Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Thopudurthi Prakash Reddy Strong Counter to Ramagiri SI Sudhakar Yadav1
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?

అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్‌ యాదవ్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్‌ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్‌ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్‌ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్‌ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Amid Trump tariffs come into effect big Cabinet meet India today Updates2
ట్రంప్‌ టారిఫ్‌.. భారత ప్రతీకారం అనుమానమే?

న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే.. అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్‌ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్‌ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్‌ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్‌ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.

home loan emi reducing due to rbi repo rate cut3
ఆర్‌బీఐ తాజా నిర్ణయం.. గృహ రుణంపై ఊరట

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) రెపో రేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్‌ రుణాలపై వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. దీంతో ఈఎంఐల భారం తగ్గనుంది. గత ఐదేళ్లుగా ఆర్‌బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచింది. 2025 ఫిబ్రవరిలో చాలాకాలం తర్వాత 25 పాయింట్లు తగ్గించింది. మరోసారి తాజాగా మరో 25 పాయింట్లు తగ్గుస్తున్నట్లు తెలిపింది. దాంతో ప్రధానంగా అధిక కాలం ఈఎంఐలు కొనసాగే గృహ రుణ గ్రహీతలకు ఇది బంపర్‌ అవకాశమనే చెప్పొచ్చు. అటు మందగమనంతో ఆశగా ఎదుచుచూస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా తాజా తగ్గింపు తగిన బూస్ట్‌ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.గృహ రుణంపై ఊరట ఎంతంటే..?ఒక వ్యక్తి తాజా రెపో రేటు కోతకు ముందు 8.75 శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి రూ.25 లక్షల ఇంటి రుణం తీసుకున్నారనుకుందాం. అతనికి ప్రస్తుతం రూ.22,093 చొప్పున నెలవారీ వాయిదా (ఈఎంఐ) పడుతుంది. ఆర్‌బీఐ తాజా పావు శాతం రేటు కోత నేరుగా బ్యాంకులు వర్తింపజేస్తే.. గృహ రుణంపై వడ్డీ రేటు 8.5 శాతానికి తగ్గుతుంది. దీని ప్రకారం ఈఎంఐ రూ.21,696కు దిగొస్తుంది. అంటే నెలకు రూ.397 తగ్గినట్లు లెక్క. మిగతా రుణ వ్యవధిలో ఇతరత్రా ఎలాంటి మార్పులు జరగకుండా ఉంటే, దీర్ఘకాలంలో రుణ గ్రహీతకు రూ.95,280 వేలు మిగులుతాయి. ఒకవేళ అదే ఈఎంఐ మొత్తాన్ని కొనసాగిస్తే.. రుణ కాల వ్యవధి 10 నెలలు తగ్గుతుంది.ఇదీ చదవండి: ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్లపై కీలక నిర్ణయంరెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది.

Manchu Manoj Issue With Mohan Babu Latest4
మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ఆందోళన

ప్రస్తుతం సైలెంట్ అయ్యారే అనుకుంటున్న టైంలో మంచు కుటుంబంలో(Manchu Family) మరోసారి వివాదం మొదలైంది. తాను ఇంట్లో లేనప్పుడు తన కారు, ఇతర వస్తువుల్ని ఎత్తుకెళ్లారని మనోజ్(Manchu Manoj).. అన్న విష్ణుపై కేసు పెట్టాడు. జల్‌పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదంతా మంగళవారం జరిగింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)తాజాగా బుధవారం ఉదయం.. జల్ పల్లిలోని మోహన్ బాబు(Mohan Babu) ఇంటి ముందు మనోజ్ ఆందోళనకు దిగాడు. కూతురు పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లగా.. తన ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని, దీని గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన స్పందించట్లేదని మనోజ్ చెప్పాడు. దీంతో గేటు ముందే బైఠాయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొన్నాళ్ల క్రితం విష్ణు-మనోజ్ మధ్య మొదలైన గొడవ.. చాలారోజుల పాటు నడిచింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లింది. ఏమైందో ఏమో మరి సైలెంట్ అయ్యారు అనుకునేంతలోపు మళ్లీ వివాదం రాజుకున్నట్లు కనిపిస్తుంది.(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!)ఇక మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు. కావాలనే అందరినీ పిచ్చో‍ల్లని చేస్తున్నారు. నా కూతురు బర్త్ డే చేసుకోవడానికి ఏప్రిల్ 2 న వచ్చాము. ఇక్కడ పరిస్థితులు బాగోలేక పోవడంతో జైపూర్ కు వెళ్ళాము. నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వండి. ఇంట్లో మూడు పెట్స్ ఉన్నాయి, అవి ఇవ్వమని అడుగుతున్నా. ఏరోజు నేను ఆస్తి కోసం కొట్లాడలేదు. నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నేనంటే విష్ణుకి కుల్లు. కోర్టు ఆర్డర్ ఉన్నా నన్ను లోపలికి వెళ్ళి నివ్వడం లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారు అని మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు.

