌కు మెసేజ్‌లు వస్తాయి. సంవత్సరానికి ఒక్కసారి ఈ సిమ్‌కు రీచార్జి చేయిస్తే సరిపోతుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండే ఎక్కడి నుంచైనా మోటర్‌ను ఆఫ్, ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నీరు లేకపోయినా, విద్యుత్తు హెచ్చుతగ్గులు వచ్చినా మోటర్ స్విచ్ ఆఫ్ అయిపోయి.. రైతుకు మొబైల్లో సందేశం వస్తుంది. ఉపయోగాలెన్నో.. ఎప్పుడు కావాలంటే అప్పుడు (అడ్హాక్ మోడ్) న్యాస్త మొబైల్ యాప్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏయే వేళ్లల్లో మోటర్ నడవాలి (ఇంట్రవెల్స్ మోడ్)?: భూగర్భంలో నీరు తక్కువగా ఉన్న చోట నిరంతరంగా బోర్లు నడిపితే కాలిపోతాయి. విద్యుత్తు ప్రసారం ఉండే సమయాలకు అనుగుణంగా మోటర్‌ను ఏ సమయానికి ఆన్ చెయ్యాలి? ఏ సమయానికి ఆఫ్ చేయాలి? అని టైమ్ సెట్ చేస్తే చాలు. ఆ ప్రకారంగా అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. షెడ్యులర్ మోడ్: ప్రతి రోజు ఒకే సమయంలో ఆన్ అయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా టైం ఫిక్స్ చేసుకోవడం వలన ప్రతి రోజు పంటలకు సాగు నీళ్లు తగిన మోతాదులో అందించే అవకాశం ఉంటుంది. దొంగల భయం లేదు.. వరి, కూరగాయలు, పామాయిల్, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్న 117 మంది రైతులు ఈ స్టార్టర్ ద్వారా లబ్ధిపొందుతున్నారని న్యాస్త స్టార్టప్ సహ వ్యవస్థాపకులు భార్గవి (83673 69514) తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)తో పాటు క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీతో ఈ ఎంబెడ్డెడ్ స్టార్టర్ పనిచేస్తుంది. అందువల్ల పొలంలో నుంచి ఎవరైనా ఇతరులు దీన్ని దొంగతనంగా తీసుకెళ్లినా వారు వినియోగించలేరని, దాన్ని ఆన్ చేయగానే మొబైల్ నెట్వర్క్ ద్వారా దాని లొకేషన్ ఇట్టే తెలిసిపోతుందని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. ఓవర్ ద ఎయిర్ (ఒ.టి.ఎ.) సర్వర్ ద్వారా ఈ స్టార్టర్లను తాము నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటామని, సాంకేతికంగా అప్డేట్ చేయటం చాలా సులభమన్నారు. రైతు ఒక్క సిమ్ ద్వారా అనేక మోటర్లను వాడుకోవటం ఇందులో ప్రత్యేకత అని ఆమె వివరించారు. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్ధిపేట ఈ పరికరం లేకపోతే వ్యవసాయమే చేయకపోదును! 8 ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నా. పొలానికి సుమారుగా 600 మీటర్ల దూరం నుంచి సాగు నీరు సరఫరా చేస్తున్నా. దూరంలో బోర్ ఉండటంతో పైప్‌లు చాలా సార్లు ఊడిపోతుండేవి. అప్పుడు మోటర్‌ను బంద్ చేసేందుకు అంత దూరం నడచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారానే మోటర్‌ను ఆన్, ఆఫ్ చేస్తున్నా. సెల్‌ఫోన్‌తో బోర్ మోటర్ ఆఫ్, ఆన్ చేయడం అందుబాటులోకి రావడంతో చాలా ఇబ్బందులు తప్పాయి. ఈ పరికరం లేకపోతే నేను వ్యసాయం కూడా చేయకపోదును. – నాగర్తి తిరుపతి రెడ్డి (94415 44819), మాచాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా ఊరికి వెళ్లినా ఇబ్బంది లేదు.. ఊరికి వెళితే పంటలకు నీళ్లు పెట్టాలంటే ఇబ్బందులు ఉండేవి. పక్కన రైతును బతిమిలాడుకునే వాళ్లం. అదే ఇప్పుడు న్యాస్త స్టార్టర్‌తో ఎక్కడికైనా ఫంక్షన్‌కు, ఊరికి సంతోషంగా వెళ్లి వస్తున్నా. అక్కడి నుంచే మోటర్‌ను సెల్ఫోన్లో నుంచే ఆన్, ఆఫ్ చేస్తున్నా. ఇది ఎంతో ఉపయోకరంగా ఉంది. – పంపరి సత్తయ్య (9989385961), చిన్నకోడూరు, చిన్నకోడూరు మండలం, సిద్ధిపేట జిల్లా నిర్వహణ: – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: Dr Anandi Singh Rawat: అర్థం చేసుకోవడం ముఖ్యం -
ప్రతిష్టాత్మక అగ్రి షో ‘కిసాన్ 2024’ను ప్రారంభించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో ‘కిసాన్ 2024’ 2వ ఎడిషన్‌ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోనే అతిపెద్ద అగ్రి షో - కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదిక పైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1వ నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారించింది. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024.. వ్యవసాయ పరిశ్రమలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తోంది. ఎగ్జిబిషన్లో వ్యవసాయ యంత్రాలు-పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్-ఇరిగేషన్ సొల్యూషన్స్, ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు(టూల్స్), ఐఓటీ ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్స్‌తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతలు, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్ మొబైల్ యాప్‌లు సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు. ఈ అద్భుత వ్యవసాయ ప్రదర్శనలో 140 మందికి పైగా ఎగ్జిబిటర్లు, అగ్రి పరిశ్రమల ప్రముఖుల నుండి ఇన్నోవేటివ్ స్టార్టప్‌ల వరకు పాల్గొన్నారు. ఈ వేదికపై వ్యవసాయానికి అనుకూలమైన తాజా ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ 12,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి 140కి పైగా కంపెనీలను, 20,000 మంది సందర్శకులను కలుపుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. "కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులను విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను, ప్రోత్సాహాకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు." 3 రోజుల అగ్రి షో నేపథ్యంలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్లను అందించడానికి ఏకకాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్లో సమగ్ర ప్రదర్శన, సమాచార సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో తాజా పురోగతులు, ఉత్పత్తులు, సేవలను అన్వేషించే అవకాశాన్ని హాజరైన వారికి అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల నుండి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే! -
మూడేళ్లుగా ముందుకుసాగని పథకం.. విత్తనోత్పత్తికి అంతరాయం!
రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు. పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు.. కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది. దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది. ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం! -
బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!
మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వరకు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం. స్ప్రింక్లర్లతో సాగు చేస్తున్న కొత్తిమీర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇవి చదవండి: ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు! -
ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!
రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే.. వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం. విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది. రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ విత్తన శుద్ధి.. విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి. ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి. విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పొలం తయారీ, విత్తే పద్ధతి.. నేలను 4–5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి. పోషకాల యాజమాన్యం.. 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు. మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి. పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి. పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి. మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి. పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి. రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి. అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి. దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. భూసార యాజమాన్యం ఇలా.. దబోల్కర్ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి. -
‘చిరు’ యంత్రాల ఫౌండేషన్!
టేబుల్ టాప్ హల్లర్: దేశంలోనే తొలి ‘స్మాల్ మిల్లెట్ టేబుల్ టాప్ ఇంపాక్ట్ హల్లర్ వి3’ ఇది. చిన్న చిరుధాన్యాల పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే చిన్న యంత్రం ఇది. బరువు 30 కిలోలు. ముప్పావు మీటరు ఎత్తు, అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు ఉంటుంది. ఇంట్లో చిన్న టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైనది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. అతి తక్కువ 0.5 హెచ్ పి విద్యుత్తుతో పనిచేస్తుంది. సింగిల్ ఫేజ్ విద్యుత్తు లేదా సౌర విద్యుత్తు లేదా పెట్రోలు మోటారుతోనూ నడుస్తుంది. 90% సామర్థ్యంతో పనిచేస్తుంది. ఒకసారి మర పడితే 10% మెరికలు వస్తాయి. రెండోసారి మళ్లీ మరపడితే వంద శాతం బియ్యం సిద్ధమవుతాయి. చిరుధాన్యం రకాన్ని బట్టి గంటకు 30 నుంచి 80 కిలోల ధాన్యాన్ని మర పట్టొచ్చు. ఏ రకం చిన్న చిరుధాన్యాన్నయినా ఈ యంత్రానికి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే మర పట్టుకోవచ్చు. అర కేజీ ధాన్యం ఉన్నా సరే దీన్ని ఉపయోగించవచ్చు. తక్కువ శబ్దం చేస్తుంది. 2 గంటల తర్వాత ఓ గంట విరామం ఇవ్వాలి. దీని ధర రూ. 88 వేలు (18% జిఎస్టీ అదనం). కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిన్న చిరుధాన్యాల (స్మాల్ మిల్లెట్స్) ధాన్యాన్ని వండుకొని తినాలంటే పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్వం దంపుకొని చిరుధాన్యాల బియ్యం తయారు చేసుకునే వారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. కొన్ని సంవత్సరాలుగా మిక్సీలను ఉపయోగించి ఇంటి స్థాయిలో మిల్లెట్ బియ్యం తయారు చేసుకోవటం ప్రారంభమైంది. అయితే, మిక్సీకి ఉన్న పరిమితుల దృష్ట్యా వాణిజ్య దృష్టితో చిన్న చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యా΄ారులు యంత్రాలను ఆశ్రయించక తప్పట్లేదు. యంత్రాల ధర అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్ పెద్ద సంస్థలు, కంపెనీలకే పరిమతం అవుతూ వచ్చింది. ఇది గ్రామాల్లో పేద రైతులు, మహిళా బృందాలు, చిన్న వ్యా΄ారులకు ఈ ప్రక్రియ పెద్ద సవాలుగా నిలిచింది. ఈ సవాలును అధిగమించడానికి ఇంటి స్థాయిలో, గ్రామస్థాయిలో మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైన అనేక చిన్న యంత్రాల రూపుకల్పనలో అనేక ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న తమిళనాడుకు చెందిన స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ – ధాన్ – ఫౌండేషన్ అనుబంధ సంస్థ) విజయం సాధించింది. ఈ సంస్థ రూపొదించిన చిన్న యంత్రాల్లో ఒకటి.. దేశంలోనే తొలి ‘టేబుల్ టాప్ డీహల్లర్ మిషన్’. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి ఏ రకం చిరుధాన్యాలతోనైనా, అర కిలో అయినా సరే, ఈ యంత్రంతో బియ్యం తయారు చేసుకోవచ్చు. ఇటువంటివే మనికొన్ని చిన్న యంత్రాలను ఈ ఫౌండేషన్ రూపొందించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన మేలైన సాగు, శుద్ధి, విలువ జోడింపు పద్ధతులు, యంత్రాలపై నీతి ఆయోగ్ ‘మిల్లెట్ సంకలనం’ను న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేసింది. స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు అవసరాల మేరకు తయారు చేసి అందుబాటులోకి తెచ్చిన చిన్న యంత్రాలను ప్రశంసిస్తూ ఒక కథనం ప్రచురించటం విశేషం. నీతి ఆయోగ్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నీలం పటేల్ తదితరులు ఈ సంకలనానికి సం΄ాదకులుగా వ్యవహరించారు. పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ టేబుల్ టాప్ హల్లర్ కన్నా కొంచెం పెద్దది స్మాల్ మిల్లెట్ పోర్టబుల్ ఇంపాక్ట్ హల్లర్ (ఎస్.ఎం.ఎఫ్. వి2). ఇది గంటకు 100 నుంచి 500 కిలోల చిన్న చిరుధాన్యాలను ్ర΄ాసెస్ చేస్తుంది. 1 హెచ్‌పి మోటారుతో త్రీఫేస్ విద్యుత్తుతో పనిచేస్తుంది. బరువు 98 కిలోలు. మీటరు ΄÷డవు, మీటరు ఎత్తు, ము΄్పావు మీటరు వెడల్పు ఉంటుంది. ఎక్కువ గంటల పాటు వాడొచ్చు. మహిళలు సైతం సురక్షితంగా, సులువుగా వాడటానికి అనువైనది. ఎస్.ఎం.ఎఫ్. వి2 ధర రూ. 1,68,000. (18% జిఎస్టీ అదనం). ఈ యంత్రాలపై ఆసక్తి గల వారు తమిళనాడులోని కృష్ణగిరి కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్ మిల్లెట్ ఫౌండేషన్ (ఎస్.ఎం.ఎఫ్.) సాంకేతిక విభాగం ఇన్చార్జ్ శరవణన్‌ను 86675 66368 నంబరులో ఇంగ్లిష్ లేదా తమిళంలో సంప్రదించవచ్చు. 11న దేశీ గోవ్యాధులపై సదస్సు ఫిబ్రవరి 11(ఆదివారం) న ఉ. 7 గం. నుంచి సా. 4 గం. వరకు గుంటూరు జిల్లా కొర్నె΄ాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో దేశీ గో–జాతుల వ్యాధులు, ఇతర సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. దేశీ ఆవుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై గో పోషకులకు అవగాహన కల్పిస్తారు. గోవులకు ఉచిత వైద్య శిబిరంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు 97053 83666. -
Brown Top Millet ఒక్కసారి విత్తితే.. నాలుగు పంటలు!
అండుకొర్ర.. చిన్న చిరుధాన్యా(స్మాల్ మిల్లెట్స్)ల్లో విశిష్టమైన పంట. పంట కాలం 90–100 రోజులు. ధాన్యపు పంట ఏదైనా కోత కోసి, దుక్కి చేసిన తర్వాత మళ్లీ పంట రావాలంటే తిరిగి విత్తనాలు ఎదపెట్టాల్సిందేనని మనకు తెలుసు. అయితే, అండుకొర్ర పంటను రెండేళ్లుగా సాగు చేస్తున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన కె. హేమాద్రిరెడ్డి అనుభవం అందుకు భిన్నంగా ఉంది. 2022 జూౖలై లో తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తనం వేసి, అక్టోబర్‌లో పంట కోసుకున్నారు. నవంబర్‌లో దుక్కిచేసి మినుము చల్లి, నీటి తడి పెట్టారు. అండుకొర్ర వత్తుగా మొలవటంతో ఆశ్చర్యం కలిగింది. అండుకొర్ర కోత కోసే సమయంలో రాలిన ధాన్యమే నెల రోజుల తర్వాత దుక్కి చేసి తడి పెట్టగానే మొలిచిందన్నమాట. మినుము మొలకలు కనిపించినా అవి ఎదగలేకపోయాయి. అండుకొర్ర ఏపుగాపెరిగింది. సరే.. ఇదే పంట ఉండనిద్దామని నిర్ణయించుకొని.. ట్రాక్టర్‌తో సాళ్లు తీసి అండుకొర్ర పంటనే కొనసాగించారు. అదే విధంగా మూడు పంటలు పూర్తయ్యాయి. నాలుగో పంట ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందని, ప్రతి పంటలోనూ ఎకరానికి 10 క్వింటాళ్ల అండుకొర్ర దిగుబడి వస్తోందని, పంట పంటకు దిగుబడి ఏమాత్రం తగ్గలేదని, తక్కువ ఖర్చుతోనే అండుకొర్ర పంట అధికాదాయాన్ని అందిస్తోందని రైతు హేమాద్రి రెడ్డి సంతోషంగా చెప్పారు. అనంతపురంలో ఇటీవల జరిగిన మూడు రోజుల చిరుధాన్యాల సమ్మేళనం ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ‘సాక్షి సాగుబడి’తో తన ఆనందాన్ని పంచుకున్నారు. కదిరికి చెందిన ఎర్త్ 360 సంస్థ వ్యవస్థాపకులు దినేశ్ సూచనలు, సహాలతో చిరుధాన్యాల సాగు చేపట్టానని ఆయన తెలిపారు. కలుపు బాధ లేని అండుకొర్ర పంట 40 ఎకరాల ఆసామి అయిన హేమాద్రిరెడ్డి సాగు భూమిని చాలా కాలంగా కౌలుకు ఇస్తూ వచ్చారు. రెండేళ్ల క్రితం మనుమడి సూచన మేరకు 5 ఎకరాల్లో అండుకొర్ర చిరుధాన్యాల సాగు ్ర΄ారంభించారు. కూలీల కొరతతో ఇబ్బంది అవుతుందని తొలుత సంశయించానని, అయితే అండుకొర్ర పంటకు కలుపు సమస్య లేక΄ోవటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నానని ఆయన అన్నారు. పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేని చక్కని పంట అండుకొర్ర అన్నారాయన. కలుపు మొక్కల కన్నా అండుకొర్ర మొక్కలు వేగంగా పెరుగుతుంది. అందువల్ల కలుపు పెరిగే అవకాశమే లేదన్నారు. దీంతో ప్రయాస లేకుండానే పంట చేతికి వస్తోందని, యంత్రంతో కోతలు జరుపుతున్నారు. ఇప్పుడు మొత్తం 20 ఎకరాలకు అండుకొర్ర సాగును విస్తరించారు. మోళ్లు కలియదున్నుతాం.. దుక్కి చేసిన తర్వాత గొర్రెలను పొలంలో నిల్వగడతారు. గొర్రెల మలమూత్రాలు పొలాన్ని సారవంతం చేస్తాయి. ఆ తర్వాత కలియదున్నిన తర్వాత వరుసల మధ్య 15 అంగుళాలు ఉండే ట్రాక్టర్ గొర్రుతో ఎకరానికి 5 కిలోల అండుకొర్ర విత్తనాలను తొలి ఏడాది విత్తారు. రెండో పంట నుంచి.. పంట కోత తర్వాత మోళ్లను రొటవేటర్‌తో భూమిలో కలియదున్నుతున్నారు. పంట కాలంలో మూడు దఫాలు హంద్రీ నది నుంచి మోటారుతో తోడిన నీటిని పారగడుతున్నారు. నల్లరేగడి నేల కావటంతో ఎక్కువగా తడి ఇవ్వటం లేదని, ఇది మెట్ట పంట కాబట్టి నీరు ఎక్కువ పెడితే రొట్ట పెరుగుతుంది తప్ప దిగుబడి రాదని హేమాద్రి రెడ్డి వివరించారు. గొర్రెలు ఆపటానికి ఎకరానికి రూ. 1,500 ఖర్చవుతోంది. దుక్కి, అంతర సేద్యం అంతా సొంత ట్రాక్టర్‌తోనే చేస్తున్నారు. బయటి ట్రాక్టర్‌తో ఈ పనులు చేస్తే ఎకరానికి పంటకు రూ. 3 వేలు ఖర్చు వస్తుంది. ‘అంతకు మించి చేసేదేమీ లేదు. చీడపీడలు, తెగుళ్ల సమస్య లేదు కాబట్టి పురుగుమందుల పిచికారీ అవసరం రావటం లేద’న్నారాయన. కలుపు, చీడపీడల సమస్యలు లేని, కూలీల అవసరం పెద్దగా లేని అండుకొర్ర పంటను సునాయాసంగా సాగు చేస్తూ.. క్వింటాకు రూ. 9,500 ఆదాయం పొందుతున్నానని హేమాద్రిరెడ్డి తెలిపారు. మిషన్‌తో పంట కోత ఖర్చు, గడ్డి అమ్మితే సరిపోతోందన్నారు. కొర్ర కూడా సాగు చేస్తున్నానని, వచ్చే సీజన్ నుంచి అరికలు కూడా వేద్దామనుకుంటున్నానన్నారు. అండుకొర్ర అద్భుత పంట అద్భుతమైన చిరుధాన్య పంట అండుకొర్ర.. కలుపును ఎదగనివ్వదు. ఈ విత్తనానికి నిద్రావస్థ పెద్దగా ఉండదు. గింజ బాగా తయారైన తర్వాత కోత కోసి నూర్పిడి చేస్తే, వారం రోజుల తర్వాత మొలుస్తుంది. ఒక్కసారి విత్తి వరుసగా నాలుగో పంట తీసుకుంటున్న హేమాద్రిరెడ్డి సాగు అనుభవం రైతులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. పంట కోసిన తర్వాత మోళ్లను భూమిలోకి కలియదున్నటం, గొర్రెలను నిలపటం వల్ల భూమి సారవంతమవుతోంది. మార్కెట్లో అండుకొర్రలు సహా అన్ని చిరుధాన్యాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ధర తగ్గే ప్రమాదం లేదు. దినేశ్ (94408 70875), చిరుధాన్యాల నిపుణుడు, ఎర్త్ 360, కదిరి క్వింటా రూ.9,500 రెండేళ్ల క్రితం తొలిసారి 5 ఎకరాల్లో అండుకొర్ర విత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి పంటా ఎకరానికి పది క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. తొలి పంట క్వింటా రూ. 5 వేలకు అమ్మాను. రెండో పంటను క్వింటా రూ.7,500కు అమ్మాను. గత ఏడాది ఖరీఫ్‌లో మరో 15 ఎకరాల్లో కూడా అండుకొర్ర వేశా. మూడో పంటను క్వింటా రూ. 9,500కు అమ్మాను. నాలుగో పంట కొద్ది రోజుల్లో కోతకు సిద్ధమవుతోంది. రైతులకు విత్తనంగా కూడా ఇస్తున్నాను. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చులు పోగా మంచి నికరాదాయం వస్తోంది. 3 సార్లు నీరు కడుతున్నాం. నీరు ఎక్కువైతే దిగుబడి తగ్గిపోతుంది. ఒక పొలంలో జనుము సాగు చేసి రొటవేటర్ వేస్తే ఆ తర్వాత అండుకొర్ర దిగుబడి ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు వచ్చింది. ప్రయాస లేని పంట అండుకొర్ర. – కె. హేమాద్రిరెడ్డి (92469 22110), అండుకొర్ర రైతు, కోడుమూరు, కర్నూలు జిల్లా -
సెమీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందని మీకు తెలుసా?
'రసాయనిక ఎరువులు, పురుగుమందులు.. జన్యుమార్పిడి విత్తనాలను అస్సలు వాడకుండా పంటలు పండించే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో ‘ఆర్గానిక్’ సర్టిఫికేషన్ గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ‘మంచి వ్యవసాయ పద్ధతుల(జి.ఎ.పి.)’తో పండించే ఆహారోత్పత్తులకు ‘గ్యాప్’ సర్టిఫికేషన్‌కు కూడా అదే మాదిరి గుర్తింపు ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు అమల్లో ఉన్నాయి. ఈ ఆహారోత్పత్తులకు ఆయా దేశాల్లోని వినియోగదారులు, రిటైలర్ల ఆదరణతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంది. ‘గ్లోబల్‌గ్యాప్’కు అనుగుణంగా దేశీయంగా రైతులు, ప్రాసెసింగ్ పరిశ్రమదారులు పాటించవలసిన ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను భారత ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) 2021లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రమాణాలను రైతులకు మొట్టమొదటగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కటం విశేషం. తొలుత ఈ ప్రమాణాలను పాటించటం అలవాటు చేసుకునే రైతులకు.. భవిష్యత్తులో సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లోబల్‌గ్యాప్’, ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు, వాటి ప్రయోజనాల పూర్వాపరాలపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..' ఆహారం ప్రజలకు స్థానికంగా, సరసమైన ధరలో, అందరికీ అందుబాటులో ఉంటే ప్రజలకు ఆహార భద్రత (ఫుడ్ సెక్యూరిటీ) ఉన్నట్లు. ఆ ఆహారం మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని ప్రమాణాలతో పండించి, నిల్వ చేసినదై ఉంటే అది క్షేమదాకమైన ఆహారం (సేఫ్ ఫుడ్). తగుమాత్రంగా రసాయనాలు వాడుతూ, ఇతర జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్ ఫుడ్‌ను పండించడానికి రైతులకు ఉపకరించేవే ‘మంచి వ్యవసాయ పద్ధతులు’. వీటిని ‘గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ (జి.ఎ.పి.– గ్యాప్) అంటారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందినవే ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలు. ఈ ప్రమాణాల ద్వారా రైతుల ఉత్పత్తులకు గిరాకీ పెరిగి, వారి నికరాదాయం పెరుగుతుందని అనుభవాలు చెబుతున్నాయి. పసుపు తోటలో శ్రేష్ట ఎఫ్‌పిసి రైతు నెర్ల విజయేంద్రరెడ్డి ‘గ్లోబల్‌గ్యాప్’ పుట్టుపూర్వోత్తరాలు.. తెలిసో తెలియకో పరిమితికి మించి రసాయనిక ఎరువులు, పురుగుమందులను విచ్చలవిడిగా వాడుతూ పంటలు పండిస్తున్నందు వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కొందరు రైతులు నిషిద్ధ పురుగుమందులను సైతం వాడుతున్నారు. పురుగుమందులు చల్లటానికి, పంట కోతకు మధ్య పాటించాల్సిన వ్యవధిని సైతం పాటించకపోవటం వల్ల విష రసాయనాల అవశేషాలు పరిమితికి ఎన్నో రెట్లు ఎక్కువ కనిపిస్తున్న సందర్భాలు లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు కోసిన తర్వాత కలుషిత నీటిలో కడగటం వంటి, రవాణా, నిల్వ పద్ధతుల్లో కూడా టోకు, చిల్లర వ్యాపారులు నిర్దేశిత ప్రమాణాలు పాటించకపోవటం పరిపాటిగా మారింది. ఇటువంటి సురక్షితం కాని ఆహారోత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మన రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇదే. ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఆహార వ్యవస్థలో గుణాత్మక మార్పులు తేవడానికి యూరప్‌లో చిల్లర వర్తకులు 1997లో ‘యూరోప్గ్యాప్’ పేరుతో మంచి వ్యవసాయ పద్ధతుల అమలుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి కృషి ఫలితంగా మెరుగుపరిచిన ప్రమాణాలు 2007లో ‘గ్లోబల్‌గ్యాప్’ పేరుతో ప్రపంచ దేశాలకు అందుబాటులోకి వచ్చాయి. ధాన్యపు పంటలు, కూరగాయలు, పండ్లు, పూల సాగుతో పాటు ఆక్వా సాగుకు కూడా ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాలు వర్తింపజేస్తున్నారు. పంట పొలాలు, తోటలు, ఆక్వా చెరువుల్లో సాగు పద్ధతుల్లో ప్రతి దశలోనూ.. అదేవిధంగా ఆహారోత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వ, ప్రాసెసింగ్ వ్యవస్థల్లో పాటించాల్సిన ప్రమాణాలను ‘గ్లోబల్‌గ్యాప్’ ప్రమాణాల సంస్థ నిర్దేశిస్తోంది. భారత్ సహా 130 దేశాల్లో ఇప్పటికి 1,95,000 మంది రైతులు గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందారు. 43 లక్షల హెక్టార్లలో రైతులు అందుకు అనుగుణంగా సాగు చేస్తూ.. సాధారణ ఉత్పత్తులతో పోల్చితే అధిక ధరకు అమ్ముకుంటున్నారు. 25 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల చేపలు, రొయ్యలతో పాటు.. 2.1 కోట్ల టన్నుల సర్టిఫైడ్ కాంపౌండ్ ఫీడ్‌ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. టర్కీలో గ్యాప్ ప్రమాణాలు పాటించిన రైతుల పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకం 19–31% మేరకు తగ్గింది. రసాయనిక పురుగుమందుల వాడకం 50%, శిలీంధ్రనాశనులు 25%, కలుపు మందులు 70% తగ్గిందని ఒక అధ్యయనంలో తేలింది. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులు, పెద్ద రైతులు అనుసరించదగిన మంచి వ్యవసాయ పద్ధతులను క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యు.సి.ఐ.) ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను 2021లో ప్రకటించింది. 2023 ఆగస్టులో గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలతో ఇండిగ్యాప్ను అనుసంధానం చేశారు. 180కి పైగా గ్లోబల్‌గ్యాప్ సర్టిఫికేషన్ సంస్థలు అంతర్జాతీయగా రైతులకు సేవలందిస్తున్నాయి. మన దేశంలో ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ విస్తరణ సేవలను వ్యవసాయ, అనుబంధ శాఖల ద్వారా అమలుకు శ్రీకారం చుట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావటం విశేషం. క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గున్వత్తా సంకల్ప్ పథకం కింద ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కార్యక్రమం అమలవుతోంది. తొలి ఏడాది 33 ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఇండ్‌గ్యాప్ అమలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ ఇందుకు తోడ్పడుతోంది. స్పైసెస్‌బోర్డు ద్వారా మిరప, పసుపు తదితర సుగంధ ద్రవ్య పంటల్లో సైతం ఏపీ, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఖర్చుతోనే పరీక్షలు.. ‘ఇండిగ్యాప్’ సర్టిఫికేషన్ పొందే ప్రయత్నాలను దేశంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 2023 ఖరీఫ్ నుంచి ప్రారంభించింది. తొలుత 20 వ్యవసాయ, 13 ఉద్యాన ఎఫ్‌పిసిలకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే కొందరు రైతులు తక్కువ ఖర్చుతో, రసాయనిక అవశేషాల్లేని ఆహారం పండించి రైతులు అధిక ఆదాయం పొందారు. పరిమితికి మించి రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను పండించిన తర్వాత శాంపుల్స్‌ను బెంగళూరు పంపి ప్రభుత్వ ఖర్చులతోనే 200 వరకు రసాయనాలకు సంబంధించి పరీక్ష చేయిస్తున్నాం. ఒక్కో శాంపిల్‌కు రూ. 10–12 వేలు ఖర్చు అవుతోంది. ఏపీలోనే రూ.2.6 కోట్లతో అధునాతన లాబ్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్‌గ్యాప్ సర్టిఫికేషన్ పొందే రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు 130 దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఆర్గానిక్ సర్టిఫికేషన్‌ను రైతులకు అందించడానికి సంబంధించి అపెడా ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన రైతుల బ్రాండెడ్ ఉత్పత్తులను దేశ విదేశాల్లో మంచి ధరకు విక్రయించి అధికాదాయం రాబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. – డా. ఎ. త్రివిక్రమరెడ్డి (97393 16931), డైరెక్టర్, ఏపీ విత్తన, సేంద్రియ ధృవీకరణ అథారిటీ, గుంటూరు రైతుల్లో మార్పు వస్తోంది! మా శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో 300 మంది రైతులు ఉన్నారు. ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ కోసం రూ. 18 వేలు ఫీజు చెల్లించి నమోదు చేసుకున్నాం. మొదటి ఏడాది 24 మంది రైతులు 50 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి 100 మంది రైతులు 500 ఎకరాల్లో పసుపు సాగు చేయించాలన్నది లక్ష్యం. మా రైతులు 10% రసాయనిక ఎరువులు 90% సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. నిషేధిత పురుగుమందులు వాడకుండా ఇండిగ్యాప్ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్న విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తున్నాం. పసుపు పండిన తర్వాత ప్రభుత్వమే పరీక్ష చేయించి, ఇండిగ్యాప్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే దేశ విదేశాల్లో మా ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ కోసం పనిచేస్తున్న మా సభ్య రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ఇండిగ్యాప్ మామిడి, మిరప, అరటి రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అన్ని వివరాలూ మాన్యువల్‌గా నమోదు చేస్తున్నాం. వచ్చే ఏడాది ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి వస్తే వెసులుబాటుగా ఉంటుంది. – ఉయ్యూరు సాంబిరెడ్డి (93969 62345), శ్రేష్ట ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, కొల్లిపర, గుంటూరు జిల్లా చిన్న, సన్నకారు రైతుల కోసం..! విదేశాల్లో రిటైల్ స్టోర్లలో పక్కపక్కనే సాధారణ రసాయనిక వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులు, సేంద్రియ సర్టిఫైడ్ ఆహారోత్పత్తులతో పాటు.. మంచి వ్యవసాయ పద్ధతుల (గ్యాప్) ద్వారా పరిమితంగా రసాయనాలు వాడి పండించిన సర్టిఫైడ్ ఉత్పత్తులు కూడా పక్కపక్కనే పెట్టి అమ్ముతూ ఉంటారు. వినియోగదారులు తమ స్థోమతను బట్టి వాటిని కొనుగోలు చేస్తుంటారు. యూరప్‌లో 1997లో రిటైల్ వర్తకుల చొరవ వల్ల ‘గ్లోబల్‌గ్యాప్’ సర్టిఫికేషన్ ప్రారంభమైంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ‘ఇండిగ్యాప్’ ప్రమాణాలను నిర్దేశించింది. ఈ ప్రమాణాలను ఖచ్చితంగా పాటించటం, సర్టిఫికేషన్ పొందే ప్రక్రియకు సంబంధించిన అంశాలపై మా సంస్థ అనేక రాష్ట్రాల్లో అధికారులు, ఎఫ్‌పిసిలు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం. గతంలో మహారాష్ట్రం, ఏపీలకు చెందిన ద్రాక్ష రైతులకు కూడా శిక్షణ ఇచ్చాం. ఔషధ మొక్కల పెంపకంపై స్పైసెస్ బోర్డు తోడ్పాటుతో రైతులకు శిక్షణ ఇస్తున్నాం. శంషాబాద్‌లో క్షేత్రస్థాయిలో ఇండిగ్యాప్, సేంద్రియ సర్టిఫికేషన్లకు అనుగుణంగా శాస్త్రవేత్తలు, అధికారులు, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇచ్చేందుకు త్వరలో నమూనా క్షేత్రాన్ని నిర్మిస్తున్నాం. ‘ఇండిగ్యాప్’ ప్రమాణాల ప్రకారం రైతులు పంటలు పండించి ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల ద్వారా గ్రూప్ సర్టిఫికెట్ పొందొచ్చు. పరిమితికి మించి రసాయనిక పురుగుమందుల అవశేషాల్లేని మంచి ఆహారానికి ఇటు దేశీయ మార్కెట్లలోగాని, అటు అంతర్జాతీయ మార్కెట్లలో గాని మంచి గిరాకీ ఉంది. రైతులు అధికాదాయం పొందవచ్చు. – కోటెల శ్రీహరి (98480 34740), వ్యవస్థాపకులు, కృషిగ్యాప్ డిజిటల్ సొల్యూషన్స్, హైదరాబాద్, www.krishigap.com – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఆవిష్కర్తలకు ఆత్మీయ దిక్సూచి!
'వ్యవసాయం రైతులకు గిట్టుబాటు కావాలంటే పనిసౌలభ్యంతో పాటు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే యాంత్రీకరణ అత్యవసరం. ఆవిష్కరణలను సాంకేతికంగా, ఆర్థికంగా ప్రోత్సహించినప్పుడే వినూత్న యంత్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. అందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలు దోహదం చేస్తాయి. అటువంటి కేంద్రాల్లో విలక్షణమైనది హైదరాబాద్ పిజెటిఎస్ఎయు ఆవరణలో కొలువుదీరిన అగ్రిహబ్ ఫౌండేషన్. టెక్నీషియన్ల నుంచి గ్రామీణుల వరకు ఎవరైనా అగ్రిహబ్ సేవలను అందుకోవచ్చు.' అగ్రిహబ్.. వ్యవసాయం, ఆహార సంబంధమైన అనుబంధ రంగాల్లో ఇటు సాంకేతిక నిపుణుల ఆవిష్కరణలకు, అటు గ్రామీణ ఆవిష్కర్తలకు మార్గదర్శిగా నిలుస్తున్న సంస్థ. రెండు అంచెల వ్యవస్థగా పనిచేస్తున్న తొలి అగ్రి ఇంక్యుబేటర్ కావటం దీని ప్రత్యేకత. అంతేకాదు, అగ్రిటెక్ స్టార్టప్‌ల ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలో పరీక్షించి, వాటి యోగ్యతను నిర్థారించే విలక్షణ వేదిక అగ్రిహబ్. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవటంలోనూ ఆవిష్కర్తలకు చేదోడుగా నిలుస్తోంది. అర్హులైన ఆవిష్కర్తలకు నాబార్డు గ్రాంట్‌కు సిఫారసు చేస్తోంది. కొన్ని స్టార్టప్‌ల ఆవిష్కరణల్లో ఈక్విటీ ఫండింగ్ సమకూర్చుతోంది. ఆలోచనతో వస్తే చాలు.. సాంకేతిక నిపుణులు, పరిశో«దకులు, విద్యార్థులు వ్యవసాయం, ఆహారోత్పత్తులకు సంబంధించి వినూత్న ఆలోచనతో వస్తే.. ఆ ఆలోచనను ఆచరణాత్మక ఆవిష్కరణగా తీర్చిదిద్దటానికి ఇంక్యుబేషన్ సేవలందిస్తున్నామని అగ్రిహబ్ ఫౌండేషన్ సీఈవో, డైరెక్టర్ విజయ్ నడిమింటి ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ చెప్పారు. ఆవిష్కరణలపై మేధోహక్కులకు పేటెంట్ హక్కులు పొందటానికి కూడా అగ్రిహబ్ తోడ్పడుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఈ సేవలు అందుకోవచ్చు. ఇప్పటి వరకు 350కి పైగా స్టార్టప్‌లకు అగ్రిహబ్ సేవలందించింది. 825 డిజైన్ థింకర్స్‌కు తోడ్పాటునందించింది. 25 స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం నెరపింది. 8 స్టార్టప్‌లు రూపొందించిన డ్రోన్లు, రోబోలు వంటి సాంకేతికతలను క్షేత్రస్థాయిలో వాలిడేట్ చేసింది. గ్రాంట్లు పొందటానికి నలుగురు ఆవిష్కర్తలకు తోడ్పడింది. 8 స్టార్టప్‌లకు ఈక్విటీ ఫండింగ్ అందించింది అగ్రిహబ్. cco@ag-hub.co 040 23014515 -అగ్రిహబ్ సీఈవో విజయ్ ప్రయోగాత్మకంగా సోలార్ సేద్యం! రైతుల వ్యవసాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఉపకరించే అగ్రిటెక్ స్టార్టప్‌ల సాంకేతికతలను పొలాల్లో వినియోగించి, వాటి ప్రయోజకత్వాన్ని ధృవీకరించటం అగ్రిహబ్ ప్రత్యేకత. ఇప్పటికి 8 సాంకేతికతలను వాలిడేట్ చేశారు. ఈ క్రమంలో.. అగ్రి ఫొటో ఓల్టాయిక్ (ఎపివి) సిస్టం వాలిడేషన్ ప్రక్రియ అగ్రిహబ్‌లో గత రబీ కాలం నుంచి కొనసాగుతోంది. పొలాల్లో పంటల సాగుతో పాటే ఏకకాలంలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఈ పద్ధతిని అగ్రివోల్టాయిక్స్ లేదా సోలార్ సేద్యంగా చెప్పుకోవచ్చు. సౌర కాంతిని పంటల సాగుతో పాటు విద్యుత్తు ఉత్పత్తికి కూడా వాడుకోవటం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. అయితే, సాధారణ సోలార్ ఫలకాల నీడ కింద పంటలు పెరగవు. అందుకే వాటిని బంజరు భూముల్లోనో, కాలువల మీదనో పెడుతున్నారు. పంట పొలాల్లో కూడా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలంటే సౌర ఫలకాలు ఎండను కిందికి ప్రసరింపజేసేలా పారదర్శకమైనవై ఉండాలి. ఇటువంటి వినూత్న ఫలకాలనే రూపొందించింది బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ రెన్బ్యూక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఫలకాలను వినియోగించి అగ్రిహబ్ ద్వారా పిజెటిఎస్ఎయులోని వాటర్ టెక్నాలజీ సెంటర్ డైరెక్టర్ డా. అవిల్ కుమార్ పర్యవేక్షణలో గత ఏడాది (2022–23) రబీ కాలం నుంచి పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. క్యాబేజి, బ్రోకలి, కాళిఫ్లవర్, క్యారట్, చెట్టుచిక్కుడు, వేరుశనగ, మిరప వంటి సుమారు 15 రకాల పంటలను 65 వాట్ల సామర్థ్యం గల 40 సోలార్ ప్యానళ్ల కింద 300 చ.మీ. విస్తీర్ణంలో గత నవంబర్ నుంచి పలు పంటలను సాగు చేస్తున్నారు. ఇప్పటికి రబీ, ఖరీఫ్ పంటలు సాగు చేశారు. మళ్లీ రబీ పంటలు ఇటీవలే వేశారు. ‘రెన్బ్యూక్ సోలార్‌ప్యానల్స్ నుంచి ప్రసరించే సూర్యరశ్మిలో 70% వరకు నేల మీద పంటలపై పడుతోంది. సాధారణ సోలార్ ప్యానళ్ల కన్నా ఈ ప్యానళ్ల ద్వారా 10–12% అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ ప్యానళ్ల కింత సాగైన క్యారట్ పంట దిగుబడి ఏమీ తగ్గలేదు. వేరుశనగ వంటి పంటల్లో కొంచెం తగ్గింది. నీటి వినియోగంలో మార్పు లేదు. అయితే, మరికొన్ని పంటకాలాలు పండించిన తర్వాత ఏయే పంటలకు ఈ సోలార్ సేద్యం అనుకూలమో తెలుస్తుంది’ అన్నారు డా. అవిల్ కుమార్(99513 35111). గ్రామీణులకు ప్రత్యేకం.. గ్రామీణ ఆవిష్కర్తలకు ఇంక్యుబేషన్ సేవలందించటం కోసం జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో అగ్రిహబ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామీణ యువత, రైతులు, ఎఫ్పిఓలు, కోఆపరేటివ్‌ల నిర్వాహకులు తమ కలలను అగ్రిహబ్ తోడ్పాటుతో సాకారం చేసుకోవటానికి ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని అగ్రిహబ్ ఎండీ డా. కల్పనా శాస్త్రి తెలిపారు. పేటెంట్లకూ తోడ్పడుతున్నాం! ఎంటర్ప్రెన్యూర్లు, శాస్త్రవేత్తల అగ్రిటెక్ స్టార్టప్‌లతో పాటు రైతులు, గ్రామీణుల ఆవిష్కరణలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్న ఏకైక ఇంక్యుబేషన్ సంస్థ అగ్రిహబ్ ఒక్కటే. సాంకేతిక ఆవిష్కరణలతో పాటు రైతుల వంగడాలకు కూడా పేటెంట్లు పొందేందుకు మేం తోడ్పడుతున్నాం. ఇన్నోవేటర్ల తరఫున ఇప్పటికి మొత్తం 13 పేటెంట్లకు దరఖాస్తు చేశాం. – డా. కల్పనా శాస్త్రి, మేనేజింగ్ డైరెక్టర్, అగ్రిహబ్ ఫౌండేషన్, పిజెటిఎస్ఎయు, హైదరాబాద్ ఇవి చదవండి: మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి! -
మిచాంగ్ తుఫానుకు దెబ్బతిన్నా.. తిరిగి విరగ్గాసిన సేంద్రియ పత్తి!
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.' లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి. నెలకొరిగినా తిప్పుకుంది! డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్) 3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం! 3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది. – ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా – ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు (చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం) -
చెరకు పంట జాగ్రత్తలు మరవకు! లేదంటే?
'చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన పద్ధతులు పాటించకుండా పాత పద్ధతులను పాటిస్తే నష్టపోతారు. కొంత మంది రైతులు చెరకు పక్వానికి రాకముందే క్రషింగ్‌కు తరలిస్తూ ఉంటారు. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చెరకు పంట పక్వానికి వచ్చిందా ?లేదా? కొన్ని మెలకువలు పాటించాలి.' - ప్రస్తుతం చేతికొచ్చిన చెరకు పంటను నరకుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బసంత్‌పూర్–మామిడ్గి గ్రామాల శివారులో గల ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం.విజయ్‌కుమార్ మాట్లాల్లోనే.. పక్వానికి వచ్చిందా.. లేదా? పక్వానికి వచ్చిన చెరకు తోటల ఆకులు పచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారుతాయి. చెరకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడి కన్నులు బాగా ఉబ్బినట్లు అవుతాయి. తోటలో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. చిట్ట చివర నాలుగైదు కణుపులు దగ్గర దగ్గర ఏర్పడి వాటి నుంచి పుట్టు ఆకులు ఒకే చోట కుచ్చువలె ఏర్పడుతాయి. కొన్ని రకాల్లో పూత పూయడం కనబడుతుంది. శాసీ్త్రయంగా గమనిస్తే చెరకును రెండు భాగాలు నరికి వాటి రసంను వేర్వేరుగా గానుగాడిస్తే వాటిలోని ఘన పదార్థాలు సమానంగా ఉండాలి. చేతి రిఫ్రాక్టో మీటర్ ద్వారా కూడా చెరకు పక్వానికి వచ్చింది తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు! చీడ పీడలు ఆశించిన చెరకును ముందుగా క్రషింగ్‌కు తరలించాలి. లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడులతో రసం నాణ్యత తగ్గుతుంది. బెల్లం తయారు చేశాక మెత్తగా ఉంటే నిల్వకు పనిరాదు. ఏదైనా ప్రమాదశాత్తు చెరకు కాలిపోతే ముందుగా దాన్ని నరికివేయాలి . లేకపోతే తూకం తగ్గి రోజుకు 3 శాతం చొప్పున తగ్గుతుంది. పూత వచ్చిన, బెండు బారిన చెరకును నరకడం ఆలస్యం చేయరాదు. పూత వచ్చిన చెరకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చెరకును ఫ్యాక్టరీకి తరలించాలి. చెరకును భూ మట్టానికి నరకాలి. రెండు మూడు అంగుళాలు వదిలి నరకడం వల్ల ఎకరానికి రెండు మూడు టన్నులు దిగుబడి తగ్గుతుంది. కింది భాగంలో పంచదార పాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెరకు వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి బలమైన గాలులు వీచినా చెరకు ఒరిగిపోదు. చెరకు క్రషింగ్‌కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లేకుండా తరలించాలి. చెత్తా చెదారంతో తరలించడం వల్ల పంచదార దిగుబడిలో 10 శాతం నష్టం వాల్లుతుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి. వేర్లను తీసేయకుండా చెరకును అలాగే క్రషింగ్‌కు తరలిస్తే 0.4 నుంచి 0.6 శాతం మేర పంచదార దిగుబడి తగ్గుతుంది. నరికిన తర్వాత నరికిన చెరకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి సరఫరా చేయాలి. ఆలస్యమైన కొద్ది చెరకు తూకంలో 2 నుంచి 4 శాతం, రసనాణ్యతలో ఒక శాతం తరుగుదల కనిపిస్తోంది. నరికిన చెరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించలేని పక్షంలో కట్టిన చెరకు మోపులను నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పలుచగా పోయాలి.\ రైతులు సాగు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇలాంటి మెలకువలు పాటిస్తేనే లాభాలు సాధిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి చదవండి: బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం! -
బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం!
కేరళలోని కొట్టాయంకు చెందిన రైతు వి.ఎ. థామస్ 8 ఏళ్ల క్రితం రబ్బర్ సాగుకు స్వస్తి చెప్పారు. 70 ఏళ్ల వయసులో రసాయనిక వ్యవసాయం వదిలి సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. ఇంత వరకే అయితే పెద్ద విశేషం లేదు. కొట్టాయం దగ్గర్లోని చక్కంపుఝ గ్రామంలోని తమ 5 ఎకరాల కుటుంబ క్షేత్రాన్ని 400 రకాల పనస చెట్లతో జీవవైవిధ్యానికి చెరగని చిరునామాగా మార్చారు థామస్. బడ్ గ్రాఫ్టింగ్ లేదా బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ కొత్త రకాలను సృష్టిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ పనస తొనలను రుచి చూస్తారు. నచ్చిన రకాల మొక్కల్ని వెంట తెచ్చి నాటుకుంటారు. రెండేళ్లు, ఏడాదిన్నరలోనే కాపుకొచ్చే వియత్నాం, కంబోడియాల నుంచి కూడా కొన్ని పనస రకాలను సేకరించారు. మొక్కలతో పాటు ఎండబెట్టిన పనస తొనలను అమ్ముతూ ఎకరానికి ఏటా రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు. ఎండబెట్టిన పచ్చి పనస కాయలను కిలో రూ. వెయ్యి. ఎండబెట్టిన పనస పండ్లను కిలో రూ. 2 వేలకు అమ్ముతుండటం విశేషం! ఇవి కూడా చదవండి: ‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%! -
‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్ పాలేకర్ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన. భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్–మేనేజ్)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్‌తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..' • పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? డా. పాలేకర్: శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని సోషల్ మీడియా (వెబ్సైట్, యూట్యూబ్, వాట్సప్) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్ మైక్రోబియల్ కల్చర్‌ను వినియోగిస్తే చాలు. • దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు? డా. పాలేకర్: సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్ నా టెక్నాలజీతో కన్విన్స్ అయ్యింది. హైదరాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్ జిల్లాలో విజయరామ్ సాగు చేస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను. • పర్యావరణ సంక్షోభంపై దుబాయ్‌లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..! డా. పాలేకర్: అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. • మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..! డా. పాలేకర్: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి. సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్‌లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. • రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా? డా. పాలేకర్: ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబడుతుంది. అందులో నుంచి కర్బనం విడుదలై ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సయిడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా. • మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..? డా. పాలేకర్: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు. నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు. • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్ పాలేకర్ కృషి’ అని అంటున్నారెందుకని? డా. పాలేకర్: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్ పాలేకర్ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. • పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం? డా. పాలేకర్: ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి. • రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా? డా. పాలేకర్: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్‌లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్ పాలేకర్: వాట్సప్– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in) - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
