
నవీన్ చంద్ర హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ లెవెన్’. డైరెక్టర్ సుందర్ సి. వద్ద ‘కలకలప్పు 2, వందా రాజావా దాన్ వరువేన్, యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసిన లోకేశ్ అజ్లస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రేయా హరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అభిరామి, రవి వర్మ, కిరీటి దామరాజు కీలక పాత్రలు పోషించారు.
ఏఆర్ ఎంటర్‌టైన్ మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన ఈ సినిమాను మే 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి, నవీన్ చంద్ర పోస్టర్ విడుదల చేశారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హ్యాష్‌ట్యాగ్ లెవెన్’. ఈ మూవీ ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమేరా: కార్తీక్ అశోకన్.