Dhoni Unmissable Reaction As Preity Zinta Celebrates Shashank Dropped Catch5
ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌

ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ (PBKS vs CSK) మధ్య మంగళవారం నాటి మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. ఆరంభంలోనే వికెట్లు తీస్తూ జోష్‌లో ఉన్న రుతురాజ్‌ సేనకు.. ఆ తర్వాత వరుస షాకులు తగిలాయి. పంజాబ్‌ యువ ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య (Priyansh Arya) ఆకాశమే హద్దుగా చెలరేగి.. చెన్నై బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు.పంజాబ్‌ @ 219 తాను ఇచ్చిన క్యాచ్‌లను డ్రాప్‌ చేసి లైఫ్‌ ఇచ్చిన ప్రత్యర్థి జట్టుపై ఏమాత్రం కనికరం లేకుండా వీరబాదుడు బాదాడు. కేవలం 42 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఏకంగా తొమ్మిది సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. అయితే, నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో విజయ్‌ శంకర్‌ క్యాచ్‌ పట్టడంతో ఎట్టకేలకు ప్రియాన్ష్‌ ఆర్య సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.అయితే, ఈ ఆనందాన్ని శశాంక్‌ సింగ్‌, మార్కో యాన్సెన్‌ సీఎస్‌కే ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శశాంక్‌ సింగ్‌ 36 బంతుల్లో 52.. యాన్సెన్‌ 19 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.చిన్న పిల్లలా గెంతులేస్తూఅయితే, ఇన్నింగ్స్‌ రెండో బంతికే ప్రియాన్ష్‌ ఆర్య ఇచ్చిన క్యాచ్‌ మిస్‌ చేయడం ద్వారా.. పంజాబ్‌ భారీ స్కోరుకు చేజేతులా బీజం వేసిన సీఎస్‌కే.. ఆ తర్వాత మరో రెండుసార్లు లైఫ్‌ ఇచ్చింది. దీంతో అతడు మెరుపు శతకంతో దుమ్ములేపాడు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ జట్టు యజమాని ప్రీతి జింటా చిన్న పిల్లలా గెంతులేస్తూ ప్రియాన్ష్‌ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకున్నారు.This is what we pay our internet bills for... ❤️pic.twitter.com/mE38MmXFB0— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025 స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ ప్రీతి.. ధోని సీరియస్‌మరోవైపు.. శశాంక్‌ సింగ్‌ 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించగా.. టాప్‌ ఎడ్జ్‌కు తాకి బంతి గాల్లోకి లేచింది. అయితే, అతడు ఇచ్చిన క్యాచ్‌ను రచిన్‌ రవీంద్ర డ్రాప్‌ చేశాడు. అప్పటికి శశాంక్‌ సింగిల్‌ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరో చెత్త విషయం ఏమిటంటే.. ఓవర్‌త్రో కారణంగా పంజాబ్‌కు మరో అదనపు పరుగు లభించింది.ఈ క్రమంలో ప్రీతి జింటా.. స్టాండ్స్‌లో అటూ ఇటూ పరిగెడుతూ వైల్డ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అయితే, అదే సమయంలో చెన్నై మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని కోపం పట్టలేక సీరియస్‌ లుక్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.Preity zinta cutie enjoying shashank’s catch drop😇😇Thankyou csk 🤣🤣 #CSKvsPBKS #pbksvscsk pic.twitter.com/xpCdtuuz6v— gαנαℓ (@Gajal_Dalmia) April 8, 2025ఇక పంజాబ్‌ విధించిన 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చెన్నై చతికిల పడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసి.. 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సీఎస్‌కే బ్యాటర్లలో ఓపెనర్లు రచిన్‌ రవీంద్ర (36), డెవాన్‌ కాన్వే (69 రిటైర్డ్‌ అవుట్‌), శివం దూబే (42), ధోని (27) ఫర్వాలేదనిపించారు. కాగా ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి కాగా.. పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. Back to winning ways this season ✅First home win this season ✅@PunjabKingsIPL compile a comprehensive 1⃣8⃣-run victory over #CSK ❤️Scorecard ▶ https://t.co/HzhV1VtSRq #TATAIPL | #PBKSvCSK pic.twitter.com/HtcXw4UYAK— IndianPremierLeague (@IPL) April 8, 2025చదవండి: PBKS Vs CSK: గ్లెన్‌ మాక్స్‌వెల్‌కు షాకిచ్చిన బీసీసీఐ!

