
డైరెక్టర్ మెహర్ రమేశ్ సోదరి మరణం పట్ల మెగాస్టార్ సంతాపం వ్యక్తం చేశారు. నా తమ్ముడు మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. తాను నాకు కూడా సోదరేనని ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి, నా తమ్ముడు మెహర్ రమేశ్‌కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా అని ట్వీట్ చేశారు.
(ఇది చదవండి: టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం)
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ.. నా సోదరి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు.
తమ్ముడు మెహెర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి స్వర్గస్థులవటం ఎంతో కలచి వేసింది. తాను నాకూ సోదరే. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడు, దర్శకుడు మెహెర్ రమేష్ కు, నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ, నా సోదరి ఆత్మ కి శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025