
సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన
శ్రీరాంపూర్: సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన చేస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సీసీసీలోని సింగరేణి హైస్కూల్‌లో పదోతరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్, కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అరవిందరావు, పాఠశాల కరస్పాండెంట్ ఏ.రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు సంతోష్, రిటైర్డ్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఇంద్ర ప్రకాష్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు సమ్మయ్య, వాణిశ్రీ, రాజారెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి,
కృష్ణ్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.