
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ నెల 18న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయశాంతి కీలక పాత్రలో, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, కల్యాణ్ రామ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ లుక్‌లో కల్యాణ్ రామ్ కనిపిస్తారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాం. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది’’ అని చిత్రబృందం పేర్కొంది