అరుదైన సజ్జ కంకి బారెడు పొడవు పెరుగుతుంది.
కరువును తట్టుకొని హెక్టారుకు 20–25 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.
300 ఏళ్లుగా ఈ వంగడాన్ని ఓ రాజస్థానీ రైతు కుటుంబం సంరక్షిస్తోంది.
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రైతును పురస్కారంతో గౌరవించింది.
సజ్జ కంకి పొడవు మహా అయితే మూర పొడవుంటుందని మనకు తెలుసు. అయితే, రాజస్థాన్‌కు చెందిన ఓ రైతు దగ్గర ఏకంగా కంకి బారెడు పొడవు పెరిగే సజ్జ రకం ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ అపురూపమైన పురాతన సజ్జ వంగడాన్ని ఆ రైతు కుటుంబం గత 300 ఏళ్లుగా సాగు చేస్తూ, పరిరక్షిస్తూ ఉంటటం మరో విశేషం. కరువును దీటుగా తట్టుకొని వర్షాధారంగా హెక్టారుకు 20–25 క్వింటాళ్ల దిగుబడిని ఇవ్వగలిగిన గొప్ప వారసత్వ సంపదైన ఈ వంగడం పేరు ‘సుల్కానియా బజ్రా’. రాజస్థాన్‌లోని చురు జిల్లా సుల్కానియా గ్రామానికి చెందిన హనుమాన్‌రామ్ ఝురియా అనే 69 ఏళ్ల రైతు 45 ఏళ్లుగా దీన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
ప్రతి ఏటా సాగు చేస్తూ రైతులకు విత్తనాలు అందుస్తున్నారు. సంప్రదాయ విత్తనాన్ని సంరక్షిస్తున్న ఈ రైతు కృషిని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వ సైన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు అనుబంధమైన స్వతంత్ర సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్‌కు) ఔట్‌స్టాండింగ్ ట్రెడిషినల్ నాలెడ్జ్ పురస్కారాన్ని 2017లోనే ప్రదానం చేసింది. ఈ అద్భుత వంగడానికి సంబంధించిన ఇంకొన్ని వివరాలు..
పొడవైన కంకులు, రుచికరమైన గింజలు, అధిక దిగుబడినివ్వటం, కరువు పరిస్థితులను తట్టుకోవటం, ఎక్కువ పశుగ్రాసం ఇవ్వటం ఈ సుల్కానియా సజ్జ ప్రత్యేకతలు.
హనుమాన్‌రాం కుటుంబం తాత ముత్తాతల కాలం నుంచే ఈ సజ్జలను పండిస్తున్నారు. బికనీర్ నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక గురువు 300 సంవత్సరాల క్రితం వీరి ముత్తాతకి ఈ విత్తనం ఇచ్చారట! అప్పటి నుంచి అదే రకాన్ని వీరి కుటుంబం పండిస్తున్నది.
ప్రతి సంవత్సరం పంట వచ్చిన తర్వాత బాగున్న గింజలను ఏరి, ఎండిన వేపాకులతో కలిపి నిల్వచేస్తాడు. ఈ విధంగా 5 సంవత్సరాల వరకు ఈ విత్తనాన్ని నిల్వ చేసుకోవచ్చు అంటారు హనుమాన్‌రామ్ ఝురియా.
‘సుల్కానియా’ సజ్జ తొలకరి వర్షాలకు విత్తుకునే రకం. ఇది ఇసుకతో కూడిన నేలలు, నీటి ఎద్దడి ్రపాంతాల్లో సాగుకు అనువైన రకం.
కరువు వాతావరణాన్ని తట్టుకుంటుంది. విత్తిన తర్వాత కొంత కాలం వర్షం లేక΄ోయినా బాగా మొలకెత్తి ఎదగగలగటం దీని మరో ప్రత్యేకత.
సజ్జతో హెక్టారుకు 20 నుంచి 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి సాధించవచ్చు. 20 నుంచి 30 అంగుళాల పొడవాటి కంకులు వుండటం ప్రత్యేకత.
ప్రతి మొక్కకు అనేక పిలకలతో పాటు 6 నుంచి 10 కంకులు వస్తాయి. ప్రతి కంకిలో 90 శాతానికి పైగాబలమైన విత్తనాలే వుంటాయి. విత్తిన 90 రోజులకు పంట కోతకు వస్తుంది. అధిక మొత్తంలో గడ్డి లభిస్తుంది.
వర్షాధారంగా ఈ రకంతో ఎక్కువ ఉత్పత్తి సాధించవచ్చని, చీడపీడలను తట్టుకునే శక్తి కలిగి వుందని అక్కడి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు, సెంటర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సంస్థ శాస్త్రవేత్తలు అభి్రపాయ పడ్డారు.
సుల్కానియా ప్రాంత రైతులతో పాటు, నిపుణులు ప్రశంసిస్తూ.. తాము కూడా 30 ఏళ్లుగా ఈ వంగడాన్ని సాగు చేస్తున్నామన్నారు.
సికింద్రాబాద్‌లోని పల్లె సృజన స్వచ్ఛంద సంస్థ సుల్కానియా సజ్జ రకం విత్తనాలను తెప్పించి తెలుగు రాష్ట్రాల రైతులకు అందిస్తోంది. ఇతర వివరాలకు ‘పల్లెసృజన’ ప్రతినిధి వీరరాఘవరెడ్డిని 81257 99904, 79890 38186 ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.
ఇవి చదవండి: Sagubadi: అరెకరం ఉచిత విత్తనాలకై..
Comments
Please login to add a commentAdd a comment