
నిర్మల్ విద్యార్థుల ప్రతిభ
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఉపాధ్యాయులు పోతుల్వార్ సురేష్–స్వప్న దంపతుల కుమారుడు సృజన్ కుమార్ జేఈఈ మెయిన్‌లో 99.96 శాతం పర్సంటైల్‌తో ఆలిండియాలో 683 కామన్ ర్యాంక్, ఓబీసీ విభాగంలో 105 ర్యాంక్ సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన అటోలి సంజీవ్ కుమార్, చింతప్రభ దంపతుల కుమారుడైన రుతిక్ కుమార్ 99.89 శాతం పర్సంటైల్ సాధించి ఓబీసీ కోటాలో 301 ర్యాంకును కై వసం చేసుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నహిద్ పాష కుమారుడు సయ్యద్ రియాజ్ 99.88 శాతం పర్సంటైల్ సాధించాడు.

నిర్మల్ విద్యార్థుల ప్రతిభ