ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్ లెస్ కాక్టస్) పంటను కరువు ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ పశుగ్రాసం కోసం సాగు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు దీనితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్కల్ని తీవ్ర కరువు పరిస్థితుల్లో.. నిస్సారమై వ్యవసాయానికి పనికిరాని భూముల్లో (మన దేశంలో వ్యవసాయ భూమిలో 40శాతం ఇప్పటికే నిస్సారమై సాగు యోగ్యం కాకుండా΄ోయిందని అంచనా) కూడా సాగు చేయొచ్చు.
ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా అడుగులు వేశారు కూడా. అయితే, బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం వాడుతున్న పశువుల పేడకు బదులు పాక్షికంగా బ్రహ్మజెముడు మొక్కల్ని వాడొచ్చని తాజాగా రుజువైంది. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఆవిష్కరణ కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో బ్రహ్మజెముడుతో బయోగ్యాస్‌పై పరిశోధన జరుగుతోంది. కరువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశువుల పేడతో బయోగ్యాస్ ద్వారా 65% బయోమీథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పేడపై ఆధారపడటం తగ్గించి బ్రహ్మజెముడును వాడుతున్నారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)
ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్ ఉమ్మడిగా ఝాన్సీలో పరిశోధనలు చేపట్టాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్క ఆకులను పశుగ్రాసంగా, çపర్యావరణహితమైన తోలు ఉత్పత్తులకు ముడిసరుకుగా, బయోగ్యాస్ ఉత్పత్తితో ఇంధనంగా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బ్రహ్మజెముడు స్లర్రీని సేంద్రియ ఎరువుగా, ఈ చెట్టు పండ్లు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. ఈ పండ్లను అనేక దేశాల్లో ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా ఇష్టంగా తింటారు.
బ్రహ్మజెముడు ఆకుల గుజ్జుతో పాటు కొంతమేరకు పేడను కలిపి చేసిన బయోగ్యాస్ ప్రయోగాత్మక ఉత్పత్తిలో 61% వరకు మీథేన్ కంటెంట్‌ను సాధించడం విశేషం. దీంతో ఇది వాణిజ్యపరంగా లాభదాయకమైనదేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిప్ ద్వారా నీటిని అందించటం, ఎరువుల వాడకం ద్వారా ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట ఉత్పాదకతను పెంచే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక్కో బ్రహ్మజెముడు మొక్క ఏడాదికి 69 కిలోల బొగ్గుపులుసు వాయువును గ్రహిస్తుందట. రైతులకు కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)
ఇదీ చదవండి : గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు
Comments
Please login to add a commentAdd a comment