
కూరగాయలు అమ్మేందుకు వచ్చి మృత్యుఒడిలోకి..
● విద్యుత్‌షాక్‌తో యువరైతు మృతి
తాంసి: కూరగాయలు విక్రయించేందుకు వచ్చి విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన అశిలీ పొచ్చన్న (38) తనకున్న ఎకరంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని 20 ఏళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నాడు. వాటిని జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌కు తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం కూరగాయలు విక్రయించడానికి జిల్లా కేంద్రంలోని రైతుబజార్‌కు వచ్చాడు. విక్రయించిన అనంతరం రాత్రి సమయంలో విద్యుత్‌బల్బును తొలగించే క్రమంలో షాక్ కొట్టడంతో పక్కనున్న రాళ్లపై పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు.