
Prakash Jha Set To Direct Multilingual Series On PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్ రాబోతుంది. భారతదేశ రూపురేఖల్ని మార్చిన పీవీ తీరుపై వినయ్ సీతాపతి ‘హాఫ్ లయన్’ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగానే వెబ్‌సిరీస్‌ను రూపొందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా దీనికి దర్శకత్వం వహించనున్నారు.
హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్టు ప్రకాష్ ఝా ప్రకటించారు. వెబ్ సిరీస్‌ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 2023లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా 1991 నుంచి 1996 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే.