
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల పత్రాలు, ఆస్తి పత్రాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాలలో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది మే 1 నుండి అమలు కానుంది.
2014 మే 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారు తప్పకుండా వ్యక్తి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు ఆ తరువాత ఇంటిపేరు వచ్చేలా కొత్త ఫార్మాట్ పాటించాలి. క్యాబినెట్ నిర్ణయాన్ని ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మంగళవారం తమ తల్లి పేరు ఉన్న నేమ్‌ప్లేట్‌లను చూపించారు. అయితే.. అనాథలకు ఈ కొత్త నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దీనికి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
एकनाथ गंगुबाई संभाजी शिंदे...!
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) March 12, 2024
आई एक नाव असतं... घरातल्या घरात गजबजलेलं गाव असतं... कवी फ.मु. शिंदे यांच्या कवितेच्या ओळींमधून आईची महती आपल्याला समजते. आपल्याला जन्म देण्यापासून आपल्याला मोठे करण्यात ज्या माऊलीचा सिंहाचा वाटा असतो तिला तिचं श्रेय देण्याचा ऐतिहासिक निर्णय राज्य… pic.twitter.com/PTEJt4AGii