‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’ | BRS Leader Palla Rajeshwar Reddy Slams Kadiyam Srihari Again | Sakshi
Sakshi News home page

‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’

Published Mon, Apr 7 2025 8:59 PM | Last Updated on Mon, Apr 7 2025 9:17 PM

BRS Leader Palla Rajeshwar Reddy Slams Kadiyam Srihari Again

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం రోజురోజుకూ ీవ్రతరమవుతోంది.  ఈ నేతలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్ల ఇచ్చకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను బొచ్చు కుక్క అన్న వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొట్టారు పల్లా.

తాను కుక్కనేనని, కాకపోతే ప్రజలకు విశ్వాసంగా పని చేసే కాపలా కుక్కనన్నారు. అదే సమయంలో కడియం శ్రీహరిని గుంట నక్కతో పోల్చారు. నీలాగా గుంట నక్కను కాదంటూ మండిపడ్డారు. ‘ఘన్‌పూర్‌కు మున్సిపాలిటీ వస్తే ఆపేసారు, డిగ్రీ కాలేజీ ఆపేసారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసారు, 100 పడకల ఆస్పత్రిని ఆపేశారు. నవాబ్‌పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది.. పనులు చేయడమనే చరిత్ర మనది’ అంటూ మండిపడ్డారు.

ఇటీవల తనను ‘బొచ్చు కుక్క’ అనేలా మాట్లాడిన కడియంను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. “అవును నేను కుక్కనే..నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటాను. నీలాగా గుంట నక్కను మాత్రం కాదు,” అని పల్లా స్పష్టంగా చెప్పారు. ‘అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు.ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు ఆ భూములను కాపాడటానికి నేను రేసు కుక్కలా ఉంటా’ అని తెలిపారు.

కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కను. ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే లక్షణాలు నాకు ఉన్నాయి. నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్ద ఉన్నాయి’ అని కూడా హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement