చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో ఎంతో కొంతైనా భాగం చేసుకోవాలని భారతీయ వైద్యపరిశోధనా మండలికి అనుబంధంగా ఉన్న జాతీయ పోషకాహార సంస్థ ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలలో భారతీయులకు స్పష్టమైన సూచన చేసింది. గత ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల దినోతవ్సం జరుపుకున్న నేపథ్యంలో ఇప్పటికే చిరుధాన్యాలను అన్నంగానో, అంబలిగానో స్నాక్స్‌గానో తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర లభిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగుపై రైతులు మక్కువ చూపుతున్న ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విత్తనాల సమాచారం పొందుపరుస్తున్నాం..
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో...
జొన్న, సజ్జ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద విత్తనాలు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. రకాన్ని బట్టి కిలో విత్తనాల ధర రూ. 100 నుంచి 200 వరకు ఉంటుంది. రైతులు స్వయంగా వెళ్లి ఐఐఎంఆర్ కార్యాలయంలో కొనుక్కోవాలి. వివరాలకు.. 040–24599305 నంబరులో సంప్రదించవచ్చు.
పాలెంలో...
నాగర్‌కర్నూల్ జిల్లాపాలెంలోని ్ర΄ాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అనేక ఇతర పంటల విత్తనాలతోపాటు చిరుధాన్యాల విత్తనాలు కూడా రైతులకు విక్రయిస్తున్నారు.పాలెం పచ్చజొన్న–1 (3 కేజీలు–రూ.450), తెలంగాణ తెల్ల జొన్న (3 కేజీలు–రూ.270), రాగి (3కేజీలు– రూ.150), సజ్జ (2 కేజీలు–రూ.200), కొర్ర (2 కేజీలు–రూ.130) విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు మురళిని 94904 09163 నంబరులో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో...
నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో జొన్న, రాగి విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ నర్సింహులును 79810 85507 నంబరులో సంప్రదించవచ్చు. అనంతపురంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో సజ్జ విత్తనాలు ఉన్నాయి. డాక్టర్ మాధవీలతను 79819 29538 నంబరులో సంప్రదించవచ్చు. పెరుమాళ్లపల్లె వ్యవసాయ పరిశోధనా స్థానంలో రాగి విత్తనాలు ఉన్నాయి. ఎం. శ్రీవల్లిని 93987 95089 నంబరులో సంప్రదించవచ్చు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో రాగి విత్తనాలు ఉన్నాయి. డా. ఎన్. అనూరాధను 85002 04565 నంబరులో సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ ఖరీఫ్‌కు ఇతరత్రా పంట విత్తనాతోపాటు 721 క్వింటాళ్ల రాగి, 146 క్వింటాళ్ల కొర్ర, 6 క్వింటాళ్ల సామ, ఒక క్వింటా ఊద విత్తనాలను 26 జిల్లాల్లో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
బోరు చుట్టూ ఇంకుడుగుంత నిర్మించడం ఎలా?
ఈ ఏడాది అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో వాననీటి సంరక్షణకు ఉపక్రమిద్దాం. పొలాల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌మెంట్లు / ఇళ్ల దగ్గర ఉన్న బోర్ల చుట్టూతా ఇంకుడు గుంతలు తీయించుకుందాం.
బోరు రీచార్జ్ గుంతను నిర్మించుకుంటే.. వర్షపు నీటిలో 40–50% వరకు భూమి లోపలికి ఇంకింపజేసుకోవచ్చని భూగర్భ జల నిపుణులు, సికింద్రాబాద్‌లోని వాటర్ అండ్ లైవ్‌వీహుడ్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. రామమోహన్ (94401 94866) సూచిస్తున్నారు. మరింత సమాచారం కోసం, సంబంధిత వీడియో కోసం ఈ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయండి.
ఇవి చదవండి: Sagubadi: ఈ అతిపొడవైన సజ్జ పేరు.. 'సుల్కానియా బజ్రా'!
Comments
Please login to add a commentAdd a comment