biogas
-
ముళ్లు లేని బ్రహ్మజెముడుతో బయోగ్యాస్!
ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్ లెస్ కాక్టస్) పంటను కరువు ప్రాంతాల్లో ఎండా కాలంలోనూ పశుగ్రాసం కోసం సాగు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల శాస్త్రవేత్తలు దీనితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్కల్ని తీవ్ర కరువు పరిస్థితుల్లో.. నిస్సారమై వ్యవసాయానికి పనికిరాని భూముల్లో (మన దేశంలో వ్యవసాయ భూమిలో 40శాతం ఇప్పటికే నిస్సారమై సాగు యోగ్యం కాకుండా΄ోయిందని అంచనా) కూడా సాగు చేయొచ్చు. ఇప్పటికే కొందరు రైతులు ఈ దిశగా అడుగులు వేశారు కూడా. అయితే, బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రస్తుతం వాడుతున్న పశువుల పేడకు బదులు పాక్షికంగా బ్రహ్మజెముడు మొక్కల్ని వాడొచ్చని తాజాగా రుజువైంది. బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియను ఈ ఆవిష్కరణ కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆశిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బ్రహ్మజెముడుతో బయోగ్యాస్‌పై పరిశోధన జరుగుతోంది. కరువు ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో బయోగ్యాస్ ఉత్పత్తిని పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పశువుల పేడతో బయోగ్యాస్ ద్వారా 65% బయోమీథేన్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో పేడపై ఆధారపడటం తగ్గించి బ్రహ్మజెముడును వాడుతున్నారు. (కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!)ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫోడర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐసిఎఆర్ అనుబంధ సంస్థ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ది డ్రై ఏరియాస్ ఉమ్మడిగా ఝాన్సీలో పరిశోధనలు చేపట్టాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు మొక్క ఆకులను పశుగ్రాసంగా, çపర్యావరణహితమైన తోలు ఉత్పత్తులకు ముడిసరుకుగా, బయోగ్యాస్ ఉత్పత్తితో ఇంధనంగా, బయోగ్యాస్ ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే బ్రహ్మజెముడు స్లర్రీని సేంద్రియ ఎరువుగా, ఈ చెట్టు పండ్లు ఆహారంగా ఉపయోగ పడుతున్నాయి. ఈ పండ్లను అనేక దేశాల్లో ప్రజలు డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా ఇష్టంగా తింటారు. బ్రహ్మజెముడు ఆకుల గుజ్జుతో పాటు కొంతమేరకు పేడను కలిపి చేసిన బయోగ్యాస్ ప్రయోగాత్మక ఉత్పత్తిలో 61% వరకు మీథేన్ కంటెంట్‌ను సాధించడం విశేషం. దీంతో ఇది వాణిజ్యపరంగా లాభదాయకమైనదేనని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిప్ ద్వారా నీటిని అందించటం, ఎరువుల వాడకం ద్వారా ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట ఉత్పాదకతను పెంచే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఒక్కో బ్రహ్మజెముడు మొక్క ఏడాదికి 69 కిలోల బొగ్గుపులుసు వాయువును గ్రహిస్తుందట. రైతులకు కార్బన్ క్రెడిట్స్ ద్వారా అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇదీ చదవండి : గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు -
బయోమాస్ సేకరణపై ఫోకస్.. ఖర్చు ఎంతంటే..
అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల నిత్యం గ్యాస్ ధరల పెరుగుతున్నాయి. భారత్ విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతోంది. చేసేదేమిలేక ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. అయితే దిగుమతి చేసుకునే గ్యాస్ స్థానే స్థానికంగా బయోమాస్‌ను సేకరించి దీన్ని తయారుచేసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్(ఐబీఏ) సూచించింది. అందుకు అనుగుణంగా బయోమాస్ సేకరణపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఐబీఏ పేర్కొంది. బయోగ్యాస్ ప్లాంట్లకు బయోమాస్‌ను సప్లయ్ చేయడానికి మెషినరీ, ఎక్విప్మెంట్ల కోసం రూ.30 వేలకోట్ల వరకు పెట్టుబడులు అవసరం అవుతాయని ఐబీఏ అంచనా వేసింది. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) దిగుమతులను తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. వరిగడ్డి వంటి అగ్రి వేస్టేజ్‌ను బయోఎనర్జీ ఉత్పత్తికి వాడుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ చైర్మన్ గౌరవ్ కేడియా అన్నారు. అయితే బయోమాస్‌ను సేకరించడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. దాన్ని సేకరించడం, స్టోర్ చేయడం, రవాణా వంటి వాటికి అధికమొత్తంలో ఖర్చువుతుందని, దీంతో వరిగడ్డి వంటి అగ్రి వేస్ట్‌ను అమ్మడం కంటే తగలబెట్టడానికే రైతులు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడం కంటే వరి గడ్డిని సమర్ధవంతంగా సేకరించగలిగే ఎక్విప్మెంట్లను వాడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదీ చదవండి: ‘వేర్’వేర్లు..! విభిన్న సాఫ్ట్వేర్లు.. -
షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) తన కొత్త వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆ వ్యాపారం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు చెరుకు వ్యర్దాలు సేకరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ టన్నుల కొద్దీ చెరకు వ్యర్థాలు కొనుగోలు చేయనుంది. రానున్న ఐదేళ్లలో 100 బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో ప్లాంట్ 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది, ఈ మధ్య కాలంలో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్వహణకు టన్నుల కొద్దీ చెరుకు వ్యర్దాలు అవసరమని స్పష్టమైంది. బయోగ్యాస్ ప్లాంట్లలో ఉపయోగించే వ్యర్దాల వల్ల సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 2.5 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఇదీ చదవండి: రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్ గత నెలలో కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. స్వదేశంలో అభివృద్ధి చెందిన సాంకేతికల ఆధారంగా అతి పెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. బయోగ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ కంపెనీ మాత్రమే కాకుండా అదానీ కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విస్కీ వ్యర్థాలతో బయో ఇంధనం
రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రాలేదు. ఇప్పడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం కాకుండా మరో వాహనం మార్కెట్లోకి రానుందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. ప్రముఖ స్కాచ్ విస్కీ బ్రాండ్ "గ్లెన్ ఫిడిచ్" గురుంచి చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పడు ఈ కంపెనీ మద్యం తయారీతో పాటు ఇంధనం తయారీలో అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా తన డెలివరీ వాహనాలలో పెట్రోలకు ప్రత్యామ్నాయంగా విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ ఇంధనాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇంధనం వాహన కాలుష్యాన్ని(సీఓ2 ఉద్గారాన్ని) 95% వరకు తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. గ్లెన్ ఫిడిచ్ ఇప్పటికే తన డెలివరీ ట్రక్కులను ఈ బయోగ్యాస్ ఇంధనం ద్వారా నడపడం ప్రారంభించింది. "క్లోజ్డ్ లూప్" ధారణీయత ప్రాజెక్ట్ లో భాగంగా ఈశాన్య స్కాట్లాండ్ లోని కంపెనీ డఫ్ టౌన్ డిస్టిలరీలో ఇంధన స్టేషన్లను ఏర్పాటు చేసింది. విస్కీ వ్యర్థాల నుంచి తయారు చేసిన బయోగ్యాస్ డీజిల్ ఇతర శిలాజ ఇంధనాలతో పోలిస్తే సీఓ2 ఉద్గారాలను 95% కంటే ఎక్కువ తగ్గిస్తుందని, ఇతర హానికరమైన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను 99% వరకు తగ్గిస్తుందని గ్లెన్ ఫిడిచ్ పేర్కొంది. ఈ ఇందనాన్ని త్వరగా మార్కెట్లోకి తీసుకొనిరావడానికి కంపెనీ యోచిస్తుంది. ఒకవేల ఈ ఇందనాన్ని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితే కార్బన్, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల నుంచి పర్యావరణాన్ని కాపాడవచ్చు అని కంపెనీ పేర్కొంది. -
‘చెత్త’తో వెలుగులు.. ప్లాంట్ ఎలా పనిచేస్తుందంటే?
సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మార్కెటింగ్ శాఖ.. నగరవ్యాప్తంగా ఉన్న మార్కెట్లన్నింటిలోనూ ఈ విధానంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బోయిన్పల్లి మార్కెట్లో పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఆ శాఖ.. 10 టన్నుల చెత్తతో 550 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. తద్వారా మార్కెట్ అవసరాలన్నింటికీ ఈ కరెంట్ సరిపోతుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) సహాయంతో చెత్తను బయోగ్యాస్‌గా మార్చిన నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇతర మార్కెట్లలోనూ అవలంభించాలని మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలో ఎర్రగడ్డ రైతుబజార్లో ఒకడుగు ముందుకేసి.. ప్లాంట్‌ను అందుబాటులోకి కూడా తెచ్చింది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్‌తో క్యాంటీన్ కూడా నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రతిరోజూ 500 కిలోల చెత్తను బయోగ్యాస్ మార్చడం ద్వారా.. ఈ పవర్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. గతంలో ఈ మార్కెట్లో వ్యర్థాలను తరలించేందుకు నెలకు సుమారు రూ.1.5 లక్షల మేర ఖర్చు చేసేవారు. పవర్‌ప్లాంట్ రాకతో సుమారు రూ.70వేల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. బోయిన్పల్లే ఆదర్శం.. బోయిన్పల్లి తరహాలో గుడిమల్కాపూర్, గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ సరూర్‌నగర్ రైతు బజార్‌తో పాటు గ్రేటర్ పరిధిలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఇతర మార్కెట్లలో కూడా ఇలాంటి ఏర్పాట్లకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించిందని ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. ఇప్పటికే మెహిదీపట్నం రైతుబజార్లో సేంద్రియ ఎరువుల తయారీ యూనిట్ నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్, అల్వాల్ రైతుబజార్లో ఎర్రగడ్డ తరహాలో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. చదవండి: కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ బోయిన్పల్లి ప్లాంట్.. ►1500 ఎరువు ఉత్పత్తి రూ.3 కోట్లతో బోయిన్ పల్లిలో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ పవర్ ప్లాంట్ విశేషాలు ►నిత్యం 10 టన్నుల చెత్తను ఇంధనంగా మార్చుతోంది. రోజుకు 1220–1400 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి ► 550 ఎల్పీజీ గ్యాస్‌తో సమానం ►నగరంలోని వివిధ హోల్‌సేల్ మార్కెట్లలో చెత్త ఎత్తడానికి నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.20 లక్షలు బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్.. ►10 టన్నుల వ్యర్థాలతో బయోగ్యాస్, విద్యుత్తుగా ఎలా మారుస్తోంది. ►ఆహారం వృథా: ఐక్యరాజ్య సమితి 2019 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని అంచనా. ►వీటిలో 61శాతం గృహాల నుండి, 26 శాతం ఆహార సేవ నుండి, 13 శాతం చిల్లర వర్తకం (రిటైల్) నుండి వృథా అయ్యాయి. ►భారతదేశంలో గృహ ఆహార వ్యర్థాల సంవత్సరానికి 68.7 మిలియన్ టన్నులు అని ఆ నివేదిక తెలిపింది. బోయిన్పల్లి మార్కెట్ ►హైదరాబాద్ మార్కెట్ స్థిరమైన పద్ధతిలో రోజువారీగా 10 టన్నుల వ్యర్థాన్ని నిర్వహిస్తోంది. ►ఇది ఆహారం, కూరగాయ వ్యర్థాలను బయోగ్యాస్, విద్యుత్తుగా మారుస్తోంది. ► వీధి దీపాల దుకాణాలకు విద్యుత్తునందిస్తోంది ► గత కొన్ని నెలలుగా, 500 యూనిట్ల విద్యుత్తును వినియోగించడం జరుగుతోంది. ►120 వీధి దీపాలకు విద్యుత్తు ►170 దుకాణాలకు విద్యుత్తు ►శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజ్ యూనిట్)కి విద్యుత్తు. ఎల్పీజీ స్థానంలో.. ► గ్యాస్ హరిత విద్యుత్తు సేంద్రీయ ఎరువు వెచ్చదనం ► ప్లాంట్ వద్ద అదే వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతోంది. ►ఇది మార్కెట్ క్యాంటీన్లో ఉపయోగించే ఎల్పీజీ వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేస్తోంది. ►ఈ క్యాంటీన్ రోజుకు 800 మందికి భోజనాలను వడ్డిస్తుంది. ఈ ప్లాంట్ ఎలా పనిచేస్తుంది? ► మార్కెట్ నుంచి వ్యర్థాల సేకరణ ►ప్లాంట్‌కు వాటిని తీసుకురావడం ► వ్యర్థాల మక్కించడం ► ఫీడ్ తయారీ ట్యాంక్‌లో నానబెట్టడం ► ముద్దగా మార్చడం ►ఏరోబిక్ బయో మీథనేషన్ ప్రక్రియకు గురికావడం ► ప్రత్యేక ట్యాంకుల్లో బయోగ్యాస్ సేకరణ ►బయోగ్యాస్‌ను వంటగదికి పంపడం ►బయో ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్లోకి సరఫరా చేయడం ► నీటి పంపునకు, శీతల గిడ్డంగులకు, వీధి దీపాలు, దుకాణాలకు కరెంట్ సరఫరా ► హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ తీసుకున్న చొరవను ప్రధాని నరేంద్ర మోడీ తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రశంసించారు. ► ‘హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని కూరగాయల మార్కెట్ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తోందో తెలుసుకుని ఆనందిస్తున్నాను’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ► సహజ వాయువుకు ప్రతిగా బయోగ్యాస్, అమెరికాలో సహజ వాయువు కన్నా బయోగ్యాస్ 5 రెట్లు అధిక ధర పలుకుతుంది. ► విద్యుత్తు డిమాండ్‌కు తగినంతగా వృథా లేనందున సహజ వాయువు స్థాయిని బయోగ్యాస్ భర్తీ చేయలేదు. కానీ ఇది వ్యర్థాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. -
కోళ్ల వ్యర్థాలతో బయోగ్యాస్ తయారీ
సాక్షి, హైదరాబాద్ : పౌల్ట్రీఫారమ్‌లోని కోళ్ల వ్యర్థాల ఆధారంగా పనిచేసే తొలి బయోగ్యాస్ ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఏర్పాటైంది. హైదరాబాద్ శివారులోని ఉడిత్యాల్ గ్రామంలో సోలికా ఎనర్జీ, శ్రీనివాస హ్యచరీస్, ఎక్స్‌ఈఎంఎక్స్ ప్రాజెక్ట్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ ప్రాజెక్ట్ గురువారం ప్రారంభమైంది. భారతదేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుచేశారు. రోజుకు 2.4 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్రాజెక్ట్‌ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓఎల్) ఈడీ ఆర్ఎస్ఎస్ రావు ప్రారంభించారు. 4.50 లక్షల కోళ్లు కలిగిన అతిపెద్ద కోళ్ల ఫారమ్ పక్కన దీనిని ఏర్పాటుచేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని చౌకైన రవాణా పథకం కింద సోలికా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే బయోగ్యాస్‌ను అత్తాపూర్‌లోని ఐఓఎల్ ఔట్‌లెట్‌కు సరఫరా చేయనున్నారు. రాష్ట్రంలో 3.6 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో రెండో బయోగ్యాస్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సోలికా ప్రమోటర్ హిమదీప్ నల్లవడ్ల తెలిపారు. -
ఎమ్మెల్యే ప్రకృతి సేద్యం
రసాయనిక అవశేషాల్లేకుండా ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసుకోవడానికి రోజువారీ పనుల వల్ల తీరిక దొరకటం లేదనుకుంటూ ఉంటారు. అయితే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇందుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి నిదర్శంగా నిలుస్తూ ఇంటిపంటలను ఇష్టంగా సాగు చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉండే ఆమె ప్రకృతి వ్యవసాయ ప్రేమికురాలు కావడం విశేషం. స్వగ్రామం వండువలో ఇంటి పక్కనే ఉన్న 50 సెంట్ల స్థలాన్ని ఉద్యాన పంటల వనంలా మార్చారు. ఆకుకూరలు, పందిరి కూరగాయ పంటలు ఆనప, బీర, బెండ, గుమ్మడి కాయల దిగుబడి బాగుంది. ఒక్కో ఆనపకాయ 10 నుంచి 20 కిలోల బరువు పెరుగుతున్నాయి. కంది, చెరకు, పెండలం, కంద ఇలా అనేక పంటలను సాగు చేస్తున్నారు. వంటకు బయోగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. పంటలకు సొంతంగా తయారు చేసుకున్న సేంద్రియ ఎరువును, జీవామృతాన్ని, కషాయాలను వాడుతూ మంచి దిగుబడి సాధిస్తుండటం విశేషం. పెరటి పంటల పనులను కళావతి ప్రతి రోజూ ఉదయం గంట సేపు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. పెరటి తోటలో కలియ దిరుగుతూ సిబ్బందికి తగిన సూచనలిస్తారు. పురుగు గానీ, ఆకు ముడత కనపడినా వెంటనే వాటిని తీసేయడం ద్వారా చక్కని పంట దిగుబడులు పొందుతుండడం విశేషం. – సూరాబత్తుల గాంధీ, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా మహిళలు పెరటి తోటల సాగు చేపట్టాలి శ్రద్ధగా చేస్తే ప్రకృతి/సేంద్రియ సాగు అసాధ్యమేమీ కాదు. సేంద్రియ ఎరువుతో భూమిని సారవంతం చేస్తే పంటల సాగుకు అనుకూలంగా మారుతుంది. బాల్యం నుంచీ పంటల సాగు అంటే బాగా ఇష్టం. ఇంటి దగ్గర కొద్ది స్థలంలో సరదాగా చేపట్టిన సాగు 50 సెంట్లకు విస్తరించింది. మహిళలంతా పెరటి తోటల సాగు చేపట్లేలా స్ఫూర్తినివ్వాలన్నది నా కోరిక. సేంద్రియ ఎరువులతో ఇంటి వద్దనే ఆరోగ్యదాయకమైన కూరగాయలు, పండ్లు సాగు చేసుకునేందుకు మహిళలు ముందుకు రావాలి. – విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ, శ్రీకాకుళం జిల్లా -
కిచెన్ బయోగ్యాస్
గచ్చిబౌలి: కిచెన్ నుంచి నిత్యం వచ్చే వేస్ట్‌ను వృథాగా పడేయకండి. ఆ వ్యర్థాలతో ఎంచక్కా గ్యాస్ ఉత్పత్తి చేసుకోండి. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌తో ఇట్టే వండుకోండి. మిషన్ నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని మొక్కల ఎరువుగా వాడుకోండి. కిచెన్ వ్యర్థాలు బయట పడేసేందుకు ఇక స్వస్తి పలకండి. జీహెచ్ఎంసీ వెస్ట్ జోనల్ అధికారులు బయోగ్యాస్ మిషన్‌లో కిచెన్ వ్యర్థాలు వేసి గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని చెబుతున్నారు. ఎవరికి వారు కిచెన్‌లో ఫోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను అమర్చుకోవచ్చు. ఇప్పటికే చందానగర్ సర్కిల్లో పోర్టబుల్ బయోగ్యాస్‌పై డెమో నిర్వహించారు. ప్రయోజనాలెన్నో.. బహుళ ప్రయోజనాలు కల్గిన పోర్టబుల్ బయో గ్యాస్‌ను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం సన్‌గ్రీన్ ఆర్గానిక్ వ్యవస్థాపకురాలు అరుణా శేఖర్ చందానగర్ సర్కిల్–20లో పోర్టబుల్ బయో గ్యాస్‌పై అవగాహన కల్పించారు. దీనిపై వేస్ట్ 500 గ్రాముల తడి చెత్త నుంచి 100 కిలోల తడి చెత్త వెలువడే మిషన్లను అమర్చుకోచ్చు. ఇలా పని చేస్తుంది.. పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను కిచెన్ బాల్కనీలో పెట్టి పైపును కిచెన్‌లో ఉంచుతారు. మిషన్‌తో పాటు స్టౌ కూడా ఉంటుంది. మిషన్ వెంట వచ్చిన బయో కల్చర్‌తో పాటు ఆవు పేడను గుజ్జుగా కలిపి డబ్బాలో వేస్తారు. ఆ తర్వాత మిగిలిపోయిన అన్నం, పండ్లు, కూరగాయల తొక్కలు, సాంబారు, బియ్యం కడిగిన నీళ్లు, మిగిలిపోయిన బోన్ లెస్ మాంసం ముక్కలను అందులో వేయాలి. 24 గంటల అనంతరం గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. మిషన్‌కు మూత ఉండటంతో ఎలాంటి దుర్వాసన రాదు. నిత్యం వాడితే కొద్దిమొత్తంలో వేస్టేజ్ బయటకు వస్తుంది. దానిని పూలు, కూరగాయలు, చెట్లకు ఎరువుగా వాడవచ్చు. 2 కిలోల తడి చెత్త సామర్థ్యం కలిగిన ఫోర్టబుల్ బయో గ్యాస్ మిషన్ విలువ రూ.40,000 ఉంటుంది. రెండు కిలోల చెత్తతో రోజు అర గంట నుంచి గంట సేపు గ్యాస్‌ను ఉపయోగించుకోవచ్చు. కాఫీ, టీతో పాటు ఇతర వంటలు చేసుకునే వీలుంది. ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం.. పోర్టబుల్ బయోగ్యాస్‌ను ఉపయోగించడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తోంది. కేరళలో ఈ గ్యాస్ ఎంతో సక్సెస్ సాధించింది. తడి చెత్తతో గ్యాస్ ఉత్పత్తితో పాటు ఎరువు వస్తోంది. పోర్టబుల్ బయోగ్యాస్‌పై ఇప్పటికి వెయ్యికిపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. గృహాలు, స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా బయోగ్యాస్‌ను ఉపయోగించాలని ప్రజలను చైతన్యం చేస్తున్నాం. – అరుణా శేఖర్, సన్‌గ్రీన్ ఆర్గానిక్ ఫౌండర్ నా కార్యాలయం నుంచే మొదలు.. పోర్టబుల్ బయోగ్యాస్‌ను ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ గ్యాస్‌పై అవగాహన కల్పిస్తున్నాం. రెండు రోజుల్లో పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్‌ను శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ కార్యాలయంలో అమర్చనున్నారు. ఉద్యోగుల లంచ్‌లో వచ్చే వ్యర్థాలతో బయోగ్యాస్‌ను ఉపయోగించుకొని టీ, కాఫీ చేసుకోనున్నాం. ఇప్పటికే చందానగర్‌లో నిర్వహించిన డెమో ద్వారా పోర్టబుల్ బయోగ్యాస్ మిషన్ బాగా పనిచేస్తుందనే నమ్మకం కలిగింది. – హరిచందన, వెస్ట్ జోనల్ కమిషనర్ -
17 కిలోమీటర్లకు బస్సు చార్జీ.. ఒక్క రూపాయే!
ఆవులను పెంచడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని మనకు ఇన్నాళ్లుగా తెలుసు. అయితే ఇప్పుడు ఓ సరికొత్త ప్రయోజనం కూడా ఉందని కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీ నిరూపించింది. ఆవు పేడ నుంచి తయారుచేసిన బయో గ్యాస్‌తో బస్సులను నడిపిస్తున్నారు. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. సాధారణంగా డీజిల్‌తో నడిపించే బస్సులకు లీటర్ డీజిల్‌తో మహా అయితే నాలుగైదు కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజి రాదు. డీజిల్ ధర లీటరు 60 రూపాయలకు పైనే ఉంది. కానీ ఇప్పుడు వీళ్లు కనుగొన్న కొత్త పద్ధతిలో బయో గ్యాస్‌తో బస్సు నడిపితే.. 17 కిలోమీటర్లకు ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుందట. తాజాగా ఈ బస్సును కోల్‌కతా నగరంలో ఉత్తరాన ఉన్న ఉల్టాదంగా నుంచి దక్షిణాన ఉన్న గరియా వరకు నడిపించారు. ఈ ప్రయాణంలో మొత్తం 17.5 కిలోమీటర్ల దూరానికి లెక్క కడితే ఒక్కో ప్రయాణికుడికి ఒక్క రూపాయే ఖర్చయింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత చవకైన ప్రజారవాణా వ్యవస్థ ఇదేనని అంటున్నారు. ఢిల్లీలో బస్సులను సీఎన్జీతో నడిపించినా కూడా కిలోమీటరకు దాదాపు నాలుగైదు రూపాయలు చార్జీ అవుతోంది. ఫోనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గ్రూప్ అనే ఈ కంపెనీ ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేసింది. ఈ సంస్థ అశోక్ లేలాండ్ కంపెనీతో చేతులు కలిపింది. 54 సీట్లున్న బస్సును రూ. 13 లక్షలకు అందించారు. ఇలాంటివి సుమారు 15 బస్సులను త్వరలోనే కోల్‌కతాలో నడిపిస్తామని చెబుతున్నారు. అన్నింటిలోనూ ఒకే తరహా చార్జీలు ఉంటాయి. జంతువులు, వృక్షాల వ్యర్థాల నుంచి మీథేన్‌తో కూడిన బయోగ్యాస్ తయారవుతుంది. ఇది ప్రమాదరహితం, రంగులేని గ్యాస్. దీన్ని వాహనాలకు, విద్యుత్ ఉత్పత్తికి, వంటకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణ అనుకూలమైన ఇంధనం. ప్రస్తుతం తాము బీర్భూమ్ జిల్లాలోని తమ ప్లాంటులో ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారుచేస్తున్నామని, దీన్ని ట్యాంకర్ల ద్వారా కోల్‌కతా తరలిస్తున్నామని ఫోనిక్స్ ఇండియా గ్రూపు సీఎండీ జ్యోతి ప్రకాష్ దాస్ తెలిపారు. బయోగ్యాస్ ఉత్పత్తికి కిలో రూ. 20 చొప్పున ఖర్చవుతుంది. కిలో గ్యాస్‌తో బస్సు 5 కిలోమీటర్లు నడుస్తుంది. దాస్ బోటనీలో పీహెచ్డీ చేశారు. గత 8 ఏళ్లుగా బయో గ్యాస్ మీద పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పుడు తాము జర్మనీ సంస్థ నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకుని, కిలో గ్యాస్‌తో 20 కిలోమీటర్లు నడిచేలా చూస్తున్నామని అన్నారు. ట్యాంకులో 80 కిలోల గ్యాస్ పడుతుందని, దాన్ని ఫుల్ చేస్తే 1600 కిలోమీటర్లు వెళ్తుందని, అందుకే చార్జీలు బాగా తక్కువ ఉంటాయని ఆయన వివరించారు. -
వెయ్యికోట్లతో బయో ఎనర్జీ మిషన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ బయో ఎనర్జీ మిషన్ లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టనుంది. శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించడం కోసం ఇథనాల్, బయో ఇంధనాలు, బయోగ్యాస్ వాడకం విస్తరించేందుకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ .10,000 కోట్ల వ్యయం తో సమీకృత జీవశక్తి యాత్రను ప్రారంభించడానికి యోచిస్తోంది. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికోసం 2017-18 నుంచి 2021-22 వరకు రూ 10,000 కోట్లను కేటాయించారు. గ్రీన్ హౌస్ వాయువులను, కర్బన్ ఉద్గారాలను తగ్గించడమే తమ మిషన్ ఉద్దేశమని ఆయన చెప్పారు. సీఓపీ 21 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 వార్షిక సమావేశం) వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సదస్సులోని (యూఎన్ఎఫ్సీసీ )అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బొగ్గు, పెట్రోలు, డీజిల్, సహజవాయువు, వంటగ్యాస్ బయోమాస్ గుళికలు, బయో ఇథనాల్, బయో డీజిల్, బయో మీథేన్ లాంటి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రగతిశీల సమ్మిశ్రణంకోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ శిలాజ ఇంధనాల ప్రతిక్షేపణ ద్వారా లక్ష్యం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. కపూర్తలాలోని నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బయోఎనర్జీ ని తమ మిషన్ కోసం వరల్డ్ క్లాస్ సంస్థగా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. దీంతోపాటుగా ఎంఎన్ఆర్ ఈ మాజీ సలహాదారు ఎకె ధుస్సా ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ కమిటీకి నియమించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కమిటీ నేతృత్వంలో మిషన్ కు సంబంధించిన విధి విధానాలు రూపుదిద్దుకుంటాయని అధికారి పేర్కొన్నారు. -
నాచు పట్టిన ఇల్లు కరెంట్ ఇస్తుంది!
ఫొటో చూశారుగా... జర్మనీలోని హాంబర్గ్‌లో ఉందీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఏంటి దీని ప్రత్యేకత? ముందువైపు అద్దాల్లో పచ్చగా కనిపిస్తోందే... అదే! ఏముంది అందులో? పాచి! ఎందుకు? ఆ పాచి ఇంటికి కావాల్సిన కరెంట్ మొత్తాన్ని తయారు చేస్తుంది! అదెలా? అంటున్నారా? పాచి చిన్నసైజు మొక్కలన్న సంగతి మీకు తెలుసుకదా... కాబట్టి ఇవి సూర్యరశ్మిని తీసుకుని ఎదుగుతాయి. ఫలితంగా ఏర్పడే బయోమాస్‌ను రియాక్టర్‌లోకి చేరిస్తే.. అక్కడ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని ఫ్యుయెల్ సెల్‌లోకి పంపి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో విడుదలయ్యే కార్బన్‌డై యాక్సైడ్‌ను పాచి మరింత వేగంగా పెరిగేందుకు ఎరువుగా వాడతారు. మొత్తమ్మీద ఈ అపార్ట్మెంట్స్లోని అన్ని ఇళ్లకు కావాల్సిన విద్యుత్తు అక్కడికక్కడే ఉత్పత్తి కావడమే కాకుండా... 24 గంటలూ వేడినీళ్లు పొందేందుకూ ఈ పాచినే వాడుతున్నారు. అంతేకాదు... అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. దాన్ని ఎంచక్కా గ్రిడ్‌కు కనెక్ట్ చేసి అమ్మేసుకుంటున్నారు. భలే ఐడియా కదూ...! -
దారి చూపిన ఊరు
స్ఫూర్తి కొత్తదారి ఎప్పుడు కనిపిస్తుంది? ఏ ఇబ్బందో, కష్టమో వచ్చినప్పుడో... ప్రత్యామ్నాయం కోసం వెదుకుతాం. కొత్త దారి ఒకటి కనుక్కుంటాం. కొందరు మాత్రం కష్టాలు, నష్టాలు దరి చేరక మునుపే ప్రత్యామ్నాయాలను వెదుకుతారు. ముందుచూపుతో వ్యవహరిస్తారు. కంబకాయ గ్రామం అలాంటి ముందు చూపుతోనే వ్యవహరించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా మారింది. ‘గ్యాస్ ధరల కష్టాలు’ అనే మాట వినిపించక ముందే ఊళ్లోకి బయోగ్యాస్‌ను ఆహ్వానించింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శం గా నిలవడమే కాదు తెలుగునాట అగ్రస్థానంలో నిలిచింది. ఇంట్లోకి వంటగ్యాస్ రాగానే పండగ కాదు. రోజురోజూకు పెరుగుతున్న ధరను తట్టుకునే శక్తి ఉండాలి. అలాంటి శక్తి ఎంతమందికి ఉంది? కంబకాయ గ్రామంలో చాలామందికి గ్యాస్ధరల పెరుగుదలతో సంబంధం లేదు. ‘గ్యాస్ ధర మళ్లీ పెరిగింది’లాంటి వార్తలు చదివి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాల క్రితమే ఆ గ్రామానికి ‘బయో గ్యాస్’ రూపంలో ఒక వరం లభించింది. ఇక భయమెందుకు? శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో ఉంది కంబకాయ గ్రామం. రెండు దశాబ్దాల క్రితం అప్పటి గ్రామ సర్పంచ్ పాగోటి రాజారావునాయుడు పశువుల పేడతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేశారు. అప్పటికది ఊరికి కొత్త. దాని ప్రయోజనాల గురించి కూడా ఎక్కువమందికి తెలియదు. అయితే కాలక్రమంలో బయోగ్యాస్ విలువ తెలుసుకోవడం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్క కంబకాయ గ్రామంలోనే 320కి పైగా బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణం జరిగింది. ఇది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. చుట్టుపక్కల 70 గ్రామాల వరకు ఈ ఊరిని స్ఫూర్తిగా తీసుకొని బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాయి, నిర్మిస్తున్నాయి. ఎలా తయారుచేస్తారు? మొదట ట్యాంకు నిర్మిస్తారు. ఈ ట్యాంకు భూమి అడుగు భాగంలో ఉంటుంది. ట్యాంకుకు ప్రక్కన కానీ, ట్యాంకు పైన కానీ ఒక కుండీ నిర్మిస్తారు. ఆ కుండీ ద్వారా పేడ, నీరు కలిపి బాగా చిక్కటి ద్రవ పదార్థంలా తయారు చేసి ట్యాంకులోకి విడిచిపెడతారు. ట్యాంకులో ప్రవేశించిన పేడ మూడు రోజులకి (ప్రారంభంలో) గ్యాస్‌గా మారుతుంది. ఆ ట్యాంకుకు ఏర్పాటు చేసిన పైపులైన్ సహాయం తో గ్యాస్ పొయ్యి వరకు సరఫరా అవుతుంది. మరో వైపు ట్యాంకు లోపల వ్యర్థపదార్థం రెండవ వైపు ఏర్పాటు చేసిన ఔట్లెట్ ద్వారా బయటకు వెళుతుంది. దీన్ని ‘స్లర్రీ’ అంటారు. ప్రతిరోజూ పశువుల పేడను ద్రవపదార్థంగా మార్చి ట్యాంకులో వేస్తుండాలి. ప్రయోజనం ఏమిటి? ‘‘బయోగ్యాస్ వినియోగం ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది’’ అంటున్నారు గ్రామ మాజీ సర్పంచ్ పి.కుసుమకుమారి. గ్యాస్ ధరల పెరుగుదలకు ప్రత్యామ్నాయమనే కాకుండా, బయోగ్యాస్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంట చేసే మహిళలకు కళ్ల జబ్బులు, ఇతర హానికరమైన సమస్యలు ఉండవు. బయోగ్యాస్ వినియోగం అనంతరం విడుదలయ్యే వ్యర్థ పదార్థం ‘స్లర్రీ’ని పంట పొలాలలో ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ సేంద్రియ ఎరువు వినియోగం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది. గ్యాస్ వృథా అవుతుందనిగానీ, ప్రమాదాలు సంభవిస్తాయనే భయం కానీ గృహిణులకు ఉండదు. బయోగ్యాస్‌ద్వారా విద్యుద్దీపాలనూ వెలిగించుకోవచ్చు. ప్రభుత్వ చేయూత... ఒక ప్లాంట్ నిర్మాణానికి సుమారు ఇరవైవేల రూపాయల ఖర్చు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) ద్వారా ఒక్కో ప్లాంట్‌కు ఎనిమిదివేల రూపాయల సబ్సీడి ఇస్తోంది. సబ్సీడీలో భాగంగా పొయ్యి, ఇతర పరికరాలను కూడా సరఫరా చేస్తారు. పర్యావరణ మిత్ర... బయోగ్యాస్‌కు ముందు వంటచెరుకు కోసం చెట్లను నరికేసేవారు. దీని ప్రభావం పర్యావరణంపై పడేది. బయోగ్యాస్ పుణ్యమా అని చెట్లకు ముప్పు తప్పింది. దోమల బెడద తప్పింది. రసాయనిక ఎరువులు కొనే అవసరం తప్పింది. ఒక్కటా రెండా... బయోగ్యాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ గ్యాస్‌ను సమర్థంగా ఉపయోగించుకుంటూ తెలుగునాట అగ్రస్థానంలో నిలిచి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్న కంబకాయ బాటలో ప్రయాణించడానికి ఎన్నో గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నాయి. - సదాశివుని కృష్ణ, సాక్షి, నరసన్నపేట ఫొటోలు: చల్ల మల్లేశ్వరరావు 1. ట్యాంక్‌లో పేడ కలుపుతున్న దృశ్యం 2. స్లర్రీ వినియోగించిన పొలంలో వరినాట్లు వేస్తున్న దృశ్యం 3. బయోగ్యాస్ ద్వారా వంట చేస్తున్న గృహిణి ఎలాంటి సమస్యా లేదు... ఇరవై సంవత్సరాల నుంచి బయోగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాం. ఇప్పటికి వరకు ఏ విధమైన సమస్య రాలేదు. ప్లాంట్ నిర్మాణానికి స్వామిబాబు వజ్రమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ (ఎస్వీసిటీ) స్వచ్ఛంద సంస్థ సహకరించింది. - పాగోటి లక్ష్మి, గృహిణి, కంబకాయ వంటతో పాటు వ్యవసాయోత్పత్తికీ... బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్లర్రీని సేంద్రియ ఎరువుగా వినియోగించడం వల్ల అధిక దిగుబడి, భూమి సారవంతంగా తయారవడం వంటి మంచి ఫలితాలు ఉన్నాయి. వంట ప్రయోజనం కంటే వ్యవసాయోత్పత్తికి ఇది మరీ ప్రోత్సాహంగా ఉంది. - గుజ్జిడి నాగేశ్వరరావు, రైతు -
సౌర, పవన వినియోగంతో విద్యుత్ స్వావలంబన
రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా.. ‘విద్యుత్’కు ప్రత్యామ్నాయాలు వెదకాలని పిలుపు బయోగ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సలహా పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సౌర, పవన విద్యుత్‌లతో పాటు బయోగ్యాస్‌కు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కార మార్గాలను కనుగొనాల్సి ఉందని రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా సూచించారు. ఈ రంగాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను వినియోగిస్తే కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు విద్యుత్ స్వావలంబనకు అవకాశం ఉంటుందన్నారు. నగరంలో గురువారం ఓ ప్రైవేట్ సంస్థతో కలసి కర్ణాటక వాణిజ్య, పారిశ్రామిక సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసిన ‘పచ్చదన శిఖరాగ్ర సమావేశం 2104 -ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ శిఖరాగ్ర సమావేశం’ను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య ఉన్నందున, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరముందన్నారు. 2020-22 నాటికి కనీసం 32 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పునరుత్పాదక విద్యుత్‌పై దృష్టి సారించాలన్నారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటక సౌర విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. దీనిని సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యుత్ రంగంలో స్వావలంబనను సాధించాలని ఆమె సూచించారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. తద్వారా విద్యుత్ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చని చెప్పారు. బెంగళూరులో స్థిరపడతా రాజస్తాన్ గవర్నర్‌గా మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేస్తానని మార్గరెట్ ఆళ్వా తెలిపారు. తదనంతరం బెంగళూరులో స్థిరపడతానని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ కనుమల్లో విద్యుదుత్పాన ప్రాజెక్టులను నెలకొల్పాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకించారు. తన జిల్లా ఉత్తర కన్నడలో జల విద్యుత్కేంద్రం, కైగా అణు విద్యుత్కేంద్రాలు ఉన్నందున, మరిన్ని విద్యుదుత్పాదక కేంద్రాలను ప్రారంభించాల్సిన అవసరం లేదని వివరించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ లేఖలు రాసినట్లు గుర్తు చేశారు. ఒక జిల్లాలో ఎన్ని కేంద్రాలను స్థాపిస్తారని ఆమె ప్రశ్నించారు. అదే పనిగా విద్యుదుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పోతే, అటవీ, పర్యావణ, జన జీవనాలపై దుష్ర్పభావాలు ఉంటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. -
కోడి రెట్టతో బయోగ్యాస్ తయార్ !
పౌల్ట్రీ వ్యర్థాలతో బయోగ్యాస్ తయార్ సాక్షి, హైదరాబాద్: కాసేపు కోళ్ల ఫారాల వద్దకెళితే చాలు... ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం స్వాగతం పలుకుతుంది. కోళ్ల రెట్టతో చెడు వాసనొక్కటే సమస్యకాదు... వ్యర్థాలను నిర్మూలించకుంటే నీటి కాలుష్యం తోపాటు అనేక ఇతర సమస్యలూ ముసురుకుంటాయి. మరి ఈ చిక్కులకు పరిష్కారం? ఆ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడమే అంటోంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ). ఇందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి ఆహూజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ సహకారంతో ఓ నమూనా ప్లాంట్‌ను కూడా సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ నమూనా ప్లాంట్‌ను పౌల్ట్రీ రైతులు, టెక్నాలజిస్టులు, బ్యాంకు అధికారుల కోసం గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఐఐసీటీ డెరైక్టర్ డాక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ దేశంలో పౌల్ట్రీ రంగం ఏటా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వ్యర్థాల సమర్థ నిర్వహణ కీలకమవుతోందని చెప్పారు. ఈ అవసరాన్ని గుర్తించి ఐఐసీటీ ఈ సరికొత్త బయోగ్యాస్ టెక్నాలజీని అభివృద్ధి చేసిందని తెలిపారు. పౌల్ట్రీ వ్యర్థాలకు నీరుతోపాటు ఒక రకమైన బ్యాక్టీరియాను జోడించి, ఆక్సిజన్ లేని వాతావరణం లో కుళ్లబెడితే మీథేన్ వాయువు ఉత్పత్తి అవుతుందని లక్ష్మీకాంతం వివరించారు. పౌల్ట్రీ వ్యర్థాల నుంచి తక్కువ ఖర్చుతో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి చేయగలగడం తమ ప్రత్యేకతని ఆహుజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రతినిధి శ్రుతి అహుజా చెప్పారు. గ్యాస్‌ను కోళ్లఫారాల్లో వినియోగించుకోవచ్చు. మిగిలిన వ్యర్థాన్ని ఆరబెట్టి ఎరువుగానూ, ద్రవరూపంలోనైతే చేపలకు ఆహారంగానూ వాడవచ్చు. ఒకటిన్నర టన్నుల పౌల్ట్రీ వ్యర్థంతో దాదాపు వంద ఘనపుమీటర్ల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుందని, ఇది 42 కిలోల ఎల్పీజీ గ్యాస్‌తో సమానమని శ్రుతి వివరించా రు. కార్యక్రమంలో ఐఐసీటీ బయోఇంజనీరింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ విభాగం సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎ.గంగాగ్నిరావు, శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఎ.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.