వేమనపల్లి/కోటపల్లి: ఆదివాసీ యువజన సంఘం పేరిట వేమనపల్లి మండలం ముక్కిడిగూడెం, కళ్లంపల్లి, సుంపుటం, జాజులపేట, కో టపల్లి మండలం వెంచపల్లి, ఆలుగామ, రొ య్యలపల్లి, సిర్సా, లింగన్నపేట, పంగిడిసో మారం, నక్కలపల్లి గ్రామాల్లో మావోయిస్టుల కు వ్యతిరేకంగా శుక్రవారం వాల్‌పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. బాంబులు పెట్టామంటూ మావోయిస్టులు ఆదివాసీలను బెదిరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కాలం చెల్లించిన సిద్ధాంతాలకు స్వస్తి పలకాలని కోరారు. కర్రెగూడ పేలుడు ఘటనను ప్రస్తావిస్తూ వాల్‌పోస్టర్లను ముద్రించారు. వాల్‌పోస్టర్లు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసు శాఖ అ ప్రమత్తమై వాల్‌పోస్టర్లపై ఆరా తీయడంతోపా టు ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు.