రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా? | Watch Total Lunar Eclipse 2025 And The Moon Turns Into | Sakshi
Sakshi News home page

రంగులు పులుముకున్న జాబిల్లి.. ఆకాశంలో ఈ సుందర దృశ్యం చూశారా?

Published Fri, Mar 14 2025 12:25 PM | Last Updated on Fri, Mar 14 2025 7:18 PM

Watch Total Lunar Eclipse 2025 And The Moon Turns Into

ఆకాశంలో ఇవాళ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాదిలో మొదటి గ్రహణం.. అందునా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుదైన బ్లడ్‌ మూన్‌ ఘట్టం చోటు చేసుకోవడంతో ప్రపంచమంతా ఈ దృశ్యాన్ని చూసేందుకు తహతహలాడుతోంది.  

దాదాపు.. రెండేళ్ల తర్వాత ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. భూమి.. సూర్యుడు.. చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు... భూమి నీడ చంద్రుడి మీద పడి పూర్తిగా కప్పేసినప్పుడు ఏర్పడేదే సంపూర్ణ చంద్రగ్రహణం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత ‘బ్లడ్ మూన్’గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడిందని, దీని ప్రకారం  భూమి నీడ జాబిల్లిని 99.1 శాతం కప్పేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భారత కాలమానం ప్రకారం  ఉదయం 11.57 గంటలకు గ్రహణం మొదలైంది. మధ్యాహ్నం 12.29 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుని దాదాపు గంట పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.01 గంటలకు గ్రహణం పూర్తయ్యింది. మొత్తం 3గం. 38 ని.లోనే గ్రహణం మూడుదశలు పూర్తి చేసుకుంది. 

సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో భారత్‌లో పగటి సమయం. కాబట్టి మనకు కనిపించదు. అయితే.. ఆ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్థగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తోంది. ఉత్తర-దక్షిణ అమెరికా దేశాలు, పశ్చిమ ఐరోపా దేశౠలు, ఆఫ్రికా దేశాల్లోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ప్రత్యేకించి.. అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. 

యూరప్‌లో గ్రహణ దశలో చంద్రుడు అస్తమించనుండగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం గ్రహణం పూర్తయ్యే సమయానికి చంద్రుడు ఉదయించాడు. దీంతో అక్కడ ఎటువంటి పరికరాలు లేకుండానే గ్రహణాన్ని నేరుగా వీక్షించారు. ఇప్పటికే పలువురు సోషల్‌ మీడియాలో ఆ దృశ్యాలను పోస్టులు పెడుతున్నారు. 

సాధారణ గ్రహణాల సమయంలో చంద్రుడి పరిమాణం కాస్త పెద్దదిగా, ఎప్పుడు కనిపించే రంగులోనే దర్శనమిస్తాడు. కానీ, బ్లడ్‌మూన్ రోజున జాబిల్లి పూర్తిగా ఎరుపు, నారింజ రంగులో చూపురులను కనువిందు చేశాడు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ఎరుపు, నారింజ కిరణాలు భూ వాతావరణం గుండా ప్రయాణించి చంద్రుడ్ని ప్రకాశింపజేస్తాయి. ఖగోళ పరిభాషలో దీనినే రేలీ స్కాటరింగ్ అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement