
వైద్య విద్యార్థుల చేయూత
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులంతా కలిసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవసరమున్న వారికి చేయూతనందిస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు 300 మంది ప్రతీ నెల రూ.100 చొప్పున జమ చేసి కళాశాలలో అవసరమున్న విద్యార్థులతోపాటు సాయం కోసం చూస్తున్న వారికి అందిస్తూ అండగా నిలస్తున్నారు. ఒక విద్యార్థికి సంబంధించిన ఏడాది ఫీజును చెల్లించారు. మంగళవారం మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు న్యాప్‌కిన్స్ అందజేశారు. విద్యార్థినులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.