పంటలకు ప్రాణప్రదమైన భూమి పైపొర మట్టి వర్షపు నీటితో భారీగా కొట్టుకు పోతోంది. మట్టితో కూడిన బురద నీరు వరదలా పారుతుంటే.. ఇది ‘ప్రవహిస్తున్న భూమాత రక్తం’ అని ఓ రైతు శాస్త్రవేత్త ఆవేదన చెందారు. మట్టిని కొట్టుకెళ్లనివ్వని సాగు పేరు పిఎండిఎస్..
పిఎండిఎస్ ప్రయోజనాలు:
నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయినేలలో నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది
పోషక విలువలతో కూడిన నవధాన్య పంటలు పశువులకు పచ్చి మేతగా ఉపయోగ పడతాయి
ఏకకాలంలో బహుళ పంటలు వేయటం వలన అదనపు ఆదాయం వస్తుంది
ప్రధాన పంటల్లో కలుపు సమస్య ఉండదు. నేల కోతకు గురి కాదు
ప్రధాన పంటల దిగుబడులు పెరుగుతాయి ∙నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది
మట్టిలో సూక్ష్మజీవుల జీవవైవిధ్యం పెరుగుతుంది ∙ప్రధాన పంటలకు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది
ప్రధాన పంటలకు చీడపీడలు, తెగుళ్ళను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది
వివిధ పంటల వేర్లు భూమిలో వివిధ రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పిస్తాయి. ఈ సూక్ష్మజీవుల కార్యకలాపాల ద్వారా ప్రధాన పంటకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా అందుతాయి
ప్రధాన పంటకు అతివృష్టి, అనావృష్టి వంటి వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది ∙ఏడాదిలో 365 రోజులు బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచే సేద్యం ఇలా సాధ్యమవుతుంది
భూమిని పలు పంటలతో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల నీరు ఆవిరికాకుండా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా భూముల్లో నుంచి ప్రతి ఏటా 2,400 కోట్ల టన్నుల మట్టి వాన నీటితో పాటు కొట్టుకు΄ోతోంది. ప్రపంచ భూభాగంలో భారత్ వాటా 2.2శాతం మాత్రమే. అయితే, ప్రపంచం ఏటా కోల్పోతున్న మట్టిలో 23శాతంని, హెక్టారుకు సగటున 16శాతం టన్నుల మట్టిని మన దేశం కోల్పోతున్నదని ఎఫ్.పి.ఓ. చెబుతున్న లెక్క.
అయితే, ఢిల్లీ ఐఐటిలోని పరిశోధకుల బృందం ‘సాయిల్ ఎమర్జెన్సీ’ గురించి తాజా అధ్యయనం విస్తుగొలిపే గణాంకాలను బయటపెట్టింది. అస్సాం, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎకరానికి ఏటా 100 టన్నులకు పైగా మట్టి కొట్టుకు΄ోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెక్టారుకు హెక్టారుకు ఏటా 15 నుంచి 30 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎడారీకరణకు గురవుతున్న రాయలసీమ వంటి కొన్ని చోట్ల ఏకంగా 50 టన్నుల వరకు మట్టి కొట్టుకు΄ోతోందని ఈ అధ్యయనం తేల్చింది. అడవుల నరికివేత, ప్రతి ఏటా అతిగా దుక్కిచేయటం వంటి అస్థిర వ్యవసాయ పద్ధతులతో పాటు వాతావరణ మార్పులతో కుండ΄ోత వర్షాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది.
అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మాత్రం తమ భూముల్లో మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడుకోగలుగుతుండటం విశేషం. పోర్చుగల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ గెల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ పురస్కారాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం ఇటీవల అందుకున్న సందర్భంలో.. ప్రకృతి సాగులో ఒక ముఖ్యభాగమైన ప్రీ మాన్‌సూన్ డ్రై సోయింగ్ (పి.ఎం.డి.ఎస్.) అనే వినూత్న పద్ధతి గురించి తెలుసుకుందాం. సాయిల్ ఎమర్జెన్సీ విపత్కర స్థితిని మానవాళి దీటుగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టి. విజయకుమార్ అంటున్నారు.
2023–24లో 8 లక్షల 60 వేల మంది రైతులు 3.80 లక్షల హెక్టార్లలో పి.ఎం.డి.ఎస్. పద్ధతిలో ఎండాకాలంలో వానకు ముందే విత్తారు. పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందుగా వేసవిలోనే విత్తుకునే వినూత్న పద్ధతే పి.ఎం.డి.ఎస్. సాగు. 20 నుంచి 30 రకాల పంటల విత్తనాలను కలిపి వానాకాలానికి ముందే విత్తనాలు వేస్తున్నారు. వేసవి వర్షాలకు మొలుస్తాయి. సజీవ వేరు వ్యవస్థతో మట్టిని కాపాడుకుంటూ.. సారవంతం చేసుకునే ప్రక్రియ ఇది. 30–60 రోజుల్లో ఈ పంటలు కోసిన తర్వాత రైతులు ప్రధాన పంటలు విత్తుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment