
స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చింది..
బెల్లంపల్లి: ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానే బీఆర్‌ఎస్ పార్టీకి ఎంతో ఘనచరిత్ర ఉంది. స్వ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ప్రజా సహకారంతో వీరోచితంగా పోరాడి అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయ పార్టీగా ఏర్పడి సాధించుకున్న తెలంగాణను బంగారుమయం చేయడానికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ 10ఏళ్లపాటు కష్టపడ్డారు. ఎందరో అమరులు తెలంగాణ కోసం ప్రాణాలు వదిలారు. ఒక్కడితో ఏర్పడిన పార్టీ క్రమంగా బలోపేతమైంది. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్రతో మరే రాజకీయ పార్టీని చూడలేం. బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర ప్రజల జీవితం ముడి పడి ఉంది.
– మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బెల్లంపల్లి