
భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి
నస్పూర్: భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై రై తులందరూ పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణ పరిధిలోని సీతారాంపల్లి రైతువైదిక వద్ద భూభారతి నూతన ఆర్‌ఓఆర్ చట్టంపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూ తన చట్టంపై ఈ నెల 30 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి అవగాహన క ల్పిస్తామని తెలిపారు. హక్కులు, రికార్డుల్లో తప్పు ల సవరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. భూఆధార్ కార్డులు జారీ చేస్తామని, భూ సమస్యల పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, జూన్ 2 నుంచి చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని అన్నారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మండలంలోని కొత్తూరు, వెంకట్రావ్‌పేట, ఎల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. నిర్వాహకులు రైతుల వివరాలు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. ధాన్యం రశీదులు రైతులకు అప్పగించాలని అన్నారు. కొనుగోలు కేంద్రం నిర్వహకులు, గ్రామ సమైఖ్య సభ్యులు పాల్గొన్నారు.
వరిధాన్యం బకాయిలు చెల్లించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: గత 2022–23 యాసంగి సీజన్ వరిధాన్యం బకాయి ఉన్న రైస్‌మిల్లరు వెంట నే పూర్తిగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారా వు, జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్‌మిల్లర్లతో బకాయి చెల్లింపులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం బకాయి ఉన్న దాదాపు రూ.87 కోట్లు రైస్‌మిల్లర్లు వెంటనే చెల్లించాలని, రూ.కోటిలోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలని పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్