
బెంగళూరు: ఏదైనా కళాశాలో పంక్షన్ జరుగుతున్నప్పుడు విద్యార్థులు నృత్యం చేస్తుంటే, ఉపాధ్యాయులు వారిని ఉత్సహపరచడాన్ని, ఆనందించడాన్ని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నమైన దృశ్యం బెంగళూరులో కనిపించింది. ఇక్కడి ఒక కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల సమక్షంలో హిప్-హాప్ నృత్యం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌ను ఉత్సాహపరుస్తుండగా, అతను డాన్స్ ఇరగదీయడాన్ని మనం వీడియోలో చూడవచ్చు.
గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ(Global Academy of Technology) (గాట్) విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ప్రొఫెసర్ పుష్ప రాజ్.. ప్లే అవుతున్న మ్యూజిక్‌కు అనుగుణంగా నృత్యం చేయడాన్ని చూడవచ్చు. మైఖేల్ జాక్సన్ తరహాలో నృత్యం చేశారు. కళాశాల కారిడార్‌లో ప్రొఫెసర్ నృత్యం చేస్తుండగా, విద్యార్థులు ఆనందంతో కేకలు వేశారు. కళాశాలలోని విద్యార్థులంతా అతని నృత్యాన్ని వీక్షించారు. ఈ వీడియో ఇప్పటికే 24 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుంది.
ఈ వీడియోను చూసిన యూజర్స్ సోషల్ మీడియా(Social media)లో రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒక యూజర్ ‘నృత్యకారునిగా పుట్టారు.. లెక్చరర్‌గా బలవంతంగా మారారు’ అని రాయగా, మరొకరు ‘అతను నా గురువు కాకుంటే, నాకు ఇష్టమైన హీరో అయ్యేవారు’ అని రాశారు. మరొకరు ‘అతను తనకు నచ్చని వృత్తిలో కొనసాగుతున్నారు’ అని రాశారు. మొరొకరు *అతను మాస్టర్ జీ కాదు..డ్యాన్స్ మాస్టర్ జీ’ అని రాశారు.
ఇది కూడా చదవండి: New Delhi: తృటిలో తప్పిన తొక్కిసలాట