
చలివేంద్రాల ఏర్పాటు
జయపురం: జయపురం పట్టణంలోని 28 వార్డులలో జయపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 1వ తేదీ ఉత్కళ దినోత్సవాల సందర్భంగా 28 చలివేంద్రాలతోపాటు 8 చల్లని నీటి చలివేంద్రాలను (కోల్డ్ డ్రింకింగ్ వాటర్ కేంద్రాలు) ఏర్పాటు చేసిందని బుధవారం మున్సిపాలిటీ సహాయ కార్యనిర్వాహక అధికారి కృతిబాస సాహు వెల్లడించారు. వేసవి కాలం ప్రారంభం నుంచి ఎండలు మండుతున్నాయని, అందువలన దాహార్తులకు తాగునీరు సమకూర్చే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారాలు, ఇతర ప్రాంతాల నుంచి జయపురం వచ్చేవారికి చలివేంద్రాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.

చలివేంద్రాల ఏర్పాటు