
ఒకప్పుడు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా ఒకే కుటుంబంలా ఉండేది. ఏ పండగ వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్లు. కానీ రానురానూ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. అది ఇటీవల తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో హీరో రామ్‌చరణ్ (Ram Charan) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)ను అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ వరుసకు బావ, బావమరిది అవుతారు. బంధువులుగా కంటే స్నేహితుల్లానే ఎక్కువగా కలిసిమెలిసి ఉండేవారు.
అన్‌ఫాలో చేసిన చరణ్?
సడన్‌గా ఏమైందో ఏమో కానీ బన్నీని రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశాడు. రామ్‌చరణ్ అన్‌ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్ అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేశాడు. బన్నీని వదిలేసిన చరణ్.. అల్లు శిరీష్ (Allu Sirish)ను మాత్రం ఫాలో అవుతుండటం గమనార్హం. అటు అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే అనుసరిస్తున్నాడు.

దూరమవుతున్న బంధం?
ఏపీ ఎన్నికల సమయం నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇటీవల తండేల్ (Thandel Movie) ఈవెంట్‌లోనూ అల్లు అరవింద్.. చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువే ఆడిందని కామెంట్స్ చేశాడు. ఒక్క వారంలోనే దిల్‌రాజు నష్టాలు చూశాడంటూ.. గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. దీనిపై ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చాడు. రామ్‌చరణ్ తన ఏకైక మేనల్లుడని, తనకు కొడుకులాంటివాడని పేర్కొన్నాడు. ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరాడు.