
నాని(Nani) అంటే కుర్రాళ్ల దగ్గర నుంచి ఫ్యామిలీస్ వరకు నచ్చే హీరో. కానీ గత కొన్నాళ్ల నుంచి ట్రెండ్ కి తగ్గట్లు తను కూడా మారుతున్నాడు. యాక్షన్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీకి తాజాగా సెన్సార్ జరగ్గా.. పిల్లలు, సున్నిత మనస్కులకు నో ఎంట్రీ అనే టాక్ వినిపిస్తోంది.
చాన్నాళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. హిట్ 3(Hit 3 Movie) గురించి హింట్ ఇచ్చేశాడు. యాక్షన్ గట్టిగా ఉంటుందని, కచ్చితంగా పిల్లలు చూడకూడదని అన్నాడు. ఇప్పుడు అదే జరిగింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే 18 ఏళ్లు నిండిన వాళ్లు మాత్రమే ఈ మూవీ చూసేందుకు అర్హులు.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)
మరోవైపు గతకొన్నాళ్ల క్రితం రిలీజై టీజర్(Hit 3 Teaser) కూడా రక్తపాతం అనేలా ఉంది. దీంతో మూవీ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే సినిమాలోనూ అలాంటి సీన్లు చాలానే ఉన్నాయని, సెన్సార్ వాటిని బ్లర్ చేయమని ఆదేశించిందని తెలుస్తోంది. బూతులు కూడా ఉన్నాయని అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తోంది.
నాని పోలీస్ గా నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. మే 1న థియేట్రికల్ రిలీజ్. కానీ మూడు వారాల ముందే సెన్సార్ చేయించేశారు. సోమవారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అలా ప్రమోషన్స్ షురూ చేస్తారనమాట.
(ఇదీ చదవండి: తమన్నా ట్రెండీ ఐటమ్ సాంగ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు?)