మిల్లెట్స్ తింటున్నారా? ఆ వ్యాధులను పూర్తిగా మాయం చేయగలదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకోవటానికి అలవాటు పడితే యావత్ మానవాళికి ఆహార /పౌష్టికాహార భద్రతతో పాటు ఆరోగ్య/ పర్యావరణ భరోసా దొరుకుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ‘చిరుధాన్యాలతో ప్రపంచ ప్రజలకు ఆహార భద్రత’ అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్)లో మంగళవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీ రౌండ్‌టేబుల్ సమావేశంలో 31 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ‘మేనేజ్’తో కలసి ఆఫ్రికా ఆసియా గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎఎఆర్‌డిఓ) నిర్వహిస్తున్న ఈ రౌండ్‌టేబుల్ ప్రారంభ సమావేశంలో మిల్లెట్ మాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలితో పాటు ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రధాన స్రవంతి వ్యవసాయ శాస్త్రవేత్తలతో కలసి తొలిసారి వేదికను పంచుకోవటం విశేషం. డా. ఖాదర్ వలి కీలకోపన్యాసం చేస్తూ, భూగోళంపై వేల ఏళ్లుగా ప్రజలు ప్రధాన ఆహారంగా తింటున్న చిరుధాన్యాలే అసలైన ఆహారమన్నారు. అయినప్పటికీ.. ఆంగ్లేయులు, పాశ్చాత్యులు ఇది మనుషుల ఆహారం కాదని చెప్పటం ప్రారంభించి గోధుమలు, వరి బియ్యాన్ని హరిత విప్లవం పేరుతో ప్రోత్సహిస్తూ కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పారిశ్రామిక ఆహారోత్పత్తులను ముందుకు తేవటం వల్ల చిరుధాన్యాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్నదని, ఇందువల్లనే ఆహార భద్రత సమస్య ఉత్పన్నమైందన్నారు. పారిశ్రామిక ఆహారం కారణంగానే మానవాళి ఎన్నో జబ్బుల పాలవుతున్నదని మానవాళి, శాస్త్రవేత్తలు, పాలకులు గుర్తెరగాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. మనుషులను రోగగ్రస్థంగా మార్చుతున్న కార్పొరేట్ ఆహారాన్ని వదిలించుకుంటేనే మానవాళికి జబ్బుల నుంచి, ఎడతెగని ఔషధాల వాడకం నుంచి సంపూర్ణ విముక్తి దొరుకుతుందన్నారు. సిరిధాన్యాలు (స్మాల్ మిల్లెట్స్) దివ్యౌషధాలుగా పనిచేస్తున్నాయని 8 ఏళ్లుగా తాను వందలాది మంది రోగులతో కలసి చేసిన అధ్యయనంలో వెల్లడైందని డా. ఖాదర్ వలి పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఫలితాలను నమోదు చేశామని, 140 రకాల జబ్బుల్ని ఆరు నెలల నుంచి 2 ఏళ్లలోపు నయం చేయటమే కాదు పూర్తిగా మాయం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సిరిధాన్యాలను రోజువారీ ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటే డయాబెటిస్, బీపీ, ఊబకాయం, కేన్సర్ వంటి జబ్బులకు వాడుతున్న మందులను క్రమంగా మానివేస్తూ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చన్నారు. సిరిధాన్యాలు సకల పోషకాలను అందించటంతోపాటు దేహంలో నుంచి కలుషితాలను బయటకు పంపటంలోనూ కీలకపాత్రపోషిస్తున్నాయన్నారు. ఇవి వర్షాధారంగా పండే అద్భుత ఆహార ధాన్యాలని అంటూ సాగు నీటితో పండించే ఆహారం అనారోగ్య కారకమనటంలో ఏ సందేహమూ లేదని డా. ఖాదర్ వలి తెలిపారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తూ పోషకాల గనులైన చిరుధాన్యాలను రసాయనాలతో సాగు చేయటం విచారకరమన్నారు. రసాయనాలతో పండించటం వల్ల చిరుధాన్యాల్లో పోషకాలు తగ్గిపోవటమే కాకుండా, రసాయనిక అవశేషాల వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్నారు. చిరుధాన్యాల వేలాది వంగడాలను అనాదిగా ఆదివాసులు సంరక్షిస్తున్నారని, మనకు తెలియని చిరుధాన్య రకాలు ఇప్పటికీ వారి వద్ద ఉన్నాయన్నారు. శాస్త్రవేత్తలు వాటిపై దృష్టి కేంద్రీకరిస్తే మరింత ఎక్కువ పోషకాలున్న చిరుధాన్యాలు వెలుగులోకి రావచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించటంపై పాలకులు దృష్టి కేంద్రీకరిస్తే ఆహార భద్రత సమస్య, పర్యావరణ సమస్య కూడా తీరిపోతుందని పాలేకర్ సూచించారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) సంచాలకులు డా. సి.తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాల సాగును విస్తృతంగా చేయాలన్నారు. వరి కోతల తర్వాత ఆ పొలాల్లో జొన్న తదితర చిరుధాన్యాలను సాగు చేసి అధిక దిగుబడి సాధించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందన్నారు. చిరుధాన్యాలను అన్నం, రొట్టెలతో పాటు 300 రకాల ఉత్పత్తులుగా మార్చి తినవచ్చన్నారు. ఐఐఎంఆర్ ప్రపంచ దేశాలకు ఆధునిక చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించిన సాంకేతికతను అందిస్తోందన్నారు. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ప్రసంగిస్తూ ఆహార భద్రత సాధించాలంటే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంపొందించడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎఎఆర్‌డిఓ ప్రధాన కార్యదర్శి మనోజ్ నర్దేవ్సింగ్, డా.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'కోళ్ల ఫారాల కాలుష్యానికి' ఇకపై చెక్! ఎలాగో తెలుసా?
కోళ్ల ఫారంలో కోళ్ల విసర్జితాల వల్ల కోళ్ల రైతులు, కార్మికులకే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈగలు, దుర్వాసన పెద్ద సమస్యగా ఉంటుంది. కోళ్ల విసర్జితాలను ఆశించే ఈగలు మనుషులకు, కోళ్లకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. కోళ్ల విసర్జితాల నుంచి విడుదలయ్యే అమ్మోనియా వాయువు వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు, రైతులకు కళ్లు మండటం, తలనొప్పి వంటి సమస్యలు రావటంతో పాటు కోళ్లకు సైతం తలనొప్పి, కంటి చూపు సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. లేయర్, బ్రీడర్ కోళ్ల ఫారాల కింద పోగుపడే కోళ్ల విసర్జితాల దుర్వాసన, ఈగల నివారణకు రసాయనాలు చల్లినప్పటికీ ఇది తీరని సమస్యగానే మిగిలిపోతోంది. జనావాసాలకు దగ్గరగా ఉండే కోళ్ల ఫారాల దుర్గంధాన్ని, ఈగలను భరించలేని ప్రజలు వాటిని మూయించే పరిస్థితులు కూడా నెలకొంటూ ఉంటాయి. అయితే, ఈ సమస్యలను పర్యావరణహితంగా పరిష్కరించే ఓ మార్గాన్ని సూచిస్తున్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ స్టార్టప్ వ్యవస్థాపకుడు యడ్లపాటి రమేష్. బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) అనే హానికరం కాని ఈగకు చెందిన పిల్ల పురుగులను కోళ్ల ఫారంలోని విసర్జితాలపై వదిలితే కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన సమస్య, విసర్జితాల యాజమాన్య సమస్యలు తీరిపోతాయని రమేష్ తెలిపారు. కోళ్ల వ్యర్థాలను – వర్మి కంపోస్ట్ ప్రక్రియ లాగా మారుస్తూ బిఎస్ఎఫ్ లార్వా (పిల్ల పురుగులు) పెరుగుతాయి. నెలకొకసారి వీటిని కోళ్ల ఫారంలో విసర్జితాలపై వేసుకుంటే చాలు. కోళ్ల ఫారాల నుంచి వ్యర్థాల దుర్వాసన నుంచి 95% పైగా విముక్తి కలిగించడానికి సహజ ప్రక్రియ అయిన బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా ఒక మంచి పరిష్కారమని ఆయన చెబుతున్నారు. గత ఐదారేళ్లుగా బిఎస్ఎఫ్ లార్వా ఉత్పత్తిపై పనిచేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కోళ్ల రైతులకు ఈ లార్వాను అందిస్తూ కాలుష్య నియంత్రణకు, ఆరోగ్య రక్షణకు కషి చేస్తున్నామని ఆయన అన్నారు. లార్వాను కోళ్ల విసర్జితాల (లిట్టర్)పై నెలకోసారి చల్లటం వల్ల ఉపయోగాలు: ► సాధారణ ఈగలు పూర్తిగా తగ్గిపోతాయి. కోళ్ల విసర్జితాలపై ఈగలు అరికట్టేందుకు ఉపయోగించే మందులు, అలాగే ఈగల లార్వాను నిర్మూలించడానికి, ఫీడ్‌లో ఇచ్చే మందులు అసలు అవసరం లేదు. ► దుర్వాసన తగ్గుతుంది, కోళ్ల విసర్జితాల నుంచి వెలువడే అమ్మోనియా తగ్గిపోతుంది. ► కోళ్ల ఫారంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. కళ్ళు మంటలు, సిఆర్డి సమస్య తగ్గుతుంది. ► విసర్జితాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు ఎరువుగా మార్చే క్రమంలో, విసర్జితాల్లో తేమ తగ్గిపోయి, దుర్వాసన కూడా తగ్గుతుంది. ► సున్నం, బ్లీచింగ్ అవసరం ఉండదు. వీటి ఖర్చు తగ్గుతుంది. ► విసర్జితాల నిర్వహణకు కూలీలు, స్పేయ్రర్లు, మందుల ఖర్చు ఆదా అవుతుంది. కోళ్ల విసర్జితాలపై ఉండే సాల్మొనెల్లా, ఈ–కొలి వంటి హానికారక సూక్ష్మక్రిములను అరికడతాయి ► ఆర్గానిక్ కంపోస్ట్‌గా మారిన కోళ్ల విసర్జితాలను రైతులు మంచి ధరకు విక్రయించుకోవచ్చు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను విసర్జితాలపై చల్లటం అనే సహజ సిద్ధమైన ప్రక్రియ వల్ల.. కోళ్లకు, పనివారికి, చుట్టపక్కల నివసించే ప్రజలకు ఇబ్బందులు తప్పటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ► చనిపోయిన కోళ్లను, పగిలిపోయిన గుడ్లను త్వరగా కుళ్ళబెట్టడానికి, దుర్వాసన, బాక్టీరియా తగ్గడానికి కూడా బిఎస్ఎఫ్ లార్వా ఉపయోగపడుతుంది. ► కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలు ఆరోగ్యకరంగా, కాలుష్యరహితంగా తయారై కోళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ► ఉత్పాదకత 1–2 శాతం పెరుగుతుంది. బిఎస్ఎఫ్ గుడ్డు నుంచి ఈగ వరకు జీవితకాలం మొత్తం 45 రోజులు. గుడ్డు నుంచి పిల్లలను ఉత్పత్తి చేయటం అనేది తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ గల వాతావరణంలో జరగాల్సి ఉంటుంది. మరోన్నో ఉపయోగాలు.. ► 20 రోజుల వయసులో గోధుమ రంగులో ఉండే బిఎస్ఎఫ్ పురుగులు బతికి ఉండగానే లేయర్ కోళ్లకు, బ్రాయిలర్ కోళ్లకు, నాటు కోళ్లకు 10–20% మేరకు సాధారణ మేత తగ్గించి మేపవచ్చు. ► వంటింటి వ్యర్థాలు, ఆహార వ్యర్థాలపై ఈ బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను వేసి పెంచవచ్చు. ► 15 రోజుల తర్వాత ఆ లార్వాను పెంపుడు కుక్కలకు /పిల్లులకు /పక్షులకు మేతగా వేయొచ్చు. బతికి ఉన్న పురుగులు మేపవచ్చు. లేదా ఎండబెట్టి లేదా పొడిగా మార్చి కూడా వాడుకోవచ్చు. 'ఆక్వా చెరువుల్లో రోజుకు మూడు సార్లు మేత వేస్తూ ఉంటారు. ఒక మేతను బిఎస్ఎఫ్ లార్వాను మేపవచ్చని రమేష్ చెబుతున్నారు.' వివరాలకు: 9154160959 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఇవి చదవండి: మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!? -
