
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబసభ్యులతో పాటు సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. రెండురోజుల క్రితం సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) గాయపడిన విషయం తెలిసిందే. అయితే, ఆ చిన్నారి ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాడు. కొద్దిసేపటి క్రితం పవన్ తన సతీమణి అన్నాలెజినోవా, మార్క్‌శంకర్‌తో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. పవన్ తన కుమారుడిని ఎత్తుకుని వస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సింగపూర్‌లోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో పవన్ సతీమణి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. గతేడాదిలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆమె పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమంలో పవన్ కూడా పాల్గొన్నారు. ఆమె అక్కడ చదువుకుంటున్నందున తన కుమారుడు మార్క్ శంకర్ కూడా సింగపూర్‌లోనే స్కూల్‌లో చేరిపించారు. అగ్ని ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. దీంతో కొన్ని నెలల పాటు పవన్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోనే వుంటుందని తెలుస్తోంది.
ఆ తరువాత కూడా వారు సింగపూర్‌కు వెళ్తారా..? లేదా ఇక్కడే ఏదైనా మంచి స్కూల్‌లో బాబుని జాయిన్ చేస్తారో తెలియాల్సి వుంది. హైదరాబాద్‌లో కూడా చాలావరకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖల పిల్లలు వాటిలో చదువుతున్నారు. సింగపూర్‌లో అన్నా లెజినోవా చదవు కూడా పూర్తి అయింది కాబట్టి వారు హైదరాబాద్‌లోనే ఉండే ఛాన్స్ ఎక్కువని అంటున్నారు.
