
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉందని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో తమిళనాడు, గుజరాత్‌లలో ఒక్కరేసి చొప్పున బాధితులు చనిపోయారని పేర్కొంది.
శీతల వాతావరణం, కోవిడ్–19 వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి కారణంగా కేసులు వేగంగా పెరుగుదల నమోదవుతోందని తెలిపింది.