రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. లోపలే 9 నిమిషాలున్న అనుమానితుడు | CCTV Footage Shows Bengaluru Rameshwaram Cafe Bomb Blast Suspect Is In Inside For 9 Minutes, Watch Video - Sakshi
Sakshi News home page

Rameshwaram Cafe Bomb Blast Video: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. లోపలే 9 నిమిషాలున్న అనుమానితుడు

Published Mon, Mar 4 2024 8:44 PM | Last Updated on Tue, Mar 5 2024 10:48 AM

Rameshwaram Cafe Blast Suspect Inside For 9 Minutes CCTV Show - Sakshi

గతవారం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పేలుడు సంభవించడానికి కారణమైన ఓ వ్యక్తి సుమారు 9 నిమిషాల పాటు కేఫ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడు సన్ గ్లాసెస్, మాస్క్, బేస్ బాల్ టోపీతో బస్టాండ్ నుంచి రామేశ్వరం కేఫ్ వైపు నడుస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. శుక్రవారం ఉదయం 11.34 గంటలకు బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని కేఫ్‌లోకి ప్రవేశించిన అతను మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపించాడు.

మరో ఫుటేజిలో అతడు ఉదయం 11.43 గంటలకు కేఫ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడు వచ్చినంత హడావుడిగానే వెళ్లిపోయినట్లు ఫుటేజిలో కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్‌లో అనుమానితుడు తొమ్మిది నిమిషాలు మాత్రమే గడిపినట్లు సీసీటీవీ ఆధారాలు సూచిస్తున్నాయి.

పేలుడుకు కారణమైనట్లు అనుమానిస్తున్న వ్యక్తి కేఫ్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (IED) ఉన్న బ్యాగ్‌ని వదిలిపెట్టాడు. ఈ పేలుడులో కొంతమంది కేఫ్ సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు. ఈ కేసును ప్రస్తుతం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) టేకోవర్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement