
జేఈఈలో మెరిసిన మనోళ్లు
బెల్లంపల్లి సీవోఈ విద్యార్థుల ప్రతిభ
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ ఫలితాలను ప్రకటించింది.
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. కళాశాల నుండి మొత్తం 39 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 15 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వీరే...
ఎస్.కే. సుభాన్ 88.88 పర్సంటైల్ సాధించి కళాశాల టాపర్‌గా నిలవగా కె.రంజిత్ 86.57, సీహెచ్.సాయికుమార్ 85.15, కె.శ్రీనివాస్ 80.17, ఎం.సాయిరాం 78.99, ఆర్.అంజి 78.53, కె.శారూన్ 76.84, డి.రాజేందర్ 75.69, ఎస్.ఆదర్శ్ 75.04, ఎన్.రాజేశ్, 75.35, ఎస్.వెంకటేశ్వర్ 72.66, బి.ప్రవీణ్‌కుమార్ 73.67, బి.అంజిబాబు 72.30, జీ.చరణ్ 63.87, కె.రామ్ చరణ్‌తేజ 62.39 పర్సంటైల్ సాధించారు. సదరు విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గం రమాదేవి, లెక్చరర్లు అభినందించారు.
సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు
బెల్లంపల్లి సీవోఈ కళాశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ సారి కూడా జేఈఈ మెయిన్స్‌లో 15 మంది విద్యార్థులు మెరుగైన పర్సంటైల్ సాధించారు. సమష్టి కృషితోనే విజయం సాధ్యమైంది. నిరుపేద విద్యార్థులైనా చదువులో తామేమీ తక్కువ కాదని నిరూపించారు.
– ఆకిడి విజయ్‌సాగర్, సీవోఈ ప్రిన్సిపాల్, బెల్లంపల్లి
షేక్ అమన్

జేఈఈలో మెరిసిన మనోళ్లు

జేఈఈలో మెరిసిన మనోళ్లు

జేఈఈలో మెరిసిన మనోళ్లు

జేఈఈలో మెరిసిన మనోళ్లు

జేఈఈలో మెరిసిన మనోళ్లు

జేఈఈలో మెరిసిన మనోళ్లు