Tamilisai Soundararajan Father Kumari Ananthan Passes Away6
మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కన్నుమూత

చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఇంట విషాద ఘటన చోటుచేసుకుంది. తమిళిసై తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు కుమారి అనంతన్(93) తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆరోగ్యం విషమించడంతో అనంతన్‌ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.వివరాల ప్రకారం.. మాజీ గవర్నర్‌ తమిళిసై తండ్రి కుమారి అనంతన్(93) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ క్రమంలో అనంతన్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ఆమె కుమార్తె తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తన తండ్రి మృతి నేపథ్యంలో తమిళిసై కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ క్రమంలో తమిళిసైని వారు బంధువులు, పలువురు రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు.Late Shri. Kumari Ananthan known to be a true Gandhian and relentless leader of the people serving as President of TN @INCIndia leaves an inspirational legacy behind. Heartfelt condolences to his daughter @DrTamilisai4BJP mam and family. Om Shanti 🙏#RIPKumariAnanthan ayya pic.twitter.com/fSXpLBKwnM— Sanam Shetty (@ungalsanam) April 9, 2025కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిగా.. ఇక, కుమారి అనంతన్ మార్చి 19, 1933న కన్యాకుమారి జిల్లా అగతీశ్వరంలో జన్మించారు. స్వాతంత్ర్య సమరయోధుడు హరికృష్ణన్, తంగమ్మాళ్ దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు అనంతకృష్ణన్. ఆయన తమిళంలో బ్యాచిలర్ మరియు మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1977 పార్లమెంటరీ ఎన్నికల్లో నాగర్‌కోయిల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో తమిళనాడు ప్రభుత్వం అనంతన్‌కు థకైసల్ అవార్డును ప్రదానం చేసింది. రాజకీయాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టు వదలకుండా ప్రజాసేవలో కొనసాగించారు. అనంతన్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. VIDEO | Chennai: Former Tamil Nadu Congress president Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passes away at 93 in Chennai. Ananthan's mortal remains kept at Soundararajan's residence for people to pay homage.#ChennaiNews #TamilNaduNews(Full video… pic.twitter.com/FWlA1zXe8h— Press Trust of India (@PTI_News) April 9, 2025ఇక, తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌.. తమిళిసై నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అనంతన్‌ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. #WATCH | Chennai, Tamil Nadu: CM MK Stalin arrives at the residence of BJP leader Tamilisai Soundararajan to pay tribute to her fatherSenior Congress leader Kumari Ananthan, father of BJP leader Tamilisai Soundararajan, passed away at 93 due to age-related illness pic.twitter.com/srYmxCEBye— ANI (@ANI) April 9, 2025

Venkatagiri Municipal Council Motion of no confidence Updates7
వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ అవిశ్వాస తీర్మానం.. టీడీపీ కుట్రలు!

సాక్షి, తిరుపతి: నేడు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌కు అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్స్‌ కౌన్సిల్‌ హాల్‌కు బయలుదేరారు. ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నియోజకవర్గ ఇంచార్జ్‌ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు వాహనాలలో 20 మంది కౌన్సిలర్లు అక్కడికి చేరుకున్నారు.ఇక, వెంకటగిరి మున్సిపల్‌ కౌన్సిల్‌ అవిశ్వాస తీర్మానాన్ని గూడూరు సబ్‌కలెక్టర్‌ రాఘవేంద్రమీనన్‌ నేతృత్వంలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌తోపాటు గూడూరు డీఎస్పీ గీతాకుమారి ఏర్పాట్లను పరిశీలించారు. అయితే ఎలాగైనా ఈ ఎన్నికను వాయిదా వేయించాలని కూటమి నేతలు కుయుక్తులు పన్నుతుండటం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు, వెంకటగిరిలో 25 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ ప్రతినిధులే ఉన్నారు. 20 మంది కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ నక్కా భాను ప్రియపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ చేసిన కుట్రను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు భగ్నం చేయనున్నారు.

Dupahiya Fame Avinash Dwivedi Gifts Wife A Rs. 1.81 Cr8
నా సక్సెస్‌ మంత్ర ఆమే : భార్యకు రూ. 1.8 కోట్ల కారు గిఫ్ట్‌

ఏదైనా సక్సెస్‌ సాధించిన తరువాత స్నేహితులకు, సన్నిహితులు పార్టీ ఇవ్వడం చాలా కామన్‌. ఒక్కోసారి చిన్న చిన్న గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. మరి అలాంటిది ఊహించని విజయం వచ్చి వరిస్తే ఆసంతోషాన్ని మాటల్లో వర్ణించలేం. ఈ సంతోషాన్ని తన కరియర్‌లో సక్సెస్‌కు తొడుగా నిలిచిన తన భార్యకు ఖరీదై గిఫ్ట్‌ ఇవ్వడం విశేషంగా నిలిచింది. స్టోరీ ఏంటంటే..నటుడు, కంటెంట్ సృష్టికర్త అవినాష్ ద్వివేది 'దుపాహియా' వెబ్‌ సిరీస్ ద్వారా అద్భుత విజయం సాధించాడు. దీంతో అతని బార్య సంభావన సేథ్‌కు తన కలల కారును బహుమతిగా ఇచ్చాడు. సంభావన కూడా నటి, యూట్యూబర్. ఇది తమ ప్రేమ, పట్టుదలతోపాటు పాటు, తమ ఉమ్మడి కలలకు ప్రతిరూపమని చెప్పాడు. భార్యకు రూ. 1.81కోట్ల విలువైన విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చాడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. కొన్ని ఫోటోలను పోస్ట్‌ చేశాడు. దీని ప్రకారొం ఈ కారు వారి 7 సిరీస్ BMW 750e లాగా కనిపిస్తోంది. దీంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అవినాష్ ద్వివేది, సంభావన సేథ్ప్రారంభం నుండి కేవలం భాగస్వామిగా మాత్రమే కాకుండా అన్నివిధాల సంభావన, అండగా నిలిచి, ప్రతి పోరాటంలో తనకు వెన్నెముకగా నిలిచింది అంటూ భార్యకు కృతజ్ఞతలు తెలిపాడు. కష్టాల్లో, నష్టాల్లో తొడుగా నిలిచింది. నిజంగా ఆమె తనకు లభించిన గొప్ప వరమని పేర్కొన్నాడు. మరిన్ని కలలతో, తమ ప్రయాణం, ఇలాగే కలకాలం సాగిపోవాలని కోరుకున్నాడు. ఇది కేవలం మన విజయం మాత్రమే కాదు. మన తల్లిదండ్రులు ఆశీర్వాదం బలం కూడా అంటూ View this post on Instagram A post shared by Avinash Dwivedi (@imavinashdwivedi)మీ(సంభావన) తల్లిదండ్రులు ఇప్పుడు వారితో లేకపోయినా, పై నుంచి వారు ఆశీర్వదిస్తారంటూ వారికి కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా తాను ఈ స్థాయికి రావడానికి ముంబైలో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి ముంబైకి వచ్చినప్పుడు, ఒకే ఒక్క లక్ష్యం. నటుడిగా మారాలి. సక్సెస్‌ సాధించాలి. ఇదే పట్టుదల. ఇందుకోసం గత ఐదేళ్లుగా నా సర్వస్వం అ‍ర్పించాను అని చెప్పాడు. అలాగే దుపాహియాపై ప్రేక్షకుల అపారమైన ప్రేమ కురిపించారు అంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. మార్చి 2025 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్‌ విడుదలైంది. ఇది విమర్శకులు, వీక్షకులు ప్రశంసలు దక్కించుకుంది. సంభావన సేథ్ , అవినాష్ ద్వివేది 2016, జూలై 14న వివాహం చేసుకున్నారు.

Karnataka Yadgir district Village Fears Mangalavaram Ratri Reason Is9
మంగళవారం రాత్రి.. ఆ ఊరంతా భయం గుప్పిట

బెంగళూరు: ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో నిద్రలోకి జారుకుంటారనగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టి గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి.. కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్‌పూర్‌ తాలుకా జాలిబెంచి(Jalibenchi village) అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పిట ఉంచింది. విద్యుత్‌ సరఫరాలో షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలే అందుకు కారణం.విద్యుత్‌ సరఫరాలో కలిగిన అంతరాయం.. ఏకంగా ఒక ఊరినే వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో కరెంట్‌ వైర్లు ఒకదానికొకటి రాజుకుని.. షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకుంది. అలా మంటలు రాజుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్‌ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జిలు కాలిపోయాయి. సెల్‌ఫోన్లు పేలిపోయాయి. కరెంట్‌ స్తంభాల నుంచి వైర్లు ఇళ్ల పైకప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాలతో భీతిల్లిన ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు.సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడపడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని.. అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.సుమారు వంద ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గులబర్గ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానిక చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లను పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్‌ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.Shocking, terrible video!!A tragic incident unfolded in Jalibenchi village of Surpur taluk on Tuesday around 6 PM, as powerful winds caused an electricity-related accident, plunging the area into chaos and fear.Cc @OfficialGescom pic.twitter.com/VCQXLqQymW— Nishkama_Karma (@Nishkama_Karma1) April 8, 2025

Telangana BJP MPs Key Meeting Over HCU Land Issue10
కేటీఆర్‌ వ్యాఖ్యల ఎఫెక్ట్‌.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్‌ఎస్‌ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement