
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్(Home Town). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాల నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తమ పిల్లలు బాగా చదివి గొప్పవాళ్లుగా ఎదిగితే చూడాలని ఆశపడే తండ్రి తపనే ట్రైలర్‌లో ప్రధానంగా కనిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనేదే హోమ్ టౌన్‌లో ట్రైలర్‌లో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
You can leave your hometown, but can you ever leave the memories?
The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s— ahavideoin (@ahavideoIN) March 25, 2025