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
నాలుగైదేళ్లలో జన్యుసవరణ జొన్నలు, రాగులు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్య వంగడాల అభివృద్ధికి జన్యు సవరణ (జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) డెప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్ సైన్స్) డాక్టర్ టి. ఆర్. శర్మ వెల్లడించారు. అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం 5.0 ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన శర్మ ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. పోషకాల నాణ్యతను పెంపొందించడానికి, ‘యాంటీ న్యూట్రియంట్ల’ను పరిహరించడానికి జొన్న, రాగి విత్తనాలకు జన్యు సవరణ ప్రక్రియ చేపట్టినట్లు డా. శర్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చిరుధాన్యాలపై గతంలో పెద్దగా పరిశోధనలు జరగనందున జన్యుసవరణ కష్టతరంగా మారిందన్నారు. అందువల్ల జన్యు సవరణకు ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ పరిశోధనలు శైశవ దశలో ఉన్నాయని, ఈ వంగడాలు అందుబాటులోకి రావటానికి 4–5 ఏళ్ల సమయం పడుతుందన్నారు. మెరుగైన చిరుధాన్యాల వంగడాల అభివృద్ధి దిశగా ఇప్పటికే గణనీయమైన అభివృద్ధి సాధించామని, ఈ కృషిలో భాగంగానే జన్యు సవరణ(జీనోమ్ ఎడిటింగ్) సాంకేతికతను కూడా చేపట్టామన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో రానున్న కాలంలోనూ చిరుధాన్యాల ప్రోత్సాహానికి సంబంధిత వర్గాలందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సమ్మేళనంలో వివిధ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి, రానున్న పదేళ్లలో చిరుధాన్యాల అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆహార, పౌష్టికాహార భద్రత కోసం పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను ఐసిఏఆర్ ప్రోత్సహిస్తోందన్నారు. ఆహార వ్యవస్థలో సంబంధితులందరూ పరస్పరం సహకరించుకుంటూ చిరుధాన్యాలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావాలని డా. శర్మ సూచించారు. (చదవండి: చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!) -
డ్రాగన్ ఫ్రూట్‌తో దిమ్మతిరిగే లాభాలు, మొదటి పంటలోనే 6లక్షలకు పైగా..
కర్నూలు(అగ్రికల్చర్): కరువులో డ్రాగన్ ఫ్రూట్ సాగు కలసివస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గతంలో ఒకరిద్దరి రైతులకే పరిమితమైన తోటలు ఏడాదికేదాది అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేసే రైతుకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. గతంలో దిమ్మెలు పాతి దానిపై టైర్/బండి చక్రం అమర్చడం ద్వారా మొక్కలు పైకిపాకే ఏర్పాటు చేసేవారు. నేడు ట్రెల్లీస్ విధానంలో(దిమ్మెలపై టైరు/ బండి చక్రం అవసరం లేకుండా తీగలతో ) తోటలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటి పంటలోనే రూ.6 లక్షల ఆదాయం దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన కంది రవీంద్రకుమార్ యాదవ్ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈయన కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నారు. మొదటి పంటలోనే రూ. 6 లక్షల ఆదాయం పొందారు. నరసరావు పేట నుంచి మొక్క రూ.60 ప్రకారం తెప్పించి 2021లో నాటుకున్నారు. సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దారంలో పోల్స్ నాటుకున్నారు. పోల్స్‌కు విద్యుత్ లైన్ తరహాలో 4 వరుసలతో లైన్ వేశారు. పోల్స్ కింద ఒకదానిపైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగారు. ఈ వైర్ల కింద అడుగు, అడుగు దూరంలో డ్రాగన్ ప్రూట్ మొక్కలు నాటుకున్నారు. మొక్కలు తీగ తరహాలో పైకి పెరుగుతూ... పైన వేసిన నాలుగు లైన్లు వేసి తీగలపై అల్లుకున్నాయి. దిమ్మెలపై టైరు/బండి చక్రం అవసరం లేకుండా పోయింది. ఎకరన్నర భూమిలో ఏకంగా 7వేల మొక్కలు నాటుకోగా.. పెట్టుబడి వ్యయం రూ.16 లక్షల వరకు వచ్చింది. అంతరపంటగా వేరుశనగ సాలుకు, సాలుకు మధ్య 14 అడుగులు ఉండటంతో ట్రాక్టరుతో సేద్యం చేసుకోవచ్చు. ప్రతి ఏటా అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. డ్రాగన్‌ప్రూట్ మొక్కలకు ఆకులు రావు. తీగలపైనే అల్లుకుంటాయి. మధ్య ఖాళీగా ఉన్న భూమిలో అంతరపంటగా వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. డ్రాగన్‌ప్రూట్ తోటకు మల్చింగ్ సదుపాయం కూడా కల్పించుకున్నారు. దీంతో కలుపు సమస్య లేకుండా పోయింది. తేమ కూడా ఆరిపోదు.. ప్లాస్టిక్ షీట్లకు అడగు, అడుగు దూరంలో రంధ్రాలు వేసి మొక్కలు నాటారు. మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది. ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం కల్పించుకున్నారు. ఐదేళ్ల నుంచి పెరగనున్న దిగుబడులు పంటకు కేవలం పశువుల ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నాటిని ఏడాదిలోపే 2022 అగస్టులో కాపు మొదలైంది. మొదటి పంటలో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. 2023లో దిగుబడి బాగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన పంట నవంబరు నెలతో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 60 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. టన్ను రూ.లక్ష ప్రకారం విక్రయించారు. ఇప్పటి వరకు రూ.6 లక్షలకుపైగా ఆదాయం పొందారు. వచ్చే ఏడాది మొక్కకు 20 వరకు పండ్లు వస్తాయి. ఇవి 4 కిలోల వరకు ఉంటాయి. ఈ ప్రకారం 28 టన్నుల వరకు దిగుబడి పెరుగనుంది. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి గరిష్టస్థాయికి చేరుతుంది. మూడు నెలలు అధ్యయనం చేశా డ్రాగన్న్ఫ్రూట్స్ సాగు చేసే ముందు మూడు నెలలు అధ్యయనం చేశా. ఒక అవగాహనకు వచ్చాక ట్రెల్లీస్ విధానంలో మొక్కలు నాటుకున్నా. మల్చింగ్, పోల్స్, వైర్లు, మొక్కలు తదితర వాటికి పెట్టుబడి కింద రూ.16 లక్షల ఖర్చు వచ్చింది. డ్రాగన్ ప్రూట్స్ సాగుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.1.90 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఏపీఎంఐపీ కింద డ్రిప్ కూడా మంజూరైంది. – కంది రవీంద్రకుమార్ యాదవ్ సాగును ప్రోత్సహిస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాం. దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్నారు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
పార్వతీపురం రైతుకు పేటెంట్ మంజూరు చేసిన భారత ప్రభుత్వం
బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్ సర్టిఫికెట్ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు. 2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్ బాక్సులు అమర్చారు. రైతులే మార్పులు చేసుకోవచ్చు 2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. నాలుగు వేరియంట్లు ఎకనామిక్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో డ్రమ్సీడర్లను ఆయన రూపొందించారు. వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409 40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్ కోర్సు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యం. తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. డిసెంబర్ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు) సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజి గ్రౌండ్లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. -
ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి
హోమ్మేడ్ ఎరువు ►గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం, స్పూను వంటసోడా వేసి కలపాలి. తరువాత అర టీస్పూను వెనిగర్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. జీవం కోల్పోయిన మొక్కలపై ఈ ద్రావణాన్ని చిలకరిస్తే.. మొక్కలు పచ్చగా కళకళలాడతాయి. ► ఉల్లిపాయ ముక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లు, సోయాబీన్ నీళ్లు, బీరు కలిపిన నీళ్లు కూడా మొక్కలకు బలాన్ని అందించి చక్కగా పెరిగేలా చేస్తాయి. ► కప్పు వేడినీటిలో స్పూను పంచదార, స్పూను వంట సోడా, స్పూను వెనిగర్ వేసి కలపాలి. కప్పు మీద మూత పెట్టి ఉంచాలి. 48 గంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోస్తే వేళ్లకు బలం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి. -
శ్రీగంధం సాగుని డబ్బుచెట్ల సాగు అంటారు
-
కూరగాయల్లో వంకాయకు అధిక డిమాండ్