
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?
పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.
(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)
ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట.
మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార‍్తలు నిజమేనని తేలుతుంది.
(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!)