
సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అర్థం కావట్లేదు. గతంలో మన చాలామందిని చూశాం. కేవలం సోషల్ మీడియా వల్ల ఓవర్ నైట్‌లో స్టార్స్ అయిపోయిన వాళ్లున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వివాదం మరింత వైరల్ కావడంతో కొందరైతే ఏకంగా రీల్స్ కూడా చేసేస్తున్నారు.
అయితే తాజాగా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని ఏకంగా సినిమా ప్రమోషన్స్‌లోనూ వాడేస్తున్నారు. టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించారు. హీరోయిన్ రూప కొడువాయూర్‌తో కలిసి ప్రియదర్శి ప్రమోషన్స్ చేశారు.
అయితే ఇద్దరు కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తరహాలో సారంగపాణి జాతకం ప్రమోషన్ చేశారు. ఇందులో హీరోయిన్ ఓ డ్రెస్ చూపిస్తూ చాలా బాగుంది కదా.. అంటూ ప్రియదర్శిని అడుగుతుంది. అది చూసిన హీరో వావ్ సూపర్.. రేటు చూసి రూ.14999 నా అంటూ నోరెళ్లబెడతాడు. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ స్టైల్లో హీరోకు ఇచ్చి పడేస్తుంది. ముందు కెరీర్‌పై ఫోకస్ చేయ్.. డ్రెస్సె కొనలేనివాడిని.. ప్రేమ, పెళ్లి జోలికి పోవద్దు.. అంటూ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో ప్రియదర్శితో మాట్లాడుతుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్‌ను ఇలా కూడా వాడేస్తున్నారా? అంటూ పోస్టులు పెడుతున్నారు.
#alekhyachittipickles ni ila Kuda
Vaaduthunnara😭😂#SarangapaniJathakam pic.twitter.com/KfgAzzS6PH— Urstruly Vinodh (@UrsVinodhDHFM) April 5, 2025