
దేశానికే దిక్సూచిలా పాలన
మంచిర్యాలటౌన్: తెలంగాణ ఉద్యమం 1969, 1972 లలో పెద్ద ఎత్తున సాగినా నాడు తెలంగాణను సాధించుకోలేక పోయాం. తెలంగాణ సాధన కోసం నాడు కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ను స్థాపించి అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకుసాగారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం దీక్షా దివాస్‌తో కేంద్రం కదిలివచ్చి డిసెంబర్ 9న తెలంగా ణను ప్రకటించింది. అయినా ఎన్నో ఇబ్బందులకు గురిచేయడంతో రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసి పోరాడిన ఘనత కేసీఆర్‌ది. 2014లో రాష్ట్ర పగ్గాలు చేప ట్టి దేశానికే దిక్సూచిలా పదేళ్లు చేసిన పరిపాలన, పథకాలు, అభివృద్ధి ఎనలేనిది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం ఇవ్వడంతో అభివృద్ధి చేసేందుకు అవకాశం వచ్చింది. ఈ నెల 27న చరిత్రలో నిలిచిపోయేలా రజతోత్సవ సభ నిర్వహిస్తాం. – మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మంచిర్యాల